అధ్యాయము 16

పులస్త్యుడు

1 - తతః సుకేశిర్దేవర్షే: గత్వా స్వపురముత్తమమ్

 సమాహూయాబ్రవీత్ సర్వాన్ రాక్షసాన్ దార్మికంవచః

2 - అహింసాసత్యమస్తేయం శౌచమింద్రియసంయమః

 దానదయాచాక్షాంతిశ్చ బ్రహ్మచర్యమమానితా

3 – శుభాసత్యాచ మాదురా వాఙ్ నిత్యం    సత్క్రియారతి:

 సదాచార నిషేవిత్వం పరలోక ప్రదాయకాః

4 - ఇత్యూచుర్మునయోమహ్యం ధర్మమాద్యంపురాతనమ్

 సోహమాజ్ఞాపయే సర్వాన్ క్రియతామవికల్పతః

5 - తతఃసుకేశివచనాత్ సర్వ ఏవనిశాచరా:

 త్రయోదశాంగంతేధర్మం చక్రుర్ముదితమానసాః

6 - తతఃప్రవృద్ధింసుతరా మాగచ్చంత నిశాచరాః

 పుత్రపౌత్రార్థసంయుక్తాః సదాచారసమన్వితాః

7 - తజ్జ్యోతిస్తేజసస్తేషాం రాక్షసానాం మహాత్మనాం

 గంతుంనాశక్నువన్ సూర్యో నక్షత్రాణినచంద్రమాః

8 - తతస్త్రిభువతే బ్రహ్మన్ నిశాచరపురో_భవత్

 దివాచంద్రేనసదృశః క్షణదాయాంచసూర్యవత్

9 - నజ్ఞాయతే గతిర్వ్యోమ్ని భాస్కరస్యతతోంబరే

 శశాంకమితి తేజస్త్వా దమన్యంత పురోత్తమమ్

10 - స్వంవికాసం విముంచంతి నిశామితి వ్యచింతయన్

 కమాలాకరేషు కమలామిత్రమిత్యవాగమ్యహి

 రాత్రౌ వికసితా బ్రహ్మన్ విభూతిందాతుమీప్సవః

11 - కౌశికారాత్రిసమయం బుద్ధ్వానిరగమన్ కిల

 తాన్ వాయసాస్తదాజ్ఞాత్వా దివానిఘ్నంతి కౌశికాన్   

12 - స్నాతకాస్త్వాపగాస్వేవ స్నానజప్యపారాయణాః

 ఆకంఠమగ్నాస్తిష్ఠంతి రాత్రౌ జ్ఞాత్వా_థవాసరమ్

13 - నవ్యయుజ్యంతకచక్రాశ్చ తదావైపురదర్శనే

 మన్యమానాస్తుదివస మిదముచ్చైర్ బ్రువంతిచ

14 - నూనంకాంతావిహీనేన కేనచిచ్చక్రపత్రిణా

 ఉత్సృష్టంజీవితంశూన్యే పూత్కృత్య సరితస్తటే

15 - తతోనుకృపయావిష్టో వివస్త్వాంస్తీవ్రరశ్మిభిః

 సంతాపయన్ జగత్ సర్వం నాస్తమేతికథంచన

16 - అన్యేవదంతి చక్రాహ్వో నూనంకశ్చిన్ మృతోభవేత్

 తత్కాంతయాతపస్తప్తం భర్తృశోకార్తయాబత

17 - ఆరాదితస్తుభగవాం స్తపసావై దివాకరః

 తేనాసౌశశినిర్ణేతా నాస్తమేతి రవిర్దృవమ్

పులస్త్యుడు

దేవర్షీ ! అంతట తన నగరంచేరి సుకేశి, ధర్మిష్టులైన రాక్షసుల నందరినీ సమావేశపరచి యిలా అన్నాడు. రాక్షసులారా ! పురాతనం భవ్యమూనైన ధర్మ స్వరూపం నేను మునులు చెప్పగా విన్నాను. దానిని ఎలాంటిసంకోచం లేకుండా మీరందరూ ఆచరించాలని ఆజ్ఞాపిస్తున్నాను. వినండి. అహింస, సత్యం, అస్తేయం (అచౌర్యం ) బ్రహ్మచర్యం అమానిత్వం, శౌచం, ఇంద్రియ సంయమనం, దానం, దయ, క్షాంతి (ఓర్పు), శుభమధుర భాషణం, ఎల్లప్పుడూ మంచి పనులు చేయడంలో ఆసక్తి, సదాచరణం చక్కని నడవడి ఉత్తమలోకాలు కలిగిస్తాయి. సుకేశీ ఆజ్ఞానుసారం ఆ రాక్షసులందరు త్రయోదశాంశాలతో కూడిన ధర్మాన్ని ఎంతో నిష్టతో, సంతోషంతో అనుష్టించసాగారు. ఆ ధర్మాచరణ ప్రభావంతో నిశాచరులు పుత్ర పౌత్రాభివృద్ధి, శక్తి సంత్పదాభివృద్ధి కలిగి పురోగమించారు. రాక్షసులావిధంగా సంపాదించిన ధర్మజ్యోతి తేజస్సు, సూర్య చంద్ర నక్షత్రాల రాకపోకలను నిరోధించింది. విప్రోత్తమా! ఆ రాక్షసుల నగరం ముల్లోకాల్లోనూ పగటివేళ చంద్రుడివలెనూ, రాత్రి సమయాల్లో సూర్యుడివలెను వెలుగసాగింది. తర్వాత ఆకాశంలో సూర్యగమనమే కనిపించలేదు. రాక్షసుల ఆ దివ్య నగరాన్నే అందరూ చంద్రుడుగా భావించసాగారు. ఆ నగరం వెదజిమ్మే వెలుగు వెల్లువలను రాత్రియని భ్రమించి సరోవరాల్లోని కమలాలు వికసించలేదు. అయితే రాత్రివేళల్లో ఆ నగరాన్ని సూర్యుడని యెంచి పద్మాలు వికసించసాగాయి. రాత్రి అనే భ్రమతో బయటకు వచ్చిన గుడ్లగూబలను, పగలుగా భావించి బయలుదేరిన కాకులు చంపసాగాయి. పగలని భ్రమించి రాత్రి వేళల్లో గొంతువరకు నీళ్ళలోనికి దిగి జనులు నదుల్లో స్నానాలు చేస్తూ జపాలు చేసేవారు. ఆ నగర కాంతికి రాత్రిని పగలని భ్రమించిన చక్రవాకాలు విడిపోవడం మానేసి తమలో తామిలా బిగ్గరగా మాటాడుకున్నాయి. “భార్యా వియోగాన్ని సహించలేక ఒక చక్రవాకం నదీతీరాన ప్రాణం విడిచినట్టు తోస్తున్నది. వాటి కరుణ దశకు జాలిపడి సూర్యభగవానుడు క్షణ కాలమైనా అస్తమించకుండా తన తీవ్ర కిరణాలతో జగత్తునంతటినీ యిలా వెలిగిస్తున్నాడు.” మరొక చక్రవాకం “కాదు కాదు, భర్తయైన చక్రవాకం చనిపోతే భర్తృవియోగం భరించలేక చక్రవాకి దీనదీనంగా విలపిస్తూ తపించి ఉంటుంది. దాని తపస్సుకు సంతోషించి, చంద్రుని జయించి సూర్యుడు అస్తమించకుండా ఉన్నాడు. ఇదే ముమ్మాటికీ నిజం.” అన్నది.

18 - యజ్వినో హోమశాలాసు సహఋత్విగ్భి రధ్వరే

 ప్రావర్తయంతకర్మాణి రాత్రావపి మహామునే

19 - మహాభాగావతాః పూజాం విష్ణోః కుర్వంతిభక్తితః

 రవౌశశినిచైవాన్యే బ్రహ్మణో న్యే హరస్యచ

20 - కామినశ్చాప్యమన్యంత సాధుచంద్రమసా కృతమ్

 యదియంరజనీరమ్యా కృతాసతతకౌముదీ

21 - అన్యేబ్రువంల్లోకగురు రాస్మాభిశ్చక్రభృద్వశీ

 నిర్వ్యాజేనమహాగంధై రర్చితః కుసుమైః శుభైః

22 - సహలక్ష్మ్యామహాయోగీ నభస్యాదిచతుర్ష్వపి

 అశూన్యశయనానామ ద్వితీయా సర్వకామదా

23 - తేనాసౌభగవాన్ ప్రీతః ప్రాదాచ్చయనముత్తమమ్

 అశూన్యంచ మహాభోగై రనస్తమిత శేఖరమ్

24 - అన్యేబ్రువన్ ధ్రువందేవ్యా రోహిణ్యాశశినః క్షయమ్

 దృష్ట్వాత ప్తంతపోఘోరం రుద్రారాధనకామ్యయా

25 - పుణ్యాయామక్షయాష్టమ్యాం వేదోక్తవిధినాస్వయం

 తుష్టేనశంభునాదత్తం వరంచాస్యైయదృచ్చయా

26 - అన్యేబ్రువన్ చంద్రమాసా ధ్రువమారాధితో హరిః

 వ్రతేనేహత్వఖండేన తేనాఖండః శశీదివి

27 - అన్యేబ్రువంచ్చశాంకేన ద్రువంరక్షాకృతాత్మనః

 పదద్వయంసమభ్యర్చ్య విష్ణోరమితతేజసః

28 - తేనాసౌదీప్తిమాంశ్చంద్రః పరిభూయదివాకరం

 ఆస్మాకమానందకరో దివాతపతి సూర్యవత్

29 - లక్ష్యతే కారణైరన్యై ర్బహుభిః సత్యమేవహి

 శశాంకనిర్జితః సూర్యోనవిభాతియథాపురా

30 - యథామీకమలాః శ్లక్ష్ణా రణద్ భృంగగణావృతాః

 వికచాఃప్రతిభాసంతే జాతః సూర్యోదయో ధ్రువమ్

31 - యథాచామీవిభాసంతి వికచాః కుముదాకరాః

 అతోవిజ్ఞాయతేచంద్ర ఉదితశ్చ ప్రతాపవాన్

మహామునీ! యాజ్ఞికులు ఋత్విక్కులు రాత్రియైనను యజ్ఞకర్మలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. మహాభాగవతులగు భక్తులు విష్ణుదేవునీ, యితరులు హరబ్రహ్మ సూర్య చంద్రాద్రులను భక్తితో అర్చించసాగారు. ఇక కాముకులకైతే నిరంతరం వెన్నెలతో వెలిగిపోయే పూర్ణిమారాత్రులు ప్రసాదించిన చంద్రుని కార్యమెంతగానో ప్రశంశాపాత్రమైనది. ఇంకను కొందరు “మనమెంతో భక్తి శ్రద్ధలతో మంచి పుష్పగంధాదులతో మహా విష్ణువు నర్చించి యున్నాము. ఆ లక్ష్మీ నారాయణుని “సర్వ కమడాయి అశూన్యశయన ద్వితీయ” సంభవించే శ్రావణ మాసంతో ప్రారంభించి నాలుగు నెలలపాటు ఆరాధించాము. అందుకు సంతోషించి ఆశ్రియః పతి మనకు మహాభోగాలతో కూడి ఎల్లప్పుడు శోభాయామానంగా ఉండే ఉత్తమమైన ఆళూన్య శయన సౌఖ్యం ప్రసాదించాడు” అన్నారు. మరికొందరైతే “కాదు కాదు, తన భర్త చంద్రుని క్షీణ దశకు దుఃఖించి రోహిణీ దేవి శివుని గూర్చి ఉగ్రమైన తపస్సుచేసి, వేదోక్త రీతిలో అక్షయాష్టమినాడా మహాదేవుని ప్రసన్నుని చేసుకోగా ఆయన వెంటనే ఆమెకావరం ప్రసాదించాడు. చంద్రుని క్షయరోగముక్తుని గావించాడు” అని సమాధానం చెప్పుకున్నారు. ఇంకా కొందరు – అదికాదయ్యా, చంద్రుడు శ్రీహరినుద్దేశించి అఖండమైన వ్రతం చేసి ఆయన దయవల్ల కాంతిపుంజంతో దివాకరుని జయించి, ఆకాశంలో సూర్యుని వలే వెలిగిపోతూ మన బోంట్లకు ఆనందం కలుగచేస్తున్నా” డని మరికొందరు తమ నిశ్చితాభిప్రాయం వెల్లడించారు. “ఇంకా మరెన్నియో కారణాల వలన చంద్రుని కోడిపోయి సూర్యుడు పూర్వం మాదిరిగా వెలగలేకపోతున్నాడు; అంతే. ఎందుకనగా భ్రమర ఝంకారాలతో నిండిన ఈ కమలాలు వికసించడం చూస్తే సూర్యుడుదయించియుండుట నిజము. అలాగే వికసించిన కలువలతో నిండిన ఈ కుముదాకరాలు గూడా చంద్రోదయాన్ని చెప్పకుండా చెబుతున్నాయి సుమా!”

32 - ఏవం సంభాషతాం తత్ర సూర్యోవాక్యాని నారదః

 అమన్యత కిమేతద్ధి లోకో వక్తి శుభాశుభమ్

33 - ఏవంసంచిత్యభగవాన్ దధ్యౌధ్యానం దివాకరః

 ఆసమంతాజ్జగద్ గ్రస్తం త్రైలోక్యం రజనీచరైః

34 - తతస్తుభగవాన్ జ్ఞాత్వా తేజసోప్యసహిష్ణుతామ్

 నిశాచరస్యవృద్ధింతా మచింతయత యోగవిత్

35 - తతోజ్ఞాసీచ్చతాన్ సర్వాన్ సదాచారరతా న్శుచీన్

 దేవబ్రాహ్మణ పూజాసు సంసక్తాన్ ధర్మసంయుతాన్

36 - తతస్తురక్షఃక్షయకృత్ తిమిరద్వీపకేసరీ

 మహంశునఖరః సూర్య స్తద్ వఘాతమచింతయత్

37 - జ్ఞాతవాంశ్చతాతాశ్చిద్రo రాక్షసానాందివస్పతిః

 స్వధర్మవిచ్యుతిర్నామ సర్వధర్మవిఘాతకృత్

38 - తతఃక్రోదాభిభూతేన భానునారిపుభేదిభిః

 భానుభీరాక్షసపురం తాద్ దృష్టంఛయథేచ్ఛయా

39 - సభానునా తదాదృష్టః క్రోధాధ్మాతేనచక్షుషా

 నిపపాతాంబరాద్ భ్రష్టః క్షీణపుణ్యఇవగ్రహః

40 - పతమానంసమాలోక్య పురంశాలకటంకటః

 ‘నమోభవాయశర్వాయ!’ ఇదముచ్చైరుదైరయత్

41 - తమాక్రందితమాకర్ణ్య చారణాగగనేచరాః

 హాహేతిచుక్రుశుః సర్వేహరభక్తఃపతత్యసౌ

42 - తచ్చారణవచఃశర్వః శ్రుతవాన్ సర్వగోవ్యయః

 శ్రుత్వా సంచిoతయామాస కేనాసౌపాత్యతేభువి

43 - జ్ఞాతవాన్ దేవపతినా సహస్రకిరణేన తత్

 పాతితం రాక్షసపురం తతః క్రుద్ధస్త్రీలోచనః

44 - క్రుద్ధస్తు భగవంతంతం భానుమంతమపశ్యత

 దృష్టమాత్రస్త్రీణేత్రేణ నిపపాత తతోంబరాత్

నారదా ప్రజలీవిధంగా మాట్లాడుకొనడం చూచి సూర్యుడు తనలో “ఇదేమి! వీరలీవిధంగా నన్నుచూచి శుభాశుభాలు పలుకుచుండుటెందులకని యనుకొనుచు దివాకరుడు ముల్లోకాలు రాక్షసులాక్రమించి యుండుటను గ్రహించెను. అంతట యోగవిదుడైన ఆ భాస్కరుడు నిశాచరుల తేజస్సును అభ్యుదయాన్ని చూచి అందులకుగల హేతువును విచారించి వారందరు సదాచార సంపంన్నులనీ, దేవబ్రాహ్మణ భక్తులనీ ధర్మాను రక్తులనీ అదే వారల అభ్యుదయ హేతువనీ తెలుసుకొనెను. అంధకార గజంపాలిటి సింహం, రాక్షసాంతకుడు, తీక్షణకరనఖరుడు అయిన సూర్యుడా రాక్షసుల వధోపాయమును గురించి యోచించెను. ఆ సహస్రాంశుడు, ధర్మమార్గచ్యుతి ఒక్కటే రాక్షస నిర్మూలనకు మార్గమని గ్రహించి, తన ఆగ్నేయ నేత్రాలతో, క్రోధాభిభూతుడై శత్రువినాశకరాలైన చూపులతో ఆ రాక్షస నగరాన్ని ముంచెత్తాడు. సూర్యుని క్రోధాగ్నికి దగ్ధమై ఆ రాక్షస నగరం, పుణ్య క్షయం పొందిన గ్రహం లాగా ఆకాశాన్నుంచి క్రిందకు బడిపోయెను. తన నగరమా విధంగా నేల కూలుట చూచి యా సుకేశీ ఉచ్చైఃస్వరంతో కరుణంగా, ఓభవా! నీకు నమస్కారం, ఓ శర్వా! నీకు నమస్కారం” అని శంకరుని ప్రార్దించెను. ఆకాశగతులైన చారణులా ఆక్రందనమాలకించి, “అయ్యో! అయ్యో! ఈ మహేశ్వర భక్తుడు పడిపోవుచున్నాడే! అని ఆక్రోశించిరి. సర్వవ్యాపి, అవ్యయుడైన శివుడా చారణుల మాటలు విని తన భక్తుని పడద్రోయువాడెవడా యని ఆలోచించెను. రాక్షస పురాన్ని కూలద్రోసినది సహస్ర కిరణుడు సూర్యుడని గ్రహించినంతనే త్ర్యంబక మహాదేవుడు తన త్రినేత్రంతెరచి సూర్యుని తీక్ష్ణంగా విలోకించెను. హరనేత్రాగ్ని స్పర్శ మాత్ర్రాన్నే ఆ దివాకరుడు ఆకాశం నుంచి క్రిందబడసాగెను.

45 - గగనాత్స పరిభ్రష్టః పథి వాయునిషేవితే

 యదృచ్ఛయానిపతితో యంత్రముక్తోయథోపలః

46 - తతో వాయుపథాన్ముక్తః కింశుకోజ్వలవిగ్రహః

 నిపపాతాంతరిక్షాత్స వృతఃకిన్నరచారణైః

47 - చారణైర్వేష్టితోభానుః ప్రవిభాత్యంబరాత్పతన్

 అర్థపక్వంయథాతాలాత్ ఫలంకపిభిరావృతమ్

48 - తతస్తుఋషయోభ్యేత్య ప్రత్యూచుర్భానుమాలినమ్

 నిపతస్వహరిక్షేత్రే యదిశ్రేయోభివాంఛసి

49 - తతోబ్రవీత్ పతన్నేవ వివస్వాంస్తాంస్తపోధనాన్

 కింతత్ క్షేత్రం హరేః పుణ్యం వదధ్వంశీఘ్రమేవమే

50 - తమూచుర్మునయః సూర్యం శృణుక్షేత్రం మహాఫలమ్

 సాంప్రతంవాసుదేవస్య భావితచ్ఛంకరస్యచ

51 - యోగశాయినమారభ్య యావత్కేశవదర్శనమ్

 ఏతత్ క్షేత్రంహరేః పుణ్యం నామ్నావారాణసీపురీ

52 - తచ్చ్రుత్వాభగవాన్ భాను ర్భవనేత్రాగ్నితాపితః

 వరణాయాస్తథైవాస్యా స్త్వంతరే నిపపాతహ

53 - తతఃప్రదహ్యతితనౌ నిమజ్జ్యాస్యాం లులద్ రవిః

 వరణాయాంసమభ్యేత్య న్యమజ్జత యథేచ్చయా

54 - భూయోసిం వరణాంభూయో భూయోపి వరణామసిమ్

 లులంస్త్రీణేత్రవహ్న్యార్తో భ్రమతేలాతచక్రవత్

55 - ఏతస్మిన్నంతరేబ్రహ్మన్ ఋషయో యక్షరాక్షసాః

 నాగావిధ్యాధరాశ్చాపి పక్షిణోప్సరసస్తథా

56 - యావంతో భాస్కరరథే భూతప్రేతాదయః స్థితాః

 తావంతో బ్రహ్మసదనం గతావేదయితుం మునే

ఆకాశం నుండి భ్రంశం పొంది వడిశెల యంత్రంతో విసరివేయబడిన రాయివలె సూర్యుడు వాయుమండలంలో పడి అక్కడ నుండి తనను పరివేష్టించియున్న కిన్నర చారణులతో బాటు జ్వలించుచున్న కింశుకం లాగ క్రిందకు జారెను. అంతరిక్షం నుంచి ఆ విధంగా చారణులతో గూడి క్రిందపడుతూన్న సూర్యుడు, సగంపండిన కపులచే చుట్టబడిన తాటిపండు లాగ కనిపించెను. పాపమా విధంగా పడి పోతున్న సూర్యుని వద్దకు వచ్చి ఋషులు, ‘నీకు శుభంకలగాలంటే భూమిమీద హరి క్షేత్రంలో వెళ్లి పడుమనిరి. అంత నాతపోధనులను “మహనీయులారా! ఆక్షేత్రమెచట నున్నదో వెంటనే చెప్పుడ”ని క్రిందపడనున్న సూర్యుడు ప్రార్థించెను. అప్పుడా మహర్షులు ఓ భాస్కరుడా ప్రస్తుతం శ్రీ హరికి ప్రీతికరంగా ఉండి భవిష్యత్తులో శివునకు ప్రేమ పాత్రంకాబోయే ఆ క్షేత్రమేదో చెబుతున్నాం వినుము.యోగశాయితో ప్రారంభమై కేశవుని దర్శనం వరకు వ్యాపించియున్న ఆ పవిత్రహరి క్షేత్రమే వారణాశీ నగరం. వారి మాటలు వినిశివ నేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమౌతున్న భాస్కరుడు, వరణా ఆసీవదుల మధ్య ప్రదేశంలో పడిపోయెను. శివనేత్రాగ్ని జ్వాలలకు తట్టుకోలేక సూర్యుడు అసీనదిలో పడి అక్కడ నుంచి దొర్లుకుంటూ పోయి వరణా జలాల్లో మునిగాడు. మరల వరుణ నుంచి అసీ, అసీ నుంచి వరుణ నదుల జలాల్లో మాటి మాటికి అగ్ని చక్రంలాగా ఇష్టం వచ్చినట్లు దొర్లుతూ ఆ జలాల్లో తనమండే శరీరాన్ని తడుపుకోసాగేడు. ఈ లోపున ఓ నారదా! ఋషులు యక్షరాక్షసులు నాగులు విద్యాధరోప్సరసలు పక్షులు భూత ప్రేతాదులందరు కలిసి ఈ వృత్తాంతం విరించికి తెలియచేయుటకు బ్రహ్మలోకానికి వెళ్ళారు.

57 - తతో బ్రహ్మసురపతిం సురైఃసార్థం సమభ్యగాత్

 రమ్యంమహేశ్వరావాసం మందరంరవికారణాత్      

58 - గత్వా దృష్ట్వాచదేవేశం శంకరంశూలపాణినం

 ప్రసాద్యభాస్కరార్థాయ వారాణస్యాముపానయత్

59 - తతో దివాకరంభూయః పాణినాదాయశంకరః

 కృత్వా నామాస్యలోలేతి రథమారోపయత్ పునః

60 - ఆరోపితే దినకరే బ్రహ్మాభ్యేత్య సుకేశినమ్

 సబాంధవంసనగరం పునరారోపయద్దివి       61 - సమారోప్యసుకేశించ పరిష్వజ్యచ శంకరం

 ప్రణమ్య కేశవందేవం వైరాజం స్వగృహంగతః

62 - ఏవంపురానారదః భాస్కరేణ పురం సుకేశిర్భువిసన్ని పాతితమ్

 దివాకరో భూమితలే భవేన క్షిప్తస్తు దృష్ట్వానచసంప్రదగ్ధః

63 - ఆరోపితో భూమితలాద్ భవేన భూయోపిభానుః ప్రతిభాసనాయ

 స్వయంభూవాచాపి నిశాచరేంద్ర స్త్వారోపితః ఖేసపురఃసబంధుః

అంతట దేవపతి బ్రహ్మ శివుని రమణీయ సదనం మందర పర్వతానికి సూర్యుని రక్షించుటకై దేవా గణంతో కూడి బయలుదేరెను. అచట శూలపాణి మహాదేవుని ప్రసన్నుని గావించుకొని, భాస్కరుని రక్షించుటకై వారాణాసీ నగరానికి తోడి తెచ్చెను. మంటల వేడిమికి అటునిటు దొర్లుచున్న సూర్యుని, శివుడు చేతితో స్పృశించి, ఆయనకు ’లోలు’డని (ఈనాడు వారణాశి లో ఆ ప్రదేశం “లోలార్క” కుండం అని పిలవబడుతూంది.) పేరిడి రథముపై గూచ్చుండ బెట్టెను. ఆ విధంగా సూర్యుని పునః ప్రతిష్టితుని గావించి బ్రహ్మసుకేశిని సమీపించి ఆయనను ఆయన నగరంతో బంధు జనులతో సహా మరల దివియందు ప్రతిష్టితుని గావించెను. సుకేశికి పునరావాసం కల్పించి శంకరుని ఆలింగనం చేసికొని విష్ణువుకు నమస్కరించి విరించి తిరిగి తన వైరాజ సదనానికి వెడలిపోయెను. నారదా! ఈ విధంగా పూర్వ కాలాన సుకేశి నగరం సూర్యుని చేత భూమిమీదకు త్రోయబడగా సూర్యుడు హర నేత్రాగ్ని వల్ల దగ్దుడై భూమి మీద పడిపోయినాడు. కరుణామయుడగు, శివుడా సూర్యుని భూమి నుండి ఉద్ధరించి మరల వెలుగు నట్లొనరించెను. కాగా రాక్షసేంద్రుడగు సుకేశిని అతని నగరం పరివారంతో సహా, విరించి మరల అంతరిక్షాన నిలిపినాడు.

అధ్యాయము 16 complete