వామన మహా పురాణము
అధ్యాయము 58
నారద
1 – యాన్ జప్యాన్ భగవ ద్భక్త్యా ప్రహ్లాదో దానవో జపత్ ।
గజేంద్ర మోక్షణాదీంస్తు చతుర స్తాన్ వదస్వ మే ।
నారదుడు
బ్రహ్మర్షే! పరమ భక్తుడైన ప్రహ్లాదుడు శ్రద్దగా జపించిన గజేంద్ర మోక్షణం మొులయిన నాలుగు స్తోత్రాలేమో చెప్పండి.
పులస్త్య
2 - శృణుష్వ కథయిష్యామి జప్యా నేతాం స్తపోధన ।
ళి దుఃస్వప్న నాశోభవతి యైరుకైః సంశ్రుతైః ।
3 - గజేంద్ర మోక్షణం త్వాదౌ శృణుష్వ తదనంతరమ్ ।
సారస్వతం తతః పుణ్యౌ పాప ప్రశమనౌ స్తవౌ ।
4 - సర్వ రత్నమయః శ్రీమాన్ త్రికూటో నామ పర్వతః ।
సుతః పర్వత రాజస్య సుమేరో ర్భాస్కర ద్యుతేః ।
5 - క్షీరోద జలవీ చ్యగ్రై ర్థౌతామల శిలాతలః ।
ఉత్థితః సాగరం భిత్వా దేవర్షి గణసేవితః ।
6 - అప్సరోభిః పరివృతః శ్రీమాన్ ప్రస్రవణాకులః ।
గంధర్వైః కిన్నరై ర్యక్షైః సిద్ధ చారణ పన్నగైః ।
7 - విద్యాధరైః సపత్నీకైః సంయతైశ్చ తపస్విభిః ।
వృక ద్వీపి గజేంద్రైశ్చ వృత గాత్రో విరాజతే ।
8 - పున్నాగైః కర్ణికారైశ్చ బిల్వామలక పాటలైః ।
చూత నీప కదంబైశ్చ చందనాగురు చంపకైః ।
9 - శావై స్తావె స్తమావైశ్చ సరలార్జున పర్పటైః ।తథాన్యై ర్వివిధై ర్వృక్షైః సర్వతః సమలంకృతః ।
10 - నానా ధాత్వంకి తైః శృంగైః ప్రస్రవద్భిః సమంతతః ।
శోభితో రుచిర ప్రఖ్యస్త్రి భి ర్విస్తీర్ణ సానుభిః ।
11 - మృగైః శాఖామృగైః సిహై ర్మాతంగైశ్చ సదామదైః ।
జీవం జీవక సంఘుష్టై శ్చకోర శిఖి నాదితైః ।
12 - తస్యైకం కాంచనం శృంగం సేవతే యం దివాకరః ।
నానా పుష్ప సమాకీర్ణం నానా గంధా దివాసితమ్ ।
13 - ద్వితీయం రాజతం శృంగం సేవతే యం నిశాకరః ।
పాండురాంబుద సంకోశం తుషార చయ సంనిభమ్ ।
14 - వజ్రేంద్ర నీలవై డూర్య తేజోభి ర్భాసయన్ దిశః ।
తృతీయం బ్రహ్మ సదనం ప్రకృష్టం శృంగ ముత్తమమ్ ।
15 - న తత్‌కృతఘ్నాః పశ్యంతి న నృశంసా న నాస్తికాః ।
నాఽతప్తతపసో లోకే యే చ పాపకృతో జనాః ।
పులస్త్యుడు
ఓ తపోధనా! దేనిని జపిస్తే వింటే స్మరిస్తే దుఃస్వప్నాలు నశించునో ఆ గజేంద్ర మోక్షణ గాధను ముందుగా వినుము. తర్వాత సారసత్వ పాప ప్రశమన స్తోత్రాలు చెబుతాను. సర్వ రత్నాలతో నిండిన త్రికూటమనే భవ్య పర్వతం ఉంది. సూర్య కాంతితో వెలిగే మేరు పర్వతానికి ఆ త్రికూట పర్వతం పుత్రుడు. దేవర్షి గణాలు సేవించే ఆ పర్వతం క్షీర సాగరంలో నుంచి ఉద్భవించింది. దాని నునుపైన శిలలను ఆ సాగర తరంగాలు కడుగుతూంటాయి. అనేక సెలయేళ్లతో కల కల లాడే ఆ పర్వతాన్ని గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, సిద్ద, చారణ, పన్నగ, విద్యాధరులు తమ భార్యలతో కలిసి సేవిస్తుంటారు. జితేంద్రియు లగు తపస్వులకు ఆట పట్టు అ గిరి. తోడేళ్లు, గజేంద్రాలు దాని మీద సంచరిస్తుంటాయి. ఆ పర్వతం నిండా పున్నాగ, కర్ణికార (గన్నేరు), బిల్వ, ఉసిరిక, పాటల, మామిడి, కడిమి, కదంబ, చందన, అగరు, సంపెంగ శాల, తాళ, తమాల, సరళ, అర్జున, పర్పట మొదలయిన ఎన్నో రకాల వృక్షాలు ఏపుగా పెరిగి నేత్ర పర్వం గావిస్తాయి. అనేక ధాతుమయాలైన దాని శిఖరాల నుంచి జాలువారే జల పాతాలతో అందాలుచిందించే మూడుసానువులతో అది అలరారుతూంటుంది. లేళ్లు, వానరాలు, సింహాలు, మదపుటేనుగులు జీవాలను చంపి తినే యితర జంతువులతో చకోర మయూరాల నాదాలతో ఆ ప్రదేశం కోలాహలంగా ఉంటుంది. ఆ మూడు శిఖరాలలో ఒకటి బంగారుమయమై దివాకరున కావాసంగా చక్కని పరిమళాలు వెదజల్లే నానాపుష్పాలతో నిండి ఉంటుంది. చంద్రున కావాసమైన రెండవ శిఖరం రజత నిర్మితం. అది శ్వేతమేఘ సమూహం లాగ తుషారపటలాల్లా గా మనోహరంగా ఉంటుంది. ఇంద్రనీల, వజ్ర, వైడూర్యకాంతులతో దిశలను వెలిగిస్తూ ఉండే మూడవ శిఖరం బ్రహ్మకు నెలవు. సర్వోత్తమమైనది. అది కృతఘ్నులకూ, కౄరులకూ, నాస్తికులకూ, తపస్సు చేయని పాపులకూ గోచరం కాదు.
16 - తస్య సానుమతః పృష్టే సరః కాంచన పంకజమ్ ।
కారండవ సమాకీర్ణం రాజహంసోపశోభితమ్ ।
17 - కుముదోత్పలక ల్హారైః పుండరీకైశ్చ మండితమ్ ।
కమలైః శతపత్రైశ్చ కాంచనైః సమలంకృతమ్ ।
18 - పత్రై ర్మరకత ప్రఖ్యైః పుష్పైః కాచన సంనిభైః ।
గుల్మైః కీచక వేణూనాం సమంతా త్పరివేష్టితమ్ ।
19 - తస్మిన్ సరసి దుష్టాత్మా విరూపోऽoత ర్జవేశయః ।
ఆసీద్‌గ్రాహో గజేంద్రాణాం రిపు రాకేకరేక్షణః ।
20 - ఆధూనంతో జ్వలముఖః కదాచి ద్గజయూధపః ।
మదస్రావీ జలాకాంక్షీ పాద చారీవ పర్వతః ।
21 - వాసయ న్మద గంధేన గిరి మైరావతో పమః ।
గజో హ్యంజన సంకాశో మదా చ్చలిత లోచనః ।
22 - తృషితః పాతు కామోऽసౌ అవతీర్ణశ్చ తజ్జలమ్ ।
సలీలః ఫంకజ వనే యూధ మధ్య గత శ్చరన్ ।
23 - గౄహీత స్తేన రౌద్రేణ గ్రాహే ణావ్యక్త మూర్తినా ।
పశ్యంతీనాం కరేణూనాం క్రోశం తీనాం చ దారుణమ్ ।
24 - హ్రియతే పంకజ వనే గ్రాహేణా తిబలీయసా ।
వారుణైః సంయతః పాశై ర్నిష్ప్రయత్న గతిః కృతః ।
25 - వేష్ట్య మానః సుఘోరైస్తు పాశై ర్నాగో దృఢై స్తథా ।
విసార్య చ యథా శక్తి విక్రోశం చ మహారవాన్ ।
26 - వ్యథితః స నిరుత్సాహో గృహీతో ఘోరకర్మణా ।
పరమాపదమాపన్నో మనసా చింతయ ద్దరిమ్ ।
27- స తు నాగవరః శ్రీమన్ నారాయణ పరాయణః ।
తమేవ శరణం దేవం గతః సర్వాత్మనా తదా ।
28 - ఏకాత్మా నిగృహీతాత్మా విశుద్ధే నాంతరాత్మనా ।
జన్మ జన్మాంతరాభ్యాసాత్ భక్తి మాన్ గరుడధ్వజే ।
29 - నాన్యం దేవం మహాదేవాత్ పూజయామాస కేశవాత్ ।
మథితామృత ఫేనాభం శంఖ చక్ర గదా ధరమ్ ।
30 - సహస్ర భుజ నామాన మాది దేవ మజం విభుమ్ ।
ప్రగృహ్య పుష్కరాగ్రేణ కాంచనం కమలోత్తమమ్ ।
ఆప ద్విమోక్ష మన్విచ్ఛన్ గజః స్తోత్ర ముదీరయత్ ।
ఆ పర్వతాగ్రాన బంగారు కమలాలతో నిండిన చక్కని సరోవరం నీటి బెగ్గురులు రాజహంసలు జల కుక్కుటాల కల ధ్వనులతో నయన శ్రవణాభిరామంగా శోభిస్తుంది. అందులో కలువలు, నల్ల కమలాలు, కల్హారాలు, తెల్ల కమలాలు, శతపత్రాలూ, కాంచన శోభతో నిండి ఉన్నాయి. మరకత మణు ల్లాగ కమల పత్రాలు నలువైపులా పరచుకుని ఉన్నాయి. సరోవరం చుట్టూ వెదురు పొదలు దట్టంగా వ్యాపించాయి. అలాంటి అందమైన సరోవరంలో ఏనుగుల పాలిట మృత్యువు లాగ అరమోడ్పు కనులలో నీళ్లలో కనపడకుండా దాగి కొని ఒక భయంకరమైన మొసలి మాటు వేసికొని ఉండేది. అలా ఉండగా నొక పర్యాయం ల్లని దంతకాంతులతో ముఖం వెలిగి పోతున్న ఒక గజ సమూహ నాయకుడు మద జలధారలు చెంపల నుండి స్రవిస్తూ ఉండగా దాహార్తుడై మద వాసనలతో ఆ పర్వతాన్ని ముంచేస్తూ ఐరావతాన్ని బురుడిస్తూ నడుస్తున్న కాటుక కొండ లాగ బయలుదేరి అచటకు వచ్చాడు. మద ఘూర్ణిత నేత్రాలలో నీరు త్రాగుటకై ఆ సరోవరంలోకి ఆతురతతో దిగాడు. నీరు త్రాగి తామర కొలనులో విహరిస్తూన్న ఆ గజాధిపతిని కనపడకుండా నీళ్లలో పొంచి ఉన్న ఆ క్రూర గ్రాహం గట్టిగా తన కోరలతో పట్టుకున్నది. ప్రక్కనే నిలబడిన ఆడ ఏనుగుల గుంపు ఏమీ చేయ లేక చూస్తూ ఆక్రోశిస్తూ ఉండిపోయింది. ఆ మొసలి మదగజం కాలు పట్టుకొని సరస్సులోనికి లాగుతూంటే ఆ బలమైన వరుణ పాశానికి లోనై విడిపించుకొనే ప్రయత్నం కూడ చేయలేని అసహాయ స్థితిలో చలనం మాని నిలబడిపోయింది, ఆ ఏనుగ. అలా ఘోరమైన పాశాలతో బంధింప బడి గజేంద్రుడు శక్తి కొలది ఘీంకరిస్తూ పెడ బొబ్బలు పెట్టసాగాడు. క్రమంగా శక్తి ఉత్సాహం కోల్పోయి ఫెూర విపత్తుకూ బాధకూ తట్టుకొన లేక మనసారా హరిని స్మరించాడు. పూర్వ జన్మలలో నారాయణుని చరణ కమల భక్తిని అభ్యసించిన వాడై ఉన్నందున, ఆ గజశ్రేష్ఠుదు పూర్వ సంస్కార పుణ్య పరిపాకం వల్ల పదిశుద్ధమైన అంతఃకరణంతో సర్వేంద్రియాలను ఆ గదుడధ్వజునిపై లగ్నం చేసి నిశ్చలమైన విశ్వాసంతో నా ప్రభువుకు శరణాగతుడై నాడు. అలా అనన్యమైన చిత్తంతో మధించిన అమృతం నుంచి వెలువడే నురుగునకు వలె తెల్లనైన శంఖం, చక్రం, గద ధరించిన ఆకేశవుని, మంగళ ప్రదాలయిన వేయి నామాలతో వెలుగొందే అభవుని, సర్వ లోక నాయకుని, కరా(తొండము) గ్రాన బంగారు కమలం పట్టుకొని తన బంధ విముక్తికై దీన హీన స్వరంతో యిలా స్తోత్రం చేశాడు.
గజేంద్ర
31 - ఓం నమో మూల ప్రకృతయే అజితాయ మహాత్మనే ।
అనాశ్రితాయ దేవాయ నిఃస్పృహాయ నమోऽస్తు తే ।
32 - నమ ఆద్యాయ బీజాయ ఆర్షేయాయ పవర్తినే ।
అనంతరాయ చైకాయ అవ్యక్తాయ నమోనమః ।
33 - నమో గుహ్యాయ గూఢాయ గుణాయ గుణవర్తినే ।
అప్రతర్క్యా ప్రమేయాయ అతులాయ నమో నమః ।
34 - నమః శివాయ శాంతాయ నిశ్చింతాయ యశస్వినే ।
సనాతనాయ పూర్వాయ పురాణాయ నమో నమః ।
35 – Slokas 35-59
పులస్త్య
60 - భక్తిం తస్యాను సంచిత్య నాగస్యాऽమోఘ సంభవః ।
ప్రీతిమా నభవ ద్విష్ణుః శంఖ చక్ర గదాధరః ।
61 - సాన్నిధ్యం కల్పయామాస తస్మిన్ సరసి కేశవః ।
గరుడస్థో జగ త్స్వామీ లోకా ధార స్తపోధనః ।
62 - గ్రాహ గ్రస్తం గజేంద్రం తం తం చ గ్రాహం జలాశయాత్ ।
ఉజ్జహారా ప్రమేయాత్మా తరసా మధుసూదనః ।
63 - స్థలస్థం దారయామాస గ్రాహం చక్రేణ మాధవః ।
మోక్షయమాస నాగేంద్రం పాశేభ్యః శరణాగతమ్ ।
64 - స హి దేవల శాపేన హూహూ గంధర్వ సత్తమః ।
గ్రాహత్వ మగమత్ కృష్ణా ద్వధం ప్రాప్య దివం గతః ।
65 - గజోऽపి విష్ణుణా స్పృష్టో జాతో దివ్య వపుః పుమాన్ ।
ఆప ద్విముక్తా యుగప ద్గజ గంధర్వ సత్తమౌ ।
66 - ప్రీతిమాన్ పుండరీకాక్షః శరణాగత వత్సలః ।
అభవ త్వథ దేవేశ స్తాభ్యాం చైవ ప్రపూజితః ।
67 - ఇదం చ భగవాన్ యోగీ గజేంద్రం శరణాగతమ్ ।
ప్రోవాచ ముని శార్దూల! మధురం మధుసూదనః ।
పులస్త్యుడు
శంఖ చక్ర గదాధరుడూ, అమోఘ సంభవుడు (సార్థక జన్ముడు) నగు విష్ణుదేవుడు గజేంద్రుని భక్తికి సంతోషించి ఈ సరస్సులో సాన్నిధ్యాన్ని కల్పించు కొన్నాడు. లోకాధారుడు మహా తపోధనుడునైన ఆ గరుడవాహనుడు వచ్చి మహా వేగంతో ఆ గజాన్నీ మొసలినీ రెంటినీ సరుస్సులో నుండి లాగి బయటపడవేసి చక్రంతో మకరి కంఠాన్ని ఉత్తరించాడు. శరణాగతుడైన ఆ గజాధిపునకు బంధ మోక్షం కలిగించాడు. దేవలుని శాపం వల్ల మకరిగా మారిన హూహూ అనే గంధర్వుడు కృష్ణుని చే వధింప బడి శాప విముక్తుడై దివికి చేరుకున్నాడు. గజేంద్రుడు గూడ విష్ణు కర స్పర్శ వలన దివ్య దేహం ధరించాడు. అలా గజ గంధర్వు లిద్దరూ ఆపదలు వీడి ముక్తులయ్యారు. అంతట వారిద్దరా పుండరీకాక్షుని పూజించారు. శరణాగత వత్సలు డైన ఈ మహా యోగి మధుసూదన డంతట నా గజేంద్రుని జూచి ఓ నారదా! ఇలా అన్నాడు.
శ్రీ భగవానుడు
68 - యో మాం త్వాం చ సరశ్చైవ గ్రాహస్య చ విదారణమ్ ।
గుల్మ కీచక వేణూనాం రూపం మే రోః సుతస్య చ ।
69 - అశ్వత్థం భాస్కరం గంగాం నైమిషారణ్య మేవ చ ।
సంస్మరిష్యంతి మనుజాః ప్రయతాః స్థిర బుద్ధయః ।
70 - కీర్తయిష్యంతి భక్త్యా చ శ్రోష్యంతి చ శుచివ్రతాః ।
దుస్వప్నో నశ్యతే తేషాం సుస్వప్నశ్చ భవిష్యతి ।
71 - మాత్స్యం కౌర్మం చ వారాహం వామనం తార్ఘ్యమేవ చ ।
నారసింహం చ నాగేంద్రం సృష్టి ప్రళయ కారకమ్ ।
72 - ఏతాని ప్రాత రుత్థాయ సంస్మరిష్యంతి యే నరాః ।
సర్వపాపైః ప్రముచ్యంతే పుణ్యం లోక మవాప్నుయుః ।
మధుసూదనుడు
ఎవరైతే నిన్నూ, నన్నూ, ఈ సరోవరాన్ని, ఇచటి గుల్మ, కీచక, రేణువులను, మేరుపుత్రుడైన గిరిశఖరాన్ని మకరిసింహారాన్ని అశ్వత్థ వృక్షాన్ని, భాస్కరుని, గంగను నైమిషారణ్యాన్ని పవిత్రాంతఃకరణతో, స్థిర బుద్ధితో కీర్తిస్తారో, భక్తితో శుచులై ఈ పవిత్ర గాధను వింటారో వారల దుస్వప్నాలు నశించి శుభ స్వప్నాలు కలుగుతాయి. ప్రతి దినము ప్రాతఃకాలాన మేల్కాంచి ఏ నరులైతే మత్స్య, కూర్మవరాహ, వామన, గరుడ, నారసింహావతారాలను, వారి కార్యాలను, సృష్టి ప్రలయ కారకుడైన నాగేంద్రుని, సమాహిత చిత్తంతో స్మరిస్తారో వారలు సమస్త పాపాల నుండి విడి వడి వూణ్యలోకాలకు పోతారు.
పులస్త్య
73 - ఏవ ముక్త్వా హృషీకేశో గజేంద్రం గరుడధ్వజః ।
స్పర్శయామాస హస్తేన గజం గంధర్వమేవ చ ।
74 - తతో దివ్య వపు రూత్వా గజేంద్రో మధుసూదనమ్ ।
జగామ శరణం విప్ర నారాయణ పరాయణః ।
75 - తతో నారాయణః శ్రీమాన్ మోక్షయిత్వా గజోత్తమమ్ ।
పాప బంధాచ్చ శాపాచ్చ గ్రాహం చాద్భుత కర్మకృత్ ।
76 - ఋషిభి స్తూయమానశ్చ దేవ గుహ్య పరాయణైః ।
గతః స భగవాన్ విష్ణు ర్దుర్విజ్ఞేయ గతిః ప్రభుః ।
77 - గజేంద్ర మోక్షణం దృష్ట్వా దేవాః శక్ర పురోగమాః ।
వవందిరే మహాత్మానం ప్రభుం నారాయణం హరిమ్ ।
78 - మహర్షయ శ్చారణాశ్చ దష్ట్వా గజ విమోక్షణమ్ ।
విస్మయోత్ఫుల్లనయనాః సంస్తువంతి జనార్దనమ్ ।
79 - ప్రజాపతి పతి ర్బ్రహ్మా చక్రపాణి విచేష్టితమ్ ।
గజేంద్ర మోక్షణం దృష్ట్వా ఇదం వచన మబ్రవీత్ ।
80 - య ఇదం శృణుయాన్నిత్యం ప్రాత రుత్థాయ మానవః ।
ప్రాప్నుయా త్పరమాం సిద్థిం దుఃస్వప్నసస్య నశ్యతి ।
81 - గజేంద్ర మోక్షణం పుణ్యం సర్వ పాప ప్రణాశనమ్ ।
కథితేన స్మృతేనాऽథ శ్రుతేన చ తపోధన ।
గజేంద్రమోక్షణేనేహ సద్యః పాపా త్ప్రముచ్యతే ।
82 - ఏత త్పవిత్రం పరమం సుపుణ్యం ।
సంకీర్తనీయం చరితం మరారేః యస్మిన్ కిలోక్తే బహు పాప బంధనాత్ ।
లభ్యేత మోక్షో ద్విరదేన యద్వత్ ।
83 - అజం వరేణ్యం వర పద్మనాభం ।
నారాయణం బ్రహ్మ నిధిం సురేశమ్ ।
తం దేవగుహ్యం పురుషం పురాణం ।
వందామ్యహం లోకపతిం వరేణ్యమ్ ।
పులస్త్యుడు
గరుడ ధ్వజుడైన ఆ హృషీకేశవుడీ విధంగా వరా లిచ్చి ఆ గజ గ్రాహాలను తన చేతితో నిమిరాడు. అంత నా గజేంద్రుడు దివ్య దేహం ధరించి మధుసూదనుని పాదాల కడ శరణాగతు డయ్యాడు. నారదా! అంతట శ్రీ నారాయణ దేవుడా నారాయణ పరాయణుడగు గజరాజునకు మకరి నుండి యే కాక పాపాల నుండి కూడ ముక్తి ప్రసాదించాడు. అనంతరమా అద్భుత కర్ముడు విష్ణుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, స్తోత్రాలు చేస్తూండగా వెళ్లిపోయాడు. దుర్విజ్ఞేయ గమను డైన శ్రీహరి గావించిన గజేంద్ర మోక్షణాన్ని తిలకించిన యింద్రాది దేవతలంద రా భక్త వత్సలు నకు చేతులు మోడ్చి వందనాలు చేశారు. మహర్షులు చారణులు ఆశ్చర్య పులకితులై స్తవనములు గావించారు. చక్ర పాణి నెరపిన అద్భుత చేష్టితాన్ని చూచి ప్రజాపతులలో ముఖ్యుడైన చతుర్ముఖుడు యిలా అన్నాడు. ఈ గజేంద్ర యోక్షణ కథను ప్రాతఃకాలాన లేచి నిత్యమూ యే మానవులు వినెదరో వారలకు పరమసిద్ధి కలుగుతుంది. దుస్వస్నాలు నశిస్తాయి. ఓ తపోధనా! గజరాజమోక్షణ గాధ పరమ పవిత్రమైనది. పుణ్య ప్రదమైనది. దీనిని చదివినా, స్మరించినా, వినినా, సర్వ పాపాలు నశిస్తాయి. ఆ క్షణాన్నే! మురారి యొక్క ఈ పావన చరిత్రం సదా గానం చేయతగినది. దీనిని చదివినచో ఆ గజరాజునకు వలెనే సకల పాప బంధాల నుంచీ విముక్తి కలుగుతుంది. అజితుడం వరేణ్యుడు, పద్మనాభుడు, నారాయణుడు, బ్రహ్మ నిధి, సురేశ్వరుడు, పురాణపురుషుడు లోకపతి అయిన శ్రీవల్లభునకు నమస్కరిస్తున్నారు.
పులస్త్య
84 - ఏత త్తవోక్తం ప్రవరం స్తవానాం ।
స్తవం మురారే ర్వర నాగ కీర్తనమ్ ।
యం కీర్త్య సంశ్రుత్య తథా విచింత్య ।
పాపాపనోదం పురుషో లభేత ।
పులస్త్యుడు
నారదా! నీవడిగిన స్తోత్రాలలో మేటి అయిన గజేంద్ర కృత స్తవాన్ని వినిపించాను. దీనిని పాడి విని స్మరించి మానవుడు పాప దూరుడు కాగలడు.
అధ్యాయము 58 Complete
Summary of chapter 62 of the Vāmana Mahā Purana is as follows:
ThePurāṇa relates the inspiring story of Śrīdāmā, a impoverished brāhmaṇa living in extreme poverty who remained completely free from anger, greed, or worldly desire, spending his days immersed in chanting the divine names of Bhagavān Vishṇu. Despite possessing barely enough rag clothing to cover his frame and enduring severe hunger, Śrīdāmā shared whatever meager morsels he received with guests and mendicants. Impressed by his unshakeable faith and pure selflessness, Bhagavān Vishṇu showered Śrīdāmā with boundless earthly wealth, divine wisdom, and eternal residence in Vaikuṇṭha.