మార్కండేయ మహా పురాణము
47 - యక్ష్మానుశాసనము
అనంతరము బ్రహ్మ తిరిగి చింతించుటచే అతని శరీరము నుండి కార్య కారణులగు మానస ప్రజలు ఉత్పన్నమైరి. ఆ బుద్ధిమంతుడగు బ్రహ్మ యొక్క గాత్రము నుండి సమస్త క్షేత్రజ్ఞులు ఉత్పన్న మయిరి. ఇంతేగాక ఇంకెవరు ఉత్పన్నమైరో, వారిని గూర్చి ఇంతకు ముందు చెప్పితిని. దేవతలా నుండి స్థావర పర్యంతము అందరును త్రిగుణ యుక్తులు. ఈ విధముగాబ్రహ్మ స్థావర, జంగమ చరాచర జీవులను ఉత్పన్నము చేసెను. భృగు, పులస్త్య, పులహ,క్రతు, అంగీరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్టులను వీరు బ్రహ్మ యొక్క మానస పుత్రులు.
ఈ తొమ్మిది మంది బ్రహ్మ యొక్క మానస పుత్రులని పురాణముల యందు నిశ్చయింప బడిరి. అప్పుడు తిరిగి క్రోధాత్ముడగు రుద్రుణ్ణి ఉత్పన్నము చేసెను. ఆ తరువాత సంకల్పమును, ధర్మమును, ఉత్పన్నము చేసెను. అవి మొదటి నుండియే జన్మించెను. మరియు సనందనాదులను మొదటి సృష్టి యందే స్వయంభువగు బ్రహ్మ సృష్టించెను. వీరందరు భవిష్యత్తున జ్ఞాన సంపన్నులు, వీతరాగులు, మత్సరహితులు, నిరపేక్షులు, సమాధిమంతులు అయిరి. ప్రజా సృష్టి విషయమందు సంకల్పము లేదు. సృష్టి యందు ఈ విధముగా వారి నిరపేక్షను చూసి బ్రహ్మకు అత్యంత క్రోధము కలిగెను.ఆ క్రోధము నుండి భయంకర దేహ యుక్తుడు, సూర్యుని తేజస్సుతో సమానమగు ఒక పురుషుడు జన్మించెను. అతని దేహము నందలి అర్థ భాగము పురుషుడు, మిగిలిన సగ భాగము స్త్రీగాను ఉండెను. అనంతరము “నీ దేహమును విభజించుమని” చెప్పి బ్రహ్మ అంతర్థాన మయ్యెను.
ఆ పురుషుడు బ్రహ్మ యొక్క ఆజ్ఞను పొందిన వాడై తన దేహమును రెండు భాగములు చేసెను. అందులో స్త్రీత్వము, పురుషత్వము వేరు వేరుగా పుట్టెను. అందు పురుషాకారమునకు సౌమ్యము, అసౌమ్యము, శాంతము, తెల్లని, నల్లని ఇత్యాది భేదములతో పదునొకండు భాగములుగా విభజించెను. ఓ ద్విజుడా! అటు పిమ్మట ప్రభువగు బ్రహ్మ పూర్వము జన్మించిన తనతో సమానమగు పురుషులకు “స్వాయంభువ మనువు” అను పేరు పెట్టి ప్రజాపాలకునిగా చేసెను. మరియు తపస్సుచే పాపరహితురాలగు నట్టి కామినికి “శతరూప” మని పేరు పెట్టెను. దేవా విహుడగు స్వాయంభువ మనువు ఆ శతరూపను తన భార్యగా చేసికొనెను. ఆ పురుషుడు శతరూప వలన ఇద్దరు పుత్రులను కనెను. ఆ ఇద్దరి పేర్లు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఆ ఇద్దరు తమ తమ కర్మల వలన విఖ్యాతి చెందిరి.
వీరుగాక ఆ శతరూపకు ఇద్దరు కన్యలు ఉత్పన్న మయిరి. ఆ ఇద్దరి పేర్లు ఆకూతి మరియు ప్రసూతి. తండ్రి స్వాయంభువు ప్రసూతి యను పేరు గల కన్యను దక్షునికి, ఆకూతి యను పేరుగల కన్యను ప్రజాపతి యగు రుచి అను వానికి సమర్పించెను. ఓ మహాభాగా! వారిలో ఒకరికి పుత్రుడు వేరొకరికి పుత్రిక కలిగిరి. వారి పేర్లు యజ్ఞుడు, దక్షిణ. వారిద్దరూ దాంపత్య భావమును పొందిరి. ఆ దక్షిణ యందు యజ్ఞుడి వలన ఏ పన్నెండు మంది పుత్రులు ఉత్పన్నమయిరి. వారు స్వాయంభువు మన్వంతర మందు “ యాము” లను పేరు గల దేవతలుగా ప్రసిద్ధి కెక్కిరి. యజ్న పురుషుని పుత్రులు మిక్కిలి తేజస్సు గలవారు, ఇక్కడ ప్రజాపతి వలన ప్రసూతి గర్భము నుండి ఇరువది నలుగురు కన్యలు జన్మించిరి. వారి పేర్లను బాగుగా వినుము. 1. శ్రద్ధా,2. లక్ష్మీ, 3. ధృతి, 4. తుష్టి, 5. మేధా, 6. క్రియ, 7. బుద్ధి, 8.లజ్జ,9. వపు, 10. శాంతి, 11. సిద్ధి,12. కీర్తి,13.పుష్టి అను ఈ పదముగ్గురు కన్యలను ధర్ముడు తన భార్యలుగా స్వీకరించెను.
మరియు మిగిలిన పదునొకండు సులోచనలగు కన్యలు ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వదా అను పేర్లతో విఖ్యాతి పొందిరి. ఆ పదునొకండు కన్యలను భృగువు ఇత్యాదులు క్రమానుసారముగా స్వీకరించిరి. భృగువు, మహాదేవుడు, మరీచి, అంగీరసముని, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్టుడు, అత్రి, వహ్ని మరియు పితృగణాలు. ఈ మునులు, ఋషులు, ముని సత్తమ గణాలు ఖ్యాతి మొదలగు పదునొకండు మంది దక్షుని కుమార్తెలను యథా క్రమముగా స్వీకరించిరి. వీరిలో శ్రద్ధ కామమును, లక్ష్మి దర్పమును, ఘృతి నియమమును, తుష్టి సంతోషమును, పుష్టి లోభమును, మేధ శ్రుతమను, క్రియ దండమును, బుద్ధి బోధను, లజ్జ వినయమును, వాపు వ్యవసాయమును, శాంతి క్షేమమును, సిద్ధి సుఖముమును, కీర్తి యశమును ఉత్పన్నము చేసిరి. వీరు ధర్ముని సంతానము కామము వలన అత్యానందము గల హర్షుడను పేరుగల పౌత్రుడు ధర్మునికి జన్మించెను.
అధర్ముని భార్య పేరు హింసా. ఆమె గర్భము నుండి అనృతుడు జన్మించెను. అనృతుడు ఆ నిరృతి గర్భము నుండి నరకుడు, భాయుడు అను పేర్లు గలిద్దరూ పుత్రులు జన్మించిరి. మరియు మాయా, వేదన అను పేర్లు గల ఇద్దరు కన్యలను ఉత్పన్నము చేసెను. వీరు పరస్పరము దాంపత్య భావమును కలిగి యుండిరి. వారిలో మాయ ప్రాణులను సంహరించు మృత్యువు అను పేరు గల కుమారుని కనెను.
మరియు నరకము వలన దుఃఖము అను పేరు గల ఒక పుత్రుని వేదన ఉత్పన్నము చేసెను. ఈ మృత్యువుకు వ్యాధి, జరా, శోకము, తృష్ణా, క్రోధము, ఉత్పన్నమైనవి. ఇవన్ని దుఃఖము వలన ఉత్పన్నమై మహా అధర్ములైరి. వారికి భార్యా పుత్రులు ఎవరూ లేరు. ఎందుచేత ననగా వారందరూ ఎడారులు. ఓ మునీశ్వరా! నిఋృతి అను పేరు గలది మృత్యువునకు ఒక భార్య ఉన్నది. ఆమెను లోక మందు అలక్షీ అందురు. మృత్యువు ఆమె వలన పదునాల్గురు పుత్రులను ఉత్పన్నము చేసెను. ఆ మ్ర్యత్యువు యోక్క ఆజ్ఞావర్తులగు పుత్రా గణాలు “అలక్షీ పుత్రులు” అను పేరుతో విఖ్యాతి చెందిరి. వీరు వినాశ కాలమందు మానవుల యొక్క ఏ ఏ అంగములందు ఉందురో వాని పేర్లు చెప్పెదను వినుము. వీరు మొదటి పది మంది పది ఇంద్రియములందు నివసించెదరు. మరియు పదునొకండవ పుత్రుడు అందరి మనస్సుల పైన నివసించును. ఇతడే స్త్రీ, పురుషులను తన తన విషయములందు కలుపు కొనును.
ఓ ద్విజుడా! అనంతరము రాగము, క్రోధము, మొదలగు వాని ద్వారా సమస్త ఇంద్రియములను ఆక్రమించి అధర్మాది సహితముగా సంయోగము చేయుటచే ప్రాణులకు హాని కలుగును. మృత్యువు యొక్క పండ్రెండవ పుత్రుడు అహంకారమును ఆశ్రయించి వర్తించును. పదమూడవ పుత్రుడు ప్రాణుల యొక్క బుద్ధి యందు నిలిచి యుండును. అందుచే పురుషులు మోహితులై స్త్రీలను నాశనము చేయుటకు ప్రయత్నించుదురు. పదునాల్గవ అలక్ష్మీ యొక్క పుత్రుని పేరు దుఃస్సహుడు. యితడు పురుషుల ఇండ్ల యందు నివసించును. ఈ దుఃస్సహుడు ఎల్లప్పుడు క్షుదాతరుడు, అధోముఖము కలవాడు, నగ్నుడు, చెట్టు పట్టా ధరించువాడు. కాకి వలె శబ్దము చేయువాడు అయి ఉండెను. బ్రహ్మ పదార్థము లన్నింటిని భక్షించుటకే ఈ తపోనిధిని సృష్టించెనని తెలియు చున్నది. అనంతరము భయంకరమగు గడ్డము, నోరు తెరచుకొని అత్యంత భయంకర రూపముతో శబ్దము చేయుచు, అందరిని భక్షించుటకు ఉద్యుక్తుడైన దుఃస్సహుని చూచి లోక పితామహుడు, సర్వ బ్రహ్మ మాయ శుద్ధ జగత్కారణుడు, నాశము లేనివాడు అగు బ్రహ్మ ఇట్లు చెప్ప నారంభించెను.
ఓ దుఃస్సహా! జగత్తును నీవు భక్షించుట ఉచితము గాదు. కోపమును వీడి శాంతమును పొందుము. ఈ తమో గుణమును త్యజించుము. మరియు రజో గుణము యొక్క అంశను కూడా వీడుము.
ఓ జగన్నాథా! నేను ఆకలిచే అత్యంత బాధచే కృశించి దాహము యొక్క బాధ చేత అత్యంత దుర్భలుడ నైతిని. ఓ నాథా! ఏ విధముగా తృప్తిని పొందుదును? ఏ విధముగా బలవంతుడ నగుదును? ఎవ్వరిని ఆశ్రయించి సుఖముగా నుందును? దయ ఉంచి నాకు చెప్పుడు.
వత్సా! పురుషుల గృహములే నీకు ఆశ్రయము. అధర్మ పురుషులే నీకు బలము. మానవుల నిత్య కృత్యములకు హాని కలుగుటచే నీకు తృప్తి లాభము కలుగును. మొసలి యొక్క వల మరియు స్ప్రోటములే నీకు వస్త్రములు. ఇప్పుడు నీకు ఆహారము ప్రసాదించు చున్నాను. ఏ ప్రదేశమందు కీటకములు ఉత్పన్నమగునో, వేనిని కుక్కలు చూచునో, అట్టివి నీకు ఆహారము. మరియు ఏ పదార్థములు పగిలిన పాత్రయందు ఉంచ బడునో, లేక నోటితో ఊదుతూ చల్లబరచిన ఆహార పదార్థములు, లేక ఎంగిలి చేసిన, పక్వము కాని అన్న సంస్కారము లేని పదార్థములు.
విరిగిన ఆసనము మీద కూర్చొనిన లేక ఇంటికి వచ్చిన అతిథులకు భోజనము పెట్టక, లేక దక్షిణ దిక్కున ముఖము ఉంచి, లేక సంధ్యా సమయమందు గాని, నృత్యము చేయు సమయమందు గాని, పాట పాడు సమయమందు గాని, వాద్య సమయమందు గాని, ఎవరు భోజనము చేయుదురో లేక రసజ్వల అయిన స్త్రీ చూసిన లేక తాకిన, ఎవరైన ఎంగిలి చేసిన దూషింప బడిన యట్టి అన్నమును భుజింతురో, ఈ పదార్థము లన్నియు నీకు ఆహార పదార్థములు. నీకు పుష్టి కారకములగును. ఓ దుఃస్సహా! నీ పుష్టి కొరకు ఇంకను ఇచ్చుచున్నాను. ఎవరు స్నానము చేయక, శ్రద్ధ లేక హోమము చేయుదురో ఏ అజ్ఞానులైన మనుష్యులచే ఇవ్వ బడునో, ఎవడు ఏ వస్తువులను జలముచే పవిత్రత చేయక ఇచ్చునో, ఎక్కడ వస్తువులు వ్యర్థముగా పడి యుండునో, ఎచ్చట పరిత్యజించుటకు విస్తారముగా పదార్థములు ఉండునో, వ్యాపించి ఉండునో, ఏ పదార్థములు అత్యంత ఆశ్చర్యమును, భయమును కలుగ జేయునో, ఏ పదార్థములు దుష్టులు, క్రోధితులు, ఆర్తులు, అగు మానవులు ఇచ్చెదరో, ఇట్టి వాటిని అన్నింటిని నీవు అనుభవింపుము. ఓ యక్ష్మా! నీకు అవి వశీభూతమై ఉండును. ఎవరు రెండవ వివాహము చేసుకొన్న స్త్రీకి కలిగిన పుత్రుడు పరలోక సంబంధమగు కార్యములు చేయునో, మరియు పునర్భవ యగు స్త్రీ ఏ కర్మలు చేయునో, వో యక్ష్మా! అవి నీకు తృప్తిని కలిగించును. ఏ కన్యను ధనమును తీసుకొన ధర్మక్రియలు చేయునో, ఇదే విధముగా ఏ క్రియలు అసత్ శాస్త్రము ద్వారా చేయుదురో అవి నీకు పుష్టిని కలిగించును. ఎవరు అర్థము ప్రాప్తించుటకు కార్యములు చేయుదురో, ఎవరు అసత్యము భోదింతురో, ఓ దుఃస్సహా! అవే నీకు పుష్టి యొక్క హేతువులు. ఇప్పుడు నీకు సిద్ధి కొరకు సమయము ఇచ్చు చున్నాను. వినుము. ఎప్పుడు మనుష్యుడు గర్భవతులగు స్త్రీలతో రమించెదరో, ఎప్పుడు సంధ్య లేక నిత్య కార్యములను అతిక్రమించెదరో, మరియు ఎప్పుడు మనుష్య గణాలు అసత్ శాస్త్రోక్త కార్యముల ద్వారా దూషింప బడుదురో ఓ దుఃస్సహా! అట్టి సమయమందు నీవు వారి యొక్క తిరస్కారము లందు సామర్థ్య లాభము పొందగలవు. ఎచ్చట పంక్తి భేదము కలుగునో, ఎచ్చట వ్యర్థముగా అన్నము తయారు చేయబడునో, అనగా తన కొరకు మాత్రమే భోజనము తయారు చేసుకోనునో, ఎచ్చట ఎల్లప్పుడూ కలహములు ఉండునో అచ్చట నీనివాసము ఉండును.
ఏ ఇంటిలో అన్నము తృణము ఇవ్వక గోవు, గుఱ్ఱము, మొదలైన పశువులు ఉండునో, వాటిని ఆకలిచే బాధింతురో, మరియు ఏ ఇంటి యందు సూర్యాస్తమయ మగుటకు ముందుగానే అసంధ్యా కాలమందు చీపురుతో శుభ్రము చేయబడదో, ఓ దుస్సహా! అక్కడి మానవులకు నీ వలన భయము కలుగును. నక్షత్ర గ్రహ పీడలు, త్రివిధమగు ఉత్పాతములు కన్పించినపుడు ఏ మానవుడు శాంతి జరపడో, అట్టి మనుష్యులను నీవు అభిభూతులను చేయుదువు. ఎవరు వృథాగా ఉపవాసము చేయుదురో, జూదమందు, స్త్రీల యందు, ఎవడు ఎల్లప్పుడూ ఆసక్తుడై ఉండునో, ఎవరు నీ యొక్క ఉపకారము గురించి సంభాషించెదరో, ఎవరు పిల్లి వలె తన ప్రయోజనమును సిద్ధింప జేసుకొనుదురో, ఏ ప్రజలు బ్రహ్మ చర్యము లేకుండ వేద పఠనము చేయుదురో, మరియు మూర్ఖులచే చేయబడు యజ్ఞము, తపోవనము నందు గృహస్థుని వలె చేయు కర్మలు, చంచల చిత్తముతో అజితేంద్రియుడు
270, 271 pages missing.
సూర్యుడు ఏ ఇంటి యందు శయ్యను చూడడో, ఏ ఇంటి యందు అగ్ని, జలము, వెలుగొందు చుండునో, ఏ ఇల్లు సూర్యుని ప్రకాశముచే ప్రకాశింప బడునో, అట్టి గృహము లక్ష్మి యొక్క స్థానము. ఏ ఇంటిలో చందనము, వీణ, దర్పణము, మధువు, ఘృతము, విషము, మరియు రాగి పాత్రలు ఉండునో, అట్టి గృహమును నీవు ఆశ్రయింప లేవు. ఏ ఇంటిలో ముళ్ళ చెట్టు, నిష్పావలత, ద్వితీయ వివాహం చేసుకొన్న స్త్రీ, పుట్ట కలిగి యుండునో, ఓ యక్ష్మా! అది నీ యొక్క గృహము. ఏ ఇంటిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలు, మూడు గోవులు, అంధకారము, కాష్టము, అగ్ని, ఉపస్థితమై ఉండునో, అట్టి ఇల్లు నీకు నివాసము. ఓ యక్ష్మా! ఏ ఇంటి యందు ఒక మేక, ఇద్దరు స్త్రీలు మూడు గోవులు, ఐదు దున్నపోతులు, ఆరు గుఱ్ఱములు, ఏడు ఏనుగులు ఉండునో ఆ ఇంటిని వెంటనే నాశనము చేయుము.
ఏ ఇంటి యందు కొడవలి, పీట, పళ్ళెము ఇత్యాది సమస్త పాత్రలు ఇటునటు విసర వేయబడి ఉండునో ఆ ఇంటి యందలి మనుష్యులు నీకు తన ఇంటి యందు ఆశ్రయము ఇచ్చుటకు ఇష్ట పడుదురు. ఓ యక్ష్మా! ఏ ఇంటి యందలి స్త్రీ రోకలి రోలు మీద లేక గడప మీద కూర్చొని ఉండునో మరియు ఇంటి వెనుక భాగమున ఉండు స్త్రీతో మాట్లాడుచు ఉందురో ఈ పనులన్నియు నీకు ఉపకారము కొరకై ఉన్నవి. ఏ ఇంటి యందు వండిన లేక వండని ధాన్యములను మరియు సత్ శాస్త్రము యొక్క అనాదరము కలుగునో, ఓ దుస్సహా! అట్టి ఇంటి యందున నీవు ఇచ్చానుసారముగా వ్యవహరింపుము. ఏ ఇంటి యందు పళ్ళెము మూయుట, గరిటతో ఇంటి యందలి స్త్రీ ఎవరికైనను నిప్పు ఇచ్చుట చేయునో, అట్టి ఇల్లు అన్ని అరిష్ఠములకు స్థానమై ఉన్నది. మనుష్యుల ఎముకలు, మృత పదార్థము, ఏ ఇంటి యందు పగలు రాత్రి ఉండునో, అక్కడ ఇతరములగు సమస్త రాక్షసులు నివసించెదరు.
ఎప్పుడు మనుష్య బంధువులు సపిండము, సమానోదకుల పురుషులకు పిండము లేక జలదానము చేయరో అట్టి సమయ మందు నీవు వారిని భుజింపుము. ఏ ఇంటి యందు పద్మము, మహాపద్మము అనగా నిథి విశేషములు ఉండునో స్త్రీలు ఎల్లప్పుడు లడ్డులు భుజించు చుండురో, ఎద్దు, ఏనుగులు ఉండునో ఆ ఇంటిని నీవు విడిచి పెట్టుము. ఎక్కడ శస్త్రము లేని దేవతలు యుద్ధము లేకుండానే మనుష్యుల ద్వారా సశస్త్ర రూపము లందు కల్పింపబడి పూజింప బడుదురో, అట్టి మందిరములను నీవు త్యజించ వలెను. పూర్వము చెప్పిన ఎట్టి ఇళ్ళయందు పురవాసులుండు పురముల యందు సమస్త జనపదాలు పూర్వ ప్రసిద్దులగు మహాత్ముల సంయుక్తమై ఉండునో, అట్టి గృహములను త్యజించ వలెను. ఎవరు బాట యొక్క గాలి, కలశము యందలి నీరు, వస్త్రము పిండగా వచ్చు జలము, పాదాగ్రజలము తగిలిన నీటిచే స్నానము చేయుదురో అట్టి నీచ లక్షణము కలిగిన మనుష్యుల సమీపమునకు నీవు వెళ్ళుము.
ఏ మనుష్యుడు దేశాచారము, సమయము, జ్ఞాతి, ధర్మము, జపము, హోమము, మంగళ కార్యములు, దేవ పూజలు, బాగుగా శౌచము, యథా విధి సమస్త లోకవాదములను ఆచరించునో అట్టి మానవులతో నీవు సాంగత్యము చేయరాదు.
ఓ ద్విజవరా! బ్రహ్మ దుస్సహునకు ఈ విధముగా ఆజ్ఞాపించి ఆ ప్రదేశము నుండి అంతర్ధాన మయ్యెను. దుస్సహుడు కూడ పద్మజన్ముడగు బ్రహ్మ యొక్క శాసనము ప్రకారము ప్రవర్తించు చుండెను.
