వామన మహా పురాణము
అధ్యాయము 23
సనత్కుమారుడు
1 - బ్రాహ్మణో వచనం శ్రుత్వా ఋషయః సర్వఏవతే ।
పునరేవచపప్రచ్చు ర్జగతః శ్రేయకారణమ్ ॥
సనత్కుమారుడు
అలా బ్రహ్మ పలికిన మాటలు విని ఋషులందరు యిప్పుడు జగత్తుకు శ్రేయస్సు ఎలా కలుగుతుందని మరల ప్రశ్నించారు.
బ్రహ్మ
2 - గచ్చనుః శరణం దేవం శూలపాణింత్రిలోచనమ్ ।
ప్రసాదాద్దేవదేవస్య భవిష్యథయథాపురా ॥
3 - ఇత్యుక్తాబ్రహ్మణాసార్థం కైలాసంగిరిముత్తమమ్ ।
దదృశుస్తేనమాసీన ముమయాసహితంహరమ్ ॥
4 - తాతఃస్తోతుంసమారబ్దో బ్రహ్మలోకపితామహః ।
దేవాధిదేవంవరదం త్రైలోక్యస్య ప్రభుంశివమ్ ॥
5 - అనంతాయనమస్తుభ్యం వరదాయపినాకినే ।
మహాదేవాయ దేవాయ స్థాణవేపరమాత్మనే ॥
6 - నమో-స్తుభువనేశాయ తుభ్యంతారకసర్వదా ।
జ్ఞానానాందాయకోదేవ స్త్వమేకఃపురుషోత్తమః ॥
7 - నమస్తేపద్మ గర్భాయ పద్మేశాయనమోనమః ।
ఘోరశాంతిస్వరూపాయ చండక్రోధనమో-స్తుతే ॥
8 - నమస్తేదేవవిశ్వేశ నమస్తేసురనాయక ।
శూలపాణేనమస్తే-స్తు నమస్తేవిశ్వభావన ॥
9 - ఏవంస్తుతో మహాదేవో బ్రహ్మణాఋషిభిస్తదా ।
ఉవాచమాభైర్ర్వజతలింగంవోభవితాపునః ॥
10 - క్రియతాంమద్వాచః శీఘ్రం యేనమేప్రీతిరుత్తమా ।
భవిష్యతిప్రతిష్టాయాం లింగస్యాత్రనసంశయః ॥
11 - యేలింగంపూజయిష్యంతి మామకంభక్తిమాశ్రితాః ।
నతేషాందుర్లభంకించి ధ్భవిష్యతికదాచన ॥
12 - సర్వేషామేవపాపానాం కృతానామపిజానతా ।
శుద్ద్యతేలింగపూజాయాం నాత్రకార్యావిచారణా ॥
13 - యుష్మాభిఃపాతితంలింగం సారయిత్వామహత్సరః ।
సంనిహిత్యంతువిఖ్యాతం తస్మిన్ శీఘ్రం ప్రతిష్టితమ్ ॥
14 - యతాభిలషితంకామంతతః ప్రాప్యథబ్రాహ్మణాః ।
స్థాణుర్నామ్నాహిలోకేషు పూజనీయోదివౌకసామ్ ॥
బ్రహ్మ
మనమందరం వెళ్లి ఆ దయామయుడు త్రిలోచనుడు శూలపాణి శరణుకోరుదము. ఆయన అనుగ్రహం వల్ల యథాపూర్వస్థితి ఏర్పడుతుంది. అంతట బ్రహ్మతో కలిసి ఆ మునులందరు కైలాసానికి వెళ్లి ఉమాసహితుడైన శంకరుని దర్శించారు. అప్పుడు లోకపితామహుడగు బ్రహ్మ వరదాయకుడు దేవాది దేవుడునైన ముల్లోకేశ్వరుడు శివుని యిలా స్త్రోత్రం చేశాడు. ఓ అనంతా నీకు నమస్కారం! పినాకదారీ, వరదా, మహాదేవా, స్థాణూ! పరమాత్మా నీకు ప్రణామాలు! భువనేశా! తారకా! సకలజ్ఞానప్రదాయకా! నీకు నమస్సులు! దేవా! నీవొక్కడవే పురుషోత్తముడవు. పద్మగర్భా! పద్మేశా! నీకు ప్రణామములు. ఘోరరూపా, శాంతిరూపా, చందకోననా! విశ్వేశా! నీకు నమస్కారములు. సురనాయకా! శూలపాణీ! విశ్వభావానా! ప్రభూ! నీ కనేక ప్రణామాలు! బ్రహ్మ ఋషులు చేసిన స్తోత్రం విని మహాదేవుడిలా అన్నాడు. భయపడకండి, వెళ్ళండి. లింగం పునః ప్రతిష్టిత మౌతుంది. నాకు ప్రీతికరంగా నేను చెప్పినట్లు చేయండి. చేయండి. నిస్సందేహంగా లింగ ప్రతిష్ట జరుగుతుంది. నాలింగాన్ని ఎవరు భక్తితో పూజిస్తారో వారలకు అసాధ్యమంటూ ఉండదు. పాపాలు తెలిసి చేసినప్పటికీ, ఎలాంటివైనా లింగార్చన చేసినంతటనే పటాపంచలౌతాయి. సందేహింపకుడు. మీరలు పడగొట్టిన లింగాన్ని వెంటనే తీసుకవెళ్లి సన్నిహిత్యమనే మహత్సరోవరంలో ప్రతిష్టించండి. అందువల్ల మీ మనోవాంచితాలన్నీ నెరవేరతాయి. స్థాణువనే పేర దానిని దేవతలంతా పూజిస్తారు.
15 - స్థాణ్వీశ్వరేస్థితోయస్మాత్ స్థాణ్వీశ్వరస్తతః స్మృతః ।
యేస్మరం తిసదాస్థాణుం తేముక్తాః సర్వకిల్బిషై: ॥
16 - భవిష్యంతి శుద్దదేహా దర్శనాన్మోక్షగామినః ।
ఇత్యేవముక్తాదేవేన ఋషయో బ్రహ్మణాసహ ॥
17 - తస్మాడ్డారువనాల్లింగం నేతుంసమువచక్రముః నతంచాలయితుంశక్తా స్తేదేవాఋషిభిః సహ ॥
18 - శ్రమేణమహాతాయుక్తా బ్రహ్మాణంశరణం యయుః ।
తేషాంశ్రమాభితప్తానా మిదంబ్రహ్మ-బ్రవీద్వచః ॥
19 - కింవాశ్రమేణమహతా నయూయంవహనక్షమాః ।
స్వేచ్చయాపాతితంలింగం దేవదేవేనశూలినా ॥
20 - తస్మాత్తమేవశరణం యాస్యామః సహితాః సురాః ।
ప్రసన్నశ్చమహాదేవః స్వయమేవనయిష్యతి ॥
21 - ఇత్యేవముక్తాఋషయో దేవాశ్చ బ్రహ్మణా సహ ।
కైలాసంగిరిమాసేదూ రుద్రదర్శనకాంక్షిణః ॥
22 - నచపశ్యంతితందేవం తతశ్చింతాసమన్వితాః ।
బ్రహ్మాణమూచుర్మునయః క్వసదేవోమహేశ్వరః ॥
23 - తతోబ్రహ్మాచిరంధ్యాత్వా జ్ఞాత్వాదేవం మహేశ్వరమ్ ।
హస్తిరూపేణ తిష్టంతం మునిభిర్మానసైః స్తుతమ్ ॥
24 - అథతేఋషయస్సర్వే దేవాశ్చ బ్రహ్మణా సహ ।
గతామహత్సరః పుణ్యం యత్రదేవః స్వయంస్తితః ॥
25 - నచవశ్యంతితందేవం అన్విష్యంత స్తతన్తతః ।
తతశ్చింతాన్వితాదేవా బ్రహ్మణాసహితాః స్థితాః ॥
26 - పశ్యంతిదేవీం సుప్రీతాం కమండలు విభూషితామ్ ।
ప్రీయమాణాతదాదేవీ ఇదంవచనమబ్రవీత్ ॥
27 - శ్రమేణమహతాయుక్తా అన్విష్యంతో మహేశ్వరమ్ ।
పీయతామమృతందేవా స్తతోజ్ఞాస్యథశంకరమ్ ।
ఏతచ్చ్రుత్వాతువచనం భవాన్యాసముడాహృతమ్ ॥
28 - సుఖోపవిష్టాస్తేదేవాః వపుస్తద మృతంశుచి ।
అనంతరంసుఖాసీనాః పప్రచ్చుః పరమేశ్వరీమ్ ॥
29 - క్వసదేవఇహాయాతో హస్తిరూపదరః స్థితః ।
దర్శితశ్చతదాదేవ్యా సరోమధ్యేవ్యవస్థితః ॥
30 - దృష్ట్వాదేవంహర్షయుక్తాః సర్వేదేవాః సహర్షిభిః ।
బ్రహ్మాణమగ్రతఃకృత్వా ఇదంవచనమబ్రవీత్ ॥
స్థాణ్వీశ్వరంలో ఉన్నందున నన్నచట స్థాణ్వీశ్వరుడని పిలుస్తారు. స్థాణువును సదా స్మరిస్తే సర్వకిల్బిషాలు తొలగిపోతాయి. ఆ దేవుని దర్శన మాత్రాననే పరిశుద్ద దేహులై మోక్షగాములౌతారు. పరమేశ్వరుని మాటలు విని బ్రహ్మాది దేవతలతో కూడి ఆ ఋషులు దారువనం నుంచి లింగాన్ని కదలించి తీసికొని వెళ్ళుటకుపక్రమించారు. అయితే వారందరు కలిసి ప్రయత్నించినా ఆ లింగాన్ని కదలించలేకపోయారు. ఇక దారి ఏమని బ్రహ్మను ప్రశ్నించగా ఆయన మీరెంతగా శ్రమించినా దేవదేవుని ఇచ్చానుసారంభూపతితమైన లింగాన్ని తీసి కొనిపోలేరు. కనుక ఆయననే మరల శరణు వెడితే ఆయనే దయతో దానిని తీసికొనిరాగలడు. అంత అందరూ మరల కైలాసానికి వెళ్ళారు. అయితే అక్కడ వారలకు రుద్రుడగుపించలేదు. అప్పుడు బ్రహ్మద్యానస్తుడై ఆలోచించగా శంకరుడు ఏనుగు రూపంలో, ఆయనను స్త్రోత్రం చేస్తున్న ఆ దేవతలు, ఋషుల మనస్సులలోనే ఉన్నట్టు కనుగొన్నాడు. అంతట బ్రహ్మను ముందుంచుకొని ఆ దేవతలు ఋషులంతా, ఆ దేవుడు స్వయంగా విరాజిల్లే ఆ మహాత్సరోవరానికి వెళ్ళారు. అక్కడ కూడ ఆ శివుని కానక వారంతా అన్వేషణ సాగించారు.చింతాకులమైన హృదయాలతో ఉండిపోయారు. అప్పుడచట పార్వతీదేవి కమందలదారిణియై ప్రసన్న వదనంతో కనిపించగా ఆమె నందరు స్తోత్రం చేశారు. ప్రీతురాలైన ఆ ఉమామహేశ్వరుని వెదకి వెదకి బాగా అలసి పోయారు. కాబట్టి మీరంతా ముందీ అమృతాన్ని త్రాగండి. అనంతరం శంకరుని జాడ తెలిసి కోగలరు. అన్నది. ఆ భవాని మాటలకు సంతుష్టులై వారందరచట కూర్చొని ఆ పవిత్రమైన అమృతపానం చేశారు. అనంతరం సుఖాసీనులై వారామెను హస్తిరూపంలో అచ్చటికి వచ్చిన ఈశ్వరుడెచటనున్నాడని అడిగారు. అప్పుడామె ఆ సరోవర మధ్యంలో హస్తిరూపాన ఉన్న శివుని చూపించింది. నీటిలో మునిగి యున్న నామహాదేవుని చూచి బ్రహ్మను ముందుంచుమని ఆ దేవర్షులిలా అన్నారు.
31 - త్వయాత్యక్తం మహాదేవ లింగంత్రైలోక్యవందితమ్ ।
తస్యచానయనేనాన్యః సమర్థః స్యాన్మ హేశ్వర ॥
32 - ఇత్యేవముక్తోభగవాన్ దేవోబ్రహ్మాదిభిర్హరః ।
జగామఋషిభిః సార్ధం దేవదారువనాశ్రమమ్ ॥
33 - తత్రగత్వా మహాదేవో హస్తిరూపధరోహరః ।
కరేణజగ్రాహతతో లీలయాపరమేశ్వరః ॥
34 - తమాదాయమహాదేవః న్తూయమానోమహర్షిభిః ।
నివేశయామాసతదా సరః పార్శ్వేతుపశ్చిమే ॥
35 - తతోదేవాః సర్వఏవ ఋషయశ్చతపోధనాః ।
ఆత్మానంసఫలం దృష్ట్వా స్తవంచక్రుర్మ హేశ్వరే ॥
36 - నమస్తేపరమాత్మన్ అనంతయోనే లోకసాక్షిన్ పరమేష్టిన్ భగవన్ సర్వజ్ఞ క్షేత్రజ్ఞ పరావరజ్ఞ
37 - జ్ఞానజ్ఞేయ సర్వేశ్వర మహావిరించ మహావిభూతే మహాక్షేత్రజ్ఞ మహాపురుష సర్వభూతావాస
38 - మనోనివాస ఆదిదేవ మహాదేవ సదాశివ ॥
39 - ఈశాన దుర్విజ్ఞేయ దురారాధ్య మహాభూతేశ్వర పరమేశ్వర మహాయోగేశ్వర త్రయంబక మహాయోగిన్
40 - పరబ్రహ్మన్ పరమజ్యోతిః బ్రహ్మవిదుత్తమ ఓంకార వషట్కార స్వాహకార స్వదాకార పరమకారణ
41 - సర్వగత సర్వదర్శిన్ సర్వశక్తే అజ
42 - సహస్రార్చిః పృషార్చిః సుదామన్ హరదామ అనంతదామ ।
సంవర్త సంకర్షణ బడవానల అగ్నీషోమాత్మక ?
43 - పరిత్ర మహాపవిత్ర మహామేఘ మహామాయాదర మహాకామ
44 - కామహన్ హంస పరమహంస మహారాజిక మహేశ్వర
45 - మహాకాముక మహాహంస భవక్షయకర సురసిద్దార్చిత
46 - హిరణ్యవాహ హిరణ్యరేతః హిరణ్యనాభ హిరణ్యాగ్రకేశ ।
ముంజకేశిన్ సర్వలోకవరప్రద సర్వానుగ్రహకర
47 - కమలేశయ కుశేశయ హృదయేశయ జ్ఞానోదదే శంభో
48 - నిభో మహాయజ్ఞ మహాయాజ్ఞిక సర్వయజ్ఞమయ
49 - సర్వయజ్ఞ హృదయ సర్వయజ్ఞసంస్తుత నిరాశ్రయ ॥
50 - సముద్రేశయ అత్రిసంభవ భక్తానుకంపిన్ అభగ్నయోగ యోగదర వాసుకిమహామణి
51 - విద్యోతితవిగ్రహ హరితనయన త్రిలోచనజటాధర నీలాకంట చంద్రార్ధదర ఉమాశరీరార్ధహర ॥
52 - గజచర్మదర దుస్తర సంసార మహాసంహారకర ప్రసీదభక్తజనవత్సల
53 - ఏవం స్తుతో దేవగనైః సుభాక్త్యా సబ్రహ్మముఖ్యైశ్చ పితామహేన ।
త్యక్త్వా తదా హస్తిరూపం మహాత్మా లింగే తదా సంనిదానం చకార ॥
మహాదేవా ! నీవు వదలిన త్రిలోకవందనీయమైన లింగాన్ని యితరులెవ్వరూకొని తెచ్చుటకు సమర్థులు కాకున్నారు. బ్రహ్మాదుల నివేదనము విని ఈశ్వరుడు వారందరను వెంటబెట్టుకొని దేవదారువనాశ్రమానికి వెళ్లి ఏనుగురూపంతో లింగాన్ని తొండంతో అలవోకగా పట్టుకొని తెచ్చి మహర్షుల స్తోత్రపాటాలమధ్య నామహాసరస్సుకు పశ్చిమదిక్కున నిలిపాడు. అంతనా దేవతలు ఋషులంతా తమజన్మలు ధన్యమైనవని సంతోషించి ఆ పరమశివుని యిలా స్తోత్రం చేశారు. పరమాత్మా అనంతయోనీ లోకసాక్షీ పరమేష్టీ భగవాన్ సర్వజ్ఞా క్షేత్రజ్ఞా నీకు నమస్కారము।
పరావరజ్ఞా జ్ఞానజ్ఞేయా సర్వేశ్వరా మహావిరించీ ।
మహావిభూతీ మహాక్షేత్రజ్ఞా మహాపురుషా సర్వభూతావాసా ।
మనోనివాసా ఆదిదేవా సదాశివా మహాదేవా నీకుప్రణామము. ।
ఈశానా దుర్విజ్ఞేయా దురారాధ్యా మహాభూతేశ్వరా ।
పరమేశ్వరా మహాయోగేశ్వరా త్రినేత్రా మహాయోగీపరబ్రహ్మ పరమజ్యోతీ బ్రహ్మవేత్తలలో ఉత్తముడా ప్రణవస్వరూపా ।
వషట్కారస్వాహాకారస్వదాకారరూపా పరమకారణా ।
సర్వగాతా సర్వదర్శీ సర్వశక్తిరూపా సర్వదేవా ఆభవా ।
సహస్రార్చీ అనేకకిరణా సుదామా హరదామా అనంతదామా ।
మేఘస్వరూపా సంకర్షణా బడవానలా అగ్ని చంద్రమయా నీకునమస్సులు. ।
పవిత్రుడా మహాసవిత్రుడా మహామేఘుడా మహామాయాదారీ ।
మహాకామా కామాంతకా హంసా పరమహంసా పరమాదీశ్వరా ।
మహేశ్వరా మహాకాముకుడా మహాహంసా భవనాశకా సురసిద్దార్చితా ।
హిరణ్యవాహా సువర్ణవీర్యా సువర్ణనాభా హిరణ్యకేశా ముంజకేశా ।
సర్వలోకవరప్రదా సర్వానుగ్రహకరా కమలశయనా దర్భశయనా ।
హృదయనివాసా జ్ఞానసిందూ శంభూ విభూ ।
మహాయజ్ఞా మహాయాజ్ఞికుడా సర్వయజ్ఞమయుడా ।
సర్వయజ్ఞప్రియా సర్వయజ్ఞసంస్తుతా నిరాశ్రయా ।
సముద్రశయనా అత్రిపుత్రా భక్తులయెడదయగలవాడా ।
ఆభగ్నయోగా యోగధరా వాసుకిమహామణికాంతులతో ।
వెలిగేవాడా హరితనేత్రుడా ముక్కంటీ జటాధరా నీకు నమస్సులు. ।
నీలకంటా చంద్రమౌళీ అర్ధనారీశ్వరా కృత్తివాసా ।
దుస్తరమైన సంసారాన్ని హరించేవాడా భక్తవత్సలా మమ్మనుగ్రహింపుము. ।
నీకు వేలాది ప్రణామములు. ఆ విధంగా బ్రహ్మపురోగాములయిన దేవతలు వాలఖిత్యాది ఋషులు భక్తిప్రపత్తులతో చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ మహాదేవుడా ఏనుగురూపాన్ని వదలి ఆ లింగ మధ్యంలో సన్నిహితుడైనాడు.
అధ్యాయము 23 complete
Summary of chapter 95 of the Vāmana Mahā Purana is as follows:
The narrative details how Sage Mankanaka, upon seeing vegetable juice flow from his wounded hand instead of blood, became filled with spiritual pride and began an ecstatic dance that shook the entire cosmos. Parameśvara Śiva manifested before the sage, pierced His own finger to produce divine white ash, and gently revealed the futility of ego, restoring Mankanaka to true humility. Overwhelmed with gratitude, Sage Mankanaka bowed at the feet of Mahādeva Śiva, establishing Saptasārasvata as a place for shedding spiritual pride.