అధ్యాయము 54

నారద

1 - పురూరవా ద్విజశ్రేష్ఠ ! యథా దేవం శ్రీ యః పతిమ్

నక్షత్ర పురుషాఖ్యేన ఆరాధయత తద్వద

నారదుడు

ఓ విప్రోత్తమా ! శ్రీ యఃపతి యగు వాసుదేవుని పురూరవుడు నక్షత్ర పురుష వ్రతం ద్వారా ఎలా ఆరాధించినదీ చెప్పండి.

పులస్త్య

2 - శ్రూయతాం కథయిష్యామి నక్షత్ర పురుష వ్రతమ్

 నక్షత్రాంగాని దేవస్య యాని యానీహ నారదః

3 - మూలర్క్షం చరణౌ విష్ణో ర్జంఘే ద్వే రోహిణీ స్మృతే

 ద్వే జానునీ తథా శ్విన్యౌ సంస్థితే రూపధారిణః

4 - ఆషాఢే ద్వే ద్వయం చోర్వో ర్గుహ్యస్థం ఫాల్గునీ ద్వయమ్

కటిస్థాః కృత్తికా శ్చైవ వాసు దేవస్య సంస్థితాః

5 - ప్రౌష్ఠపద్యా ద్వయం పార్శ్వే కుక్షిభ్యాం రేవతీ స్థితా

 ఉరః సంస్థా త్వనూరాధా శ్రవిష్ఠా పృష్ఠ సంస్థితా

6 - విశాఖా భుజయో ర్హస్తః కరద్వయ ముదా హృతమ్

పునర్వసు రథాంగుల్యో న ఖాః సార్పం తథోచ్యతే

7 - గ్రీవా స్థితా తథా జ్యేష్ఠా శ్రవణం కర్ణయోః స్థితమ్

ముఖ సంస్థ స్తథాప్యః స్వాతి ర్దంతాః ప్రకీర్తి తాః

8 - హనూ ద్వే వారుణ శ్చోక్తో నా పైత్ర ఉదాహృతః

మృగ శీర్షం నయనయో రూపధారిణి తిష్ఠతి

9 - చిత్రా చైవ లలాటే తు భరణీ తు తధా శిరః

శిరోరుహస్థా చైవార్ద్రా నక్షత్రాంగ మిదం హరేః

పులస్త్యుడు

నారదా ! నక్షత్ర పురుష వ్రత విధానమూ శ్రీహరి నక్షత్రాంగాల వివరమూ చెబుతున్నా వినుము. శ్రీహరి చరణాలలో మూలానక్షత్రం జంఘలలో రోహిణీ నక్షత్రం ఉంటాయి. మోకాళ్లలో అశ్వినులు రూపొందుతాయి తొడలలో ఆషాఢా నక్షత్రం ఉంటే గుహ్యేంద్రియం రెండు ఫల్గునీలకు ఆవాసం. కృత్తికలు నడుము భాగాన ఉంటవి ఆ వాసుదేవుని ప్రక్కల (కక్ష్య)లో భాద్రపద నక్షత్రాలు, కడుపులో రేవతీ నివాసం చేస్తుంటాయి వక్షస్థలం అనూరాధకు, శ్రనిష్ఠకు వీపు నెలవులు. విశాఖ ఆ ప్రభువు భుజాలలో ఉంటే హస్తాల నక్షత్రం రెంఉ చేతులలో ఉంటుంది. వ్రేళ్ళు పునర్వసుకూ, గోళ్లు ఆశ్లేషకు నెలవులు. జ్యేష్ఠా నక్షత్రం స్వామి మెడలోనూ శ్రవణం రెండు చెవులలోను ఉంటవి. నోరు పుష్యమికి ఆవాసం, పలు వరస స్వాతికి నెలవు. వరుకొ దైవతమైన శతభిషా నక్షత్రం దవడల నాశ్రయించి ఉంటే, ముక్కు మొఖకు ఆశ్రయం. మృగశిర నేత్రాల రూపంలో ఉంటుంది లలాట భాగాన చిత్రా, శిరోదేశాన భర్దణి నిలచి ఉంటవి. కేశాల రూపంలో ఆర్ద్రా నక్షత్రం నెలవై యుంటుంది. ఇదే శ్రీ మన్నారాయణుని నక్షత్ర పురుషరూపము.

10 - విథానం సంప్రవక్ష్యామి యధా యోగేన నారద

సంపూజితో హరిః కామాన్ విదధాతి యధేప్సితాన్

11 - చైత్ర మాసే సితాష్టమ్యాం యదా మూల గతః శశీ

తదా తు భగవ త్పాదౌ పూజయేత్ తు విధానతః

నక్షత్ర సంనిధౌ దద్యా ద్విపేంద్రాయ చ భోజనమ్

12 - జానునీ చాశ్వినీ యోగే పూజయే దథ భక్తితః

దోహదే చ హవిష్యాన్నం పూర్వవ ద్ద్విజ భోజనమ్

13 - ఆషాఢాభ్యాంఛ తథా ద్వాభ్యాం ద్వా వూరూ పూజయే ద్బుధః

సలిలం శిశిరం తత్ర దోహదే చ ప్రకీర్తితమ్

14 - ఫాల్గునీ ద్వితయే గుహ్యం పూజనీయం విచక్షణైః

దోదహే చ పయో గవ్యం దేయం చ ద్విజ భోజనమ్

15 - కృత్తికాను కటిః పూజ్యా సోపవాసో జితేంద్రియః

దేయం చ దోహదం విష్ణోః సుగంధ కుసుమోదకమ్

16 - పార్శ్వే భాద్రపదా యుగ్మే పూజయిత్వా విధానతః

గుడం సలేహ్యకం దద్యా ద్దోహదే దేవ కీర్తితమ్

17 - ద్వే కుక్షీ రేవతీ యోగే దోహదే కుసుమోదకాః

అనురాధాసు జఠరం షష్టికాన్నం చ దోహదే

18 - శ్రవిష్ఠాయాం తథా పృష్ఠం శాలిభక్తం చ దోహదేః

భుజయుగ్మం విశాఖాసు దోహదే పర మోదనమ్

19 - హస్తే హస్తే తథా పూజ్యౌ యావకం దోహదే స్మృతమ్

పునర్వసా వంగుళీశ్చ పటోల్తసత్ర దోహదే

20 - ఆశ్లేషాసు నఖాన్ పూజ్య దోహదే తిత్తిరామిషమ్

జ్యేష్ఠాయాం పూజయే ద్గ్రీవాం దోహద తిల మోదకమ్

21 - శ్రవణే శ్రవణౌ పూజ్యౌ దధి భక్తం చ దోహదే

పుష్యే ముఖం పూజయేత దోహదే ఘృత పాయసమ్

22 - స్వాతి యోగే చ దశనా దోహదే తిలశష్కులీ

దాతవ్యా కేశవప్రీత్యై బ్రహ్మణస్య చ భోజనమ్

23 - హనూ శతభిషా యోగే పూజయే చ్చ ప్రయత్నతః

ప్రియంగు రక్త శాల్యన్నం దోహదం మధు విద్విషః

24 - మఘాసు నాసికా పూజ్యా మధు దద్యాచ్చ దోహదే

మృగోత్తమాంగే నయనే మృగమాంసం చ దోహదే

25 - చిత్రా యోగే లలాటం చ దోహదే చారు భోజనమ్

భరణీషు శిరః పూజ్యం చారుభక్తం చ దోహదే

26 - సంపూజనీయా విద్వద్భిః ఆర్ద్రా యోగే శిరోరుహాః

విప్రాంశ్చ భోజయే ద్భక్త్యా దోహదే చ గుడార్ద్రకమ్

27 - నక్షయోగే ష్వేతేషు సంపూజ్య జగతః పతిమ్

పారితే దక్షిణాం దద్యాత్ స్త్రీ పురిసో శ్చారు వాస

28 - ఛత్రోపాన శ్వేత యుగం సప్త ధాన్యాని కాంచనమ్

ఘృత పాత్రం చ మతిమాన్ బ్రాహ్మణాయ నివేదయేత్

ఇక నారదా ! నక్షత్ర రూపంలో వెలిగే ఆ శ్రీవల్లభుని వ్రత విధానం విను. ఆ ప్రకారం ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ ఆ ప్రభువు సఫలం చేస్తాడు. చైత్రశుద్ధ అష్టమినాడు చంద్రుడు మూలా నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు శ్రీహరి దివ్య చరణాలను విధి విపాతంగా పూజించి నక్షత్రం గోచరించినంతనే విప్రులకు భోజనం పెట్టాలి అశ్వనీ యోగంలో చంద్రుడు ఉన్నప్పుడు భక్తితో స్వామి మోకాళ్ళకు పూజించి హవిష్యాన్నం దోహదకారిగా సమర్పించి వెనుకటివలనే బ్రాహ్మణ భోజనం చేయించాలి. పూర్వం ఉత్తరాషాఢంలో చంద్రుడున్నప్పుడు శ్రీహరి రెండు తొడలనూ విజ్ఞుడు పూజించి దోహదకారిగా చల్లని జలము సమర్పించాలి తెలిసిన ఆస్తికుడు పూర్వ ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యోగంలో ప్రభువు గుహ్యం గాని అర్పించి ఆవుపాలు దోహదంగా ఇచ్చి బ్రాహ్మణ భోజనం చయించాలి. చంద్ర కృత్తికా యోగాన జితేంద్రియుడై ఉపవశించి స్వామికటి భాగాన్ని పూజించి పూలవాసనులు వెదజల్లే జలము దోహదంగా అర్పించాలి. శశి పూర్వ ఉత్తరాభాద్రలయోగంలో శ్రీహరి పార్శ్వ భాగాలను (చంకలు) పూజించి ఇష్టసిద్ధికి బెల్లపు ఉండలు అర్పించాలి. శశిరేవతీ యోగంలో రెండు కడుపులను (పై ది కిందిది) పూజించి పెసరలడ్లు దోహదంగా అర్పించాలి. అనూరాధ చంద్రయోగాన జఠరాన్ని పూజించి బియ్యపు పేలాలు దోహదంగా ఇవ్వాలి. శ్రీ విష్టా యోగంలో వీపు భాగాన్ని పూజించి శాల్యన్నం దోహదంగా సమర్పించాలి. విశాఖా యోగాన పరమాన్నం దోహదంతో శ్రీహరి భుజాలు రెండు అర్చించాలి. హస్తా నక్షత్ర యోగంలో రెండు చేతులు పూజించి యవాన్నం దోహదం యివ్వాలి. పునర్వసు యోగాన వ్రేళ్ళు పూజించి దోసపండ్లు దోహదంగా యివ్వాలి. ఆశ్లేషా శశియోగంలో గోళ్ళు పూజించాలి. తిత్తిరిమాంసం దోహదం. జ్యేష్ట్యా చంద్రయోగంలో నూవులడ్డూ దోహదంతో శ్రీహరి మెడను అర్చించాలి. శ్రవణ శశియగంలో స్వామి చెవులను పూజించి పెరుగన్నం దోహదంగా అర్పించాలి. పుష్యయోగంలో ముఖాన్ని పూజించి నేతి పాయసదోహదం అర్పించాలి. స్వాతి చంద్రయోగాన దంతపంక్తిని పూజించి నూవుల వడలు నివేదించాలి. శ్రీ వల్లభుని ప్రీత్యర్థం బ్రాహ్మణ భోజనం చేయించాలి. శతభిషా చంద్ర యోగాన ప్రభువు దవడలను చక్కగా పూజించి ఆ మధుసూదనునకు ఎర్రబియ్యం ప్రియం గవాన్నం దోహదం అర్పించాలి. మృగశిర్ష యోగంలో నేత్రపూజ, లేడి మాంసం దోహదం, చిత్రా యోగంలో లలాట పూజ మృష్టాన్న దోహదం కర్తవ్యాలు. చంద్ర భరణీ యోగంలో శిరస్సును పూజించి రుచ్యమైన అన్నం దోహదంగా యివ్వాలి. విద్వాంసు డార్ద్రా చంద్ర యోగాన స్వామి కేశజాలాన్ని అర్చించి అల్లము, బెల్లముతో చేసిన కుడుములు దోహదంగా నివేదించి విప్రోత్తములకు భోజనం పెట్టాలి. ఈ విధంగా చంద్ర నక్షత్ర యోగాలలో జగన్నాధునుని యథావిథిగా భక్తితో పూజించి వ్రతానంతరము బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి చక్కని వస్త్రాలు ఇవ్వాలి. వర్ధిష్టులైన సజ్జనులు బ్రాహ్మణునకు ఛత్రం, పాదరక్షలు, సప్తవిధాలయిన ధాన్యాలు, బంగారం నేతితో నింపిన పాత్ర, వ్రతోద్యోదాపనగా భక్తితో సమర్పించాలి.

29 - ప్రతి నక్షత్ర యోగేన పూజనీయా ద్విజాతయః

నక్షత్ర మయ ఏవైష పురుః శాశ్వతో మతః

30 - నక్షత్ర పురుషాఖ్యం హి వ్రతానా ముత్తమం వ్రతమ్

పూర్వం కృతం హి భృగుణా సర్వ పాతక నాశనమ్

31 - అంగోపాంగాని దేవర్షే పూజయిత్వా జగద్గురోః

సురూపా ణ్యభిజాయంతే ప్రత్యంగాంగాని చైవ హి

32 - సప్త జన్మకృతం పాపం కుల సంగాగతం చ యత్

పితృ మాతృ సముత్థం చ తత్సర్వం హంతి కేశవః

33 - సర్వాణి భద్రా ణ్యాప్నోతి శరీరారోగ్య ముత్తమమ్

అనంతాం మనసః ప్రీతిం రూపం ఛాతీవ శోభనమ్

34 - వాజ్‌మాధుర్యం తధా కాంతిం యచ్చాన్య దభివాంఛితమ్

దదాతి నక్షత్ర పుమాన్ పూజితస్తు జనార్దనః

35 - ఉపోష్య సమ్య గౌతేషు క్రమేణ క్షషు నారద

అరుంధతీ మహాభాగా ఖ్యాతి మగ్య్రాం జగామ హ

36 - ఆదిత్య స్తనయార్ధాయ నక్షత్రాంగం జనార్దనమ్

సంపూజయిత్వా గోవిందం రేవంతం పుత్ర మాప్తవాన్

37 - రంభా రూప మవాపా గ్య్రం వాజ్ మాధుర్యం చ మేనకా

కాంతిం విధుర వాపాగ్య్రాం రాజ్యం రాజా పూరూరవాః

38 - ఏవం విధానతో బ్రహ్మ న్న క్షత్రాంగో జనార్దనః

పూజితో రూపధారీ యై ప్రాప్తా తు సుకామితా

39 - పత త్తదోక్తం పరమం పవిత్రం ధన్యం యశ్యం శుభ రూప దాయి

నక్షత్ర పుంసః పరమం విధానం శృణుష్వ పుణ్యాం మిహ తీర్థ యాత్రామ

అవ్యయుడైన జనార్దనుడు నక్షత్ర మయుడు. కనుక పూజా క్రమంలో ప్రతి నక్షత్ర యోగాన బ్రాహ్మణార్చన జరగాలి నక్షత్ర పురుష వ్రతం వ్రతాలలో కెల్ల ఉత్తమమైనది. పూర్వకాలంలో భృగుమహర్షి సర్వ పాప హరమైన ఈ వ్రత మాచరించాడు. ఓ దేవర్షీ ! జగన్నాధుని అంగోపాంగాల నీవిధంగా పూజించిన వారల సర్వాంగాలూ సుందరంగా చూడముచ్చటగా ఉంటాయి. ఏడు జన్మలలో చేసిన పాపం కుల క్రమాగతంగా వచ్చిన దోషాలు, తల్లి దండ్రులు చేసిన పాపాలూ అన్ని విధాల పాపాలనూ, ఈ వ్రతం వల్ల సంతోషించి శ్రీధరుడు నశింప చేస్తాడు. మస్త కళ్యాణాలు, ఉత్తమమైన శరీరారోగ్యం, అమితమైన మానసోల్లాసము, చక్కని రూపసాందర్యము మధురమైన వాక్కు సర్వత్రా గౌరవం, యితరా లయిన ఈ ప్సితార్థా లన్నీ నక్షత్ర పురుషుడైన జనార్దనుడు ప్రసాదిస్తాడు నారదా ! ఈ నక్షత్ర యోగాలన్నింటి యందు చక్కగా ఉపవసించి ప్రభువును పూజించి అరుంధతీ దేవి స్త్రీలోకాని కంతకూ పూజ్యు రాలైంది. నక్షత్రాంగ పురుషుని అర్చించి సూర్యదేవుడు, గోవిందుడినే కుమారుడుగా పొందాడు. అతడే రేవంతుడు ఈ వ్రతం చేసి రంభ రూప సౌందర్యాన్నీ, మేనక మధుర మైన వాక్కునూ, చంద్రుడు చక్కని కాంతినీ, పురూరవుడు రాజ్యాన్నీ సంపాదించారు. ఓ నారదా ! ఈ విధంగా నక్షత్రాంగ రూపునిగా జనార్దనుని ఎవ రెవరు పూజించారో వారంతా తమ కోర్కెలు నెరవేర్చు కున్నారు పరమ పవిత్రం, యశోధన రూప ప్రదాయకం, ధన్యతమం అయిన నక్షత్ర పురుష వ్రత విధానం నీకు వినిపించాను. ఇక పవిత్రమైన తీర్ధ యాత్రా వివరణం వినుము.

అధ్యాయము 54 Complete