మార్కండేయ మహా పురాణము
114 - ఖనిత్ర చరిత్రము
పిమ్మట ఆ సునంద గర్భము నుండి వత్సప్రికి పన్నెండు మంది పుత్రులు కలిగిరి. వారి పేర్లు వరుసగా, ప్రాంశు, ప్రవీర, శూర, సుచక్ర, విక్రమ, క్రమ, బల, బలాక, చండ, ప్రచండ, సువిక్రమ, స్వరూపులను వీరందరు గొప్ప అదృష్ట వంతులు, మఱియు సంగ్రామ మందు విజయులు. వీరిలో జ్యేష్టుడు, మహా వీరుడునగు ప్రాంశుడు రాజయ్యెను, ఇతరులగు పదు నొకండుగురు సోదరులు సేవకులతో సమానులుగా నుండి అతనికి వశ వర్తులై యుండిరి. అతడు చేసిన యజ్ఞ కాల మందు అనేక మంది బ్రాహ్మణుల చేతను ఇతర వర్ణముల చేతను వదిలి వేయ బడిన అనంత ద్రవ్య రాసులతోను భూమికి వసుందర యను నామము సార్ధక మయ్యెను. కన్న పిల్లలతో సమానముగా ప్రజా పాలన చేయుచు అతని యొక్క ధన కోశము నందు యే ధనము నింపబడెనో ఆ ధనము చేతనే అసంఖ్యాక ములగు యజ్ఞములు చేయ బడినవి. మునీశ్వరా! వందలు వేలు, లక్షలు, కోట్లు పద్మములు మొదలగు సంఖ్యల చేతను గూడ లెక్క బెట్ట శక్యము గాదు.
ప్రాంశుకు ప్రజాతి యను కుమారుడు కలిగెను. అతని యజ్ఞ మందు ఇంద్రుడు దేవతలతో గూడి యజ్ఞ భాగముల వలన తృప్తి బొందెను. మహావీర్య శాలులగు తొంబది తొమ్మిది మంది దానవులను, బలవంతులలో శ్రేష్ఠుడగు బలాసురుని, అసు రోత్తముడగు జంభాసురుని, ఇంకను మహావీర్య వంతులు దేవ శత్రువులు నగు రాక్షసులను సంహరించెను. ఓ మునీశ్వరా! అట్టి ప్రజాపతికి ఖనిత్రుడు మొదలగు అయిదుగురు పుత్రులు కలిగిరి. వారిలో ఖనిత్రుడు నిజ పరాక్రమముచే ప్రసిద్ది బొందిన రాజు అయ్యెను. అతడు శాంతుడు, సత్య వాది, శూరుడు, సర్వ ప్రాణులకు హితము చేయు వాడుగా నుండెను.
స్వధర్మ పరాయణుడు, సదా వృద్దులను సేవించు వాడు, బహు శాస్త్రముల దర్శించిన వాడు, వాగ్మి, వినయము కలవాడు అహంకార రహితుడు. మఱియు సర్వ లోకములకు ప్రియము కలిగి యుండెను. అతడు ఎల్లప్పుడు ఇట్లు పలుకు చుండెడి వాడు “అన్ని ప్రాణులు ఆనందము ననుభవించు గాక. విజన స్థానము లందును ప్రీతి మంతుడ నగుదును గాక. జీవు లన్నింటికి జయ మగును గాక. అందఱు భయ రహితులై యుందురు గాక. ప్రాణుల పీడలు నశించును గాక, ఎవ్వరికీ మనో వ్యథ కలుగ కుండును గాక, మరియు సమస్త ప్రాణులు అందరి యెడల మైత్రీ భావము కలిగి యుండును గాక. బ్రాహ్మణులకు మంగళము. పరస్పర ప్రీతి, అన్ని వర్ణముల యొక్క సమృద్ది, మరియు సంపూర్ణ కర్మల సిద్ది కలుగును గాక. ఓ జనులారా! మీ అందరిలోనూ ఎల్లప్పుడు మంగళ ప్రడంగు వృద్ది ప్రవృత్త మగును గాక.”
మీరు ఏ విధముగా మీ యొక్క మఱియు మీ కుమారుల యొక్క హితమును కోరు చుందురో, అట్లే అన్ని జీవుల హితమును కోరుడు. అట్టి భావమే మీకు అత్యంత హిత మైనది. ఎడల ఎవరి ఎదుడ అపరాధి యగునో, ఏ మంద బుద్ది ఎవరి కైననూ అపకారమును చేయునో, అట్టి వానికే కీడు సంభవించును. ఎట్లనగా కర్మ ఫలమును కర్తయే అనుభవింప వలసి వచ్చును. ఓ జనులారా మీరు ఇట్లాలోచించి సమస్త ప్రాణు లందును హితమగు బుద్దిని కలిగి యుండుడు. అనగా సదా ప్రాణులకు హితమునే చేయు చుండుడు. ఓ బుధులారా! మీరు లౌకిక పాపము లందు ప్రవృత్తులు కాకండి! అట్లు చేయుట వలన మీరు పుణ్య లోకమును పొందెదరు. ఎవరు ఈ సమయమున నా యెడల స్నేహమును చూపు చున్నారో, పృథ్వి యందు వారికి సదా జయము కలుగును’ లేక ఎవరు నన్ను ద్వేశించుదురో, అట్టి వారును జయమును పొందుదురు గాక. సమస్త గుణ సంపన్నుడు, పద్మ పలాశలోచనుడు, రాజ పుత్రుడు నగు ఆ ఖనిత్రుడు ఈ విధముగా చెప్పెను. అతడు ప్రీతి పూర్వకముగా సోదరులను వేరు వేరు రాజ్యము లందు నియమించెను.
సముద్ర పర్యంతము ఈ పృథ్విని పాలించుచూ భోగించు చుండెను. శౌరికి తూర్పు నందు, ముదావసుకు దక్షిణ దిక్కు నందు, పశ్చిమ దిక్కు నందు మునికి, మఱియు ఉత్తర దిక్కు నందు మహారధికి, ఇట్లు రాజ్యముల నిచ్చెను. ఆ రాజులకు వేరు గోత్రీకులు పురోహితులుగ నుండిరి. ఖనిత్రునికి మరియు అతని సోదరుల యొక్క మంత్రుల వంశ క్రమముతో ప్రాప్తించిన అన్య గోత్రికులగు ముని గణాలు పురోహితులుగ నుండిరి. అట్లే అత్రికులో త్పన్నుడగు సుహోత్రుడను బ్రాహ్మణుడు శౌరికి, గౌతమ వంశో త్పనుడగు కుశావర్తుడు ఉదాసనునకు, కాశ్యప గోత్రికుడగు ప్రమతి సునయునకు, మఱియు వసిష్ఠుడు మహారథునకు పురోహితులుగా నుండిరి పైన చెప్పిన నల్గురు సోదరులు రాజులై తమ తమ రాజ్యముల ననుభవించు చుండిరి.
సమస్త వసుదాధిపతి యగు ఖనిత్రుడు వారికి అధిపతిగా నుండెను. మహారాజు ఖనిత్రుడు, అందఱు సోదరులు, మఱియు సమస్త ప్రజల యెడల తండ్రి ఏ విధముగా పుత్రుల యెడల వ్యవహరించునో అదే విధముగా ఎల్లప్పుడు హితముగా వ్యవహరించు చుండిరి. ఒకనాడు మంత్రి విశ్వవేది శౌరితో నిట్లు పలికెను. ఓ రాజా! ఈ ఏకాంత సమయమున నేను మీతో కొంచెము మాట్లాడ వలసి యున్నది. ఈ సమస్త పృథ్వి మరియు భూపాల గణాలు ఎవరి ఆధీనములో నుండెనో. అతడు, అతని యొక్క పుత్ర పౌత్రులు మొదలగు వారి వంశములోని వారే రాజులగు చుందురు. కాని అతని సోదరులు మాత్రము అల్ప రాజ్యమునకు మాత్రమే అధికారియై యుందురు.
క్రమానుసారముగా అతని పుత్రుడు అతని కన్నా అల్ప రాజ్యమునకు. మరల అతని పౌత్రుడు అతని కన్నను అల్పమగు రాజ్యమునకు అధికారి యగు చుండును. కాలక్రమాన పురుషాను క్రమముతో అది తగ్గుచూ చివరకు, “ఆ వంశము లోని వారు వ్యవసాయమును చేసుకొనుచు జీవనము నడుపు కొను చుండూరు. ఓ రాజా! భ్రాతృ స్నేహము నకు బద్దుడైన సోదరుడు ఎప్పటికి సోదరుని ఉద్దరింప లేదు.” పిమ్మట ఆ యిద్దరు సోదరులు పుత్రులును పరస్పరము పరాయి వారుగా తలంచుదురు. ఓ రాజా! వారికి కలిగిన బిడ్డలు తిరిగి వారిని కూడా అన్యులుగా తలచెదరు.” “మరియు ఏ కార్యము వలన నా పుత్రుడు సుఖముగా నుండును? అని ఆ విషయమును గూర్చియే అధికముగా యోచించు చుందురు. ఇంకను సంతోషకరమగు ఎట్టి కార్యము నైనను ఆ రాజు అవలంబిచును.” “అయినచో భూపాలుడు ఏ ప్రయోజనము కొఱకు మంత్రులను నియమించు కొందురు? నా వంటి మంత్రు లున్నచో మీరు సమస్త రాజ్యమును భోగింప గలరు.”
“మఱియు నేను కార్యమును చేసినచో మీరెందులకు వృధా సంతోషమును పొందు చున్నారు? రాజ్యమును చేయువాని కార్యమును చేయుటయే మంత్రి అభీష్టము.” “కాని రాజ్య లాభ కార్యము నందు మీరు కర్త, నేను క్రియ. అందు వలన క్రియ ద్వారానే పితృ, పితామహుల రాజ్య శాసనము చేయుడు. మేము ఈ లోకము నందు మాత్రమే ఫలము నిచ్చెదము పర లోక దాతలము మేము కాము.”
“మహీ పాలుడగు రాజు మా జ్యేష్ఠుడు. మేము వారి అనుజులము. అందు వలన ఆయన ఈ భూమి నంతటిని అనుభవించు చున్నారు. మఱియు మేము అల్ప మాత్రమగు పృథ్విని అనుభవించు చున్నాము.” “ఓ మహామతీ! మేము ఐదుగురు సోదరులము కానీ భూమి కేవలము ఒక్కటి మాత్రమే. అందు వలన ఈ భూమి యొక్క సమస్త ఐశ్వర్యమును ఏ విధముగా వేరు వేరు భాగములుగా చేసి అనుభవించుటలో సమర్ధుల మగుదుము?”
“ఓ రాజా! మీరు చెప్పినది సత్యమే పృథ్వీ ఒక్కటి మాత్ర మేనని అంగీకరించేదము. అందు చేత మీరే దానిని గ్రహింపుడు. అందరిలో ప్రదానుడుగా నుండి మీరే ఈ భూమిని శాశింపుడు.” “సర్వాదిపత్యమును పొంది సోదరు లందరిలో మీరే అఖిలేశ్వరునిగా నుండుడు. నా వలెనే ఆయనకు నియమింప బడిన మంత్రియును ఇట్లు చేయును.”
జ్యేష్టుడు అగ్రజుడు మమ్ములను పుత్రుల వలె స్నేహముతో పాలించు చున్నాడు. అట్టి వాని యెడల నేనెట్లు రాజ్యమునకు లోభము చెందుదును?
నీవు అధికార పూర్వకముగా రాజ్యమునకు జ్యేష్టుడవై వివిధ సత్కారములచే వారిని పూజింపుము. రాజ్యము కోరు వాడు కనిష్ఠ జ్యేష్ఠ విచారణ చేయుట నిష్ప్రయోజనము.
అనంతరము రాజు ఈ మాటను అంగీకరించెను. పిమ్మట మంత్రియగు విశ్వవేది ఆ రాజు యొక్క ఇతర సోదరులను తన వశము చేసి కొనెను.
మఱియు వారి పురోహితులను తను చేయు శాంతి కర్మలో ఖనిత్రుని అంతము చేయు కార్యము నందు నియమించెను. ఖనిత్రుని యొక్క విశ్వాస పాత్రులగు భృత్యులను సామ, ధాన, భేద యుక్తులచే తన దండము యొక్క ప్రభావము పెంచుట యందు నియమించెను. ఎప్పుడయితే నలుగురు పురోహితులు నిత్యము అత్నుగ్రమైన అభిచారిక కర్మ చేయుట యందు ప్రవృత్తులైరో, అప్పుడు “కృత్య” లను నాలుగు శక్తులు పుట్టుకొని వచ్చెను. అవి యన్నియు భీకర శరీరములు, భయంకర ముఖములు, చూచుటకే అతి భీషణ ముగా నుండెను. వాటి హస్తముల యందు మహా శూలములు పెద్ద శరీరములతో దారుణముగా నుండిన వయ్యెను. పిమ్మట ఆ నాలుగు శక్తులు ఖనిత్ర మహారాజు సమీపమునకు పోగానే ఏ పాప మెరుగని ఆ రాజు పుణ్య బలమున అతని తేజస్సుచే ఏమి చేయ జాలక పోయెను.
ఆ శక్తులు ఆ రాజుల యొక్క నలుగురు పురోహితుల యొక్క విశ్వ వేది యొక్క సమీపమునకు తిరిగి వచ్చిన వయ్యెను. అప్పుడు పురోహితులు శౌరికి దుష్ట సలహాలను యిచ్చు విశ్వవేదియు కృత్యా శక్తులచే చంప బడుటయే గాక భస్మము చేయ బడిరి.
