అధ్యాయము 5

కశ్యప

1 - నమో_స్తుతే దేవదేవ ఏకశృంగ వృషార్చే

2 - సింధువృష వృషాకపే సురవృష అనాదిసంభవ

3 - రుద్ర కపిల విష్వక్షేన సర్వభూతపతే ధ్రువ

4 - ధర్మాధర్మ వైకుంఠ వృషావర్త అనాదిమధ్యనిధన

5 - ధనంజయ శుచిశ్రవః పృశ్నిగర్భ నిజజయ

6 - అమృతేశయ సనాతన త్రిధామ తుషిత మహాతత్త్వ

7 - లోకనాథ పద్మనాభ విరించే బహురూప అక్షయ

8 - అక్షర హవ్యభుజ ఖండపరశో శక్ర ముంజకేశ

9 - హంస మహాదక్షిణ హృషీకేశ సూక్ష్మ మహానియమధర

10 - విరజలోకప్రతిష్ట ఆరూప అగరాజ ధర్మజ ధర్మనాభ

11 - గాభస్తినాభ శతక్రతునాభ చంద్రరథ సూర్యతేజః

12 - సముద్రవాసః అజ సహస్రశిరః సహస్రపాద

13 - అధోముఖ మహాపురుష పురుషోత్తమ సహస్రబాహో

14 - సహస్రమూర్తే సహస్రాస్య సహస్రంభవ సహస్రసత్వం

15 - త్వామహుః పుష్పహాస చరమ త్వమేవ వౌషట్

16 - వషట్కారం త్వామాహురగ్ర్యం మఖేషు ప్రాశితారం సహస్రధారం

17 - చ భూశ్చభువశ్చ స్వశ్చ త్వమేవ వేదవేద్య బ్రహ్మశయ

18 - బ్రాహ్మణప్రియ త్వమేవ ద్యౌరసి మాతరిశ్వా_సి

19 - ధర్మో_సి హోతా పోతా మంతా నేతా హోమహేతు స్త్వమేవ

20 - అగ్ర విశ్వధామ్నా త్వమేవ దిగ్భిః సుభాండ

21 - ఇజ్యో_సి సుమేధో_సి సమిధస్త్వమేవ మతి ర్గతిర్

22 - దాతా త్వమసి మోక్షో_సి యోగో_సి సృజసి

23 - ధాతా పరమయజ్ఞో_సి సోమో_సి దీక్షితో_సి దక్షిణా_సి

24 - విశ్వమసి, స్థవిర హిరణ్యనాభ నారాయణ

25 - త్రినయన ఆదిత్యవర్ణ అదిత్యతేజః మహాపురుష

26 - పురుషోత్తమ ఆదిదేవ సువిక్రమ ప్రభాకర

27 - శంభో స్వయంభో భూతాదిః మహాభూతో_సి విశ్వభూత

28 - విశ్వం త్వమేవ విశ్వగోప్తా_సి పవిత్రమసి విశ్వభవ

29 - ఊర్ధ్వకర్మ అమృత దివస్పతే వాచస్పతే ఘృతార్చే

30 - అనంతకర్మ వంశప్రాగ్వంశ విశ్వపాస్త్వమేవ

31 - వరార్ధినాం వరదో_సి త్వం

 చాతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ

 హూయసే చ పునర్ద్వాభ్యాం తుభ్యంహోత్రాత్మనే నమః  ॥        

కశ్యప

ఓ దేవా, ఏకశృంగా, వృషార్చీ, సింధుపతే, వృషాకపీ, సురశ్రేష్ఠ అనాది సంభవా రుద్రా కపిలా విష్వక్షేనా సర్వభూతపతీ, ధృవా ధర్మాధర్మా, వైకుంఠా, వృషావర్తా అనాది మధ్యనిధనా ధనంజయా, శుచిశ్రవా (సత్కీర్తీ), పృశ్నితేజా నిజజయా నీకు నమస్కారము. అమృతేశయా సనాతనా, త్రిదామా, తుషితా, మహాతత్వా, లోకనాతా, పద్మనాభా, విరించీ, బహురూపా, అక్షయా, అక్షరా, హవ్యభోజీ, ఖండపరశూ, శక్రా, ముంజకేశా, హంసా, మహాదక్షిణా, హృషీకేశా, సూక్ష్మా, మహానియమధరా, విరజా, లోకప్రతిష్ఠా, ఆరూపా, అగ్రజా, ధర్మజా ధర్మనాభా నీకు ప్రణామాలు. గాభస్తినాభా శతక్రతునాభా చంద్రరథా సూర్యతేజా, సముద్రవసనా, ఆజా, సహస్రశీర్షా, సహస్రచరణా, అదోముఖా మహాపురుషా, పురుషోత్తమా, సహస్రబాహూ, సహస్రరూప, సహస్రముఖా, సహస్రసంభవా, సహస్రసత్త్వా, నిన్ను ఈ విధంగా వర్ణిస్తారు. ఓ పుష్పహాసా, చరమా, వౌషట్ వషట్ కారాలు నీవే. నిన్ను మొదటివాడనీ యజ్ఞభోక్తవనీ, సహస్రదారివనీ భూర్భువః సువర్లోక రూపుడవని, వేదవేద్యుడవు మహాశయుడవు బ్రహ్మణప్రియుడవనీ అంటారు. అంతరిక్షం, వాయువు ధర్మానివీ నీవే. హోతవు, పురోహితుడవు నీవే, మంత్రనివి నీవే. నేతవు, హోమహేతువు నీవే. నీవే అగ్ర్యుడవు, విశ్వదాముడవు. దిక్కులు నీవు. సుభాండము, యజింపబడదగినవాడవు, చక్కని మేధస్వరూపివి నీవే. సమిధలు, మతిగతి, దాతవు నీవే. మోక్షం నీవు. యోగం నీవు. స్రష్టవు నీవు. ధాతవు, పరమయజ్ఞానివి. సోమరసానివి, దీక్షితుడవు, యజ్ఞదక్షిణవు. విశ్వానివీ నీవే. స్థవిరుడవు, హిరణ్యనాభుడవు, నారాయణుడవు, త్రినేత్రుడవు, ఆదిత్యవర్ణుడవు. ఆదిత్య తేజస్వియగు మహాపురుషుడవు, పురుషోత్తముడవు ఆదిదేవుడవు సువిక్రముడవు ప్రభాకరుడవు, శంకరుడవు, స్వయంభువు నీవే. సమస్త భూత జాలానికి ఆదివి, మహాభూతానివి, విశ్వభూతానివి, విశ్వానివి, విశ్వరక్షకుడవు నీవే. నీవు పవిత్రుడవు. విశ్వభవుడవు,మ్ ఊర్ధ్వకర్మావు, అమృతానివి, దివస్పతివి, వాచస్పతివి,ఘృతార్చివి, వంశానివి, ప్రాగ్వంశానివి (అన్ని వంశాలకు మూలం). విశ్వరక్షకుడవు నీవే, ఆర్థులకు కామ్యాలు వర్షించే వరడవగు నీకు నమస్కారం. నిన్ను నాలుగు మరి నాలుగు, రెండు మరియు అయిదు మరల రెండు హోమాలతో అర్చిస్తారు. అట్టి హోత్రాత్మ ( యజ్ఞరూపి) వాగు నీకు ప్రభో ! నమస్సులు !

అధ్యాయము 5 complete