మార్కండేయ మహా పురాణము
45 - సృష్టి ప్రకరణము
MISSING slంkas 1 tం 5
అందుచేత వారికి తమో గుణాత్మక మగు శరీరమును ప్రసాదించెను. మరియు ఆ శరీరమును వదలి పెట్టి వెంటనే తమో గునాత్మికమగు “రాత్రి”యను పేరుతో విఖ్యాతి పొందెను. అనంతరము ప్రజాపతి వేరొక శరీరమును గ్రహించి ప్రసన్నతను పొందెను. దాని యందు సత్త్వ గుణము యొక్క ఉద్రేకముచే అతని ముఖము నుండి దేవతల సృష్టి కలిగెను. వారికి సాత్త్విక శరీరమును ఇచ్చెను. అప్పుడు విడిచి పెట్ట బడిన సత్త్వ గుణ కళేబరము “దినము” అను పేరును పొందెను. తిరిగి సత్త్వమయ మగు రెండవ శరీరమును గ్రహించి పితరులకు ఇచ్చగించి, పితరులను సృష్టించెను. పితరులను సృష్టించి ప్రభువు ఆ శరీరమును కూడా పరిత్యజించెను. అప్పుడు అది పగలు, రాత్రి కాక “సంధ్యా” రూప మందు పరిణితి చెందెను.
ఆ తరువాత రజో గుణాత్మకమగు వేరొక శరీరమును గ్రహించి రజో గుణ మదికమగు మానవులను సృష్టించెను. మనుష్యులను ఉత్పన్నము చేసి ఆ విభుడు ఆ శరీరమును కూడా విడిచి వేసెను. అది “జ్యోత్స్న” అయినందున అది జ్యోత్స్నా రాత్రి యొక్క శేషము. మరియు పగలు ప్రధమ భాగమందు ప్రాదుర్భూత మయ్యెను. ఓ ద్విజుడా! బుద్ధిమంతుడగు దేవ దేవుని ఈ సమస్త విగ్రహములే పగలు, రాత్రి సంధ్యా మరియు జ్యోత్స్నా అను పేర్లతో విఖ్యాతి పొందెను. జ్యోత్స్నా, సంధ్యా, పగలు ఈ మూడు సత్త్వ గుణాత్త్వికములు. రాత్రి తామస గుణము కలది. అందు చేతనే రాత్రి త్రియామా అయినది. పూర్వము చెప్పిన గుణాదిక్యత వలననే పగలు దేవతలు, రాత్రి అసురులు, జ్యోత్స్న యందు మనుష్యులు పరియు సంధ్యా సమయమందు పితృ గణాలు, అధిక బలశాలురై శత్రువులను జయించెదరు. అనగా శత్రువులు వీరిని సంగ్రామ మందు గెలువ లేరు. అధిక మగు బలశాలురై యుందురు.
ప్రజాపతి పగలు, రాత్రి, సంధ్యా, జ్యోత్స్నా ఈ నాలుగు విధాల శరీరములను ఉత్పత్తిని చేసెను. అది బ్రహ్మ యొక్క త్రిగుణాత్మకమగు శరీరము. ప్రజాపతి ఈ నాలుగు శరీరములను సృష్టించి ఆకలి, దప్పిక కలిగిన రజస్తమో మాయ గుణాత్మక మగు రాత్రిని గ్రహించెను. ఆ అంధకార మందు భగవానుడు బ్రహ్మ ఆకలి నుండి కృశించిన శరీరము పొడుగైన గడ్డము, మీసములు గల వానిని సృష్టించెను. అప్పుడు అతడు ఆ శరీరమును తినుటకు ప్రవృత్తు డయ్యెను. ఓ ద్విజుడా! ఎప్పుడయితే అతడు ఆ శరీరమును భక్షించుట మొదలు పెట్టేనో, అప్పుడు ఎవరు “రక్షించండి” అనిరో వారు రాక్షసులు. ఎవరు “భక్షిస్తాము” అనిరో వారు యక్షులు అన్న పేరుతొ ప్రసిద్ధి కెక్కిరి.
వారిని చూసి అప్రసన్నత కలిగి నందున విధాత యొక్క కేశములు గిరిగిర తిరుగ నారంభించెను. ఈ కేశములు బ్రహ్మ యొక్క శిరస్సు నుండి పడిపోయి, విహరించుటచే (పాకుటచే) సర్ప సంజ్ఞ లభించెను. హీన జాతి యగుటచే వాటిని ఆహులు అని కూడా అందురు. బ్రహ్మ క్రోధముతో సర్పములను చూచుట తోడనే వాటిని క్రోదాత్ములను చేసెను. కపిల వర్ణముచే ఉత్పన్నమగు ఉగ్ర స్వభావము, మాంస భోజులు ఉత్పన్న మయిరి. గోవు యొక్క చింతన కాల మందు గంధర్వులు ఉత్పత్తి కలిగెను. వాక్యములను పరిగ్రహించుచూ ఉత్త్పన్న మైనందున వారు గంధర్వులు అను పేరును పొందిరి. ఈ విధముగా అష్ట విధముల దేవ యోనులు ఉత్త్పన్నము చేసి, తన దేహము నుండి ఇతరములగు సమస్త పశు పక్ష్యాదులను ఉత్త్పన్నము చేసెను. ముఖము నుండి మేకను, హృదయము నుండి గొర్రెలను పుట్టించెను.
మరియు ఉదరము నుండి, పార్శ్వ స్థానము నుండియు గోవులను, రెండు పాదముల నుండి ఆశ్వములను, ఏనుగులను, గార్ధభములను, కుందేళ్ళను, జింకలను, ఒంటెలను మరియు కంచర గాడిదలను మరియు రోమముల నుండి ఫల మూల యుక్తమగు అనేక ప్రకారము లగు ఔషదులను ఉత్పన్నము చేసెను. భగవానుడు త్రేతాయుగ ప్రారంభ మందు ఈ విధముగా పశువులను, ఔషధులను ఉత్పన్నము చేసి యజ్ఞ సృష్టి యందు నియమించెను. గోవు, మేక, దున్నపోతు, మేషము, అశ్వము, కంచర గాడిద పరియు గాడిద. ఈ పశువు లన్నింటిని గ్రామ్యము లందురు. ఇప్పుడు అరణ్యములు అనగా వన పశువుల గురించి చెప్పెదను. క్రూర మృగములు, ఏనుగులు, కోతులు, పక్షులు, జలచర, పశువులు, ద్విఖురములు, ప్రాకేడి జంతువులు, పాములు మొదలగునవి. ఈ ఏడును అరణ్యము నందు నివసించు ప్రాణులు.
విధాత తన మొదటి ముఖము నుండి యజ్ఞము యొక్క గాయత్రిని త్రిఋక్ వేద మంత్రములు, త్రివృత్, సామ రథంతరములను మరియు అగ్ని ష్టోమములను ఉత్త్పన్నము చేసెను. దక్షిణ ముఖము నుండి యజుః, త్రైష్టుభ చందము, పంచ దశస్తోమ బృహత్సామము మరియు ఉక్థములను పుట్టించెను. పశ్చిమ ముఖము నుండి సామ జగతీ చందమూ, పంచ దశ స్తోమము, వైరూపము, అతి రాత్రములను ఉత్పత్తి చేసెను. ఉత్తర ముహము నుండి ఇరువది ఒకటి అథర్వములు, ఆప్తోర్యామములు, అనుష్టుభాములు, వైరాజకములను ఉత్పన్నము చేసెను. భగవంతుడగు విభుడు కల్పమునకు మొదట మెరుపులు, వజ్రములు, మేఘములు, ఎరుపు, ఇంద్ర ధనుస్సు మరియు పక్షులు వీటిని సృష్టించెను.
ఆ తరువాత దేవతలు అసురులు పితరులు మనుష్యులు ఉత్పన్న మైనపుడు వాని శరీరము నుండి నానా విధాల ప్రాణులు ఉత్పన్నమై ఆ తర్వాత స్థావర, జంగమ, భూత గణ, యక్ష, పిశాచ, గంధర్వాదులు మరియు అప్సరో గణంబులు, నరులు, కిన్నెరులు, రాక్షసులు, పశువులు, పక్షులు, మృగములు, భుజంగములు మొదలగు సంపూర్ణ నశ్వరములు అనశ్వరములు అగు స్థావర జంగమ పదార్థములు ఉత్పన్న మైనవి. వెతికి ఏయే కర్మలు ఉన్నవో అవి సృష్టికి ప్రథమ మందే నిర్దేశింప బడినవి. అందు వలన అవి మాటి మాటికి ఉత్పన్న మగుచు వాని యొక్క అన్నీ కర్మలను పొందు చున్నవి. ప్రాణి గణాలు పూర్వ జన్మ మందు హింస, అహింస, మృదుత్వము, క్రూరత్వము, ధర్మము, అధర్మము, సత్యము వీటిని ఏ విధముగా యోచించునో తరువాత జన్మ మందు వానికి అవియే సంప్రాప్త మగును.
ప్రాణుల యందు ఇంద్రియముల యొక్క అర్థము మరియు శరీర మందు ఇంద్రియాలను అనేక ప్రకారములగు వాటిని కర్మాను సారముగ ఆ విభుడు స్వయంగా నిర్మించెను. ప్రాణుల యొక్క పేరు, రూపము, వారి కృత్యములు, అకృత్యములు, ప్రపంచము మరియు దేవతల యొక్క కర్మలు మొదలైన వారి యందు వేద శబ్దము నుండి నిర్మాణము చేసెను. ఋషుల పేర్లు, దేవతల సృష్టి ఇవన్నియు ప్రళయము తర్వాత, ప్రళయమునకు ముందున్నట్లుగానే చేసెను. ఏ విధముగా ఋతువులు మారినపుడు వాటి చిహ్నములు ఎట్లు కన్పించునో అట్లే యుగ యుగములు ప్రకటిత మగును. ఈ విధముగా అవ్యక్త జన్ముడగు బ్రహ్మ ప్రతి కల్పము నందును ప్రళయాంత మందు సృష్టిని చేయు చున్నాడు.
