వాయు మహా పురాణము
39 - భువనవిన్యాసో
సూత ఉవాచ:-
అతఃపరం ప్రవక్ష్యామి యస్మిన్ యస్మిన్ శిలోచ్చయే ।
యేసన్నవిష్టా దేవానాం వివిధానాం గృహోత్తమాః ॥
తత్ర యోఽసౌ మహాశైలః శీతాంతోనైక విస్తరః ।
నైకధాతు శతైశ్చిత్రైర్నైక రత్నాకరాకరః ॥
నితంబైః పుష్పసాలంబైర్నై కసత్త్వగుణాలయః ।
మహార్హమణి చిత్రాభిర్హే మవంశైరలంకృత ॥
నితంబైః షట్పదోద్గీతైః ప్రమిలైర్హేమ చిత్రకైః ।
తటైః కుసుమసంకీర్ణై ర్మత్తభ్రమర నాదితైః ॥
లతాలంబై శ్చిత్ర వద్భిశ్చి తైర్థాతు శతార్చితైః ।
సానుభిరత్న చిత్రైశ్చ పుష్పాడ్యైశ్చ విడాసితః ॥
విమల స్వానుపానీయైర్నె ప్రసవ వణైర్యుతః ।
నికుంజైః కుసుమోత్కీర్ణై రనేకైశ్చ విభూషితః ॥
పుష్పౌడు పవహాభిశ్చ స్రవంతీ భిరలంకృతః ।
కిన్నరా చరితాభిశ్చ దరీభిః సర్వతస్తతః ॥
యక్షగంధర్వ చరితైరనేకైః కందరోదరైః ।
శోభితశ్చ సుఖాసేవ్యైశ్చిత్త్రైర్గహ నసంకటై ॥
నానాసత్య గణాకీర్ణైః సుపానీయైః సుఖాశ్రయైః।
నానాపుష్ప ఫలో పేతైః పాదపైః సమలంకృతః॥
సూతుడనెను:- ఆ తఱువాత ఏయే పర్వతమున వివిధములైన దేవతలయొక్క యే గృహరాజములు చక్కగా నెలకొన్నవో చెప్పుదును వినుడు-1. అందులో ఏ యీ మహాశైలము శీతాంతమై (ప్రాణులకు శీతలమే మరణమైనట్టి) అనేక విస్తారములు గలదై, చీధాత్రములైన యనేక శతధాతువులచే చిత్రమై, అనేక సముద్రములకు నిధానమై, అనేక ప్రాణులకును గుణములకును నెలవైనదై, గొప్పనైన మణులచే చిత్రములైన బంగారు వెదురు వృక్షములతో నలంకరింప బడినదై యుండెనో ఆ పర్వతము-3. యొక్క నితంబములు (కొండనడిమి ప్రదేశములు) తుమ్మెదలచే ఝంకారములచే నాదితములు. పగడపు రంగు ధాతువులచేతను బంగారు ధాతువుల చేతను చిత్రవర్ణములుగలవి. తటములు మదించిన తుమ్మెదల ధ్వనిగల పూవులతో వ్యాపించినవి-4. వ్రేలాడు తీగలుగలవి. చిత్రములచే చిత్రములైనవి. నూర్ల ధాతువులచే పూజింపబడినవి. పూవులతో నొప్పి రత్నచిత్రములైన చరియలచే నలంకరింపబడినవి-5. నిర్మలమై తీయనైన పానీయములైన నీరుగల యనేకములైన కాలువలతో కూడినది. అనేకములైన పూబోదలతో నలంకరింపబడినది-6. పూలతెప్పలను వహింపజేయు నదులచే నలంకరింపబడినది. అంతట కిన్నరులు దీరుగు గుహలు గలది-7. దానిగుహాగర్బములు యక్షులు గంధర్వులు తిరుగాడునవి. సుఖముగా సేవింపదగిన చిత్రములైన లోతైన గుహలచే శోభితమైనది-8. అనేక ప్రాణి గణములు (ప్రక్ష్యాదులు) వ్యాపించి సుఖాశ్రయములై మంచిపానీయములు గలది. అనేక పుష్పఫలములతో గూడిన వృక్షములతో నలంకరింపబడినది. (ఆ పర్వతము)?-9.
తస్మిన్ గుహాశ్రయా కీర్ణే అనేకోదరకందరే ।
క్రీడావనం మహేంద్రస్య సర్వకామ గుణైర్యుతమ్॥
తత్ర తద్దేవరాజస్య పారిజాతవనం మహత్ ।
ప్రకాశం త్రిషు లోకేషు గీయతే శ్రుతినిశ్చయాత్॥
తరుణాదిత్య సంకాశైర్మహా గంధైర్మనోహరైః ।
పుష్ఫైర్భాతి నగశ్రేష్ఠః సుదీప్తఇవ సర్వశః ॥
సమగ్రం యోజనశతం తం గంధమనిలో వవౌ ।
పారిజాతక పుష్పాణాం మాహేంద్రవన నిర్గళః ॥
వైదూర్యనాలైః సౌవర్ణైర్వజ్ర కేసరైః ।
సర్వగంధబలో పేతై ర్మత్త షట్పదనాదితైః ॥
వ్యాకోశ్వైకచైశ్చాపి శతపత్రై ర్మనోహరైః ।
సపంకజైర్మహా పత్రైర్వాప్యస్తత్ర విభూషితాః ॥
విరేజురంతరంభూస్థాః సౌవర్ణమణి భూషితాః ।
పరిస్పందేక్షణా నిత్యం మీనయూధాః సహస్రశః ॥
కూర్మైశ్చానేక సంస్థానైర్హేమరత్న పరిష్కృతైః ।
చంచూర్యమాణైః సలిలైర్భాతి చిత్రం సమన్తతః ॥
నానావర్ణైశ్చ శకునై ర్నానారత్న తనూరు హైః ।
సువర్ణ పుష్టైశ్చానేకైర్మణి తుండైర్వృజాతిభిః ॥
వల్గుస్వరైః సదోన్మత్తైః సంపతద్భిః సమన్తతః ।
శుశుభే తద్వనం రమ్యం సహస్రాక్షస్య దీమతః ॥
అనేక గర్భములు గల గుహలు గలిగి యా గుహ నాశ్రయించియున్న వారితో నిండిన యా పర్వతము నందు మహేంద్రుని క్రీడావనము కలదు. అది యన్ని కోరికలకు తగిన గుణములతో గూడినది-10. అచట దేవరాజైన యా యింద్రుని యొక్క పారిజాతవనమను మహావనముగలదు. అది వేద ప్రామాణ్యమున ముల్లోకములలో ప్రకాశమైనదిగా కీర్తింపబడును-11. లేత సూర్యునితో సమానమైన యెఱ్ఱనై మహాగంధముగలిగి మనోహరములైన పూవులతో నా పర్వత శ్రేష్ఠము చక్కగా నంతట ప్రకాశించినది (వెలిగినది) వలె నుండును-12. మహేంద్ర వనమున నుండి బయలుదేరిన పారిజాత పుష్పముల గంధమును వాయువు పూర్తి నూరు యోజనముల వరకు గొనిపోయి వ్యాపింపజేయును-13. అచటి బావులు (దిగుడుబావులు) కమలములతో నలంకరింపబడినవి. ఆ కమలములు సువర్ణములు (బంగారువి) వైడూర్య నాళములు గలవి. వజ్రపు కింజల్కములు గలవి. సమస్తము గంధములతో గూడినవి. మదించిన తుమ్మెదల ఝుంకారములు గలవి. విశాల కోశములు గలిగి బాగా వికసించినవి. ఇట్టి మనోహరములైన కమలములు గలవి-14,15. ఆ బావులలో నీటి మధ్యలో బంగారము చేతను మణుల చేతను అలంకరింపబడి కదలని కన్నులుగల వేలకొలది చేపల గుంపులు ప్రకాశించును-16. అనేక సంస్థానములుగలిగి సౌవర్ణమని భూషణముల నలంకరింపబడి ఎగజిమ్ముచున్న నీరు గలిగిన తాబేళ్ళచే నంతట చిత్రముగా ప్రకాశించుచుండును-17. అనేక విధములైన రత్నము వెంట్రుకలు (రెక్కలు)గల పలురంగుల పక్షులచే ప్రకాశించు చుండును. పలు బంగారు పూవుల చేతను మణుల తుండములు గల యేనుగుల చేతను ప్రకాశించుచుండును-18. అంతటను వాలుచున్నవియు చక్కని స్వరములు గలిగి మదోన్మత్తములైన పక్షులచే నా మేధావియైన యింద్రుని యొక్క క్రీడావనము రమ్యమై ప్రకాశించును-19.
మత్తభ్రమరసన్నాదై ర్విహంగానాం చ కూజితైః ।
నిత్య మానందిత వనం తస్మాత్క్రీడావనం మహత్॥
సౌవర్ణ పార్శ్వైశ్చనగై ర్మణిముక్తా పురస్కృతైః ।
మణిశృంగ కలాపన్నై పతద్భిశ్చ సమన్తత ॥
శాఖామృగైశ్చ చిత్రాంగై ర్నానారత్న తనూరుహైః ।
నానావర్ణ ప్రకారైశ్చ సత్త్వైరన్యైః సమాకులమ్॥
ముంచంతి పుష్పవర్షం చ తత్ర బాలలతాద్రుమా ।
పారిజాతక పుష్పాణాం మందమారుత కంపితాః ॥
శయనాసననిర్వ్యూ హైః స్తీర్ణైరత్న విభూషితైః ।
విహార భూమయస్తత్ర ద్విజాః శక్రవనేశుభాః ॥
న చ శీతో న చాప్యుష్ణో రవిస్తత్ర సమః సదా ॥
నిత్యమున్మాద జననో మధుమాధవ సంభవః।
వాతి చాప్యనిలస్తత్ర నానాపుష్పాధి వాసితః॥
నిత్యం సంగ సుఖాహ్లాదీ శ్రమక్లమ వినాశనః ॥
ఆ క్రీడావనము మదించిన తుమ్మెదల చక్కని నాదములతోను పక్షుల కూతలతోను నిత్యము ఆనంద వంతముగా జేయబడిన యా క్రీడావనము గొప్పది-20. అది బంగారు ప్రక్క భాగములు గల పర్వతముల చేతను, మణుల చేతను ముత్యముల చేతను, మణులతో గూడిన పర్వత శిఖరముల చేతను ఒప్పినది. అంతటి ఎగురుచున్నవియు-21. చిత్రమైన శరీరములు గలవియు, అనేక రత్నముల వంటి శరీర రోమములు గలవి యునైన కోతుల చేత కూడినది. అనేక వర్ణములు గల తక్కిన ప్రాణుల చేత వ్యాకులముగా నున్నది-22. అచట బాలతలును, పారిజాత(పుష్పముల) వృక్షములును పిల్లవాయువులచే కదల్చబడినవై పుష్పవర్షములు గురియును-23. అచట విశాలములై రత్నములచే నలంకరింపబడిన శయనములు, ఆసనములు, ద్వారములు- వీనిచే నలంకరింపబడిన విహారభూములును గలవు. అచట ఇంద్రక్రీడావనములో మంగళకరములైన పక్షులుగలవు. అచట సూర్యుడు మిక్కిలి వేడిగ గాని శీతలముగగాని లేక ఎల్లప్పుడు సమశీతోష్ణముగా నుండును-24. అచట చైత్రమాసమున వసంతఋతువున అనేక పుష్పములతో సువాసితమై వాయువు వీచును. అది నిత్యము కామోన్మాదమును గలుగజేయును. నిత్యము శరీరము శరీరమున సంగసుఖముచే నానందింప జేయును. శ్రమమును క్లమమును నశింపజేయును-25.
తస్మిన్నింద్రవనే శుభ్రే దేవదానవ పన్నగాః ।
యక్షరాక్షస గుహ్యాశ్చ గంధర్వామీతౌజసః ॥
విద్యాధరాశ్చ సిద్ధాశ్చ కిన్నరాశ్చ ముదాయుతా ।
అధాప్సరో గణాశ్చైవ నిత్యం క్రీడాపరాయణాః ॥
తస్య పర్వతరాజస్య పూర్వే పార్శ్యే మహోచితమ్ ।
కుముంజం శైలరాజానం నైకనిర్ఘర కందరమ్॥
తస్య ధాతువిచిత్రేషు కూటేషు తు బహువిస్తరాః ।
అష్టా పుర్యోహ్యుదీర్ణాశ్చ దానవానాం మహాత్మనామ్ ॥
ఆశుభ్రమైన యింద్ర వనమున, దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు, అమితతేజస్కులైన గంధర్వులు-24. విద్యాధరులు, సిద్దులు, కిన్నరులును సంతోషముతో గూడి యుందురు. ఆ తరువాత అప్సరోగణములుగూడ అచట నిత్యము క్రీడాపరాయణులై యుందురు-27. ఆ పర్వత శ్రేష్ఠము యొక్క తూరుపు ప్రక్కన మహోచితమైన కుముంజమను పర్వతశ్రేష్ఠము గలదు. దాని పై యనేక(నదీ) ప్రవాహములు, గుహలును గలవు-28. దానియొక్క ధాతు విచిత్రమైన శిఖరముల యందు మహాత్ములైన రాక్షసులయొక్క బహువిస్తారములైన యెనిమిది నగరములు బయలు దేరినవి-29.
వజ్రకే పర్వతే చాపి అనేకశిఖరోదరైః ।
ఉదీర్ణా రాక్షసావాసా నరనారీ సమాకులాః ॥
నీల కా నామ తే ఘోరా రాక్షసాః కామరూపిణః ।
తత్ర తేఽభిరతా నిత్యం మహాబల పరాక్రమాః ॥
మహానీలేఽపి శైలేంద్రే పురాణి దశ పంచచ ।
హయాననానాం విఖ్యాతాః కిన్నరాణాం మహాత్మనామ్ ॥
దేవ సేనో మహాబాహుర్బల మింద్రాదయ స్తథా ।
తత్ర కిన్నరరాజానో దశపంచ చ గర్వితా॥
సువీర్ణపార్శ్వాః ప్రాయేణ నానావర్ణ సమాకులైః ।
బిల ప్రవేశైర్నగరైః శైలేంద్రః సోఽభ్యలంకృతః ॥
వజ్రక పర్వతమునగూడ అనేక శిఖరములచేతను గర్భముల చేతను పైకి వెలసిన రాక్షస నివాసములు గలవు. అవి పురుషులతోను స్త్రీలతోను వ్యాకులమైనవి-30. నీలకులను నా రాక్షసులు భయంకరులు, కామరూపులు (అనుకొన్న రూపమును ధరించగలవారు) వారు బలపరాక్రమవంతులై యచట నిత్యము ఆసక్తులై యుందురు-31. మహానీలపర్వతరాజమున గూడ పదియైదు పురములు గలవు. అవి గుఱ్ఱపు ముఖము గలిగి కిన్నరులనీ ప్రసిద్దిజెందిన మహాత్ములవి-32. మహాబాహువైన దేవసేనుడు అట్లే ఇంద్రుడు మొదలగువారు ఆపురములకు బలము అచట కిన్నరరాజులు పదియైదుగురు గర్వితులు-33. బంగారు ప్రక్కభాగములు గలవారు. సామాన్యముగా అనేక వర్ణ(జాతులతో) ములచే వ్యాకులములై బల ప్రవేశములు గల నగరములచే ఆ శైలేంద్రము బాగుగా నలంకరింపబడినది-34.
అతిదారుణా దృష్టి విషా: హ్యగ్ని కోపాదురాసదాః ।
మహోరగ శతాస్తత్ర సువర్ణవశవర్తినః॥
సునాగేఽపి మహాశైలే దైత్యావాసాః సహస్రశః ।
హర్మ్య ప్రాసాదకలిలాః ప్రాంశు ప్రాకారతోరణాః ॥
అచట మిక్కిలి భయంకరులు, విషపు చూపులు గలవారు, అగ్నివంటి కోపము గలవారు. సమీపింపనలవికానివారు, బంగారమునకు వశమై నడచుకొనువారు నైన మహోరగులు నూరుగురు గలరు-35. ఆ పర్వతము చక్కగా నాగులు గలదైనను అచట రాక్షసావాసములు వేలకొలది కలవు. ధనికుల మేడలు రాజమందిరములు దేవాలయములును పొడవైన ప్రాకరము తోరణద్వారములును గలిగియున్నవి-36.
వేణువన్తే మహాశైలే విద్యాధర పురత్రయమ్ ।
త్రింశద్యోజన విస్తీర్ణం పంచాశద్యోజ నాయతమ్ ॥
ఉలూకో రోమశశ్చైవ మహానేత్రశ్చ వీర్వవాన్ ।
విద్యాధర వరాస్తత్ర శక్రతుల్య పరాక్రమాః ॥
వేణువంతమను మహాశైలమున విద్యాధరులవి మూడు పురములున్నవి. అవి ముప్పదియోజనములు వెడల్పు, ఏబది యోజనముల పొడవును గలవి-37. అచట దేవేంద్రునితో సమానమైన పరాక్రమములు గల ఉలూకుడు, రోమశుడు, వీర్యవంతుడైన మహానేత్రుడు-అను విద్యాధరులు గలరు-38.
వైకంకే శైలశిఖరే హ్యంతః కందరనిర్ఘరే ।
మహోచ్చ శృంగే రుచిరే రత్నధాతు విచిత్రితే॥
తత్రాన్తే గారుడిర్నిత్యం ఉరగారిర్దురాసదః ।
మహావాయుజ రశ్చండః సుగ్రీవోనామ వీర్యవాన్॥
మహాప్రమాణైర్వి క్రాంఛైర్మహా బలపరాక్రమైః ।
స శైలోహ్యావృతః సర్వః పక్షిభిః పన్నగారిభిః॥
వైకంకమను శైలము గలదు. దానిలో గుహలు సెలయేరులును గలవు. మహోన్నతమై యందమైన శిఖరములు గలవు. అది అనేక రత్నములచేతను ధాతువులచేతను చిత్రింపబడినట్లుండును-39. అచట నిత్యము గరుడుని కుమారుడైన సుగ్రీవుడను పరాక్రమవంతుడు కలడు. ఆతడు ఉరగుల శత్రువు. దరి చేరనలవికాని వాడు మహావాయువంతటి వేగము గలవాడు-40. ఆ పర్వతము మహాప్రమాణములు గలవై, పరాక్రమవంతములై మహాబలపరాక్రమములు గల సర్పశత్రువులైన పక్షులచే నా పర్వతమంతయు నొవరింపబడియుండును-41.
కరంఽజే భిరతో నిత్యం సాక్షాద్భూత పతిః ప్రభుః ।
వృషభాంకో మహాదేవః శంకరో యోగినాం ప్రభుః ॥
నానావేషధరై ర్భూతైః ప్రమదై శ్చ దురాసదైః ।
కరంజే సానవః సర్వే హ్యవకీర్ణాః సమంతతః ॥
కరంజ వర్వతమున నెల్లప్పుడును సాక్ష్యాద్భూతపతియై ప్రభువై వృషభధ్యజుడై యోగులకు ప్రభులై-42. మహాదేవుడైన శంకరుడుండును. ఆ కరంజ పర్వతమున చరియలన్నియును అనేక వేషములు ధరించి భూతములై దరిజేరనలవిగాని ప్రమథ గణములచేత నంతట వ్యాపించబడియుండును-43.
వసుధారే వసుమతాం వసూనామమి తౌజసామ్ ।
అష్టావాయత న్యాహుః పూజితాని మహాత్మనామ్ ॥
రత్నధాతౌ గిరివరే ఋషీణాం చ మహాత్మనామ్ ।
సప్తాశ్రమాని పుణ్యాని సిద్ధా వాసయుతాని చ ॥
మహాప్రజాపతేః స్థానం హేమశృంగే నగోత్తమే ।
చతుర్వక్త్రస్య దేవస్య సర్వభూత నమస్కృతమ్॥
గజశైలే భగవతో నానాభూత గణావృతాః ।
రుద్రాః ప్రముదితా నిత్యం సర్వభూత నమస్కృతాః ॥
వసుధారమను పర్వతమున వస్తువుల యొక్క యెనిమిది పూజితములైన నివాసములు గలవందురు. వారు వసు(ధన) మంతులు. అమితతేజసులు. మహాత్ములు-44. రత్నధాతువను పర్వత శ్రేష్ఠమున మహాత్ములైన (సప్త ఋషులయొక్క యేడు ఆశ్రమములు గలవు. అవి సిద్ధావాసములతో గూడియున్నవి-45. హేదుశృంగమను పర్వత శ్రేష్ఠమున నాలుగు ముఖములు గల ప్రజాపతిబ్రహ్మ) యొక్క స్థానము గలదు. అది సర్వభూతములచే నమస్కరింపబడినది-46. గజశైలమున భగవంతుని నానా భూతగణములతో జుట్టబడిన శూద్రులు గలరు. వారు నిత్య సంతుష్టులు. సర్వ భూతములచే నమస్కరింప బడినవారు-47.
సమేధే ధాతుచిత్రాడ్యై శైలేంద్రే మేఘసన్నిభే ।
నైకోదరద రీవప్రనికుంజై శ్చోపశోభితే ॥
ఆదిత్యానాం వసూనాం చ రుద్రాణాం చామితౌజసామ్ ।
తత్రాయతన విన్యాసారమ్యశ్చై వాశ్వినోరవి ॥
స్థానాని సిద్ధైర్దేవానాం స్థాపితాని నగోత్తమే ।
తత్ర పూజాపరా నిత్యం యక్షగంధర్వ కిన్నరాః ॥
అట సుమేధమను పర్వతము ధాతుచిత్రములతో గూడినది. మేఘముతో సమముగా నల్లనైనది. అనేకములైన గుహలు, ధాన్యములు వాటిక్షేత్రములు పొదలు - వీనిచే నది ప్రకాశించినది-48. ఆదిత్యుల యొక్కయు వస్తువులయొక్కయు, అమిత తేజుస్కులైన రుద్రులయొక్కయు, అశ్వినీ దేవతలయొక్కయు మనోహరములైన గృహవిన్యాసములు గలవు-49. ఆ నగోత్తమమున సిద్ధులచేత దేవతలయొక్క స్థానములు స్థాపింపబడినవి. అచట యక్షగంధర్వకిన్నరులు నిత్యము పూజాపరులై యుందురు.50.
గంధర్వనగరే స్పీతా హేమకక్షే నగోత్తమే ।
అశీత్యాయామ పుర్యాభా మహాప్రాకార తోరణా ॥
సిద్ధాహ్యపత్తనానామ గంధర్వా యుద్ధశాలినః ।
యేషామధిపతి ర్దేవో రాజరాజః కపింజలః ॥
అనతే రాక్షసావాసాః పంచకూటేఽపి దానవాః ।
ఊర్జితా దేవరిపనో మహాబల పరాక్రమాః ॥
హేమకక్షమను పర్వత శ్రేష్ఠమున విశాలమైన గంధర్వనగరి కలదు. ఎనుబది (క్రోశముల) పొడవుగల పురివంటిది. గొప్పప్రాకార తోరణములుగలది-51. సిద్దులు, అపత్తనులను గంధర్వులను యుద్ధమున శోభించువారు. వారి యధిపతి రాజరాజై దేవుడైన కపింజలుడు-52. అనలపర్వతమున రాక్షసావాసములు గలవు. పంచకూటమున గూడ దానవులుగలరు. వారుత్సాహవంతులై మహాబలపరాక్రమములు గల దేవశత్రువులు-53.
శతశృంగం పురశతం యక్షాణా మమితౌజసామ్ ।
తామ్రా భేకాద్రవే యస్య తక్షకస్య పురోత్తమమ్ ॥
విశాఖే పర్వతశ్రేష్ఠే నైకవప్రదరీ శుభే ।
గుహానిరత వాసస్య గుహస్యాయతనం మహత్॥
శ్వేతోదరే మహాశైలే మహాభవన మండితే ।
పురం గరుడపుత్రస్య సునాభస్య మహాత్మనః ॥
పిశాచకే గీరవరే హర్మ్యం ప్రాసాద మండితమ్ ।
యక్షగంధర్వ చరితం కుబేర భవనం మహత్ ॥
హరికూటే హరిర్దేవః సర్వభూత నమస్కృతః ।
ప్రభావిత్తస్య శైలోఽ సౌ మహానాభః ప్రకాశతే॥
కుముదే కిన్నరావాసా అంజనే చ మహోరగాః ।
కృష్ణే గంధర్వనగరాః మహాభవన శాలినః ॥
పాండురే చారు శిఖరే మహాప్రాకార తోరణే ।
విద్యాధరపురం తత్ర మహాభవన మాలినామ్॥
సహస్రశిఖరే శైలే దైత్యానాయుగ్ర కర్మణామ్ ।
పురాణి సముదీర్ణానాం సహస్రం హేమమాలినామ్॥
ముకుటే పన్నగా వాసా అనేకాః పర్వతోత్తమాః ।
పుష్పకే వై మునిగణా నిత్యమేవ ముదాయుతాః ॥
వైవస్వతస్య సోమస్య వాయోర్నాగాధి పస్య చ ।
సుపక్షే పర్వతవరే చ త్వార్యాయతనాని చ ॥
గంధర్యైః కిన్నరై ర్యక్షై ర్నాగైర్విద్యాధరోత్తమైః ।
సిద్ధిర్హితేషు స్థానేషు నిత్యమిష్టః ప్రపూజ్యతే ॥
ఇతిశ్రీమహాపురాణే వాయుప్రోక్తే భువన విన్యాసో నామైకోఽనచత్వారింశోఽధ్యాయః ॥
రాగి కాంతి గల పర్వతమున అమిత తేజస్కులైన యక్షులకు సంబంధించిన నూరు శిఖరములు గల నూరు పురములు గలవు. అటక ద్రువ పుత్రుడైన తక్షకుని యొక్క పురశ్రేష్ఠము గూడ గలదు-54. అనేక వస్త్రముల చేతను గుహల చేతను శుభమైన విశాఖమను పర్వత శ్రేష్ఠమున ఎల్లప్పుడు గుహలోనే నివాసము గల గుహుని (కుమారస్వామి) యొక్క గొప్ప (భవనము) కలదు-55. మహాభవనములతో నలంకరింపబడిన శ్వేతోదరమను మహాశైలమున మహాత్ముడు గరుడ పుత్రుడునైన సునాభునియొక్క పురము గలదు-56. పిశాచకమను పర్వత శ్రేష్ఠమున ధనికులయు దేవరాజులయొక్కయు గొప్పమేడలచే నలంకరింపబడినదియు, యక్షగంధర్వులు తిరిగి నదియునై గొప్పనైన కుబేర భవనము గలదు-57. హరికూటపర్వతమున దేవుడై సర్వభూత నమస్కృతుడైన హరి యుండును. ఆయన ప్రభావమువల్ల నీ పర్వతము మహానాభమై ప్రకాశించును-58. కుముదపర్వతమున కిన్నరుల నివాసములు, అంజన పర్వతమున మహోరగులును (వారినివాసములు)ను గలవు. కృష్ణపర్వతమున మహా భవనములతో నొప్పిన గంధర్వ నగరములు గలవు-59. అందమైన శిఖరము గొప్ప ప్రాకారతోరణమును గల పాండుర పర్వతమున మహాభవన పంక్తులు గల విద్యాధరులయొక్క పురము గలదు-60. సహస్ర శిఖరమను పర్వతమున ఉగ్రకర్ములు, బాగుగ పైకెదిగినవారు, బంగారు మాలలుగల రాక్షసులయొక్క వేయిపురములు గలవు-61. ముకుటపర్వతమున నాగుల కావాసములైన యనేక పర్వత శ్రేష్ఠములు గలవు. పుష్పక పర్వతమున నిత్య సంతుష్టులైన ముని గణములు గలవు- 62. సుపక్షమను పర్వత శ్రేష్ఠమున వైవస్వతుని యొక్కయు, సోముని యొక్కయు, వాయువు యొక్కయు, నాగాధిపుని యొక్కయు ఈ నలువురియొక్క నివాసములు గలవు-63. గంధర్వులచేతను, కిన్నరులచేతను, యక్షులచేతను, నాగుల చేతను, విద్యాధరశ్రేష్ఠుల చేతను వారి స్థానములలో నిత్యము ఇష్టమై (హోమము చేయబడినదై) యొక్కువగా పూజింపబడును-64.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను ముప్పది తొమ్మిదవ యధ్యాయము.39.