వామన మహా పురాణము
అధ్యాయము 45
నారద
1 - మలయేఽపి మహేంద్రేణ యత్కృతం బ్రాహ్మణర్షభ! నిష్పాదితం స్వకం కార్యం ।
తన్మే వ్యాఖ్యాతు మర్హసి ॥
నారదుడు
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! మలయ పర్వతం మీద యింద్రుడు తన స్వంత పనులెలా నిర్వర్తించుకొనెనో ఆ వివరాలు తెలయచెప్పండి.
పులస్త్య
2 - శ్రూయతాం యన్మ హేంద్రేణ।
మలయే పర్వతోత్తమే ।
కృతం లోకహితం బ్రహ్మ।
న్నాత్మనశ్చ తథా హితమ్।
3 - అంధాసురస్యానుచరా।
మయ తార పురోగమాః ।
తే నిర్జితాః సురగణైః।
పాతాళ గమనోత్సుకాః।
4 - దదృశు ర్మలయం శైలం।
సిద్ధాధ్యుషిత కందరమ్ ।
లతా వితాన సంఛన్నం।
మత్త సత్త్వ సమాకులమ్।
5 - చందనై రురగాక్రాంతైః।
సశీతై రభిసేవితమ్ ।
మాధవీ కుసుమా మోదం ।
ఋష్యర్చిత హరం గిరిమ్।
6 - తం దృష్ట్వా శీతల చ్ఛాయం।
శ్రాంతా వ్యాయామ కర్షితాః ।
మయ తారపురోగాస్తే।
నివాసం సమరో చయన్।
7 - తేషు తత్రోపవిష్టేషు।
ప్రాణ తృప్తి ప్రదోఽనిలః ।
వివాతి శీతః శనకై।
ర్దక్షిణో గంధ సంయుతః।
8 - తత్రైవ చ రతించక్రుః।
సర్వ ఏవ మహాసురాః ।
కుర్వంతో లోక సంపూజ్యే।
విద్వేషం దేవతా గణైః।
9 - తాన్ జ్ఞాత్వాశంకరః శక్రం।
ప్రైషయ న్మలయేసురాన్ ।
స చాపి దదృశే గచ్ఛన్।
పథి గోమాతరం హరిః।
10 - తస్యాః ప్రదక్షిణాం కృత్వా।
దృష్ట్వా శైలం చ సుప్రభమ్ ।
దదృశే దానవాన్ సర్వాన్।
సంహృష్టాన్ భోగ సంయుతాన్
11 - తథాజుహావ బలహా।
సర్వానేవ మహాసురాన్।
తే చాప్యాయయు రవ్యగ్రా।
వికిరంతః శరోత్కరాన్।
12 - తానాగతాన్ బాణజాలైః రథ స్థోఽద్భుత దర్శనః।
దఛాయామాసవిప్రర్షే!।
గిరీన్ వృష్ట్యా యథా ఘనః।
13 - తతో బాణై రవచ్ఛాద్య।
మయా దీన్ దానవాన్ హరిః ।
సాకం జఘాన తీక్ష్ణాగ్రై ర్మార్గణైః కంకవాససైః।
14 - తత్ర నామ విభుర్లోభే।
శాసనత్వాశ్చరై ర్దృఢైః ।
పాక శాసనతాం శక్రః।
సర్వామర పతిర్ విభుః।
15 - తథాఽన్యం పురనామానం।
బాణాసుర సుతం శరైః ।
సపుంఖైర్దారయా మాస।
తతోఽ భూత్సపురందరః।
పులస్త్యుడు
ఓ నారదా! మలయ పర్వతానికి వెళ్లి యింద్రుడు నిర్వర్తించిన లోకహిత కార్యమూ తన కార్యమూ చెబుతున్నా వినుము. అంధకాసురుడి అనుచరులలో, యుద్ధంలో ఓడిపోయిన మయ తారాది రాక్షసులు పాతాళానికి వెళ్లవలెనని ఉత్సహించి వెళ్లుతూ దారిలో సిద్ధులకు నివాసాలయిన గుహలతో లతా సమూహాలతో మదించిన మృగాదులతో అలరారే మలయ పర్వతాన్ని చూచారు. మహా సర్పాలతో చుట్టుకొనబడిన చల్లని చందన తరువులతో మాధవీ కుసుమ పరిమళంతో నిండిన ఆ గిరి మీద ఋషులు శివార్చనలు గావిస్తున్నారు. యుద్ధ వ్యాయామంతో అలసి పోయిన మయుడు, తారుడు మొదలయిన రాక్షసుల చ్చటి చల్లని వాతావరణం చూచి ఆ చెట్ల నీడల్లో కూర్చొని యుండగా, సుగంధంతో కూడిన దక్షిణ వాయువు మెల్లగా వీచినది. ఆ సుఖానికి ముగ్ధులై వారచటనే స్థిరంగా ఉండిపోయారు. లోక పూజ్యులైన దేవతలను ద్వేషించ సాగారు. ఆ విషయం తెలిసి కొనిన శివుడు యింద్రుణ్ణీ దేవతలనూ అక్కడకు పంపాడు. దారిలో ఆ దేవరాజుకు కామధేనువు కనిపించగా నాతడా గోమాతకు ప్రదక్షిణం చేసి, అందమైన మలయగిరినీ, అచట యిష్ట భోగాల్లో మునిగియున్న దానవులందరనూ చూచాడు. వెంటనే ఆ బలారి ఆ రాక్షసులను యుద్ధానికాహ్వానించగా వారంతా బాణ వర్షం కురిపిసూ ఆయన మీద కెత్తి వచ్చారు. అద్భుత దర్శనుడైన ఆ శక్రుడు రథం మీద కూర్చొని, ఓ నారదా! కొండలను మేఘాలు కమ్ముకున్నట్లు ఆ దానవులను తన బాణాలతో కప్పి వేశాడు. అలా మయుడు మొదలయిన రాక్షసులను బాణాలతో ముంచెత్తి పాకుడనే మహాసురుణ్ణి వాడిమొనగల్గి గ్రద్ద ఈకలతో అలంకరించబడిన బాణాలతో సంహరించాడు. పాక దానవుని శాసించినందున ఆయన కానాటి నుండి పాక శాసనుడను పేరు కలిగింది. బాణాసుర పుత్రుడైన పురుడనే మరొక రాక్షసవీరుణ్ణి బాణ పరంపరతో చీల్చి చెండాడి పురందరుడనే బిరుదు కూడ పొందాడు.
16 - హత్వేత్థం సమరే జైషీద్‌గోత్ర భిద్దానవం బలమ్ ।
తచ్చాపి విజితం బ్రహ్మన్ !రసాతల ముపాగమత్ ।
17 - ఏతదర్థం సహస్రాక్షః।
ప్రేషితో మలయా చీలమ్ త్య్రంబకేన మునిశ్రేష్ఠ!।
కిమన్య చ్ఛ్రోతు మిచ్చసి? ।
అలా గోత్రభేది చేతిలో వారలు మడిసిన తర్వాత మిగిలిన రాక్షస బలాలు ఓడిపోయి పాతాళానికి వెళ్లిపోయాయి. ఈ పని నిర్వహించేందుకే త్రినేత్రుడు యింద్రుని మలయాచలానికి పంపాడు. ఇంకేమి వినగోరుతున్నావు.
నారద
18 - కిమర్థం దైవతపతిః గోత్రభిత్ కథ్యతే హరిః ।
ఏష మే సంశయో బ్రహ్మన్ హృది సంపరివర్తతే ।
నారదుడు
ఓ బ్రహ్మర్షీ! ఇంద్రునకు గోత్రభేది యను పేరేల కలిగెనో చెప్పి నాసంశయం తీర్చండి.
పులస్త్య
19 - శ్రూయతాం గోత్రఖిచ్ఛక్రః కీర్తితో హి యధా మయా హతే హిరణ్యకశిపౌ యచ్చకారా రిమర్దనః ।
20 - దితిర్వినష్ట పుత్రా తు కశ్యపం ప్రాహ నారద ।
విభో నాథోఽసి మే దేహి శక్రహంతార మాత్మజమ్ ।
21 - కశ్యప స్తా మువాచాఽథ యది త్వమసితేక్షణే ।
శౌచాచార సమాయుక్తా స్థాస్యసే దశతీ ర్దశ ।
22 - సంవత్సరాణాం దివ్యానాం తత స్త్రైలోక్యనాయకమ్ ।
జనయిష్యసి పుత్రం త్వం శత్రుఘ్నం నాన్యథా ప్రియే ।
23 - ఇత్యేవముక్తా సాభర్త్రా దితి ర్నియమ మాస్థితా ।
గర్భాధానం ఋషిః కృత్వా జగామోదయ పర్వతమ్ ।
24 - గతే తస్మిన్ ముని శ్రేష్ఠే సహస్రాక్షోఽపి సత్వరమ్ ।
తమాశ్రమ ముపాగమ్య దితిం వచన మబ్రవీత్ ।
25 - కరిష్యామ్యనుశుశ్రూషాం భవత్యా యది మన్యసే ।
బాఢ మిత్యబ్రవీ ద్దేవీ భావి కర్మ ప్రచోదితా ।
26 - సమిదాహరణాదీని తస్యాశ్చ క్రే పురందరః ।
వినీతాత్మా చ కార్యార్థీ ఛిద్రాన్వేషీ భుజంగవత్ ।
27 - ఏకదా సా తపోయుక్తా శౌచే మహతి సంస్థితా ।
దశవర్ష శతాంతే తు శిరః స్నాతా తప స్వినీ ।
28 - జానుభ్యా ముపరిస్థాప్య ముక్త కేశా నిజం శిరః ।
సుష్వాప కేశప్రాంతైస్తు సంశ్లిష్ట చరణాఽభవత్ ।
29 - తమంతర మశౌచస్య జ్ఞాత్వా దేవః సహస్రదృక్ ।
వివేశ మాతు రుదరం నాసారంధ్రేణ నారద! ।
30 - ప్రవిశ్య జఠరం క్రుద్ధో దైత్య మాతుః పురందరః ।
దదర్శోర్ధ్వ ముఖం బాలం కటిన్యస్తకరం మహత్ ।
పులస్త్యుడు
నారదా! ఇంద్రుడు హిరణ్యకశిపు మరణానంతరం ఏమి చేసినదీ గోత్రభేది ఎలా అయినది సావధానంగా వినుము. తన కుమారులు చంపబడుట చూచి దితి కశ్యప మహర్షిని చేరి, నాధా! నా భర్తవగు నీవు నాకు ఇంద్రుని వధించగల పుత్రుని అనుగ్రహించుమని ప్రార్ధించింది. అందులకా కశ్యప మహర్షి, ప్రియురాలా! నీవు వంద దివ్య సంవత్సరాలు శుచిగా ఆచారానుష్ఠానం చేసినచో శత్రుహంత లోకాధిపతి అయిన పుత్రుడు కలుగుతాడని చెప్పగా నాదితి అందుకు సమ్మతించినది. అంతనా బ్రహ్మర్షి యీమెకు గర్భాదానం చేసి తాను ఉదయగిరికి వెళ్లిపోయాడు. ఆ ముని వెళ్లిన వెంటనే సహస్రాక్షుడాశ్రమంలో చేరి, దితిని సమీపించి అమ్మా! నీ వంగీకరిస్తే ఈ స్థితిలో నీకు శుశ్రూష చేస్తానమ్మా అని అడిగాడు. అందుల కామె మంచిదని ఒప్పుకోగా ఆ పురందరుడు అత్యంత వినయంతో సమిధలు ఆకులు ఆమెకు తెచ్చియిస్తూ బిలం కోసం వెదకే మహావిషసర్పంలాగా, కార్యార్థియై ఆమెను కనిపెట్టి ఉన్నాడు. అలా తపోనిష్ఠలో ఉండగా, పది వందలేండ్లు పూర్తి కానుండగా ఆ తపస్విని తలకు స్నానం చేసి జుట్టు విరబోసికుని మోకాళ్లమీద తల ఆనించి, వెంట్రుకలు పాదాలకు తాకునట్లు వంగి చిన్న కుసుకు తీసినది. అలా ఆమె అశుచిగా ఉండటం గమనించి వెంటనే ఆ సహస్రాక్షుడామె ముక్కరంధ్రాల్లో గుండా మాతృజఠరంలో ప్రవేశించాడు. అక్కడ నడుము మీద చేతులుంచుకుని పైకి చూస్తూ తేజస్వి అయిన శిశువును చూచాడు. ఆ బాలుని ముఖం మీద శుద్ధ స్పటికం లాంటి మాంసపేశి (ముక్క)ని చూచి రెండు చేతులతో పట్టుకొని కోపంతో ఆ శక్రుడు గట్టిగా నలిపాడు. అది పైభాగాన క్రింది భాగాన సాగి పెద్దదై నూరంచులుగల వజ్రంగా మారింది.
31 - తస్యేవా స్యేఽథ దదృశే పేశీం మాంసస్య వాసవః ।
శుద్ధ స్ఫటిక సంకాశాం కరాభ్యాం జగృహేఽథ తామ్ ।
32 - తతః కోప సమాధ్మాతో మాంసపేశీం శతక్రతుః ।
కరాభ్యాం మర్దయామాస తతః సా కఠినాఽభవత్ ।
33 - ఊర్ధ్వేనా ర్ధంచ వవృధే త్వధోఽర్ధం వవృధే తథా ।
శత పర్వాఽథకులిశః సంజాతో మాంసపేశితః ।
34 - తేనైవ గర్భం దితిజం వజ్రేణ శతపర్వణా ।
చిచ్ఛేద సప్తథా బ్రహ్మన్! స రురోద చ విస్వరమ్ ।
35 - తతోఽప్యబుధ్యత దితి రజానా చ్ఛక్రచేష్టితమ్ ।
శుశ్రావ వాచం పుత్రస్య రుదమానస్య నారద! ।
36 - శక్రోఽపి ప్రాహ మా మూఢ! రుదస్వేతి సుఘర్ఘరమ్ ।
ఇత్యేవము క్త్వాచైకైకం భూయశ్చిచ్చేద సప్తథా ।
37 - తే జాతా మరుతో నామ దేవభృత్యాః శత క్రతోః ।
మాతు రేవా పచారేణ చలంతే తే పురస్కృతాః ।
38 - తతః సకులిశః శక్రో నిర్గమ్య జఠరాత్తదా ।
దితిం కృతాంజలిపుటః ప్రాహ భీతస్తు శాపతః ।
39 - మమాస్తినాఽపరాధోఽయం య చ్ఛస్త స్తనయ స్తవ తవై వాపనయాచ్ఛస్త స్తన్మే న క్రోద్ధు మర్హసి ।
ఓ నారదా! ఆ వజ్రంతోనే ఆ శక్రుడు దితి గర్భంలోని శిశువును ఏడు ముక్కలుగా ఖండించాడు. ఆ శిశువు కీచు గొంతుతో ఏడ్చాడు. మూర్ఖుడా! అలా కర్కశ ధ్వనితో ఏడువకుమంటూ మరల ఆ ఏడు ఖండాలను ఒక్కొక్కటి ఏడు ముక్కలుగా ఖండించాడు - ఆ ఏడుపు విని దితి మేల్కొని ఇంద్రుని దుశ్చేష్టితం తన పుత్రుని రోదనంగా తెలుసుకున్నది. "మారుద""మారుద" ఏడవకుము ఏడవకుమంటూ ఇంద్రుడు ఖండించినందువలన ఆ నలభై తొమ్మిదిమంది మరుత్తులు అయ్యారు. తల్లి గావించిన అపచారం వల్ల అలా జన్మించి ఇంద్రుని భృత్యులై ముందు (వాయువులై) నడుస్తూ ఉంటూరు. అంతట వజ్రపాణియై మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చి శాపభయంతో దితి ఎదుట చేతులు జోడించి నిలచి- తల్లీ! నీకుమారుని మృతికి నేను కారణం కాదమ్మా. నీవు అశుచివైనందుననే యిలా జరిగినది. నా మీద కోపపడకు తల్లీ! అని అర్ధించెను.
దితి
40 - నతావా త్రా పరాధోఽస్తి మన్యే దిష్ట మిదంపురా ।
సంపూర్ణేత్వపి కాలే యాఽశౌచత్వ ముపాగతా ।
దితి
"యిందులో నీ తప్పు లేదు బాబూ! దైవవిధియే యిలా ఉన్నది. కాకపోతే వ్రత పరిసమాప్తి దశలో నేనశుచిగా ఎందుకు ప్రవర్తించాలి! అని సమాధానపడినది.
పులస్త్య
41 - ఇత్యేవముక్త్వా తాన్ బాలాన్ పరిసాంత్వ్యదితిః స్వయమ్ ।
దేవారాజ్ఞా సహైతాంస్తు ప్రేషయామాస భామినీ ।
42 - ఏవం పురా స్వానపి సోదరాన్।
సగర్భస్థితా నుజ్జరితుం భయార్తః ।
బిభేద వజ్రేణ తతః సగోత్రభిత్ ।
ఖ్యాతో మహర్షే! భగవాన్ మహేంద్రః ।
పులస్త్యుడు
అంతట నాదితి ఆ బాలకులను సముదాయించి యింద్రుని వెంట పంపి వేసినది. నారదా! ఇలా పూర్వకాలంలో భయార్తుడై తన కుటుంబానకి (గోత్రానికి) చెందిన స్వంత సోదరులనే వజ్రంతో భిన్నం చేసినందున భగవంతుడైన మహేంద్రుడు గోత్రభిత్తుగా పిలువబడినాడు.
అధ్యాయము 45 Complete
Summary of chapter 47 of the Vāmana Mahā Purana is as follows:
As the demonic host threatens Mount Kailāsa, the devas and Maharshis offer transcendent prayers to Parameśvara Śiva, invoking His supreme form as Sadāśiva, the eternal, five-faced, ten-armed controller of creation. Parameśvara Śiva reveals His glorious vision of Sadāśiva to the assembled devas, filling their hearts with boundless courage, divine light, and absolute conviction in the triumph of Dharma. Emboldened by this supreme vision, the divine forces step forward onto the battleground, ready to execute the divine will against the invading dark armies.