అధ్యాయము 8

పులస్త్యుడు

1 - శార్ ఙ్గపాణిన మాయాంతం దృష్ట్వా-గ్రే దానవేశ్వరః

 పరిభ్రామ్య గదాంవేగాత్ మూర్ద్ని సాధ్య మతాడయత్

2 - తాడితస్యాథగదయా దర్మపుత్రస్య నారద

 నేత్రాబ్యా మపతద్వారి వహ్నివర్షనిబం భువి    

3 - మూర్ద్ని నారాయణస్యా పి సాగాదాదానవార్పితా

 జగామ శతదాబ్రహ్మన్ శైలశ్రుంగేయథా-శనిః

4 - తతో నివృత్యదైత్యేంద్రః సమాస్తాయరథం ద్రుతమ్

 ఆదాయ కార్ముకం వీరస్తూణాద్ బాణంసమాదదే

5 - ఆనమ్య చాపంవేగేన గార్దపత్రాన్ శిలీముఖాన్

 ముమోచ సాద్యాయ తదా క్రోదాందకారితాననః

పులస్త్యుడు

శార్జ్ఞ ధనువును దరించి తనవైపు వచ్చుచున్న నారాయణుని చూచి, దానవేశ్వరుడు, తన గదను గిరగిర త్రిప్పి అసాద్యుని నెత్తిపై బలముగా మోదెను. నారదా ! అట్లు గదచే ప్రహరించబడిన ఆ ధర్మపుత్రుని నేత్రాల నుండి అగ్నివృష్టివలె జలధారలు భూమిపై రాలెను. నారాయణుని నెత్తిమీదపడిన పిడుగునకు వలె నూరు వ్రక్కలుగా పగిలిపోయెను. అంతట వెనుదిరిగి, ఆ దానవ వీరుడు త్వరగా తన రథముపై నెక్కి కార్ముకము చేతగొని అమ్ముల పొదినుండి బాణమును తీసికొనెను. క్రోధంతో నల్లబడిన మోముగల ఆ దానవేశ్వరుడు, గృద్రపత్రాలతో నలంకరింపబడిన బాణాలను వింట సంధించి ఆ సాధ్యునిపై గుప్పించెను.

6 - తానాపతతఏవాశు బాణాన్ చంద్రార్దసన్నిబాన్

 చిచ్చేదబాణైరపరై ర్నిర్బిభేదచ దానవమ్

7 - తతో నారాయణందైత్యో దైత్యం నారాయణఃశరైః

 అవిధ్యేతాం తదా-న్యోన్యం మర్మభిద్బిరజిహ్మగైః

8 - తతోం-బరే సన్నిహితో దేవానా మభవన్మునే

 దిదృక్షూణాం తదా యుద్ధం లఘు చిత్రంచ సుష్టుచ

9 - తతఃసురాణాందుందుబ్యస్ త్వవాద్యంత మహాస్వనాః

 పుష్ప వర్ష మనౌపమ్యం ముముచుః సాధ్యదైత్యయోః

10 - తతః పశ్యత్సు దేవేషు గగనస్తేషు తావుభౌ

 ఆయుద్యేతాం మహేష్వాసౌ ప్రేక్షక ప్రీతివర్దనమ్

11 - బబంధతు స్తదాకాశం తావుబౌ శరావృష్టిభిః

 దిశశ్చవిదిశశ్చైవ ఛాదయేతాం శారోత్కరైః

12 - తతో నారాయణశ్చాపం సమాకృష్య మహామునే

 బిబేద మార్గణైస్తీక్ష్నై: ప్రహ్లాదం సర్వమర్మసు     

13 - తథా దైత్యేశ్వరఃక్రుద్ధ శ్చాపమానమ్య వేగవాన్

 బిభేద హృదయేబాహ్వో ర్వదనేచ నరోత్తమమ్,

ఇలాతనపైకి వచ్చుచున్న అర్ద చంద్రబాణాలను తన శరపరంపరతో మధ్య మార్గాన్నే ఖండించి నారాయణుడా దానవుని నిశితమార్గణాలతో గాయపరచెను. ఆ విధంగా ఆ వీరులిరువురు ఒకరినొకరు తీవ్రములగు బాణములతో ఖేదించుకొనిరి. సాధ్య దైత్యుల అభీకర సంగ్రామాన్ని తిలకించిన దేవతలు గగనతలాన నిలబడి దుందుభులు మ్రోగించుచూ ఆ వీరులపై పుష్పవృష్టి కురిపించిరి. ఆ విధంగా అకాశాన్నుంచి తిలకించుచుచున్న దేవతలకు ప్రీతివర్దకంగా ఆ వీరులు అద్భుతసంగ్రామం గావించిరి. వారి బాణాసనాలనుంచి వెడలిన, అసంఖ్యాక శరాలతో భూమ్యాకాశాలు అష్టదిక్కులు కప్పబడినాయి. బ్రహ్మర్షే ! అంతట నారాయణుడు తన ధనుస్సును బాగుగా వంచి అతి తీవ్రమైన బాణముతో ప్రహ్లాదుని మర్మ స్థానమున గొట్టెను. అలా సర్వమర్మ స్తానములండు ప్రహరింపబడిన ప్రహ్లాదుడు ప్రచండమైనకోపంతో, నారాయణుని వక్షస్తలమును బాహువులను ముఖమును బాణాలతో నింపివైచెను.

14 - తతో-స్యతోదైత్యపతేః కార్ముకం ముష్టిబందనాత్

 చిచ్చేదైకేనబాణేన చంద్రార్దాకారవర్చసా

15 - అపాస్యతదనుఃఛిన్నం చాపమాదాయచాపారమ్

 అధిజ్యంలాఘవాత్కృత్వా వవర్షనిశితాన్ శరాన్

16 - తానప్యస్యశరాన్ సాధ్య శ్చిత్వా బాణైరవారయత్

 కార్ముకంచ క్షురప్రేణ చిచ్చేద పురుషోత్తమః

17 - చిన్నం చిన్నందనుర్దైత్య స్త్వన్య దన్యత్సమాదదే

 సమాదత్తం తదా సాద్యోమునిచిచ్చేద లాఘవాత్

18 - సంచిన్నేష్వథ చాపేషు జగ్రాహ దితిజేశ్వరః

 పరిఘం దారుణందీర్ఘం సర్వలోహమయం దృడమ్   

19 - పరిగృహ్యాథ పరిఘాం బ్రామయామాస దానవః

 బ్రామ్యమాణం సచిచ్చేద నారాచేన మహామునిః

20 - చిన్నేతు పరిఘే శ్రీమాన్ ప్రహ్లాదో దానవేశ్వరః

 ముద్గరం బ్రామ్యవేగేన ప్రచిక్షేప నరాగ్రజే

21 - తమాపతంతం బలవాన్ మార్గణై ర్దశభిర్మునే

 చిచ్చేద దశాదాసాద్యః సచ్చిన్నో న్యపతద్ భువి

22 - ముద్గరేవితథేజాతే ప్రాసమావిద్య వేగవాన్

 ప్రచిక్షేప నరాగ్రాయ తంచచిచ్చేద ధర్మజః

23 - ప్రాసేచ్చిన్నేతతోదైత్యః శక్తిమాదాయ చిక్షిపే

 తాంచ చిచ్చేద బలవాన్ క్షురప్రేణ మహాతపాః

అంతట నారాయణుడొక అర్ద చంద్ర బాణంతో దైత్యేశ్వరుని చేతిలోని వింటిని ఖండించివైచెను. అంతట దైత్యుడు వేరొక ధనుస్సు గైకొని అతిలాఘవంతో నారాయణునిపై బాణవృష్టి గురియించెను. సాధ్యుడగు నారాయణుడా బాణములను ఖండించి ఒక తీవ్రమైన శరంతో శత్రువు వింటిని రెండు తునుకలు గావించెను. వెంటనే దైత్యుడు వేరొక ధనుస్సు గైకొనినంతనే దానిని గూడ నా పురుషోత్తముడు రెప్పపాటులో త్రుంచివైచెను. ఈ విధంగా రాక్షస రాజు బాణాసనాలనెన్నింటినో ఖండించివైచెను. తన కార్ముకాలన్నీ యీ విధంగా ఖండింపబడుట చూచి క్రోదతాంరాక్షుడై దైత్యపతి, అతి భయంకరం సుదీర్ఘం సర్వలోహమయమైన పరిఘ (గుదియ)ను గైకొనెను, ఆ ప్రచండమైన పరిఘనాతడు భయంకరంగా త్రిప్పుతుండగా దానిని నారాయణుడొక బాణముతో ముక్కలుగావించెను. పరిఘతునుకలుకాగా శ్రీమంతుడైన ప్రహ్లాడుదొక ముద్గరమును చేకొని అతివేగంగా త్రిప్పి నారాయణునిపై విసరెను. మహామునీ ! ఆ వచ్చుచున్న ముద్గరాన్ని నారాయణుడు పది బాణములతో శతదాబిన్నము గావించెను. ముద్గరం వ్యర్థంకాగా దైత్యుడు ప్రాసమును ప్రయోగింపగా దానిని కూడ దర్మపుత్రుడు ఖండించివైచెను. అంతట దైత్యపతి శక్తిని ప్రయోగించగా నద్దానినిగూడ తీవ్రబాణాలతో ఆ తపస్వి వారించెను.

24 - చిన్నేషుతేషుశస్త్రేషు దానవో-న్యన్మహద్దనుః

 సమాదాయ తతోబాణై రవతస్తార నారద

25 - తతోనారాయణోదేవో దైత్యనాథం జగద్గురుః

 నారాచేన జఘానాథ హృదయే సురతాపసః

26 - సంభిన్న హృదయో బ్రహ్మన్ దేవేనాద్ భుతకర్మణా

 నివపాత రథోపస్థే తమపోవాహ సారథిః

27 - ససంజ్ఞాం సుచిరేణైవ ప్రతిలభ్య దితీశ్వరః

 సుద్రుడం చాపమాదాయ భూయో యోద్దుముపాగతః

28 - తమాగతం సంనిరీక్ష్య ప్రత్యువాచ నరాగ్రజః

 గచ్చ దైత్యేంద్ర యోత్స్యామః ప్రాతస్త్వాహ్నిక మాచర

29 - ఏవముక్తో దితీశస్తు సాధనాద్భుతకర్మణా

 జగామ నైమిషారణ్యం క్రియాం చక్రే తదా-హ్నికీమ్

నారదా! అస్త్రాలట్లు వ్యర్థంకాగా నాదానవుడు వేరొక మహా ధనుస్సును గైకొని నలువైపులా బాణముల గురిపించెను. అంతట జగద్గురువగు నారాయణుడొక బాణమున తానా దైత్యుని వక్షమును భేదించెను. బ్రహ్మర్షే! అద్భుత కర్ముడగు నాతపోదనునిచే వక్షము విదీర్ణము కాగా నాదైత్యుడు రథముపై నొరగిపోయెను, వెంటనే సారథి అతనిని అచ్చట నుండి దూరముగా గొనిపోయెను. అచిరకాలంలోనే మూర్చనుండి తేరుకొని దానవపతి వేరొక ద్రుడచాపాన్ని తీసికొని మరల యుద్దమునకు దలపడెను. అంతట నరాగ్రజుడతని జూచి – ఓ దైత్యేంద్రా! రేపు ప్రాతఃకాలమున మరల యుద్దము చేయుదము. ఇంతట వెళ్లి నిత్యాహ్నికములు నేరవేర్చుకొమ్మనెను. నారాయణుని మాటలు విని దైత్యనాధుడు నైమిషారణ్యమునకు వెళ్లి అహ్నికకృత్యములు నేరవేర్చుకొనెను.

30 - ఏవంయుద్ద్యతి దేవేచ ప్రహ్లాకో హ్యసురోమునే

 రాత్రౌ చింతయతే యుద్దే కథంజేష్యామిదాంభికమ్

31 - ఏవంనారాయణేనా-సౌ సహాయుద్ద్యతనారద

 దివ్యంవర్షసహస్రంతు దైత్యోదేవం నచాజయత్

32 - తతో వర్షసహస్రాంతే హ్యజితే పురుషోత్తమే

 పీతవాససమభ్యేత్యదానవో వాక్యమబ్రవీత్

33 - కిమర్థందేవదేవేశ సాధ్యం నారాయణంహరిమ్

 విజేతు౦నా-ధ్యశక్నోమి ఏతన్మే కారణంవద

మునీ! నారాయణుడు గావించు సంగ్రామమును చూచి ప్రహ్లాదుడా రాత్రి – “ఈ కపట మునిని నిర్జించుటేట్లాయని ఆలోచనలో బడెను. నారదా! వారిర్వురావిధంగా వేయి దివ్యవత్సరములు పోరాడిరి. అయితే దైత్య రాజా తపస్వినిజయింపజాలడయ్యెను. దానితో విసిగిపోయి ప్రహ్లాదుడు పీతావాసుడగు విష్ణుదేవుని సమీపించి యిట్లనెను. యిందులకు కారణమేమి?”

పీతవాసుడు

34 - దుర్జయో-సౌ మహాబాహు స్త్వయా ప్రహ్లాదదర్మజః

 సాద్యో విప్రవరో దీమాన్ మృథేదేవాసురైరపి

పీతవాసుడు

ప్రహ్లాదా మహాబాహువగు నీ ధర్మపుత్రుని నీవు జయింపజాలవు. దీమంతుడగు నీసాద్యవిప్రోత్తముని దేవతలు రాక్షసులు సైతము నిర్జింప లేరు సుమా !

ప్రహ్లాదుడు

35 - యద్యసౌ దుర్జయోదేవ

 మయా సాద్యో రణాజిరే

 తత్కథం యత్ప్రతిజ్ఞాతం తదసత్యం భవిష్యతి

36 - హీనప్రతిజ్ఞో దేవేశ కతంజీవేత మాదృశః

 తస్మాత్తవాగ్రతోవిష్ణో కరిష్యే కాయశోదనమ్

ప్రహ్లాదుడు

 “ప్రభూ! అతడజేయుడగుచో నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరుటెట్లు? నావంటివాడు హీనప్రతిజ్ఞుడై ఎట్లు జీవింపగలడు? కాబట్టి ఓ విష్ణూ! నీ ఎదుటనే ఈ శరీర శోదనము కావించుకొందును.”

పులస్త్యుడు

37 - ఇత్యేవముక్త్వా వచనం దేవాగ్రే దానవేశ్వరః

 శిరఃస్నాతస్తదాతస్థౌ గృణన్ బ్రహ్మ సనాతనమ్

38 - తతోదైత్యపతిం విష్ణుః పీతావాసా-బ్రవీద్వచః

 గచ్చ జేష్యసి భక్త్యా తం న యుద్దేన కథంచన

పులస్త్యుడు

విష్ణునితో నిట్లుపలికి ప్రహ్లాదుడు శిరస్నానము గావించి ఆసీనుడై బ్రహ్మనుసందానమున కుపక్రమించెను. అంతట నతనితో విష్ణుడిట్లనెను. “నీ వాయనను భక్తి ప్రపత్తులతోనే జయింపగలవు. యుద్దమున నెన్నటికీ జయింపజాలవు. పొమ్ము!”

ప్రహ్లాదుడు

39 - మయాజితం దేవదేవ త్రైలోక్యమపి సువ్రతః

 జితోయంత్వత్ప్రసాదేనా శక్రఃకిముత దర్మజః

40 - అసౌయద్యజయోదేవ త్రైలోక్యేనాపి సువ్రతః

 నస్థాతుంత్వత్ప్రసాదేనా శక్యంకిముకరోమ్యజ

ప్రహ్లాదుడు

ఓ దేవదేవ! నీ దయవల్ల నేను ముల్లోకాలనూ జయించాను. యింద్రుని సైతం గెలిచాను. ఈ యిర్వురు మూడులోకాలకూ అజేయులగుచో, ఓ అభవా! నేనెట్లు జీవింతును? నాకు దారి ఏది?

పీతవాసుడు

41 - సో-హం దానవశార్దూల లోకానాం హితకామ్యయా

 దర్మంప్రవర్తాపయితుం తపశ్చర్యాం సమాస్థితః

42 - తస్మా ద్యదీచ్చసి జయం తమారాదయ దానవ

 తంపరాజేష్యసే భక్త్యా తస్మా చ్చుశ్రూష దర్మజమ్

పీతవాసుడు

ఓ దానవేశ్వరా! లోకకల్యాణ కాంక్షతో ధర్మ ప్రవర్థనార్తమై నేనే కఠోర తపశ్చర్యకు పూనుకొంటిని. కాబట్టి నీవు జయింపగోరుచో వారలనారాదింపుము. వారిని భక్తితో జయింపుము. వెళ్లి దర్మసుతునకు శుశ్రూషగావింపుము.

పులస్త్యుడు

43 - ఇత్యుక్తః పీతవాసేన దానవేంద్రో మహాత్మనా

 అబ్రవీద్వచనం హృష్ణః సమాహుయాం-ధకం మునే

పులస్త్యుడు

“ఓ మునీ! శ్రీ విష్ణుడిట్లు చెప్పగా దానవేంద్రుడు సంతోషించిన వాడై అంధకుని బిలిచి యిట్లనెను.”

ప్రహ్లాదుడు

44 - దైత్యాశ్చ దానవాశ్చైవ పరిపాల్యా స్త్వయాందక

 మయోత్త్సృష్ట మిదం రాజ్యం ప్రతీచ్చస్వ మహాభుజ

45 - ఇత్యేవముక్తో జగ్రాహ రాజ్యం హైరణ్యలోచనిః

 ప్రహ్లాదో-పితదా-గచ్చత్ పుణ్యం బదరికాశ్రమమ్

ప్రహ్లాదుడు

 “మహా బలశాలివైన అంధకా ! దైత్యదానవులను నేటి నుండియు నీవు పరిపాలించుము. నేనీ రాజ్యము పరిత్యజిస్తున్నాను. దీనిని నీవు గైకొనుము. “ హిరణ్యాక్ష పుత్రుడైన అందకుడు ప్రహ్లాదుని కోరిక ప్రకారము రాజ్యము తీసికొనగా ప్రహ్లాదుడచ్చట నుండి పవిత్రమైన బదరికా వనమునకు బోయెను.

46 - దృష్ట్వా నారాయణందేవం నరంచ దితిజేశ్వరః

 కృతాంజలిపుటో భూత్వా వవందే చరణౌ తయోః      

47 - తమువాచ మహాతేజా వాక్యం నారాయణో-వ్యయః

 కిమర్థంప్రణతో-సీహ మామజిత్వా మహాసుర

అచట నారా నారాయణులను చూచి చేతులు జోడించి నమస్కరించెను.అతనిని చూచి మహా తేజస్వి అయిన నారాయణు డిట్లనెను. “అసురోత్తమా ! ఇదేమి, మమ్ము జయింపక ఈ నమస్కరించుటేల?’

ప్రహ్లాదుడు

48 - కస్త్వాంజేతుంప్రబో శక్తః కస్త్వత్తః పురుషో-ధికః

 త్వంహి నారాయణో-నంతః పీతవాసా జనార్దనః      

49 - త్వందేవః పుండరీకాక్షః త్వంవిష్ణుః శార్ ఙ్గచాపద్రుక్

 త్వమవ్యయోమహేశానః శాశ్వతః పురుషోత్తమః

50 - త్వాంయోగినశ్చింతయంతి చార్చయంతి మనీషిణః

 జపంతి స్నాతకాస్త్వాంచ యజంతి త్వాం చ యాజ్ఞికాః

51 - త్వమచ్యుతో హృషీకేశ శ్చక్రపాణి ర్థరాదరః

 మహామీనో హయశిరా స్త్వమేవ వరకచ్చపః

52 - హిరణ్యాక్షరిపుః శ్రీమాన్ భగవానథ సూకరః

 మత్పితుర్నాశనకరో భవానపి నృకేసరీ 

53 - బ్రహ్మ త్రినేత్రోమరరాడ్ హుతాశః ప్రేతాదిపో నీరపతిః సమీరః

 సూర్యో మృగాంకోచల జంగమాద్యో భవాన్విభో నాథ ఖగేంద్రకేతో   

54 - త్వం పృథ్వీ జ్యోతి రాకాశం జలం భూత్వా సహస్రశః

 త్వయావ్యాప్తం జగత్సర్వం కస్త్వాం జేష్యతి మాధవః

55 - భక్త్యాయది హృషీ కేశ తోషమేషి జగద్గురో

 నాన్యథా త్వం ప్రశక్యోసి జేతుం సర్వగతావ్యయ

ప్రహ్లాదుడు

 “ప్రభో! మిమ్ము జయింప గల వారెవ్వరు? మీ కంటే అధికులెవ్వరు? నీవు సాక్షాత్తు నారాయణుడవు, అనంతుడవు, పీతాంబరుడ వగు జనార్ధనుడవు. దేవా! నీవే పుండరీకాక్షుడవు! శార్ఙ్గపాణి యగు విష్ణుడవు! అవ్యయుడవు మహేశానుడవు. పురుషోత్తముడవు శాశ్వతుడవు. యోగులు నిన్నే ధ్యానింతురు, మనీషులు నిన్నర్చింతురు. స్నాతకులు నీ నామాన్ని జపిస్తారు. యాజ్ఞికులు యజ్ఞేశ్వరునిగా యజిస్తారు. నిన్ను హృషీకేశుడనీ చక్రధరుడనీ, ధరాధరుడనీ, మత్స్యమూర్తివనీ, హయగ్రీవుడవనీ, కూర్మమూర్తివనీ కీర్తిస్తారు. హిరణ్యాక్షుని సంహరించిన భగవంతుడవగు శ్రీ వరాహమూర్తివి నీవే! నా తండ్రిని వధించిన నృకేసరివి గూడ నీవే స్వామీ! హే గరుడధ్వజా! విభో! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు వరుణుడు, వాయువు, సూర్యచంద్రులు, జంగామస్థావరాత్మకమైన ఈ సర్వము నీవే. హే! లక్ష్మీపతీ! భూమి జ్యోతి రాకాశ జల రూపాన వేవేల మూర్తులతో జగత్తునంతటా వ్యాపించియున్న నిన్నెవడు జయింపగలడు? జగద్గురో! సర్వగతుడవు అవ్యయుడవునగు నిన్ను భక్తి చేతనే జయింపనగును. మరే విధంగానైననూ నిన్ను జయింప లేరు!

భగవానుడు

56 - పరితుష్టోస్మి తే దైత్య స్తవేనానేన సువ్రత

 భక్త్యా త్వనన్యయా చాహం త్వయాదైత్య పరాజితః     

57 - పరాజితశ్చ పురుషో దైత్యః దండం ప్రయచ్చతి

 దండార్థం తే ప్రదాస్యామి వరం వృణు యమిచ్ఛసి

భగవానుడు

సుపుత్రదవాగు దైత్యపతీ! నీ స్తోత్రమునకు సంతోషించితిని. అనన్యమైన నీ భక్తి చేతనేనోడింపబడితిని. ఓడిపోయిన వారు పరిహారం చెల్లించుకోవలెను. పరిహారరూపాన నీకొక వరం ప్రసాదిస్తున్నాను. కోరుము.

ప్రహ్లాదుడు

58 - నారాయణ వరం యాచే యం త్వం మే దాతు మర్హసి

 తన్మేపాపం లయం యాతు శరీరం మానసం తథా

59 - వాచికం చ జగన్నాథ యత్త్వయా సహా యుద్యతః

 నరేణ యద్యప్యభవద్ వరమే తత్ప్రయచ్చమే

ప్రహ్లాదుడు

వరదేశ్వరా! ప్రభో! నిన్ను శత్రువుగా నెంచి నేను (యుద్ధము చేసి) చేసిన మానసిక, వాచిక శారీరక పాపములన్నింటిని నశింపజేయుము. మహాత్ముడగు నరుని యెడ గావించిన అపరాధము క్షమింపుము, జగత్ప్రభో!

నారాయణుడు

60 - ఏవం భవతు దైత్యేంద్ర పాపం తేయాతు సంక్షయమ్

 ద్వితీయం ప్రార్థయ వరం తం దదామి తవాసుర

నారాయణుడు

దైత్యేంద్రా! అట్లే అగు గాక, నీ పాప సంక్షయమగు గాక. యింకొక వరం కోరుకొనుము.

ప్రహ్లాదుడు

61 - యా యా జాయేత మే బుద్ధిః సా సా విష్ణోత్వదాశ్రితా

 దేవార్చనే చ నిరతా త్వచ్చిత్తా త్వత్పరాయణా

ప్రహ్లాదుడు

విష్ణో! నా బుద్ధులన్నియు నేల్లవేళలందునూ నిన్నాశ్రయించుకొని యుండు గాక. నీ పూజ అర్చన ఉపాసనలందే లగ్నమై యుండుగాక.

నారాయణుడు

62 - ఏవం భవిష్యత్యసుర వరమన్యం య మిచ్చసి

 తం వృణీష్వ మహాబాహో ప్రదాస్యా మ్యవిచారయన్

నారాయణుడు

తథాస్తు. మహావీరా ! మరొక వరము కోరుకొనుము. కాదనక నిచ్చెద.

ప్రహ్లాదుడు

63 - సర్వమేవ మయా లబ్దం త్వత్ప్రసాదా దధోక్షజ

 త్వత్పాదపంకజాభ్యాం హి ఖ్యాతిరస్తు సదా మమ

ప్రహ్లాదుడు

అధోక్షజా! ప్రభూ! నీ దయతో నా కన్నియు లభించినవి. ఎల్లప్పుడు నీ పాదముల భక్తి నాకనుగ్రహింపుము.

నారాయణుడు

64 - ఏవమస్త్వపరం చాస్తు నిత్యమేవాక్షయోవ్యయః

 అజర శ్చామరశ్చాపి మత్ప్రసాదా ద్భవిష్యసి     

65 - గచ్చస్వ దైత్యశార్దూల స్వమావాసం క్రియారతః

 నకర్మబంధో భవతో మచ్చిత్తస్య భవిష్యతి

66 - ప్రశాసయదమూన్ దైత్యాన్ రాజ్యం పాలయ శాశ్వతం

 స్వజాతిసదృశం దైత్య కురు ధర్మ మనుత్తమం

నారాయణుడు

అట్లే యగు గాక. నా ప్రసాదం వల్ల నీవు అజరామరుడవై చిరకాలం వర్ధిల్లగలవు. రాక్షస శార్దూలా! వెంటనే నిజావాసమునకు వెళ్లి కర్మరతుడవుకమ్ము. మత్పరాయనుడవైన నిన్ను కర్మబందములంటవు. శాశ్వతంగా దైత్యరాజ్యానికధిపతివై స్వకులోచితమైన ధర్మాచరణము గావింపుము.

పులస్త్యుడు

67 - ఇత్యుక్తో లోక నాథేన ప్రహ్లాదో దేవ మబ్రవీత్

 కథం రాజ్యం సమాదాస్యే పరిత్యక్తం జగద్గురో

68 - తమువాచ జగత్ స్వామీ గచ్ఛ త్వం నిజమాశ్రయమ్

 హితోపదేష్టా దైత్యానాం దానవానాం తథా భవ

69 - నారాయణే నైవ ముక్తః స తదా దైత్య నాయకః

 ప్రణిపత్య విభుం తుష్టో జగామ నగరం నిజమ్

70 - దృష్టః సభాజితశ్చాపి దానవైరంధకేన చ

 నిమంత్రితశ్చ రాజ్యాయ న ప్రత్యైచ్చత్స నారద

71 - రాజ్యం పరిత్యజ్య మహా సురేంద్రో నియోజయన్ సత్పథి దానవేంద్రాన్

 ధ్యాయన్స్మరన్ కేశవ మప్రమేయం తస్థౌతదా యోగ విసుద్ధదేహః

72 - ఏవం పురా నారద దానవేంద్రో నారాయణే నో త్తమపూరుషేణ

 పరాజితశ్చాపి విముచ్య రాజ్యం తస్థే మనో ధాతరి సన్నివేశ్య

పులస్త్యుడు

జగన్నాధుని మాటలు విని ప్రహ్లాడిట్లనెను. “ప్రభో! ఒక పర్యాయము వదలిన రాజ్యాన్ని మరలనెట్లు గ్రహించగలను? ధర్మమూర్తీ!” అందులకు భగవంతుడు “అట్ల్గుచొ రాక్షస జాతికంతకు హితోపదేశకుడవుగా నుండి దైత్య దానవులను కాపాడుము” అనెను. నారాయణునిచే ననుజ్ఙాతుడై ఆ దైత్యేశ్వరుడు స్వామికి మ్రొక్కి సంతోషముతో నిజ మందిరమున కరిగెను. తిరిగి వచ్చిన ప్రహ్లాదుని దైత్య దానవులు అంధకుడు సంభావించి రాజ్యమును మరల స్వీకరించమనిరి. కాని ఆ మహా జ్ఞాని అందులంగీకరింపడయ్యెను. నారదా! గడ్డిపోచ వలె సకల దానవ రాజ్యాన్నీ పరిత్యజించి అంధకుని సన్మార్గమున నడపుచు రాక్షసులకు మార్గదర్శియై, ఆ మహనీయుడు, నిరంతరము అప్రమేయుడగు శ్రీహరిని ఆరాధించుచు మహాయోగియై వర్ధిల్లెను. నారదా! ఈ విధంగా పురాసమయాన దానవేంద్రుడగు ప్రహ్లాదుడు పురుషోత్తముడగు నారాయణునిచే పరాజితుడయయు, రాజ్యత్యాగం కావించి తన చిత్తవృత్తులన్నియు నా భగవంతునిపై నుంచి ధన్యుడాయెను.

అధ్యాయము 8 complete