మార్కండేయ మహా పురాణము

Table of Contents

95 - రుచి వివాహము - రౌచ్య మను జననము

ఎప్పుడు రుచి “అట్లే యగు గాక” అని చెప్పెనో, అప్పుడు ఆ ప్రమ్లోచ జలము నుండి “మాలిని”అను కన్యను తీసుకొని వచ్చెను.

మునివరుడగు రుచి ఆ నది ఒడ్డున మహా మునులను రప్పించి విధి విదానముగా పాణి గ్రహణము చేసెను. ఆమె గర్భము నుండి మహాత్ముడగు రుచికి మహా వీర్యవంతుడు, మహామతి యగు ఒక పుత్రుడు జన్మించెను. ఆ పుత్రుడు తండ్రి పేరు ననుసరించి రౌత్యుడను పేరుచే వసుధాతల మందు విఖ్యాతి చెందెను. అతని మన్వంతరము నందలి దేవతలు, సప్తర్షులు, మరియు అతని యొక్క సమస్త రాజ పుత్రుల విషయములను నీకు పూర్వము చెప్పితిని. ఈ మన్వంతర కథను వినుటచే మనుష్యులకు ధర్మవృద్ధి ,ఆరోగ్యము, ధన ధాన్యములు, మరియు పుత్రోత్పత్తి కలుగును. ఓ మహామునీ! పితరులను స్తుతించుట వలన మరియు నీ పితృ గణాలను శ్రవణము చేయుట వలనను వారి ప్రసాదముచే సంపూర్ణమగు కోరికలు సిద్ధించును.