వామన మహా పురాణము
అధ్యాయము 17
ఋషులు
1 - కథంమంకణకఃసిద్ధః కస్మాజ్జాతోమహానృషిః ।
నృత్యమానస్తుదేవేన కిమర్థంసనివారితః ॥
ఋషులు
మంకణకుడెలా సిద్దుడయ్యాడు? ఆయన ఎవరి కుమారుడు? ఆ మహర్షి నృత్యం చేస్తుంటే శివుడేల నివారించాడు?
లోమహర్షణ
2 - కశ్యపశ్యసుతోజజ్ఞేమానసోమంకణోమునిః ।
స్నానంకర్తుంవ్యవసితో గృహీత్వావల్కలంద్విజః ॥
3 - తత్ర గత్వాహ్యప్సరసో రంభాధ్యాఃప్రియదర్శనాః ।
స్నాయంతిరుచిరాః స్నిగ్ధాస్తేన సార్థమనిందితాః ॥
4 - తతోమునేస్తదా క్షోభా ద్రేతః స్కన్నంయదంభసి ।
తద్రేతఃసతు జగ్రాహ కలశేవైమహాతపాః ॥
5 - సప్తధాప్రవిభాగంతు కలశస్థం జగామహ ।
తత్రర్షయఃసప్త జాతా విదుర్యాన్ మరుతాంగణాన్ ॥
6 - వాయువేగోవాయుబలో వాయుహా వాయుమండలః ।
వాయుజ్వాలోవాయురేతో వాయుచక్రశ్చ వీర్యవాన్ ॥
7 - ఏతేహ్యపత్యాస్తస్యర్షేర్దారయంతి చరాచరమ్ ।
పురామంకణకఃసిద్ధః కుశాగ్రేణేతి మేశ్రుతమ్ ॥
8 - క్షతఃకిలకరేవిప్రా స్తస్య శాకరసో_స్రవత్ ।
సవైశాకరసందృష్ట్వా హర్షావిష్టః ప్రవృత్తవాన్ ॥
9 - తతఃసర్వం ప్రవృత్తంచ స్థావరంజంగమంచయత్ ।
ప్రవృత్తంచ జగద్దృష్ట్వా తేజసా తస్యమోహితమ్ ॥
10 - బ్రహ్మాదిభిః సురైస్తత్రఋషిభిశ్చతపోధనైః ।
విజ్ఞప్తోవై మహాదేవో మునేరర్థే ద్విజోత్తమాః ॥
11 - నాయంనృత్యేద్ యథాదేవ ।
తథాత్వంకర్తుమర్హసి ।
తతోదేవోమునిం దృష్ట్వా హర్షావిష్టమతీవహి ॥
12 - సురాణాంహిత కామార్థం మహాదేవో_భ్యభాషత ।
హర్షస్థానంకింమర్థంచ తవేదం మునిసత్తమః ।
తపస్వినోధర్మపథేస్థితస్యద్విజసత్తమ ॥
లోమహర్షణ
మంకణముని కశ్యప మహర్షి మానసపుత్రుడు. ఒకనాడాయన వల్కలాలతో స్నానంచేయనుద్యుక్తుడయ్యాడు. బ్రాహ్మణులారా! అప్పుడచటకు సుందరులు ప్రియదర్శనలు కొమలాంగులయిన రంభాది అప్సరసలు కూడ వచ్చి ఆయనతో బాటు స్నానం చేయసాగారు. వారలను చూచి మనస్సు చలించి ఆ ముని వీర్యం నీటిలో జారి పడగా నాతపస్వి దానినొక కలశంలో పట్టివేశాడు. కలశంలోని వీర్యం ఏడుభాగాలయి అందులో నుండి సప్తమరుద్గణాలు, వాయువేగ, వాయుబల, వాయుహా, వాయుమండల, వాయుజ్వాల, వాయురేత, వాయుచక్రులను మహావీర్యవంతులుద్భవించారు. ఆ ఋషికి పుట్టిన ఆ ఏడుగురు కుమారులు ఈ చరాచర జగత్తును ధరించియున్నారు. సిద్ధపురుషుడైన ఆ మంకణకుడు పూర్వమొకసారి కుశాగ్రలతో చేయికోసుకున్నట్లు ఆ వ్రణంలోనుండి శాకరసంస్రవించినట్లు విన్నాను. చేతినుండి కారుచున్న ఆశాకరరసాన్ని చూచి ఆయన ఆనందంతో నాట్యం చేయసాగాడు. ఆనాటోద్ధతికి స్థావరజంగమాలన్నీ నాట్యం చేయసాగాయి. ఆయన తేజస్సుకు మోహం చెంది జగత్తంతానాట్యం చేయడంతో బ్రహ్మాదిదేవతలు తపోధనులయిన ఋషులందరూ కలిసి మహాదేవుని దర్శించి యిలా ప్రార్థించారు. ప్రభూ! ఈ మునిని నృత్యం చేయకుండా నివారించండి. అంతట శివుడు హర్షోన్మత్తుడయిన మునిని చూచి దేవహితం కోసమై యిలా ప్రశ్నించాడు. ఓ మునిసత్తమా! ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మపథాన నడచుచున్న నీకింతటి హర్షాతిరేకం కలుగుటకు కారణమేమిటో చెప్పవలయును.
మంకణఋషి
13 - కింనపశ్యసిమేబ్రహ్మన్ కరచ్చాకరసంస్రుతమ్ ? ।
యందృష్ట్వాహంప్రనృత్తోవైహర్షేణమహతా_న్వితః ॥
14 - తంప్రహస్యాబ్రవీద్దేవో మునింరాగేణమోహితమ్ ।
అహంనవిస్మయంవిప్ర ! గచ్చామీహప్రపశ్యతామ్ ॥
15 - ఏవముక్త్వామునిశ్రేష్ఠం దేవదేవోమహాద్యుతిః ।
అంగుళ్యగ్రేణవిప్రేంద్రాః స్వాంగుష్ఠంతాడయద్భవః ॥
16 - తతోభస్మక్షతాత్ తస్మా న్నిర్గతంహిమసన్నిభమ్ ।
తద్దృష్ట్వావ్రీడితోవిప్రః పాదయోః పతితో_బ్రవీత్ ॥
17 - నాన్యందేవాదహంమన్యేశూలపాణేర్మహాత్మనః ।
చరాచరస్యజగతో వరస్త్వమసిశూలదృక్ ॥
18 - త్వదాశ్రయాశ్చదృశ్యంతే సురాబ్రహ్మాదయో_నఘ ।
పూర్వస్త్వమసిదేవానాం కర్తాకారయితామహత్ ॥
19 - త్వత్ప్రసాదాత్ సురాస్సర్వే మోదంతేహ్యకుతోభయాః ।
ఏవంస్తుత్వామహాదేవం ఋషిఃసప్రణతో_బ్రవీత్ ॥
20 - భగవంస్త్వత్ప్రసాదాద్ధి తపోమేనక్షయంవ్రజేత్ ।
తతోదేవఃప్రసన్నాత్మా తమృషింవాక్యమబ్రవీత్ ॥
మంకణఋషి
భగవాన్! నాచేతినుండి కారుచున్న శాకరసాన్ని చూడటంలేదా? దానిని చూచియే ఆనందంతో గంతులు వేస్తున్నాను. ఆ మాటకు నవ్వి పరమేశ్వరిడిలా అన్నాడు. ఓ రాగమోహితుడవైన మునీ! ఇందులో నాకేమీ ఆశ్చర్యం కనిపించుటలేదు! ఆ మాట చెప్పి ఆ మహాతేజస్వియైన దేవదేవుడు తన వ్రేలి చివర భాగంతో బొటన వ్రేలిని ప్రహరించాడు. అంతట అందులోనుంచి తెల్లని మంచులాంటి భస్మం బయటకు వచ్చింది. అదిచూచి సిగ్గుపడి ఆ మంకణుడు పరమేశ్వరుని పాదాలమీద వ్రాలి యిలా ప్రార్థించాడు. ప్రభూ! శంకరా! నిన్ను మించిన దేవుడున్నాడని నేననుకోను. చరాచర జగత్తులో శూలపాణివగు నీవే శ్రేష్టుడవు. ఈ బ్రహ్మాదిదేవతలంతా నిన్నాశ్రయించి బ్రతుకుచున్నారు. ఓ అనఘా! దేవశ్రేణిలొ అగ్రస్థానం నీదే. ఈ జగత్తునంతను సృష్టించి నడపుతున్న వాడవు నీవే. నీ అనుగ్రహం వల్లనే దేవతలంతా ఎవరివల్లా ఎలాంటి భయం లేకుండా మనుగడ సాగిస్తున్నారు. ఈ విధంగా స్తుతించి ఆ ఋషి పరమేశ్వరుని పాదాలు పట్టుకొని యిలా అన్నాడు. భగవాన్! నీ దయవల్ల నా తపస్సు నశింపకుండుగాక . అలా అనుగ్రహించుము.
ఈశ్వర
21 - తపస్తేవర్ధతాంవిప్ర మత్ప్రసాదాత్ సహస్రధా ।
ఆశ్రమేచేహవత్స్యామి త్వయా సార్థమహంసదా ॥
22 - సప్తసారస్వతేస్నాత్వా యోమామర్చిష్యతే నరః ।
నతస్యదుర్లభంకించి దిహలోకేపరత్రచ ॥
23 - సారస్వతంచతంలోకం గమిష్యతి నసంశయః ।
శివస్యచప్రసాదేన ప్రాప్నోతి పరమంపదమ్ ॥
ఈశ్వర
నీతో బాటు ఈ ఆశ్రమంలో నేనుకూడ ఎల్లప్పుడూ ఉంటాను. సప్తసారస్వత క్షేత్రంలో స్నానంచేసి నన్నర్చించిన వానికి యిహలోకంలోనూ పరలోకంలో కూడా లభించనిదేమీ ఉండదు. శివానుగ్రహంవల్ల అలాంటి అదృష్టవంతులు సర్వోన్నతపదం పొందుతారు. సారస్వత స్వర్గసౌఖ్యాలనుభావిస్తారు.
అధ్యాయము 17 complete
Summary of chapter 90 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya narrates the inspiring story of Sage Rushangu, an aged ascetic who felt his physical frame waning and desired to depart his body at a supreme pilgrimage site. Guided by divine intuition, Sage Rushangu traveled to Prithūdaka on the banks of Sarasvatī, where he entered deep meditation upon Bhagavān Nārāyaṇa and peacefully abandoned his mortal frame. His spiritual ascent demonstrated to all seekers that departing life at Prithūdaka guarantees immediate entrance into the celestial realm of Brahmaloka.