అధ్యాయము 12

లోమహర్షణ

1 - ఇతిఋషేర్వచనంశ్రుత్వా మార్కండేయస్య ధీమతః

 నదీప్రవాహసంయుక్తా కురుక్షేత్రం వివేశహ

2 - తత్రసారంతుకంప్రాప్య పుణ్యతోయా సరస్వతీ

 కురుక్షేత్రంసమాప్లావ్య ప్రయాతా పశ్చిమాందిశమ్    

3 - తత్ర తీర్థసహస్రాణి ఋషిభిః సేవితానిచ

 తాన్యహం కీర్తయిష్యామి ప్రసాదాత్ పరమేష్టినః

4 - తీర్థానాంస్మరణంపుణ్యం దర్శనం పాపనాశనమ్

 స్నానంముక్తికరం ప్రోక్త మపి దుష్కృతకర్మణః

5 - యేస్మరంతిచతీర్థాని దేవతాః ప్రీణయంతిచ

 స్నాతించశ్రద్ధదానాశ్చ తేయాంతి పరమాంగతిమ్

6 - అపవిత్రఃపవిత్రోవా సర్వావస్థాం గతో_పివా

 యఃస్మరేత్ కురుక్షేత్రం సబాహ్యాభ్యాంతరః శుచిః

7 - కురుక్షేత్రం గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహమ్

 ఇత్యేవంవాచముత్పృజ్య సర్వపాపైః ప్రముచ్యతే

8 - బ్రహ్మజ్ఞానంగయాశ్రాద్ధం గోగ్రహే మరణం తథా

 వాసఃపుంసాంకురుక్షేత్రే ముక్తిరుక్తా చతుర్విధా

9 - సరస్వతీదృషద్వత్యోర్దే వనద్యో ర్యదంతరమ్

 తందేవనిర్మితందేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే

10 - దూరస్థో_పి కురుక్షేత్రే గచ్ఛామి చ వసామ్యహమ్

 ఏవం యః సతతం బ్రూయత్సో_పి ప్రాపైః ప్రముచ్యతే 

11 - తత్రచైవసరఃస్నాయీ సరస్వతాస్తత్యాస్తటేస్థితః

తస్యజ్ఞానంబ్రహ్మమయముత్పత్స్యతినసంశయః

లోమహర్షణ

బుద్ధిమంతుడగు మార్కండేయుని మాట విని సరస్వతి ప్రవాహరూపంతో కురుక్షేత్రంలో ప్రవేశించింది. ఆ పుణ్యసలిల రంతుకం చేరి కురుక్షేత్రాన్ని తడుపుతూ పశ్చిమ దిశగా మళ్ళింది. అక్కడ మహర్షి సేవితాలయిన వేయి తీర్థాలున్నవి. పరమేష్ఠి కృపవల్ల వాటిని వర్ణిస్తాను వినండి. పవిత్ర తీర్థాలను స్మరిస్తే పుణ్యం చూస్తే పాపక్షయం, స్నానం చేస్తే పరమ దుశ్చేష్టితులకు గూడ ముక్తి కలుగుతాయి. ఎవరు తీర్థాలను స్మరిస్తారో అచట దేవా ప్రీతికరాలయిన కార్యాలు చేస్తారో స్నానాలు చేస్తారో వాని పట్ల శ్రద్ధ గలిగి ఉంటారో వారంతా ఉత్తమ గతులను పొందుతారు. అపవిత్రుడైన పవిత్రుడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కురుక్షేత్రాన్ని స్మరించినంతనే మానవునకు బాహ్య అంతరశుచిత్వం కలుగుతుంది. ఇంతే కాదు. నేను కురుక్షేత్రం వెళ్తాను. అక్కడ నివాసం చేస్తాను. అనునోటపలికినంత మాత్రాన్నే పాపక్షయం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం, గయాశ్రాద్ధం, గోగ్రహంలో మరణం, కురుక్షేత్రవాసం వల్ల నాలుగు విధాల ముక్తులు చెప్పబడినవి. సరస్వతీ దృషస్వతీ ఈ రెండు దేవనదుల మధ్యగల భూమి దేవనిర్మితమైంది. దానిని బ్రహావర్తమంటారు. దూరాన ఉంటూ కూడ నేను కురుక్షేత్రం వెళ్తాను. అక్కడ ఉంటాను. అని నిరంతరం అంటూ ఉండే వాని సర్వ పాపాలు పోతాయి. అచట సరస్సులో స్నానం చేస్తూ సరస్వతీ తీరాన ఉండే వారికి బ్రహ్మ జ్ఞానం కలుగుటలో సందేహం లేదు.

12 - దేవతా ఋషయః సిద్ధాః సేవంతే కురుజాంగలమ్

 తస్య సంసేవనాన్నిత్యం బ్రహ్మదాత్మని పశ్యతి

13 - చంచలంహిమనుష్యత్వం ప్రాప్యయేమోక్షకాంక్షిణః

 సేవంతినియతాత్మానో ఆపి దుష్కృతకారిణః  ॥  

14 - తేవిముక్తాశ్చకలుషై రనేకజన్మసంభవైః

 పశ్యంతినిర్మలందేవం హృదయస్థంసనాతనమ్

15 - బ్రహ్మవేదిఃకురుక్షేత్రం పుణ్యంసాన్నిహితంసరః

 సేవమానానరానిత్యం ప్రాప్నువంతిపరమపదంమ్

16 - గ్రహనక్షత్రతారాణాం కాలేనపతనాద్భయమ్

 కురుక్షేత్రేమృతానాంచ పతనంనైవవిద్యతే

17 - యత్రబ్రహ్మాదయోదేవా ఋషయఃసిద్ధచారణాః

 గంధర్వాప్సరసోయక్షాః సేవంతిస్థానకాంక్షిణః

18 - గత్వాతు శ్రద్ధయా యుక్తః స్నాత్వా _ణుమహాహ్రదే

 మనసా చింతితం కామం లభతే నాత్రసంశయః

19 - నియమంచ తత్య కృత్వా గత్వా సరః ప్రదక్షిణమ్

 రంతుకం చసమాసాద్య క్షామయిత్వాపునః పునః

20 - సరస్వత్యాంనరఃస్నాత్వా యక్షం దృష్ట్వా ప్రణమ్య చ

 పుష్పంధూపంచనైవేద్యం దత్వా వాచ ముదీరయేత్

21 - తవప్రసాదాద్ యక్షేంద్ర వనానిసరితశ్చయాః

 భ్రమిష్యామిచాతీర్థాని అవిఘ్నం కురుమేసదా

దేవతలు, ఋషులు, సిద్ధులు కురుజాంగలాన్ని సదాసేవిస్తారు. ఆ కారణాన వారు బ్రహ్మను తమలోనే చూడగలుగుతున్నారు. క్షణ భంగురమైన మానవజీవితాన్ని పొంది, మోక్షమును కోరువారు జితేంద్రియులై ఈ క్షేత్రాన్ని సేవిస్తారు. ఎంతటి దురాచారులైననూసరే అనేక జన్మార్జితాలయిన పాపాలనుంచి ముక్తులై తమహృదయాల్లో ఆ పవిత్ర బ్రహ్మతత్వాన్ని చూడగలుగుతారు. నిత్యమూ బ్రహ్మదేవుని కురుక్షేత్రాన్ని సన్నిహిత సరోవరాన్ని భజించే మానవులు పరమపదప్రాప్తి పొందుతారు. గ్రహ నక్షత్ర తారలకైనా కాలంతీరిన తర్వాత పతనం పొందుతామనే భయం ఉండవచ్చు గాని కురుక్షేత్రంలో మరణించువారలకు అలాంటి భయం ఉండదు. బ్రహ్మ మొదలగు దేవతలు ఋషులు సిద్ధులు యక్షులు గంధర్వాప్సరసాదులు తమ తమ పదవులు నిలబెట్టుకొనుటకు ఆ క్షేత్రాన్ని సేవిస్తారు. అక్కడకు వెళ్లి శ్రద్ధతో స్థాణుసరోవరంలో స్నానంచేస్తే మనస్సులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి. సందేహం లేదు. వ్రతనిష్ఠతో ఆ సరోవరానికి ప్రదక్షిణం చేసి, రంతుకానికి వెళ్లి మరల మరల క్షమాయాచన చేస్తూ సరస్వతి నదిలో స్నానం చేసి యక్షుని దర్శించి ధూప దీపపుష్పనైవేద్యాదులతో పూజించి ఓ యక్షేంద్రా! నీ అనుగ్రహం వల్లనే నేను తలపెట్టిన ఈ తీర్థ అరణ్య సరోవరాల పర్యటనం నిర్విఘ్నంగా నేరవేరుగాక, అని ప్రార్థించవలెను.

అధ్యాయము 12 complete