వామన మహా పురాణము
అధ్యాయము 14
లోమహర్షణ
1 - తతో రామహద్రం గచ్చేత్ తీర్థసేవీ ద్విజోత్తమః ।
యత్రరామేణవిప్రేణ తరసా దీప్తతేపసా ॥
2 - క్షత్రముత్సాద్యవీరేణ హ్రదాః పంచనివేశితాః ।
పూరయిత్వానరవ్యాఘ్ర రుధిరేణేతి నః శ్రుతమ్ ॥
3 - పితరస్తర్పితాస్తేన తథైవచ పితామహః ।
తతస్తేపితరః ప్రీతారామమూచుర్ద్విజోత్తమాః ॥
4 - రామరామః మహాబాహో ప్రీతాఃస్మ స్తవ భార్గవ ।
అనయా పితృ భక్త్యాచ విక్రమేణచ తేవిభో ॥
5 - వరంవృణీష్వభద్రంతే కిమిచ్చసి మహాయశః ।
సఏవముక్తస్తు పితృభీరామఃప్రభవతాంవరః ॥
6 - అబ్రవీత్ప్రాంజలిర్యాక్యం సపితౄన్ గగనే స్థితాన్ ।
భవంతోయదివై ప్రీతా యద్యనుగ్రాహ్యతా మయి ॥
7 - పితృప్రసాదాదిచ్చేయం తపసాప్యాయనంపునః ।
యచ్చరోషాభిభూతేన క్షత్రముత్సాదితం మయా ॥
8 - తతశ్చపాపాన్ముచ్యేయం యుష్మాకం తేజసా హ్యహమ్ ।
హ్రదాశ్చైతేతీర్థభూతా భవేయు ర్భువివిశ్రుతాః ॥
9 - ఏవముక్త్వాశుభంవాక్యం రామస్య పితరస్తదా ।
ప్రత్యూచుఃపరమప్రీతా రామం హర్షపురస్కృతాః ॥
10 - తపస్తేవర్ధతాంపుత్రః పితృభక్త్యా విశేషతః ।
యచ్చరోషాభిభూతేన క్షముత్సాదితం త్వయా ॥
11 - తతశ్చపాపాన్ముక్తస్త్వం పాతితాస్తే స్వకర్మభిః ।
హ్రదాశ్చతవతీర్థత్వంగమిష్యంతి న సంశయః ॥
12 - హ్రదేష్వేతేషుయేస్నాత్వా స్వాన్ పితౄం స్తర్పయంతిచ ।
తేభ్యోదాస్యంతిపితరో యథాభిలషితం వరమ్ ॥
13 - ఈప్సితాన్ మానసాన్ కామాన్ స్వర్గవాసంచశాశ్వతమ్ ।
ఏవందత్వావరాన్ విప్రారామస్యపితర స్తదా ॥
14 - ఆమంత్ర్యభార్గవం ప్రీతా స్తత్రైవాంతర్హితాస్తదా ।
ఏవం=రామహ్రదాఃపుణ్యా భార్గవస్య మహాత్మనః ॥
15 - స్నాత్వాహ్రదేషురామస్య బ్రహ్మచారీ శుచివ్రతః ।
రామమభ్యర్చ్యశ్రద్ధావాన్ విందే ద్బహుసువర్ణకమ్ ॥
లోమహర్షణ
అచట నుంచి తీర్థసేవ చేయుగోరు బ్రాహ్మణోత్తముడు రామహ్రదాని కెళ్ళాలి. ఆ చోటనే మహాతేజస్వియయిన భార్గవరాముడు క్షత్రియ సంహారం చేసి వారల రక్తంతో అయిదు సరోవరాలను నింపాడు. ఈ విషయం మేము విన్నాము. ఆ జలాలతో పితృపితామహులకు తర్పణా లిచ్చాడు. అంతట పరమ ప్రీతులైరాముని పితరులు అతనితో యిలా అన్నారు. మహాపరాక్రమవంతుడవైన రామా! ణీ విక్రమానికి పితరులయెడ భక్తికి సంతోషించాము. మహాయశస్వీ! నీకేమి వరంకావలయునో అడుగుము. నీకు కళ్యాణమగుగాక. అంతట మహాబలశాలియైన భార్గవరాముడు ఆకాశాన నిలబడిన పితృదేవతలకు చేతులెత్తి నమస్కరించి యిలా అన్నాడు. మీరలు నాయెడ ప్రసన్నులైనచో నన్ననుగ్రహించునో మీ అనుగ్రహం వల్ల నేను మరల తపోసిద్ధి పొందవలెను. రోషాతిరేకంతో క్షత్రియ సంహారం చేసినందున నాకు గల్గిన పాపం నశింపవలెను. మీ ప్రభావంవల్ల ఈ అయిదు సరోవరాలు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందవలె. రాముడు పలికిన ఈ శుభ వాక్యాలు విని హర్షంతో ఆయన పితరులు ప్రేమతో అభయమిచ్చారు. పుత్రా ! విశిష్టమైన ణీ పితృ భక్తివల్ల ణీ తపస్సు వర్ధిల్లుతుంది. కోపవశాన నీకు సంక్రమించిన క్షత్రియ వధపాతకం తొలగిపోయినది. ఆ క్షత్రియులు తమ దుష్కర్మల వల్లనే చంపబడ్డారు. నిస్సందేహంగా, నీవు నిర్మించిన ఈ సరస్సులకు తీర్థత్వం లభిస్తుంది. ఈ సరస్సులలో మునిగి ఎవరు తమ పితరులకు తర్పణాలు విడుస్తారో వారల కోర్కెలు వారి పితరులు సిద్ధింప చేస్తారు. వారలకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పరశురామునకు వరాలిచ్చి ఆయన పితృదేవతలు అంతర్ధానమైనారు. ఈ విధంగా మహాత్ముడగు భార్గవరామునిచే నెలకొల్పబడిన రామసరోవరాలు పరమ పవిత్రాలు. బ్రహ్మచారియై నియమంతో వానిలో స్నానంచేసి రాముని అర్చిస్తే బహుసువర్ణ ప్రాప్తి కలుగుతుంది.
16 - వంశమూలం సమాసాద్య తీర్థసేవీ సుసంయతః ।
స్వవంశసిద్ధయేవిప్రాః స్నాత్వా వై వంశమూలకే ॥
17 - కాయశోధనమాసాద్య తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ।
శరీరశుద్ధిమాప్నోతి స్నాత స్తస్మిన్ ణ సంశయః ॥
18 - శుద్ధదేహశ్చతం యాతి యస్మా న్నావర్తతే పునః ।
తావద్ భ్రమంతి తీర్థేషు సిద్దా స్తీర్థపరాయణాః ।
యావన్నప్రాప్ను వంతీహ తీర్థంత త్కాయశోధనమ్ ॥
19 - తస్మింస్తీర్థేచ సంప్లావ్య కాయం సంయతమానసః ।
పరంపద మవాప్నోతి యస్మాన్నావర్తతే పునః ॥
20 - తతోగచ్చేతవిప్రేంద్రా స్తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ।
లోకాయత్రోద్ద్రుతాః సర్వే విష్ణునాప్రభవిష్ణునా ॥
21 - లోకోద్ధారంసమాసాద్య తీర్థస్మరణతత్పరః ।
స్నాత్వాతీర్థవరేతస్మిన్ లోకాన్ పశ్యతిశాశ్వతాన్ ॥
22 - యత్రవిష్ణుఃస్థితోనిత్యం శివోదేవః సనాతనః ।
తౌదేవౌప్రణిపాతేన ప్రసాద్యమ క్తిమాప్నుయాత్ ॥
23 - శ్రీ తీర్థంతుతతో గచ్చేత్ శాలగ్రామమనుత్తమమ్ ।
తత్రస్నాతస్యసాన్నిధ్యం సదా దేవీ ప్రయచ్చతి ॥
24 - కపిలాహ్రదఘాసాద్య తీర్థంత్రైలోక్య విశ్రుతమ్ ।
తత్ర స్నాత్వా_ర్చయిత్వాచ దైవతానిపితౄంస్తథా ॥
25 - కపిలానాం సహస్రస్య ఫలం విందతిమానవః ।
తత్రస్థితం మహాదేవం కాపిలం వపురాస్థితమ్ ॥
26 - దృష్ట్వాముక్తిమవాప్నోతి ఋషిభిః పూజితంశివమ్ ।
సూర్యతీర్థంసమాసాద్య స్నాత్వానియతమానసః ॥
27 - అర్చలుత్వాపితౄన్ దేవా నుపవాసపరాయణః ।
అగ్నష్టోమమవాప్నోతి సూర్యలోకంచ గచ్చతి ॥
28 - సహస్రకిరణందేవం భానుం త్రైలోక్యవిశ్రుతమ్ ।
దృష్ట్వాముక్తిమవాప్నోతి నరోజ్ఞానసమన్వితః ॥
29 - భావానీవనమాసాద్య తీర్థసేవీయథాక్రమమ్ ।
తత్రాభిషేకం కుర్వాణోగోనహస్రఫలం లభేత్ ॥
30 - పితామహస్యపిబతో హ్యమృతం పూర్వమేవహి ।
ఉద్గారాత్ సురభిర్జాతా సా చ పాతాళ మాశ్రితా ॥
31 - తస్యాః సురభయో జాతాః తనయాలోకమాతరః ।
తాభిస్తత్సకులంవ్యాప్తం పాతాళం సునిరంతరమ్ ॥
32 - పితామహస్యయజతో దక్షిణార్థముపాహృతాః ।
ఆహూతాబ్రహ్మణాతాశ్చ విభ్రాంతా వివరేణహి ॥
33 - తస్మిన్వివరద్వారేతు స్థితో గణపతిః స్వయమ్ ।
యందృష్ట్వాసకలాన్ కామాన్ ప్రాప్నోతి సంయతేంద్రియః ॥
జితేంద్రియుడగు తైర్థికుడు తన వంశాభివృద్ది కోసం వంశమూలంలో స్నానం చేసి ఆటనుండి కాయశోధనం అనే ముల్లోకాల్లో పేరుగన్న తీర్థంలో స్నానం చేసి తప్పకుండా కాయసిద్ధి పొందుతాడు. పరిశుద్ధమైన దేహం కలిగి పునరావృత్తి లేని లోకాలకు పోతాడు. తీర్థ పరాయణులైన సిద్ధులు కాయశోధనం పొందనంతవరకు తీర్థాటనం చేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో స్నానం చేసి సంయతచిత్తులగు వారు పరమపదాన్ని చేరుకుంటారు. అనంతరం ఉత్తములగు విప్రులు, సకలప్రాణులు విష్ణువు చేత ఉద్ధరింపబడిన త్రిలోకఖ్యాతి గల లోకోద్ధారమను తీర్థంలో స్నానం చేసి శాశ్వత లోకాలను పొందుతారు. సనాతనులైన శివవిష్ణువులిరువును నిత్యం సన్నిహితులగుచోట, నా దేవులకు ప్రణమిల్లి ప్రసన్నుల గావించుకొని ముక్తిపొందనగును. ఆటనుండి పరమోత్తమమైన శాలగ్రామశ్రీ తీర్థంలో స్నానంచేసిన సదాపరమేశ్వరి సాన్నిధ్యం పొందవచ్చు. తర్వాత త్రిలోకఖ్యాతి గల కపిల తీర్థంలో స్నానం చేసి, దేవపితరులను అర్చించినచో, వేయి కపిలగోవులు దానమిచ్చిన ఫలం కలుగును. అచటనే కపిలరూపంలో వెలసిన మహాదేవుని, ఋషి పూజితుని దర్శించినచో ముక్తి కలుగును. ఆపైని, సూర్యతీర్థంలో స్నానం చేసి స్థిరచిత్తంతో ఉపవాసపూర్వకంగా పితరులను దేవతలను అర్చించిన, అగ్నిష్టోమ యాగఫలం కలిగి సూర్యలోకప్రాప్తి పొందనగును. జ్ఞానియగు నరుడు సహస్రఖరకిరణుడగు సూర్యదేవుని దర్శించి మోక్షగామి అవుతాడు. అనంతరం భవానివనం చేరి అచటనభిషేకాదులొనర్చిన గోసహస్రదాన ఫలం దక్కుతుంది. పూర్వకాలాన బ్రహ్మ అమృతపానంచేసి పుక్కిలించగా అందులోనుంచి సురభి (కామధేనువు) పుట్టి పాతాళానికి వెళ్ళింది. లోకమాత అయిన ఆ సురభికి ఎన్నో గోవులు జన్మించాయి. వానితో పాతాళం నిండి పోయింది. తర్వాత బ్రహ్మయజ్ఞం చేసినపుడు దక్షిణ యివ్వడానికి ఆ గోవులను పిలిచాడు. అవి ఒక బిల ద్వారాన ప్రయాణించి వెళ్ళాయి. ఆ బిలద్వార ముఖాన వేంచేసిన గణపతిని దర్శించినచో సకల కోర్కెలు సిద్ధిస్తాయి.
34 - సంగినీంతుసమాసాద్య తీర్థంముక్తిసమాశ్రయమ్ ।
దేవ్యాస్తీర్థేనరఃస్నాత్వా లభతేరూపముత్తమమ్ ॥
35 - అనంతాంశ్రియమాప్నోతి పుత్రపౌత్రసమన్వితః ।
భోగాంశ్చవిపులాన్ భుంక్త్వా ప్రాప్నోతిపరమంపదమ్ ॥
36 - బ్రహ్మావర్తేనరఃస్నాత్వా బ్రహ్మజ్ఞానసమన్వితః ।
భవతేనాత్రసందేహః ప్రాణాన్ ముచంతిస్వేచ్చయా ॥
37 - తతోగచ్చేతవిప్రేంద్రా ద్వారపాలంతురంతుకమ్ ।
తస్యతీర్థంసరస్వత్యాం యక్షేంద్రస్య మహాత్మనః ॥
38 - తత్రస్నాత్వా మహాప్రాజ్ఞ ఉపవాస పరాయణః ।
యక్షస్యచప్రసాదేన లభేతకామికంఫలమ్ ॥
39 - తతోగచ్చేత విప్రేంద్రాః బ్రహ్మావర్తమనుత్తమమ్ ।
బ్రహ్మావర్తేనరః స్నాత్వా బ్రహ్మాచాప్నోతినిశ్చితమ్ ॥
40 - తతోగచ్చేత విప్రేంద్రాః సుతీర్థకమనుత్తమమ్ ।
తత్రసంనిహితానిత్యం పితరోదైవతైఃసహ ॥
41 - తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనేరతః ।
ఆశ్వమేధమవాప్నోతి పితౄన్ ప్రీణాతిశాశ్వతాన్ ॥
42 - తతోం_బువనం ధర్మజ్ఞ సమాసాద్యయథాక్రమమ్ ।
కామేశ్వరస్య తీర్థంతు స్నాత్వాశ్రద్దాసమన్వితః ॥
43 - సర్వవ్యాధివినిర్ముక్తో బ్రహ్మవాప్తిర్భవేద్ధృవమ్ ।
మాతృతీర్థంచతత్రైవ యత్రస్నాతస్యభక్తితః ॥
44 - ప్రజావివర్ధతేనిత్యమనంతాంచావ్నుయాచ్చ్రియమ్ ।
తతఃశీతవనంగచ్చే న్నియతోనియతాశనః ॥
45 - తీర్థంతత్రమహావిప్రా మహాదన్యత్రదుర్లభమ్ ।
పునాతిదర్శనాదేవ దండకంచద్విజోత్తమాః ॥
46 - కేశానభ్యుక్ష్యవై తస్మిన్ పూతోభవతిపాపతః ।
తత్రతీర్థవరంచాన్యత్ స్వానులోమాయనంమహత్ ॥
47 - తత్రవిప్రామహాప్రాజ్ఞా విద్వాంసస్తీర్థతత్పరాః ।
స్వానులోమాయనే తీర్థే విప్రాస్త్రైలోక్యవిశ్రుతే ॥
48 - ప్రాణాయామైర్నిర్హరంతి స్వలోమానిద్విజోత్తమాః ।
పూతాత్మానశ్యతేవిప్రాః ప్రయాంతిపరమాంగతిమ్ ॥
49 - దశాశ్వమేధికంచైవ తత్రతీర్థంసువిశ్రుతమ్ ।
తత్రస్నాత్వాభక్తియుక్తస్తదేవలభతేఫలమ్ ॥
50 - తతోగచ్చేతశ్రద్ధావాన్ మానుషంలోకవిశ్రుతమ్ ।
దర్శనాత్తస్యతీర్థస్యముక్తోభవతి కిల్బిషైః ॥
51 - పురాకృష్ణమృగా స్తత్రవ్యాధేన శరపీడితాః ।
గాహ్యతస్మిన్ సరసి మానుషత్వముపాగతాః ॥
52 - తతోవ్యాధాశ్చతేసర్వే తానపృచ్చన్ ద్విజోత్తమాన్ ।
మృగాఅనేనవైయాతా అస్మాభిఃశరపీడితాః ॥
53 - నిమగ్నాస్తేసరఃప్రాప్య క్వతేయాతాద్విజోత్తమాః ।
తేబృవంస్తత్రవైపృష్టా వయంతేచ ద్విజోత్తమాః ॥
54 - అస్యతీర్థస్యమాహాత్మ్యా న్మానుషత్వముపాగతాః ।
తస్మాద్ యూయం శ్రద్ధదానాః స్నాత్వా తీర్థేవిమత్సరాః ॥
55 - సర్వపాపవినిర్ముక్తా భవిష్యథనసంశయః ।
తతఃస్నాతాశ్చతేసర్వే శుద్ధదేహాదివంగతాః ॥
56 - ఏతతీర్థస్యమాహాత్మ్యం మానుషస్యద్విజోత్తమాః ।
యేశృణ్వంతిశ్రద్ధదానాస్తే పియాంతి పరాంగతిమ్ ॥
అనంతరం ముక్తినిలయమైన సంగిని తీర్థంలోని దేవీ తీర్థంలో స్నానంచేసి, నరుడు చక్కని రూపవంతుడు కాగలడు. అనంతైశ్వర్యాలు పుత్రపౌత్రులు గలిగి విస్తారమైన భోగాలననుభావించి పరమపదమందగలడు. బ్రహ్మావర్తంలో స్నాన మాడినవాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. స్వేచ్చామరణం పొందుతాడు. సందేహం లేదు. బ్రాహ్మణోత్తములారా! అచట నుండి రంతుకద్వారపాలుని సేవించాలి. మహాత్ముడగు నాయక్షేంద్రుని సరస్వతీతీర్థంలో ఉపవాసముండి స్నానమాడుచో యక్షప్రసాదం వల్ల కోరిన ఫలములు పొందనగును. ఆటనుండి మునిస్తుతమైన బ్రహ్మావర్తతీర్థంలో స్నానం చేసిన తప్పక బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అచట నుండి దేవతలకు పితరులకు నిత్యనివాసమైన సుతీర్థకమను ఉత్తమ తీర్థంలో పితృదేవార్చనలు అభిషేకాదులు చేసి వారలను సంతోషపెట్టి అశ్వమేధ ఫలం పొందవచ్చు. అక్కడ నుంచి అన్బువనం వెళ్లి అచట కామేశ్వరతీర్థంలో భక్తితోస్నానంచేసినవాడు సర్వరోగముక్తుడై బ్రహ్మజ్ఞాని అవుతాడు. తప్పదు. అక్కడే మాతృతీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానంచేస్తే సంతానవృద్ధి కలిగి అనంతైశ్వర్యాలు లభిస్తాయి. అక్కడనుంచి నియతాహార సేవియై శీతవనానికి వెళ్ళాలి. బ్రాహ్మణులారా! అక్కడ అన్యత్ర దుర్లభమైన తీర్థం ఉంది. దర్శన మాత్రాన్నే పవిత్రం చేసే ఆ క్షేత్రం దండకం. అక్కడ శిరోముండనం చేసికొని మానవుడు పవిత్రుదౌతాడు. పాపాలు పోతాయి. అక్కడే స్వానులోమాయనమనే మరో త్రైలోక విఖ్యాతిగాంచిన తీర్థం ఉంది. అక్కడ మహాప్రాజ్ఞులైన తీర్థోపసేవులు ప్రాణాయామవిధిచే తమ శరీరం మీది రోమాలన్నీ పోగొట్టుకుంటారు. అలాంటి పవిత్రులు పరమపదం పొందుతారు. ఆవల దశాశ్వమేధిక తీర్థం ప్రఖ్యాతమైనది. అక్కడ భక్తితో స్నానం చేస్తే దశాశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. తర్వాత శ్రద్ధాళువులు, లోకవిఖ్యాతమైన మానుషతీర్థానికి వెళ్తారు. దానిని చూసినంతనే కిల్బిషాలు తొలగి ముక్తులౌతారు. పూర్వసమయాన ఆ ప్రదేశాన వేటకాని బాణాలకు గురియై కృష్ణమృగాలు ఆ సరస్సులోపడి మనుష్యశరీరాలు ధరించారు. అలావచ్చిన బ్రాహ్మణోత్తములను చూచి వేటగాళ్ళు వారలతో ఓ ఋషులారా! మా బాణాలు తగిలిన లేళ్ళు సరస్సులో మునిగిపోయాయి. అవి తర్వాత ఏమైనవని అడిగారు. అందులకా బ్రాహ్మణులు మేమే ఆ జింకలము. ఈ తీర్థమహిమ వల్ల ఉత్తమమానుష రూపములు ధరించాము. మీరు గూడ మా వలెనే మత్సర రహితులై స్నానం చేసి పాపాలనుండి ముక్తులవండి. అని చెప్పారు. అంతట వారు గూడ అందులోస్నానంచేసి పవిత్ర శరీరులై స్వర్గానికి వెళ్ళారు. ఓ విప్రోత్తములారా! యిలాంటి మహిమ గల మానుషతీర్థం గరిమనువిన్న శ్రద్ధాళువులు గూడ పరమపదం పొందుతారు.
అధ్యాయము 14 complete
Summary of chapter 87 of the Vāmana Mahā Purana is as follows:
The text recounts the history of Auśanasa-tīrtha, also celebrated as Kapālamochana, where Sage Auśanas performed intense penances to master divine wisdom. The chapter details how a demonic skull that had attached itself to Sage Mahodara was instantly severed and dissolved upon entering the holy waters of Kapālamochana. This miraculous event established the lake as a supreme sanctuary for dissolving the heaviest sins, karmic afflictions, and physical ailments.