6 - కశ్యపీయ ప్రజాసర్గః  

ఋషయ ఊచుః :

ఏతచ్ఛృత్వా వచస్తస్య నైమిషేయాస్తపస్వినః ।

 పప్రచ్ఛుర్ఋషయః శ్రేష్ఠం వచనస్య యథాక్రమమ్ ॥

సప్తస్విహ కథం దేవా జాతా మన్వంతరేష్విహా ।

 ఇంద్రవిష్ణుప్రధానాస్తే ఆదిత్యస్తు మహోజసః ॥

 ఏతత్ప్రబ్రూహి నః సర్వం విస్తరాద్రో మహర్షణ ॥

 ఏవముక్తస్తదా సూతో వినయీ బ్రహ్మవాదిభిః ।

ఉవాచ వదతాం శ్రేష్ఠో యదా పృష్ఠో మహర్షిభిః ॥

ఋషులనిరి :

ఆ సూతుని యీ మాటలను విని నైమిషారణ్యవాసులైన మునులు యథాక్రమ వచనమునకు శ్రేష్ఠుడైన సూతునడిగిరి లోకమున ఏడు మన్వంతరములలో ఇంద్ర - విష్ణు ప్రధానులైన మహౌజస్వులైన ఆదిత్యులు (అదితి పుత్రులు) ఎట్లు పు రోమహర్షణ! సూత! ఇదియంతయు మాకు విస్తరముగా జెప్పుము (2). బ్రహ్మవాదులైన మహరులతో నిట్లడుగబడిన వినయ. ప్రవక్తలలో శ్రేష్ఠుడును ఐన సూతుడప్పుడు ఇట్లనెను (3).

సూత ఉవాచ :

బ్రహ్మణో వై ముఖాత్ సృష్టా యథా దేవాః ప్రజేప్సయా ।

సర్వే మంత్రశరీరాస్తే స్మృతా మన్వంతరేష్విహ ॥

 దర్శశ్చ పౌర్ణమాసశ్చ బృహద్యచ్చ రథంతరమ్ ।

 ఆకూతః ప్రథమస్తేషాం తతస్త్వాకూతిరేవ చ ॥

విత్తశ్చైవ సువిత్తిశ్చ ఆకూతిః కూతిరేవ చ ।

 అధీష్టస్తు తతో జ్ఞేయః అధీతిశ్చైవ తత్త్వతః ।

విజ్ఞాతిశ్చైవ విజ్ఞాతో మానవో యే చ ద్వాదశ ॥

జ్ఞేయో ద్వాదశపుత్రశ్చ యశ్చాబ్దేన సమాజయేత్ ।

తం దృష్ట్వా చాబ్రవీద్బ్రహ్మా జయా దేవానసూయత ॥

దారాగ్నిహోత్రసంయోగే మిధ్యామారభతేతి చ ।

ఏవముక్త్వా తు తం బ్రహ్మా తత్రైవాంతర ధీయత ॥

సూతుడనెను :

సంతానేచ్ఛతో బ్రహ్మముఖము నుండి సృష్టింపబడిన యా దేవతలు అందరును మన్వంతరములలో నీ లోకమున మంత్రశరీరులు - (మంత్రము శరీరముగా గలవారు) అనబడిరి (4), దర్శుడు, పౌర్ణమాసుడు, బృహత్తైన, రథంతరము, వారిలో ప్రథముడైన ఆకూతుడు, తరువాత అకూతీయు, తరువాత అధీష్టుడును, తరువాత విత్తి, సువిత్తి, అధీతియు, విజ్ఞాతియు, విజ్ఞాతుడును, మానవుడును వీరు పండ్రెండుగురు (5, 6). ఇట్లు ద్వాదశ పుత్రులు గలవాడని పన్నెండు మాసములు గల సంవత్సరముతో సమానుడనియు తెలియవలెను. ఆతనిని చూచి బ్రహ్మ - ‘జయ’ దేవతలను గనెనని యనెను (7) దారాగ్ని హోత్ర (గార్హస్థ్యాగ్ని) సంయోగమున మిథ్యను (మిథునభావమును) మొదలిడుడనెను. ఈ విధముగా బలికి బ్రహ్మ యచటనే యంతర్థానమందెను (8).

తతస్తే నాభ్యనందంత తద్వాక్యం పరమేష్ఠినః ।

 సత్య స్యేహ తు కర్మాణి వా~ఙ్మనః కర్మజాని తు ॥

య ఏవాప్యవతిష్ఠంతే దోషం దృష్ట్వా తు కర్మసు ।

క్షయాతిశయయుక్తం తు తే దృష్ట్వా కర్మణాం ఫలమ్ ॥

 జుగుప్సంతః ప్రసూతిం చ నిస్తంద్రా నిర్మమాభవన్ ।

 అజస్రం కాంక్షమాణాస్తే విరక్తా దోషదర్శినః ॥

 అర్థం ధర్మం చ కామం చ హిత్వా తే వై వ్యవస్థితాః ।

 పౌరుషం జ్ఞానమాస్థాయ తేజః సంక్షిప్య చాస్థితాః ॥

 తేషాం చ తమభిప్రాయం జ్ఞాత్వా బ్రహ్మా చుకోప హ ।

 తానబ్రవీత్తదా బ్రహ్మా నిరుత్సాహాత్ సురానథ ॥

 ప్రజార్థమిహ యూయం వై ప్రజాస్రష్టాఽ స్మి నాన్యథా ।

ప్రసూయధ్వం జయధ్వం చేత్యుక్తవానస్మి యత్ పురా ॥

 యస్మాద్వాక్యమనాదృత్య మమ వైరాగ్యమాస్థితాః ।

జుగుప్సమానాః స్వం జన్మ సంతతిం నాభినందథ ॥

 కర్మణాం చ కృతో స్యాసో హ్యమృతత్వాభి కాంక్షయా ।

తస్మాద్యూయమనాదృత్య సప్తకృత్వస్తు యాస్యథ ॥

 తే శప్తా బ్రహ్మణా దేవా జయాస్తం పై ప్రసాదయన్ ।

 క్షమాస్మాకం మహాదేవ యదజ్ఞానాత్ కృతం విభో ॥

 ప్రణిపత్య సానునయం బ్రహ్మా తానబ్రవీత్పునః ।

 లోకే మయాననుజ్ఞాతః కః స్వాతంత్య్ర మిహార్హసి ॥

 మయా పరిగతం సర్వం కథమచ్ఛందతో మమ ।

 ప్రతిపత్స్యంతి భూతాని శుభం వా యది వాఽ శుభమ్ ॥

 లోకే యదస్తి కించిద్వై సత్త్వాసత్త్వ వ్యవస్థితమ్ ।

 బుద్ధ్యాత్మనా మయా వ్యాప్తం కో షూం లోకేఽ తిసంధయేత్ ॥

 భూతానాం తర్కితం యచ్చ యచ్చా ప్యేషాం విధారితమ్ ।

 తథా విచారితం యచ్చ తత్సర్వం విదితం మమ ॥

 మయా స్థితమిదం సర్వం జగత్ స్థావరజంగమ్ ।

 ఆశామయేన తత్త్వేన కథం ఛేత్తు మిహోత్సహే ॥

 యస్మాచ్చాహం వివృత్తో వై సర్గార్థమిహ నాన్యథా ।

 ఇహకర్మాణ్యనారభ్య కో మే ఛందాద్వి మోక్ష్యతే ॥

పరిభాష్య తతో దేవాన్ జయాన్ వై నష్టచేతసః ।

 అబ్రవీత్స పునస్తాన్ పై ధృతాన్ దండే ప్రజాపతిః ॥

యస్మాన్మమాభిసంధాయ సన్యాసో వః కృతః పురా ।

 యస్మాత్స విఫలోఽయం నో హ్యపార స్త్వేష యః కృతః ।

 భవితాతః సుఖోదర్కో దేవా భావేషు జాయతాయ్ ॥

ఆత్మచ్ఛందేన వో జన్మ భవిష్యతి సురోత్తమాః ।

 మన్వంతరేషు సమ్మూఢాః షట్సుసర్వే గమిష్యథ ॥

 వైవస్వతాంతేషు సురాస్తథా స్వాయంభు వాదిషు ।

 తాన్ జ్ఞాత్వా బ్రహ్మణా తత్ర శ్లోకో గీతః పురాతనః ॥

 త్రయీం విద్యాం బ్రహ్మచర్యం ప్రసూతిం శ్రాద్ధమేవ చ ।

యజ్ఞం చైవ తు దానం చ ఏషా మేవ తు కుర్వతామ్ ॥

స హి స్మ విరజో భూత్వా వసతేఽ న్యప్రశంసయా ॥

స ఏవం శ్లోకం దృష్ట్వా తు జయా దేవానథాఽ బ్రవీత్ ।

 వైవస్వతేఽ తరేఽ తీతే మత్సమీప మిహేష్యథ ॥

తతో యూయం మయాసార్ధం సిద్ధిం ప్రాప్స్యథ శాశ్వతీమ్ ।

ఏవముక్త్వా తు తాన్ బ్రహ్మా తత్రైవాంతర ధీయత ॥

         తరువాత వారు (ఋషులు) బ్రహ్మ యొక్క యా మాటనభినందించలేదు. వాక్కు - మనస్సు - కర్మలు - వీనివల్ల నీలోకములో బుట్టిన కర్మలు సత్యస్వరూపునకు సంబంధించినవే. ఎవరైతే దోషమును జూచి కర్మలందు నిలచియుందురో! వారు కర్మల ఫలమును క్షయాతిశయయుక్తముగా జూచీ (10), సంతానమునేవగించుచు అలసతలేనివారును, మమకారము లేనివారునునైరీ. మాటికి కోరికలను గోరుచున్నవారై (అందులో) దోసము జూచి విరక్తులై అర్థమును, ధర్మమును, కామమును వదిలి చక్కగా న పౌరుషమైన (విష్ణుసంబంధమైన) జ్ఞానమును బొంది తేజమును సంక్షేపించి కూడ నుండిరి (11, 12), వారియొక్క యా యభిప్రాయ దెలిసి బ్రహ్మకోపించెనట. అపుడు నిరుత్సాహులగు ఆ సురల నోట్లనెను (13). ప్రజ కొఱకే మీరుద్దేశింపబడితిరి. నేను ప్రజను స వానిని. వేరుకాదు. “నేను పూర్వము సంతానమును గనుడు, జయింపుడు” - అని చెప్పియే యుంటిని (14). ఏ కారణవ మాటను తిరస్కరించి వైరాగ్యము నొందితిరో! ఆ కారణమున మీ స్వ జన్మను ఏవగించువారై సంతతిని అభినందింపకుందు. (15). అమరణమును గోరి కర్మల యొక్క సంన్యాసము గూడ జేయబడినది. కావున మీరు ఏడు మారులు అనాదరించి త (సంతతిని) బొందుదురు (16). బ్రహ్మచేత శపింపబడి యా జయులు ఆ బ్రహ్మను శాంతింపజేసిరి. ఓ ప్రభో ఓదేవ! ఓ మ అజ్ఞానము వలన జేసిన మా పనిని క్షమింపుము (17) అని నమస్కరించి సానునయముగా బలికిరి. బ్రహ్మ వారితో మరల్చనిట్లనే లోకమున నాచే ననుమతింపబడని పోడెవడు స్వాతంత్ర్యమునకరుడగును ? నాచేతనంతయు తెలీయబడినది. శుభము అశుభమును గాని, నా యిష్టము లేక భూతములు ఎట్లు తెలియగలవు? పొందగలవు ? (19) లోకమున సత్త్వము అసత్త్వము వ్యవస్థితమైనదంతయు బుద్ధాత్ముడనైన నౌచే వ్యాపింపబడినది. లోకమున నన్నెవ్వడును వంచింపలేడు (20). భూక తర్కించినదియు ధరించినదియు, విచారించినదియు అంతయును నాకు దెలియును (21). నాచేత సుస్థితమైన యీ స్థావర జంగమా జగమునంతయు ఆశామయమైన తత్త్వముతో నిటనేట్లు చేదింపనుత్సహింతును (22). నేను సృష్టి కొఱకై వివృత్తుడనైతిని (అవతార. మార్పు జెందితిని) వేరుకాదు కావుననే లోకమున ఎవడు కర్మలనారంభింపక నౌ యిష్టము నుండి విడివడగలడు? (23) అని తరువాత బ్రహ్మ నష్టచేతస్కులై దేవతలై దండమున నిలచిన యాజయలను గూర్చి యిట్లు పలికెను (24). ఏ కారణమున పు నన్ను వంచించి మీ సన్యాసము చేయబడినదో! ఏ కారణమున అంతులేని యీ విఫలమేదైతే చేయ బడినదో! ఆ కారణమున స భవిష్యత్ఫలము గలుగును. దేవతలు భావములలో (మనస్సులలో) జన్మింతురు గాక (25). ఓ సురోత్తములారా! మీ స్వేష్ట ప్రక మీ జన్మలు కలుగగలవు. మీరందరు ఆలు మన్వంతరములలోనికి వెళ్లగలరు (26). స్వాయంభువముతో మొదలై వైవస్వత మన్వంత ముగియు మన్వంతరములలో దేవతలట్లే జన్మింతురు. వారిని దెలిసి యచట బ్రహ్మ పురాతనమైన శ్లోకమును గానము జేసిన త్రయిని (ఋగ్యజుస్సామవేదములను) విద్యను, బ్రహ్మచర్యమును, సంతానమును, శ్రాద్ధమును, యజ్ఞమును, దానమును జేయు ఆ బ్రహ్మ విరజుడై (రజోగుణము లేనివాడై) ఇతరుల ప్రశంసతో నుండును (28). బ్రహ్మ యీ విధముగా శ్లోకమును జూచి జం దేవతలతో వైవస్వత మన్వంతరము గడవగనే యిట నా సమీపమునకు రండు అని పలికెను (29). తరువాత మీరు నా శాశ్వతమైన సిద్ధిని బొందగలరు. ఈ విధముగ వారితో చెప్పి బ్రహ్మ యచటనే యంతర్ధానమొందెను (30).

 తతో దేవాస్తిరోభూతే ఈశ్వరే హ్యకుతోభయమ్ ।

ప్రపన్నా అణిమాద్యైశ్చ యుక్తా యోగబలాన్వితాః ॥

తత స్తేషాం తు యాస్తన్వస్తాఽ భవన్ ద్వాదశ హ్రదాః ।

 జయా ఇతి సమాఖ్యాతా జాతాశ్చోదధి సన్నిభాః ॥

 తతః స్వాయంభువే తస్మిన్ సర్గే తే జజ్ఞిరే సురాః ।

అజితాయాం రుచేః పుత్రా అజితా ద్వాదశ స్మృతాః ॥

 విధిశ్చ మునయశ్చైవ క్షమో నందోఽ వ్యయస్తథా ।

ప్రాణోఽపానః సుధామా చ క్రతుశక్తి వ్యవస్థితాః ।

ఇత్యేతే మానసాః సర్వే అజితా ద్వాదశ స్మృతాః ॥

 తే చ యజ్ఞే, సురైః సార్ధం యజ్ఞభాజస్తదా స్మృతాః ।

 స్వాయంభువేఽతరే పూర్వే తతః స్వారోచిషే పునః ।

తుషితాయాం సముత్పన్నాః పునః పుత్రాః స్వరోచిషః ॥

తుషితా నామ తే హ్యాసన్ ప్రాణాఖ్యా యాజ్ఞికాః సురాః ।

 పునస్తే తుషితా దేవా ఉత్తమే త్వంతరే స్వయమ్ ॥

ఉత్తమస్య తు తే పుత్రాః సత్యాయం జజ్ఞిరే శుభాః ।

తతః సత్యాః స్మృతా దేవా ఉత్తమే చాంతరే తదా ॥

 అభజన్ యజ్ఞభాజస్తే తృతీయే ద్వాపరాంతయే ।

తే తు సత్యాః పునర్దేవాః సంప్రాప్తే తామసేఽతరే ॥

 హర్షా యే తమసః పుత్రాః జజ్ఞిరే ద్వాదశైవ తు ।

హరయో నామ తే దేవా యజ్ఞభాజస్తథాఽ భవన్ ॥

తతస్తే హరయే దేవాః ప్రాప్తే చారిష్ణవేంఽతరే ।

వైకుంఠాయాం తతస్తే వై చరిష్ణోః జజ్ఞిరే సురాః ॥

 వైకుంఠా నామ తే దేవా పంచమస్యాంతరే మనోః ॥

 తతస్తే వై పునర్దేవా వైకుంఠాః ప్రాప్య చాక్షుషమ్ ।

 సాధ్యాయాం ద్వాదశ సుతా జజ్ఞిరే ధర్మసూనవః ॥

 తతస్తే వై పునః సాధ్యాః సంక్షీణే చాక్షుషేఽతరే ।

ఉపస్థితే మనోః సర్గి పునర్వైవస్వతస్య హ ॥

ఆద్యే త్రేతాయుగముఖే ప్రాప్తే వైవస్వతస్య తు ।

 అంశేన సాధ్యాస్తేఽదిత్యాం మారీచాత్కశ్యపాత్పునః ॥

జజ్ఞరే ద్వాదశాదీత్యాః వర్తమానేఽతరే పునః ।

 యదో త్వేతే సముత్పన్నా శ్చాక్షుషస్యాంతరే మనోః ॥

తతః స్వాయంభువే సాధ్యా జజ్ఞిరే ద్వాదశామరాః ।

 ఏవమాద్యా జయాస్తే వై శాపాత్సమభవంస్తదా ॥

 య ఇమాం సప్త సంభూతిం దేవానాం దేవశాసనాత్ ।

 పఠేద్యః శ్రద్ధయా యుక్తః ప్రత్యవాయం న గచ్ఛతి ॥

 ఇత్యేతే భూతయః సప్త జయానాం సప్త లక్షణాః ।

 పరిక్రాంతా మయా చాద్య కిం భూయః శ్రోతుమిచ్చథ ॥

ఈశ్వరుడైన బ్రహ్మ యంతర్థానము జెందగా, ఎక్కడినుండి కూడభయము లేని వారై దేవతలు అణిమాది సిద్దులతో గూడినవారును, యోగబలముతో గూడినవారునునైరి (31). తరువాత వారి శరీరములు పండ్రెండు మడుగులైనవి. అవి జయములని చక్కగా బిలువబడినవియు, సముద్రముతో సమానమైనవియునైనవి (32). తరువాత స్వాయంభువ మన్వంతరమున నా సృష్టిలో సురలు పుట్టిరి. రుచికి అజితయందు బుట్టిన పుత్రులు పండ్రెండుగురు అజితులు అనబడిరి (33). విధి, మునయుడు, క్షముడు, నందుడు, అవ్యయుడు, ప్రాణుడు, అపానుడు, సుధాముడు, క్రతు - శక్తి - వ్యవస్థితుడు, అజితుడు ఈపండ్రెండుగురు అజితులనబడిరి. వీరందరు మానసపుత్రులు (34). వారు యజ్ఞమున దేవతలతో బాటు యజ్ఞభాగమును బొందువారనబడిరి. స్వాయంభువ మన్వంతరమునను పూర్వము స్వారోచిషమన్వంతరమునను మరల స్వరోచికి తుషితయందు పుత్రులు పుట్టిరి (35). వారు తుషితులను పేర నుండిరి. వారు ప్రాణులను పేరుగల యాజ్ఞకులు. మరలవారు ఉత్తమ మన్వంతరమున తుషితులను దేవతలు. వారు స్వయముగా ఉత్తమునకు సత్యయందు బుట్టిన శుభులైన పుత్రులు. కావున ఉత్తమ మన్వంతరమున సత్యులని పిలువబడిరి (37). మూడవ ద్వాపరాంతరమున వారు యజ్ఞభాగమును బొందువారైరి. తామసమన్వంతరము రాగా ఆ సత్యులు మరల దేవతలైరి (38). హరులు పండ్రెండుగురు తమసునకు పుత్రులుగా జన్మించిరి. వారు హరులను పేర దేవతలు యజ్ఞభాగమును బొందువారుగనైరి (39). తరువాత ఆ హరులను దేవతలు చారిష్ణవమన్వంతరము రాగా వైకుంఠయందు చరిష్ణువునకు సురలై జన్మించిరి. పంచమమన్వంతరమున వారు వైకుంఠులను దేవతలు (40). తరువాత ఆ వైకుంఠ దేవతలు చాక్షుష మన్వంతరమును జేరి సాధ్యయందు ధర్మపుత్రులుగా పండ్రెండుగురు పుత్రులై జన్మించిరి (41). తరువాత మరల వారు చాక్షుష మన్వంతరము బాగుగా క్షీణింపగా వైవస్వత మన్వంతరసృష్టి రాగా సాధ్యులైరి (42). వైవస్వత మన్వంతరమున మొదటి త్రేతాయుగ ప్రారంభము రాగా మారీచుడైన కశ్యపుని వలన అదితియందు ఆ సాధ్యులే అంశముగా బుట్టిరి (43). వీరు వర్తమాన చాక్షుష మన్వంతరమున ద్వాదశాదిత్యులు (44). తరువాత స్వాయంభువ మన్వంతరమున ఆ సాధ్యులు పండ్రెండుగురు దేవతలుగా జన్మించిరి. ఈ మొదలుగా గల జయులు అపుడు శాపముతో బుట్టిరి (45). దేవశాసనమున నెవడీ దేవతల సప్తసంభూతిని (ఏడుజన్మలను) శ్రద్ధాయుకుడై పఠించునో, వాడు ప్రత్యవాయమును (పాపమును) బొందడు (46). అని యీ జయులయొక్క యేడు లక్షణములు గల యేడు జన్మలు సంపూర్ణముగా నివ్వేళ చెప్పబడినవి. మరల నింకేమి వినగోరుచున్నారు అని సూతుడనేను (47).

ఋషయ ఊచుః :

దైత్యానాం దానవానాం చ గంధర్వోరగరక్షసామ్ ।

 సర్వభూత పిశాచానాం పశూనాం పక్షివీరుధామ్ ॥

ఉత్పత్తిం నిధనం చైవ విస్తరాత్కథయస్వ నః ॥

ఏవముక్తస్తదా సూత ఉవాచ ఋషిసత్తమాన్ ।

దితేః పుత్రద్వయం జజ్ఞే కశ్యపాదితి నః శ్రుతమ్ ॥

కశ్యపస్యాత్మజౌ తౌ వై సర్వేభ్యః పూర్వజౌ స్మృతౌ ।

 సూత్యేఽహన్యతిరాత్రస్య కశ్యపస్యాశ్వమేధికే ॥

హిరణ్యకశిపుర్నామ ప్రథమం ఋత్విగాసనమ్ ।

 దిత్యా గర్భాద్వినిః సృత్య తత్రాసీనోచ్చ సంసది ॥

హిరణ్యకశిపుస్తస్మాత్ కర్మణా తేన స స్మృతః ॥

ఋషులనిరి :

దైత్యుల యొక్కయు, దానవుల యొక్కయు, గంధర్వ - ఉరగ - రక్షస్సుల యొక్కయు, సమస్త భూత పిశాచముల యొ పశువుల యొక్కయు, పక్షులయొక్కయు, తీవలయొక్కయు జననమును మరణమును విస్తరముగా మాకు జెప్పుము (48), ఈ వి నడుగబడిన సూతుడు ఋషిసత్తములతో నిట్లనెను. కశ్యపుని వలన దితికి పుత్రద్వయముగలిగెనని మాచే వినబడినది (49). కశ్యపపు వారిరువురు కశ్యపుని యాశ్వమేధిక యజ్ఞమునందు అతిరాత్రము యొక్క సూత్యదినమున అందరికన్న మొదటివారుగా బుట్టి యనబడిరి (50). హిరణ్యకశిపుడనగా మొదటి ఋత్విజుని యాసనము, దితియొక్క గర్భము నుండి బయల్వెడలి ఉన్నతమై వేదసభయందు గూర్చుండెను. ఆ కారణమున ఆ పనిచేత నాతడు హిరణ్యకశిపుడనబడెను (51).

ఋషయ ఊచుః :

హిరణ్యకశిపోర్నామ జన్మ చైవ మహాత్మనః ।

ప్రభావం చైవ దైత్యస్య విస్తరాద్బ్రూహి నః ప్రభో ॥

ఋషులనిరీ :

మహాత్ముడైన హిరణ్యకశిపుడను రాక్షసుని యొక్క పుట్టుకను ప్రభావమును ఓ ప్రభూ! మాకు విస్తరముగా జెప్పుము (52).

సూత ఉవాచ :

కశ్యపస్యాశ్వమేథోఽ భూత్ పుణ్యో వై పుష్కరే పురా ।

 ఋషిభిర్దేవతాభిశ్చ గంధర్వైరుపశోభితః ॥

 ఉత్కృష్టేనైవ విధినా ఆఖ్యానాదౌ యథావిధి ।

 ఆసనాన్యుపక్లుప్తాని కాంచనాని తు పంచ వై ॥

కుశపూతాని త్రీణ్యత్ర కూర్చం ఫలకమేవ చ ।

 ముఖ్యర్త్విజశ్చ చత్వార స్తేషాం తాన్యుపకల్పయేత్ ॥

 శుభం తత్రాసనం యత్తు హాతురర్థే ప్రకల్పితమ్ ।

 హిరణ్మయం తథా దివ్యం దివ్యాస్తరణ సంస్కృతమ్ ॥

అంతర్వత్నీ దితిశ్చైవ పత్నీత్వం సముపాగతా ।

దశవర్ష సహస్రాణీ గర్భస్తస్యా అవర్తత ॥

స తు గర్భాద్వినిః సృత్య మాతుర్వై ఉదరాత్తదా ।

ఉపక్లుప్తాసనం యత్తు హోతురర్థే హిరణ్మయమ్ ।

 నిషసాద స గర్భోఽత్ర తత్రాసీనః శశంస చ ॥

 ఆఖ్యానపంచమాన్ వేదాన్ మహర్షి కాశ్యపో యథా ।

 తం దృష్ట్వా మునయస్తస్య నామాఽ కుర్వంస్తు తద్విధమ్ ॥

 హిరణ్యకశిపుస్తస్మాత్ కర్మణా తేన విశ్రుతః ।

 హిరణ్యాక్షోఽ నుజస్తస్య సింహికా తస్య చానుజా ।

 రాహోః సా జననీ దేవీ విప్రచిత్తేః పరిగ్రహాత్ ॥

హిరణ్యకశిపుర్దైత్యశ్చకార పరమం తపః ।

 శతం వర్షసహస్రాణాం నిరాహారో హ్యధఃశిరాః ॥

తం బ్రహ్మా ఛందయామాస దైత్యం తుష్టో వరేణ తు ।

 సర్వామరత్వం విప్రేభ్యః సర్వభూతేభ్య ఏవ చ ॥

 యోగాద్దేవాన్వీనిర్జిత్య సర్వదేవత్వమాస్థితః ॥

 దానవాశ్చా సురాశ్చైవ దేవాః సమా భవంతు వై ।

 మారుతేర్యన్మ హైశ్వర్యమేష మే దీయతాం వరః ॥

 ఏవముక్తోఽథ బ్రహ్మా తు తస్మై దత్త్వా యథేప్సితమ్ ।

దత్త్వా తస్మై వరాన్ దివ్యాన్ తత్రైవాంతరధీయత ।

 హిరణ్యకశిపుర్దైత్యః శ్లొకైర్గీతః పురాతనైః ॥

రాజా హిరణ్యకశిపుర్యాం యామాశాం నిషేవతే ।

తస్యాస్తస్యా దిశో దేవా నమశ్చక్రుర్మహర్షిభిః ॥

 ఏవం ప్రభావో దైత్యేంద్రో హిరణ్యకశిపుర్ద్విజాః ।

 తస్యాసీన్నరసింహః స విష్ణుర్మృత్యుః పురా కిల ॥

నఖైస్తు తేన నిర్భిన్నస్తతః శుద్ధా నఖాః స్మృతాః ॥

 హిరణ్యాక్షసుతాః పంచ విక్రాంతాః సుమహాబలాః ।

ఉత్కురః శకునిశ్చైవ కాలనాభస్తథైవ చ ॥

మహానాభశ్చ విక్రాంతో భూతసంతాపనస్తథా ।

 హిరణ్యాక్షసుతా హ్యేతే దేవైరపి దురాసదాః ॥

 తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ బాడేయః స గణః స్మృతః ।

శతం తాని సహస్రాణి హతాస్తార కామయే ॥

హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారస్తు మహాబలాః ।

 ప్రహ్లాదః పూర్వజస్తేషా మనుహ్లాద స్తథైవ చ ॥

 సంహ్రదశ్చ హ్రదశ్చైవ హ్రదపుత్రాన్నిబోధత ॥

 హ్రదో నిసుందశ్చ తథా హ్రదపుత్రౌ బభూవతుః ।

 సుందోపసుందౌ విక్రాంతౌ సుందతనయావుభౌ ॥

 బ్రహ్మఘ్నస్తు మహావీర్యో మూకస్తు హ్రదదాయినః ।

 మారీచః సుందపుత్రస్తు తాడకాముపపద్యతే ॥

తాడకా నిహతా సాథ రాఘవేణ బలీయసా ।

మూకో వినిహతశ్చాపి కిరాతే సవ్యసాచినా ॥

ఉత్పన్నా మహతా చైవ తపసా భావితాః స్వయమ్ ।

తిస్రః కోట్యస్తు తేషాం వై మణివర్త నివాసినామ్ ।

 అవధ్యా దేవతానాం పై నిహతాః సవ్యసాచినా ॥

 అనుహ్లాదసుతో వాయుః శినీవాలీ తథైవ చ ।

తేషాం తు శతసాహస్రో గణో హాలాహలః స్మృతః ॥

 వైరోచనస్తు ప్రాహ్లదిః పంచ తస్యాత్మజాః స్మృతాః ।

గవేష్ఠీ కాలనేమిశ్చ జంభో బాష్కల ఏవ చ ।

శంభుస్తు అనుజస్తేషాం స్కృతాః ప్రాహ్లాదిసూనవః ॥

యథా ప్రధానం వక్ష్యామి తేషాం పుత్రాన్ దురాసదాన్ ।

 శుంభశ్చైవ నిశుంభశ్చ విష్వక్సేనో మహౌజసః ॥

 గవేష్ఠినః సుతా హ్యేతే జంభస్య శతదుందుభిః ।

 తథా దక్షశ్చ ఖండశ్చ త్రయస్తు జంభసూనవః ॥

 విరోధశ్చ మనుశ్చైవ వృక్షాయుః కుశలీముఖః ।

 బాష్కలస్య సుతా హ్యేతే కాలనేమిసుతాన్ శృణు ॥

 బ్రహ్మజిత్ క్షత్రజిచ్చైవ దేవాంతకనరాంతకౌ ।

 కాలనేమిసుతా హ్యేతే శంభోస్తు శృణుత ప్రజాః ॥

 ధనుకో హ్యసీలోమా చ నాబలశ్చ సగోముఖః ।

 గవాక్షశ్చైవ గోమాంశ్చ శంభోః పుత్రాః ప్రకీర్తితాః ॥

 విరోచనస్య పుత్రస్తు బలిరేకః ప్రతాపవాన్ ।

 బలేః పుత్రశతం జజ్ఞే రాజానః సర్వ ఏవ తే ॥

తేషాం ప్రధాసాశ్చత్వారో విక్రాంతాః సుమహాబలాః ।

సహస్రబాహుర్జ్యేష్ఠస్తు బాణో ద్రవిణ సమ్మతః ॥

 కుంభనాభో గర్దభాక్షః కుశిరిత్యేవమాదయః ॥

 కుశినీ పూతనా చైవ కన్యే ద్వే తు బలేః సుతే ।

 బలేః పుత్రాశ్చ పౌత్రాశ్చ శతశోఽథ సహస్రశః ॥

 బలిర్యో నామ విఖ్యాతో గణో విక్రాంతపౌరుషః ।

 బాణస్య చంద్రమనసో లౌహిత్యముప పద్యతే ॥

సూతుడనెను :

పూర్వము పుష్కర ప్రదేశమున కశ్యపుని యశ్వమేధయాగము జరిగెను. అది ఋషులతోను, దేవతలతోను, గంధర్వులతోను ప్రకాశించినది (53). అచట ఉత్కృష్టమైన విధానముచేత శాస్త్రీయముగా 69ఖ్యాన ప్రారంభమున ఐదు బంగారు ఆసనములు చక్కగా కల్పింపబడినవి (54). ఇచట కుశలచే పవిత్రములైన మూడు ఆసనములు, కూర్చము ఒక ఫలకమున్ను కల్పింపబడినవి. నలుగురు ముఖ్యులైన ఋత్విక్కులు. ఆ ఋత్విక్కులకు ఆ యాసనములను కల్పింపవలెను (55). అచట శుభమైన యాసనము హోతకోటకు ప్రకల్పింపబడినది. అది బంగారుమయమైనది. అట్లే దివ్యమైనది. దివ్యమైన చిత్రాసనము పరచినది (56). గర్భవతియైన దితి భార్యగానుండెను. ఆమె గర్భము పదివేల సంవత్సరములుండెను (57). ఆ హిరణ్యకశిపుడు తల్లియొక్క గర్భమునుండి బయలువెడలి హోతకొఱకై ప్రకల్పింపబడిన బంగారు ఆసనమున గూర్చొనెను. అచట నట్లు గూర్చున్న గర్భము (గర్భముననున్న హిరణ్యకశిపుడు) (58), ఆఖ్యానపంచమములైన వేదములను కాశ్యపుడు చెప్పిన విధముగనే చెప్పెను. అతనినిజూచిన మునులాతనికా పేరు (హిరణ్యకశిపుడని) పెట్టిరి (59). దానివలన హిరణ్యకశిపుడా పనిచేత ప్రసిద్ధుడయ్యెను. ఆతని తమ్ముడు (తరువాత బుట్టిన వాడు) హిరణ్యాక్షుడు. ఆతని చెల్లెలు సింహిక విప్రచిత్తిని పెండ్లాడినందున రాహువునకు జన్మనిచ్చిన తల్లియయ్యెను (60). హిరణ్యకశిపుడను రాక్షసుడు నూరువేలయేండ్లు నిరాహారుడై తలక్రిందులుగా నుండి గొప్ప తపము జేసెను (61). బ్రహ్మ యాతని వరముతో ననుగ్రహించెను. బ్రాహ్మణులనుండియు, సర్వభూతములనుండియు చావులేక అమరత్వమును బొంది యోగము వలన దేవతలనందరిని జయించి సర్వదేవుడై నిలిచేను (62). దానవులును అసురులును, దేవతలును హెచ్చుతగ్గులు లేక సమానులగుదురుగాక, మారుతీయొక్క మ హైశ్చ నాకు వరముగా నీయబడుగాక. (అని హీరణ్యకశిపుడు బ్రహ్మనుండి వరమును గోరెను). ఈ విధముగా నడుగబడిన బ్రహ్మ య కోరినది యిచ్చి యింకను నాతనికి దివ్యములైన వరములను గూడనిచ్చి యచటనే యంతర్థానమొందెను. రాక్షస హిరణ్యకశిపుడు శ్లోకములతో నిట్లు గానము జేయబడెను (63, 64), రాజైన హిరణ్యకశిపుడే దిక్కునకు బోవునో ఆయాదిక్కునకెల్ల దేవతలు మహా బాటు నమస్కరించిరి (65). ఓ బ్రాహ్మణులారా! రాక్షసరాజైన హిరణ్యకశిపుడిటువంటి ప్రభావము గలవాడు. పూర్వము నరసింహరూపుడైన యా విష్ణువు మృత్యువయ్యెనట. ఆ నరసింహ విష్ణువుచే గోళ్లతో నాహిరణ్యకశిపుడు చీల్చబడినాడు. దొ నఖములు శుద్ధములనబడినవి (66). హిరణ్యాక్షుని పుత్రులు ఐదుగురు. విక్రమము బలమును గలవారు - ఉత్కురుడు, కాలనాభుడు, విక్రమించిన మహానోభుడు, భూతసంపనుడును - హిరణ్యాక్షసుతులైన వీరు దేవతలకు గూడ జయింపనలవికా (68). వారియొక్క పుత్రులు పౌత్రులును సగణుడైన బాడేయుడనబడెను. నూరువేలున్న పోరు తారకామయమున నిహతులై హిరణ్యకశిపుని పుత్రులు నలుగురు మహాబలులు. వారిలో మొదటివాడు ప్రహ్లాదుడు, తరువాతివారు అనుహ్లాదుడు, సంప్రద ప్రదుడును. ప్రదుని పుత్రులను వినుడు (70). ప్రదుడు నిసుందుడును - వీరు ప్రదపుత్రులైరి. విక్రమించిన సుందోపసుందులి నీసుందుని తనయులు (71). బ్రహ్మఘ్నుడు, మహావీర్యుడు, మూకుడును - వీరు ప్రదుని కుమారులు. మారీచుడైన సుందష తొడకను జేరెను (72), ఆ తాడక బలవంతుడైన రామునిచే జంపబడినది. మూకుడు కిరాతమున సవ్యసాచియైన యః జంపబడెను (73). స్వయంభావితులై మహాతపముతో బుట్టినవారును మణివర్తమున నివసించువారును దేవతలచేత గూడ వధింపన వారును నైన మూడు కోట్ల రాక్షసులు సవ్యసాచిచే జంపబడిరి (74). అనుహ్లాదుని సుతుడు వాయువు శినీవాలియును. వారియొ హాలాహలమను గణము - అనబడినది (75). ప్రహ్లాదపుత్రుడు వైరోచనుడు. ఆతనికైదుగురు పుత్రులు. వారు - గవేష్ఠి, కా జంభుడు, భాష్కలుడు, శంభుడు పై నలువురి తమ్ముడు - వీరందరు ప్రహ్లాదపుత్రులు (76). ప్రాధాన్యమును బట్టి శత్ర జయింపనలవిగాని యా ప్రహ్లాదపుత్రుల పుత్రులను జెప్పెదను. శుంభుడు, నిశుంభుడు, విష్వక్సేనుడు - అనుపోరు మహోజ గవేష్ఠి పుత్రులు (77). జంభునకు శతదుందుభి, దక్షుడు, ఖండుడు - అను మువ్వురు పుత్రుల (78). విరోధుడు, మనువు, వృక్షా కుశలీముఖుడు - వీరు బాష్కలుని పుత్రులు. కాలనేమి సుతులను వినుడు (79). బ్రహ్మజిత్తు, క్షత్రజిత్తు, దేవాంతకుడు, నరా - వీరు కాలనేమి పుత్రులు. శంభుని పుత్రులను వినుడు (80). ధనుకుడు, అసిలోముడు, నాబలుడు, గోముఖుడు, గ గోమంతుడు - వీరు శంభు పుత్రులనబడిరి (81). విరోచనునకు బలీయొక్కడే ప్రతాపవంతుడైన పుత్రుడు. బలికి నూరుగురు : పుట్టిరి. వారందఱును రాజులే (82). వారిలో ప్రధానులు నలుగురు విక్రమము బలమును గలవారు. వారిలో జ్యేష్ఠుడ బాహువులు గలిగి ద్రవీణసమ్మతుడైన బాణుడు. కుంభనాభుడు, గర్గభాక్షడు, కుశి - అనుమొదలగువారు తక్కిన పుత్రులు (83) పూతన - అను నిరువురు బలికి పుత్రికలైన కన్యలు. బలియొక్క పుత్రులును, పౌత్రులును నూర్లకొలదియు వేలకొలదియు న (84). బలీయను పేర ప్రసిద్దమైన గణము. విక్రమము పౌరుషమును గలది. చంద్రమనస్సు గల బాణునకు ఎఱుపు దగియుండును (85).

దితిర్వినష్టపుత్రా వై తోషయామాస కశ్యపమ్ ।

 స కశ్యపః ప్రసన్నాత్మా సమ్యగారాధితస్తయా ।

వరేణ చ్చందయామాస సా చ వవ్రే వరం తతః ॥

 స తు తస్యై వరం ప్రాదాత్ ప్రార్థితం భగవన్ ప్రభుః ।

 కిమిచ్ఛసి మయి శుభే మారీచస్తామభాషత ॥

 మారీచం కశ్యపం తుష్టం భర్తారం ప్రాంజలిస్తథా ।

హతపుత్రాఽ స్మి భగవన్ ఆదిత్యైస్తవ సూనుభిః ॥

 శక్రహంతారమిచ్చేయం పుత్రం దీర్ఘతపోఽ న్వితమ్ ।

 అహం తపశ్చరిష్యామి గర్భమాధాతుమర్హసి ॥

 తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కశ్యపస్తథా ।

 ప్రత్యువాచ మహాతేజా దితిం పరమ దుఃఖితామ్ ॥

 ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే ।

జనయిష్యసి సత్పుత్రం శక్రహంతారమాహవే ॥

పూర్ణం వర్షశతం తావత్ శుచిర్యది భవిష్యసి ।

 పుత్రం త్రిలోకప్రచరమథ త్వం జనయిష్యసి ॥

 ఏవముక్త్వా మహాతేజాస్తయా సమభవత్ప్రభుః ।

తామాలింగ్య త్రిభువనం జగామ భగవానృషిః ॥

గతే భర్తరి సా దేవీ దితిః పరమహర్షితా ।

 కుశలం వనమాసాద్య తపస్తేపే సుదారుణమ్ ॥

తపస్తస్యాం తు కుర్వంత్యాం పరిచర్యం చకారహ ।

 సహస్రాక్షః సురశ్రేష్ఠః పరయా గుణ సంపదా ॥

 అగ్నిం సమిత్కుశం కాష్ఠం ఫలం మూలం తథైవ చ ।

 న్యవేదయత్ సహస్రాక్షో యచ్చాన్యదపి కించన ॥

 గాత్రసంవాహనైశ్చైవ శ్రమాపనయనై స్తథా ।

శక్రః సర్వేషు (లోకేషు) కాలేషు దితిం పరిచచారహ ।

 ఏవమారాధితా శక్రమువాచాథ దితిస్తథా ॥

విశేషముగా నశించిన పుత్రులు గల దితి భర్తయైన కశ్యపుని (తన సేవతో) సంతోష పెట్టేను. ఆ కాశ్యపుడు ప్రసన్నమైన యాత్మ గలవాడై యామేచే చక్కగా సారాధింపబడినవాడై వరముతో నామేననుగ్రహించెను. తరువాతనామె కూడ వరమును కోరుకొనెను (86). ఆ భగవత్స్వరూపుడై ప్రభువైన కశ్యపుడు ఆమెకు కోరిన వరమిచ్చెను. ఓ మంగళకరురాలా! నా యెడ నీవేమి కోరుచున్నావు - అని పలికెను (87). సంతుష్టి జెందిన మారీచుడై కశ్యపుడైన తన భర్తను చేతులు జోడించి యిట్లడిగెను. ఓ భగవత్స్వరూపుడా అదితికి బుట్టిన నీ కుమారులచే నేను హతపుత్రనైతిని (88). కావున దీర్ఘతపముతో గూడి ఇంద్రహంతమైన పుత్రుని బడయగోరుచున్నాను. నేను తపమాచరించెదను. నాయందు గర్భమును గలుగజేయుము (89), ఆమె యొక్క యా మాటను వీని మారీచుడైన కశ్యపుడు మహాతేజస్వియై మిక్కిలి దుఃఖితురాలైన దితికి మారు పలికెను (90). అభ్యగుగాక నీకు భద్రమగుగాక. ఓ తపోధనురాలా! పవిత్రురాలవు గమ్ము. యుద్ధమున నింద్రుని జంపగలుగు సత్పుత్రుని గనగలవు (91). నిండునూరేండ్లు పవిత్రురాలుగానున్నచో ముల్లోకములను అధిపతిగా జరించు పుత్రుని నీవు గనగలవు (92). ఈ విధముగా బలికి ప్రభువైన యామహాతేజస్వి యామెతో సంగమించెను. ఆమె నాలింగనము జేసీకోని భగవంతుడైన యా కశ్యపమహర్షి ముల్లోకమును జేరనేగెను (93). ఆ విధముగా భర్త వెడలిపోగా ఆ దేవియైన దితి మిక్కిలి సంతసించినదై కుశలమైన (దర్భలు నిండిన) వనమును జేరి మిక్కిలిదారుణమైన తపము జేసెను (94). సహస్రాక్షుడై దేవశ్రేష్ఠుడైన యింద్రుడు తపము జేయుచున్న యాదితికి ఉత్తమగుణ సంపదతో పరిచర్య (సేవ) జేసెను (95). అగ్నిని, సమిధలను, దర్భలను, కట్టెలను, ఫలములను కందమూలములను, ఇంకను కావలసిన యన్నింటిని ఇంద్రుడు తెచ్చి యిచ్చెను (96). శ్రమను బోగోట్టునట్టి ఒడలుపట్టుటల చేతను ఇంద్రుడు సర్వకాలములందా దితిని సేవించేను. ఇట్లారాధింపబడిన దితి సంతోషముతో నింద్రునితో నిట్లనెను (97).

దితిరువాచ :

ప్రీతా తేఽ హం సురశ్రేష్ఠ దశవర్షాణి పుత్రక ।

 అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః ॥

 జయలిప్సాం సమాధాస్యే లబ్ధ్వాఽ హం తాదృశం సుతమ్ ।

త్రైలోక్యవిజయం పుత్ర ప్రాప్స్యామి సహ తేన వై ॥

ఏవముక్త్వా దితిః శక్రం మధ్యం ప్రాప్తే దివాకరే ।

 నిద్రయాపహృతా దేవీ జాన్వోః కృత్వా శిరస్తదా ॥

దృష్ట్వా తామశుచిం శక్రః పాదయోర్గత మూర్ధజామ్ ।

తస్యాస్తదంతరం లబ్ధ్వా జహాస చ ముమోద చ ॥

తస్యాః శరీరం వివృతం వివేశాథ పురందరః ।

ప్రవిశ్య చామితం దృష్ట్వా గర్భమింద్రో మహౌజసమ్ ।

 అభినత్స ప్రధానం తు కులీశేన మహాయశాః ॥

భిద్యమానస్తదా గర్భో వజ్రేణ శతపర్వణా ।

 రురోద సస్వరం భీమం వేపమానః పునః పునః ।

 మారోదీరితి తం గర్భం శక్రః పునరభాషత ॥

తం గర్భం సప్తధా భూతం హ్యేకైకం సప్తధా పునః ।

కులిశేన బిభేదేంద్రస్తతో దితిరబుధ్యత ॥

 న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరీబ్రవీత్ ।

 నిష్పపాతోదరాద్వజ్రీ మాతుర్వచన గౌరవాత్ ॥

ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత ॥

అశుచిర్దేవి సుప్తాసి పాదయోర్గత మూర్ధజా ।

 తదంతరమహం లబ్ద్యా శక్రహంతారహవే ॥

 భిన్నవాన్ గర్భమేతం తే బహుధా క్షంతుమర్హసి ।

 తస్మింస్తు విఫలే గర్భే దితిః పరమదుఃఖితా ।

 సహస్రాక్షం తతో వాక్యం మాతుర్నయన మబ్రవీత్ ॥

మమాపరాధాద్గర్భోఽయం యది తే విఫలీకృతః ।

 నాపరాధోఽ స్తి దేవేశ ఋషిపుత్ర మహాబల! ॥

శత్రోర్వధే న దోషోఽ స్తి తేన త్వాం న శపామి భోః ।

 ప్రియం తు కర్తుమిచ్ఛామి శ్రేయో గర్భస్య మే కురు ॥

 భవంతు మమపుత్రాణాం సప్త స్థానాని వై దివి ।

 వాతస్కంధానిమాన్ సప్త చరంతు మమ పుత్రకాః ।

 మరుతశ్చేతి విఖ్యాతా గణాస్తే సప్తసప్తకాః ॥

 పృధివ్యాం ప్రథమస్కంధో ద్వితీయశ్చైవ భాస్కరే ।

 సోమే తృతీయో విజ్ఞేయశ్చతుర్థో జ్యోతిషాం గణే ॥

 గ్రహేషు పంచమశ్చైవ షష్ఠః సప్తర్షిమండలే ।

 ధ్రువే తు సప్తమశ్చైవ వాతస్కంధః పరస్తు సః ॥

తాన్యేతే విచరంత్వద్య కాలే కాలే మమాత్మజాః ।

వాతస్కంధానిమాన్ భూత్వా చరంతు మమపుత్రకాః ॥

 పృథివ్యాం ప్రథమస్కంధో అమేధ్యోభ్యో య ఆవహః ।

 చరంతు మమపుత్రాస్తే ప్రథమశ్చరతాంగణః ॥

ద్వితీయశ్చాపి మేధ్యేభ్య ఆసూర్యాతత్ప్రవహస్తు యః ।

 వాతస్కంధం ద్వితీయంతు ద్వితీయశ్చరతాంగణః ॥

సూర్యోర్ధ్వం తు తతః సోమాదుద్వహోయస్తు వై స్మృతః ।

 వాతస్కంధం తం ప్రాహుస్తృతీయశ్చరతాంగణః ॥

 సోమాదూర్ధ్వం తథర్క్షేభ్యశ్చతుర్థః సువహస్తు యః ।

 చతుర్థో మమపుత్రాణాం గణస్తు చరతాం విభో ॥

 యక్షేభ్యశ్చ తథైవోర్ధ్వమాగ్రహాద్వివహస్తు యః ।

 పంచమం పంచమః సౌమ్యః స్కందస్తు చరతాం గణః ॥

 ఊర్ధ్వం గ్రహాదృషిభ్యస్తు షష్ఠో యో వై పరాహతః ।

చరంతు మమపుత్రాసు తత్ర షష్ఠే గణే తు యే ॥

 సప్తర్షయస్తథైవోర్ధ్వమాధ్రువాత్ సప్తమస్తు యః ।

వాతస్కంధః పరివహస్తత్ర తిష్ఠంతు మే సుతాః ॥

 ఏతత్సర్వం చరం త్వేతే కాలే కాలే మమాత్మజాః ।

తత్ర తేన చ నామ్నా వై భవంతు మరుతస్త్విమే ॥

దితియనెను :

ఓ సురశ్రేష్ఠుడా! ఓ ప్రియపుత్ర! నీ విషయమున సంతుష్టురాలనైతిని. ఇంకను పదియేండ్లు మిగిలియున్నవి. నీకు భద్రవ ఆ తరువాత నీవు తమ్ముని జూడగలవు (98). జయవాంఛను మనముననుంచుకొన్నాను. ఆ జయమునిచ్చునట్టి పుత్రుని బొందన ఓ పుత్రుడా! ఆతనితో ముల్లోకముల విజయమును బొందగలను (99). ఈ విధముగా నీంద్రునితో బలికీ, సూర్యుడు మధ్యాహ్న రాగా, మోకాళ్లపై తలయుంచి నిద్రావశురాలయ్యెను (100). పాదముల పై బడిన తలవెంట్రుకలు కలదగుటచే అశుచియైన జూచీ యింద్రుడు ఆమె విషయమున ఒక యవకాశమును బొంది నవ్వి సంతసించెను (101). అపుడేంద్రుడు తెరచుకొన్న శరీరమున బ్రవేశించెను. ప్రవేశించి మహాతేజస్సులతో అమితమైన గర్భమును జూచెను. మహాయశస్వియైన యింద్రుడు ఆప్రళ గర్భమును వజ్రముతో భిన్నము జేసెను (102). నూరు కణుపులు గల యా వజ్రముతో భేదింపబడుచున్న యా గర్భము కంపి సస్వరముగా మరల భయంకరముగా రోదనము జేసెను. ఇంద్రుడు - ఏడువకుము అని యా గర్భముతో బలికెను (103). విధములుగా నైన యా గర్భమున మరల నొక్కొక్కటీ యేడు విధములగునట్లు ఇంద్రుడు వజ్రముతో భిన్నము జేసెను. అం మేలుకొనెను (104). చంపరాదు చంపరాదు అని దితి పలికెను. తల్లి మాట పై గౌరవము వలన వజ్రము ధరించిన యింద్రు కడుపునుండి కిందబడెను. వజ్రముతోనే యింద్రుడు చేతులు జోడించి దితితో నిట్లనెను (105). ఓయమ్మా! పొదముల వెంట్రుకలు బడునట్లుగా నపవిత్రురాలవై నిద్రించితివి. ఆయవకాశమును దీసికొని యుద్ధమున నింద్రుని జంపగల నీ యీ గర భిన్నము జేసితిని. నన్ను క్షమింపుము అనెను (106). ఆ గర్భము విఫలము గాగా దితి మిక్కిలి దుఃఖితురాలై తన తల్లికి కం పోడయిన యింద్రునితో నిట్లనెను (107). నా యపరాధముననే యీ గర్భము విఫలము జేయబడినది. ఓ దేవరాజా! ఋ మహాబల! నీయపరాధమేమియు లేదు (108). నీ శత్రువును జంపుటలో నీకు దోషము లేదు. దానం జేసి ఓయి! నిన్ను శపింపన ప్రియమునే జేయగోరుదును. నా గర్భమునకు శ్రేయమును గూర్చుము (109). నా పుత్రులకు ఆకాశమున ఏడు స్థానములేర్పడు? పుత్రులు ఈ యేడు వాతస్కంధములను చరింతురు గాక. సప్తసప్త కులైన నలుబది తొమ్మిది నా పుత్రులు మరుద్గణ ప్రసిద్దిజెందుదురుగాత (110). పృథివియందు మొదటిస్కంధము, భాస్కరునియందు, రెండవ స్కంధము సోమునియందు మూడవస జ్యోతిర్గణమునందు నాలుగవ స్కంధము (111), గ్రహములందు ఐదవ స్కంధము, సప్తర్షిమండలమున ఆరవస్కంధము, ధ్రువుని ఏడవస్కంధము (112). నా యీ పుత్రులు పై స్కంధములను ఇపుడు ప్రతికాలమునదిరుగుదురు. నా పుత్రకులు ఈ పాతస్కంధములను దిరుగురుదు గాక (113). భూమియందలి మొదటి స్కంధము - అపవిత్రముల నుండి ప్రవహించు ఆవహము (ఆవహవాయుస్థానము). మొదటిదైన చరించుగుణముగా నా పుత్రకులు ఇందు చరింతురు గాక (114). రెండవది కూడ పవిత్రప్రదేశముల నుండి సూర్యుని వరకు ప్రవహించునది ప్రవహ వాయుస్థానము. ఈ వాతస్కంధమున రెండవచరించు గుణము చరించుగాక (115). సూర్యునకు పైన చంద్రుని నుండి ప్రవహించు వాయువు ఉద్వహమనబడును. దానిని మూడవవాతస్కంధమందురు. దీనియందు మూడవ చరించుగుణము చరించుగాక (116). సోమునకు పైన నక్షత్రముల నుండి ప్రవహించు వాయువు నాలుగవది సువహమనునది. సో పుత్రులగు నాలుగవచరించు గణము అచట చరించుగాక (117). యక్షులకు (నక్షత్రములకు) పైన గ్రహముల వరకు ప్రవహించు వాయువు వివహము ఐదవది. ఈ యెదవదానియందు యైదవస్కంధమున చరించు గణము చరించుగాక (118). గ్రహములకంటే పైన ఋషులవరకు చరించు వాయువు ఆరవది పరాహతము (పరావహము). అచట ఆరవగణపు నా పుత్రులు చరింతురు గాక (119). సప్తరులకును పైన ధ్రువ నక్షత్రము వరకు చరించు నేడవ వాయు స్కంధము పరివహము అచట నొపుత్రులుందురుగాక (120). ఈ నా పుత్రులు దీనినంతయు ప్రతికాలమున చరింతురు గాగ. అచట ఆ పేరుతో మరుత్తులు అగుదురు గాక (121).

తతస్తేషాం తు నామాని మాతాపుత్రౌ ప్రచక్రతుః ।

తత్కృతే కర్మభిశ్చైవ మరుతో వై పృథక్ పృథక్ ॥

 సత్త్వజ్యోతిస్తథాఽ దిత్యః సత్యజ్యోతిస్తథాఽ పరః ।

 తిర్యగ్జ్యోతిశ్చ సజ్యోతిర్జ్యోతిష్మాన పరస్తథా ॥

 ప్రథమస్తు గణః ప్రోక్తో ద్వితీయం మే నిబోధత ।

ఋతజిత్సత్యజిచ్చైవ సుషేణః సేనజిత్తథా ॥

సత్యమిత్రోఽ భిమిత్రశ్చ హరిమిత్రస్తథాఽ పరః ।

గణ ఏష ద్వితీయస్తు తృతీయం మే నిబోధత ॥

కృతః సత్యో ----- ధ్రువోధర్తా విధారయః ।

ధ్వాంతశ్చైవ ధునిశ్చైవ హ్యుగ్రో భీమస్తథైవ చ ।

అభియుః సాక్షిపశ్చైవమాహ్వయశ్చ గణః స్మృతః ॥

ఈదృక్చైవ తథాన్యాదృక్ యాదృక్చ ప్రతికృత్తథా ।

సమితిశ్చైవ సంరంభశ్చ తథా గణః ॥

 ఈదృక్చ పురుషశ్చైవ అన్యాదృక్షాచ్చ చేతసః ।

 సమితాసమితదృక్షాచ్చ ప్రతిదృక్షాచ్చ వై గణాః ॥

ఏతే హ్యేకోనపంచాశన్మరుతో నామతః స్మృతాః ।

ప్రసంఖ్యాశాస్తథా తాభ్యాం దిత్యా చేంద్రేణ చైవ హి ॥

శ్రుత్వా తేషాం తు నామాని దితిరింద్రమువాచ హ ।

 వాతస్కంధం చరంత్వేతే మమ పుత్రాశ్చ పుత్రక ।

 విచరంతు చ భద్రం తే దేవైః సహా మమాత్మజాః ॥

 తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ।

 ఉవాచ ప్రాంజలిర్భూత్వా మాతర్భవతు తత్తథా ॥

 సర్వమేతద్యధోక్తం తే భవిష్యతి న సంశయః ।

 దేవభూతా మహాత్మానః కుమారా దేవసమ్మతాః ॥

 దేవైః సహ భవిష్యంతి యజ్ఞభాజస్తథాత్మజాః ॥

 తస్మాత్తే మరుతో దేవాః సర్వే చేంద్రానుజామరాః ।

విజ్ఞేయాశ్చామరాః సర్వే దితిపుత్రాస్తపస్వినః ॥

ఏవం తౌ నిశ్చయాజ్ఞాత్వా మాతాపుత్రౌ తపోధనౌ ।

 జగ్మతుస్త్రిదివం హృష్టౌ శక్రోఽపి త్రిదివం గతః ॥

 మరుతాం హి శుభం జన్మ శృణుయాద్యః పఠేత వా ।

 నావృష్టిభయమాప్నోతి బహ్వాయుశ్చ భవేత్తతః ॥

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే కాశ్యపీయప్రజాసర్గోనామ షష్ఠోఽధ్యాయః ॥

తరువాత నా తల్లికొడుకులు (దితి - ఇంద్రులు) వారికి పేరులను బెట్టిరి. దానికై మరుత్తులు తమ కర్మలతో వేరువేరుగానైరి (122), సత్త్వజ్యోతి, దిత్యుడు, సత్యజ్యోతీ, తిర్యగ్ జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మంతుడు (123), ఇది ప్రథమగణము అనబడినది. రెండవ గణమును వినుడు. ఋతజిత్తు, సత్యజిత్తు, సుషేణుడు, సేనజిత్తు (124), సత్యమిత్రుడు, అభిమిత్రుడు, హరిమిత్రుడు - ఇది. రెండవగణము. మూడవగణమును వినుడు (125). కృతుడు, సత్యుడు - ధ్రువుడు, ధర్త, విధారయుడు, ధ్వాంతుడు, ధుని, ఉగ్రుడు, భీముడు, అభియువు, సాక్షిపుడు, ఆహ్వయుడు - ఇది మూడవగణమనబడినది (126). ఈదృక్కు, అన్యాదృక్కు, యాదృక్కు, ప్రతికృతు, సమితి, సంరంభుడు, - ఇది నాల్గవగణము (127). ఈదృక్కును, పురుషుడును, అన్యాదృక్షమైన (ఇతరులతో సమానమైన) చిత్తము నుండి వెలసినవారును, సమితాసమితులతో సమానమైన చిత్తము నుండి వెలసినవారును, ఎదుటి (విరోధి) తో సః చిత్తము నుండి వెలసినవారును - గణముల వారు (128). వీరు నలుబది తొమ్మండుగురు మరుత్తులు పేరులతో జెప్పబడిరి. ఇంద్రులిద్దరిచేత అట్లు చక్కగా లెక్కింపబడిరి గదా (129) - దితి యామరుత్తుల పేర్లను విని ఇంద్రునితో నిట్లనెను. ఓ పుత్రకి ఈ నాపుత్రులు వాతస్కంధమును చరింతురు గాక. నా పుత్రులు దేవతలతో గలిసి చరింతురు గాక. నీకు భద్రమగుగాక (130 యొక్క యా మాటను విని సహస్రాక్షుడైన యింద్రుడు. చేతులు జోడించినవాడై తల్లీ! అది యట్లేయగుగాక - అనెను (131). జెప్పినట్లంతయు జరుగగలదు. సంశయము లేదు. మహాత్ములైన నీకుమారులు దేవసమ్మతులైన దేవతలగుదురు. అట్లే దేవతలతో బాటు యజ్ఞభాగమునందువారును గాగలరు (132). కావున నీ మరుత్తులైన దేవతలు అందరును ఇంద్రుని త యమరులు. కశ్యపముని వల్ల దితికి పుత్రులైనవారందరు అమరులుగా దెలియవలెను (133). ఈ విధముగ తపోధనులై కొడుకులు (దితి - ఇంద్రులు) ఇరువురు నిశ్చయమును దెలిసి స్వర్గమునకు వెళ్లిరి. ఇంద్రుడు కూడ స్వర్గమునకు వెళ్లాను (13 మరుత్తులయొక్క మంగళకరమైన జన్మను విన్నవాడును చదివినవాడును వర్షములేమి వల్ల గలుగు భయమునందడు. దీర్ఘమైన యాయువు గలవాడుగను అగును (135).

ఇది శ్రీవాయుమహాపురాణమున కాశ్యపీయప్రజాసర్గమను ఆఱవ అధ్యాయము సమాప్తము.