వామన మహా పురాణము
అధ్యాయము 9
లోమహర్షణ
1 - ఇతి దైత్యపతిః శ్రుత్వా వచనం రౌద్రవంప్రియమ్ ।
ప్రసాదయామాన గురుం ప్రణిపత్య పునఃపునః ॥
లోమహర్షణ
లోమహర్షణుడిలా చెప్పనారంభించెను. ప్రహ్లాదుడు పలికిన క్రోధపూర్ణవచనాలు విని ఆ దైత్యేశ్వరు డాయనాను ప్రసన్నుని గావించుకొనుటకై మాటిమాటికి మ్రొక్కి యిట్లనెను.
బలి
2 - ప్రసీద తాతః మాకోపం కురు మొహహతే మయి ।
బలావలేపమూదేన మయైతద్వాక్య మీరితమ్ ॥
3 - మొహాపహతవిజ్ఞానః పాపోహందితిజోత్తమ ।
యచ్చప్తో-స్మిదురాచార స్తత్సాదుభవతా కృతమ్ ॥
4 - రాజ్యభ్రంశంయశోభ్రంశం ప్రాప్స్యామీతి తతస్త్వహమ్ ।
విషన్నో-సి యథాతాత తథైవానినయే కృతే ॥
5 - త్రైలోక్యరాజ్యమైశ్వర్య మన్యద్వానాతి దుర్లభమ్ ।
సంసారే దుర్లభాస్తాతః గురవోయేభవద్విదాః ॥
6 - ప్రసీద తాతమాకోపం కర్తుమర్హసిదైత్యప ।
త్వత్కోపపరిదగ్దో-హం పరితప్యేదివానిశమ్ ॥
బలి
పితామహా! ప్రసన్నులుకండు! మొహోపహతుడనైన నా పై కోపించకుడు. దేహబల గర్వంతో అలామాటాడినాను. దైత్యోత్తమా! మూర్ఖత్వం నావివేకాన్ని నశింపజేసింది . నేను పాపిని దుర్మార్గుడను. నన్ను మీరు శపించుట మంచిదే. మీరు చెప్పినట్లు నా అవినయం వల్ల రాజ్యనాశాన్నీ కీర్తి నాశనాన్ని పొంది విషన్నుడనగుట నాకు యుక్తమే. త్రైలోక్యరాజ్యాదికారం యితర ఐశ్వర్యాలు సంపాదించుట కష్టమైన పనికాదు. కాని తమబోటి గురుజనులు లభించుట ఎంతో కష్టము. కనుక తాతా! నన్ను కరుణించి కోపించకుము. నీ కోపాగ్నిలో దగ్దుడనై రాత్రింబవళ్ళు పరితపిస్తుంటాను.
ప్రహ్లాదుడు
7 - వత్స! కోపేనమేమోహో జవితస్తేనతేమయా ।
శాపోదత్తోవివేకశ్చ మోహేనాపహృతో మమ ॥
8 - యదిమోహేనమేజ్ఞానం నాక్షి ప్తంస్యాన్మహాసుర ।
తత్కథంసర్వగంజానన్ హరింకచ్చిచ్చపామ్యహమ్ ॥
9 - యోయంశాపోమయాదత్తో భవతో-సురపుంగవ ।
భావ్యమేతేననూనంతే తస్మాత్త్వంమావిషీదవై ॥
10 - అద్యప్రభ్రుతిదేవేశే భగవత్యచ్యుతేహరౌ ।
భవేథాభక్తిమానీశే సతేత్రాతాభావిష్యతి ॥
11 - శాపంప్రాప్యచమేవీరః దేవేశఃసంస్మృతస్త్వయా ।
తథాతథావదిష్యామి శ్రేయస్త్వంప్రాప్స్యసేయథా ॥
ప్రహ్లాదుడు
వత్సా! కోపం నన్ను మూర్ఖుణ్ణి చేసింది. అంచేత వివేకం నశించి నిన్ను శపించాను. మోహంవల్ల నావివేకం నశింపకపోతే శ్రీహరి సర్వజ్ఞుడని తెలిసియూనేనెందుకు శపించాలి? నేనిచ్చిన శాపం నీ వనుభవింపక తప్పదు. అయితే విచారించవద్దు. ఈ క్షణాన్నుంచీ నాదేవదేవుని అచ్యుతుని భక్తితో ఆరాధించుము. ఆ ఈశ్వరుడు నిన్ను రక్షించగలడు. వీరాగ్రణీ! నేను శపించినందున ఆదేవదేవుని నిరంతరస్మరణ నీకు లభించినది. నీ భావి శ్రేయస్సుకు తగిన ఉపాయాలు నేను చెబుతూ ఉంటాను. భయపడకు.
లోమహర్షణ
12 - అదితిర్వరమాసాద్య సర్వకామాసమృద్దిదమ్ ।
క్రమేణహ్యుదరేదేవో వృద్దింప్రాప్తోమహాయశాః ॥
13 - తతోమాసే-థదశమే కాలేప్రసవఆగతే ।
అజాయతసగోవిందో భగవాన్ వామనాకృతిః ॥
14 - అవతీర్నేజగన్నాథే తస్మిన్సర్వామరేశ్వరే ।
దేవాశ్చముముచుర్దుః ఖం దేవమాతా-దితి స్తథా ॥
15 - వపుర్వాతాఃసుఖస్పర్శా నీరజస్క మభూన్నభః ।
ధర్మేచ సర్వభూతానాం తదా మతిరజాయత ॥
16 - నోద్వేగశ్చాప్య భూద్దేహే మనుజానాం ద్విజోత్తమాః ।
తథాహిసర్వభూతానాం దర్మేమతిరజాయత ॥
17 - సంజాతమాత్రం భగవాన్ బ్రహ్మలోక పితామహః ।
జాతకర్మాదికం కృత్వాక్రియా స్తుష్టావచ ప్రభుమ్ ॥
లోమహర్షణ
మహర్షులారా! సకల కామదాయియయిన వరం పొందిన వెంటనే అదితి గర్భంలో దేవదేవుడు క్రమంగా పెరగడం మొదలు పెట్టాడు. పదవ నెలలో ప్రసవ సమయాన భగవంతుడగు గోవిందుడు వామనాకృతితో జన్మించాడు. ప్రభువు అవతార సమయాన దేవతలకు దేవమాతకు సకల దుఃఖాలు తొలగిపోయాయి. వాయువులు సుఖ స్పర్శతో వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. సకల జీవులలోను ధర్మాసక్తి పెరిగింది. మానవులకు శరీర బాధలు తొలగి పోయాయి. భగవంతుడు జన్మించిన వెంటనే లోకపితామహుడైన విరించివచ్చి ఆయనకు జాతకత్మాదులు చేసి యీ విధంగా స్తోత్రం చేశాడు.
బ్రహ్మ
18 - జయదీశ ! జయాజేయ ! జయవిశ్వగురోహరేః ।
జయమృత్యుజరాతీత ! జయానంత ! జయాచ్యుత ॥
19 - జయాజిత జయశేష జయవ్యక్త స్థితేజయ ।
పరమార్థార్థసర్వజ్ఞ జ్ఞానజ్ఞేయార్థనిః సృథ ॥
20 - జయా-శేష జగత్సాక్షిన్ జగత్కర్తర్జగద్గురో ।
జగతో-జగదంతేశ స్థితౌపాలయతే జయః ॥
21 - జయా-ఖిలజయాశేష జయసర్వహృ దిస్థిత ।
జయాదిమధ్యాంతమయ సర్వాజ్ఞానమయోత్తమ ॥
22 - ముముక్షుభిరనిర్దేశ్య నిత్యహృష్టజయేశ్వరః ।
యోగిభిర్ముక్తికామైస్తు దమాదిగుణభూషణ ॥
23 - జయాతిసూక్ష్మదుర్గ్నేయ జయస్థూలజగన్మయ ।
జయసూక్ష్మాతిసూక్ష్మత్వం జయానింద్రియ సేంద్రియ ॥
24 - జయస్వమాయాయోగస్థ శేశాభోగజయాక్షర ।
జయైకదంష్ట్రప్రాంతేన సముద్ద్రుతవసుంధరః ॥
25 - నృకేసరిన్ ! సురారాతి వక్షఃస్థలవిదారణః ।
సాంప్రతం జయవిశ్వాత్మన్ మాయావామన కేశవః ॥
26 - నిజమాయాపరిచ్చిన్న జగద్దాతర్జనార్దనః ।
జయాచింత్యజయానేక స్వరూపైక విదప్రభో ॥
27 - వర్ధన్వవర్దితానేక వికారప్రకృతేహరే ।
త్వయ్యేషా జగతామీశే సంస్థితా ధర్మపద్దతిః ॥
28 - నత్వామహంనచేశానో నేంద్రాద్యాస్త్రిదశాహరే ।
జ్ఞాతుమీశా ణ మునయః సనకాద్యానయోగినః ॥
29 - త్వంమాయాపటనంవీతో జగత్యత్రజగత్పతే ।
కస్త్వాం వేత్స్యతిసర్వేశ త్వత్ప్రసాదంవినానరః ?
30 - త్వమేవారాదితోయస్య ప్రసాదసుముఖఃప్రభో ।
శ ఏవ కేవలందేవం వేత్తిత్వాం నేతరోజనః ॥
31 - తదీశ్వరేశ్వరేశాన విభోవర్ధస్వభావన ।
ప్రభావాయాస్య విశ్వస్య విశ్వాత్మన్ పృథులోచనః ॥
బ్రహ్మ
సర్వాదీశా! సర్వాజేయా, నీకు జయమగుగాక, విశ్వగురూ నీకుజయము. శ్రీహరీ, జన్మమృత్యురాతీతా, అచ్యుతా జయము జయము! ఆశేషా, అవ్యక్తరూపా, సర్వజ్ఞా, పరమార్తరూపా, జ్ఞానజ్ఞేయసారరూపా, జగత్సాక్షీ, జగత్కారణా , జగద్గురో , జగత్ స్థితిపాలకా నీకు జయమగుగాక! సకల జీవహృదయ నివాసా, ఆదిమధ్యాంతమయా, జ్ఞానమయా ! ముముక్షువులకు గూడ నిర్దేశించినలవిగానివాడా, నిత్యహృష్టా, దయాది సద్గుణభూషణా, అతిసూక్ష్మా, స్థూలా, దుర్జేయా సర్వమయా జయము. ఇంద్రియరూపా, ఇంద్రియరహితా, స్వమాయా యోగాస్తితా, శేషశాయీ నీకు జయము జయము! నిజదంష్ట్రాగ్రభాగాన వసుంధరను నిలిపినప్రభూ, నృకేసరీ, దేవశత్రు వక్షఃస్థల విదారణా ప్రస్తుతం కపట వామన రూపం దాల్చిన విశ్వాత్మకా కేశవా నీకు జయము. స్వీయమాయా పరిచ్చిన్నా! జగద్దారకా, జనార్దనా, అనేక స్వరూపాలలో వెలిగే ఏకైకతత్వమా, బహువిధ ప్రకృతి వికృతుల పెంపొందించువాడా నీకు జయము. నీవు వర్దిల్లుము. జగదీశుడవగు నీవు ధర్మానికి మూలాధారుడవు. ఇలాంటి నిన్ను నేనుగాని ఈశుడుగాని ఇంద్రాది దేవతలుగాని సనకాది మునులు యోగులుగాని తెలియజాలరు. నీవు స్వీయ మాయ అనే తెరమరుగున ఉంటావు, అలాంటి మాయాపతిని నిన్నెరుగ గలవారెవ్వరు? నీ అనుగ్రహం కలిగిన వాడే నిన్నెరుగ గలడు. నిన్నారాధించి నీ కృపకు పాత్రుడగువాడే నిన్ను గుర్తించును. ఓ ఈశాన, ఈశ్వరేశ్వర భూతభావనా వర్ధిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వాత్మా! విశ్వకళ్యాణార్థం నీవు వర్ధిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వకళ్యాణార్థం నీవు వర్ధిల్లుము. నీకు జయమగుగాక!
లోమహర్షణ
33 - స్తుతో-హంభావతాపూర్వ మింద్రాద్యై: కస్యపేనచ ।
మయాచవః ప్రతిజ్ఞాత మింద్రస్య భువనత్రయమ్ ॥
34 - భూయశ్చా-హంస్తుతోదిత్యా తస్యాశ్చాపిమయాశ్రుతమ్ ।
యథాశక్రాయదాస్యామి త్రైలోక్యం హతక్యంటకమ్ ॥
35 - సో-హం తథా కరిష్యామి యథేంద్రో జగతఃపతిః ।
భవిష్యతి సహస్రాక్షః సత్యమేతద్ బ్రవీమివః ॥
36 - తతక్రుష్ణాజినం బ్రహ్మ హృషీ కేశాయదత్తవాన్ ।
యజ్ఞోపవీతం భగవాన్ దదౌతస్యబృహస్పతిః ॥
37 - ఆషాఢమదదాద్ధండం మరీచిర్ర్బ హ్మణః సుతః ।
కమండలుంవసిష్ఠ శ్చ కౌశంచీరమథాంగిరాః ।
ఆసనం చైవపులహః పులస్త్యః పీతవాససీ ॥
38 - ఉపతస్థుశ్చతం వేదాః ప్రణవస్వరభూషణాః ।
శాస్త్రాణ్యశేషాణితథా సాంఖ్యయోగోక్తయశ్చయాః ॥
39 - సవామనోజటీదండీ చత్రీద్రుతకమండలుః ।
సర్వదేవమయోదేవో బలేరద్వరమభ్యగాత్ ॥
40 - యత్రయత్రపదంవిప్రా, భూభాగేవామనోదదౌ ।
దదాతిభూమిర్వివరం తత్రతత్రాభిపీడితా ॥
41 - సవామనోజడగతి ర్మ్రుదుగచ్చన్సపర్వాతామ్ ।
సాబ్దిద్వీపతీంసర్వాం చాలయామాసమేదినీమ్ ॥
42 - బృహస్పతిస్తుశనకై ర్మార్గందర్శయతేశుభమ్ ।
తథా క్రీడావినోదార్థ మతిజాడ్యగతో-భవత్ ॥
43 - తతః శేషోమహానాగో నిఃసృ త్యాసౌరసాతలాత్ ।
సాహాయ్యం కల్పయామాస దేవదేవస్య చక్రి ణః ॥
44 - తదద్యాపిచవిఖ్యాత మహిర్బిలమనుత్తమమ్ ।
తస్యసందర్శనాదేవ నాగేభ్యోనభయంభవేత్ ॥
లోమహర్షణ
బ్రహ్మస్తోత్రం విని వామనాకృతి దాల్చిన ఆ హృషీకేశుడు చిరునవ్వు నవ్వి భావగంభీరముగా నిట్లనెను. విరించీ! నీవు యింద్రాదులు కశ్యపుడు పూర్వం నన్ను స్తుతించగా యింద్రునకు ముల్లోకాలు యిస్తానని పతిజ్ఞ చేసియున్నాను. తర్వాత అదితి స్త్రోత్రం విని ఆమెకూ, శక్రునకు త్రిలోకాధిపత్యం యిస్తానని మాటయిచ్చి యున్నాను. ఇంద్రుని జగత్తుకు అధిపతిని చేసి ఆమాట నిలబెట్టుకుంటాను . సహస్రాక్షుడు రాజగుట తథ్యము. అంతట పొట్టివడుగునకు బ్రహ్మకృష్ణాజినం బృహస్పతి యజ్ఞోపవీతం బ్రహ్మతనయుడు మరీచి ఆషాఢదండాన్ని వసిష్టుడు కమండలం అంగిరసులు పట్టుపుట్టము, పులహుడు ఆసనం పులస్త్యుడు పీతాంబరం యిచ్చారు. ప్రణవ ఓంకారం, స్వరాలచేత ముస్తాబై సకలవేదాలు, శాస్త్రాలు సాంఖ్యయోగ విద్యలు ఆ ప్రభువును ఆశ్రయించాయి. జడలు, దండక మండలు ఛత్రాలు ధరించి సర్వాదేవమయుడైన ఆ వామనుడు బలియజ్ఞ వాటికలో ప్రవేశించెను. ఆ పొట్టివాడు తన చిట్టిఅడుగు పెట్టినచోటల్లా భూమిపీడితురాలై వివరం (రంద్రం) యిచ్చింది. అలా మెల్లగా అడుగు పెడుతూ నావామనుడు నడువగా సముద్ర పర్వత ద్వీపాదులతో కూడిన భూమి అంతా కంపించింది. బృహస్పతి మెల్లమెల్లగా శివంకరమైన చక్కని మార్గం చూపిస్తూ ఉండగా నాకుహనావటువు ఆటలలోవలె సరదాగా అతిమందగమనంతో పయనించాడు. అంతట పాతాళా న్నుంచి మహానాగం శేషుడు బయలుదేరివచ్చి దేవదేవుడైన నాచక్రితోడైనాడు. ఆ ఉత్తమమైన శేషబిలం ఈనాటికీ ప్రసిద్ది వహించి యున్నది.దానిని చూచినవారలకు సర్పభయం ఉండదు.
అధ్యాయము 9 complete
Summary of chapter 82 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya imparts the sacred ordinances, devotional vows, and daily worship rituals to be observed by pilgrims visiting Sannihatī Tīrtha. The chapter emphasizes the supreme importance of offering charity, sesame seeds, milk, and gold to virtuous brāhmaṇas while maintaining strict mental purity. Observing these holy rites with faith liberates seven generations of ancestors from subtle bonds and grants the devotee eternal spiritual merit and union with Parameśvara Śiva.