వాయు మహా పురాణము
10 - మన్వన్తరాది వర్ణనం
సూత ఉవాచ:-
ఏవం భూతేషు లోకేషు బ్రహ్మణా లోకకర్తృణా ।
యదా తా న ప్రవర్తనే ప్రజాః కేనాఽపి హేతునా॥
తమో మాత్రావృతో బ్రహ్మా తదా ప్రభృతి దుఃఖితః ।
తతః సవిదధే బుద్ధి మర్థనిశ్చయ గామినమ్॥
అథాత్మని సమస్రాక్షీత్తమో మాతాం నియామికామ్।
రాజసత్వం పరాజిత్య వర్తమానం సధర్మతః॥
సూతుడు పలికెను :- లోక కర్తయైన బ్రహ్మచే లోకములట్లుండగా, అప్పుడు ఏ కారణమునైనను ప్రజలు ( ధర్మ మార్గమున) ప్రవర్తింపకుండిరి-1. అప్పటి నుండి బ్రహ్మ తమోగుణ మాత్రముచే జుట్టబడెను. (కప్పబడెను) తరువాత తన బుద్దిని అర్థ నిశ్చయ గామినిగా (విషయములను తేల్చునిశ్చయించుదానిగా) జేసెను-2. వెంటనే తన యందు నియామికయైన (నియమించునదైన) తమోగుణమాత్రముచే నిండిన బుద్దిని సృష్టించేను. ధార్మికముగా మండుచున్న రాజస గుణమును ఓడించేను.
తప్యతే తేన దుఃఖేన శోకం చక్రే జగత్పతిః ।
తమశ్చ వ్యనుదత్తస్మాద్ర జస్తమస మావృణోత్॥
తత్తమః ప్రతినుత్తం వై మిథునం సవ్యజాయత ।
అధర్మాచ్చరణాజ్జజ్ఞే హింసాశోకాద జాయత॥
తతస్తస్మిన్ సముద్భూతే మిథునే చరణాత్మని ।
తతశ్చ భగవానాసీత్ ప్రీతశ్చైవ మశిశ్రియత్ ॥
స్వాం తనుం స తతో బ్రహ్మ తామపోహద భాస్వరామ్ ।
ద్విధా కరోత్సతం దేహమర్థేన పురుషోఽభవత్ ॥
అర్థేన నారీ సా తస్య శతరూపావ్య జాయత ।
పాకృతాం భూతధాత్రీం తాం కామాన్యై సృష్టవాన్విభు: ॥
సాథితం పృథివీంచైవ మహిమ్నా వ్యాప్యధిష్టితా ।
బ్రహ్మణః సా తనుః పూర్వాదిత మావృత్య తిష్ఠతి॥
ఆ దుఃఖముచే తపింపబడి జగత్పతి శోకించెను. దాని వలన తమోగుణము తొలగించెను. రజోగుణము తమోగుణము నావరించెను (ఆక్రమించెను)-4. తొలగించబడిన యా తమోగుణము మిధునమును (రణమును, యుద్దమును) కలిగించెను. రణము నుండి అధర్మము జన్మించెను. శోకము నుండి హింస జనించేను-5. అంత రజోరూపమైనయా మిధునము జనింపగా భగవంతుడు సంతసించెను. అట్లు సంతసించినవాడై యభాస్వరమైన (కాంతిలేని) తన తన శరీరము నాశ్రయించెను-6, ఆ శరీరమును ఒక క్రొత్తవిధముగా భావించేను. ఆ దేహమును రెండు విధములుగా చేసెను. అది సగము పురుషుడయ్యెను-7. సగము స్త్రీయయ్యెను. ఆ స్త్రీ శతరూపమయ్యెను. ప్రాకృతయై భూతదాత్రియైన మాయెననుసరించి యాప్రభువు కామములను సృజించెను-8. ఆమె తన మహిమచే ఆ స్వర్ణమును భూమిని గూడ వ్యాపించి నిలిచెను. బ్రహ్మయొక్కయు మొదటి శరీరము స్వర్ణమావరించియున్నది.
యాత్వర్థాత్సృజతే నారీ శతరూపా వ్యజాయత ।
సా దేవీ నియతం తప్త్వా తపః పరమ దుశ్చరమ్ ॥
భర్తారం దీప్తయశసం పురుషం ప్రత్యపద్యత ।
సవై స్వాయంభువః పూర్వ పురుషోమను రుచ్యతే॥
తస్యైకసప్తతియుగం మన్వన్తర మిహోచ్యతే ।
లబ్దా తు పురుషః పత్నం శతరూపాయ యోనిజామ్ ॥
తయా సరమతే సార్థం తస్మాత్సా రతి రుచ్యతే ।
ప్రథమః సంప్రయోగః సకల్పాదౌ సమవర్తత ॥
తన యర్థశరీరము నుండి సృజింపబడిన స్త్రీయైన శతరూప అతి కష్టమైన లక్షతపము జేసెను-10. దీప్తయశస్కుడైన పురుషుని భర్తగానొందెను. అతడేయిట స్వాయంభువమన్వంతరము వాడైన మొదటి పురుషుడైన మనువనబడుచున్నాడు-11. ఇచట డెబ్బది యొక్కయుగములు ఆతని మన్వంతరమనబడును. ఆ పురుషుడు అయోనిజయైన శతరూపనుపత్నిగా బొందెను. అది ఆమెతో రమించుచుండెను. ఆ కారణమున నామె (ఆరమణ క్రియ) రతి యనబడినది. కల్పాదిలో అదియే మొదటి సంప్రయోగము (స్త్రీ పురుష సంపర్కము)గా జరిగెను.
విరాజమసృజద్భ్రహ్మా సోఽభవత్పురుషో విరాట్ ।
సమ్రాణ్మానసరూపాత్తు పై రాజస్తుమనుః స్మృతః ॥
స వై రాజః ప్రజాసర్ల: ససర్గే పురుషో మనుః ।
వైరాజా త్పురుషాద్వీరాచ్చతరూపా వ్యజాయ త ॥
బ్రహ్మ విరాజుని సృజించెను. ఆతడు విరాట్టయ్యెను. (ఆదిదేవుడు) (బ్రహ్మ) మానసరూపుడై వైరాజుడైన విరాట్టు నుండి బుట్టినవాడు సమ్రాట్టెన (చక్రవర్తియైన) మనువనబడేను-14. అది వైరాజమైన ప్రజాసృష్టి ఆ సృష్టిలో పురుషుడు మనువు వీరుడైన విరాట్పురుషుని నుండి శతరూప పుట్టెను.
ప్రియవ్రతోత్తానపాదౌ పుత్రా పుత్రవతాం వరౌ ।
కన్యే ద్వే చ మహాభాగే యాభ్యాజాతాః ప్రజాస్త్విమాః ॥
దేవీ నామ్నా తథాకూతిః ప్రసూతిశ్చైవ తే శుభే ।
స్వాయమ్భువః ప్రసూతిం తు దక్షాయ వ్యసృజత్ప్రభుః ॥
ప్రాణో దక్షస్తు విజ్ఞేయః సఙ్కల్పో మనురుచ్యతే ।
రుచేః ప్రజాపతేశ్చైవ ఆకూతిం ప్రత్యపాదయత్ ॥
ఆకూత్యాం మిధునం యజ్ఞే మానసస్య రుచేః శభమ్ ।
యజ్ఞశ్చ దక్షిణాచైవ యమకౌ సంబభూవతు: ॥
యజ్ఞస్య దక్షిణాయాశ్చ పుత్రాద్వాదశ జజ్ఞిరే ।
మాయా ఇతి సమాఖ్యాతా దేవాః స్వాయంభువేఽ నర్తే ॥
యమస్య పుత్రా యజ్ఞస్య తస్మాద్యమాస్తు తే స్మృతాః ।
అజితాశ్చైవ శూకాశ్చ గణౌ ద్వౌ బ్రహ్మణః స్మృతౌ ॥
పుత్రవతులలో శ్రేష్ఠులైన ప్రియపుత్రుడు ఉత్తానపాదుడు అను పుత్రులును ఇద్దరు గొప్ప భాగ్యవతులైన కన్యలును కలిగిరి. ఆ కన్యలనుండి యీ ప్రజలు పుట్టిరి-16. దేవీ ఆకూతి, స్రసూతి అని వారి పేరుతో ప్రభువైన బ్రహ్మ స్వాయంభువుని సంతానమును దక్షునకిచ్చెను-17. ప్రాణము దక్షుడని సంకల్పము మనువు అనియనబడిరి. ప్రజాపతియైన రుచికి ఆకూతినిచ్చెను-18. మానసపుత్రుడైన రుచికి ఆకూతియందు శుభమైన మిథునము ( ) జజ్ఞే పుట్టేను. యజ్ఞుడు, దక్షిణయను (యమకులు) జంట పుట్టినదీ-19. ఆ యజ్ఞ-దక్షణలకు పండ్రెండుగురు పుత్రులు జనించిరి వారు స్వాయంభువమన్వంతరము యాములనియనబడిరి-20. యజ్ఞరూపుడైన యమునకు పుత్రులుగాన వారు యాములనబడిరి. అజితులు, శూకులు అను రెండు బ్రహ్మయొక్క గణములనబడినవి.
యామాః పూర్వం పరీక్రాన్తాయతః సంజ్ఞా దివౌకసః ।
స్వాయమ్బువసుతాయాన్తు ప్రసూత్యాం లోకమాతర: ॥
తస్యాం కన్యాశ్చతుర్వింశద్దక్షస్త్వ జనయతో ప్రభుః ।
సర్వాస్తాశ్చ మహాభాగాః సర్వాః కమలలోచనాః ॥
యోగపత్స్యశ్చ తాః సర్వాః సర్వాస్తా యోగమాతరః ।
శ్రద్ధా లక్ష్మీధృతి స్తుష్టిః పుష్టిర్మేధా క్రియాతధా ॥
బుద్ధిర్లజ్ఞావపుః శాన్తిః సిద్ధిః కీర్తి స్త్రయోదశీ ।
పత్న్యర్థే ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయణీః ప్రభుః ।
ద్వారాణ్యేతాని చైవాస్య విహితాని స్వయమ్భువా॥
తాభ్యః శిష్టా యతీ యస్య ఏకాదశ సులోచనాః।
ఖ్యాతిః సత్యథ సంభూతిః స్మృతి: ప్రీతిః క్షమా తథా ॥
సన్నతిశ్చానసూయా చ ఊర్జాస్వాహా స్వధా తథా ।
తాస్తతః ప్రత్యపాదన్త పునరన్యే మహర్షయః ॥
స్వర్గ నివాసులైన దేవతలకు పేరుగావున పూర్వము యాములు పరిక్రమించిరి. (విహరించిరి) (?) స్వాయంభువ మనువు కూతురైన ప్రసూతియందు లోకమాతయు జనించిరి-22. దక్షునకా కన్యయందు ఇరువది నలువురను కన్యలను బ్రహ్మ జనియింప జేసెను. వారందరు మహాభాగ్యవంతులు కమల లోచనలు-23. వారు యోగపత్నులు యోగమాతలను శ్రద్ధా, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధా, క్రియా అట్లే బుద్ధి, లజ్జా, వపువు, శాస్త్రి, సిద్ధి, కీర్తి, త్రయోదశి-24. దాక్షాయణులైన దక్షుని కన్యలను ధర్ముడు భార్యార్థముగా స్వీకరించెను. బ్రహ్మ యీ కన్యలు ధర్మునకు (సృష్టికి) ద్వారములుగా జేసెను-25. వారికన్న మిగిలిన సులోచనలు పిన్నవారును ఐన వారు పదకొండుగురు కన్యలును, వారు ఖ్యాతి, సతీ, తరువా తసంభూతి, స్మృతి, ప్రీతి, క్షమా అట్లే-26. సన్నతి, అనుసూయా, ఊర్జా, స్వాహా, స్వధా- అనువారు వారినైతే మహర్షులు (భార్యలుగా) పొందీరి.
రుద్రో భృగుర్మరీచిశ్చ అజ్గీరాః పులహః క్రమః ।
పులస్త్యోఽత్రిర్వసిష్ఠశ్చ పితరో ఽగ్నిస్తథైవ చ ॥
సతీం భవాయ ప్రాయచ్ఛత్, ఖ్యాతించ భృగవే తథా ।
మరీచయే చ సంఖూతిం స్మృతిమాజ్గిరసే దదౌ ॥
ప్రీతిం చైవ పులస్త్యాయ క్షమాం వై పులహాయ చ ।
క్రతవే సన్నతిం నామ అనసూయాం తథాఽత్రయే॥
ఊర్జాం దదౌ వసిష్ఠాయ, స్వాహాం వై హ్యగ్నయే దదౌ ।
స్వధాం చైవ పితృభ్యస్తు శాస్వపత్యాని వక్ష్యతే॥
రుద్రుడు, భృగువు, మరీచి, అణ్ణరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, అత్రి, వసిష్ఠుడు, పీతరులు, అగ్ని, వీరు (ఆ ఋషులు)-28. సతిని భవునకిచ్చెను. ఖ్యాతిని భృగువునకు, అట్లే, మరీచికి సంభూతిని, ఆజ్గిరసునకు స్మృతిని ఇచ్చెను -29. అట్లే పులస్త్యునకు ప్రీతిని, పులహునకు క్షమను, క్రతువునకు సన్నతిని, అట్లే ఆత్రికి అనసూయను-30. వసిష్ఠునకు ఊర్జను, అగ్నికి స్వాహాను, పితురులకు స్వధను, ఇచ్చెను. వారియందాఋషులకు గలిగిన సంతానము ముందు చెప్పబడుచున్నదీ.
ఏతే సర్వే మహాభాగాః ప్రజ్ఞాః స్వానుష్ఠితాః స్థితాః ।
మన్వన్తరేషు సర్వేషు యావదాభూత సంప్లవమ్ ॥
అన్ని మన్వన్తరములలోను సర్వభూత ప్రలయమగు నంతవరకు, ఈ యందరు మహానుభావులును ఉందురు. వారి ప్రజ్ఞలను (లౌకికాలౌకికసూక్ష్మబుద్ధులు) చక్కగా అనుష్ఠింపబడుచుండును (ప్రసరింపబడుచుండును).
శ్రద్ధా కామం విజజ్ఞే, వై దర్పోలక్ష్మీసుతః స్మృతః ।
ధృత్యా స్తు నియమః పుత్రస్తుష్ట్యాః సన్తోష ఉచ్యతే ॥
పుష్ట్యాలాభః సుతశ్చాఽపి, మేధా పుత్రః శ్రుతస్తథా ।
క్రియాయాస్తు నయః ప్రోక్తో, దణ్డః సయయ ఏవ చ ॥
బుద్దేర్బోధ సుతశ్చాపి అప్రమాదశ్చ తావుభౌ ।
లజ్జాయా వినయః పుత్రో, వ్యవసాయో వపుః సుత:॥
క్షేమ: శాన్తి సుతశ్చాపి, సుఖం సిద్ధేర్వ్యజాయత ।
యశః కీర్తేః సుతశ్చాపి, ఇత్యేతే ధర్మసూనవః ॥
వారిలో శ్రద్ధ కాముని గనెను. దర్పుడు (దర్పము) లక్ష్మీసుతుడనబడెను. ధృతికి నియముడు (నియమము) పుత్రుడు తుష్టికి సంతోషుడు (సంతోషము) పుత్రుడనబడేను-33. పుష్టికి లాభుడు (లాభము) సుతుడు. మేధా పుత్రుడు శ్రుతుడు (శ్రుతము) అట్లే, క్రియకు నయుడు (నయము) దణుడు (దణ్ణము) సమయుడు (సమయము)ను పుత్రులనబడిరి-34. బుద్దికి బోధుడు అప్రమాదుడు అనునిద్దరు పుత్రులు, లజ్జకు వినయుడు (వినమయ) పుత్రుడు. వ్యవసాయుడు (వ్యవసాయము) వపువుయొక్క పుత్రుడు-35. క్షేముడు (క్షేమము) శాస్త్రికి పుత్రుడు. సిద్ధికి సుఖుడు (సుఖము) కలిగెను. కీర్తికి యశుడు (యశము) సుతుడు. ఈ విధముగ వీరందరు ధర్ముని పుత్రులు (ధర్మము యొక్క పుత్రులు).
కామస్య హర్ష పుత్రో వై దేవ్యా రత్యా వ్యజాయత ।
ఇత్యేష వై సుఖోద ర్కః సర్గో ధర్మస్య కీర్తితః॥
కామునకు దైవియైన రతి వలన హ ర్షుడను పుత్రుడు గలిగెను. ఈ విధముగ నిది సుఖమునే ఫలముగా నిచ్చు ధర్ముని యొక్క సృష్టి చెప్పబడినది.
జజ్ఞే, హింసాత్వధర్మాద్యై నికృతిశ్చానృతావుభౌ ।
నికృత్యా నృతయోర్జజ్ఞే భయం నరక ఏవ చ ॥
మాయా చ వేదనా చాపి మిధునద్వయ మేతయోః ।
భయాజ్జజ్ఞేఽథ సా మాయా మృత్యుం భూతాప హారిణీమ్ ॥
వేదనాయాస్తతశ్చాపి దుఃఖం జజ్ఞేఽథ రౌరవాత్ ।
మృత్యోర్వ్యాధిజ్వరా శోకాః క్రోధోఽసుయా చ జజ్ఞిరే ।
దుఃఖాన్తరా స్మృతా హ్యేతే సర్వే చాధర్మలక్షణాః ॥
తేషాం భార్యాఽస్తి పుత్రో వా తే సర్వే నిధనాః స్మృతాః ।
ఇత్యేష తామసః సర్వో జజ్ఞే, ధర్మనియామకః ॥
అధర్మము నుండి హింస జనించెను. నికృతి-అనృతులిద్దరును (మిథునము) బుట్టిరి. ఆ నికృతి -అనృతులిద్దరికి భయము నరకము జనించినవి-38. వీరిద్దరికి మాయ-వేదన అను మిథునద్వయము గలిగెను. భయమునుండి యామాయ భూతాపహారిణి యగు మృత్యువును గనెను-39. తరువాత వేదన నుండి దుఃఖము గలిగెను. తరువాత భయంకరమైన మృత్యువునుండి వ్యాధి, జ్వర-శోకములు క్రోధము అసూయయును గలిగెను. ఇవి యన్నియు దుఃఖము నిండినవి. అధర్మ లక్షణములు-40. వారికి వారికి భార్యగాని పుత్రుడుగాని, వారందరు నిధనులే (మరణములే) యనబడిరి. ఈ విధముగా నిధి ధర్మనియామకమైన తామస సృష్టికలిగినది.
ప్రజాః సృజేతి వ్యాదిష్టో బ్రహ్మణా నీలలోహితః ।
సోఽభిధ్యాయ సతీం భార్యాన్నిర్మమే హ్యాత్మసంభవామ్ ॥
నాధికాన్న చ హీనాం స్తోన్మాన సానాత్మనః సుతాన్ ।
సహస్రహి సహస్రాణా మసృజత్ కృమివాససౌ ।
తుల్యాశ్చైవాత్మనః సర్వే రూపతేజో బలశ్రుతైః॥
ప్రజలను సృజింపుమని బ్రహ్మచే నీలలోహితుడైన శివుడాజ్ఞా పింపబడెను. ఆతడు ధ్యానించి ఆత్మ సంభవమైన సతిని భార్యగా నిర్మించుకొనేను-42. తనకు మించకు తగ్గకయు సమముగానున్న వేయివేల (10 లక్షల) మానవసుతులను సృజించెను. వారందరు కృమివాసస్సుతో (పట్టువస్త్రముతో) రూప-తేజో-బల-శ్రుతములతోను తనకు సమానులు.
పిజ్గలాన్ సన్నికర్షాంశ్చ సకపర్దాన్ విలోహితాన్ ।
వివాసాన్ హరికేశాంశ్చ దృష్టిఘ్నాంశ్చ కపాలినః॥
బహురూపాన్ విరూపాంశ్చ విశ్వరూపాంశ్చ రూపిణః ।
రథినో వర్మిణశ్చైవ ధర్మణశ్చ వరూధినః ॥
సహస్ర శతబాహూంశ్చ దివ్యాన్ భౌమాన్త రిక్షగాన్ ।
స్థూలశీర్షానష్ట దంష్ట్రానుద్విజిహ్వాం స్త్రీలోచనాన్॥
అన్నాదాన్ పిశితాదాంశ్చ ఆజ్యపాన్ సోమపాం స్తథా ।
మేదపాంశ్చాతి కాయాంశ్చ శతకణ్ఠోగ్రమన్యవ॥
సోపాసజ్గ ధావతశ్చైవ జృమ్బినశ్చైవ ధిష్ఠితాన్ ॥
అధ్యాపి నోఽథజపతో యుఞ్చుతో ధ్యాయత స్తథా ।
జ్వలతో వర్షతశ్చైవ ద్యోతమానాన్ ప్రధూపితాన్॥
బుద్ధాన్ బుద్ధతమాంశ్చైవ బ్రహ్మిష్ఠాన్ శుభదర్శనాన్ ।
నీలగ్రీవాన్ సహస్రాక్షాన్ సర్వాంశ్చాథ క్షపాచరాన్ ॥
అదృశ్యాన్ సర్వభూతానాం మహాయోగాన్ మహౌజసః ।
దతో ద్రవతశ్చైవ ఏవం యుక్తాన్ సహస్రశః ।
అపాతతూయానసృజత్ రుద్రరూపాన్ సురోత్తమాన్ ॥
ఎఱ్ఱని గోరోచనపువర్ణముగల) వారిని, సన్ని కర్పులను, జటాజూటముగలవారిని, విలోహితులను (ఎర్రని వారిని), వస్త్రములేని వారిని, కోతిరంగు వెంట్రుకలు గలవారిని, దృష్టాలను బోగోట్టువారిని కపాలములు ధరించు వారిని-44, బహురూపములు గల వారిని విరూపులను, విశ్వరూపులను రూపవంతులను, రథములు గల వారిని, కవచములు గల వారిని, ధర్ములను, సేనలను-45, లక్షబాహువులు గల వారిని, దీవులను భౌములను (భూమియందుండువారు) అన్తరిక్షగులను (ఆకాశమునందుండు వారు, లావుతలగలవారిని, ఎనిమిది కోరలు గల వారిని, రెండునాలుకలు గలవారిని, మూడు కన్నులు గల వారిని-46, అన్నముదినువారిని, మాంసముదినువారిని, నేయి ద్రాగువారిని, సోమరసమును ద్రాగు వారిని, మేదస్సును దాగువారిని అతి కాయులను లావు శరీరముగలవారు) నల్లనికంఠము తీవ్రకోపమును గల వారినీ-47, అమ్ములపొదులు గల వారిని, తలత్రము పై (రక్షణకవచము) గలవారిని, ధనుర్దారులను, ఉపకవచముగలవారిని, కూర్చున్నవారిని, పరిగెత్తుచున్న వారిని, ఆవులింతలు దీయువారిని, ధిష్ఠితులను (నివసించినవారిని), అధ్యాపకులను జపము చేయుచున్నవారిని, కలియుచున్నవారిని, ధ్యానము జేయుచ్ను వారిని, మండుచ్ను వారిని, వర్షించుచున్నవారిని, ప్రకాశించుచున్న వారిని మిక్కిలి పొగవేయబడిన వారిని-48, 49, బుద్ధులను, బుద్ధతములను, బ్రహ్మలో నిలచినవారిని, శుభదర్శనులను, నీలకంఠులను, సహస్రాక్షులను, సమస్తరాత్రి చరులైన రాక్షసులను, సర్వభూతములకు కనబడని వారిని, హాహాయోగులను, మహా తేజస్సు గలవారిని, రోదనము చేయుచున్నవారిని, పరుగిడుచున్న వారిని, ఈ విధముగా గలిసియున్న వారిని వేలకు వేలు అపాతయాములను రుద్రరూపులు ఐన సురోత్తములను సృజించెను.
బ్రహ్మా దష్ట్వాఽబ్రవీదేతాన్మా స్రాక్షరీదృశీః ప్రజాః ।
స్రష్టవ్యానాత్మనస్తుల్యాః ప్రజాదైవాధికాస్త్వయా।
అన్యాః సృజత్వం భద్రం తే స్థితోఽహం త్వం సృజప్రజాః॥
ఏతే వైయా సృష్టా విరూపా నీలలోహితాః ।
సహస్రాణాం సహస్రం తు ఆత్మనోప మనిశ్చితా:॥
ఏతే దేవా భవిష్యన్తి రుద్రానామ మహాబలాః ।
పృథివ్యా మన్తరిక్షే చ రుద్రనామ్నా ప్రతిశ్రుతాః ।
యజ్ఞభాజ్ఞ భవిష్యన్తి సర్వే దేవయుగైః సహ ॥
మన్వన్తరేషు యే దేవా భవిష్యన్తీహ చ్ఛన్దజాః ।
తైః సార్థమిజ్యమానాస్తే స్థాస్యన్తీహ యుగక్షయాత్ ॥
ఏవముక్త స్తదా బ్రహ్మా మహాదేవేన దీమతా ।
ప్రత్యువాచ తదా భీమం హృష్యమాణః ప్రజాపతిః॥
ఏవం భవతు భద్రం తే యథా వ్యాహృతం ప్రభో ।
బ్రహ్మణా సమనుజ్ఞాతే సదా సర్వభూత్కిల ॥
బ్రహ్మ యీ వీరిని చూచి యిటువంటి ప్రజలను సృష్టించవలదనెను. నీకు సమానులైనట్టి వారిని గాని, నీకంటే నధికులైనట్టివారిని గాని ప్రజలను సష్టింపరాదు. నీవితరులను సృజింపుము నీకు భద్రమగును. నేనున్నాను. ప్రజలను సృజింపుము అనేను-52. యీ నేను సష్టించిన వారు విరూపులు నీలలోహితులు వేయివేలు నాతో సమానులుగా నిశ్చయింపబడినవారు-53. రుద్రులను మహాబలురు దేవతలు గాగలరు. భూమిలోను ఆకాశమునను రుద్రనామముతో ప్రసిద్ధులు-54. శతరుద్రులని పిలువబడిన వారు కాగలరు. యజ్ఞమునకరులు దేవయుగములతోబాటు యజ్ఞఫలమును బొందువారు గూడకాగలరు-55. చందజులై స్వేచ్ఛతో బుట్టినవారై మన్వన్తరములలో బుట్టబోవువారితో బాటు యూగము జేయబడుచువారైయుగక్షయము వరకిచటనుండగలరు. ధీమంతుడైన మహాదేవునిచే నిట్లు చెప్పబడినవాడై బ్రహ్మ, సంతసించుచున్న ప్రజాపతియై యపుడు భీముడైన శివునకిట్లని మారుపలికెను-57. ఓ ప్రభూ! నీవు చెప్పినట్లే అట్లే అగుగాక. నీకు శుభమగుగాక అంత బ్రహ్మసమ్మతించగనే ఎల్లప్పుడు ఎల్ల విషయములు జరిగినవి.
తతః ప్రభృతి దేవేశో న ప్రాసూయత వై ప్రజాః ।
ఊర్ధ్వరేతాః స్థితః స్థాణుర్యావదాభూత సంప్లవమ్।
యస్మాచ్చోక్తం స్థితోఽస్మీతి తతః స్థాణురితి స్మృతం॥
జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం తపః సత్యం క్షమా ధృతిః ।
స్రష్టృత్వ మాత్మసంబోధ స్త్వధిష్ఠాతృత్వమేవ చ ।
అథ యాని దశైతాని నిత్యం తిష్ఠన్తి త్వం శఙ్కరే॥
సర్వాన్ దేవాన్ ఋషీంశ్చైవ సమేతా న సురైః సహ ।
అత్యేతి దేవానైశ్వర్యాద్బలేన చ మహాసురాన్।
జ్ఞానేన చ మునీన్ సర్వాన్ యోగాద్భూతాని సర్వశః॥
అప్పటినుండి దేవేశుడైన యీశ్వరుడు ప్రజలను ప్రసవించలేదు. ఊర్థ్వరేతస్కుడై మహాభూత ప్రలయమువరకు స్థాణువై కదలని మొద్ది) యుండెను. ఆతడు నేను కదలక ఉన్నాను. అన్నందువలన స్థాణువనబడెను-59. జ్ఞానము వైరాగ్యము. ఐశ్వర్యము, తపము, సత్యము, క్షమ, ధీతి, స్రష్టత్వము (సృష్టిచేయుతనము), ఆత్మజ్ఞానము, అధిష్ఠాతృత్వము (అందరికి పై నుండువాడు) ఈ యైదు నిత్యము శంఖరుని యందుండును-60. సమస్తదేవతలను ఋషులను అసురులను గూడ తేజస్సుతో అతిశయించును గాన నాతడుమహాదేవుడనబడినాడు-61. ఐశ్వర్యము వలన దేవతలను, బలముచే రాక్షసులను, జ్ఞానముచేత మునులనందరిని యోగమువలన భూతములను అన్ని విధముల మించినవాడు.
ఋషయ ఊచుః :-
యోగం తపశ్చ సత్యం చ ధర్మం చాపి మహామునే ।
మాహేశ్వరస్య జ్ఞానస్యసాధనం చ ప్రచక్ష్వ నః॥
యేన యేన చ ధర్మేణ గతం ప్రాప్స్య న్తి వై ద్విజాః ।
తత్సర్వం శ్రోతుమిచ్ఛామి యోగం మహేశ్వరం ప్రభో ॥
ఋషులనిరి:- ఓ మహామునీ! యోగమును, తపమును, సత్యమును, ధర్మమును, మాహేశ్వరజ్ఞానమును సాధనమును మాకు జెప్పుడు-63. బ్రాహ్మణులు యేయే ధర్మమునాచరించుటచే సద్గతిని (జ్ఞానమును) పొందగలరు. ఓ ప్రభో మాహేశ్వర యోగమైనదానినంతయు వినగోరుచున్నాను.
వాయురువాచ:-
పఞ్చ ధర్మాః పురాణే తు రుద్రేణ సముదాహృతాః ।
మాహేశ్వర్యం యథా ప్రోక్తం రుద్రైర క్లిష్టకర్మభి:॥
ఆదిత్యైర్వసుభిః సాధ్యైరశ్విభ్యాం చైవ సర్వశః ।
మరుద్భిర్భృగుభిశ్చైవ యే చాన్యే విబుధాలయాః॥
యమశుక్ర పురోగైశ్చ పితృకాలాన్త కైస్తథా ।
ఏతైశ్చాన్యైశ్చ బహుభిస్తే ధర్మా: పర్యుపాసితాః॥
తే వై ప్రక్షీణకర్మాణః శారదామ్బర నిర్మలాః ।
ఉపాసతే మునిగణా: సన్దాయాత్మాన మాత్మని॥
గురుప్రియ హి తే యుక్తా గురూణాం వై ప్రియేప్సవః ।
విముచ్య మానుషం జన్మ విహరన్తి చ దేవవత్ ॥
వాయువు పలికెను:- రుద్రునిచే పురాణము లందు ఐదు ధర్మములు చెప్పబడినవి. క్లిష్ట కర్ములు గాని రుద్రులచే నది మాహేశ్వర్యముగా చెప్పబడినది-65. ఆదిత్యులు, వస్తువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, భృగువులు, దేవాలయములు గలవారు-66. యముడు శుక్రుడు ముందుగాగల పితరులు కాలాన్తకులు వీరు మరికొందరైన అనేకులచేత ఆధర్మములు పాసింపబడినవి-67. వారు అత్యంతము క్షీణించిన కర్మలుగలిగి, శరత్కాలమేఘము వలే నిర్మలములైన మునిగణములు తమయాత్మయందాత్మను సంధానముజేసి (కలిపి) యుపాసింతురు-68. గురువులకు ప్రియమును హితమును జేయుటకు బూనుకొన్న వారు. గురువుల ప్రియమును గోరువారు మానుషజన్మను వదిలి దేవతలవలె విహరింతురు.
మహేశ్వరేణ యే ప్రోక్తాః పఞ్చ ధర్మాః సనాతనాః ।
తాన్ సర్వాన్ క్రమయోగేన ఉచ్యమానాన్నిబోదత ॥
ప్రాణాయామస్తథా ధ్యానం ప్రత్యాహారోఽథ ధారణా ।
స్మరణఇఞ్చైవ యోగేఽస్మిన్ పఞ్చధర్మాః ప్రకీర్తితాః॥
తేషాం క్రమవిశేషేణ లక్షణం కారణం తథా ।
ప్రవక్ష్యామి తథాతత్త్వం యథా రుద్రేణ భాషితమ్॥
ప్రాణయామ గతిశ్చాపి ప్రాణస్యాయామ ఉచ్యతే ।
సచాశ్పి త్రివిధః ప్రోక్తో మన్దోమధ్యోత్తమస్తథా॥
ప్రాణానాఞ్చ నిరోధస్తు స ప్రాణాయామ సంజ్ఞితః ।
ప్రాణాయామ ప్రమాణన్తు మాత్రా వై ద్వాదశ స్మృతాః ॥
మన్దోద్వాదశ మాత్రస్తు ఉద్ఘాతాద్వాదశ స్మృతాః ।
మధ్యమశ్చ ద్విరుద్ఘాతశ్చతుర్వింశతి మాత్రికః॥
ఉత్తమస్తత్రిరుద్ఘాతో మాత్రాః షట్రింశదుచ్యతే ।
స్వేదకమ్ప విషాదానాం జననో హ్యుత్తమః స్మృత:॥
ఇత్యేతత్త్రివిధం ప్రోక్తం ప్రాణాయామస్య లక్షణమ్ ।
ప్రమాణఞ్చ సమాసేన లక్షణఞ్చ నిబోధత॥
మహేశ్వరునిచే చెప్పబడిన యా ప్రాచీన ధర్మములనన్నింటిని క్రమయోగమున జెప్పెద వినుడు-70. ప్రాణాయామము అట్లే ధ్యానము ప్రత్యాహారము (ఇంద్రియములను విషయములనుండి మరల్చుట) ధారణ, స్మరణము ఈ యైదును ఈ యోగముననైదు ధర్మములనబడినవి-71. క్రమ విశేషముతో వాని లక్షణమును కారణమును నిజముగా రుద్రుడు జెప్పినరీతిగనే చెప్పబోవుచున్నాను-72. ప్రాణము (వాయువు) యొక్క పొడవైన నడక ప్రాణము యొక్క ఆయామమనబడును. అదియును మన్దము, మధ్యమము, ఉత్తమము అని మూడు విధములు-73, ప్రాణముల నిరోధము అనునది ప్రాణ వాయువుల నరికట్టుట ప్రాణాయామ మనబడినది. ప్రాణాయామ ప్రమాణము పండ్రెండు మాత్రలనబడినది-74. మన్ల ప్రాణాయామము పండ్రెండు మాత్రలు, పండ్రెండు ఉద్ఘాతములు ప్రారంభములు) అనబడినవి. మధ్యమ ప్రాణాయామము రెండు ఉద్ఘాతములు, ఇరువది నాలుగు మాత్రలు (పరిమాణముగలది) 75 ఉత్తమ ప్రాణా యామము మూడుద్ఘాతములు ముప్పది యారుమాత్రలు గలది. యనబడును. చెమట కంపము (వణుకు) విషాదములను గలుగజేయునది యుత్తమమనబడును-76 ఈ విధముగ ప్రాణాయామలక్షణము మూడువిధములుగా జెప్పబడినది. ఇది ప్రాణా యామము యొక్క ప్రమాణము సంగ్రహ లక్షణమున్ను (అని తెలియవలెను).
సింహో వా కుజ్ఞరో వాపి తథాఽ న్యోవా మృగో వనే ।
గృహీతః సేవ్యమానస్తు మృదుః సముపజాయతే॥
తథా ప్రాణో దురాధర్షః సర్వేషా మకృతాత్మనామ్ ।
యోగత:సేవ్యమానస్తు సేవాభ్యాసతో వ్రజేత్ ॥
సచైవ హి యదా సింహః కుజ్ఞరో వాపి దుర్బలః ।
కాలాన్తర వశాద్యోగాద్గమ్యతే పరిమర్ధనాత్॥
పరిధాయమనో మన్దం వశ్యత్యం చాధిగచ్ఛతి ।
పరిధాయ మనోదేవం తథా జీవతి మారుతః॥
వశ్యత్వం హి యథా వాయుర్గచ్ఛతే యోగమిచ్ఛతః ।
తదా స్వచ్చన్దతః ప్రాణం నయతే యత్ర చేచ్ఛతి ॥
యథా సింహో గజోవాపి వశ్యత్వాదవతిష్ఠతే ।
అభయాయ మనుష్యాణాం మృగేభ్యః సంప్రవర్తతే॥
యథాపరిచిత శ్చాఽయం వాయు ర్వై విశ్వతోముఖం।
పరిధ్యాయమానః సంరుద్ధః శరీరే కిల్బిషం దహత్ ॥
ప్రాణాయామేన యుక్తస్య విప్రస్య నియతాత్మనః ।
సర్వే దోషాః ప్రణశ్యన్తి సత్త్వస్థశ్చైవ జాయతే ॥
తపాంసి యాని తప్యన్తే వ్రతాని నియమాశ్చ యే ।
సర్వయజ్ఞఫలం చైవ ప్రాణాయామశ్చ తత్సమ:॥
సింహము గాని యేనుగు గాని యట్లే వేరొక మృగము గాని ఆరణ్యమున పట్టుకొన బడినదై సేవింపబడుచు క్రూరస్వభావము వదిలి మృదు స్వభావముగలది యగును-78. సమస్త పాపాత్ములకు పట్టుబడని ప్రాణము యోగము వలన సేవింపబడుచున్నదై యభ్యాసమువలన ఆ ప్రాణమే పట్టుబడును-79. ఆ ప్రాణమే సింహము వలె ఏనుగువలె కాలాన్తరవశమువలన, యోగమువలన, పరిమర్దనము వలనను దుర్బలమగును-80. వాయువు యోగము నందుండి వశ్యత్వమును బొందును. అట్లే మనోదేవుని గప్పివాయువు ప్రాణము జీవించును. వాయువు యోగము నందుండి వశ్యత్వమును బొందును. అంట్లే మనోదేవుని గప్పి వాయువు ప్రాణము జీవించును-81. వాయువు యోగమునందుండి వశ్యత్వమును బొందినపుడు స్వేచ్ఛగా ప్రాణమును కోరినచోటికి గొనిపోవును-82. సింహముగాని ఏనుగుగాని మనుష్యుల వశమందుండి మనుష్యలనితర మృగములనుండి ప్రవర్తించును. అభయమునకై అట్లే విశ్వతోముఖమైన (సర్వవ్యాపియైన) వాయువు పరిచితమై పరిధ్యాయమానమై ప్రాణాయామమున శరీరమందు సంరుద్దమై పాపమును దహించివేయును. పెంచిన కుక్క యజమానిని ఇతరుల భయమునుండి రక్షించినట్లే సర్వవ్యాపియైన వాయువు ప్రాణవాయువుగా శరీరమున బంధింపబడి శరీరఘాతుకములైన దోషములనన్నింటిని దహించివేయునని భావము-83, 84. ప్రాణయామముతో యుక్తుడైన నియమబద్ధుడైన బ్రాహ్మణునకు సర్వదోషములు నశించును. అతడు సుస్వస్థుడు గూడనగును-85. సర్వతపములు సర్వయజ్ఞఫలములు ప్రాణాయామమునకు సమానము.
అబ్బిందుం యః కుశాగ్రేణమాసి సమశ్నుతే ।
సంవత్సరశతం సాగ్రం ప్రాణాయామం చ తత్సమమ్ ॥
ప్రాణాయామైర్ధ హేద్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషమ్ ।
ప్రత్యాహారేణ విషయాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్ ॥
తస్మాద్యుక్తః సదా యోగీ ప్రాణాయామపరో భవేత్ ।
సర్వపాప విశుద్ధాత్మ పరం బ్రహ్మాధిగచ్ఛతి॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే మన్వన్తరాది వర్ణనం నామ దశమోఽధ్యాయః ॥
నూరేండ్లు ప్రతి మాసమున దర్బాగ్రముతో నీటి బిందువును ఆదర్బాగ్రముతో బాటు తిని యుపవాసము చేయుటతో ప్రాణాయామము సమానము-87. ప్రాణాయామములతో దోషములను దహింపజేయవలెను. ధారణలచే పాపములను దహింపజేయవలెను. ప్రత్యాహారముచే (ఇంద్రియములవిషయనివృత్తిచే విషయసుఖములను, ధ్యానముచే అనీశ్వరములైన (ఈశ్వరత్వప్రాప్తికి విరుద్దములైన గుణములను దహింపజేయవలెను-88. కావున యుక్తుడైన (సమర్థుడైన) యోగి ప్రాణాయామపరుడు గావలెను. వాడు సర్వపాపములు తొలగి విశుద్ధాత్ముడై పరబ్రహ్మను జేరును-89.
ఇది శ్రీ వాయు ప్రోక్తమైన మహాపురాణమున మన్వన్తరాది వర్ణనమనునది పదియవ యధ్యాయము.