వామన మహా పురాణము
అధ్యాయము 18
పులస్త్యుడు
1 - మాసిదాశ్వయుజే బ్రహ్మన్ యదా పద్మం జగత్పతేః ।
నాభ్యానిర్యాతిహితదా దేవేష్వేతాన్యదోభవన్ ॥
2 - కందర్పస్య కరాగ్రేతు కదంబశ్చారుదర్శనః ।
తేనతస్యపరాప్రీతిః కదంబేన వివర్ధతే ॥
3 - యక్షణామదిపస్యాపి మణిభద్రస్యనారద ।
వటవృక్షః సమభవత్ తస్మింస్తస్యరతిః సదా ॥
4 - మహేశ్వరస్యహృదయే దత్తూరవిటపః శుభః ।
సంజాతః సచశర్వస్య రతికృత్ తస్యనిత్యశః ॥
5 - బ్రహ్మణోమధ్యతోదేహా జ్ఞాతోమరకతప్రభః ।
ఖదిరఃకంటకీశ్రేయా నభవద్విశ్వకర్మణః ॥
6 - గిరిజాయాఃకరతలే కుందగుల్మ స్త్వజాయత ।
గణాధిపస్యకుంభస్తో రాజతేసిందువారకః ॥
7 - యమస్యదక్షిణేపార్శ్వే పాలాశోదక్షిణోత్తరే ।
కృష్నోదుంబరకోరుద్రా జ్ఞాతఃక్షోభాకరోవృషః ॥
8 - స్కందస్యబంధుజీవస్తు రావేరశ్వత్తఏవచ ।
కాత్యాయన్యాఃశమీజాతా బిల్వోలక్ష్మ్యాః కరేభవత్ ॥
9 - నాగానాం పతయేబ్రహ్మన్ శరస్తంబోవ్యజాయత ।
వాసుకేర్విస్తృతే పుచ్చేపృష్ఠే దూర్వాసితాసితా ॥
10 - సాద్యానాం హృదయేజాతో వృక్షో హరితచందనః ।
ఏవంజాతేషు సర్వేషు తేన తత్రరతిర్భవేత్ ॥
పులస్త్యుడు
బ్రహ్మర్షే! ఆశ్వయుజ మాసంలో జగన్నాధుని నాభి నుండి పద్మం పుట్టంగానే యితర దేవతల నుంచి కూడా ఆయా పుష్పాదులుద్భవించాయి. కామదేవుని కరాగ్రాన్నుంచి సుందరమైన కదంబం పుట్టింది. ఆయన కాపుష్పమంటే ఎంతో ప్రీతి. యక్షేశ్వరుడైన మణిభద్రు నుంచి వటవృక్షం పుట్టింది ; ఆయనకా వృక్షమంటే యింతో ప్రేమ, పరమ శివుడు తన హృదయాన్నుంచి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు. బ్రహ్మ శరీర మధ్య భాగాన్నుంచి అవతరించిన మరకతవర్ణపు ఖదిరవృక్షాన్ని విశ్వకర్మనుంచి పుట్టిన కంటకీవృక్షాన్ని ఆయాదేవతలు ప్రేమిస్తారు. పార్వతి అరచేతి నుంచి కుంద (మల్లె) పొద, గణాదిపుని చెంపల నుండి సింధువారకం, యముని దక్షిణ పార్శ్వం నుండి పాలాశం, దక్షిణోత్తరాలనుండి నల్లమేడి, రుద్రునిదేహంనుండి క్షోభం కలిగించే వృషవిటపం కుమారస్వామినుండి బందుజీవనం, సూర్యునినుండి అశ్వత్థ (రావి) చెట్టు, కాత్యాయనివల్ల జమ్మిచెట్టు, మహాలక్ష్మి చేతినుండి బిల్వ (మారేడు) వృక్షం ఉద్భవించాయి. నాగుల అధిపతినుంచి రెల్లుదుబ్బు, వాసుకి విశాలమైన తోకనుండి వీపునుండి తెల్ల, నల్లగరిక (దూర్వా), సాధ్యుల హృదయాలనుంచి హరిచందన వృక్షములు ఉద్భవించాయి. తమనుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయినాయి.
11 - తత్రరమ్యే శుభేకాలే యాశుక్లైకాదశీ భవేత్ ।
తస్యాంసంపూజయేద్విష్ణుం తేనఖండోస్య పూర్యతే ॥
12 - పుష్పైః పత్రైః ఫలై ర్వాపి గంధవర్ణరసాన్వితైః ।
ఓషదీభిశ్చముఖ్యాభి ర్యావత్ స్యాచ్చ రదాగమః ॥
13 – ఘృతంతిలా వ్రీహియవా హిరణ్యకనకాది యత్ ।
మణిముక్తాప్రవాళాని వస్త్రాణి వివిదానిచ ॥
14 - రసానిస్వాదుకట్వమ్ల కషాయలవణానిచ ।
తిక్తానిచనివేద్యాని తాన్యఖండాని యానిహి ॥
15 - తత్పూజార్థం ప్రదాతవ్యం కేశవస్య మహాత్మనే ।
యదాసంవత్సరంపూర్ణ మఖండం భవతేగృహే ॥
16 - కృతోపవాసోదేవర్షే ద్వితీయే హని సంయతః ।
స్నానేన తేన స్నాయీత యేనాఖండం హి వత్సరమ్ ॥
17 - సిద్దార్థకైస్తిలైర్వాపి తేనైవోద్వర్తనం స్మృతమ్ ।
హవిషాపద్మనాభస్య స్నానమేవ సమాచరేత్ ।
హోమేతదేవగదితం దానే శక్తిర్నిజాద్విజ ॥
18 - పూజయేతాథకుసుమైః పాదాదారభ్య కేశవమ్ ।
ధూపయేద్ వివిధంధూపం యేనస్యాద్ వత్సరంపరమ్ ॥
19 - హిరణ్యరత్న వాసోభిః పూజయేత జగద్గురుమ్ ।
రాగఖాoడవచోష్యాణి హవిష్యాణి నివేదయేత్ ॥
20 - తతస్సంపూజ్యదేవేశం పద్మనాభం జగద్గురుమ్ ।
విజ్ఞాపయేన్మునిశ్రేష్ఠ మంత్రేణానేన సువ్రత ॥
అలాంటి రమణీయమైన శుభ సమయాన, శుక్ల పక్ష ఏకాదశినాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజింపవలె. శరదృతువు ప్రవేశించే వరకు పుష్పవ్రతఫల, గంధాదులతోను, వర్జరస ముఖ్య ఓషదులతోను శ్రియఃపతిని చక్కగా పూజించాలి. నేయి తిలలు బియ్యం యవలు, బంగారం, వెండి మొదలయినవి, మణులు, ముత్యాలు, పగడాలు, వివిధ వస్త్రాలు, తీపి పులుపు మొదలయిన షడ్రసోపేతాలయిన వస్తువులను అఖండాలుగా (తుంచకుండా) సేకరించి మహాత్ముడగు కేశవునకు నివేదనం చేయాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తిఅయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్దులు వర్షిస్తాయి. నారదా! ఉపవాసంచేసి ఆ మరునాడుదయం జితేంద్రియుడై సంవత్సరకాలం నిర్విఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చేయాలి. సువాసనగల తెల్ల ఆవాలుగాని నువ్వులుగాని పిండిచేసి దేహానికి నలుగు పెట్టుకొని స్నానంచేయాలి. విష్ణుదేవుని నేతితో అభిషేకించాలి. నేతితోనే హోమంచేసి తన శక్తిననుసరించి ఘ్రుతదానం చేయాలి. తదనంతరం పద్మనాభుని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి. రకరకాలయిన పరిమళ ధూపాలు వేయాలి. ఆ విధంగా ఆ సంవత్సరం పరమపవిత్ర మౌతుంది. అనంతరమాజగన్నాథుని స్వర్ణరత్నాలతోను చీని చీనాంబరాలతో నలంకరించి మిష్టాన్నం రుచ్యములైన చోష్యహవిష్యాదులు నైవేద్యం చేయాలి. మునిశ్రేష్టా! ఇలా సమర్పించిన తర్వాత నా జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి.
21 - నమోస్తుతే పద్మనాభ పద్మాధవ మహాద్యుతే ।
ధర్మార్థకామోక్షాణి త్వఖండాని భవంతుమే ॥
22 - వికాసిపద్మ పత్రాక్ష యథాఖండో సి సర్వతః ।
తేనసత్యేనధర్మాద్యా అఖండాః సంతుకేశవ ॥
23 - ఏవంసంవత్సరంపూర్ణం సోపవాసో జితేంద్రియః ।
అఖండంసారయేద్ బ్రహ్మన్ వ్రతం వై సర్వవస్తుషు ॥
24 - అస్మింశ్చీర్నేవ్రతేవ్యక్తం పరితుష్యన్తి దేవతాః ।
ధర్మార్థకామమోక్షాద్యా స్త్వక్షయాః సంభవంతిహి ॥
25 - ఏతానితేమయోక్తాని వ్రతాన్యుక్తాని కామిభిః ।
ప్రవక్ష్యామ్యదునాత్వేత ద్వైష్ణవం పంజరం శుభమ్ ॥
“ఓ పద్మనాబా! పద్మావతీ! మహాద్యుతీ! నీకు నమస్కారము! వికసించిన తామర రేకుల వంటి కన్నుల వాడా! నీవేవిధంగా పరిపూర్ణుడవై సర్వత్రా నిండియున్నావో అలాగే నేను ఆచరించు ధర్మార్థ కామ మోక్షాలు, అఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగియుండునట్లు అనుగ్రహించుము కేశవా!” ఈ విధంగా ఉపవాసియై ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్తు సర్వ విషయాలలోనూ పూర్ణత్వాన్ని సిద్దింప చేసుకుంటాడు. ఈ విధంగా వ్రతమాచారించినచో దేవతలందరు సంతోషించెదరు. అలాంటి వ్రతం చేసిన వానికి చతుర్విధ పురుషార్థాలు పూర్ణంగా సిద్దిస్తాయి. నారదా! అర్థార్థులైన వారలకు నిర్ణయించబడిన వ్రతాలను నీ కెరిగించితిని. ఇక సర్వమంగళకరమైన విష్ణుపంజర స్తోత్రం వినిపించెదను.
Section - శ్రీవిష్ణుపంజర స్తోత్రమ్
26 - నమోనమస్తే గోవింద చక్రంగృహ్య సుదర్శనమ్ ।
ప్రాచ్యాంరక్షస్వమాంవిష్ణో త్వామహం శరణంగతః ॥
27 - గదాంకౌమోదకీంగృహ్య పద్మనాభామితద్యుతే ।
యామ్యాంరక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః ॥
28 - హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ ।
ప్రతీచ్యాంరక్షమే విష్ణో భవంతం శరణంగతః ॥
29 - ముసలంశాతనంగృహ్యపుండరీకాక్ష రక్షమామ్ ।
ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణంగతః ॥
30 - శార్జ్ఞ మాదాయచదనురస్త్రం నారాయణం హరే ।
నమస్తేరక్షరక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః ॥
31 - పాంచజన్యం మహాశంఖ మంతర్బోద్యం చ పంకజమ్ ।
ప్రగృహ్యరక్షమాంవిష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర ॥
32 - చర్మ సూర్యశతంగృహ్య ఖడ్గం చంద్రమసంతదా ।
నైర్ ఋత్యాంమాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్ ॥
33 - వైజయంతీం ప్రగృహ్యత్వం శ్రీవత్సం కంటభూషణమ్ ।
వాయవ్యాంరక్షమాందేవ అశ్వశీర్ష నమోస్తుతే ॥
34 - వైనతేయం సమారుహ్య అంతరిక్షేజనార్దన ।
మాంత్వంరక్షాజిత సదా నమస్తే త్వపరాజిత ॥
35 - విశాలాక్షంసమారుహ్య రక్ష మాంత్వం రసాతలే ।
ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమోస్తుతే ॥
36 - కరశీర్షాంఘ్రిపర్వేషుతథాష్టబాహుపంజరమ్ ।
కృత్వారక్షస్వమాందేవ నమస్తే పురుషోత్తమ ॥
37 - ఏతదుక్తంభగవతావైష్ణవం పంజరం మహత్ ।
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ ॥
38 - నాశాయామాస సా యత్ర దాసవం మహిషాసురమ్ ।
సమరం రక్తబీజం చ తథాన్యాన్ సురకంటకాన్ ॥
Section - శ్రీవిష్ణుపంజర స్తోత్రమ్
గోవిందా! నీకు నమస్కారం. నీకు శరణాగతుడను. సుదర్శన చక్రం ధరించి విష్ణో! నీవు నన్ను తూర్పున రక్షించుము. అమిత తేజస్వియైన పద్మనాభా! కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశన రక్షించుము. విష్ణో! నీకు శరణాగతుడను. నీకు నమస్కారము. పురుషోత్తమా! నమస్కారము. సౌనందహలాన్ని ధరించిన విష్ణూ! పశ్చిమ దిక్కున నన్ను రక్షించుము. నీకు శరణాగతుడను! పుండరీకాక్ష ! ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షింపుము. జగన్నాథా! నీకు శరణాగతుడను . ఓ రాక్షస నాశకా! శార్ జ్ఞ ధనుస్సును నారాయణాస్త్రాన్నీ ధరించి నన్ను ఈశాన్య దిశన రక్షింపుము. నీకు శరణాగతుడను. ఓ విష్ణూ యజ్ఞ పురుషా! పాంచజన్య శంఖాన్ని అంతర్బోద్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షింపుము. ఓ నరసింహ ప్రభూ! దివ్యమూర్తీ! సూర్యశతమనే డాలును చంద్రమస ఖడ్గాన్ని ధరించి నైర్రుతి దిక్కున నన్ను రక్షింపుము. వైజయంతీమాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభూ! వాయవ్య దిశన నన్ను రక్షించుము. నీకు నమస్కారము. జనార్ధనా! గరుడ వాహనారూడుడవై నన్ను అంతరిక్షంలో రక్షింపుము. అజితా అపరాజితా! నీకు సదానమస్సులు! విశాలాక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించుము! ఆకూపారా! మహామోహ! నీకు నమస్కారము! అష్టబాహు పంజర రూపాన ణా శరీరంలోని చేతులు, తల పాదాలు, మడమలు మొదలగు వానిని రక్షింపుము. పురుషోత్తమ దేవా! నీకు నమస్కారము! ఈ విధంగా ఈ విష్ణు పంజర స్త్రోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాత్యాయానికి చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమా : దీని ప్రభావం వల్ల, ఆ మహాదేవి మహిషాసురునీ, సమరుడు, రక్తబీజుడు తదితరులెందరో దానవులను సుర కంటకులను నాశనం గావించింది.
నారదుడు
39 - కాసౌ కాత్యాయనీ నామ యా జఘ్నేమహిషాసురమ్ ।
సమరంరక్తబీజంచ తథా-న్యాన్ సురకంటకాన్ ॥
40 - కశ్చా సౌమహిషోనామ కులేజాతశ్చ కన్యనః ।
కశ్చాసౌర క్తబీజాభ్యో సమరః కస్య చాత్మజః ॥
నారదుడు
దేవకంటకులైన మహిషదైత్యునీ సమార, రక్తబీజులను వధించిన ఆకాత్యాయని ఎవరు? ఆ మహిషుడేవడు? అతడు పుట్టిన వంశమేది ? ఆసమర రక్తబీజులెవరి కుమారులు ? మహర్షే ! ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి.
పులస్త్యుడు
41 - శ్రూయతాంసంప్రవక్ష్యామి కథాం పాపప్రణాశినీమ్ ।
సర్వదావరదాదుర్గాయేయం కాత్యాయనీ మునే ॥
42 - పురాసురవరౌరౌద్రౌ జగత్షోభకరావుబౌ ।
రంభశ్చైవకరంభశ్చ ద్వావాస్తాం సుమహాబలౌ ॥
43 - తావపుత్రౌచదేవర్షే పుత్రార్థం తేపతు స్తపః ।
బహూన్ వర్షగణాన్ దైత్యౌ స్థితౌ పంచనదే జలే ॥
44 – తత్త్రైకోజలమధ్యస్థో ద్వితీయోప్యగ్నిపంచమీ ।
కరంభశ్చైవరంభశ్చయక్షం మాలవటం ప్రతి ॥
45 - ఏకం నిమగ్నం సలిలే గ్రాహరూపేణ వాసవః ।
చరణాభ్యాంసమాదాయ నిజమాన యథేచ్చయా ॥
46 - తతోబ్రాతరినష్టే చరంభః కోపపరిప్లుతః ।
వహ్నౌస్వశీర్షం సంక్షిద్య హోతుమైచ్చన్ మహాబలః ॥
47 - తతఃప్రగృహ్య కేశేషు ఖడ్గం చ రవిసప్రభమ్ ।
చేత్తుకామో నిజం శీర్షం వహ్నినా ప్రతేషేధితః ॥
48 - ఉక్తశ్చమాదైత్యవర నాశయాత్మాన మాత్మనా ।
దుస్తరాపరవద్యాపి స్వవద్యాప్యతి దుస్తరా ॥
49 - యచ్చప్రార్థయసేవీరః తద్దదామి యథేప్సితమ్ ।
మామ్రియస్వమ్రుతస్యేవ నష్టా భవతి నైకథా ॥
50 - తతోబ్రవీద్వచోరంభో వరం చె న్మే దదాసి హి ।
త్రైలోక్యవిజయీపుత్రః స్యాన్మే త్వత్తేజసాధికః ॥
51 - అజేయోదైవతైః సర్వైః పుంభిర్దైత్యైశ్చ పావక ।
మహాబలోవాయురివ కామరూపీ కృతాస్త్రవిత్ ॥
52 – తంప్రోవాచకవిర్ బ్రహ్మన్ బాఢమేవం భవిష్యతి ।
యస్యాంచితం సమాలంబి కరిష్యసి తతఃసుతః ॥
పులస్త్యుడు
ఓమునీ! ప్రాచీనకాలాన జరిగిన పాపాపహారి అయిన కథ చెబుతున్నా వినుము. సమస్తమైన వరాలు ప్రసాదించే దుర్గయే యా కాత్యాయని. పురాసమయాన, జగత్తు నంతా సంక్షోబింపజేసే యిద్దరు రాక్షసులు, మహాబలశాలురు ఉండేవారు. వారు రంభుడు కరంభుడు. అపుత్రకులైన వారు పుత్రప్రాప్తి కొరకు పంచనదీ జలాలలో మునిగి చాలా ఏండ్లు తపస్సు చేశారు. వారిలో కరంభుడు జలమధ్యంలో, రంభుడు అగ్ని మధ్యంలో ఉండి, మాలవట యక్షుని గూర్తి తపించారు. కరంభుడు నీటిలో మునిగిపోగా యింద్రుడు మకర రూపానవాని కాళ్ళు పట్టుకొని లాగికొని పోయి తన కోరిక మేరకు వధించెను. సోదరుని చావునకు కోపించి రంభుడు తన తల నరికి అగ్నిలోవేల్చ సంకల్పించెను. తన జుట్టు ఒక చేతపట్టుకొని రెండవ చేతితో మెరిసిపోతున్న ఖడ్గం గ్రహించి తల నరుకుకొనబోగా రంభుని అగ్ని వారించి యిట్లనెను – రాక్షసేశ్వరా! తన్ను తాను చంపుకొనుట మంచిదికాదు. పరహత్యాపాతకం కంటె ఆత్మ హత్యాపాతకం భయంకరమైనది. దుస్తరమైనది. చచ్చిన వానినెవడూ పట్టించుకోడు. నీ కోరికయేదో చెప్పుము. నేను నేరవేర్చగలను. అప్పుడు రంభుడు –“ఓ అగ్నీ ! నాకు వరమివ్వదలనుచో నీకంటే తేజస్వి, దేవతల కజేయుడు, నరదైత్యుల కవధ్యుడు వాయువునకు వలె బలవంతుడు, కామరూపుడు సర్వాస్త్రకోవిదుడు, త్రిలోక విజయం సాధించ గలిగిన పుత్రుని దయచేయుమ“ నియెను. అందుకు అగ్ని “తప్పకుండా అలాగే జరుగగలదు. నీకు, ప్రియురాలైన వనితయందు అలాంటి పుత్రుని కను”మణి వచించెను.
53 - ఇత్యేవముక్తో దేవేన వహ్నినా దానవో యయౌ ।
ద్రష్టుం మాలవటం యక్షం యక్ష్యైశ్చ పరివారితమ్ ॥
54 - తేషాంపద్మ నిధిస్తత్ర వసతే నాన్యచేతనః ।
గజాశ్చ మహిషాశ్చాస్చ్వా గావోజావిపరిప్లుతః ॥
55 – తాన్ దృష్ష్ట్వైవ తదా చక్రేభావం దానవపార్థివః ।
మహిష్యాం రూపయుక్తాయాంత్రిహాయణ్యం తపోధన ॥
56 - సాసమాగాచ్చదైత్యేంద్రం కామయంతీ తరస్వినీ ।
సచాపిగమనంచక్రే భవితవ్యప్రచోదితః ॥
57 - తస్యాంసమభవద్ గర్భస్తాం ప్రగ్రుహ్యాథదానవః ।
పాతాళం ప్రవివేశాథ తతః స్వభవనం గతః ॥
58 - దృష్టశ్చదానవైః సర్వైః పరిత్యక్తశ్చ బంధుభిః ।
ఆకార్యకారకేత్యేవం భూయో మాలవటం గతః ॥
59 - సా పితేనై వపతినా మహిషీ చారుదర్శనా ।
సమంజగామతత్పుణ్యం యక్షమండలముత్తమమ్ ॥
60 - తతస్తు వసతస్తస్య శ్యామా సా సుషువే మునే ।
అజీజనత్ సుతంశుభ్రం మహిషం కామరూపిణమ్ ॥
61 - ఏతామృతుమతీం జాతాం మహిషోన్యోదదర్శహ ।
సాచాభ్యగాద్ దితివరం రక్షంతీ శీలమాత్మనః ॥
62 - తమున్నామితనాసంచ మహిషంవీక్ష్యదానవః ।
ఖడ్గంనికృష్యతరసా మహిషం సముపాద్రవత్ ॥
63 - తేనాపిదైత్య స్తీక్ష్ణాభ్యాం శ్రుంగాభ్యాం హ్రుదితాడితః ।
నిర్భిన్నహృదయోభూమౌ నివపాత మమార చ ॥
64 – మృతేభర్తరి సాశ్యామా యక్షాణాం శరణంగతా ।
రక్షితా గుహ్యకైః సాధ్వీ నివార్య మహిషం తతః ॥
65 - తతోనివారితోయక్ష్యై ర్హయారి ర్మదనాతురః ।
నిపపాతసరోదివ్యం తతో దైత్యో భవన్మృతః ॥
66 - సమరోనామవిఖ్యాతో మహాబలపరాక్రమః ।
యక్షానాశ్రిత్యతస్థౌ సకాలయన్ శ్వాపదాన్ మునే ॥
67 - సచదైత్యేశ్వరో యక్ష్యై ర్మాలవట పురస్సరైః ।
చితామారోపితఃసాచ శ్యామా తంచారుహత్పతిమ్ ॥
68 - తతోగ్నిమధ్యాదు తస్థౌ పురుషో రౌద్రదర్శనః ।
వ్యద్రావయత్ సతాన్ యక్షాన్ ఖడ్గపాణి ర్భయంకరః ॥
69 - తతోహతాస్తుమహిషాః సర్వా ఏవ మహాత్మనా ।
ఋతే సంరక్షితారంహి మహిషం రంభనందనమ్ ॥
70 - సనామతః స్మృతో దైత్యో రక్తబీజో మహామునే ।
యో జయత్ సర్వతో దేవాన్ సేంద్రరుద్రార్క మారుతాన్ ॥
71 - ఏవంప్రభావా దనుపుంగవాస్తే తేజో ధిక స్తత్ర బబౌ హయారిః ।
రాజ్యేభిషిక్తశ్చ మహాసురేంద్రై ర్వినిర్జితైః శంబరతారకాద్యై ॥
72 - ఆశక్నువద్భిః సహిత్తైశ్చదేవైః సలోకపాలైః సహుతాశభాస్కరైః ।
స్థానాని త్యక్తాని శశీంద్రభాస్కరై ర్దర్మశ్చ దూరే ప్రతియోజితశ్చ ॥
అగ్నిదేవుని యాదేశాను సారం, అనేక మంది యక్షులతో పరివేష్టితుడైయున్న మాలవట యక్షుని చూచుటకై ఆదానవుడు వెళ్ళిపోయెను. ఆ ప్రదేశాన గజాశ్వ మహిషములు గోవులు మేకలచే పరివృతుడై యుండియు అనన్య చిత్తుడైన పద్మనిధి నివసించుచుండెను. వాటి మధ్య ఉన్నతు వంటి మూడేండ్ల వయస్సు గలిగి అందముగానున్న ఆడు మహిషాన్ని చూచి ఆదానవుడు మోహితుడాయెను . ఓ మునీ! విధి విధానం వల్ల ఆ ఆడుమహిషం గూడ ఆరాక్షసునితో సంగమించుటకై త్వరగా అతనిని సమీపించగా వాడు దానితో రమించెను. వెంటనే అది గర్బం ధరించగా దానిని తీసికొని అతడు పాతాళంలో తన భవనానికి జేరెను. అతడు చేసిన ఆకార్యానికి తోడి రాక్షసులాతనిని బరిత్యజించగా అతడచ్చోటు వదలి తిరిగి మాలవటం చేరెను. ఆ మహిషి గూడ పతిని అనుగమించి ఆ యక్షమండలమునకు వెళ్ళెను. వారక్కడ ఉండగా ణా నల్లని మహిషి ఒకనాడు చక్కని అందమైన దున్నపోతును ప్రసవించెను. అది కామరూపి. ఒకనాడా మహిషి ఋతుమతి అయి ఉండగా మరొక మహిషం (మగది) దానిని చూచి మోహంతో వెంబడించగా నాశ్యామ తన శీలమును రక్షించుకొనుటకై భర్తయైన రాక్షసుని సమీపించెను. మోర ఎత్తుకొని వెంటబడిన ఆ దున్నపోతు మీదకు ఆ రాక్షసుడు కత్తిదూసి లంఘించెను. అంతట నా దున్నపోతు తన కొమ్ములతో రాక్షసుని గుండెల్లో కుమ్మగా హృదయం చీలిపోయి వాడు మరణించెను. తన భర్త మరణించడంతో నా మహిషి యక్షులను శరణుజొచ్చెను. యక్షులచేత నివారింపబడిన ఆ దున్నపోతు మోహాతిరేకంతో చేయునది లేక సమీపంలో ఉన్న ఒక దివ్య సరస్సులోబడి చనిపోయి ఒక రాక్షసుని రూపం ధరించెను. ఆ బాలపరాక్రమ సమన్వితుడైన రాక్షసుడే నమరుడుగా ఖ్యాతి చెందాడు. అతడు ఆ యక్షుల మరుగున చేరి అక్కడ నున్న జంతువుల నెల్లను బారద్రోలెను. అంతట మాలవటాది యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై చేర్చగా నాశ్యామ మహిషి తన పతితో చితాగ్నిలో బడిపోయెను. అంతట నా చితాగ్ని మధ్య నుండి రుద్రాదికారుడగు పురుషుడొకడు బయలుదేరి ఖడ్గపాణియై ఆ యక్షులనందరను వెళ్ళగొట్టెను. ఆ వీరుడు రంభనందనుడైన మహిషుని వదలి మిగిలిన మహిషములన్నింటినీ వధించెను. ఓ మహామునీ! అతడే రక్తబీజుడు. వాడు యింద్రరుద్ర సూర్య మరుత్తులతో సహా దేవతలనందరను జయించాడు. ఆ రాక్షస వీరులంతటి పరాక్రమవంతులు. అయితే వారందరిలోనూ మహిషాసురుడు గొప్పవాడు. శంబరుడు, తారకుడు మొదలయిన వారలనందరను జయించినాడు. వారందరూ నాతనిని తమ ప్రభువుగా అభిషేకించారు. అతని ధాటికి నిలువలేక లోకపాలకులందరు సూర్యచంద్రాగ్నులతో సహా తమ తమ స్థానాలు వదలి పారిపోయారు. ధర్మానికి స్థానం అంటూ లేకుండా పోయింది.
అధ్యాయము 18 complete
Summary of chapter 18 of the Vāmana Mahā Purana is as follows:
Facing total defeat and humiliation, the ousted devas led by Pitāmaha Brahmā repair to the presence of Bhagavān Vishṇu and Mahādeva Śiva to seek divine intervention against the tyranny of Mahishāsura. As the supreme deities contemplate the plight of the cosmos, intense divine energies radiate from the bodies of Vishṇu, Śiva, Brahmā, and all the devas, merging into a blinding mountain of light that materializes as the glorious Goddess Mahāmāyā. The devas rejoice and present Her with divine weapons—Vishṇu bestowing the discus, Śiva his trident, Indra his thunderbolt—preparing the Supreme Mother for cosmic battle.