అధ్యాయము 28

పులస్త్య

1 - తతోగిరౌవసన్ రుద్రః స్వేచ్ఛయావిచరన్‌మునే

 విశ్వకర్మాణమాహూయప్రోవాచకురుమేగృహమ్

2 - తతశ్చకారశర్వస్య గృహంస్వస్తికలక్షణమ్

 యోజనానిచతుఃషష్టిః ప్రమాణేనహిరణ్మయమ్

3 - దంతతోరణనిర్యూహం ముక్తాజాలాంతరంశుభమ్

 శుద్దస్పటికసోపానం వైఢూర్యకృతరూవకమ్

4 - సప్తకక్షంసువిస్తీర్ణం సర్వైఃసముదితంగుణైః

 తతో దేవపతిశ్చక్రే యజ్ఞగార్హస్థ్యలక్షణమ్

5 - తంపూర్వచరితంమార్గ మనుయాతిస్మశంకరః

 తథాతతస్త్రినేత్రస్య మహాకాలోఽభ్యగాన్మునే

6 - రమతఃసహపార్వత్యాధర్మాపేక్షీజగత్పతిః

 తతఃకదాచిన్నర్మార్థం కాశీత్యుక్తాభవేనహి

7 - పార్వతీమన్యునావిష్టా శంకరంవాక్యమబ్రవీత్

 సంరోహతీషుణావిద్ధం వనంపరశునాహతమ్

 వాచాదురుక్తంబీభత్సం నప్రరోహతివాక్‌క్షతమ్

8 - వాక్సాయకావదనాన్నిష్పతంతి తై రాహతఃశోచతిరాత్య్రహాని

 నతాన్‌విముంచేతహిపండితోజన స్తమద్యధర్మంవితథంత్వయాకృతమ్

9 - తస్మాద్వ్రజామిదేవేశ తప స్త ప్తమను త్తమమ్

 తథాయతిష్యేనయథా భవాన్‌కాళీతివక్ష్యతి

10 - ఇత్యేవముక్త్వాగిరిజా ప్రణమ్యచమహేశ్వరమ్

 అనుజ్ఞాతా త్రినేత్రేణ దివమేవోత్పపాతహ

11 - సముత్పత్యచవేగేన హిమాద్రిశిఖరంశివమ్

 టంకచ్ఛన్నంప్రయత్నేన విధాత్రానిర్మితంయథా

12 - తతోఽవతీర్యసస్మార జయాంచవిజయాంతథా

 జయంతీంచ మహాపుణ్యాం చతుర్థీమపరాజితామ్

13 - తాఃసంస్మృతాఃసమాజగ్ముః కాళీంద్రష్టుంహిదేవతాః

 అనుజ్ఞాతా స్తథాదేవ్యా శుశ్రూషాంచక్రిరేశుభాః

పులస్త్యుడు

ఓ మునీ! అలా హరుడా గిరిమీద పార్వతితో యథేచ్ఛగా విహరిస్తూ విశ్వకర్మను పిలిచి తనకొక గృహం నిర్మించమన్నాడు. అంతటనాతడు స్వస్తిక లక్షణంతో అరవై నాలుగు యోజన ప్రమాణం గల మేలిమి బంగారం భవనాన్ని నిర్మించాడు. దంతాలతోచేసిన తోరణాలు, ముత్యాలు పొదిగిన గవాక్షాలు, వాకిండ్లు, స్ఫటికసోపాన పంక్తులు, వైదూర్వమణుల చిత్తరువులు, ఏడు విశాలమైన గదులు, సకలవిధాల వసతులు, భోగసామగ్రులు కలిగి ఆ భవనం సర్వాతిశాయిగా రూపొందింది. అందులోచేరి ఆ దేవదేవుడు గృహస్థులు చేయదగిన యజ్ఞం చేశాడు. అందులో పూర్వీకుల పద్ధతినే హరుడు అవలంబించాడు. ఆ సుందరహర్మ్యంలో చాలాకాలం పార్వతితో సుఖాలనుభవిస్తూ శివుడు గడిపాడు. అంతనొకనాడు వినోదానికై పార్వతిని "కాళీ" యని (నల్లపిల్లా!) అని సంబోధించాడు. అందులకా శర్వాణి కోపించి యిలా అన్నది. "బాణ విద్ధమైన వృక్షం, గొడ్డలివేటుకు తెగిన కొమ్మ తిరిగి చిగిరించగలవు. నోటవెడలిన దురుక్తి తో అపశబ్దాలతో గాయపడిన, వ్రణం తిరిగి మానిపోదు. నోటవచ్చిన శబ్దబాణాలకు ఎర అయిన ప్రాణి రాత్రింబవళ్ళూ యాతన అనుభవిస్తూంటాడు. కనుక అలా అపశబ్దాలు పలుకకూడదని పండితులు ధర్మశాసనం చేశారు. ఆ శాసనాన్ని నీవు నేడు అతిక్రమించి నా మనస్సు నొప్పించావు. కనుకనో దేవదేవా! నేనీ క్షణమే తపోవనానికి వెళ్తున్నాను. నా తపస్సునంతా వెచ్చించి నీచేత మరల "కాళి" అని పిలిపించుకోకుండా ఆయత్తమై తిరిగి రాగలను. అలా అని శివుని అనుమతితో ఆ క్షణాన్నే ఆకాశమార్గాన వళ్ళి హిమాద్రి శిఖరాన్ని చేరుకుంది. అది అత్యంత రమణీయంగా మనోహరంగా సాక్షాత్తు బ్రహ్మనిర్మితమా అన్నట్లు కన్నుల పండువు కలిగించింది. అక్కడకు చేరగానే, జయ, విజయ, జయంతి, అపరాజిత అనే పలుగురు దేవాంగనలను స్మరించగానే వారు ఆమె దర్శనం చేసుకున్నారు. ఆమె అనుజ్ఞతో ఆమెకు శుశ్రూషలు చేయసాగారు.

14 - తత స్తపసిపార్వత్యాం స్థితాయాంహిమవద్వనాత్

 సమాజగామతందేశం వ్యాఘ్రోదంష్ట్రానఖాయుధః

15 - ఏకపాద స్థితాయాంతు దేవ్యాం వ్యాఘ్రస్త్వ చింతయత్

 యదాపతిష్యతే చేయం తదాదాస్యామివై అహమ్

16 - ఇత్యేవం చింతయన్నేవ దత్తదృష్టిర్మృగాధిపః

 పశ్యమానస్తువదన మేకదృష్టిరజాయత

17 - తతోవర్షశతం దేవీ గృణంతీ బ్రహ్మణః పదమ్

 తపోఽతప్యత్ తతోఽభ్యాగాద్ బ్రహ్మాత్రిభువనేశ్వరః

18 - పితామహ స్తతోవాచ దేవీంప్రీతోఽస్మిశాశ్వతే

 తపసాధూతపాపాఽసి వరం వృణుయథేప్సితమ్

19 - అథోవాచ వచః కాళీ వ్యాఘ్రస్యకమలోద్భవః

 వరదోభవ తేనాహం యాస్యే ప్రీతిమనుత్తమమ్

20 - తతః ప్రాదాద్వరంబ్రహ్మా వ్యాఘ్రస్యాద్భుతకర్మణః

 గాణపత్యం విభౌ భక్తి మజేయత్వం చ ధర్మితామ్

21 - వరంవ్యాఘ్రాయదత్వైవం శివకాంతామథా బ్రవీత్

 వృణీష్వవరమవ్యగ్రా వరందాస్యే తవాంబికేః

22 - తతోవరం గిరిసుతా ప్రాహదేవీ పితామహమ్

 వరఃప్రదీయతాం మహ్యం వర్ణం కనకసంనిభమ్

23 - తథేత్యుక్త్వాగతో బ్రహ్మా పార్వతీచాభవత్తతః

 కోశంకృష్ణం పరిత్యజ్య పద్మకింజల్క సంనిభా

24 - తస్మాత్‌కోశాచ్చ సంజాతా భూయః కాత్యాయనీమునే

 తామభ్యేత్య సహస్రాక్షః ప్రతిజగ్రాహ దక్షిణామ్ ప్రోవాచగిరిజాందేవో వాక్యం స్వార్థాయవాసవః

అలా పార్వతి కఠోర తపస్సులోనుండగా హిమాద్రి అరణ్యంనుంచి పెద్దపులి ఒకటి అక్కడకు వచ్చింది ఒంటికాలిమీద నిలబడి తపంచేస్తున్న కాళినిచూచి ఆమె క్రిందపడిపోయిన తర్వాతతినెదనని నిశ్చయించుకుని ఆమె ముఖంవైపు దీక్షగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. దానికి ఏకాగ్రత సిద్ధించింది. అలా బ్రహ్మనుగూర్చి నూరు సంవత్సరాలు ఆ దేవి తపస్సుచేయగా ఆ పితామహుడు ప్రత్యక్షమై, దేవీ! నీ తపస్సుకు సంతోషించాను, వరం కోరుకోవలసినదన్నాడు. అందులకా ఉమ, స్వామీ మొదట ఈ పెద్దపులికి కావలసిన వరమివ్వండి. దానితో నాకెంతో తృప్తికలుగుతుంది అని అన్నది అంతట అద్భుతదీక్ష నెరపిన ఆ వ్యాఘ్రానికి విఫ్నేశ్నర భక్తి, ధర్మబుద్ధి, అజేయత్వం వరాలుగా యిచ్చి విరించి ఉమను ఏమి కావలెనని ప్రశ్నించాడు. అంతటనా కాళి "ఓ మహానుభావా! నా శరీరం తప్తకుందనంలాగ వెలుగొందునట్లు వరమివ్వండి" అన్నది. అందులకు తథా స్తని బ్రహ్మ తనచోటికి వెళ్ళిపోయాడు. అంతట పార్వతి వంటిమీది నల్లని కోశం (పొర) ఊడిపోయి పద్మకింజల్క సన్నిభమైన స్వర్ణకాంతి కలిగింది. ఆ ఊడిన నల్లని (పొర) కోశాన్నుంచి కాత్యాయని జన్మించింది. ఓ నారదా! అంతట ఇంద్రుడామెను సమీపించి ఆ కాత్యాయనిని దక్షిణగా స్వీకరించి పార్వతిని యిలా అర్థించాడు.

ఇంద్ర

25 - ఇయం ప్రదీయతాంమహ్యం భగినీమేఽస్తు కౌశిక

 త్వత్కోశ సంభవాచేయం కౌశికీ, కౌశికోఽప్యహమ్

26 - తాంప్రాదాదితి సంశ్రుత్య కౌశికీం రూపసంయుతామ్

 సహస్రాక్షోఽపితాంగృహ్య వింధ్యంవేగాజ్జగామ చ

27 - తత్రగత్వా త్వథోవాచ తిష్ఠస్వాత్ర మహాబలేః

 పూజ్యమానాసురైర్నామ్నా ఖ్యాతాత్వం వింధ్యవాసినీ

28 - తతస్థాప్య హరిర్దేవీం దత్వాసింహం చ వాహనమ్

 భవామరారి హంత్రీతి ఉక్త్వా స్వర్గముపాగమత్

ఇంద్రుడు

 “దేవీ! ఈమెను నాకిచ్చి వేయుము. నీ కోశము నుండి పుట్టిన ఈ కౌశికి నాకు సోదరి కాగలదు. అందుచేత నేను కౌశికుడనయ్యెదను. "ఇంద్రుని కోర్కెను మన్నించి ఆ సుందరి కౌశికిని, అతనికిచ్చి వేసింది. ఆ సహస్రాక్షుడా కౌశికిని వెంటబెట్టుకొని త్వరత్వరగా వింధ్యాద్రికి చేరుకున్నాడు. ఆమెతో "ఓ మహాబలశాలినీ! నీవీ వింధ్యశిఖరాన వింధ్యవాసిని అనే పేరుతో సర్వదేవతలచే కీర్తింపబడుతూ విరాజిల్లుము. ఈ సింహంమీద విహరిస్తూ అమర శత్రువులనందరను సంహరింపుము" అని చెప్పి ఆ దేవరాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు.

29 - ఉమాఽపితం వరంలబ్ద్వా మందరంపునరేత్య చ

 ప్రణమ్య చ మహేశానః స్థితా సవినయంమునే

30 - తతోఽమర గురఃశ్రీమాన్ పార్వత్యా సహితోఽన్యయ:

 తస్థౌవర్ష సహస్రంహి మహామోహనకే మునే

31 - మహామోహాస్థితేరుద్రే భువనాశ్చేలురుద్దతాః

 చుక్షుభుఃసాగరాః సప్తదేవాశ్చ భయమాగమన్

32 - తతఃసురాః సహేంద్రేణ బ్రహ్మణః సదనం గతాః

 ప్రణమ్యోచు ర్మహేశానం జగత్‌క్షుబ్దింతుకిం త్విదమ్

33 - తానువాచ భవోనూనం మహామోహనకే స్థితః

 తేనాక్రాంతా స్త్విమేలోకా జగ్ముఃక్షోభం దురీత్యయమ్

34 - ఇత్యుక్త్వా సోఽభవత్ తూష్ణీం తతోఽప్యూచుః సురాహరిమ్

 ఆగచ్ఛశక్రగచ్ఛామో యావత్తన్న సమాప్యతే

35 - సమాప్తే మోహనేబాలో యఃసముత్పత్స్యతేఽవ్యయః

 సమానం దేవరాజస్య పదమైంద్రం హరిష్యతి

36 - తతోఽమరాణాం వచనా ద్వివేకో బలఘాతినః

 భయాత్‌జ్ఞానంతతో నష్టంభావికర్మ ప్రబోధనాత్

37 - తతఃశక్రః సురైస్సార్థం వహ్నినా చ సహాస్రదృక్

 జగామమందరగిరిం తచ్ఛృంగేన్యవిశత్తతః

38 - అశక్తాః సర్వఏవైతే ప్రవేష్టుం తద్భవాజిరమ్

 చింతయిత్వారు సంచిరం పావకం తేవ్యసర్జయన్

39 - స చాభ్యేత్య సురశ్రేష్ఠో దృష్ట్వాద్వారే చ నందినమ్

 దుష్ట్రవేశం చ తంమత్వా చింతాంవహ్నిః పరాం గతః

40 - స తుచింతార్ణవేమగ్నః ప్రాపశ్యచ్ఛంభు సద్మనః

 నిష్క్రామంతీం మహా పంక్తిం హంసానాం విమలాంతథా

41 - అసావుపాయ ఇత్యుక్త్వా హంసరూపోహుతాశనః

 వంచయిత్యా ప్రతీహారం ప్రవివేశహరాజిరమ్

42 - ప్రవిశ్యసూక్ష్మ మూర్తిశ్చ శిరోదేశే కపర్దిసః

 ప్రాహప్రహస్య గంభీరం దేవాద్వారి స్థితా ఇతి

43 - తచ్ఛృత్వా సహసోత్థాయ పరిత్య జ్యగిరేః సుతామ్

 వినిష్క్రాంతోఽజిరాచ్ఛర్వో వహ్నినానహ నారద

44 - వినిష్క్రాంతే సురపతౌ దేవాముదిత మానసాః

 శిరోఖిరవనీంజగ్ముః సేంద్రార్క శశిపావకాః

45 - తతఃప్రీత్యాసురానాహ వదర్వం కార్యమాశుమే

 ప్రణామావనతానాంవో దాస్యేఽహం వరముత్తమమ్

నారదా! ఉమకూడ అట్లు వరాన్ని పొంది తిరిగి మందరగిరికి వచ్చి భర్తయైన శివునకుమ్రొక్కి వినయంగా నిలబడినది. అంతనా పార్వతితో కలిసి దేవాధిదేవుడు వేయి సంవత్సరాలు కామోపభోగాలనుభవించాడు. అలా శివుడు కామక్రీడల్లో మునిగి ఉండగా ముల్లోకాలూ క్షోభించిపోయాయి. సముద్రాలు ఘార్లిల్లాయి. దేవతలంతా భయకంపితులై ఇంద్రునితో కలిసి బ్రహ్మవద్దకువెళ్ళి నమస్కరించి యీ సంక్షోభానికి కారణమేమని అడిగారు. ఆయన, శివుడు పార్వతితో మహామైథున క్రీడలోమునిగి యున్నాడు. ఆ తీవ్రతకు లోకాలన్నీ కంపించిపోతున్నాయని చెప్పి మౌనం వహించాడు. అంతట దేవతలు యింద్రునితో "దేవపతీ! త్వరపడుము. శివ పార్వతుల మైథునకర్మ ముగియు లోపల మనమక్కడకు వెళ్ళవలె. అది పూర్తిఅయి బాలకుడు జన్మించినచో అతడు నీ యింద్రాధిపత్యాన్ని హరించి వేస్తాడని భయపెట్టారు. దేవతల మాట వినగానే యింద్రుడి వివేకం విచక్షణా జ్ఞానం నశించి, భయం చోటుచేసుకుంది. అతడా క్షణమే దేవతలను అగ్నిని వెంటబెట్టుకొని మందరగిరి శిఖరాన డేరా వేశాడు. శివుని భవనంలోకి వెళ్ళేందుకు ధైర్యంచాలక చాలాసేపు తమలోతామాలోచించుకుని చివరకు అగ్నిని పంపించారు. అగ్ని శివుని యింటిప్రాంగణం వద్దకు వెళ్ళిచూస్తే నందీశ్వరుడు ద్వారంవద్ద నిలచి ఉన్నాడు. దానికి భయపడి అగ్ని కర్తవ్యం ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద హంసలగుంపు ఈశ్వర భవనంలో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇదే తరుణమని ఎంచి అగ్ని ఒక హంసరూపం ధరించి నందికన్నుగప్పి లోపలకు ప్రవేశించాడు. అక్కడ యింకా సూక్ష్మరూపంలో త్రినేత్రుని జటామండలం మీద ఎగురుతూ శివుడికి వినపడునట్లు మెల్లగా దేవతలు ద్వారంవద్ద వేచియున్నారని చెప్పాడు. అంతట వెంటనే పార్వతిని వదలి శివుడు అగ్నితోకలిసి ప్రాంగణంలోకి వచ్చాడు. నారదా! అలా బయటకువచ్చిన హరునిచూచి దేవతలు సంతోషించారు. అందరూ భూమికి తలలు ఆనించి నమస్కారాలు చేశారు. అంతట శివుడు మీ కోర్కె తీర్చగలను. మీరెందుకు వచ్చారో చెప్పండని అన్నాడు.

దేవ

46 - యదితుష్టోఽసి దేవానాం వరందాతు మిహేచ్ఛసి

 తదిదంత్య జ్యతాంతావ న్మహామైథునమీశ్వర!

దేవతలు

ప్రభూ మమ్ముల కరుణింపనెంచుచో మీ యీ మైథునక్రీడను చాలించండి.

ఈశ్వర

47 - ఏవం భవతు సంత్యక్తో మయాభావోఽమరో త్తమాః

 మమేదంతేజ ఉద్రిక్తం కశ్చిద్దేవః ప్రతీచ్ఛతు

ఈశ్వరుడు

అందులకా దేవదేవుడట్లేయని అంగీకరించి, అయితే ఉద్రిక్తమైన నాయీ శుక్రాన్ని మీలో ఎవరు పరిగ్రహిస్తారని ప్రశ్నించాడు.

పులస్త్య

48 - ఇత్యుక్తాః శంభునాదేవాః స్తేంద్రచంద్రదివాకరాః

 అసీ దంతయథా మగ్నాః పం కే బృందారకా ఇవ

49 - సీదత్సుదైవతేష్వేవం హుతాశోఽభ్యేత్య శంకరమ్

 ప్రోవాచంముంచ తేజస్త్వం ప్రతీచ్ఛామ్యేష శంకర

50 - తతోముమోచ భగవాం స్తద్రేతఃస్కన్న మేవతు

 జలం తృషాంతే వై యద్వత్ తైలపానం పిపాసితః

51 - తతఃపీతే తేజసివై శార్వే దేవేనవహ్నినా

 స్వస్థాః సురాః సమామంత్య్ర హరంజగ్ముస్త్రి విష్టపమ్

52 - సంప్రయాతేషు దేవేషు హరోఽపి నిజమందిరమ్

 సమభ్యేత్య మహాదేవీ మిదం వచన మబ్రవీత్

53 - దేవి! దేవైరిహాభ్యేత్య యత్నాత్ ప్రేష్యహుతాశనమ్

 నీతఃప్రోక్తోనిషిద్ధస్తు పుత్రోత్పత్తింతవోదరాత్

54 - సాఽపిభర్తుర్వచః శ్రుత్వా క్రుద్ధారక్తాంతలోచనా

 శశాపదైవతాన్ సర్వాన్ నష్టపుత్రోద్భవాశివా

55 - యస్మాన్నిచ్ఛంతి తే దుష్టా మమపుత్ర మధౌరసమ్

 తస్మాత్తేన జనిష్యంతి స్వాసుయోషిత్సు పుత్రకాన్

56 - ఏవంశప్త్వా సురాన్‌గౌరీ శౌచశాలా ముపాగమత్

 ఆహూయమాలినీం స్నాతుం మతించక్రే తపోధనాః

57 - మాలినీ సురభింగృహ్య శ్లక్ష్ణ ముద్వర్తనం శుభా

 దేవ్యం గముద్వర్తయతే కరాభ్యాం కనకప్రభమ్ తత్‌స్వేదం పార్వతీ చైవ మేనేకీ దృగ్గుణేనహి

58 - మాలినీతూర్ణ మగమద్ గృహంస్నానస్య కారణాత్

 తస్యాంగతాయాం శైలేయీ మలాచ్చక్రేగజాననమ్

59 - చతుర్భుజం పీనవక్షం పురుషం లక్షణాన్వితమ్

 కృత్వోత్స సర్జభూమ్యాంచ స్థితాభద్రాసనేపునః

60 - మాలినీతచ్ఛిరస్నానం దదౌ విహసతీతదా

 ఈషద్ధాసాముమా దృష్ట్వా మాలినీం ప్రాహనారద!

61 - కిమర్థం భీరుశనకై ర్హససి త్వమతీవచ?

 సాఽథోవాచహసామ్యేవం భపత్యాస్త నయఃకిల

62 - భవిష్యతీతి దేవేన ప్రోక్తోనందీగణాధిపః

 తత్‌శ్రుత్వా మమహాసోఽయం సంజాతోఽద్యకృశోదరి

పులస్త్యుడు

శంకరుని పశ్నకు ఇంద్ర చంద్ర సూర్యుడు మొదలైన దేవతల ఊబిలో కూరుకొనిపోయిన ఏనుగుల్లాగ హతాశులయ్యారు. దేవతల దైన్యాన్ని చూచి అగ్నిముందుకు వచ్చి “శివా నీ శుక్రాన్ని నేను భరిస్తాను, వెంటనే వదులుమనెను. దాహం గొన్న వాడినోట్లో నూనెపోసినట్లు శంకరుడా శుక్లాన్ని అగ్నినోట వదిలాడు. శివ తేజాన్ని అగ్నిపానం చేయగానే దేవతలు స్వస్థులై తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. దేవతలువెళ్ళిన తర్వాత శివుడులోనికి వెళ్ళి పార్వతితో, దేవీ! దేవతలందరు వచ్చి ఎంతో కష్టంతో అగ్నిని లోనికి పంపి నన్ను బయటకు పిలిపించుకున్నారు. నీ గర్భంనుంచి పుత్రుడు కలుగకుండా నన్ను నివారించి వెళ్ళిపోయారని చెప్పాడు అది విన్నంతనే కోపంతో నిప్పులుగ్రక్కుచు దేవతల్లో ఎవరికీకూడ యిక ముందు భార్యలవల్ల పుత్రులు కలుగరాదని భయంకరంగా శపించింది. నాకు ఔరసుడు కలుగకుండా కుట్రపన్నిన దుష్టులు అపుత్రకులుగా ఉండిపోతారని శాసించింది. అలా దేవతలకు శాపమిచ్చి గౌరిశౌచాలయంలోకి వెళ్ళి మాలిని పిలిచి స్నానానికి ఏర్పాట్లు చేయమన్నది. మాలిని పరిమళభరితమైన ఉద్వర్తన (నలుగుపిండి) ద్రవ్యంలో ఆ దేవి బంగారు వన్నె గల కరచరణాదులకు నలుగుపెడుతూ ఉంటే పార్వతి తన స్వేదం (చెమట) ప్రభావాన్ని గురించి ఆలోచించసాగింది. నలుగుపెట్టి మాలిని స్నానం చేసేందుకు లోపలకు పోయింది. ఆమె పోగానే తనవంటి నుండి రాలిన నలుగుపిండితో గజముఖము, నాలుగు చేతులు, వెడల్పు ఛాతీ గలిగి పురుషాకృతి గల బొమ్మనుచేసి నిలబెట్టింది. ఇంతలో మాలిని వచ్చి ఆమెకు శిరస్నానం చేయిస్తూ మధ్యలో తనలోతాను నవ్వుకొనడం సాగించింది. నారదా! అది చూచి పార్వతి ఎందుకే నీలో నీవు మాటిమాటికి అలా నవ్వుకుంటున్నావు! అని అడిగింది. అందుకు మాలిని నవ్వుతూ అవునమ్మా నీకు కొడుకు కలుగుతాడని శివుడు గణాధిపతి నందితో అంటూంటే విన్నాను. అందుకే యిలా నవ్వుతున్నా. దేవతలు ఆయనకు కొడుకును కనకుండా నివారించారు కదా!"

63 - యస్మాద్దేవైః పుత్రకామః శంకరో వినివారితః

 ఏతచ్ఛృత్వావచోదేవీ స స్నౌపుత్ర విధానతః

63 - యస్మాద్ధేవై పుక్రామః శంకరోవినివారితః

 ఏతచ్ఛృత్వావచోదేవీ సస్నౌ తత్ర విధానతః

64 - స్నాత్వాఽర్చ్యశంకరంభక్త్యా సమభాగ్యాద్‌గృహంప్రతి

 తతఃశంభుంసమాగత్య తస్మిన్‌భద్రాసనేత్వపి

65 - స్నాతస్తస్యతతోఽధస్తాత్ స్థితఃసమలపూరుషః

 ఉమా స్వేదంభవస్వేదం జలభృతిసమన్వితమ్

66 - తత్సంపర్కాత్ సముత్తస్తే పూత్కృత్యకరముత్తమమ్

 అపత్యంహివిదిత్వాచ ప్రీతిమాన్‌భువనేశ్వరః

67 - తంచాదాయహరో నంది మువాచభగనేత్రహా

 రుద్రఃస్నాత్వాఽర్చ్యదేవాదీన్ వాగ్భిరద్భిఃపితౄనపి

68 - జప్త్వాసహస్రనామాన ముమాపార్శ్వముపాగతః

 సమేత్యదేవీంవిహసన్ శంకరఃశూలదృగ్ వచః

69 - ప్రాహత్వపశ్యశైలేయి స్వసుతంగుణసంయుతమ్

 ఇత్యుక్తాపర్వతసుతా సమేత్యాపశ్యదద్భుతమ్

70 - యత్తదంగమలాద్దివ్యం కృతం గజముఖం నరమ్

 తతఃప్రీతాగిరిసుతా తంపుత్రంపరిషస్వజే

71 - మూర్థ్నిచై నముపాఘ్రాయ తతఃశర్వోఽబ్రవీదుమామ్

 నాయకేననినాదేవి తవభూతోఽపిపుత్రకః

72 - యస్మాజ్జాత స్తతోనామ్నా భవిష్యతివినాయకః

 ఏషవిఘ్నసహస్రాణి సురాదీనాంకరిష్యతి

73 - పూజయిష్యంతిచైవాస్య లోకాదేవిచరాచరాః

 ఇత్యేవముక్త్వాదేవ్యాస్తు దత్తవాం స్తనయాయహి

74 - సహాయంతుగణశ్రేష్ఠం నామ్నాఖ్యాతంఘటోదరమ్

 తథామాతృగణా ఘోరా భూతావిఘ్నకరాశ్చయే

75 – తేసర్వేపర మేశేన దేవ్యాఃప్రీత్యోపపాదితాః

 దేవీచస్వసుతందృష్ట్వా పరాంముదమవాపచ

76 - రేమేఽథశంభునాసార్థం మందరేచారుకందరే

 ఏవంభూయోఽభవద్దేవీ ఇయంకాత్యాయనీవిభో యాజఘానమహాదైత్యౌ పురాశుంభనిశుంభకౌ

77 - ఏతత్తవోక్తంవచనంశుభాఖ్యం

 యథోద్భవం పర్వతతో మృడాన్యాః స్వర్గ్యంయశస్యంచ తథాఘహారి

 ఆఖ్యాన మూర్జస్కర మద్రిపుత్య్రాః

మాలిని మాటలు విని పార్వతి యధావిథిగా స్నానం చేసి భక్తితో శంకరుని అర్చించి యింటిలోనికి వచ్చింది. శంకరుడుకూడ పార్వతికూర్చున్న భద్రాసనం మీదనే కూర్చుండి స్నానం చేశాడు. అప్పుడాయన క్రింద నిలబెట్టిన నలుగు పిండి బొమ్మను చూచాడు. ఆ నేల ఉమాశంకరుల చమటతో తడిసినందున ఆ బొమ్మ జీవనంగల పురుషుడుగా తొండంతో పూత్కారం చేస్తూ నిలబడింది. ఆ గజాననుడిని తన పుత్రుడుగా గుర్తించి శివుడు మహదానందపడ్డాడు. అతడిని వెంటబెట్టుకొని నందికి చూపించి ఆ సమాచారం చెప్పాడు. తర్వాత స్నానంచేసి ఆత్మపూజ, దేవపితృ పూజలు పవిత్ర మంత్రాలతో గావించి సహస్రవామాలు జపిస్తూ ఉమను సమీపించి, పర్వతపుత్రీ! ఇడుగో సకల గుణాఢ్యుడైన నీ కుమారుడ"ని చూపించాడు. అప్పుడా పార్వతి తన శరీర మలం (నలగుపిండి)తో చేసిన బొమ్మగజ ముఖంతో నరుడుగా మారడం చూచి సంతోషించి కౌగిలించుకొని ముద్దాడింది. అప్పుడు శర్వడు, నాయకుడు (తండ్రి) లేకుండా పుట్టిన ఈ బిడ్డ వినాయకుడని ఉమతో అన్నాడు. ఆ పేరుతో మనసుతుడు దేవతలకు వేలవిధాల విఘ్నాలు కలుగజేస్తాడు. ఇతడిని దేవతలు చరాచరజీవులు పూజిస్తారంటూ పార్వతికి అప్పగించాడు. సర్వగణాల్లో శ్రేష్ఠుడైన ఘటోదరుడను వానిని విఘ్నాలు కలుగజేసే మాతృగణాలను భూతాలను వినాయకునకు సహాయకులుగా నియమించాడు పార్వతి తృప్తికోసంగాను హరుడు తన కుమారుని చూచికొని ఉమ నిజంగానే పరమానందం పొందింది. నారదా! తర్వాత పార్వతి శివునితో మందరగిరి సుందర కంధరాల్లో విహారాలు గావించింది. ఆ విధంగా కాత్యాయని మరల జన్మించి పురాసమయాన శుంభనిశుంభులనే దైత్యులను సంహరించింది. పర్వత పుత్రిగా మృడాని జన్మగాథ చాలా మంగళకరమైనది. పాపహారి. స్వర్గ యశస్సులు చేకూర్చగలిగి భవ్య వృత్తాంతం. నీకు వివరంగా వినిపించాను.

అధ్యాయము 28 Complete