వామన మహా పురాణము
అధ్యాయము 13
సుకేశి
1 - భవద్బిరుదితా ఘోరా పుష్కరద్వీపసంస్థితిః ।
జంబూద్వీపస్య సంస్థానం కథయంతు మహర్షయః ॥
సుకేశి
మహర్షులారా ! పుష్కర ద్వీపములోని ఘోరపరిస్తితులు మీరు వర్ణించారు. ఇక జంబూ ద్వీపస్థితి గతులు చెప్పండి.
ఋషులు
2 - జంబూద్వీపస్య సంస్థానం కథ్యమానం నిశామయ ।
నవభేదం సువిస్తీర్ణం స్వర్గమోక్షఫలప్రదమ్ ॥
3 - మధ్యేత్విలావృతో వర్షో భద్రాశ్వః పూర్వతోద్భుతః ।
పూర్వ ఉత్తరతశ్చాపి హిరణ్యో రాక్షసేస్వర ॥
4 - పూర్వదక్షిణతశ్చాపి కింనరో వర్ష ఉచ్యతే ।
భారతో దక్షిణే ప్రోక్తో హరిర్దక్షిణపశ్చిమే ॥
5 - పశ్చిమేకేతుమాలశ్చ రన్యుకః పశ్చిమోత్తరే ।
ఉత్తరేచ కురుర్వర్షః కల్పవృక్షసమావృతః ॥
6 - పుణ్యారమ్యానవైవేతే వర్షాః శాలకటంకట ।
ఇలావృతాద్యాయే చాష్టౌ వర్షం ముక్తైవ భారతమ్ ॥
7 - నతేష్వస్తియుగావస్థా జరామృత్యుభయం నచ ।
తేషాం స్వాభావికీ సిద్ధిః సుఖప్రాయా హ్యయత్నతః ॥ ।
విపర్యయోనతేష్వస్తి నో త్తమాదమమధ్యమాః ॥
8 - యదేతద్ భారతంవర్షం నవద్వీపం నిశాచర ।
సాగారాంతరితాః సర్వే ఆగమ్యాశ్చ పరస్పరమ్ ॥
ఋషులు
రాక్షసపతీ! ఇక నవ విభాగాత్మకమై సువిశాలమై స్వర్గ మోక్షాలను ప్రదానం చేయగల జంబూద్వీప వృత్తాంతం వినుము. అది మధ్యలో ఇలావృత వర్షం, తూర్పున అద్భుతమైన భద్రాశ్వ వర్షం ఈశాన్యాన హిరణ్యవర్షం, ఆగ్నేయాన కింనర వర్షం, దక్షిణాన భారత వర్షం, నైరుతి భాగాన హరివర్షం, పశ్చిమాన కేతుమాల వర్షం, వాయవ్యాన రమ్యక వర్షం, ఉత్తరాన కురువర్షంగా తొమ్మిది వర్షాలలో విభక్త మైనది. ఈ తొమ్మిది భూభాగాలు పవిత్రమైనవి రమణీయమైనవీను. వీనిలో కురువర్షం కల్పవృక్షాలతో నిండి ఉంటుంది. భారతవర్షం మినహాయిస్తే యిలావృతాదులు ఎనిమిది వర్షాల్లో యుగ విభాజనం గాని జరామరణ భయంగాని ఉండవు. అక్కడి వారలకు ఆ ప్రయత్నంగానే సుఖంగా సిద్ది లభిస్తుంది. అది సహజ సిద్ధం. వారిలో ఉత్తమధామార్వాది వివక్షగాని ఎలాంటి విపర్యయాలు గాని ఉండవు. ఇక భారత వర్షమో తొమ్మిదవది. ఇవన్నీ సముద్రాలచే వేరుచేయబడి పరస్పరం ఆగమ్యాలుగా ఉన్నాయి.
9 - ఇంద్రద్వీపః కసేరుమాం స్తామ్రవర్ణోగభస్తిమాన్ ।
నాగద్వీపః కటాహశ్చ సింహలో వారుణస్థథా ॥
10 - అయంతునవమస్తేషాం ద్వీపః సాగరసంవృతః ।
కుమారాఖ్యః పరిఖ్యాతో ద్వీపో-యందక్షిణోత్తరః ॥
11 - పూర్వేకిరాతా యస్యాంతే పశ్చిమేయవనాః స్థితాః ।
ఆంధ్రాదక్షిణతో వీర తురుష్కాస్త్వపి చోత్తరే ॥
12 - బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చాంతరవాసినః ।
ఇజ్యాయుద్దవణిజ్యాధ్యై: కర్మభిః కృతపావనాః ॥
13 - తేషాం సంవ్యవహారశ్చ ఏభిః కర్మభిరిష్యతే ।
స్వర్గాపవర్గప్రాప్తిశ్చ పుణ్యం పాపం తథైవచ ॥
14 - మహేంద్రోమలయః సహ్యః శుక్తిమాన్ ఋక్షపర్వతః ।
వింధ్యశ్చపారియాత్రశ్చ సప్తాత్రకులపర్వతాః ॥
15 - తథాన్యేశతసాహస్రా భూధరా మధ్యవాసినః ।
విస్తారోచ్చ్రాయిణోరమ్యా విపులాః శుభసానవః ॥
16 - కోలాహలః సవైభ్రాజోఃమందరోధర్దురాచలః ।
వాతందమో వైద్యుతశ్చ మైనాకః సరసస్తథా ॥
17 - తుంగప్రస్థోనాగగిరి స్తథా గోవర్ధనాచలః ।
ఉజ్జాయనః పుష్పగిరి రర్భుదోరైవత స్తథా ॥
18 - ఋష్యమూకః సగోమంత శ్చిత్రకూటః కృతస్మరః ।
శ్రీపర్వతః కొంకణశ్చ శతశోన్యేపి పర్వతాః ॥
19 - తైర్విమిశ్రాజనపదా మ్లేచ్చా ఆర్యాశ్చ భాగశః ।
తైః పీయంతే నరిచ్చ్రేష్టా యాస్తాః సమ్యజ్ నిశామయ ॥
20 - సరస్వతీ పంచరూపా కాళిందీసహిరణ్వతీ ।
శతద్రుశ్చంద్రికానీలా వితస్త్రైరావతీ కుహూః ॥
21 - మధురాహారరావీచ ఉశీరా ధాతుకీ రసా ।
గోమాతీదూతపాపాచ బాహుదా నదృషద్వతీ ॥
22 - నిశ్చిరా గండకీ చిత్రా కౌశికీచవదూనరా ।
సరయూశ్చ సలౌహీత్యా హిమవత్పాదనిఃసృతాః ॥
ఇక భారత వర్షం-యింద్ర ద్వీపం, కసేరుమాన్, తామ్రవర్ణం, గభస్తిమాన్ నాగద్వీపం, కటాహం, సింహళం, వారుణం, కుమారం అనే తొమ్మిది ద్వీపాలుగా విభక్తమైంది. దానిలో యిది దక్షిణోత్తర దిశలో సముద్రం చేత చుట్టబడియున్న కుమార ద్వీపం. ఓ వీరుడా! దీనికి తూర్పున కిరాతులు, పడమట యవనులు. దక్షిణాన ఆంధ్రులు ఉత్తర సీమన తురుష్కులు ఉన్నారు, అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తదితర జాతులవారు యజ్ఞాలు, యుద్ధాలు, వాణిజ్యం, గోపాలనం మొదలయిన విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ పవిత్రులైనారు. వారల పరస్పర ఆచరణలు, స్వర్గమోక్ష సంపాదనము, పుణ్య పాపాలు, కర్మాచరణాన్ననుసరించి నిర్ణయింపబడుతవి. అక్కడ మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, ఋక్ష, వింధ్య పారియాత్రములనే సప్తకుల పర్వతాలున్నవి. ఈ ప్రధాన గిరులు కాక వందలు వేల సంఖ్యలో విస్తార వైశాల్యాలు గలిగి రమణీయాలయిన యితర పర్వతాలు కూడ ఉన్నవి. కోలాహలం వైబ్రాజం, మందరం, దుర్దురం వాతంధమం వైద్యుతం, మైనాకం సరసం, తుంగప్రస్థం, నాగగిరి, గోవర్ధనాచలం, ఉజ్జాయనం, పుష్పగిరి, ఆర్భుదం, రైవతం, ఋష్యమూకం, గోమంతం, చిత్రకూటం, కృతస్మరం, శ్రీపర్వతం, కొంకణం వానిలో కొన్ని. ఈ పర్వత ప్రదేశాలతో కలిసి మ్లేచ్చ ఆర్యజనపదాలెన్నో వెలిశాయి. వీనికి జల ప్రదానం గావించే శ్రేష్ఠ నదులను గురించి చెబుతున్నాము. జాగ్రత్తగా వినుము. సరస్వతి, పంచరూప, కాళింది, హిరణ్వతి, శతద్రు, చంద్రిక, నీల, వితస్త, ఐరావతి, కుహూ, మధురా, హారరావీ, ఉశీర, ధాతుకి, రసా, గోమతి, దూతపాపా, బాహుద, దృషద్వతి, నిశ్చిరా, గండకి, చిత్ర, కౌశికీ, వదూసరా, సరయూ, లౌహిత్య ఈ నదులు హిమవత్పాద భూమినుంచి ఉద్గమిస్తాయి.
23 - వేదస్మ్రుతి ర్వేదసినీ వృత్రఘ్నీ సింధురేవచ ।
పర్ణాశానందినీచైవ పావనీచ మహీతథా ॥
24 - పారాచర్మణ్వతీ లూపీవిదిశా వేణుమత్యపి ।
సిప్రాహ్యవంతీచతథా పారియాత్రాశ్ర యాస్మృతాః ॥
25 - శోణోమహానదశ్చైవ నర్మదాసురసా కృపా ।
మందాకినీదశార్ణాచ చిత్రకూటాపవాహికా ॥
26 - చిత్రోత్పలావైతమసా కరమోదా పిశాచికా ।
తథాన్యాపిప్సలశ్రోణీ విపాశావంజులావతీ ॥
27 - నత్సంతజాశుక్తిమతీ మంజిష్టా కృత్తిమావసుః ।
ఋక్షపాదవ్రసూతాచ తథాన్యా బలవాహినీ ॥
28 - శివా పయోష్నీనిర్వింధ్యా తాపీ సనిషదావతీ ।
వేణా వైతరణీ చైవ సినీవాహుః కుముద్వతీ ॥
29 - తోయాచైవ మహాగౌరీ దుర్గందావా శిలాతథా ।
వింధ్యపాదప్రసూతాశ్చ నద్యః పుణ్యజలాః శుభాః ॥
30 - గోదావరీ భీమరథీ కృష్ణావేణా సరస్వతీ ।
తుంగభద్రా సుప్రయోగా బాహ్యా కావేరిరేవచ ॥
31 - దుగ్దోదానలినీరేవా వారిసేనా కలస్వనా ।
ఏతాస్త్వపిమహానద్యః సహ్యపాదవినిర్గతాః ॥
32 - కృతమాలాతామ్రపర్ణీ వంజులా చోత్పలావతీ ।
సినీచైవసుదామాచ శుక్తిమత్ప్రభవాస్త్విమాః ॥
33 - సర్వాః పుణ్యాః సరస్వత్యః పాపప్రశామనాస్తథా ।
జగతోమాతరః సర్వాః సర్వాః సాగరయోషితః ॥
34 - అన్యాః సహస్రశశ్చాత్ర క్షుద్రనద్యో హి రాక్షస ।
సణాకాలవహాశ్చాన్యాః ప్రావృట్కాలవహాస్తథా ।
ఉదజ్ మధ్యోద్బవా దేశాః పిబంతి స్వేచ్చయాశుభాః ॥
వేదస్మ్రుతి, వేదసినీ, వృత్రఘ్ని, మహీ, పారా, చర్మణ్వతి, లూపి, విదిశా, వేణుమతి, సిప్ర, అవంతీ అనే నదులు పారియాత్రగిరి నాశ్రయించియున్నవి. శోణా,మహానది, నర్మద, సురస, కృపా, మందాకిని, దశార్ణ, చిత్రకూటా, అపబాహిక, చిత్రోత్పల, తమసా, కరమోద, పిశాచిక, పిప్పలశ్రోణి, విపాశ, వంజులావతి, సత్సంతజ, శుక్తిమతి, మంజిష్టా, కృత్తిమా, వస, తదితర నదులు ఋక్షగిరి నుంచి ప్రభవించినవి. శివ, పయోష్టి, నిర్వింధ్య, తాపి, నిషదావతి, వేణా వైతరణీ, సినీబాహు, కుముద్వతి, తోయా, మహాగౌరీ, దుర్గందా, వాశిలా, యీ పవిత్ర నదులు వింధ్య పాద మూలాన ప్రభవించినవి. గోదావరి, భీమరథీ, కృష్ణా, వేణా, సరస్వతి, తుంగభద్ర, సుప్రయోగా, వాహ్య, కావేరి, దుగ్దోద, నళినీ, రేవా, వారిసేన, కలస్వనా, ఈ మహాతరంగిణులు సహ్యాద్రి కుమారికలు, కృతమాల, తామ్రపర్ణి, వంజుల, ఉత్సలాపతి, సినీ, సుదామ, యివి శుక్తిమత్పర్విత పుత్రికలు, ఈ నదులన్నీ పరమ పవిత్రాలు, సాగర పత్నులు, రాక్షసవరా! యింకా ఎన్నో వేలాది క్షుద్ర నదులున్నవి. కొన్ని అన్ని ఋతువుల్లో ప్రవహించేవి కాగా యితరాలు వర్షాకాలంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ తమకందుబాటు గల ప్రదేశాలకు పుష్కలంగా జలప్రదానం చేస్తాయి.
35 - మత్సాఃకుశట్టాః కుణికు౦డలాశ్చ ।
పాంచాలకాశ్యాః సహకోసలాభిః ॥
36 - వృకాఃశబరకౌవీరాః సభూలింగాజనాస్త్విమే ।
శకాశ్చైవసమశకా మధ్యదేశ్యాజనాస్త్విమే ॥
37 - బాహ్లీకావాటదానాశ్చ అభీరాః కాలతోయకాః ।
అపరాంతా స్తథాశూద్రాః పహ్లావాశ్చసఖేటకాః ॥
38 - గాంధారాయావనాశ్చైవ సిందుసౌవీరమద్రకాః ।
శాతద్రవాలలిత్థాశ్చ పారావతసమూషకాః ॥
39 - మాఠరోదకదారాశ్చ కైకేయా దశమాస్తథా ।
క్షత్రియాః ప్రాతివైశ్యాశ్చ వైశ్యశూద్రకులానిచ ॥
40 - కాంబోజాదరదా శ్చైవ బర్బరాహ్యంగలౌకికాః ।
చీనాశ్చైవతుషారాశ్చ బహుదా బాహ్యతోదరాః ॥
41 - ఆత్రేయాఃసభరద్వాజాః ప్రస్థలాశ్చదశేరకాః ।
లంపకాస్తావకారామాః శూలికాస్తంగణైఃసహ ॥
42 - ఔరసశ్చాలిమద్రాశ్చ కిరాతానాంచజాతయః ।
తామసా క్రమమాసాశ్చ సుపార్శ్వాః పుండ్రకాస్తథా ॥
43 - కులూతాః కుహుకా ఊర్ణా స్తూణీపాదాః సకుక్కుటాః ।
మాండవ్యా మాలవీయాశ్చ ఉత్తరాపథవాసినః ॥
మత్స్య, కుశట్ట, కుణి, కుండల, పాంచాల, కాళీ, కోసల, వృక, శబర, కౌవీర, సభూలింగ, శక, సమశక, జనపదాలు మధ్యదేశం లోనివి. వాహీక, వాటదాన, అభీర, కాలతోయక, అపరాంత, శూద్ర, పహ్లవ, ఖేటక, గాంధార, యవన, సింధు, సౌవీర, మద్రక, శతద్రవ, లలిత్థ్హ , పారావత, మూషక, మాకర, ఉదాకదార, కైకేయ, దశమజన పదస్థులు క్షత్రియ వైశ్య శూద్ర కులాలవారు వైశ్యుల స్థానంలోను, కాంబోజ, దరద, బర్బర, అంగలౌకిక, చీన, తుషార తదితరులు, జనపదాలకు వెలుపలను ఉందురు. ప్రస్థలులు, ఆత్రేయులు, భరద్వాజులు, దశేరకులు, లంపకులు, తాపకులు, రాములు, శూలికులు, తంగణులు, ఔరసులు, ఆలిమద్ర, కిరాత జాతులవారు, తామసులు, క్రమమాసలు, సుపార్శ్వులు, పుండ్రకులు, కులూతులు, కుహుకులు, ఊర్ణులు, తూణిపాదులు, కుక్కుటులు, మాండవ్యులు, మాలవీయులు వీరంతా ఉత్తరాపథవాసులు.
44 - అంగావంగా ముద్గరవా స్త్వంతర్గిరిబహిర్గిరాః ।
తథాప్రవంగా వంగేయా మాంసాదా బలదంతికాః ॥
45 - బ్రహ్మోత్తరాః ప్రావిజయా భార్గవాః కేశవర్వరాః ।
ప్రాగ్జ్యోతిషాశ్చశూద్రాశ్చ విదేహా స్తామ్రలిప్తకాః ॥
46 - మాలామగధగోనందాః ప్రాచ్యాజనపదా స్త్విమే ।
పుండ్రాశ్చ కేరళాశ్చైవ చౌడాః కుల్యాశ్చ రాక్షస ॥
47 - జాతూషామూషికాదాశ్చ కుమారాదామహాశకాః ।
మహారాష్ట్రామాహిషికాః కాలింగాశ్చైవ సర్వశః ॥
48 - ఆభీరాఃసహనైషీకా ఆరణ్యాః శబరాశ్చయే ।
వలి౦ధ్యావింధ్యమౌళేయా వైదర్భా దండకైఃసహ ॥
49 - పౌరికాఃసౌశికాశ్చైవ ఆశ్మకాభోగవర్ధనాః ।
వైషికాః కుందలా ఆంధ్రా ఉద్భిదానలకారకాః ॥
50 - సూర్పరకాఃకారివనా దుర్గాస్తాలీకటైఃసహ ।
పులీయాః ససినీలాశ్చ తాపసాస్తామసాస్తథా ॥
51 - కారస్తరాస్తురమినో నాసిక్యాంతర నర్మదాః ।
భారకచ్చాః సమాహేయాః సహసారస్వతైరపి ॥
52 - వాత్యేయాశ్చ సురాష్ట్రాశ్చ అవంత్యాశ్చర్బుదైఃసహ ।
ఇత్యేతే పశ్చిమామాశాం స్థితా జానపదాజనాః ॥
53 - కారుషైశ్చాకలవ్యాశ్చ మేకలాశ్చోత్కలైస్సహ ।
ఉత్తమర్ణాదశార్ణాశ్చ భోజాఃకింకవరైఃసహ ॥
54 - తోశలాఃకోశాలాశ్చైవ త్రైపురాశ్చైల్లికాస్తథా ।
తురుసాస్తుంబరాశ్చైవ వాహనా నైషధైఃసహ ॥
55 - ఆనూపాస్తుండి కేరాశ్చ వీతహోత్రాస్త్వవంతయః ।
సుకేశే వింధ్యమూలస్థా స్త్విమేజనపదాఃస్మృతాః ॥
56 - అథోదేశాన్ ప్రవక్ష్యామ్యః పర్వతాశ్రయిణస్తుయే ।
నిరాహారాహంసమార్గాః కుపథాస్తంగణాఃఖశాః ॥
57 - కథప్రావరణాశ్చైవ ఊర్ణాః పుణ్యాః సహూహుకాః ।
త్రిగర్తాశ్చ కిరాతాశ్చ తోమరాః శిశిరాద్రికాః ॥
58 - ఇమేత వోక్తావిషయాః సవిస్తరాత్ ద్వీపేకుమారేరజనీచరేశ ।
ఏతేషు దేశేషు చ దేశాధర్మాన్ సంకీర్త్యమానాన్ శ్రుణుతత్త్వతోహి ॥
అంగ, వంగ, ముద్గరవ, అంతర్గిరి, బహిర్గిరి, ప్రవంగ, వాంగేయ, మాంసాద, బలదంతిక, బ్రహ్మోత్తర ప్రావిజయ, కేశబర్బర, ప్రాగ్జ్యోతిష, శూద్ర, విదేహ, తామ్రలిప్తక, మాల, మాగధ, గోనందులు తూర్పు జానపదాలు. రాక్షసేశ్వరా! పుండ్ర, కేరళ, చౌడ, కుల్య, జాతుష, మూషికాద, కుమారాద, మహాశక, మహారాష్ట్ర మాహిషక, కళింగ, అభీర, నైషీక, అరణ్య, శబర,బలిందయ, వింధ్య, మౌళేయ, వైదర్భ, దండక, పౌరిక, సౌశిక, అశ్మక, భోగవర్ధన, నైషిక, కుందల, ఆంధ్ర, ఉద్భిద, నలకారక, జానపదాలు దక్షిణ దిశన గలవు. సూర్పారక, కారివన, దుర్గ, తాళీకట, పుళీయ, ససినీల, తాపస, తామస, కారస్కర, రమిన, నాసిక్యాంతర, నర్మదా, భారకచ్చ, మాహేయ, సారస్వత, వాత్సేయ, సౌరాష్ట్ర, అవంత్య, అర్బుద –యివి పశ్చిమాన గల జానపదాలు. అక్కడి జనులు కారుష, ఏకలవ్య, మేకల, ఉత్కల,ఉత్తమర్ణ, దశార్ణ, భోజ, కిమ్కవర, తొసల, కోసల, త్రైపుర, చైల్లిక(ఇల్లిక?), తురుస, తుంబుర, వహన, నైషధ, అనూప, తుండికేర, వీతిహోత్ర, అవంతి, ఓ సుకేశీ! ఈ జానపదాలు వింధ్యాద్రిపాద మూలాన ఉన్నవి. ఇక పర్వత ప్రదేశాలలోని జానపదాలు యివి, నిరాహార, హంసమార్గ, ఊర్ణ, పుణ్య, కుపథ, తంగణ, ఖశ, కుథప్రావరణ, హుహుక, త్రిగర్త, కిరాత,తోమర, హిమవన్నగ ప్రదేశాలు. రజనీచరవతా! కుమార ద్వీపంలోని జనపదాలను గురించి విపులంగా చెప్పితిమి. ఇక ఈ ప్రదేశాలలో ఆచరించబడే ధర్మాచారాలను వివరించెదము వినుము.
అధ్యాయము 13 complete
Summary of chapter 13 of the Vāmana Mahā Purana is as follows:
The narrative presents a comprehensive cosmic vision of Bhuvana-Kosha, describing the structure of the fourteen worlds comprising the upper heavenly spheres, the middle earthly plane, and the lower nether realms. The details include the dimensions of Jambūdvīpa, the sacred Mount Meru at the center of the world, the surrounding oceans, and the movements of the sun, moon, and planetary constellations. This cosmic mapping reinforces the grandeur of the Supreme Being, whose divine energy sustains the intricate blueprint of the cosmos across infinite space and time.