మార్కండేయ మహా పురాణము
6 - బలదేవ కృత బ్రహ్మ హత్యా కారణ కథనం
Missing 1 - 25 శ్లోకాలు మరియు భావము
కొందరు లేడి చర్మము లందు, కొందరు ఉపవస్త్రము లందు, కొందరు కుశాసనము లందు, కొందరు ధర్భాసనము లందు కూర్చొని యుండ, వారల మధ్యలో గూర్చొని కళ్యాణ ప్రదములగు భగవత్కథలను జెప్పుచున్న సూత మహర్షిని చూచెను. సూత మహర్షి పురాణము లందలి యాది దేవతల యొక్క, మహర్షుల యొక్క చరిత్రములకు సంబంధించినవి, కళ్యాణ దాయకములగు కథలను జెప్పుచుండెను. ఆ కథా శ్రవణము చేయుచున్న శౌనకాది మహర్షు లందరు మధుపానముచే నెర్రబడిన నేత్రములు గల బలరాముని జూచిరి. అతడు మదిరాపాన మత్తుడై యున్నట్లు తెలిసికొనిన యా మహర్షులు సూత మహర్షి యొక్కడు తప్ప యందరు లేచిరి. ఎదురేగిరి. పూజ సలిపిరి. అశేష దానవ దమనుడు, పరాక్రమశాలి, మహాబలుడునగు హలాయుధుడు, సూత మహర్షి తన నవమానించినట్లు తలంచెను. అనంతరము క్రోదావిష్టు డయ్యెను. నేత్రముల పెద్దవిగా చేసెను. సూత మహర్షిని చంపెను.
బ్రహ్మాసనాదిష్టితుడగు సూత మహర్షిని జంపుటచే కృష్ణా జినంబర ధారులగు మహర్షులెల్ల ఆ వనమందు ఉండక వెడలి పోయిరి. అప్పుడా హలాయుధుడు తన శరీరమున బ్రహ్మ హత్యా రూపమగు పాపదేవత యావేశించుట జూచెను. నేను మహా పాపము జేసితినని చింతించెను. ఈ సూత మహర్షి బ్రహ్మాసన మలంకరించెను. ఇట్టి వానిని నేను జంపితిని. ఈ పాపమును చేసిన నన్ను జూచి ఈ బ్రాహ్మణు లందరు వనము నుండి వెడలిపోయిరి. నా శరీరము నుండి దుఃఖవహమగు లోహ గంధము వంటి దుర్వాసన వచ్చు చున్నది. దీనికి కారణము అతి నీచముగా బ్రహ్మ హత్యను చేయుటయే నని గ్రహించితిని. అమర్ష, మద్య, దురభిమాన, సాహస, దుష్ట దేవతలారా! నేటి నుండి మిమ్ములను ధిక్కరించు చున్నాను. నేను మీ యందాసక్తి గలవాడనగుట గదా యిట్టి పాప కార్యమునకు దలపడితిని. ఆ పాప క్ష్యయమునకై పన్నెండు సవత్సరముల వ్రతము జేసెదను. నేను చేసిన పాప మందరికీ చెప్పు చున్న వాడనై ఉత్తమమగు ప్రాయశ్చిత్తమును చేసికొనెదను. ఇప్పుడీ తీర్థయాత్ర ప్రారంభము చేసియే యుంటిని, గాన ప్రతిలోమ యగు సరస్వతిని గురించి పోయెదను. మునీశ్వరా! ఈ బలరాము డిందు వలన (మదిరా పానముచే సంభవించిన పాపము వలన) ప్రతిలోమ యగు సరస్వతీ నదీ తీర్థ స్నానమునకు పోయెను. తరువాత నీ పాండు కుమారుల కథా వృత్తాంతమును వినుము.
