20 - లక్షణం

వాయురువాచ:-

 అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ఓఙ్కారప్రాప్తి లక్షణమ్

ఏష త్రిమాత్రా విజ్ఞేయో వ్యఞ్జనం చాత్ర సస్వరమ్

ప్రథమా వైద్యుతీ మాత్రా ద్వితీయా తామసీ స్మృతా

తృతీయా నిర్గుణీ విద్యాన్మాత్రా మక్షరగామినీమ్

గాన్దర్వీతి చ విజ్ఞేయా గాన్ ధరస్వర సంభవా

 పిపీలికా సమస్పర్శా ప్రయుక్తా మూర్ధ్ని లక్ష్యతే

తథా ప్రయోక్తమోఙ్కారం ప్రతినిర్వాతి మూర్ధని

తథోఙ్కారమయో యోగీ హ్యాక్షరే త్వక్షరీ భవేత్

ప్రణవోధనుః శరోహ్యాత్యా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే

 అప్రమత్తేన చేద్వధ్యం శరవత్తన్మయో భవేత్

వాయువు పలికెను:- ఆ పైన ఓంకార ప్రాప్తి లక్షణమును జెప్పబోవుచున్నాను. ఓంకారము మూడు మాత్రలు గలదని తెలియవలె. ఇచట వ్యంజనముగూడ (హల్లుగూడ) సస్వరము-1. మొదటి మాత్ర విద్యుత్సంబద్ధమైనది. (వైద్యుతీ). రెండవ మాత్ర తామసీ యనబడినది. మూడవ మాత్ర నిర్గుణీయని తెలియవలె. మాత్రను అక్షరగామినిగా తెలియవలెను-2. గాన్గార స్వరమును బుట్టినదీ గాన్తరీయమని తెలియవలే. పిపీలిక యనునదీ సమానస్పర్శగలదై ప్రయోగింపబడినది. అది శిరమున గనపడును-3. ఆ విధముగా ప్రయోగింపబడిన ఓంకారము శిరమున బయలుదేరును. ఆ విధముగా యోగి ఓంకారమయుడై ఓంకారాక్షరమున (నాశములేని ఓంకారమున) నాశనము లేనివాడగును-4. ఓంకారము ధనువు. ఆత్మబాణము, బ్రహ్మదానికి లక్ష్యము (గురి) జాగరూకుడైనచో బాణము చేతవలె లక్ష్యము వధ్యమగును. కావున బాణము లక్ష్యమును భేదించి తన్మయమయిన రీతిగా ఆత్మబ్రహ్మను జేరి బ్రహ్మమయముగావలె-5.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ గుహాయాం నిహితం పదమ్

 ఓ మిత్యేతత్త్రయో వేదాస్తయో లోకాస్త్రయోఽగ్నయః

 విష్ణుక్రమాస్త్రయస్త్యేతే ఋక్సామాని యజూంషి చ

మాత్రాశ్చాత్ర చతస్రస్తు విజ్ఞేయాః పరమార్థతః

 తత్ర యుక్తశ్చ యో యోగీ తససాలోక్యతాం వ్రజేత్

అకారస్త్యక్షరో జ్ఞేయస్త్రిమాత్ర ఇతి సంజ్ఞితః

మకరస్తుప్లుతోజ్ఞేయస్త్రిమాత్ర ఇతి సంజ్ఞితః

అకారస్త్యథభూర్లోక ఉకారో భువరుచ్యతే

 సవ్యంజనోమకారశ్చ స్వర్లోకశ్చ విధీయతే

ఓంకారస్తు త్రయోలోకాః శిరస్తన్యత్రివిష్టపమ్

భువనాన్తం చ తత్సర్వం బ్రాహ్మం తత్పదముచ్యతే

 మాత్రాపదం రుద్రలోకోహ్యమాతస్తు శివం పదమ్

ఏవం ధ్యానవిశేషణ తత్పదం సముపాసతే

 తస్మాద్ధ్యానరతీర్నిత్యమ మాత్రం హి తదక్షరమ్

 ఉపాస్యం హి ప్రయత్నేన శాశ్వతం పదమిచ్ఛతా

ఓం అనునొక్కయక్షరము బ్రహ్మ దాని పదము గుహారూపమయిన బుద్ధియు నుంచబడినది. ఓం అనునది మూడులోకములు ,మూడగ్నులు, వామనావతారములోని విష్ణువు యొక్కయు మూడు పాద విక్షేపము (భూమ్యాకాశ పాతాళము)-6. పరమార్థమునకు (సత్యార్థమునకు) ఓంకారమున మాత్రలు నాలుగు అని తెలియవలెను. ఓంకారమున యోగధారణమునుజేసిన యోగి ఓంకార సరస్వరూపమును బొందును-7. అకారము అక్షరముగను (నాశనములేని దానిగను వర్ణముగను) తెలియవలె. ఉకారము స్వరితముగా జెప్పబడినది. మకారము ప్లుతముగా తెలియవలే. ఇది త్రిమాత్రకముగా గుర్తించబడినది (పేర్కొనబడినది)-8. తరువాత ఆకారము భూర్లోకము. ఉకారము భువర్లోకమనబడినది. వ్యంజనముతో గూడిన మకారము స్వర్లోకముగా జెప్పబడినది-9. ఓంకారమైతే మూడు లోకములు దాని శిరస్సు స్వర్గము అది యంతయు భువనాంతము. ఆస్థానము బ్రహ్మకు సంబంధించినదిగా జెప్పబడినది-10. మాత్రాస్థానము రుద్రలోకము మాత్రలులేనిది శివస్థానము ఈ విధముగ ధ్యాన విశేషముచే ఓంకారపదము నుపాసింతురు-11. కావున ధ్యానాసక్తుడైనవాడు శాశ్వతపదమునుగోరి నిత్యము అయాత్రకమైన యా ఓంకారాక్షరమును ప్రయత్నశీలియై యుపాసింపవలె-12.

హ్రస్వా తు ప్రథమా మాత్రా తతో దీర్ఘ్వానన్ తరమ్

 తతఃప్లుతవతీ చైవ తృతీయా ఉపదిశ్యతే

ఏతాస్తు మాత్రా విజ్ఞేయా యథావదను పూర్వశః

యావచ్చైవతు శక్యన్ తే ధైర్యన్ తే తావదేవ హి

ఇన్ ద్రియాణి మనోబుద్ధిం ధ్యాయన్నాత్మని యః సదా

 అత్రాష్టమాత్రమపి చేచ్ఛృణుయాత్ఫల మాప్నుయాత్

 మాసే మాసేఽశ్వమేధేన యో యజేత శతం సమాః

 న స తత్రాప్నుయాత్పుణ్యం మాత్రయా యావదాప్నుయాత్

హ్రస్వమాత్ర మొదటిది. తరువాత దీర్ఘ మాత్ర రెండవది. ఆ తరువాత ఫుతవతియైన మాత్ర మూడవది అని చెప్పబడినవి-13. మొదటిది రెండవది ఇత్యాది అనుపూర్వక్రమముననివి (ఫైజెప్పినవి) మాత్రలని తెలియవలె. శక్తియున్నంతవరకు ఇవి యోగధారణలో ధరింపబడును-14. ఆత్మయందు ఇంద్రియములను, మనస్సును, బుద్దిని, ఎల్లప్పుడు ధ్యానము చేయుచు ఎనిమిది మాత్రలు గల దానినిగా ఓంకారమును విన్నవాడు ఫలితమును బొందును-15. ప్రతిమాసమున నూరేండ్లు అశ్వమేధయాగముజేసిన యంతటి పుణ్యఫలమును ఓంకారములోని ఒక మాత్రమును ధ్యానముచేసి పొందగలడు- 16.

అబ్బిందుం యః కుశాగ్రేణ మాసే మాసే పిబేన్నరః

సంవత్సరశతం పూర్ణం మాత్రయా తదవాప్నుయాత్

 ఇష్టాపూర్తస్యయజ్ఞస్య సత్యవాక్యే చ యత్పలమ్

 అభక్షణే చ మాం సస్యమాత్రయా తదవాప్నుయాత్

స్వామ్యర్థే యుధ్యమానానాం శూరాణమనివర్తినామ్

యద్భవేత్తత్ఫల దృష్టం మాత్రయా తదవాప్నుయాత్

 న తథా తపసోగ్రేణ న యజ్ఞైర్బూరిదక్షిణైః

యత్పలం ప్రాప్నుయాత్ సమ్యగ్ మాత్రయా తదవాప్నుయాత్

తత్రవైయోఽర్థమాత్రో యః ప్లుతోనామోపదిశ్యతే

ఏషా ఏవ భవేత్కార్యా గృహస్థానాం తు యోగినామ్ 

ప్రతి మాసమున నూరేండ్లవరకు దర్భకొసతో నీటి బిందువు త్రాగి సంపాదించునంతటి పుణ్యమును ఓంకారము యొక్క మాత్రను ధ్యానించుటతో బొందును-17. ఇష్టా పూర్త యజ్ఞమునకు సత్యవాక్యమునకు, మాంసభక్షణము జేయనందుకును, రాగల పుణ్యమును ఓంకార మాత్రధారణచే బొందును-18. తమ స్వామి కొరకు మరలకుండగా యుద్ధముజేయు వారితో సమానమైన ఫలమును ఓంకార మాత్రధారణతో బొందగలడు-19. ఉగ్రతారుస్సుచేతనా, భూరి దక్షిణలుగల యజ్ఞములచేతను పొందలేనంతటి ఫలమును ఓంకార మాత్రముచే బొందగలడు. అందులో అర్థమాత్రము ప్లుతముగా నుపదేశింపబడును. గృహస్థులైన యోగులు దీనినే చేయవలె 21

ఏషా చైవ విశేషణ ఐశ్వర్య సమలక్షణా

యోగినాం తు విశేషేణ ఐశ్వర్యే హ్యష్టలక్షణే

ఆణిమాద్యేతి విజ్ఞేయా తస్మాద్యుంజేత తాం ద్విజః

 ఏదం హి యోగీ సంయుక్తం శుచిర్దాన్తో జితేన్ద్రియః

ఆత్మానం విందతే యస్తు ససర్వం విందతే ద్విజ

ఋచో యజూంషి సామాని వేదోపనిషదస్తథా

యోగజ్ఞానాదవాప్నోతి బ్రాహ్మణో ధ్యానచిన్తకః

ఇదియే విశేషముగా ఐశ్వర్యముతో సవలక్షణమైనది. విశేషమగు యోగులకు ఎనిమిది రూపములు గల యైశ్వర్యమునందు సమముగా గుర్తింపదగినది. అది అణిమాదులగలదియని తెలియవలె. కావున బ్రాహ్మణుడు యోగమున మనస్సు నిలిపి యోగిగావలె-22. ఈ విధముగ యోగి చక్కగా యోగయుక్తుడై శుచియై, కోరికల నణచిదాత్తుడై ఇంద్రియముల జయించినవాడై, ఆత్మనుదెలిసికొన్న బ్రాహ్మణుడు సర్వమును బొందగలడు-23. బ్రహ్మ ధాన్యము చేయువాడు యోగజ్ఞానమువలన ఋక్కులను యజుస్సులను సామములను (ఋగ్యస్సామవేదములను) వేదోపనిషత్తులను (జ్ఞానమును) బొందగలడు-24.

సర్వభూతలయో భూత్వా అభూతః స తు జాయతే

యోగీ సంక్రమణం కృత్వా యాతి వై శాశ్వతం పదమ్

అపిచాత్ర చతుర్హస్తాం ధ్యాయమానశ్చతుర్ముఖమ్

ప్రకృతిం విశ్వరూపాఖ్యాం దృష్ట్యా దివ్యేన చక్షుషా

సర్వభూతముల లయము జరిగి జన్మించనివాడు జన్మించును. యోగి సంక్రమణమును (పరమాత్మతో గలిసి) జేసి శాశ్వతపదమును బొందును-25. ఇంతియే కాక, ఇచట (ఓంకారమునందు) నాలుగు హస్తములు నాలుగు ముఖములు గలిగిన ప్రకృతియైన విశ్వరూపయను ధ్యానించుచున్నవాడై దివ్య చక్షువుతో నామెను జూచును-26.

అజామేతాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీప్రజాః సృజమానాం స్వరూపామ్

 అజోహ్యేకో జుషమాణోఽనుశేతే జహాత్యేనాం భుక్తభోగామజోఽన్యః

 అష్టాక్షరాం షోడశపాణిపాదాం చతుర్ముఖం త్రిశిభామేకశృంగామ్

ఆద్యామజాం విశ్వసృజాం స్వరూపాం జ్ఞాత్వా బుధాస్త్యమృత్వం వ్రజన్ తి

ఇత్యేతదక్షరం బ్రహ్మ పరమోఙ్కార సంజ్ఞితమ్

యస్తు వేదయతే సమ్యక్ తథా ధ్యాయతి తథా పునః

సంపార చక్రముత్సృజ్య ముక్తబంధన బంధనః

 అచలం నిర్గుణం స్థానం శివం ప్రాప్నోత్య సంశయః

ఈ ప్రకృతి పుట్టుకలేనిది (ఆడమేక) సామ్యావస్థలో నున్న రజస్-సత్త్వ తమోగుణములు నిండినది. ఎరుపు తెలుపు నలుపురంగులు నిండినది) అనేక ప్రజలను త్రిగుణములైన మహదాది వికారములనేకములను సంతానములను) సృజించుచున్నది. స్వాత్మ స్వరూపమైనది. జన్మరాహిత్యముజెందిన యొక యోగి (మగమేక) ఈ పై ప్రకృతిని (ఆడమేక) అనుభవించిన భోగసుఖముగల యా ప్రకృతిని (ఆడమేకను) బంధమునుబెట్టుకొనక వదలివేసి విముక్తుడగును. ఎనిమిది యక్షరములు గలది. పదునాలు చేతులు కాళ్ళు గలది. నాలుగు ముఖములు గలది, మూడు సిగలు గలిగి ఒక కొమ్ముగలదియు అందరికన్న మొదటిదియు, పుట్టుక లేనిదియు, విశ్వమును సృష్టించునదియు, ఆత్మస్వరూపమునై దానీనిగా నామెను దెలిసి పండితులు జ్ఞానులు అమృతత్వమును బొందుదురు ప్రణవమును దెలిసికొన్న బ్రాహ్మణులు మరల భూలోకమున సంసారమును బొందరు-27. ఈ విధమైన ఓంకారమను అక్షర పరబ్రహ్మరూపమును తెలిసినవాడుగాని లేదా ఆ విధముగ ధ్యానము చేసినవాడు గానీ సంసార చక్రమును వదలి విడిపోయిన బంధనముల యొక్క బంధనముగలవాడై నిస్సంశయముగా. అచలమును, నిర్గుణమునునైన స్థానమగు శివుని బొందును-28, 29.

నమో లోకేశ్వరాయ సఙ్కల్ప కల్పగ్రహణాయ మహాన్తము పతిష్ఠతే

తద్వో హితం యద్బ్రహ్మణే నమః సర్వత్ర స్థానినే నిర్గుణాయ

 సంభక్తయోగీశ్వరాయ చ పుష్కరపర్ణహాదిద్వి శుద్ధమివ

 బ్రహ్మముపతి ష్ఠేత్సవిత్రం పవిత్రాణాం పవిత్రం పవిత్రేణ

 పరిపూరితేన పవిత్రేణ హ్రస్వదీర్ఘప్లుతమితి తదేతమోఙ్కార

 మశబ్దమస్పర్శమరూప మరసమగన్ధం పర్యుపాసీత అవిద్యేశా

 నాయ నమో యోగీశ్వరాయేతి చ యేన ద్యౌరుగ్రా పృథివీ చ

దృఢా యేన స్వస్తనితం యేన నాకస్తయేరన్తరిక్షమిమే వరీయసో

దేవానాం హృదయం విశ్వరూపో న తస్య ప్రాణాపానౌ పమ్యం చాస్తి

 ఓఙ్కారో విశ్వవిశ్వా వై యజ్ఞః యజ్ఞో వై వేదః వేదో వై

నమస్కారం నమస్కారో రుద్రః నమోరుద్రాయ యోగేశ్వరాధిపతయే

నమః ఇతి సిద్ది ప్రత్యుపస్థానం సాయం ప్రాతర్మధ్యాహ్నే

నమః ఇతి సర్వకామఫలోరుద్రః యథావృన్తా ఫలం పక్వం

 పవనేన మీరితమ్ నమస్కారేణ రుద్రస్య తథా పాపం ప్రణశ్యతి

లోకేశ్వరునకు నమస్కారము. సృష్టి ప్రళయములకై మహత్స్వరూపముతో వచ్చువానికి నమస్కారము. మీకు హితమైన యా బ్రహ్మకు నమస్కారము. అంతట స్థానము గలవానికి, నిర్గుణునకు, చక్కగా సేవింపబడిన యోగీశ్వరునకును నమస్కారము. నీటిచేత తామరాకువలె యోగి విశుద్దమైన బ్రహ్మను జేరవలె. అది పవిత్రములలో పవిత్రమైనది. పవిత్రముతో పవిత్రము జేరవలే. పవిత్రముతో నిండిన పవిత్రముతో హ్వస్వ దీర్ఘపుత రూపమైన ఓంకారమును శబ్ద-స్పర్శ రూప-రస గంధములు (పంచతన్మాత్రలు) లేని దానిని. సంపూర్ణముగా ఉపాసించవలె. అవిద్య కీశానుడైన వానికిని యోగీశ్వరునకును నమస్కారము. అతనిచే ద్యులోక ముగ్రమైనది. పృథివి దృఢమైనది. అతనిచేతనే స్వర్లోకము నాకలోకము వానియొక్క మధ్యనుండు అంతరిక్షమును గర్జితములైనవి. ఇవి శ్రేష్ఠములైనవి. దేవతలకు హృదయము విశ్వరూపుడు. ఆతనికి ప్రాణాపానములతో పోలికలేదు. ఓంకారము విశ్వమంతయు వ్యాపించిన యజ్ఞము. యజ్ఞమే వేదము. వేదము నమస్కారము. నమస్కారము రుద్రుడు నమస్కారము. యోగేశ్వరాధిపతికి నమస్కారము. ఇది సిద్ధి ప్రత్యుపస్థానము. సాయం ప్రాతర్మధ్యాహ్నములందు నమస్కారము. అని సర్వకామ ఫలము రుద్రుడు. పరిపక్వమైనపండు తొడిమనుండి గాలిచే క్రిందబడును. అట్లే రుద్రనమస్కారముచే పాపము నశించును-30.

యథారుద్ర నమస్కారః సర్వధర్మ ఫలోధ్రువః

 అన్యదేవ నమస్కారో న తత్సలమవాప్నుయాత్

 తస్మాత్త్రిషవణం యోగీ ఉపాసీత మహేశ్వరమ్

దశవిస్తారకం బ్రహ్మ తథా చ బ్రహ్మవిస్తరమ్

ఓంకారం సర్వతః కాలే సర్వం విహితవాన్ ప్రభుః

తేన తేన తు విష్ణుత్వం నమస్కారం మహాయశాః

 నమస్కారస్తథా చైవ ప్రణవస్తువతే ప్రభుమ్

 ప్రణవం స్తువతే యజ్ఞో యజ్ఞం, సంస్తువతే నమః

 నమస్తువతి వైరుద్రస్తస్మాద్రుద్ర పదం శివమ్

 ఇత్యేతాని రహస్యాని యతీనాం వై యథాక్రమమ్

యస్తు వేదయతే ధ్యానం స పరం ప్రాప్నుయాత్పదమ్

ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే ఓఙ్కారప్రాప్తి లక్షణం నామ వింశోధ్యాయః

రుద్ర నమస్కారము నిశ్చయముగా సర్వధర్మఫలములనిచ్చునది. అన్యదేవ నమస్కారముననట్టి ఫలము లభింపదు-31. కావున యోగి ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములలో మహేశ్వరునుపాసించవలెను. దశవిస్తారకమైనది బ్రహ్మ, కాకా బ్రహ్మ విస్తరమైనది-32. ప్రభువు అంతట కాలమున (తగిన కాలమున) మొత్తము ఓంకారమును జెప్పెను. అద్దానిచేతనే మహాయశస్కుడు విష్ణుత్వమును నమస్కారమును బొందును-33. నమస్కారములాగుననే ప్రణవము (ఓంకారము) ప్రభువును, స్తుతించును. యజ్ఞము ప్రణవమును స్తుతించును. యజ్ఞమును నమస్కారము స్తుతించును. నమస్కారమును రుద్రుడు స్తుతించును. కావున రుద్రపదము శివము (శివరూపము)-34. ఈ చెప్పిన యతి రహస్యములను యథాక్రమముగా తెలిసికొన్నవాడు ధ్యానమును తద్వారా పరమపదమును బొందును-35.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ఓంకార ప్రాప్తి లక్షణమను ఇరువదియవ యధ్యాయము 20