వామన మహా పురాణము
అధ్యాయము 2
పులస్త్యుడు
1 - తత స్త్రీనేత్రస్య గతః ప్రావృట్కాలో ఘనోపరి ।
లోకానందకరీ రమ్యా శరత్ సమభవ న్మునే ॥
2 - త్యజంతి నీలాంబుధరా నద స్థలం వృక్షాంశ్చ కంకాః సరిత స్తటాని ।
పద్మాః సుగందం నిలయాని వాయసా రురు ర్విషాణం కలుషం జలాసయాః
3 - వికాస మాయాంతి చ పంకజాని చంద్రాంశవో భాంతి లతాఃసుపుష్టా: ।
నందంతి హృష్టాన్యపి గోకులాని సంతశ్చ సంతోష మనువ్రజంతి ॥
4 - సరస్సు పద్మా గగనే చ తారకా జలాశయే ష్వేవ తథా పయాంసి ।
సతాం చ చిత్తం హి దిశాం ముఖై : నమం వైమల్య మాయాంతి శశాంకకాంతయః
పులస్త్యుడు
ఆ విధముగ త్రినేత్రుడు మేఘమండలముపైన వర్షర్తువు గడపెను. అంతట లోకమున కంతకూ ఆనందము ప్రసాదిస్తూ రమ్యమైన శరదృతువేతేంచెను. ఓ మునీ! నీలి మొగిళ్ళాకటకటిగ ఆకాశాన్ని వదలినవి. చెట్లను కంద (గడ్డలు)ములు, నదులు (ప్రవాహములు)తమ ఒడ్డులు, తామరలు తమవాసనలు, కాకులు తమ నెలవులు, రురు జింకలు తమ కొమ్ములు, పంకాన్ని (బురద)జలాశయాలు విసర్జించినవి. పద్మములు వికసించినవి. చంద్ర కిరణాలు కొత్తకాంతులు సంతరించుకొనినవి. లతలు పుష్పవతులయినవి, ఆలమందలు ఆనంద తుండిలములయినవి. మహాంతులగు సాధువులు సంతుష్టాంతరంగులైరి. కొలకులలో తామరలు, ఆకాశాన తారకలు, జలాశయాల్లో నీరములు, సాధుజనుల అంతరంగాలు, దిసాముఖాలు, వీటన్నింటితోబాటు శశాంకకాంతులు నైర్మల్యాన్ని సంతరించుకొనినవి.
5 - ఏతాదృశే హరః కాలే మేఘపృష్టాదివాసినీం ।
సతీ మాదాయ శైలేంద్రం మందరం సముపాయయౌ ॥
6 - తతో మందరపృష్టే –సౌ స్థితః నమ శిలాతలే ।
రరామ శంబుర్బగవాన్ సత్యా సహ మహాద్యుతిః
7 - తతో వ్యతీతే శరది ప్రతి బుద్దే చ కేశవే ।
దక్షః ప్రజాపతి శ్రేష్టో యష్టు మారభత క్రతుమ్ ॥
8 - ద్వాదశైవ సచాదిత్యాఞ్ శక్రాదీంశ్చ సురోత్తమాన్ ।
నికశ్యపాన్ సమామంత్ర్య సదస్యాన్ సమచీకరత్ ॥
9 - ఆరుంధత్యాచ సహితం వసిష్ఠం శంసితవ్రతమ్ ।
సహనసూయయా – త్రిం చ సహధృత్యా చ కౌశికమ్ ॥
10 - అహల్యయా గౌతమంచ భరద్వాజ మమాయయా ।
చంద్రయా సహితం బ్రహ్మన్ ఋషి మంగిరసం తథా ॥
11 - అమంత్ర్య కృతవాన్ దక్షః సదస్యాన్ యజ్ఞసంసది ।
విధుషో గుణసంపన్నాన్ వేదవేదాంగపారగాన్ ॥
12 - ధర్మం చ స సమాహూయ భార్యయా –హింసయా సహః ।
నిమంత్ర్య యజ్ఞవాటస్య ద్వారపాలత్వ మాదిశత్ ॥
13 - అరిష్టనేమినం చక్రే ఇద్మాహరణకారిణమ్ ।
భ్రుగుం చ మంత్రసంస్కారే సమ్యగ్ దక్షః ప్రయుక్తవాన్ ॥
14 - తథా చంద్రమనం దేవం రోహిణ్యా సహితం శుచిమ్ ।
ధనానా మాదిపత్యేచ యుక్తవాన్ హి ప్రజాపతిః
15 - జామాతృదుహిత్రూశ్చైవ దౌహిత్రాంశ్చ ప్రజాపతిః ।
సశంకరాం సతీం ముక్త్వా మఖే సర్వాన్ న్యమంత్రయత్ ॥
అలాంటి మనోహర వాతావరణం సమీపించగనే హరుడు దాక్షాయణితో మేఘమండలము నుండి దిగి మందరగిరిని చేరెను . ఆకొండ కొమ్మున చక్కని సమతలమైన శిలావితర్ది మీద జ్యోతిర్మయుడైన శంభుడు సతితో గూడి విహరించెను. రమ్యమైన శరత్కాలము గడచి, (ఉత్తానైకాదశి) ఉత్తరాయణము ప్రవేశించుటతో, ప్రజాపతి శ్రేష్ఠుడైన దక్షుడొక క్రతువును ప్రారంభించెను. ఆయజ్ఞానికి ద్వాదశాధిత్యులను, ఇంద్రాది దేవశ్రేష్టులను, కశ్యపమహర్షిని ఆహ్వానించి సదస్యులను గావించెను. సువ్రతుడైన అరుంధతీ వసిష్టులను, అత్రి అనసూయలను, ధృతికౌశికులను, అహల్యా గౌతములను, అమాయా భారద్వాజులను, చంద్రాంగిరసులను దక్షుడు తన యజ్ఞమున కాహ్వానించి ఆవేదవిదులైన సద్గుణజనులను యాజ్ఞకులుగ నియమించెను. అహింసాదేవీ సమేతుడై ధర్ముని పిలిచి ఆయజ్ఞవాటికకు ద్వారపాలకునిగ నుంచెను. అరిష్టనేమికి సమిధలు కొని వచ్చు పనినప్పగించెను. భృగు మహర్షికి మంత్ర సంస్కార బాధ్యత నొసగెను. అనంతరము రోహిణి సహితుడైన చంద్రునకు ధనాదిపత్యమొసగి, సతీశంకరులను తప్ప తక్కిన అల్లుండ్రను కూతుండ్రను దౌహిత్రులను అందరను క్రతువుకు దక్షుడు పిలిపించుకొనెను.
నారదుడు
16 - కిమర్థం లోకపతినా ధనాధ్యక్షో మహేశ్వరః ।
జ్యేష్ఠ:శ్రేష్టో వరిష్టో-పి ఆద్యో –పి న నిమంత్రితః ॥
నారదుడు
సర్వ లోకేశ్వరుడు, ధనేశ్వరుడు, అందరిలోకి శ్రేష్ఠుడు, జ్యేష్టుడు ఆద్యుడూనైన మహేశ్వరుడు వరిష్టుడైనను, ఆయనను దక్షుడేల పిలువనంప లేదు?
పులస్త్యుడు
17 - జ్యేష్ఠ: శ్రేష్టో వరిష్టో-పి ఆద్యో –పి భగావాన్శివః ।
కపాలీతి విదిత్వేశో దక్షేణ న నిమంత్రితః
పులస్త్యుడు
మునీ ।
అన్ని విధాల జ్యేష్టుడూ వరేన్యుడూ భగవంతుడునైనను కపాలి (చేతిలో పుర్రె కలవాడు) అయినందువలన దక్షుడు ఆయనను ఆహ్వానించ లేదు.
నారదుడు
18 - కిమర్థం దేవతాశ్రేష్టః శూలపాణి స్త్రీలోచనః ।
కపాలీ భగవాన్ జాతః కర్మణా కేన శంకరః
నారదుడు
బ్రహ్మర్షీ ।
దేవశ్రేష్టుడు, శూలపాణి, త్రినేత్రుడునగు శంకరుడేకారణమున కపాలియాయెను?
పులస్త్యుడు
19 - శ్వణుష్వావహితో భూత్వా కథా మేతాం పురాతనీమ్ ।
ప్రోక్తా మాదిపురాణేచ బ్రాహ్మణా వ్యక్తమూర్తినా ॥
20 - పురా త్వేకార్ణవం సర్వం జగత్ స్థావర జంగమమ్ ।
నష్ట చంద్రార్క నక్షత్రo ప్రనష్టపవనానలమ్,
21 - ఆప్రతర్క్య మవిజ్ఞేయం భావాభావవివర్జితమ్ ।
నిమగ్న పర్వత తరుం తమోభూతం సుదుర్ధశమ్ ॥
పులస్త్యుడు
నారదా! అవ్యక్త బ్రహ్మ ఆదిపురాణంలో చెప్పిన ఈ ప్రాచీన గాధను శ్రద్ధగా వినుము. తొల్లి స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయు ఏకార్ణవమై సూర్య చంద్ర పవనానలాలు నశించిపోయినవి. తరు పర్వతాదులను ముంచివేసి ఊహకూ తర్కానికి అందక ఏ మాత్రము తెలియరాని అందతమస్సు సర్వత్రా వ్యాపించింది.
22 - తస్మిన్ న శేతే భగవాన్ నిద్రాం వర్ష సహస్రకీమ్ ।
రాత్ర్యంతే సృజతే లోకాన్ రాజసం రూప మాశ్రితమ్ ॥
23 - రాజసః పంచవదనో వేదవేదాంగ పారగః ।
స్రష్టా చరాచరస్యాన్య జగతోద్బుత దర్శనః ॥
24 - తమోమయ స్తథైవాన్యః సముద్బూత స్త్రీలోచనః ।
శూలపాణి కపర్దీచ అక్షమాలాంచ దర్శయన్ ॥
25 - తతో మహాత్మా హ్యసృజత్ అహంకారం సుదారుణమ్ ।
యేనాక్రాంతా వుభౌ దేవౌ తావేవ బ్రహ్మశంకరౌ ॥
26 - అహంకారావృతో రుద్రః ప్రత్యువాచ పితామహమ్ ।
కో భావా నిహ సంప్రాప్తః కేన సృష్టో సి మాం వద ॥
27 - పితామహోప్యహంకారాత్ ప్రత్యువాచాథ కో భవాన్ ।
భవతో జనకః కోత్ర జననీ వా తదుచ్యతామ్ ॥
28 - ఇత్యన్యోన్యం పురా తాబ్యాం బ్రహ్మేశాభ్యాం కలిప్రియ ।
పరివాదోభవ త్తత్ర ఉత్పత్తి ర్బవతో భవత్ ॥
29 - భవానప్యంతరిక్షంహి జాతమాత్ర స్తదోత్పతత్ ।
ధారయ న్నతులాం వీణాం కుర్వన్ కిలకిలా ధ్వనిమ్ ॥
30 - తతో వినిర్జితః శంభు ర్మానినా పద్మయోనినా ।
తస్థా వదోముఖో దీనో గ్రహక్రాంతో యథా శశీ ॥
31 - పరాజితే లోకపతౌ దేవేన పరమేష్టినా ।
క్రోదాంధకారితం రుద్రం పంచమో –థ ముఖో-బ్రవీత్ ॥
32 - అహం తే ప్రతిజానామి తమోమూర్తే త్రిలోచన ।
దిగ్వాసా వృషభారూఢో లోకక్షయకరో భవాన్ ॥
33 - ఇత్యుక్తః శంకరః క్రుద్దో వదనం ఘోరచక్షుషా ।
నిర్ధగ్దుకామ స్త్వనిశం దదర్శ భగవా నజః ॥
34 - తత స్త్రీనేత్రస్య సముధ్బవంతి వక్త్రాణి పంచాథ సుదర్శనాని ।
శ్వేతం చ రక్తం కనకావదాతం నీలం తథా పింగజటం చ శుభ్రమ్ ॥
35 - వక్త్రాణి దృష్ట్వార్కనమాని సద్యః పైతామహం వక్త్ర మువాచ వాక్యమ్ ।
సమాహ తస్యాథ జలస్య బుద్బుదా భవంతి కిం తేషు పరాక్రమోస్తి ॥
36 - తచ్చ్రుత్వా క్రోధయుక్తేన శంకరేణ మహాత్మనా ।
నఖాగ్రేణ శిరశ్చిన్నం బ్రాహ్మం పరుషవాదినమ్ ॥
37 - తచ్చిన్నం శంకరస్యైవ సవ్యే కరతలేసతత్ ।
సతతే న కదాచిచ్చ త చ్చంకరకరా చ్చిరః ॥
38 - అథ క్రోధావృతేనాపి బ్రహ్మణాద్బుతకర్మణా ।
సృష్టస్తు పురుషో ధీమాన్ కవచీ కుండలీ శరీ ॥
39 - ధనుష్పాణి ర్మహాబాహు ర్బాణశక్తిధరోవ్యయః ।
చతుర్బుజో మహాతూణి ఆదిత్యసమదర్శనః
40 - న ప్రాహ గచ్చ దుర్బుద్దే మా త్వాం శూలిన్ నిపాతాయే ।
భవాన్ పాపసమాయుక్తః పాపిష్టం కో జిమాంసతి ॥
41 - ఇత్యుక్తః శంకర స్తేన పురుషేణ మహాత్మనా ।
త్రపాయుక్తో జగామాథ రుద్రో బదరికాశ్రమమ్ ॥
42 - నరనారాయణ స్థానం పర్వతే హి హిమాశ్రయే ।
సరస్వతీ యత్ర పుణ్యా న్యందతే సరితాం వరా ॥
43 - తత్ర గత్వా చ తం దృష్ట్వా నారాయణ మువాచ హ ।
బిక్షాం ప్రయచ్చ భగవన్ మహాకాపాలికోస్మి భోః ॥
44 - ఇత్యుక్తో దర్మపుత్రస్తు రుద్రం వచన మబ్రవీత్ ।
సవ్యం భుజం తాడయస్వ త్రిశూలేన మహేశ్వర,
45 - నారాయణ వచః శ్రుత్వా త్రిశూలేన త్రిలోచనః ।
సవ్యం నారాయణ భుజం తాడయామాన వేగవాన్
46 - త్రిశూలాభిహతా న్మార్గాత్ తిస్రో దారా వినిర్యియుః ఏకా గగన మాక్రమ్య స్థితా తారాభిమండితా ॥
47 - ద్వితీయా న్యపతద్ భూమౌ తాం జగ్రాహ తపొధనః ।
అత్రి స్తస్మాత్ సముద్బూతో దుర్వాసాః శంకరాంశతః ॥
48 - తృతీయా న్యపతద్ దారా కపాలే రౌద్రదర్శనే ।
తస్మా చ్ఛిశుః సమభవత్ సంనద్దకవచో యువా ॥
49 - శ్యామావదాతః శరచాపపాణి ర్గర్జన్యథా ప్రావృషి తోయదోసౌ ।
ఇత్థం బ్రువన్ కస్య విశాతయామి స్కంధా చ్ఛిరస్ తాలఫలం యథైవ ॥
50 - తం శంకరోభ్యేత్య వచో బభాషే నరంహి నారాయణ బాహు జాతమ్ ।
నిపాతయైనంనం నర దుష్టవాక్యం బ్రహ్మాత్మజం సూర్యశత ప్రకాశమ్ ॥
అందులో భగవంతుడు వెయ్యేండ్ల కాలము నిద్రతో ఉండి ఆ నిశాంతాన రాజసరూపం ధరించి లోకాలను సృష్టించెను. ఆ జగత్తు నుండి రజోగుణ ప్రధానుడైపంచాముఖాలతో వేద వేదాంగపారగుడగు చరాచర సృష్టికర్త ఉద్భవించెను. అట్లే తమోగుణమయుడు త్రిలోచనుడు శూలపాణి జటాదారియగు రుద్రుడు రుద్రాక్షమాలతో బయటకు వచ్చెను. అంతట భగవంతుడు భయంకరమైన అహంకారమును సృష్టించగా నది బ్రహ్మరుద్రుల నావహించెను. అహంకారావృతుడై శంకరుడు బ్రహ్మతో “నీవేవడవు?నిన్నెవరు సృజించి పంపిరో నాకెరింగించు” మనెను. అహంకారమునకు లోనై పితామహుడుకూడా నదేవిధమున “నీవెవడవు నీ తలిదండ్రులెవరని” శంకరుని ప్రశ్నించెను. నారదా! ఈ విధంగా ప్రాచీన కాలాన బ్రహ్మకు రుద్రునకు వివాద మేర్పడినది. నీవాసమయమున నుద్భవించితివి. పుట్టిన వెంటనే ఆసద్రుశమైన వీణపై ఆనంద ధ్వని నెలార్చుచు నీవాకలమున కెరిగితివి అభిమాని యగు బ్రహ్మచే నిర్ణింపబడి శంకరుడు దీనవదనంతో రాహుగ్రస్తుడైన చంద్రునకు వాలే అధోముఖుడై నిలచెను. అవమానభారంతో క్రోధంతో నల్లనైన ముఖంతో నిలచిన రుద్రుని బ్రహ్మయొక్క పంచమ ముఖమిట్లు గద్దించి పలికెను. “శంకరా! తమోమూర్తివైన నీవు దిగంబరుడవై త్రినేత్రాలతో ఎద్దుపై నెక్కి లోకసంహారం చేస్తుంటావని నాకు బాగా తెలియును. ఇదే నీ నిర్వాహకము.” అంతట క్రోధఘార్ణిత తామ్రాక్షుడై శంకరుడు ఆ బ్రహ్మ ముఖమును భస్మం చేయుటకై , ఆగ్నేయదృష్టులతో తిలకించెను. వెంటనే శివునకు శ్వేతారుణ స్వర్ణ నీల పింగళ వర్ణములతో నైదు మనోహరములు పవిత్రములునైన ముఖము లేర్పడెను. సూర్య కాంతితో ప్రకాశించే ఆ ముఖాలను చూచి బ్రహ్మ ముఖము హేళనగ నిట్లు పలికెను. “వానకారు నీళ్ళలో తేలే బుడగలకు నీ ముఖాలకు భేదమేమి ? నీవిదియు నొక పరాక్రమమేనా?” ఆ మాట వినిన వెంటనే శంకరుడు క్రోదోన్మత్తుడై , అట్లు ప్రేలుచున్న బ్రహ్మ ఐదవ ముఖమును కొనగోట నవలీలగ త్రుంచి వైచెను. ఆ విధముగా తెగిన ముఖము వెంటనే శివుని ఎడమ అరచేతి కంటుకోనిపోయి ఎంత ప్రయత్నించినను ఊడిపడదయ్యెను. అద్భుత శక్తిగల బ్రహ్మ అందులకు కోపించి కవచకుండల శరాలంక్రుతుడైన బుద్ధిమంతుడగు పురుషు నొకని సృష్టించెను. అతడాజాను చతుర్బాహువు అవ్యయుడు. నాలుగు చేతులలో ధనుర్భాణములు శక్తిగొప్పదగు అంబులపొది ధరించి సూర్యునివలె వెలుగుచుండెను. ఆ దివ్యపురుషుడు శంకరునితో నిట్లనెను. “దుర్భుద్దే! శంకరా! నీవు పాపిష్టుడవు. నిన్ను నేను సంహరింపను. పాపి నెవడు వధింపనెంచును? ఆ మహాపురుషుని మాటకు సిగ్గుపడి ఖిన్నుడై శంకరుడా ప్రదేశము వదలి బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమం నరనాయణుల తపోభూమి. హిమగిరి ప్రదేశము. పరమ పవిత్రమైన సరస్వతీనది యట ప్రవహించుచుండును. అక్కడకు వెళ్లి నారాయణుని చూచి శంకరుడు “ప్రభో ! మహాకాపాలికుడను. భిక్షార్థినై వచ్చితి” ననెను. అప్పుడు ధర్మపుత్రుడగు నారాయణుడు శంకరుని జూచి మహేశ్వరా! నీ త్రిశూలముతో నా ఎడమ భుజాన్ని కొట్టుమనెను. వెంటనే శంకరుడు తన త్రిశూలముతో నారాయణుని ఎడమ భుజము గట్టిగా ప్రహరించెను. త్రిశూలాఘాతము సోకిన చోటు నుండి మూడు ధారలు నిర్గమించి అందొకటి ఆకాశ మార్గమున స్థిరపడి నక్షత్రములచే నలంకరించ బడెను. భూమిపై దొరలిన రెండవ ధారను తపోధనుడగు నత్రిముని గ్రహించెను. అందుండి ఒక శిశుఉద్భవించెను. అతడు పుట్టుకతోనే శ్యామ మనోహర కాంతితో ధనుర్బాణాలు ధరించి యువకుడై మేఘ గంబీరధ్వనితో నిట్లనెను. “తాళవృక్షం నుండి తాళఫలాలకు వలె నేనెవరి తలలు పడగొట్టవలెనో చెప్పుడు. నారాయణ బాహువు నుండి జన్మించిన ఆ యువకునితో శంకరుడిట్లనెను. ఓ నరుడా! శతార్క ప్రభతో వెలుగుతు దుష్టవాక్యాలు ప్రేలుచున్న బ్రహ్మ పుత్రుడైన ఈ దుష్టుని పరిమార్చుము.
51 - ఇత్యేవ ముక్తః న తు శంకరేణ ఆధ్యం ధనుస్త్వాజగవం ప్రసిద్ధం ।
జగ్రాహ తూణాని తథాక్షయాని యుద్దాయ వీరః స మతిం చకార ॥
52 - తతః ప్రయుద్ధౌ సుభృశం మహాబలౌ బ్రహ్మత్మజో బాహుభవశ్చ శార్వః।
దివ్యం సహస్రం పరివత్సరాణాం తతో హరోభ్యేత్య విరంచి మూచే ॥
53 - జిత స్త్వదీయః పురుషః పితామహ నరేణ దివ్యాధ్బుత కర్మణా బలీ ।
మహావృషత్కై రభిపత్య తాడిత స్థదద్బుతం చేహ దిశో దశైవ ॥
54 - బ్రహ్మ త మీశం వచనం బభాషే నేహాస్య జన్మాన్యజితస్య శంభో ।
పరాజిత శ్చేష్యతేసౌ త్వదీయో నరో మదీయః పురుషో మహాత్మా ॥
55 - ఇత్యేవ ముక్తోవచనం త్రినేత్ర శ్చిక్షేప సూర్యే పురుషం విరించేః ।
నరం నరైస్యైవ తదా స విగ్రహే చిక్షేప ధర్మప్రభవస్య దేవః ॥
శంకరుని ఆదేశము విని ఆ వీరుడజగవమను ప్రసిద్ద ధనుస్సు, అక్షయ తూణీరాన్ని తీసికొని యుద్ధమునకు తలపడెను. అప్పుడు శివ బ్రహ్మలకు సంభవించిన ఆ అద్భుత వీరులకు వేయి దివ్య వర్షములు ఘోరమైన యుద్ధము జరిగెను. అంతట హరుడు విరించితో నిట్లనెను- “పితామహా! చూడుము! అద్భుత బలశాలియగు నొక నరుని బాణముల తాకిడికి పరాజితుడైనాడు. ఇది దశ దిక్కులలోను పరమాశ్చర్య కరమగు ఘటన ! అంతట బ్రహ్మ శివునితో “శంకరా ! ఒక సాధారణ మానవునిచే ఓడింపబడిన మహాత్ముడగు నా పురుషుడీ లోకమున జన్మించిన వాడు కాదు. నిజానికి సాధారణుడైన ఈ నరుడే ఓడిపోవలసి యుండె” ననెను. వెంటనే శంకరుడు, ఓడిపోయిన బ్రహ్మ పుత్రుని సూర్యునిలోనికీ విజేత అయిన నారాయణ బాహు జన్ముని, నారాయణుని దేహములోనికి విసరివైచెను.
అధ్యాయము 2 complete
Summary of chapter 2 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya narrates how Dharmadeva, born from the heart of Pitāmaha Brahmā, wedded the virtuous daughters of Daksha Prajāpati and begot the glorious twin divine incarnations, Nara and Nārāyaṇarshi, who undertook severe austerities at Badarīkāśrama for the sustenance of the cosmic order. Seeing their unmatched spiritual radiance, Indra became alarmed and dispatched the heavenly maidens along with Kāmadeva to disturb their penance, but Nārāyaṇarshi created the ethereal nymph Urvaśī from his thigh, humbling the pride of the celestial beings. Meanwhile, the narrative turns to Daksha Prajāpati's grand sacrifice where Mahādeva Śiva was insulted, prompting Satī Devi to yield her mortal frame in yogic fire, which caused the fierce manifestation of Vīrabhadra and the swift destruction of Daksha's sacrificial arena.