అధ్యాయము 18

లోమహర్షణ

1 - తతస్త్వౌశనసం తీర్థం గచ్చేత్తుశ్రద్దయాన్వితః

 ఉశనాయత్ర సంసిద్దో గ్రహత్వంచ సమాప్తవాన్

2 - తస్మిన్ స్నాత్వా విముక్తస్తు పాతకైర్జన్మసంభవైః

 తతోయాతి పరంబ్రహ్మ యస్మాన్నావర్తతే పునః

3 - రహోదరో నామ ముని ర్యత్రముక్తోబభూవహ

 మహాతాశిరసాగ్రస్త స్తీర్డ మాహాత్మ్యదర్శనాత్

లోమహర్షణ

అచట నుండి విప్రోత్తములారా! ఔశనస తీర్థానికి శ్రద్దాభక్తులతో వెళ్ళవలెను . అక్కడనే ఉశనసుడు(శుక్రుడు) సిద్దిపొంది గ్రహత్వాన్ని సంపాదించాడు. అక్కడ స్నానం చేస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి నరుడు పునరావృత్తిలేని బ్రహ్మలోకానికి పోతాడు. భయంకరమైన శిరస్సుతో పీడింపబడిన రహోదరుడనేముని అక్కడనే ఆ శిరస్సునుండి విముక్తుడైనాడు.

ఋషులు

4 - కథంరహోదరో గ్రస్తః కథంమోక్షమవాప్తవాన్ ? తీర్థస్యతస్యమాహాత్మ్యమిచ్చామః శ్రోతుమాదరాత్     

ఋషులు

రహోదర మునికి శిరోగ్రహణం ఎలా పట్టింది ? అది ఆ తీర్థ మహిమవల్ల ఎలా తొలగి పోయింది. దయచేసి చెప్పండి.

లోమహర్షణ

5 - పురావైదండకారణ్యే రాఘవేణమహాత్మనా

 వసతాద్విజశార్దూలా రాక్షసా స్తత్ర హింసితాః  ॥

6 - తత్రైకస్యశిరశ్చిన్నం రాక్షసస్య దురాత్మనః

 క్షురేణశితదారేణ తత్సపాతమహావనే

7 - రహోదరస్యతల్లగ్నం జంఘాయాంవై యదృచ్చయా

 వనేవిచర తస్తత్ర ఆస్థిభిత్త్వావివేశహ

8 - నతేనలగ్నే సతదా ద్విజాతి ర్నశశాకహ

 అభిగంతుంమహాప్రాజ్ఞ స్తీర్థాన్యాయతనానిచ

9 - స పూతినావిస్రవతావేదనార్తో మహామునిః

 జగామసర్వతీర్థాని పృథివ్యాం యానికానిచ  ॥

10 - తతఃసకథయామాస ఋషీణాం భావితాత్మనామ్

 తే-బ్రువన్ఋషయోవిప్రంప్రయాహ్యౌశనసంప్రతి

11 - తేషాంతద్వచనంశ్రుత్వా జగామనరహోదరః

 తతస్త్వౌశనసే తీర్థే తస్యోపస్ప్రుశతస్తదా  ॥        

12 - తచ్చిరశ్చరణంముక్త్వా పపాతాంతర్జలె ద్విజాః

 తతః సవిరజోభూత్వా పూతాత్మా వీతకల్మషః  ॥

13 - ఆజగామాశ్రమంప్రీతః కథయామాస చాఖిలం

 తేశ్రుత్వాఋషయస్సర్వే తీర్థమాహత్మ్యముత్తమమ్

 కపాలమోచనమితి నామచక్రుఃసమాగతాః  ॥

లోమహర్షణ

ఓ బ్రాహ్మణులారా! పూర్వం దండకారణ్యంలో ఉన్నప్పుడు మహాత్ముడగు శ్రీరాముడెందరో దుష్టరాక్షసులను సంహరించాడు. అప్పుడొక దుర్మార్గుడి తలను నిశితకరవాలంతో ఖండించగా అదిపోయి ఒక మహారణ్యంలో పడ్డది. ఆ అడవిలో తిరుగుతున్న రహోదరుని తొడకు ఆ రాక్షసుని తలతగిలి ఎముకను చీల్చుకొని లోపల ప్రవేశించింది. తొడ భిన్నమైనందున ఆ బ్రాహ్మణుడు సంకల్పించుకొన్న తీర్ధాలకు వెళ్ళలేకపోయాడు. అలా చీముకారుతున్నప్పటికీ ఆ బాధను సహిస్తూ ఆ బ్రాహ్మణుడు భువిలో గల సర్వతీర్థాలనూ సేవించాడు. దారిలో తాను దర్శించిన ఋషులకు తన బాద తెలుపుకోగా వారాతనిని ఔశనస తీర్థానికి వెళ్ళమని సలహా యిచ్చారు. అంతరహోదరుడక్కడకు వెళ్లి జలస్పర్శ చేయగానే ఆ శిరస్సు ఆయనతొడ నుండి ఊడి నీళ్ళలో పడిపోయింది. అలా అతని బాధ తొలగిపోయి పాపముక్తుడైనాడు. అలా పవిత్రుడై ఆశ్రమానికి తిరిగి వెళ్లి ఆ విషయం అందరకూ వివరంగా చెప్పాడు. అది వినిన ఋషులంతా ఆ తీర్థమహిమకు సంతసించి దానికి కపాలమోచనమని నామకరణం చేశారు.

14 - తత్రాపిసుమహత్తీర్థం విశ్వామిత్రస్య విశ్రుతమ్

 బ్రాహ్మణ్యం లబ్దవాన్ యత్రవిశ్వామిత్రోమహామునిః

15 - తస్మిస్తీర్థవరేస్నాత్వా బ్రాహ్మణ్యం లభతేద్రువమ్

 బ్రాహ్మణస్తు విశుద్దాత్మా పరంపదమవాప్నుయాత్  ॥

16 - తతః పృథూదకం గచ్చే న్ని యతోనియతాశనః

 తత్రసిద్దస్తు బ్రహ్మర్షీ రుషంగుర్నామనామతః  ॥  

17 - జాతిస్మరోరుషంగుస్తు గంగాద్వారేసదాస్థితః

 అంతకాలంతతో దృష్ట్వా పుత్రాన్ వచనమబ్రవీత్

 ఇహశ్రేయోన పశ్యామి నయద్వం మాంపృథూకమ్  ॥

18 - సతైః పుత్రైః సమానీతః సరస్వత్యామ్సమాప్లుతః

 స్మ్రుత్వాతీర్థగుణాన్ సర్వాన్ ప్రాహేదమృషి సత్తమః  ॥

19 - సరస్వత్యుత్తరే తీర్థే యస్త్యజేదాత్మనస్తనుమ్

 పృథూద కేజప్యపరోనూనం చామరతాం వ్రజేత్  ॥       

20 - తత్రైవబ్రహ్మయోన్యస్తి బ్రహ్మణాయత్రనిర్మితా

 పృథూదకం సమాశ్రిత్య సరస్వత్యాస్థటేస్థితః  ॥

21 - చాతుర్వర్ణ్యస్య సృష్ట్యర్థం ఆత్మజ్ఞానపరో-భవత్

 తస్యాభిద్యాయతః సృష్టిం బ్రాహ్మణో-వ్యక్తజన్మనః

22 - ముఖతో బ్రాహ్మణాజాతా బాహుభ్యాంక్షత్రియాస్తథా

 ఊరుభ్యాంవైశ్య జాతీయాః పద్భ్యాంశూద్రాస్తతో-భవన్

23 - చాతుర్వర్ణ్యంతో దృష్ట్వా ఆశ్రమస్థంతతః

 ఏవం ప్రతిష్టితంతీర్థం బ్రహ్మయోనీతిసంజ్ఞితమ్

అక్కడే సుప్రసిద్దమైన గొప్పతీర్థం విశ్వామిత్ర తీర్థం ఉంది. అక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఆ మహాముని తీర్థంలో స్నానంచేస్తే బ్రాహ్మణత్వం లభిస్తుంది. పరిశుద్దాత్ములయిన బ్రాహ్మణులు పరమపదం పొందుతారు. తప్పదు. అక్కణ్ణుంచి మితాహారియై నరుడు పృథూదక తీర్థాని కెళ్ళాలి. అక్కడ రుషంగుడనే బ్రహ్మర్షి సిద్ది పొందాడు. పూర్వజన్మస్మృతి గల్గిన రుషంగుడు మొదట గంగాద్వారంలో ఉండేవాడు. తనకు అంత్యకాలం రానున్నట్లు తెలిసికొని పుత్రులతో యిలా అన్నాడు. ఇక్కడ నాకు శ్రేయస్సు కలుగదు. వెంటనే నన్ను పృథూదక క్షేత్రానికి తరలించండి. తండ్రి భావాన్ని గుర్తించిన కుమారు లాయనను వెంటనే పృథూదకానికి తీసికెళ్లారు. రుషంగుడు సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ తీర్థమహిమను తలంచుకొని యిలా అన్నాడు. సరస్వతి ఉత్తరపుటోడ్డున పృథూదక తీర్థంలో జపం చేస్తూ శరీరం చాలించిన వానికి తప్పక అమరత్వం లభిస్తుంది. అక్కడే బ్రహ్మ నిర్మితమైన బ్రహ్మయోని ఉంది. బ్రహ్మ సరస్వతి తటాన పృథూదకంలో నివసించి చతుర్వర్ణముల సృష్టించేందుకు తగిన ఆత్మజ్ఞానం పొందాడు. అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టించాలని సంకల్పించుకోనినంతనే అతని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఆ నాలుగు వర్ణాల వారిని ఆశ్రమ ధర్మాల్లో అన్నిచోట్ల స్థాపించాడు. ఆ కారణాన ఆ తీర్థం బ్రహ్మ యోనిగా పిలవబడింది. ముముక్షువగునాతడక్కడ స్నానంచేస్తే మరల జన్మ అంటూ పొందడు.

24 - తత్రస్నాత్వాముక్తికామః పునర్యోనింనపశ్యతి

 తత్రైవతీర్థంవిఖ్యాత మవకీర్ణేతినామతః  ॥

25 - యస్మింతీర్థే బకోదాల్భ్యో ధృతరాష్ట్రమమర్షణమ్

 జుహావవాహనైః సార్ధం తత్రాబుధ్యత్తతోనృపః

అక్కడనే అవకీర్ణమనే తీర్థం ఉంది. అక్కడే దాల్భ్యుడైన బకుడు అసహిష్ణుడైన ధృతరాష్ట్రుని అతని బోయీలతో గలిపి యజ్ఞంలో బలియివ్వ సిద్దపడగారాజుకు బుద్ధి వచ్చింది.

ఋషులు

26 - కథం ప్రతిష్టితం తీర్థ మవకీర్ణే తినామతః

 దృతరాష్ట్రే ణరాజ్ఞాచ సకిమర్థంప్రసాదితః  ॥

ఋషులు

ఆ అవకీర్ణ తీర్థమెలా ఏర్పడ్డది? దానిని ధృతరాష్ట్రుడెందులకు సేవించాడని అడిగారు.

లోమహర్షణ

27 - రుషయోనై మిషేయా యే దక్షిణార్థం యయుఃపురా

 తత్రైవచబకో దాల్బ్యో ధృతరాష్ట్రమయాచత  ॥             

28 - తనాపతస్యనిందార్థముక్తం పశ్వనృతంతుయత్

 తతఃక్రోధేనమహతా మామ్సముత్క్రుత్యతత్రహ  ॥         

29 - పృథూద కేమహాతీర్థే అవకీర్ణేతినామతః

 జుహావధృతరాష్ట్రస్య రాష్ట్రం నరపతేస్తతః  ॥

30 - హూయమానేతదా రాష్ట్రే ప్రవృత్తేయజ్ఞ కర్మణి

 అక్షీయత తతో రాష్ట్రం నృపతేర్దుష్క్రుతేనవై  ॥             

31 - తతః సచింయామాస బ్రాహ్మణస్య విచేష్టితమ్

 పురోహితేన సంయుక్తో రత్నాన్యాదాయ సర్వశః  ॥               

32 - ప్రసాదనార్థం విప్రస్య హ్యవకీర్ణం యయౌతదా

 ప్రసాదితః సరాజ్ఞాచ తుష్టః ప్రోవాచతం నృపమ్       

33 - బ్రాహ్మణా నావమంతవ్యాః పురుషేణ విజానతా

 ఆవజ్ఞాతో బ్రాహ్మణస్తు హన్యాత్ త్రిపురుషంకులమ్             

34 - ఏవముక్త్వాశనృపతిం రాజ్యేనయశసాపునః

 ఉత్థాపయామాస తతస్తస్యరాజ్ఞో హితేస్థితః  ॥            

35 - తస్మింస్తీర్థేతుయః స్నాతి శ్రద్దదానో జితేంద్రియః

 సప్రాప్నోతినరో నిత్యం మససా చింతితంఫలమ్               

36 - తత్రతీర్థం సువిఖ్యాతం యాయంతం నామనామతః

 యస్యేహయజమానస్య మధు సుస్రావవైనదీ           

37 - తస్మింస్నాతో నరో భక్త్యా ముచ్యతేసర్వకిల్బి షై:

 ఫలంప్రాప్నోతి యజ్ఞస్య అశ్వ మేధాస్యమానవః  ॥                

38 - మధుస్రవంచతత్రైవ తీర్థం పుణ్య తమంద్విజాః

 తస్మిన్స్నాత్వానరోభక్త్యా మధునాతర్పయేత్  ॥            

39 - తత్రాపిసుమహత్తీర్థం వసిష్టోద్వాహసంజ్ఞితమ్

 తత్రస్నాతోభక్తియుక్తో వాసిష్టం లోకమాప్నుయాత్  ॥            

లోమహర్షణ

పూర్వం ఋషులు నైమిషారణ్య వాసులు, ధృతరాష్ట్రుని వద్దకు దక్షణకై వెళ్ళారు. వారలతరపున దాల్భ్యుడైన బకుడా నరపతిని యాచించాడు. ధృతరాష్ట్రుడు పలికిన నిందాగర్భితమైన అసత్యానికి మండిపడి దాల్భ్యుడైన బరుడు అభిచారిక హోమం ఒకటి పృథూదకక్షేత్రంలోని అపకీర్ణ తీర్థంవద్ద ప్రారంభించి అందులో ధృతరాష్ట్రుని రాజ్యంలో సహా వేల్చేందుకై తనతొడ మాంసాన్ని బయటకు తీసి హోమాగ్నిలో వేశాడు. అలా యజ్ఞం ప్రారంభం కావడంతో అదుష్టుడైన నరపతి రాజ్యం క్షీణించిపోయింది. రాజ్య నాశనానికి చింతాకులితుడైన వెనుక తాను రుషులనవమానించుట జ్ఞప్తికిరాగా భీతుడై తన పురోహితునితోబాటు రత్న రాసులు తీసికొని అపకీర్ణ తీర్థానికి వెళ్లి దాల్భ్యునకవి సమర్పించి పాదాల మీదబడి శరణాగతుడయ్యాడు. అందులకు సంతోషించి ఆ మహర్షి యిలా అన్నాడు. విజ్ఞానియైనవాడు. బ్రాహ్మణులనెన్నడు నవమానించరాదు. బ్రాహ్మణులకు గావించిన అవమానం మూడు తరాలవారిని దహించివేస్తుంది. సుమా . అలా హెచ్చరించి ధృతరాష్ట్రుని రాజ్యాన్నీ అతని కీర్తి ప్రతిష్టలనూ తిరిగి నిలబెట్టాడు. అలాంటి అపకీర్ణంలో విజితేంద్రియుడై శ్రద్ధాసక్తులతో స్నానంచేస్తే చింతిత ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. ఆపైన ప్రసిద్ది చెందిన యాయాత తీర్థం వస్తుంది. యయాతి చక్రవర్తి చేసిన యజ్ఞ ఫలంగా అచ్చట తేనె వాకలు ప్రవహించాయి. అచట భక్తితో స్నానం చేసి సర్వకిల్చిషాలు పోగొట్టుకోవచ్చు. అశ్వమేధ ఫలం పొందవచ్చు. మధుస్రవమనే పవిత్ర తీర్థం అక్కడే ఉంది. అందులో మునిగి పితరులకు తేనెతో తర్పణాదులిచ్చి నరుడు తరించగలడు. అక్కడనే వాసిష్టోద్వాహమనే మహత్తరమైన తీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానం చేసి సర్వకిల్చిషాలు పోగొట్టుకోవచ్చు. అశ్వమేధ ఫలం పొందవచ్చు. మధుస్రవమనే పవిత్ర తీర్థం అక్కడే ఉంది. అందులో మునిగి పితరులకు తేనెతో తర్పణాదులిచ్చి నరుడు తరించగలడు. అక్కడనే వాసిష్టోద్వాహమనే మహత్తరమైన తీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానం చేస్తే వసిష్ఠ లోకం సంప్రాప్తిస్తుంది.

అధ్యాయము 18 complete