వామన మహా పురాణము
అధ్యాయము 6
పులస్త్యుడు
1 - హృద్బవో బ్రహ్మణో యోసౌ ధర్మో దివ్యవపుర్మునే ।
దాక్షాయణీ తస్యభార్యా తస్యా మజనయ త్పుతాన్ ॥
2 - హరిం కృష్ణంచ దేవర్షే నారాయణనరౌ తథా ।
యోగాభ్యాసరతౌ నిత్యం హరికృష్ణౌ బభూవతుః ॥
పులస్త్యుడు
“మునివర ! బ్రహ్మమానస పుత్రుడు దివ్యశరీరి యగు ధర్ముడు. దాక్షాయణి ఆయన భార్య. ఆ దంపతులను హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడను నలుగురు కుమారులు. వారిలో హరికృష్ణులు యోగాభ్యాస నిరతులైనారు”.
3 - నరనారాయణౌ చైవ జగతో హితకామ్యయా ।
తప్యేతాంచ తపః సౌమ్యౌ పురాణా వృషినత్తమౌ ॥
4 - ప్రాలేయాద్రిం సమాగమ్య తీర్థే బదరికాశ్రమే ।
గృణంతౌ తత్పరం బ్రహ్మ గంగాయా విపులేతటే ॥
కాగా పురాణ ఋషి సత్తములయిన నరనారాయణులు లోకకల్యాణార్థం హిమాలయాలలో బదరికాశ్రమాన గంగా తీరాన పరబ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశారు.
5 - నరనారాయణాభ్యాంచ జగదేత చ్చరాచరమ్ ।
తాపితం తపసా బ్రహ్మన్ శక్రః క్షోభం తదా యయౌ ॥
6 - సంక్షుబ్దః తపసా తాభ్యాం క్షోభణాయ శతక్రతుః ।
రంభాద్యాప్సరసః శ్రేష్ఠా ప్రైషయత్సమహాశ్రమమ్ ॥
7 - కందర్పశ్చ సుదుర్ధర్ష శ్చూతాంకురమహాయుదః ।
సమం సహచరేణైవ వసంతే నాశ్రమం గతః ॥
వారలు గావించిన ఘోర తపస్సుకు చరాచర జగత్తంతా తల్లడిల్లినది. అది చూచి ఇంద్రుడు కలవరపాటోందెను. వారల తపస్సు భంగపరచుటకై దేవరాజు రంభాది అప్సరో కామినులను వారి కడకు పంపెను. వారితో బాటు అమ్రవల్ల వాద్యాయుధాలు ధరించి, సహచరుడైన వసంతునితో కలిసి మన్మథుడు కూడ వారల ఆశ్రమానికి వెళ్ళెను.
8 - తతో మాదపకందర్పౌ తాశ్చైవాప్సరసో వరాః ।
బదర్యాశ్రమమాగత్య విచిక్రీడుర్యథేచ్చయా ॥
9 - తతో వసంతే సంప్రాప్తే కిoశుకా జ్వలనప్రభాః ।
నిష్పత్రా సతతంరేజుః శోభయంతో ధరాతలమ్ ॥
10 - శిశిరం నామ మాతంగం విదార్య నఖరైరివ ।
వసంతకేసరీ ప్రాప్తః పలాశకుసుమై ర్మునే ॥
11 - మాయాతుషారౌఘకరీ నిర్జితః స్వేన తేజసా ।
తమేవ హసతే త్యుచ్చైః వసంతః కుందకుడ్మలైః ॥
12 - వనాని కర్ణికారాణాం పుష్పితాని విరేజిరే ।
యత్రా నరేంద్రపుత్రాణి కనకాభరణాని హి ॥
13 - తేషా మనుతథా నీపాః కింకరాఇవ రేజిరే ।
స్వామిసంలబ్దసంమానా భృత్యా రాజసుతానివ ॥
14 – రక్తాశోకవనా భాంతి పుష్పితాః సహసోజ్వలాః ।
భృత్యావసంతనృపతేః సంగ్రామే సృక్ ప్లుతా ఇవ ॥
వారందరు బదరికాశ్రమము ప్రవేశించి యిష్టము వచ్చినట్టుగా విహరించసాగిరి. వసంతాగమనంతో ఆకులూడ్చుకొని పుష్పించిన మోదుగచెట్లు, అగ్నిశిఖల్లాగా భూమికి అలంకారంగా వెలుగొందినవి. శిశిరమనే ఏనుగును మోదుగుపూవులనేగోళ్ళతో చీల్చుచున్నదోయన్నట్లు వసంతకేసరి విజ్రుంభించింది. ఆ కాంతితో తుషార సముదాయమనే ఏనుగు జయించాననే దర్పంతో మల్లె మొగ్గల దావళ్య మిషతో వసంతుడు వెక్కిరించుచుండెను. సర్వాభరణభూషితులై వెలుగొందే రాజకుమారుల వలె పుష్పించిన కర్ణికార ఉద్యానవనాలు శోభిల్లెను. వాని ప్రక్కనే నీప (కడిమి) వృక్షములు ప్రభు సమ్మాన లబ్దకింకరుల వలె శోభించినవి. మరొక వైపు పుష్పితాశోకవనాలు తమ ప్రభువైన వసంతునికై పోరాడి క్షతగాత్రులై నిలచిన సేవకుల వలె విరాజిల్లినవి.
15 - మృగవృందాః పింజరితా రాజంతే గహనే వనే ।
పులకాభిర్వృతా యద్వత్ సజ్జనాః సుహృదాగమే ॥
16 - మంజరీభి ర్విరాజంతే నదీకూలేషు వేతసాః ।
వక్తుకామా ఇవాంగుళ్యా కోస్మాకం సదృశో నగః ॥
తెల్లని మచ్చలు గల లేళ్ళ గుంపులు గహనకాననాల్లో, సంమిత్రులేతెంచినపుడు ఆనందపులకాంకితులగు సజ్జనుల వలె తిరుగసాగినవి. “ మముబోలిన వృక్షములెవ్వి?” యని అంగుళి చాలనంతో ప్రశ్నించుచున్నవో యన్నట్లు నదీ తీరాల్లో పుష్ప మంజరులతో వేతన(పేము)లతలు వెలసినవి.
పులస్త్యుడు
17 - రక్తాశోకకరా తన్వీ దేవర్షే కింశుకాంఘ్రికా ।
నీలాశోకకచా శ్యామా వికాసికమలాననా ॥
18 - నీలేందీవరనేత్రాచ బ్రహ్మన్ బిల్వఫలస్తనీ ।
ప్రపుల్లకుందాదశనా మంజరీ కరశోభితా ॥
19 - బందుజీవాధరా శుభ్రా సిందువారనఖాద్బుతా ।
పుంస్కోకిలన్వనా దివ్యా అంకోలవననా శుభా ॥
20 - బర్హివృందాకలాపాచ సారసస్వరనూపురా ।
ప్రాగ్వంశరసనా బ్రహ్మన్ మత్తహంసగతి స్తథా ॥
21 – పుత్రజీవాంశుకా భృంగరోమరాజివిరాజితా ।
వసంత లక్ష్మీః సంప్రాప్తా బ్రహ్మన్ బదరికాశ్రమే ॥
22 - తతో నారాయణో దృష్ట్వా ఆశ్రమస్యానవద్యతామ్ ।
సమీక్ష్యచ దిశఃసర్వా స్తతోనంగ మపశ్యత ॥
పులస్త్యుడు
ఓ నారదా! వసంతలక్ష్మి రక్తాశోక హస్తాలతో, అరుణ కింశుక చరణాలతో, నీలాశోక కచభారంతో, వికసిత పద్మముఖంతో, నీ లేందీవర నేత్రాలతో, మారేడుపండ్ల చమకట్టుతో, వికసిత కుంద దంతాలతో, బంధు జీవాధరాలతో, తెల్లని సిందువార నఖ కాంతులతో, అంకోల వస్త్రదారణంతో, గండు కోయిలల కల స్వరాలతో, నెమళ్ళ గుంపుల అలంకారాలతో, నీటిబెగ్గురు స్వరనూపుర ఘలంఘలలతో, ప్రాగ్వంశకటి సూత్రాలతో, మదమరాళ గమనాలతో, పుత్రజీవాంబరలతో, భ్రమరరోమావళితో సకల జన మనోభిరామమైన సౌందర్యాన్ని పుణికి పుచ్చుకుని బదరికాశ్రమంలో ప్రవేశించింది. తమ ఆశ్రమాన్ని ఆవరించిన ఆ అనవద్య శోభను తిలకిస్తూ నారాయణ ఋషి అచట అనంగుని చూచెను.
23 - కోసా వనంగో బ్రహ్మర్షే తస్మిన్ బదరికాశ్రమే ।
యం దదర్శ జగన్నాదో దేవో నారాయణోవ్యయః ॥
నారదుడు
“బ్రహ్మర్షీ! అవ్యయుడు జగన్నాథుడునగు నారాయణర్షి దర్శించిన ఆ మన్మథు(ఆనంగు)డెవ్వరు?”
పులస్త్యుడు
24 - కందర్పో హర్షతనయో యోసౌ కామో నిగద్యతే ।
స శంకరేణ సందగ్దో హ్యసంగత్వ ముపాగతః ॥
పులస్త్యుడు
ఆ అవంగుడు హర్షతనయుడగు కాముడు. శంకరునిచే దగ్ద శరీరుడై అనంగు (శరీర)రహితుడైనాడు.
నారదుడు
25 - కిమర్థం కామదేవోసౌ దేవదేవేన శంభునా ।
దగ్దస్తు కారణే కస్మిన్నే తద్వ్యాఖ్యాతు మర్హసి ॥
నారదుడు
“ఏ కారణమున కామదేవుని దేవదేవుడగు శంకరుడు భస్మము గావించెను. ఆ వివరణము తెలుపుము.”
పులస్త్యుడు
26 - యదా దక్షసుతా బ్రహ్మన్ సతీ యాతా యమక్షయమ్ ।
వినాశ్య దక్షయజ్ఞంతం విచచార త్రిలోచనః ॥
27 - తతోవృషధ్వజం దృష్ట్వా కందర్పః కుసుమాయుదః ।
అపత్నీకం తదాస్త్రేణ ఉన్మాదేనాభ్యతాడయత్ ॥
28 - తతో హరః శరేణాథ ఉన్మాదేనాశు తాడితః ।
విచచార మదోన్మత్తః కాననాని సరాంసిచ ॥
29 - స్మరన్ సతీం మహాదేవః తదోన్మాదేనా తాడితః ।
న శర్మ లేఖే దేవర్షే బాణవిద్ద ఇవ ద్విపః ॥
30 - తతః పపాత దేవేశః కాళిందీసరితం మునే ।
నిమగ్నే శంకరే ఆపో దగ్దాః కృష్ణత్వ మాగతాః ॥
31 - తదాప్రభృతి కాళింద్యా భృంగాంజననిభం జలమ్ ।
అస్యందత్ పుణ్యతీర్థా సా కేశపాశ మివావనేః ॥
32 - తతో నదీషు పుణ్యాసు సరస్సుచ నదేషుచ ।
పులినేషుచ రమ్యేషు వాపీషు నలినీషుచ ॥
33 - పర్వతేషుచ రమ్యేషు కాననేషుచ సానుషు ।
విచరన్ స్వేచ్చయా నైవ శర్మలేఖే మహేశ్వరః ॥
34 - క్షణంగాయతి దేవర్షే క్షణం రోదితి శంకరః ।
క్షణం ధ్యాయతి తన్వంగీం దక్షకన్యాం మనోరమామ్ ॥
35 – ధ్వాత్వా క్షణం ప్రస్వపితి క్షణం స్వప్నాయతే హరః ।
స్వప్నే తథేదం గదతి తాం దృష్ట్వా దక్షకన్యకామ్ ॥
36 – నిర్ఘృణే తిష్ఠ కింమూడే త్యజసే మా మనిందితే ।
ముగ్దే త్వయా విరహితో దగ్దోస్మి మదనాగ్నినా ॥
37 - సతి సత్యం ప్రకుపితా మా కోపం కురు సుందరి ।
పాదప్రణామావనత మభిబాషితు మర్హసి ॥
38 - శ్రూయసే దృశ్యసే నిత్యం స్పృశ్యసే వంద్యసే ప్రియే ।
ఆలింగ్యసే చ సతతం కిమర్థం నాభిభాషసే
39 - విలపంతం జనం దృష్ట్వా కృపా కస్య న జాయతే ।
విశేషతః పతిం బాలేః నను త్వ మతినిర్ఘృణా ॥
40 - త్వయోక్తాని వచాంస్యేవం పూర్వం మమ కృశోదరి ।
వినా త్వయా న జీవేయం తదసత్యం త్వయాకృతమ్ ॥
41 - ఏహ్యేహి కామసంతప్తం పరిష్వజ సులోచనే ।
నాన్యథా నశ్యతే తాపః సత్యేనాపి శపేప్రియే
42 - ఇత్థం విలప్య స్వప్నాంతే ప్రతిబుద్దస్తు తత్క్షణాత్ ।
ఉత్కూజతి తథారణ్యే ముక్తకంఠం పునః పునః ॥
పులస్త్యుడు
నారదా! వినుము. దక్షపుత్రి సతీదేవి మరణానంతరం త్రిలోచనుడు దక్షయజ్ఞం ధ్వంసం గావించి సంచరించుచుండగా, అపత్నీతుడగు నా వృషకేతనుని చూచి కుసుమాయుదుడగు కందర్పుడున్మాదనాస్త్రంతో ప్రహరించెను. ఆ ఉన్మాదనాస్త్ర ప్రభావం వల్ల హరుడు పిచ్చివానివలె అడవుల్లో నదీతీరాల్లో తిరుగాడ సాగెను. తన భార్య సతీదేవి స్మరణకు రాగా, బాణందెబ్బతిన్న మదగజంలాగా మనోనిబ్బరాన్ని కోల్పోయెను. ఆతాపాన్ని భరించ లేక హరుడు యమునా నదిలో దుమికెను. ఆ విరహానలానికి క్రాగి యమునాజలాలు నల్లబడెను. అప్పటినుంచీ కాటుక రంగు నీరు కలిగిన యమున “కాళింది” యయ్యెను. ఆ ప్రవాహం భూదేవికేశపాశంలాగా ప్రవహించి పవిత్ర తీర్థ మాయెను. ఆ విధంగా ఎన్నో పవిత్ర నదుల్లో సరస్సులలో వాపీకూపాల్లో మునుగుతూ నదీ తీరాల్లో పర్వత భూముల్లో అరణ్యాల్లో స్వచ్చందంగా తిరుగాడుచున్నను శివునకు మనశ్శాంతి కలుగలేదు. కొంతసేపు ఎమోపాడుతూ, కొంతసేపు ఏడుస్తూ, కొంత సేపు ధ్యానంలో ఉంటూ, అందాల బరిణ అయిన దక్షకన్యనే స్మరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కపుడు ఆమెని గురించి కలకంటూ యిలా కలువరించెడివాడు.” “ఓ నిర్ణయురాలా! నిలువుము. ఓముగ్ధా! అనింద్యురాలా! నన్నువిడువకుము. నీ వియోగం వల్ల మదనానలంతో దగ్ధమగుచున్నాను. ఓ సతీ, సుందరీ నా మీదకోపమా? కోపింపకుము. నీపాదములకు మ్రొక్కెదను. నాతో మాటాడుము. ప్రియురాలా! నిన్ననుక్షణం చూచుచున్నాను. వినుచున్నాను, స్పృశిస్తున్నాను, కౌగిలించుచున్నాను, నీకు నమస్కరిస్తున్నాను. అట్టి నాతో ఏల మాటాడవు? ఇలా విలపించే వానిని చూచి ఎవని గుండె కరుగదు? అందులోనూ భర్త అయిన వాని పట్ల ఇంతటి కాటిన్యమా ? నిన్ను వదలి నేను జీవించజాలను.” అంటూ నీవిదివరకు చేసిన బాసలు ఏమైనవి? ఎంతటి అసత్యవాదినివి? ఓసునేత్రీ! ఇంతటి నిర్దయ వలదు. రమ్ము. నన్ను కౌగలించుకొనుము. లేనిచో ఈ కామాగ్ని చల్లారదు. నేను దగ్దమగుట తథ్యము. నిజాము చెప్పుచున్నాను.” ఇలా ఇలా కలవరించి స్వప్న భంగం కావడంతోటే తెలివి తెచ్చుకొని అడవుల్లో భోరున నేడ్చుచు పర్యటించును.
43 - తం కూజమానం విలపంత మారాత్ సమీక్ష్య కామో వృషకేతనం హి ।
వివ్యాధ చాపం తరసా వినామ్య సంతాపనామ్నాతు శరేణ భూయః ॥
44 - సంతాపనాస్త్రేణ తదా స విద్దో భూయః స సంతప్తతరో బభూవ ।
సంతాపయంశ్చాపి జగత్సమగ్రం పూత్కృత్య పూత్కృత్య వివాసతేస్మ ॥
45 - తంచాపి భూయో మదనో జఘాన విజృంభణాస్త్రేణ తతో విజృంభే ।
తతో భృశం కామశ రైర్వితున్నో విజృంభమాణః పరితో భ్రమంశ్చ ॥
46 - దదర్శ యక్షాదిపతే స్తనూజం పాంచాలికం నామ జగత్ర్పదానమ్ ।
దృష్ట్వా త్రినేత్రో ధనదస్య పుత్రం పార్శ్వం సమభ్యేత్య వచోబబాషే ॥ ।
బ్రాతృవ్య వక్ష్యామి వచో యదద్య తత్వం కురుష్వామిత విక్రమోసి ॥
ఇలా దీనంగా విలపిస్తున్న హరునిచూచి కాముడు సంతాపనమనే మరొక బాణముతో గొట్టెను. ఆదెబ్బకు శంకరుడు మరింత సంతప్తుడై ఆగ్నేయ నిశ్వాసాలు పూత్కారాలు గావిస్తూ ప్రపంచాన్నంతటినీ తీవ్రతాపంలో ముంచెను. అదేసమయాన మరల కాముడు విజ్రుంభణమనే బాణాన్ని వదలెను. దానితో శివుడు విపరీతంగా ఆవులించుచూ నలుదిశలు కలయజూచెను. అప్పుడతనికి కుబేర పుత్రుడు పాంచాలికుడనువాడు కనుపించెను. వెంటనే వానిని సమీపించి శివుడు _ “బాబూ, నీవు మహావీరుడవు. నేను చెప్పునట్లు చేయుము.” అనెను.
పాంచాలికుడు
47 - యన్నాథః మాం వక్ష్యసి తత్కరిష్యే సుదుష్కరం యద్యపి దేవనంఘై: ।
ఆజ్ఞావయస్వాతులవీర్య శంభోః దాససో-స్మితే భక్తియుత స్తథేశ ॥
పాంచాలికుడు
“ప్రభూ! మీరు అసమాన పరాక్రములు. మీకు దాసుడను. మీరు చెప్పునది దేవతలకు అసాధ్యమైననూ సరే, నేను తప్పక చేయుదును. ఆజ్ఞాపింపు” డనెను.
శంకరుడు
48 - నాశంగతాయాం వరదాంబికాయాం కామాగ్నినాప్లుష్ట సువిగ్రహో-స్మి ।
విజ్రుంభణోన్మాదశరై ర్విభిన్నో దృతిం నవిందామి రతిం సుఖం వా ॥
49 - విజ్రుంభణం పుత్రః తథైవ తాప మున్మాదముగ్రం మదన ప్రణున్నమ్ ।
నాన్యః పుమాన్ ధారయితుంహి శక్తో ముక్త్వా భవంతం హి తతః ప్రతీచ్చ ॥
శంకరుడు
“పుత్రా! వరదాంబిక మరణానంతరం కామాగ్నిదగ్దుడనై విజ్రుంభణ ఉన్మాదన బాణాలకు గురియై విలవిల లాడుచున్నాను. మదన చోదితాలయిన ఈ జ్రుంభణ మాదన స్నాతాప నాస్త్రాల వేడిమిని తట్టుకొన గలవాడు నీవు దక్క మరొకడులేడు. కనుక వీనిని గ్రహించి నాకు శాంతి కలిగించుము.
పులస్త్యుడు
50 - ఇత్యేవ ముక్తో వృషభద్వజేన యక్షః ప్రతీచ్చత్ సవిజ్రుంభణాదీన్ ।
తోషం జగామాశు తతస్త్రిశూలీ తుష్టస్తదైవం వచనం బభాషే ॥
పులస్త్యుడు
ఈశ్వరుని వచనములు విని యక్షపుత్రుడా జ్రుంభణ మాదనాది అస్త్రాలను గ్రహించెను. అంతట సంతోషించిన వాడై శూలి అతని కిట్లనెను.
శంకరుడు
51 - యస్మత్త్వయా పుత్రః సుదుర్దరాణి విజ్రుంభణాదీని ప్రతీచ్చితాని ।
తస్మాద్వరం త్వాం ప్రతిపూజనాయ దాస్యామి లోకస్యచ హాస్యకారి ॥
52 - యస్త్వాం యదా పశ్యతి చైత్రమాసే స్పృశేన్నరో వార్చయతే చ భక్త్యా ।
వృద్దో-థ బాలో-థ యువాథ యోషిత్ సర్వే తదోన్మాదధరా భవంతి ॥
53 - గాయంతి నృత్యంతి రమంతి యక్ష వాద్యాని యత్నాదపి వాదయంతి ।
తవాగ్రతో హాస్యవచో-భిరక్తా భవంతితే యాగాయుతాస్తు తేస్యుః ॥
54 - మమైవ నామ్నా భవితా-సి పూజ్యః పాంచాలికేశః ప్రథితః పృథిన్యామ్ ।
మమ ప్రసాదాద్వరదో నరాణాం భవిష్యసే పూజ్యతమో-భిగచ్చ ॥
శంకరుడు
బిడ్డా! దుస్సహములయిన జ్రుంభణాది అస్త్రముల తాపమును స్వీకరించిన నీయందు ప్రీతుడనైతిని. అందుకు బదులుగా నీకు అనుకూలించునదియు లోకులకు సంతోషకరమైనదియునైన వరమొకటి యిచ్చు చున్నాను. చైత్రమాసంలో నిన్ను చూచినను తాకినను, భక్తితో అర్పించినను, అట్టివారు వృద్దులైనా, బాలురైనా, స్త్రీలైనా పురుషులైనా సరే వారందరు ఉన్మత్తులగుదురు. వారు ఆస్థితిలో నాట్యగానాలు చేయుదురు. వివిధ వాద్యాలు నేర్పుతో వాయింతురు. నీ ముందర హాస్యోక్తులు పలుకుచుందురు. అయితే వారందరకు దివ్యశక్తులు లభించును. ఇక నీవూ, భూలోకంలో నా పేరుతో పాంచాలికేశ్వరుడవుగా విఖ్యాతుడవై నిన్ను గొలిచినవారలకు వరములొసంగెదవు. ఎల్లరకు పూజ్యుడవగుదువు.
55 - ఇత్యేవముక్తో విభునా నయక్షో జగామ దేశాన్ సహనైవ సర్వాన్ ।
కాలంజరస్యోత్తరతః సుపుణ్యో దేశో హిమద్రేరపి దక్షిణస్థః ॥
56 - తస్మిన్ సుపుణ్యే విషయే నివిష్టో రుద్రప్రసాదా దభిపూజ్యతే-సౌ ।
తస్మిన్ ప్రయాతే భాగావాంస్త్రీనేత్రో దేవో-పి వింధ్యంగిరి మభ్యగచ్చత్ ॥
57 - తత్రాపి మదనో గత్వా దదర్శ వృషకేతనమ్ ।
దృష్ట్వా ప్రహర్తుకామంచ తతః ప్రాదుద్రవద్దరః ॥
58 - తతో దారువనం ఘోరం మదనాభిసృతో హరః ।
వివేశ ఋషయో యత్ర సపత్నికా వ్యవస్థితాః ॥
59 - తేచాపి ఋషయ స్సర్వే దృష్ట్వా మూర్ధ్నా నతాభవన్ ।
తతస్తాన్ ప్రాహ భగవాన్ భిక్షా మే ప్రతిదీయతామ్ ॥
హరునిచే వరము పొంది ఆ పంచాలికుడు సమస్త దేశాలలో పరిభ్రమించెను కాలింజరానికి ఉత్తరాన, హిమవత్పర్వతానికి దక్షిణాన గల పవిత్ర దేశంలో ఆ యక్షపుత్రుడు శివానుగ్రహం వల్ల పంచాలికేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ముక్కంటి కూడ వింధ్యగిరికి పయనించెను. అయితే మదనుడాయననచటకు గూడ వెంబడించి మరల ప్రహరింపనుద్యుక్తుడు కాగా హరుడచతటనుండి పలాయితు డయ్యెను. అట్లు పరుగిడి అనేకులు ఋషులకు తత్పత్నులకు నావాసమైన భయంకరమగు దారుకావనమున ప్రవేశించెను. అట్లు కామునిచే తరుమబడి తమ ఆశ్రమాలలో బ్రవేశించిన శివుని జూచి ఋషులు తమ తలలువంచికొనిరి. శివుడు వారలను బిక్ష పెట్టుడని అడిగెను.
పులస్త్యుడు
60 - తతస్తే మౌనిన స్తస్థుః సర్వఏవ మహర్షయః ।
తదాశ్రమాణి సర్వాణి పరిచక్రామ నారద ॥
61 - తంప్రవిష్టం తదాదృష్ట్వా భార్గవాత్రేయయోషితః ।
ప్రక్షోభ మగమన్ సర్వా హీనసత్వాః సమంతతః ॥
62 - ఋతే త్వరుందతీ మేకా మనసూయాంచ భామినీమ్ ।
ఏతాభ్యాం భతృపూజాసు తచ్చింతాసు స్థితం మనః ॥
63 - తతః సంక్షుభితా స్సర్వా యత్ర యాతి మహేశ్వరః ।
తత్రప్రయాంతి కామార్తా మదవిహ్వలితేంద్రియాః ॥
64 - త్యక్త్వాశ్రమాని శూన్యాని స్వాని తా మునియోషితః ।
అనుజగ్ము ర్యథా మత్తం కరిణ్య ఇవ కుంజరమ్ ॥
65 - తతస్తు ఋషయో దృష్ట్వా భార్గవాంగిరసో మునే ।
క్రోధాన్వితా బ్రువన్ సర్వే లింగోస్య పతతాం భువి ॥
66 - తతః పపాత దేవస్య లింగం పృథ్వీం విదారయన్ ।
అంతర్దానం జగామాథ త్రిశూలీ నీలలోహితః ॥
పులస్త్యుడు
నారదా! అంతట ఋషులు మౌనంగా ఉండుట చూచి హరుడు వారల ఆశ్రమముల నంతట కలయదిరిగెను. అట్లు తిరుగుచున్న శివుని చూచి భార్గవ, ఆత్రేయ ఋషుల భార్యలందరు విమోహితలై నిగ్రహాన్ని కోల్పోయి కామార్తలై శివుడెచటకు పోయిన నచటకు వెంటబడి పోసాగిరి. అయితే పరమపతివ్రతలగు అరుంధతీ అనసూయలు మాత్రము ఆ వికారమునకు లోను గాకుండిరి. తమ ఆశ్రమాలు యిండ్లు వదలి మదించిన ఏనుగు వెంబడించు కరిణుల వలె పరమ శివుని వెంట పరుగిడు భార్యల చేష్టలు చూచి క్రోదోన్మత్తులైన అంగిరసాది ఋషులు శివుని లింగము నేలబడునట్లుగ శపించిరి. వెంటనే శివుని లింగము భూమిని బ్రద్దలు చేయుచు నేలబడెను. అంతట త్రిశూలియగు శివుడంతర్హితుడాయెను.
67 - తతః స పతితో లింగో విభిద్య వసుధాతలమ్ ।
రసాతలం వివేశాశు బ్రహ్మాండం చోర్ద్వతోభినత్ ॥
68 - తత శ్చచాల పృథివీ గిరయః సరితోనగాః ।
పాతాలభువనాః సర్వే జంగమాజంగమైర్యుృతాః ॥
69 - సంక్షుబ్దాన్ భువనాన్ దృష్ట్వా భూర్లోకాదీన్ పితామహః ।
జగామ మాధవం ద్రష్టుం క్షీరోదం నామసాగరమ్ ॥
70 - తత్ర దృష్ట్వా హృషీకేశం ప్రణిపత్యచ భక్తితః ।
ఉవాచదేవః భువనాః కిమర్దం క్షుభితా విభో ॥
71 - అథోవాచ హరి ర్బ్రహ్మాన్ శార్వో లింగో మహర్షిభిః ।
పాతిత స్తస్య భారార్తా సంచచాల వసుంధరా ॥
72 - తత స్తదద్భుతతమం శ్రుత్వా దేవః పితామహః ।
తత్రగచ్చామ దేవేశ ఏవమాహ పునఃపునః ॥
73 - తతఃపితామహో దేవః కేశవశ్చ జగత్పతిః ।
ఆజగ్మతు స్తముద్దేశం యత్రలింగం భవస్యతత్ ॥
74 - తతోనంతం హరిర్లింగం దృష్ట్వారుహ్య ఖగేశ్వరమ్ ।
పాతాళం ప్రవివేశాథ విస్మయాంతరితో విభుః ॥
75 - బ్రహ్మ పద్మ విమానేన ఊర్ద్వమాక్రమ్య సర్వతః ।
నైవాంత మలభద్ బ్రహ్మన్ విస్మితః పునరాగతః ॥
76 - విష్ణుర్గత్వాథ పాతాలాన్ సప్తలోకపరాయణః ।
చక్రపాణి ర్వినిష్క్రాంతో లేభేంతం నమహామునే ॥
77 - విష్ణుః పితామహ శ్చోభౌ హరలింగం సమేత్యహి ।
కృతాంజలి పుటౌ భూత్వా స్తోతుం దేవం ప్రచక్రతుః ॥
అట్లునేలబడిన లింగము భూమిని బ్రద్దలు చేసుకొని పాతాళానికి పైన బ్రహ్మాండాన్ని ఖేదించుకొని ఊర్ద్వలోకాలకూ వ్యాపించెను. అంతట నదీనద సముద్ర పర్వతాలతో నిండిన భూగోళము కంపించెను. పాతాళాది భువనాలన్నీ ఘూర్లిల్లి పోయినవి, అట్లు సంక్షుభితాలయిన భువనాలను చూచి బ్రహ్మవిస్మితుడై క్షీరసాగరశాయి అయిన మాధవుని చూడ బోయెను. అచట హృషీకేశుని చూచి భక్తితో స్తోత్రముచేసి, “ప్రభో ! ఈ మహోపద్రవ మెట్టిది? అని అడిగెను. అప్పుడు శ్రీహరి విరించీ! మహర్షుల శాపకారణంగా శర్వుని లింగము ఊడిపడినది. ఆ భారము వహించ లేక భూమి కంపించి పోవుచున్నదనెను. ఆ అద్భుతానికి విస్మితుడై బ్రహ్మ మనమచ్చటకు పోవుదమని విష్ణువును తొందరపెట్టెను. అంతట బ్రహ్మ విష్ణువు లిద్దరు శివలింగము పడిన చోటుకు చేరిరి. తుద మొదలు కనుపించని ఆ లింగమును చూచినంతనే విష్ణువు గరుడునిపై నెక్కి ఆశ్చర్యంతో పాతాళానికి వెళ్ళిపోయెను. బ్రహ్మ పద్మవిమానాన్నెక్కి ఊర్ద్వ లోకాలన్నీ గాలించాడు. కాని లింగపు కోన కనుగొన జాలక ఆశ్చర్య చకితుడై తిరిగి వచ్చాడు. అట్లే సప్త పాతాళాలను శోధించిన విష్ణువు కూడ లింగపు మొదలు కనుగొన జాలక తిరిగి వచ్చాడు. అంతట విధి విష్ణు లిద్దరూ లింగమును సమీపించి చేతులు జోడించి ఆ మహాదేవుని ఈ విదంగా స్తోత్రం చేయ మొదలిడిరి.
78 - నమోస్తుతే శూలపాణేః నమోస్తు వృషభద్వజ ।
జీమూతవాహన కవే శర్వ త్ర్యంబకః శంకరః ॥
79 - మహేశ్వర మహేశానః సువర్ణాక్ష మహాకపే ।
దక్షయజ్ఞక్షయకరః కాలరూప నమోస్తుతేః ॥
80 - త్వమాదిరస్య జగత స్త్వం మద్యం పరమేశ్వర ।
భవానంతశ్చ భగవాన్ సర్వగస్త్వం నమోస్తుతే ॥
హరిబ్రహ్మ
“ఓ శూలపాణీ! నీకు నమస్కారం! వ్రుషభద్వజా, నీకు వందనము! కవీ! శర్వా! త్ర్యంబకా! శంకరాః నమస్కారము! మహేశ్వరా, మహేశానా, సువర్ణాక్షా, వృషాకపీ, దక్షాధ్వరనాశకా, కాలరూపా, నీకు నమస్సులు! ఈ జగత్తుకు మొదలు, మధ్య, తుది నీవే! పరమేశ్వరా! భగవన్! నీవు సర్వవుడవు! నీకు వందనములు!”
పులస్త్యుడు
81 - ఏవం సంస్తూయమానస్తు తస్మిన్ దారువనేహరః ।
స్వరూపీ తావిదం వాక్య మువాచ వదతాం వరః ॥
పులస్త్యుడు
ఆ స్తోత్రమునకు సంతసించి ఆ దారుకావనంలో వక్యవిశారదుడగు ఈశ్వరుడు హరిబ్రహ్మలకు ప్రత్యక్షమై,
హర
82 - కిమర్థం దేవతానాథౌ పరిభూతక్రమం త్విహ? ।
మాం స్తువాతే భృశాస్వస్థం కామతాపితవిగ్రహమ్ ॥
హర
“ఓ దేవాదిపులారాః కామ సంతప్తుడనై విధి క్రమాలు విసర్జించి, చిత్తశాంతి లేకుండా ఉన్న నన్నెందు స్తోత్రము చేయుచున్నారనెను.
హరిబ్రహ్మ
83 - భవతః పాతితం లింగం యదేతత్ భువి శంకర ।
ఏతత్ ప్రగృహ్యతాం భూయ ఆతో దేవ స్తువావహే ॥
హరిబ్రహ్మ
మహాదేవా! ఇచట భూపతితమైన భవదీయ లింగాన్ని తిరిగి పరిగ్రహించండి. ఇదే మా ప్రార్థనము.
హర
84 - యద్యర్చయంతి త్రిదశా మమ లింగం సురోత్తమౌ ।
తదేత త్ప్రతిగృహ్ణీయాం నాన్యథేతి కథంచన ॥
హర
“ఓ దేవోత్తములారా! దేవతలందరు నాలింగమును పూజించినచో నేను దీనిని తీసికొందును. లేనిచో తీసికొనను.
85 - తతః ప్రోవాచ భగవా నేవమస్త్వితి కేశవః ।
బ్రహ్మా స్వయంచ జగ్రాహ లింగం కనకపింగళమ్ ॥
86 - తతశ్చకార భగవాం శ్చాతుర్వర్ణ్యం హరార్చనే ।
శాస్త్రాణి చైషాం ముఖ్యాని నానోక్తివిదితానిచ ॥
87 - ఆద్యం శైవం పరిఖ్యాత మన్యత్ పాశుపతం మునేః ।
తృతీయం కాలవదనం చతుర్థంచ కపాలికమ్ ॥
88 - శైవశ్చాసీత్ స్వయంశక్తి ర్వసిష్ఠస్య ప్రియః సుతః ।
తస్యశిష్యోబభూవాథ గోపాయన ఇతి శ్రుతః ॥
89 - మహాపాశుపత శ్చాసీ ద్భారద్వాజ స్తపోధనః ।
తస్యశిష్యోప్యభూద్రాజా ఋషభః సోమకేశ్వరః ॥
90 - కాలాస్యో భగవానాసీ దాపస్తంబ స్తపోధనః ।
తస్యశిష్యోభవద్వైశ్యో నామ్నా క్రాథేశ్వరో మునే ॥
91 - మహావ్రతీచ ధనద స్తస్య శిష్యశ్చ వీర్యవాన్ ।
కర్ణోదర ఇతి ఖ్యాతో జాత్యా శూద్రో మహాతపాః ॥
92 - ఏవం న భగవాన్ బ్రహ్మా పూజనాయ శివస్య తు ।
కృత్వాతు చాతురాశ్రమ్యం స్వమేవ భవనం గతః ॥
93 - గతే బ్రహ్మణి శర్వోపి ఉపసంహృత్య తం తదా ।
లింగం చిత్రవనే సూక్ష్మం ప్రతిష్టాప్య చచారహా ॥
అందులకు కేశవుడంగీకరించగా బ్రహ్మ స్వయంగా నా బంగారు వికారముగల లింగమును తీసికొచ్చెను. అనంతరం భగవానుడు నాలుగు వర్ణముల వారిని హరార్చన పరులనొనర్చెను. అందులకు వలసిన ముఖ్యశాస్త్రముల ప్రవర్తింప జేసెను. వానిలో మొదటిది శైవము, రెండవది పాశురము, మూడవది కాలవదనము నాల్గవది కాపాలికము. వశిష్టుని ప్రియపుత్రుడు శక్తి శైవుడు, ఆయన శిష్యుడు గోపాయనుడని తెలియుచున్నది. ఇక భరద్వాజుడు మహాపాశుపతుడు. ఆ తపస్వి శిష్యుడు ఋషభ సోమకేశ్వరుడను నరపతి. తపోధనుడగు నాపస్తంబుడు కాలాముఖ భక్తుడు. ఆయన శిష్యుడు క్రాథేశ్వరుడను వైశ్యుడు. కుబేరుడు మహావ్రత దీక్షితుడు. కాగా ఆతని శిష్యుడు మహాతపస్వియగు కర్ణోదరుడను శూద్రుడు, ఈ విధంగా బ్రహ్మ చాతుర్వర్ణముల వారిని శివపూజకైనియోగించి తనలోకమునకు తిరిగి పోయెను. బ్రహ్మ వెళ్ళిన తర్వాత శివుడు లింగమునుపసంహరించుకొని సూక్ష్మరూపమున దానిని చిత్రవనమున ప్రతిష్టించి వెడలిపోయెను.
94 – విచరంతం తదా భూయో మహేశం కుసుమాయుదః ।
ఆరాత్ స్థీత్వాగ్రతో ధన్వీ సంతాపయితు ముద్యతః ॥
95 - తత స్తమగ్రతో దృష్ట్వా క్రోదాద్మా తదృశా హరః ।
స్మరమాలోకయామాస శిఖాగ్రా చ్చరణా౦తికమ్ ॥
96 - ఆలోకిత స్త్రినేత్రేణ మదనో ద్యుతిమానపి ।
ప్రాదహ్యత తదా బ్రహ్మన్ పాదాదారభ్య కక్షవత్ ॥
97 - ప్రదహ్యమానౌ చరణౌ దృష్ట్వాసౌ కుసుమాయుధః ।
ఉత్ససర్జ దనుఃశ్రేష్ఠం తజ్జగామాథ పంచధా ॥
98 - యదాసీ న్ముష్టిబంధంతు రుక్మపృష్టం మహాప్రభమ్ ।
స చంపక తరు ర్జాతః సుగందాడ్యో గుణాకృతిః ॥
99 - నాహస్థానం శుభాకారం యదాసీ ద్వజ్రభూషితమ్ ।
తజ్జాతం కేసరారణ్యం వకుళం నామతో మునే ॥
100 - యాచ కోటీ శుభా హ్యాసీ దింద్రనీలవిభూషితా ।
జాతా సా పాటలా రమ్యా భృంగరాజవిభూషితా ॥
101 - నాహోపరి తథా ముష్టౌ స్థానం శశిమణిప్రభమ్ ।
పంచగుల్మాభవజ్ఞాతీ శశాంకకిరణోజ్జ్వలా ॥
102 - ఊర్థ్వం ముష్ట్యా అధఃకొట్యోః స్థానం విద్రుమభూషితమ్ ।
తస్మా ద్బహుపుటా మల్లీ సంజాతా వివిధామునే ॥
103 - పుష్పోత్తమాని రమ్యాణి సురభీణి చ నారద ।
జాతియుక్తాని దేవేన స్వయ మాచరితానిచ ॥
104 - ముమోచ మార్గణాన్ భూమ్యాం శరీరే దహ్యతి స్మరః ।
ఫలోపగాని వృక్షాణి సంభూతాని సహస్రశః ॥
105 - చూతాదీని సుగంధీని స్వాదూని వివిధానిచ ।
హరప్రసాదాజ్జాతాని భోజ్యాన్యపి సురోత్తమైః ॥
106 - ఏవం దగ్ద్వా స్మరం రుద్రః సంయమ్య స్వతనుం విభుః ।
పుణ్యార్థీ శిశిరాద్రిం స జగామ తపసేవ్యయః ॥
107 - ఏవం పురా దేవవరేణ శంభూనా కామస్తు దగ్దః సశరః సచాపః ।
తత స్త్వనంగేతి మహాధనుర్ధరో దేవైస్తు గీతః సురపూర్వపూజితః ॥
మహేశ్వరుడట్లు మరల తిరుగుట చూచి కుసుమాయుదుడాయనను మరల ప్రహరించుటకై ధనుష్పాణియై ఎదుట నిలచెను. వానిని చూచినంతనే కోపంతో కనుల నిప్పులు రాల్చుచు శివుడాతనినినఖశిఖ పర్యంతము వీక్షించెను. తేజస్వియైనను మదనుడా వేడిమికోర్వ లేక పోగా నతని పాదముల నుండి నడుమువరకు గల భాగము దగ్దమయ్యెను. పాదములట్లు తగులబడగా మదనుడు తన ధనుస్సును వదలివేయగా నది అయిదు ఖండములాయెను. బంగారంవలె మేరయుచున్నదాని ముష్టిబంధము సువాసనలు వెదజల్లే సంపంగి వృక్షమాయెను. రత్నము పొదిగిన దాని సుందర నాహస్థానం, కేసరవనంలో చక్కని వకుళ (పొగడ) చెట్టుగమారెను. మునీ! ఇంద్రనీలమణులు పొదిగిన ఆ ధనుస్సు కోటి (అగ్రం) తుమ్మెదలతో నిండిన అందమైన పాటల తరువైనది. వాహస్తానానికిపైన చంద్రకాంతమణులు పొదిగిన పిడి (ముష్టి) చంద్రకాంతివలె తెల్లనైన అయిదురేకల మల్లెపూవయ్యెను. పిడిపైన, వంపు దిరిగిన చివరలకు దిగువ పగడములతో అలంకరించబడిన దొంతరలుగల వివిధ (వన) మల్లికలయినవి. నారదా! ఈ విధంగా పరమేశ్వరుని ద్వారా మంచి వాసనలు వెదజల్లే మల్లె మొదలయిన పుష్పాలు సృష్టింపబడినాయి. శరీరంతగలబడడం చూచి మన్మథుడు తన బాణాలను గూడ పారవైచెను. వానినుండి వేలాది ఫలవృక్షాలు పుట్టినవి. శంకరుని కృపవల్ల దేవతలందరకు రుచికరములగు మామిడి మొదలయిన పలురకముల ఫలములేర్పడినవి. ఇట్లు మన్మథుని దగ్దంచేసి తన శరీరాన్ని అదుపులో నుంచుకొని శివుడు పుణ్యార్జనకై కైలాసమున తపస్సు కొరకై వెళ్ళిపోయెను. ఈ విధంగా పురాసమయాన దేవశ్రేష్టుడగు శివుడు ధనుర్భాణాలతో సహా మదనుని దగ్దము కావించగా ఆ మహా దానుష్కుడా నాటినుండియు ఆనంగుడని పిలువబడెను.
అధ్యాయము 6 complete
Summary of chapter 6 of the Vāmana Mahā Purana is as follows:
The narrative turns to the celestial crisis caused by the demon Tārakāsura, whose tyranny could only be quelled by a son born of Mahādeva Śiva and Parvatī, the rebirth of Satī Devi as the daughter of Himavān. To awaken Mahādeva from his deep cosmic meditation on Mount Kailāsa, the devas send Kāmadeva, the deity of desire, who shoots his floral arrows of passion at the Supreme Ascetic. Enraged by the disruption of his sacred trance, Parameśvara Śiva opens his third eye, emitting a scorching flame of divine fire that instantly reduces Kāmadeva to ashes, demonstrating the utter futility of worldly desire before the supreme power of spiritual tapas.