37 -  భువనవిన్యాసో

సూత ఉవాచ:-

 శీతాంత్యస్యా చలేంద్రస్య కుముంజ స్యాంతరేణ తు

ద్రోణ్యోవిహంగ సంఘుష్టా నానాసత్త్వ నిషేవితా

త్రియోజన శతాయామా విస్తీర్ణాః శతయోజనాః

 సురసామల పానీయరమ్యం తత్ర సరోవరమ్

 ద్రోణ్యాయామ ప్రమాణెస్తు పుండరీకైః సుగంధిబిః

 సహస్రశతపత్రైర్హి మహాపద్మై రలంకృతమ్

 మహోరగై రధ్యుషితం మహాభోగైర్దు రాసదైః

 దేవదానవగంధర్యై రుపస్పృష్టం జలం శుభమ్

పుణ్యం తచ్చ్రీసరో నామ ప్రకాశం దివి చేహచ

 ప్రసన్నజల సంపూర్ణం శరణ్యం సర్వదేహినామ్  

సూతుడనెను:- శీతాంత్య పర్వత శ్రేష్ఠమునకును కుముంజ పర్వతమునకును మధ్యనున్న కొండ పల్లములు పసులు మేయు కంచెలును. అనేక పక్షుల నాదములచే ధ్వనించినవి. అనేక ప్రాణులచే సేవింపబడినవీ-1. మూడు వందల యోజనముల పొడవైనవి. నూరు యోజనములు విశాలమైనవి. అచట చక్కని రసవంతమై స్వచ్చమైన త్రాగునీటిచే సుందరమైన సరోవరమున్నది-2. అది, మంచి సుగంధముగలిగి, ఓడలంతటి తెల్లకమలములచేతను లక్షదళములు గల మహాపద్మములచే నలంకరింపబడినదీ-3. పెద్ద పడగలచే సమీపింపనలవి కాని మహాసర్పములు నివసించినది, అందలి జలము దేవదానవ గంధర్వులచే స్నానాదులచే స్పృశింపబడి పవిత్రమైనది-4. అది పుణ్యమైన (శ్రీసరస్సు) అను పేరు గల సరోవరము. భూమియందును దీవియందును ప్రకాశించినది. నిర్మలజలములతో నిండినది. సర్వప్రాణులకు రక్షణనిచ్చు గృహము వంటీది -5.

తత్ర త్వేకం మహాపద్మం మధ్యే పద్మవనస్యహ

 కోటిపత్ర ప్రచారం తత్తరుణాదిత్య వర్చసమ్

 నిత్యం వ్యాకోశమజరం చాంచల్యాచ్చాతి మండలమ్

 చారుకేశర జాలాడ్యం మత్తషట్పద నాదితమ్

 తస్మిన్ పద్మే భగవతీ సాక్షాచ్చ్రీర్నిత్యమేవ హి

 లక్ష్మ్యాః పద్మం తదావాస మూర్తిమత్యాం న సంశయః  

అచట పద్మవన మధ్యమున నొక మహాపద్మము గలదు. అది కోటి దళములతో బాగుగా కదలాడు చుండును. ఉదయించు సూర్యుని తేజము గలది-6. నిత్యము వికసించునది. వాడి రాలిపోనిది. కదలాడుటచే పెద్ద మండలము గలది. (వలయాకారము గలది) చక్కని కింజల్కములతో నొప్పినది, మదించిన తుమ్మెదలతో ధ్వనింపబడినది-7. ఆ పద్మమున నిత్యమును సాక్షాత్తుగా భగవతియైన లక్ష్మీదేవియే యుండును. (ఈ విధముగా) ఈ పద్మము ఆకారము దాల్చిన లక్ష్మీదేవికి ఆవాసము ఇట సంశయము లేదు-8.

సరసస్తస్య పూర్వస్మిన్ తీరే సిద్ధని షేవితే

 సదా పుష్పఫలం రమ్యం తత్ర బిల్వవనం మహత్

 శతయోజనవిస్తీర్ణం త్రియోజన శతాయతమ్

అర్ధక్రోశోచ్ఛ శిఖరైర్మహావృక్షః సహస్రశః

 శాఖా సహస్రకలితై ర్మహాస్కంధైః సమాకులమ్

ఫలైః సువర్ణసంకాశైర్హరి తైః పాండరైస్తథా

 అమృతస్వాదు సదృశై ర్భేమాత్రైః సుగంధిభిః

శీర్యమాణైః పతద్భి శ్చకీర్ణా భూమిర్నిరంతరా

 నామ్నా తచ్చ్రీవనం నామ సర్వలోకేషు విశ్రుతమ్

 గంధర్యైః కిన్నరైర్యక్షైర్మహానాగైశ్చ సేవితమ్

సిద్ధైశ్చైవ సమాకీర్ణం నిత్యం భిల్వ ఫలాశిభిః

 వివిధైర్భూత సంఘైశ్చ నిత్యమేవ నిషేవితమ్

తస్మిన్వనే భగవతీ సాక్షాచ్చ్రీర్నిత్యమేవ హి

దేవీ సన్నిహితా తత్ర సిద్ధ సంఘైర్నమస్కృతా

ఆ సరస్సు యొక్క తూర్పుతీరము సిద్ధులు నివసించినది. అచట నిత్యము పుష్ప ఫలములతో మనోహరమైన గొప్ప బిల్వవనము గలదు. అది నూరు యోజనముల వెడల్పై మూడు యోజనముల పొడవైనది. అర్ధక్రోశము ఎత్తైన శిఖరములు గలిగి వేల శాఖలతో గొప్ప బోదెలతోను కూడిన వేలకొలది మహావృక్షములతో వ్యాకులమైనది-10.1/2 బంగారము వలె పచ్చనివియు, తెల్లనివియునై -11. అమృతము వంటి రుచి గలవియు, దుందుభులంతటి లావైనవియు, సువాసన గలవియు, క్షీణించి పోవుచున్నవియు, రాలిపోవుచున్నవి యునైన మారేడు పండ్లచే నాభూమి యంతయు వెదజల్ల బడినట్లుండును-12. ఆ వనము శ్రీవనమని సర్వలోకములలో ప్రసిద్ది జెందినది. గంధర్వులు, కిన్నరులు, యక్షులు, మహానాగులు, వీరిచేత సేవితమైనది. (నివసింపబడినది.) ప్రతినిత్యము బిల్వఫలములను దీను సిద్ధులచే వ్యాపించియున్నది. అనేక భూత (ప్రాణి) సంఘములచేతను నిత్యము సేవింపబడినది-13,14. ఆవనమున నిత్యము భగవతియైన సాక్షాత్తు లక్ష్మియే యుండును. ఆమె సిద్ధసంఘములచే నమస్కరింప బడినదై సన్నిహితు రాలైయుండును-15.

వికంకస్యాచలేంద్రస్య మణిశైలస్య చాంతరే

 శతయోజన విస్తీర్ణం ద్వియోజన శతాయతమ్

 విపులం చంపకవనం సిద్దచారణ సేవితమ్

 పుష్పలక్ష్మావృతం భాతి జ్వలంతమివ నిత్యదా

 అర్థ క్రోచ్ఛశిఖరైర్మహాస్కంధైః పలాశిభిః

 ప్రపుల్ల శాఖా శిఖరైః పింజరం భాతి తద్వనమ్

 ద్విబాహు పరిణా హై స్తైస్త్రిహస్తాయామ విస్తరైః

 మనః శిలాచూర్ణ నిభైః పాండుకేసర శాలిభిః

 పుషైర్మనోహరై ర్వ్యాప్తం వ్యాకోశై ర్గంధశాలిభిః

 విరాజతే వనం సర్వం మత్త భ్రమరనాదితమ్

 తద్వనం దానవైర్దేవ గంధర్యై ర్యక్ష సైః

కిన్నరైరప్సరోభిశ్చ మహానాగైశ్చ సేవితమ్

వికంకమను పర్వతశ్రేష్ఠమునకును మణీశైలమునకును మధ్యన నూరు యోజనముల వెడల్పు రెండుయోజనముల పొడవుగల ఒక విశాలమైన చంపక (సంపెంగ) వనము గలదు-16. అది సిద్దులచేతను చారణులచేతను నివసింపబడినది. పుష్పలక్ష్మి (శోభ)తో చుట్టబడి యెల్లప్పుడు తేజస్సుతో మండుచున్న వానివలె నుండును-17. అర్థక్రోశమున్నతమైన శిఖరములతోను, పెద్దబోదెలతోను ఆకులు గలిగి వికసించిన కొమ్మల శిఖరములచే తమ ఎరుపు మీంచిన పసుపు (బంగారు) వర్ణము గలది యావనము-18. రెండు చేతుల వైశాల్యము గలిగి మూడు చేతుల పొడవు గలిగి, మణిశిలాచూర్ణమువలె నెఱనై తెల్లని కింజల్కములతో నొప్పి వికసించి సుగంధము గల మనోహరపుష్పములచే వ్యాపించినది. ఆవనమంతయు తుమ్మెదలనాదముచే నిండినది-19,20. ఆవనము దానవుల చేతను, దేవగంధర్వులచేతను, యక్షరాక్షసులచేతను, కిన్నరులచేతను అప్సరసలచేతను, మహానాగులచేతను, నివసింపబడినది-21.

తత్రాశ్రమం భగవతః కశ్యపస్య ప్రజాపతేః

 సిద్ధసాధ్య గణాకీర్ణం నానాశ్రుతి విభూషితమ్

 మహానీలకు ముంజాభ్యా మన్తరేఽప్య చలావథ

మహానద్యాః సుఖాయాస్తు తీరే సిద్ధని షేవితే

 పంచాశద్యోజ నాయామం త్రింశద్యోజన విస్తరం

 రమ్యం తాలవనం తద్ది అర్థక్రోశోచ్చమస్తకమ్

మహామూలైర్మహా సారైః స్థిరైరవిరలైః శుభైః

 కుముదాంజన సంస్థానైః పరివృత్తై ర్మహాఫలై

 హృష్ట గంధరసోపేతైరు పేతం సిద్ధసేవితమ్  

అచట భగవంతుడైన కశ్యప ప్రజాపతి యొక్క యాశ్రమము గలదు. అది సిద్ధసాధ్యగణములతో వ్యాపించినది. అనేక వేదనాదములచే నలంకరింపబడినది. తరువాత రెండు పర్వతముల మధ్యన ఇంద్రనీలమణుల చేతను సన్నని ముంజగడ్డి చేతను ఒప్పినది-22. సిద్దులు నివసించిన మహానదియైన ‘సుఖ’ యను నదియొక్క తీరమున, ఏబది యోజనముల పొడవై ముప్పది యోజనముల వెడలైన, అర్ద క్రోశమున్నతమైన తలలుగల మనోహరమైన తాటి వనము గలదు-23. పెద్ద మూలములు (వేళ్ళు) గలిగి, మహాబలము గలిగి, స్థిరములై, దట్టమై, శుభములై, కలువలవలెను కాటుకవలెను ఉండి గుండ్రముగా నున్న పెద్ద (తాటి) పండ్లచే నిండిన వాసనయు రసమును గల తాటి చెట్లతో నొప్పినది. సిద్ధులు నివసించినది-24.

మహేంద్రస్య ద్విపేంద్రస్య తత్ర వాస ఉదాహృతః

 ఐరావతస్య భద్రస్య సర్వలోకేషు విశ్రుతః

వేణుమంతస్య శైలస్య సుమేధస్యోత్తరేణ చ

సహస్ర యోజనాయామతి విస్తీర్ణం శతయోజనమ్

 వృక్ష గుల్మలతాగుచ్చైః సర్వవీరుద్భిరీరితమ్

దూర్వా ప్రస్తార మేవాథ సర్వసత్త్వ వివర్జితమ్  

అచట మహేంద్రుని గజశ్రేష్ఠమైన మైరావతము యొక్క నివాసము కలదని చెప్పబడినది. ఆ యేనుగు భద్రము అది యచట నివసించుననియు సర్వలోకములలో ప్రసిద్ధము-25. వేణుమంతమునకును సుమేధమనుశైలమునకును ఉత్తరదిక్కున వేయియోజనముల పొడవై నూరు యోజనముల వెడల్పైన, చెట్ల గుంపులలోను, తీవల గుత్తుల తోను, అల్లిబిల్లిగవల్లుకొన్న తీగల తోను ఒప్పినది. తరువాత గరికవ్యాపించిన భూమి పచ్చిక బయలు ఏ జంతువులు లేనిదిగా గన్పడును-26,27.

తథా నిషధశైలస్య దేవశైలస్య చోత్తరే

 సహస్ర యోజనాయామా శతయోజన విస్తృతా

సర్వా హ్యేకశిలాభూమిర్వృక్ష వీరుద్వివర్జితా

 ఆప్లుతా పాదయాత్రేణ హ్యుదకేన సమన్తతః

 ఇత్యేతా హ్యంతర ద్రోణ్యో నానాకారాః ప్రకీర్తితాః

మేరోః పూర్వేణ విప్రేంద్రా యథావదను పూర్వశః

ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే భువన విన్యాసో నామ సప్తత్రింశోఽధ్యాయః     

నిషధ పర్వతమునకును దేవ పర్వతమునకును ఉత్తరమున వేయి యోజనముల పొడవై నూరు యోజనముల వెడల్పై ఏకశిలా మయమైన భూమి కలదు. అది వృక్షములు తీవపొదలును లేనిది. పాద మాత్రమైన నీటితో నంతట నిండియున్నది-29. అనునివి. మేరువునకు తూర్పుగా కొండ పల్లములలో నుండు కంచెలు. ఇవి యనేకాకారములు గలవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా. పూర్వ పూర్వ క్రమముగా నున్నవి. యున్నట్లు అని చెప్పబడినవి.30.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను ముప్పదియేడవ అధ్యాయము-37.