వామన మహా పురాణము
అధ్యాయము 34
నారద
1 – క్వగతః శంకరోహ్యాసేద్యే నాంబానందినాసహ ।
అంధకం యోధయామాస ఏతన్మేవ క్తుమర్హసి
పులస్త్య
2 - యదావర్ష సహస్రంతు మహామోహేస్థితోఽభవత్ ।
తదాప్రభృతి నిస్తేజాః క్షీణవీర్యః ప్రదృశ్యతే ॥
3 - స్వమాత్మానం నిరీక్ష్యాథ నిస్తేజోంగో మహేశ్వరః ।
తపోర్థాయతదాచక్రే మతింమతి మతాంవరః ॥
4 - సమహావ్రతము త్పాద్య సమాశ్వాస్యాంబికాం విభుః ।
శైలాదింస్థాప్య గోప్తారం విచచారమహీతలమ్ ॥
5 - మహాముద్రార్పితగ్రీవో మహాహికృతకుండలః ।
ధారయాణః కటీదేశే మహాశంఖస్య మేఖలామ్ ॥
6 – Missing content (Slokas 6-33)
34 - బాఢమిత్యాహ భగవాన్ బ్రహ్మాలోకపితామహః ।
తతోఽభ్యాగాన్మహాతేజా మురః సురగిరింబలీ ॥
35 - సమేత్యాహ్వయతేదేవం యక్షం కిన్నరమేవవా ।
నకశ్చిద్యుయుధే తేన సమందైత్యేన నారద ॥
36 - తతోఽమరావతీం క్రుద్ధః సగత్వాశక్రమాహ్వయత్ ।
నచాస్య సహయోద్ధుంవై మతించక్రేపురందరః ॥
37 - తతః సకరముద్యమ్య ప్రవివేశామరావతీమ్ ।
ప్రవిశంతం నతంకశ్చి న్ని వారయితు ముత్సహేత్ ॥
38 - సగత్వాశక్రసదనం ప్రోవాచేంద్రం మురస్తదా ।
దేహియుద్ధం సహస్రాక్ష నోచేత్ స్వర్గంపరిత్యజ ॥
39 - ఇత్యేవ ముక్తోమురుణా బ్రహ్మన్ హరిహయస్తదా ।
స్వర్గరాజ్యం పరిత్యజ్య భూచరః సమజాయత ॥
40 - తతోగజేంద్రకులిశౌ హృతౌశక్రస్య శత్రుణా ।
సకలత్రో మహాతేజాః సహదేవైః సుతేనచ ॥
41 - కాళింద్యాదక్షిణేకూలే నివేశ్యస్వపురంస్థితః ।
మురుశ్చాపి మహాభోగాన్ బుభుజేస్వర్గ సంస్థితః ॥
42 - దానవాశ్చాపరే రౌద్రా మయతార పురోగమాః ।
మురమాసాద్యమోదంతే స్వర్గేను కృతినోయథా ॥
43 - సకదాచిన్మ హీపృష్ఠం సమాయాతోమహాసురః ।
ఏకాకీకుంజరారూఢః సరయూం నిమ్నగాంప్రతి ॥
44 - ససరయ్వాస్తటేవీరం రాజానం సూర్యవంశజమ్ ।
దదృశేరఘునామానం దీక్షితం యజ్ఞకర్మణి ॥
45 - తముపేత్యాఽబ్రవీద్దైత్యో యుద్ధంమేదీయతామితి ।
నోచేన్నిర్వర్తతాం యజ్ఞో నేష్టవ్యాదేవతా స్త్వయా ॥
46 - తముపేత్య మహాతేజా మిత్రావరుణసంభవః ।
ప్రోవాచబుద్ధిమాన్ బ్రహ్మన్ వసిష్ఠ స్తపతాంవరః ॥
పులస్త్యుడు
నారదా! పాపనాశకము పుణ్యవహము విచిత్రమూ నైన మురాసుర వధ వృత్తాంతం చెబుతున్నా వినుము. కశ్యప మహర్షికి దనువువల్ల మురాసురుడనే దానవుడు కలిగాడు. ప్రముఖులైన దేవతల చేతుల్లో దైత్యులందరు హతులుగావడంచూచి చావుకు భయపడి వాడనేక సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. వాని తపస్సుకు సంతోషించి పితామహుడు వత్సా! వరం కోరుకో అన్నాడు. అందుకు వాడు పితామహా! నేనెవరిని చేతితో తాకుదునో వారు అమరులైనా సరే యుద్ధంలో చనిపోవునట్లు వరమివ్వండి అని అర్థించాడు. బ్రహ్మ అట్లేయని అంతర్ధానమై పోయాడు. అంతట నా దానవుడు దేవ నివాసమైన (మేరు) పర్వతానికి వెళ్ళి దేవ యక్ష కింనరాదులను యుద్ధానికాహ్వానిస్తే ఎవరూ యుద్ధానికి రాలేదు. అంతట కోపంతో వాడమరావతికి వెళ్ళి ఇంద్రుని యుద్ధానికి పిలవగా నతడా దానవునితో పోరాడుటకు సమ్మతించలేదు. అంతవాడు చేతిని పైకిఎత్తి అమరావతీ నగరంలోకి చొచ్చుకొని పోగా ఎవ్వరూ నిరోధించలేదు. నేరుగా యింద్రుని సదనానికి వెళ్ళి ఆమురుడు నాతో యుద్ధమైనా సాగించు లేదా అమరావతి వదలి వెళ్ళిపో అని నిలదీశాడు. నారదా! వేరే మార్గం లేక దేవేంద్రుడమరావతి వదలి భూలోకానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడి సింహాసనంతోబాటు ఐరావత గజాన్ని వజ్రాయుధాన్ని వాడపహరింపగా నా సురపతి భార్యాబిడ్డలు దేవతలు తోడురాగా యమునా నది దక్షిణతీరానికి వెళ్ళి తనకొక నగరాన్ని నిర్మించుకొన్నాడు. మురాసురుడు సకల భోగాలనుభవిస్తూ స్వర్గంలో ఉండిపోయాడు. మయుడు తారుడు మొదలయిన యితర దనుజులు గూడ మురాసురుని వద్దకు వెళ్ళి స్వర్గ సుఖాలనుభవించసాగారు. ఆ దానవుడొక పర్యాయం వంటరిగా భూసంచారం చేస్తూ, గజారూఢుడై సరయూనదికి వెళ్ళాడు. ఆ నదీతీరాన యజ్ఞదీక్షితుడై యున్న సూర్యవంశ నృపతి రఘుమహారాజును చూచి, నాతో యుద్ధం చేయాలి లేదా ఈ యజ్ఞాన్ని మానుకోవాలి. దేవతలను యిక ఎంత మాత్రం యజ్ఞాలతో ఆరాధించడం పనికిరాదని శాసించాడు. అది చూచి మిత్రావరుణతనయుడైన వశిష్ఠుడు మహాతపస్వి ఆ దానవుని సమీపించి యిలా అన్నాడు.
47 - కింతేజితైర్నరైర్దైత్య అజితాననుశాసయ ।
ప్రహర్తు మిచ్ఛసియది తం నివారయ చాంతకమ్ ॥
48 - సబలీశాసనం తుభ్యం నకరోతిమహాసుర ।
తస్మింజితే హివిజితం సర్వం మన్యస్వభూతలమ్ ॥
49 - సతద్వసిష్ఠవచనం నిశమ్య దనుపుంగవః ।
జగామ ధర్మరాజానం విజేతుందండపాణినమ్ ॥
50 - తమాయాంతం యమః శ్రుత్వా మత్వాఽవధ్యంచసంయుగే ।
ససమారుహ్య మహిషం కేశవాంతికమాగమత్ ॥
51 - సమేత్య చాభివాద్యైనం ప్రోవాచమురచేష్టితమ్ ।
సచాహగచ్చ మామద్య ప్రేషయస్వమహాసురమ్ ॥
52 - సవాసుదేవవచనం శ్రుత్వాఽభ్యాగాత్ త్వరాన్వితః ।
ఏతస్మిన్నంతరే దైత్యః సంప్రాప్తో నగరీంమురః ॥
53 - తమాగతం యమః ప్రాహ కిం మురోకర్తుమిచ్ఛసి? ।
వదస్వవచనం కర్తా త్వదీయం దానవేశ్వర ॥
"దైత్యవీరా ! మానవుల జయించు నందున ప్రయోజనమేమి ? అజేయులైన వారలను శాసించుము. నిజంగా యుద్ధం చేయాలనుకుంటే యమధర్మరాజును అదుపులో పెట్టు. అతడిని జయించావంటే భూలోకాన్నంతా జయించినట్లే అవుతుంది. అని పలికిన వసిష్ఠుని మాట విని దండపాణియైన ధర్మరాజును జయించేందుకు బయలుదేరాడు. మురుడవధ్యుడనీ తన మీదకెత్తి వస్తున్నాడని విని, యముడు మహిషాన్నధిరోహించి కేశవుని వద్దకు వెళ్ళి నమస్కరించి మరాసురుడి ఆగడాలు వివరించాడు. అందులకా జనార్దనుడు నీవు వెళ్ళి ఆ రక్కసుని నా వద్దకు పంపుమని ఆదేశించాడు. అంతట త్వరగా తిరిగి తన నగరానికి వచ్చేసరికి మురుడుకూడ వచ్చిచేరాడు. యముడు వానికెదురేగి, దానవేశ్వరా ! నీ యిష్ట ప్రకారం చేస్తాను. నేనేంచేయాలో చెప్పుమన్నాడు.
మురు
54 - యమ! ప్రజాసంయమనా న్నివృత్తిం కర్తుమర్హసి ।
నోచేత్ తవాద్యభిత్త్వాఽహం మూర్ధానంపాతయేభువి ॥
55 - తమాహధర్మరాడ్ బ్రహ్మన్! యదిమాంనంయమాద్భవాన్ ।
గోపాయతి మురోసత్యం కరిష్యే వచనంతవ ॥
56 - ముర స్తమాహ భవతః కః సంయంతా వదస్వమామ్ ।
అహమేనం పరాజిత్య వారయామి న సంశయః ॥
57 - యమస్తం ప్రాహమావిష్ణు ర్దేవశ్చక్రగదాధరః ।
శ్వేతద్వీపనివాసీయః సమాంసంయమతేఽవ్యయః ॥
58 - తమాహదైత్య శార్దూలః క్వాసౌవసతి దుర్జయః ।
స్వయంతత్రగమిష్యామి తస్యసంయమనోద్యతః ॥
59 - తమువాచయమో గచ్ఛ క్షీరోదం నామసాగరమ్ ।
తత్రాస్తే భగవాన్ విష్ణు ర్లోకనాథో జగన్మయః ॥
60 - మురస్తద్వాక్య మాకర్ణ్య ప్రాహగచ్ఛామి కేశవమ్ ।
కింతుత్వయాన తావద్ధి సంయమ్యాధర్మ మానవాః ॥
61 - సప్రాహగచ్ఛత్వం తావత్ ప్రవర్తిష్యే జయంప్రతి ।
సంయంతుర్వాయథాస్యాద్ధి తతోయుద్ధంసమాచర ॥
62 - ఇత్యేవాముక్త్వా వచనం దుగ్ధా బ్ధిమగమన్మురః ।
యత్రాస్తే శేషపర్యంకే చతుర్మూర్తిర్జనార్దనః ॥
మురుడు
యమా ! ఈ క్షణంనుంచీ నీవు జీవుల ప్రాణాలనపహరించుట మానెయ్యాలి, లేదో నీతల నరికి పారేస్తానన్నాడు. అంతట ఓ నారదా ! ఆ యముడా దానవుడితో నీవునాపై అధికారినుంచి నన్ను కాపాడుచో నేను నా కర్తవ్యాన్ని వదిలేస్తా. నీ ఆదేశాన్ని శిరసావహిస్తా నన్నాడు. అందుకు వాడు, నీమీద ఆధికారం నెరపువాడెవడో తెలుపుము. నేను వానిని నిర్జించి తప్పక నిన్ను రక్షిస్తానన్నాడు. అందుకు యముడు శ్వేతద్వీపవాసి చక్రగదాధారి అయిన విష్ణుపు అదుపాజ్ఞలలోనే నున్నానని చెప్పగా వాడు ఆ దుర్జయుడైన విష్ణువుండే చోటు చెప్పగనే స్వయంగా వెళ్ళగలనన్నాడు. యముడదివిని క్షీర సముద్రానికి వెళ్ళు. అక్కడ నీకు జగన్మయుడు లోకాధినేత అయిన భగవానుడు విష్ణువు కనిపిస్తాడన్నాడు. మురాసురుడిదిగో యిప్పుడే ఆ కేశవుడి దగ్గరకు వెళ్తున్నా. నేను తిరిగి వచ్చే వరకు నీవు నీ మానవసంయమన కర్తవ్యాన్ని నెరవేర్చకూడదు సుమా. అనగా యముడు సరే నీయిష్ట ప్రకారమే చేస్తా కాని ఎలాగైనా ఆయనను, నాపై నియంతను జయించేందుకు ప్రయత్నం చేయము. గట్టిగా యుద్ధం చేయమన్నాడు. అలాగేనని బీరాలు పలుకుతూ ఆ మురుడు శేషపర్యంకంమీద నాలుగు రూపాలతో విరాజిల్లే జనార్దనుని నివాసం క్షీరసముద్రానికి ప్రయాణమై పోయాడు.
నారద
63 - చతుర్మూర్తిః కథంవిష్ణు రేకఏవనిగద్యతే ।
సర్వగత్వాత్ కథమపి అవ్యక్తత్వాచ్చతద్వద ॥
నారదుడు
ఒక్కడైన విష్ణువు నాలుగు రూపాలు గలవాడుగ నేల చెప్పబడినాడు ? అందుకు కారణం ఆయన సర్వగుడగుటయా లేక అవ్యక్తుడగుటయా ?
పులస్త్య
64 - అవ్యక్తః సర్వగోఽపీహ ఏక ఏవమహామునే ।
చతుర్మూర్తిర్జగన్నాథో యతాబ్రహ్మం స్తథాశృణు ॥
65 - అప్రతర్క్యమనిర్దేశ్యం శుక్లం శాంతంపరంపదమ్ ।
వాసుదేవాఖ్య మవ్యక్తం స్మృతంద్వాదశపత్రకమ్ ॥
పులస్త్యుడు
అవ్యక్తుడూ సర్వగుడూ ఒక్కడూ అయి ఉండియు జగన్నాథుడు చతుర్మూర్తి అయిన వివరం నారదా ! చెబుతున్నా వినుము. వాసుదేవుడుగా పేర్కొనబడే ఆ పరతత్వం తర్కానికి అతీతమైనది. ఇది అని నిర్దేశింపరానిది అవ్యక్తమైనది శుక్ల వర్ణం కలిగి శాంతియేరూపంగా కలిగినది. అది ద్వాదశ పత్రాలు గలిగినది.
నారద
66 - కథంశుక్లం కథంశాంత మప్రతర్క్యమ నిందితమ్ ।
కాన్యస్యద్వాదశైవోక్తా పత్రకానీతి మేవద ॥
నారదుడు
ఓ బ్రహర్షే! ఏ విధంగా ఆ తత్వం శుక్లమైనది శాంతమైనది తర్కాతీతమైనది ఉత్తమమైనది. దానిలోగల ద్వాదశపత్రాలు ఏవియో వివరించండి.
పులస్త్య
67 - ధర్మస్య భార్యాఽహింసాఖ్యా తస్యాఃపుత్ర చతుష్టయమ్ ।
సంజాతంముని శార్దూల యోగశాస్త్ర విచారకమ్ ॥
68 - జ్యేష్ఠః సనత్కుమారోఽభూద్ ద్వితీయశ్చ సనాతనః ।
తృతీయః సనకోనామ చతుర్థశ్ఛస నందనః ॥
69 - సాంఖ్యవేత్తారమపరం కపిలంవోఢు మాసురిమ్ ।
దృష్ట్వా పంచశిఖంశ్రేష్ఠం యోగయుక్తం తపోనిధిమ్ ॥
70 - జ్ఞానయోగం నతేదద్యు ర్జ్యాయాం సోఽపికనీయసామ్ ।
మానముక్తం మహాయాగం కపిలాదీనుపాసతః ॥
71 - సనత్కుమారశ్చాభ్యేత్య బ్రహ్మాణం కమలోద్భవమ్ ।
అపృచ్చద్యోగ విజ్ఞానం తమువాచ ప్రజాపతిః ॥
పులస్త్యుడు
అత్యంతగూఢమైన ఈ తత్వాన్ని మొదట పరమేష్ఠి ప్రజాపతి సనత్కుమారునకు తెలుపగా నాయననుండి నేను విన్నాను. నారదుడంతట, బ్రహ్మ స్వయంగా వినిపించిన ఆ సనత్కుమారుడెవరు ? వివరంగా చెప్పండని అర్థించగా పులస్త్యుడిలా చెప్పాడు. ధర్మునకు అహింస అనే భార్యవలన యోగశాస్త్ర విదులయిన కుమారులు నలుగురు కలిగారు. వారిలో పెద్దవాడు సనత్కుమారుడు రెండవవాడు సనాతనుడు, మూడవవాడు సనకుడు నాలవవాడు సనందనుడు. వీరు గాక సాంఖ్యవేత్తలు కపిల, వోఢు, ఆసురి, యోగివరుడు తపోనిధి అయిన పంచశిఖుడు ఉన్నారు. వారు పెద్దవారైయుండియు చిన్నవారలకు జ్ఞానయోగం చెప్పలేదు. మహాయోగ ప్రమాణం మాత్రమే చెప్పారు. అంతట సనత్కుమారుడు కమలభవుడైన బ్రహ్మనుచేరి యోగవిజ్ఞానాన్ని అర్థిస్తే ఆయన యిలా అన్నాడు.
బ్రహ్మ
72 - కథయిష్యామితేసాధ్య యదిపుత్రత్వ మిచ్చసి ।
యస్యకస్యన వక్తవ్యం తత్సత్యం నాన్యథేతిహి ॥
బ్రహ్మ
ఓ సాధ్యుడా ! నీవు నా పుత్రుడవగుటకంగీకరిస్తే ఆ శాస్త్రం నీకు చెప్పగలను. ఎవరికి పడితే వారలకు సత్యం చెప్పగూడదు. అందుకు తిరుగులేదు.
సనత్కుమార
73 - పుత్ర ఏవాస్మిదేవేశ యతః శిష్యోఽస్మ్యహంవిభో ।
నవిశేషోఽస్తి పుత్రస్య శిష్యస్యచ పితామహ ॥
సనత్కుమారుడు
ప్రభూ! నీకు శిష్యుడనుకనుక నేను పుత్రుడనేకదా, పుత్రునకు శిష్యునకుభేదమేమి గలదు?
బ్రహ్మ
74 - విశేషః శిష్యపుత్రాభ్యాం విద్యతేధర్మనందన ।
ధర్మకర్మ సమాయోగే తథాపిగదతః శృణు ॥
75 - పున్నామ్నో నరకాత్త్రాతి పుత్రస్తేనేహగీయతే ।
శేషపాపహరః శిష్య ఇతీయం వైదికీశ్రుతిః ॥
బ్రహ్మ
అలాకాదు ధర్యపుత్రా, శిష్యునికన్నా పుత్రునిలో విశేషం ఉంటుంది. అది ధర్మకర్మ నిర్వహణకు సంబంధించినది. పుత్ అనే నరకంనుంచి రక్షించేవాడు పుత్రుడయితే శేషించిన పాపాన్ని హరించే వాడు శిష్యుడనబడును. ఇది శ్రుతివచనం. అని విశ్లేషించెను.
సనత్కుమార
76 - కోఽయం పున్నామకోదేవ నరకాత్ త్రాతిపుత్రకః ।
కస్మాచ్చేషంతతః పాపం హరేచ్చిష్యశ్చ తద్వద ॥
సనత్కుమారుడు
ఆ పున్నామనరకం, శేషపాపహరణం అంటే ఏమో విపులంగా చెప్పండి.
బ్రహ్మ
77 - ఏతత్పురాణం పరమంమహర్షే యోగాంగయుక్తంచ సదైవయచ్చ ।
తథైవచోగ్రంభయహారి మానవం వదామితే సాధ్యనిశామయైనమ్ ॥
కమలభవుడు
ఓ సాధ్యా ! యోగాంగయుక్తమైన నీ విజ్ఞానం చాలా పురాతనమైనది. ఉగ్రమైనది, భయాలు పోగొట్టేది. అది నీకు చెబుతున్నాను, వినవలసినది.
అధ్యాయము 34 Complete
Summary of chapter 34 of the Vāmana Mahā Purana is as follows:
While residing peacefully upon Mount Kailāsa, Mother Parvatī creates a radiant boy from the divine fragrant paste of Her own body and endows him with life, naming him Her beloved son and appointing him as the guardian of Her inner chambers. When Parameśvara Śiva approaches and is stopped at the entrance by the dutiful young guardian, a battle ensues in which the boy's head is severed by Śiva's trident, causing immense grief to Mother Parvatī. To restore cosmic harmony and comfort the Mother Divine, Parameśvara Śiva replaces the head with that of a mighty elephant, resurrecting the child as Vināyaka Gaṇeśa and crowning him as the supreme leader of all gaṇas and the remover of all obstacles.