అధ్యాయము 2

ఋషులు

1 - బ్రూహి వామనమహాత్మ్య ముత్పత్తించ విశేషతః

 యథా బలిర్నియమితోదత్తం రాజ్యంశతక్రతోః  ॥

ఋషులు

ఓ మహర్షీ! యిక వామన మహాత్మ్యం, ఆయన జన్మ విశేషం, బకిబ్ని నిగ్రహించి అతని రాజ్యాన్ని యింద్రున కిచ్చిన గాథ వినిపింపుడు.

లోమహర్షణ

2 - శృణుధ్వంమునయః ప్రీతావామనస్య మహాత్మనః

 ఉత్పత్తించప్రభావంచ నివాసం కురుజాంగలే

3 - తదేవవంశందైత్యానాం శ్రుణుధ్వం ద్విజసత్తమాః

 యస్య వంశే సమభవద్బలి ర్వైరోచనిః పురా

4 - దైత్యానామాదిపురుషో హిరణ్యకశిపుఃపురా

 తస్యపుత్రోమహాతేజాః ప్రహ్లాదోనామదానవః

5 - తస్మాద్వైరోచనోజజ్ఞే బలిర్జజ్ఞే విరోచనాత్

 హతేహిరణ్యకశిపౌ దేవానుత్సార్య సర్వతః

6 - రాజ్యంకృతంచతేనేష్టం త్రైలోక్యే సచరాచరే

 కృతయాత్నేషుదేవేషు త్రైలోక్యే దైత్యతాంగతే   

7 - జాయే తథా బలవతో ర్మయశంబరయోస్తథా

 శుద్ధాసుదిక్షుసర్వాసు ప్రవృత్తే ధర్మకర్మణి

8 - సంప్రవృత్తే దైత్యపథే ఆయనస్థే దివాకరే

 ప్రహ్లాదశంబరమయై రనుహ్రాదేన చైవహి

9 - దిక్షు సర్వాసుగుప్తాసు గగనే దైత్య పాలితే

 దేవేషుమఖశోభాం చ స్వర్గస్థాం దర్శయత్సు చ

10 - ప్రకృతిస్థే తతోలోకే వర్తమానేచ సత్పథే

 అభావేసర్వపాపానాం ధర్మభావే సదోత్థితే

11 - చతుష్పాదేస్థితే ధర్మే హ్యధర్మే పాదవిగ్రహే

 ప్రజాపాలనయుక్తేషు భ్రాజమానేషు రాజసు

 స్వధర్మసంప్రయుక్తేషు తథాశ్రమనివాసిషు

12 - అభిషిక్తో_సురైః సర్వై ర్దైత్య రాజ్యే బలిస్తదా

 హృష్టేష్వసురసంఘేషు నదత్సు ముదితేషు చ

13 - అథాభ్యుపగతా లక్ష్మీర్బలిం పద్మాంతరప్రభా

 పద్మోద్యత కరాదేనీ వరదా సుప్రవేశినీ

లోమహర్షణ

ఓ మునులారా! మహాత్ముడగు వామన దేవుని ఉత్పత్తిని, గొప్పతనాన్ని ఈ కురుజాంగల భూమిలో నివాసం మొదలయినవి చెబుతాను. ప్రేమతో వినండి. ప్రాచీనకాలంలో విరోచన పుత్రుడు బలిరాజు ఆవిర్భవించిన దైత్యవంశానికి హిరణ్యకశిపుడు మూలపురుషుడు. ఆయన కుమారుడు మహాతేజస్వి ప్రహ్లాదుడను దానవుడు. ఆయన కొడుకు విరోచనుడు. బలి ఆ విరోచనుని పుత్రుడు. దేవతలనందరను జయించి హిరణ్యకశిపుడు మరణించిన అనంతరం ఆ వంశంవారు మూడు లోకాలను నిష్కంటకంగా పాలించసాగారు. వారలను నిర్జించుటకు దేవతలు చేసిన యత్నాలేవీ ఫలించలేదు. బలవంతులైన మయుడు, శంబరుడు విజేతలయ్యారు. దిక్కులన్నీ స్వచ్చమయ్యాయి. ప్రజలంతా ధర్మకార్యాలలో నిమగ్నులయ్యారు, దైత్య విధానం సర్వత్రా వ్యాపించింది. సూర్యుడు ఆయన పథాన్ని చేరుకున్నాడు. ప్రహ్లాద మయ శంబర అనుహ్లాదులు చతుర్దిక్కులను గగన వీథిని చక్కగా రక్షించ సాగారు. వారి ఏలుబడిలో దేవతలు యజ్ఞశోభను నలువైపులా వెదజల్లసాగారు. ఈ విధంగా లోకాలన్నీ శాంతిసౌఖ్యాలతో సత్పథానధర్మాచరణం చేస్తుండగా పాపాలన్నీ హరించుకుపోయి ధర్మ ధేనువు నాలుగుపాదాలతో విస్తరించసాగినది. అధర్మం ఒంటికాలిమీద నిలచిపోయింది. రాజులంతా ప్రజాపాలనం ధర్మయుక్తంగా ఆశ్రమవ్యవస్థను పరిరక్షిస్తూ చేసేవారు. ప్రజలంతా తమతమ విధులు చక్కగా నిర్వహించేవారు. అలాంటి పరిస్థితులలో బలి దైత్యరాజ్యాభిషిక్తుడైనాడు. దైత్యగణాల్లో ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి. అంతట కమల కోమల గర్భగౌరీ, వరదాయిని అయిన లక్ష్మీ దేవి పైకెత్తిన చేతులలో పద్మములు పట్టుకుని మంగళప్రదమైన రాకతో బలిని సమీపించెను.

శ్రీలక్ష్మీదేవి

14 - బలే బలవతాం శ్రేష్ఠ దైత్యరాజమహాద్యుతే

 ప్రీతా_స్మి భద్రంతే దేవరాజపరాజయే

15 - యత్త్వయా యుధి విక్రమ్య దేవరాజ్యం పరాజితమ్

 దృష్ట్వా తే పరమం సత్వం తతో_హం స్వయమాగతా

16 - నాశ్చర్యం దానవవ్యాఘ్ర హిరణ్యకశిపోః కులే

 ప్రసూతస్యాసురేంద్రస్య తవ కర్మేదమీదృశమ్

17 - విశేషతస్త్వయా రాజన్ దైత్యేంద్రః ప్రపితామహః

 యేనభుక్తంహినిఖిలం త్రైలోక్యమిదమవ్యయమ్

18 - ఏవముక్త్వాతుసాదేవి లక్ష్మీర్దైత్యనృపం బలిం

 ప్రవిష్టావరదాసేవ్యా సర్వదేవమనోరమా        

19 - తుష్టాశ్చదేవ్యఃప్రవరాః హ్రీః కీర్తిర్ద్యుతిరేవచ

 ప్రభాధృతిఃక్షమాభూతిర్ బుద్ధిర్దివ్యామహామతిః

20 - శ్రుతిః స్మృతిరీడాకీర్తిః శాంతిః పుష్టిస్తథాక్రియా

 సర్వాశ్చాప్సరసోదివ్యా నృత్తగీతవిశారదాః

21 - ప్రపద్యంతేస్మ దైత్యేంద్రం త్రైలోక్యం సచరాచరమ్

 ప్రాప్తమైశ్వర్యమతులం బలినా బ్రహ్మవాదినా

శ్రీలక్ష్మీదేవి

దైత్యేశ్వరుడవు మహాతేజస్వియగునో బలీ! బలవంతులలో నరిష్ఠుడవగు నీవు యింద్రుని జయించి నందులకు నేను ప్రీతురాలనైతిని. నీకు మేలగుకాక. యుద్ధంలో విక్రమించి దేవరాజును ఓడించావు. అలాంటి నీ ధైర్యసాహసాలు చూచి నేనే స్వయంగా వచ్చాను. అసురేంద్రుడైన హిరణ్యకశిపుని వంశంలో జన్మించిన నీ పట్ల ఈ అద్భుతకార్యం తగియేయున్నది. యిందులో ఆశ్చర్యం లేదు. ణీ ప్రపితామహుని కీర్తికి నీవు ఈ విధంగా వన్నె తెచ్చావు. ఆ దైత్యేంద్రుడు ముల్లోకాలను ఆక్రమించి అనుభవించాడు. ఇలా ప్రశంసించి ఆ లక్ష్మీ దేవి వరదాయిని సర్వదేవ సేవితురాలు సమస్త దేవసుందరి దైత్యవల్లభుడగు నాబలిలో ప్రవేశించింది. వెనువెంటనే హ్రీ కీర్తి ద్యుతి ప్రభ ధృతి, క్షమ, భూతి బుద్ధి మహామతి శృతి స్మృతి ఇడ శాంతి పుష్టి క్రియ మొదలగు శ్రేష్ఠదేవీగణం సంతోషంతో ఆమెననుసరించారు. నృత్యగీతాల్లో ప్రవీణులైన అప్సరసలంతా ఆ బలిచక్రవర్తిని ఆశ్రయించారు. ఈ విధంగా బ్రహ్మవాదియగు నాదైత్యపతి ముల్లోకాల ఐశ్వర్యాన్నంతటిని తనకు పాదాక్రాంతం చేసుకున్నాడు.

అధ్యాయము 2 complete