58 - చతుర్యుగాఖ్యానం  

సూత ఉవాచ:-

 అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ద్వాపరస్య విధిం పునః

 తత్ర త్రేతాయుగే క్షీణే ద్వాపరం ప్రతిపద్యతే

ద్వాపరాదౌ ప్రజానాం తు సిద్ధి స్త్రేతాయుగే తు యా

 పరివృత్తే యుగే తస్మింస్తతః సా సంప్రణశ్యతి

తతః ప్రవర్తతే తాసాం ప్రజానాం ద్వాపరే పునః

లోభో ధృతి ర్వణిగ్యుద్ధం తత్త్వానామ వినిశ్చయః

 సంభోదశ్చైవ వర్ణానాం కార్యణాం చావినిర్ణయః

 యజ్ఞౌషధః పశోర్దండో మదోదంభోఽక్షమా బలమ్

ఏషాం రజస్తమో యుక్తా ప్రవృత్తిర్ద్వాపరే స్మృతా

 ఆద్యే కృతే చ ధర్మోఽస్తి త్రేతాయాం సంప్రపద్యతే

 ద్వాపరే వ్యాకులీ భూత్వా ప్రణశ్యతి కలౌయుగే

వర్ణానాం విపరిధ్వంసః సంప్రపద్యతే

ద్వైధముత్పద్యతే చైవ యుగేతస్మిన్ శ్రుతౌస్మృతౌ

 ద్యైధాత్ శ్రుతేః స్మృతేశ్చైవ నిశ్చయో నాధిగమ్యతే

అనిశ్చయాధిగమనాద్ధర్మతత్త్వం నిగద్యతే

 ధర్మతత్త్వే తు భిన్నానాం మతిభేదో భవేన్నృణామ్

 పరస్పరవిభిన్నై స్తైదృష్టీనాం విభ్రమేణచ

 అయం ధర్మోహ్యయం నేతి నిశ్చయో నాభిగమ్యతే

 కారణానాం చ వైకల్యాత్ కారణస్యాప్య నిశ్చయాత్

మతిభేదే చ తేషాం వై దృష్టీనాం విభ్రమోభవేత్

 తతో దృష్టివిభిన్నైస్తైః కృతం శాస్త్రకులం త్విదమ్

 ఏకో వేదశ్చ తుష్పాదస్త్రేతాస్విహ విధీయతే

 సంరోధా దాయుషశ్చైవ దృశ్యతే ద్వాపరేషు చ

 వేదవ్యాసైశ్చతుర్ధా తు వ్యస్యతే ద్వాపరాదిషు

 ఋషిపుత్రః పునర్వేదా భిద్యంతే దృష్టివిభ్రమైః

మంత్రబ్రాహ్మణ విన్యాసై స్వరవర్ణవిపర్యయైః

 సంహితా ఋగ్యజుః సామ్నాం సంహన్యంతే శ్రుతర్షిభిః

 సామాన్యా ద్యై కృతాచ్చైవ దృష్టిభిన్నైః క్వచిత్క్వచిత్

  బ్రాహ్మణం కల్పసూత్రాణి మంత్రప్రవచనాని చ

 అన్యే తు ప్రహితాస్తీర్థేః కేచిత్తాన్ ప్రత్యవస్థితాః

 ద్వాపరేషు ప్రవర్తంతే భిన్నవృత్తా శ్రమాద్విజాః

ఏకమాధ్వర్యవం పూర్వమాసీద్ద్వెధం పునస్త త

సామాన్యవిపరీతార్థైః కృత శాస్త్రకులం త్విదమ్

 ఆధ్వర్యవస్య ప్రస్తావై ర్బహుధా వ్యాకులం కృతమ్

 తథైవాథర్వఋకామ్నాం వికల్పై శ్చాప్యసంక్షయైః

వ్యాకులం ద్వాపరే భిన్నే క్రియతే భిన్నదర్శనైః

 తేషాం భేదాః ప్రభేదాశ్చ వికల్పైశ్చాష్యసంక్షయాః

 ద్వాపరే సంప్రవర్తంతే వినశ్యంతి పునఃకలౌ

తేషాం విపర్యయాశ్చైవ భవన్తి ద్వాపరే పునః

 అవృష్టిర్మరణం చైవ తథైవ వ్యాధ్యుపద్రవాః

వాఙ్మనః కర్మజైర్దుః ఖైర్నిర్వేదో జాయతే పునః

నిర్వేదా జ్జాయతే తేషాం దుఃఖమోక్ష విచారణా

 విచారణాచ్చ వైరాగ్యం వైరాగ్యాద్దోష దర్శనమ్

దోషాణాం దర్శనాచ్చైవ ద్వాపరేజ్ఞానసంభవః

 తేషాం చ మానినాం పూర్వమాద్యే స్వాయంభువేఽ న్తరే

ఉత్పద్యంతే హి శాస్త్రాణాం ద్వాపరే పరిపంధినం

 ఆయుర్వేద వికల్పాశ్చ అంగానాం జ్యౌతిషస్యచ

 అర్థశాస్త్రవికల్పశ్చ హేతుశాస్త్రవి కల్పనమ్

స్మృతిశాస్త్ర ప్రభేదాశ్చ ప్రస్థానాని పృథక్ పృథక్

 ద్వాపరే ష్వభివర్తనే మతిభేదా స్తథానృణామ్

 మనసా కర్మణా వాచా కృచ్ఛ్రాద్వార్తా ప్రసిద్ధ్యతి

ద్వాపరే సర్వభూతానాం కాయక్లేశ పురస్కృతా

 లోభోఽ ధృతర్వణిగ్యుద్ధం తత్త్వా నామ వినిశ్చయః

వేదశాస్త్ర ప్రణయనం ధర్మాణాం సంకర స్తథా

ద్వాపరేషు ప్రవర్తంతే రోగో లోభో వధస్తథా

వర్ణాశ్రమపరిధ్వంసాః కామద్వేషౌ త థైవ చ

 పూర్ణే వర్షసహస్రేద్వే పరమాయుస్తథా నృణామ్

 నిఃశేషే ద్వాపరే తస్మిన్ తస్య సంధ్యాతు పాదతః

ప్రతిష్ఠతే గుణైర్హీనో ధర్మోఽసౌ ద్వాపరస్య తు

తథైవ సంధ్యా పాదేన అంశస్తస్యావ తిష్ఠతే

ద్వాపరస్య చ వర్ష యతిష్యస్య తు నిబోధత

 ద్వాపరస్యాంశ శేషే తు ప్రతిపత్తి కలే రత:

సూతుడనెను:- ఆ తరువాత మరల ద్వాపరయుగము యొక్క విధిని జెప్పెదను. అచట త్రేతాయుగము క్షీణింపగా ద్వాపరయుగము వచ్చును, ద్వాపరయుగ ప్రారంభమున, ప్రజలకు త్రేతాయుగము నందున్న సిద్ది, యుగము మారుట వలన నశించును-2. తరువాత ద్వాపరమునందు ప్రజలకు లోభము, అధైర్యము, (వ్యాపార) వైశ్యయుద్దము, తత్యముల అవినిశ్చయము వర్ణముల సాంకర్యము, కార్యముల నిర్ణయములేమి, యజౌషధియైన పశువునకు దండము, మదము, దంభము, ఓపిక లేమి బలమువీనియొక్క రజస్తమోగుణములతో గూడిన ప్రవృత్తి ద్వాపరయుగమున జెప్పబడినది, మొదటి కృతయుగమున ధర్మముండును. త్రేతాయుగమున నది చక్కగా ప్రైవర్తిల్లును. ద్వాపరయుగమున నది వ్యాకులమయి, కలియుగమున నశించును. వర్ణములయొక్క విశిష్టమైన సర్వనాశము చక్కగా పొగడబడును. అట్లే శ్రమయు ప్రశంసింపబడును. ఆయుగమున శ్రుతియందును స్మృతియందును ద్వైధీభావము (ఏకీభావములేమి) జనించును. ద్యైధీభావమున శ్రుతినుండిగాని స్మృతినుండి గాని నిశ్చయము తెలియదు. అనిశ్చయమువలన ధర్మ తత్యము నిక్కముగా జెప్పబడదు. ధర్మతత్త్యమున భేదముజెందినది మానవులకు మతి భేదము గలుగును, దృష్టలయొక్క పరస్పరబేధముచేతను భ్రమచేతను ఇది ధర్మము ఇది యధర్మము అని నిశ్చయముగలుగదు. కారణముల వికలత్వము వలనను. కారణము నిశ్చయముగానందునను వారి దృష్టులలో మతి భేదముగలుగుటచే విభ్రమము గలుగును-9. తరువాత దృష్టిలో విభిన్నులైన వారిచే ఈ శాస్త్రకులముచేయబడినది. త్రేతాయుగమున నాలుగు పాదములుగల యొక్క వేదవిధింపబడినదీ. ఆయువు యొక్క సంరోధము( అరికట్టుట) వలన నాకారము ద్వాపరయుగములో గూడ గనబడును. ద్వాపరాదులలో వేదవ్యాసులచేత నాలుగువిధములుగా (నీవేదం) వేరుచేయబడినది. దృష్టి విభ్రమముగల ఋషి పుత్రులచేత మంత్ర బ్రాహ్మణముల విన్యాసములచేతను స్వరవర్ణ(అచ్చుల)ములు తారుమారుగుటచేతను వేదములు భేదములబెందులు. సామాన్యముగను వికారము జెందుటవల్లను, ఒక్కొక్కచోట వేదములచే ఋక్యజుస్సామవేదములయొక్క సంహితలు ధ్వంసము చేయబడినవి. బ్రాహ్మణము, కల్పసూత్రములును, మంత్రప్రవచనములును, ఇతరులును తీర్థములచే పంపబడిరి. కొందరు వారిని గూర్చి నిలబడిరి. ద్విజులు భిన్మములైన వృత్తములు (పనులు) ఆశ్రమములు గలవారై ద్వాపరయుగములో బ్రవర్తింతురు. పూర్వమొకే యాధ్వర్యవము(యజ్ఞములోని యజుర్వేదప్రక్రియ) ఉండెడిది. తరువాతనది రెండు విధములైనది. సామాన్య విపరీతార్థములచేత ఈ శాస్త్రకులము చేయబడినది. ఆధ్వర్యవ ప్రస్తావములచే అనేక విధములుగా వ్యాకులముగా చేయబడినది.అట్లే వికల్పములేని అధర్వ-బుక్ సామములయొక్క వికల్పములచేత వ్యాకులము చేయబడినది. ద్వాపరముభేదింపగా నది భిన్నదర్శనములచే చేయబడును. వికల్పములచేత గూడ నశింపనియావేదముల యొక్క భేదములును ప్రభేదములను ద్వాపరమున చక్కగా ప్రవర్తిల్లును. మరల కలియుగమున నశించును. దారముననైతే వాని యొక్క (వేదములయొక్క) వ్యత్యాసములు కలుగును. అవి-వర్షములేమి, మరణము వ్యాధులు, ఉపద్రవములును అగును. మాట-మనస్సు-కర్మ-వీనివల్లగలిగిన దు:ఖములచే మరల నిర్వేదము (వైరాగ్యము) గలుగును. నిర్వేదము వలన వాని యొక్క దుఃఖమోక్షముల విచారణ గలుగును ఆవిచారణవల్ల వైరాగ్యము. వైరాగ్యమువల్ల దోషదర్శనము, దోషదర్శనము వలన ద్వాపరమున జ్ఞానోత్పత్తియు జరుగును. పూర్వము మొదటి స్వాయంభువ మన్వంతరమున ద్వాపరయుగములో ఆమానవంతుల యొక్క శాస్త్రములకు శత్రువులు బుట్టుదురు. ఆయుర్వేద వికల్పములును, వేదాంగముల యొక్కయు, జ్యోతిషము యొక్కయు వికల్పములును అర్థశాస్త్ర వికల్పమును హేతు శాస్త్ర వికల్పమును. స్మృతిశాస్త్రప్రభేదములును. వేరువేరు ప్రస్థానములును ద్వాపరమున ప్రవర్తిల్లుచుండును. అట్లే మానవులకు మతి భేదములు గూడ ప్రవర్తిల్లుచుండును. ద్వాపరమున సర్వప్రాణులకును కాయకష్టముతో గూడినదై మనోవాక్ కాయకర్మలతో కష్టముగా వృత్తి (అర్థానర్థ విచారవిద్య) సిద్దించును. లోభము, ధైర్యము, వ్యాపారులయుద్దము, తత్యముల అనిశ్చయస్థితి, వేదశాస్త్రముల దీసికొని పోవుట, ధర్మముల సంకరమును, రోగము, లోభము, వధయు, వర్ణాశ్రమ ధ్వంసము, కామద్వేషములును ద్వాపరయుగమున బ్రవర్తిల్లును. అట్లే మానవుల పరమాయువు నిండు రెండువేలు ఆద్వాపరము నిశ్శేషముగా దాని సంధ్య పాద(పావుభాగ)ముగా నుండును. గుణములతో హీనమైనది ద్వాపరముయొక్క ధర్మము. అట్లే దానియొక్క యంశము సంధ్యాపాదముగా నుండును. ద్వాపర యుగములోని (వర్ష) సంవత్సరము యొక్క ప్రతిపత్తి (జ్ఞానము)ని వినుడు. ద్వాపరాంశము మిగులు నందే కలియుగము యొక్క ప్రతిపత్తి కలుగును.

హింసాసూయాఽ నృతం మాయా వధశ్చైవ తపస్వినామ్

ఏతే స్వభావాస్తిష్యస్య సాధయన్తి చ వైప్రజాః

 ఏష ధర్మః కృతః కృత్స్నో ధర్మ్మశ్చ పరిహీయతే

మనసా కర్మణా స్తుత్యా వార్తా సిద్ధ్యతి వా నవా

కలౌ ప్రమారకో రోగః సతతం క్షుద్భయాని వై

అనావృష్టి భయం ఘోరం దర్శనం చ విపర్యయమ్

  నప్రమాణం స్మృతేరస్తి తిష్యే లోకే యుగేయుగే

 గర్భస్థో మ్రియతే కశ్చిద్యౌవనస్థ స్తథాపరః

స్థావిరే మధ్యకౌమారే మ్రియంతే వై కలౌప్రజా

 అధార్మికాస్త్యనాచారి స్తీక్ష్ణ కోపాల్పతేజసః

 అనృతబ్రువశ్చ సతతం తిష్యే జాయన్తి వై ప్రజాః

దురిష్టైద్దురధీతైశ్చ దురాచారై ర్దురాగమైః

 విప్రాణాం కర్మదో షైః ప్రజానాం జాయతే భయమ్

 హింసా మాయా తథేర్ష్యాచాఽక్రోధోఽ సూయా క్షమానృతమ్

తిష్యేభవన్తి జంతూనాం రాగోలోభశ్చ సర్వశః

సంక్షోభో జాయతేఽ త్యర్థం కలిమాసాద్య వై యుగమ్

నాథయంతే తదా వేదా నయజన్తే ద్విజాతయః

 ఉత్సీదంతి నరాశ్చైవ క్షత్రియాః సవిశఃక్రమాత్

క్షుద్రణామంత్యయోనేస్తు సంబంధ బ్రాహ్మణైః సహ

 భవన్తీహ కలౌ తస్మిన్ శయనాసనభోజనైః

 రాజానః శూద్రభూయిష్ఠాః పాషండానాం ప్రవర్తకాః

 భ్రూణహత్యాః ప్రజాస్తత్ర ప్రజా ఏవం ప్రవర్తతే

 ఆయుర్మేధాబలం రూపం కులంచైవ ప్రహీయతే

 శూద్రాశ్చ బ్రాహ్మణాచారాః శూద్రాచారాశ్చ బ్రాహ్మణాః

 రాజవృత్తే స్థితా శ్చౌరా శ్చారవృత్తాశ్చ పార్థివాః

భృత్యాశ్చ నష్టసుహృదో యుగాంతే పర్యుపస్థితే

అశీలిన్యోఽ వ్రతాప్చాపి స్త్రియో మద్యామిషప్రియాః

మాయామాత్రా భవిష్యంతి యుగాంతే ప్రత్యుపస్థితే

 శ్వాపదప్రబలత్వం చ గవాం చైవాప్యుపక్షయః

 సాధూనాం వినివృత్తిశ్చ విద్యాత్తస్మిన్ కలౌయుగే

 తదా సూక్ష్మే మహోదర్కో దుర్లభో భోగినాం తథా

చతురాశ్రమ శైథిల్యత్ ధర్మః ప్రవిచలిష్యతి

 తదా హ్యల్పఫలా దేవీ భవేద్భూమిర్మహీయసీ

శూద్రాస్తపశ్చరిష్యంతి యుగాంతే ప్రత్యుపస్థితే

 తదా హ్యైకాహికో ధర్మోద్వాపరే యశ్చ మాసికః

 త్రేతాయాం వత్సరస్థశ్చ ఏకాహాదతిరిచ్యతే

అరక్షితా రో హర్తారో బలిభాగస్య పార్థివాః

యుగాం తే షు భవిష్యన్తి సర్వరక్షణపరాయణాః

 అక్షత్రియాశ్చ రాజానో విశః శూద్రోపజీవినః

 శూద్రాభివాదినః సర్వే యుగాన్తే ద్విజసత్తమాః

పతయశ్చ భవిష్యంతి బహవోఽస్మిన్ కలౌ యుగే

 చిత్రవర్షీ తదా దేవో యదా స్యాత్తుయుగక్షయః

సర్వే వాణిజకాశ్చాపి భవిష్యంత్యధమే యుగే

భూయిష్టం కూటమానైశ్చ పణ్యవిక్రీత తేజనైః

 కుశీలచర్యా పాషండైర్వృథారూపైః సమావృతమ్

 పురుషాల్పం బహుస్త్రీకం యుగాన్తే పర్యుపస్థితే

 బహుయాచనకో లోకో భవిష్యతి పరస్పరమ్

 క్రవ్యాదనః క్రూరవాక్యో నార్జవో నానసూయకః

న కృతే ప్రతికర్తా చ క్షీణోలోకో భవిష్యతి

మండలాని భవంత్యత్ర దేశేషు నగరేషు చ

 అల్పోదకా చాల్పఫలా భవిష్యతి వసుంధరా

 గోప్తారాశ్చాష్యగోప్తారః ప్రభవిష్యంత్యశాసనాః

హర్తారః పరరత్నానాం పరదార ప్రధర్షకాః

 కామాత్మానో దురాత్మానో హ్యధర్మాత్ సాహసప్రియా

 అనష్ట చేతనాః పుంసో ముక్తకేశాస్తు చూలికాః

ఊనషోడశవర్షాశ్చ ప్రజాయంతే యుగక్షయే

శుక్లదంతాజితాక్షాశ్చ ముండాః కాషాయవాససః

శూద్రాధర్మం చరిష్యంతి యుగాంతే పర్యుపస్థితే

 సస్యచౌరా భవిష్యంతి తథాచైలాభిమర్శనాః

 చౌరాశ్చారస్య హర్తారో హర్తుర్హర్తార ఏవ చ

 జ్ఞానకర్మణ్యుపరతే లోకే నిష్క్రియతాం గతే

 కీటమూషిక సర్పాశ్చ ధర్షయిష్యంతి మానవాన్

సుభిక్షం క్షేమమారోగ్యం సామర్థ్యం దుర్బలం భవేత్

 కౌశికాః ప్రతివత్స్యంతి దేశాన్ క్షుద్భయపీడితాన్

దుఃఖేనాభిప్లుతానాం చ పరమాయుః శతం భవేత్

దృశ్యంతే న చ దృశ్యంతే వేదాః కలియుగేఽఖిలాః

ఉత్సీదంతి తథా యజ్ఞాః కేవలాధర్మపీడితాః

కాషాయిణశ్చ నిర్గంథా స్తథా కాపాలినశ్చహ

 వేదవిక్రయిణశ్చాన్యేతీర్థ విక్రయిణేఽ పరే

వర్ణాశ్రమాణాం యేచాన్యే పాషండాః పరిషంథినః

ఉత్పద్యంతే తథా తే వై సంప్రాప్తే తు కలౌ యుగే

నాధీయంతే తదా వేదాః శూద్రా ధర్మార్షకోవిదాః

యజంతే నాశ్వమేధేన రాజానః శూద్రయోనయః

 స్త్రీవధం గోవధం కృత్వా హత్వా చైవ పరస్పరమ్

ఉపహన్యుస్తదాన్యోన్యం సాధయంతి తథా ప్రజాః

 దుఃఖప్రచారతోఽల్పాయుర్దేశోత్సాదః సరోగతా

 మోహో గ్లానిస్తథా సౌఖ్యం తమోవృత్తం కలౌ స్మృతమ్

 ప్రజా తు భ్రూణహత్యాయామథ వై సంప్రవర్తతే

 దుఃఖేనాభిప్లుతానాం వై పరమాయుః శతం నృణామ్

దృశ్యంతే నాభిదృశ్యంతే వేదాః కలియుగేఽ ఖిలాః

 ఉత్సీదంతే తదా యజ్ఞాః కేవలా ధర్మపీడితాః

తదాత్వల్పేన కాలేన సిద్దాం యాస్యంతి మానవాః

 ధన్యా ధర్మం చరిష్యంతి యుగాంతే ద్విజసత్తామాః

 శ్రుతిస్మృత్యుదితం ధర్మం యేచరంత్యనసూయకాః

 త్రేతాయాం వార్షికో ధర్మో ద్వాపరే మాసికః స్మృతః

 యథాశక్తి చరన్ ప్రాజ్ఞ స్తదహ్నాత్ ప్రాప్నుయాత్ కలౌ

  హింస, అసూయ, అసత్యమాడుట, మోసము, తపము జేయు మునులను చంపుట, ఇవి కలియుగము యొక్క స్వభావములు. ప్రజలు వీనిని సాధింతురు. ఇదియే ధర్మముగా జేయబడినది. నిజమైన ధర్మమంతయు క్షీణించును. వృత్తి (జీవనము) మనస్సుతోను, క్రియతోను, పొగడ్తల రూపమైన మాటతోను సిద్ధించునో లేదో సందిగ్దార్థమే. కలియుగమున బహళముగా జంపునది రోగము. ఎల్లప్పుడు ఆకలి భయములుండును. వర్షములేని కాటకముయొక్క భయము ఘోరమగును. దర్శనము వ్యత్యాసమగును.కలియుగమున లోకమందు స్మృతికి ప్రామాణ్యముండదు. ఒకడుర్భముననుండి యేమరణింపగా మరొకడు యౌవనమున నుండి యే మరణించును. కలియుగమున ప్రజలు వృద్ధాప్యమున అధార్మికులు, అనాచారులు, తీక్షకోపులు, అల్పతేజ(వీర్యముగలవారు, ఎప్పుడు అసత్యమాడువారునునైన ప్రజలు పుట్టుదురు. బ్రాహ్మణులయొక్క దుష్టమైన కోరికలచేతను (దుష్టమైన యజ్ఞకర్మలచేతను), దుష్టమైన యధ్యయనముల(చదువుల) చేతను, యాగమము (వేదశాస్త్రము)లచేతను ఈ విధములైన దుష్టకర్మలచేతను ప్రజలకు భయము గలుగును. కలియుగములో ప్రాణుల కంతటను హింస, మాయ, అసూయ, కోపము, ఈర్ష్య, ఓపిక లేమి (సహనము లేమి) అబద్దమాడుట, రాగములోభము-ఇవి కలుగుచుండును. కలియుగమును పొంది మిక్కిలి సంక్షోభము గలుగును. బ్రాహ్మణులు వేదముల జదువరు. యజ్ఞముల జేయరు. క్రమముగా నరులు వైశ్యులతోబాటు క్షత్రియులును నశింతురు. కలియుగమున క్షుద్రులకును అంత్యజులకును పడక-కూర్చొనుట, భోజనము-వీనిలో బ్రాహ్మణులతో సంబంధములు గలుగుచుండును. శూద్రజాతులవారు రాజులగుదురు. వారు పాషండులకు (వేద బాహ్యులకు) ప్రవర్తకులగుదురు. ప్రజలు భ్రూణ(గర్భశిశువు) హత్యలు చేయుదురు. ఈ విధముగ ప్రజ ప్రవర్తించును-40. ఆయువు, మేధాబలములు, రూపము, కులము-ఇవి క్షీణించును. శూద్రులు బ్రాహ్మణాచారముల జేయగా బ్రాహ్మణులు శూద్రాచారముల జేయుదురు. దొంగలు రాజవృత్తిలోనుండగా రాజులు చోరవృత్తిని(దొంగతనము) జేయుదురు. సేవకులు తమ మిత్రుల గోల్పోవుదురు. కలియుగము రాగా నిది జరుగును . కలియుగమురాగా స్త్రీలు శీలములేనివారు వ్రతములేని వారును, మాంసప్రియలునునై మాయమాత్రమే తమలో మిగిలిన వారుగా నగుదురు. కలియుగమున పులులు ప్రబలమగును (ఎక్కువగును) గోవులుక్షీణించును. సాధువులు మరలి పోవుదురు. అపుడు భోగులకు సూక్ష్మమున రాగల మహాఫలము, అట్లే బ్రహ్మచర్య గృహస్థవానప్రస్థ-సన్యాసాశ్రమములు శిధిలములగుటచే ధర్మము మిక్కిలి చలించిపోవును. అపుడు విశాలమై గొప్పనైన భూదేవి స్వల్పఫలమిచ్చునదిగా నగును. కలియుగమురాగానే శూద్రులు తపము జేయుదురు. త్రేతాయుగమున సంవత్సరకాలముండు ధర్మము ద్వాపరయుగమున నెలవరకుండుధర్మము. అది కలియుగమున ఒక దినపు ధర్మమగును. కాని యది (కాలప్రభావమున్న) ఒక దినముకన్న మించిపోవును. కలియుగములలో ప్రజలను రక్షింపని వారై రాజుల ప్రజలిచ్చిన పన్నులనుహరించి వారై రాజులు ప్రజలిచ్చిన పన్నులను హరించి స్వరక్షణ పరాయణులగుదురు. కలియుగమున క్షత్రియులు గాని వారు రాజులగుదురు. వైశ్యులు శూద్రులనాశ్రయించి జీవింతరురు. సమస్త బ్రాహ్మణులును. శూద్రులకు నమస్కరించు వారగుదురు. ఈ కలియుగమున  ఒక్క స్త్రీకి పెక్కురు పతులుందురు. కలియుగము చివరదేవుడు(వరుణుడు) చిత్రముగా వర్షించును. కలియుగమున నందరు వ్యాపారము జేయువారు గూడనగుదురు. మిక్కిలి మోసపు కొలతలచే సరకుల నమ్ముదురు. కలియుగము వచ్చినపుడు నాట్యచర్యవ్యాపించును. వ్యర్థరూపము(వేషము)లు గలిగిన వేదబాహ్యులచే నావరింపబడును. పురుషులల్పమై స్త్రీలధికమై యుండును. లోకము బహుభిక్షుకులతో నిండిపోవును. పరస్పరముగా జనము మాంసభక్షకమై క్రూరవాక్కుగలదై, కుటిలమై, అసూయగలదై యగును-53. చేసిన (చెడు) పనికి ప్రతి కర్తయుండకుండుటచే లోకము క్షీణించును. పతితుడైనను శంకించదు-ఇది కలియుగలక్షణముభూమి నరులు లేక శూన్యమగును. ఇచట దేశములలోను, నగరములలోను మండలములు ఏర్పడును. భూమి అల్పజలముగలదై యల్పఫలమునిచ్చున దగును. రక్షించువారు రక్షింపని వారై శాసనము లేక ప్రభువులగుదురు. జనులు పరుల రత్నములను హరించు వారును. పరస్త్రీలను జెఱచువారును, కాముకులను, దురాత్ములును, ఆధర్మమువలన సాహసప్రియులును అగుదురు కలియుగమున నష్టచేతనులుగాని పురుషులు, విదిలించిన వెంట్రుకలుగలపిలకజుట్టులు, పది హేనేండ్లవయస్సుగల వారునునై ప్రజలుజన్మింతురు కలియుగము వచ్చినపుడు శూద్రులు తెల్లని శుభ్రమై దంతములుగల వారును, ఇంద్రియములను జయించిన వారును, తలగోరగించుకొన్నవారును, కాషాయవస్త్రములు ధరించిన వారునునై ధర్మము నాచరింతురు. పంటలు దొంగిలించువారు పుట్టగలరు. అట్లే బట్టల నూడదీయువారును బుట్టగలరు. దొంగలనపహరించు దొంగలు, అపహరించు వారినే అపహరించు వారును గలుగగలరు. జ్ఞానకర్మ నశింపగా లోకము నీప్రియముగా పురుగులు, ఎలుకలు, సర్పములును, మానవులను మట్టుబెట్టగలవు. సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సామర్థ్యము-ఇవి దుర్బలమగును.ఆకలిభయములతో పీడింపబడిన దేశములలో గుడ్లగూబలు వికసించును. దుఃఖములతో నావరింపబడిన వారికి పరమాయువు నూరేండ్లు మాత్రమే యుండును. కలియుగమున సమస్తవేదములను కనబడికనబడకుండ పోవును. అట్లే యజ్ఞములు కేవలమధర్మంచే పీడింపబడినవై నశించును. కాపాలికులు కాషాయవస్త్రములు ధరించిగ్రంథములు లేని వారగుదురు-64. వేదబాహ్యులైన యితరులు వర్ణాశ్రమములకు శత్రువులగుదు. కొందఱు వేదములనమ్ముదురు. మణికొందఱు తీర్థ(ప్రవిత్రదేవాలయాది) స్థలములను అమ్ముదురు-65. కలియుగమురాగానే పై విధములైన జనులు పుట్టుదురు. వేదములను జదువరు. శూద్రులు ధర్మార్థములలో పండితులగుదుర. శూద్రజన్ములైన రాజులు అశ్వమేధయాగము జేయరు. ప్రజలు స్త్రీవధను, గోవధను జేసి పరస్పరము జంపుకొందురు. ప్రజలు ఒండొరులజంపుకొని పోవుదుర. దుఃఖప్రచారమువలన అల్పాయువు, దేశనాశము, రోగములతో నిండియుండుట, మోహము, బాధ, అట్లే అసౌఖ్యము తామసప్రవృత్తి-ఇవి కలియుగమున నుండునని చెప్పబడినది. ప్రజయంతయు భ్రూణహత్యలకు బూనుకొనును. కావున కలియుగముననున్న వారికి ఆయువు, బలము, రూపము విశేషముగ క్షీణించును. దుఃఖమావరించిన మానవులకు పరమాయువు నూరేండ్లు కలియుగమున వేదములన్నియు కనబడియు కనబడవు. యజ్ఞములు కేవలము ధర్మపీడితములై నశించును. కలియుగకాలమున మానవులు అల్పకాలముననే సిద్ధినిబొందుదురు.కలియుగాంతమునబ్రాహ్మణసజ్జనోత్తములుధన్యులై చరింతురు. వారు శ్రుతిస్మృతులు చెప్పిన ధర్మమున నసూయలేకనడుచుకొందురు. త్రేతా యుగమున సంవత్సరమాచరించు ధర్మము ద్వాపరమున నొక నెలలో నాచరింపబడినది. కలియుగమున దానిన తనశక్త్యానుసారము ఒక దినముననాచరించి ఫలమునందును

ఏషా కలియుగేఽవస్థా సంధ్యాంశం తు నిబోధ మే

యుగే యుగే తు హీయన్తే త్రీంస్త్రీన్ పాదాంశ్చ సిద్ధయః

యుగప్రభావాత్ సంధ్యాస్తు తిష్ఠాన్తీమాస్తు పాదశః

 సంధ్యా స్వభావాచ్చాంశేషు పాదశస్తే ప్రతిష్ఠితాః

ఏవం సంధ్యాంశకే కాలే సంప్రాప్తే తు యుగాంతికే

తేషాం శాస్తాహ్యసాధూనాం భృగూణాం నిధనోత్థితః

 గోత్రేణ వై చంద్రమసో నామ్నా ప్రమతిరుచ్యతే

 మాధవస్య తు సోఽ శేన పూర్వం స్వాయంభువే ఽతరే

 సమాః సవింశతింపూర్ణాః పర్యటన్ వై వసుంధరామ్

ఆచకర్ష స వై సేనాం సవాజిరథ కుంజరామ్

ప్రగృహీతా యుధైర్విప్రైః శతశోఽథ సహస్రశః

 స తదా తైః పరివృతో మ్లేచ్చాన్ హన్తి సహస్రశః

స హత్వా సర్వగశ్చైవ రాజ్ఞస్తాన్ శూద్రయోనిజాన్

పాషండాన్ స తతః సర్వాన్ నిః శేషాన్ కృతవాన్ ప్రభుః

 నాత్యర్థం ధార్మికా యే చ తాన్ సర్వాన్ హంతి సర్వశః

 వర్ణవ్యత్యాస జాతాంశ్చ యే చ తానుపజీవినః

 ఉదీచ్యాన్మధ్యదేశాంశ్చ పార్వతీయాంస్తథైవ చ

 ప్రాచ్యాన్ ప్రతీచ్యాంశ్చ తథా విద్యపృష్ఠా పరాంతికాన్

 తథైవ దాక్షిణాత్యాంశ్చ ద్రవిడాన్ సింహలైః సహ

గాంధారాన్ పారదాంశ్చైవ పహ్నవాన్ యవనాం స్తథా

 తుషారాన్ బర్బరాం శ్రీనాన్ శూలికాన్ దరదాన్ ఖసాన్

 లంపాకానథకేతాంశ్చ కిరాతానాం చ జాతయః

 ప్రవృత్త చక్రో బలవాన్ మ్లేచ్ఛానామంతకృద్విభుః

అధృష్యః సర్వభూతానాం చచారాథ వసుంధరామ్

 మాధవస్య తు సోఽశేన దేవస్య హి విజజ్ఞివాన్

 పూర్వజన్మ విధిజ్ఞైశ్చ ప్రమతిర్నామ వీర్యవాన్

గోత్రేణ వై చంద్రమసః పూర్వే కలియుగే ప్రభుః

 ద్వాత్రింశేఽ భ్యుదితే వర్షే వ్రక్రాంతే వింశతింసమాః

 వినిఘ్నన్ సర్వభూతాని మానవాని సహస్రశః

 కృత్వా వీర్యావశేషాం తు పృథ్వీం రూఢేన కర్మణా

పరస్పరనమిత్తేన కోపేనాకస్మికేన తు

 స సాధయిత్వా వృషలాన్ ప్రాయశస్తాన ధార్మికాన్

 గంగా యమునయోర్మధ్యే నిష్ఠాం ప్రాప్తిః సహానుగః

 తతో వ్యతీతే తస్మింస్తు అమాత్యే సత్యసైనికే

 ఉత్సాద్య పార్ధివాన్ సర్వాన్ మ్లేచ్ఛాంశ్చైవ సహస్రశః

 తత్ర సంధ్యాంశకేకాలే సంప్రాప్తే తు యుగాంతికే

 స్థితా స్వల్పావశిష్టాసు ప్రజాస్విహ క్వచిత్ క్వచిత్

అప్రగ్రహాస్తత స్తాపై లోకచేష్టాస్తు వృందశః

 ఉపహింసంతి చాన్యోన్యం ప్రపద్యంతే పరస్పరమ్

అరాజకే యుగవశాత్ సంశయే సముపస్థితే

 ప్రజాస్తావై తతః సర్వాః పరస్పర భయార్దితాః

వ్యాకులాశ్చ పరిశ్రాంతాస్త్యక్త్యాచారాన్ గృహాణి చ

 స్వాన్ ప్రాణాన్ సమవేక్షంతో నిష్ఠాం ప్రాప్తాః సుదుఃఖితాః

నష్టే శ్రౌతే స్మృతే ధర్మే పరస్పరహతాస్తదా

 నిర్మర్యాదా నిరాక్రందా నిఃస్నేహా నిరపత్రపాః

 నష్టే వర్షే ప్రతిహతాః హ్రస్వకాః పంచవింశకాః

 హిత్వా దారాశ్చ పుత్రాంశ్చ విషాద వ్యాకులేంద్రియాః

 అనావృష్టిహతాశ్చైవ వార్తాముత్సృజ్య దుఃఖితాః

 ప్రత్యరతాస్తాన్నివేషన్తే హిత్వా జనపదాన్ స్వకాన్

 సరితః సాగరాన్ కూపాన్ సేవంతే పర్వతాం స్తదా

మధుమాంసై ర్మూలఫలైర్వర్తయంతి సుదుఃఖితాః

చీర వస్త్రాజినధరానిష్పత్రానిష్పరిగ్రహాః

వర్ణాశ్రమపరిభ్రష్ఠాః సంకరం ఘోరమాస్థితాః

ఏతాః కాష్టామనుప్రాప్తా అల్పశేషా స్తదా ప్రజాః

జరావ్యాధిక్షుధావిష్టాదుఃఖాన్ నిర్వేదమాగమన్

విచారణం తు నిర్వేదాత్ సామ్యావస్థా విచారణాత్

సామ్యావస్థా సుసంబోధః సంబోధాద్దర్మ శీలతా

 తాసూపగమయుక్తా సుకలిశిస్టాసు వై స్వయమ్

 అహోరాత్రం తదా తాసాం యుగం తు పరివర్తతే

చిత్త సంమోహనం కృత్వా తాసాం తైః సప్తమం తుతత్

 భావినోఽర్థస్య చ బలాత్ తతః కృతమవర్తత

ఇది కలియుగము యొక్క స్థితి. ఇక సంధ్యాంశమును గూర్చి నావల్ల వినుడు, యుగయుగమున సిద్దులు మూడు మూడు పాదములను 1/4 భాగము పోగొట్టుకొనును- యుగప్రభావమువలన నీ పాదములు పాదపాదముగనుండును. సంధ్యాస్వభావము వలన అంశములందు అవి సంధ్య: పాదములుగా నిలిచియుండును. కలియుగమున నీ విధముగా సంధ్యాంశకాలము రాగా భృగువంశీయుల మరణమున బుట్టిన వాడును-75. యసాధువులను శాసించు వాడును చంద్రుని గోత్రమునకు సంబంధించిన వాడును పేరున ప్రమతి యని పిలువబడును. ఆతడు పూర్వము స్వాయంభువమన్వంతరమున మాధవుని యంశమున బుట్టినవాడు. ఆతడిరువది నిండు సంవత్సరములు భూమిని దీరుగుచు గుజ్జములు రథములు, ఏనుగలును గల సేననాకర్షించెను (కూర్చెను) విశేషముగా నాయుధములను గ్రహించిన నూర్ల కొలది వేలకొలది బ్రాహ్మణుల (ద్విజు)లచే నెల్లప్పుడును జుట్టబడిన వాడై యతడు (ప్రమతి), వేలకొలది మ్లేచ్చులను జంపును. ఆ ప్రభువు అంతటనుండువాడై శూద్రజన్ములైన యా రాజులను జంపి, తరువాత వేదబాహ్యుల నందరినీ తుదముట్టించేను మిక్కిలి ధార్మికులు గాని వారిని గూడ నంతట జంపును. వర్ణవ్యత్యాసమువలన బుట్టిన వారిని, వారిననుసరించి జీవించు వారిని అంతట జంపివేయును. ఉత్తర దేశములను, మధ్యదేశములను, పర్వత ప్రాంతములను, అట్లే తూర్పుదేశములను, పశ్చిమ దేశములను వింధ్యవెనుకటి యపరాంతిక దేశములను. దాక్షిణాత్య దేశములను, సింహళములతో బాటు ద్రవిడ దేశములను, గాంధార దేశములను పారద దేశములను, పహావ దేశములను, యవన దేశములను. తుషార దేశములను, బర్బర దేశములను, చీన దేశములను శూలికదేశములను, దరదదేశములను, ఖసదేశములను, లంపాకదేశములను-వీనిలోని ప్రజలను కేతులను కిరాతజాతులను గూర్చుకొని వీరితో రాజ్యచక్రము నేర్పరచుకొని (చక్రవర్తి) మ్లేచ్చులను జంపి ప్రభువై, సర్వప్రాణులకజేయుడై భూమిని దిరిగెను. ఆతడు దేవుడైన విష్ణువు యొక్క యంశమున బుట్టిన వాడు. పూర్వజన్మవిధులను దెలిసినవారిచే వీర్యవంతుడైన ప్రమతియనియు, చంద్రవంశ(గోత్ర)జుడైన ప్రభువనియు బిలువ బడెను. ముప్పదిరెండేండ్ల అభ్యుదయవర్షము ప్రారంభముగాగా, ఇరువదియేండ్లు. సర్వప్రాణులను వేలకొలది మానవులను జంపుచు తన రూఢమైన కర్మచే భూమిని తనపరాక్రమము మాత్రమే మిగిలినదానిగా జేసెను. పరస్పరనిమిత్తకమైన యాకస్మికకోపముచేతను. సామాన్యముగాన ధార్మికులైన నీచులగు శూద్రులను సాధించెను. (వశము జేసికొనెను) తరువాత గంగాయమునల మధ్యమున తన సేవకులతో గూడి నిష్ఠను (సమాధిని) బొందెను. అంత, సమస్తరాజులను, వేలకొలది మేచ్చులను పెణికివైచి సత్యసైనికుడైన యాయమాత్యుడు (రాజును) గడచిపోయెను. అచట కలియుగమున సంధ్యాంశకాలమురాగా ఇచ్చటచట ప్రజలు అల్పావిశిష్టు(కొద్దిగా మిగిలినవారు)లైరపగ్గములులేని వారై గుంపులు గుంపులుగా లోకచేష్టలు చేయువారై పరస్పరము హింసించుకొనుచుండిరి. రక్షణము గోరుచుండిరి. (కలి) యుగవశమున అరాజకము వచ్చి జీవితసంశయమేర్పడినది. ఆ సమస్త ప్రజలు పరస్పరభయములచే పీడింపబడిరి. వారు భార్యలను ఇండ్లను వదిలి వ్యాకులులై యలిసిపోయిరి. తమ ప్రాణములను జూచుకొనుచు మిక్కిలిదు:ఖితులై చేటును బొందిరి. శ్రుతిస్మృతులు జెప్పిన ధర్మము నశించినది. అపుడు మర్యాద, పిలుపు, స్నేహము, సిగ్గు, ఇవి యేమియు లేని వారైరి. వర్షము నష్టము గాగా కొట్టబడిన వారై హ్రస్వకులు (పొట్టివారును) పంచవింశలు కులనునైరి. భార్యాపుత్రులను వదలి దుఃఖముతో కలత జెందిన యింద్రియములు గలవారైరి. (సర్వేంద్రియములు దెబ్బతినినవి). వర్షము లేమిచే జచ్చిరి. జీవనవృత్తులువదిలి దుః:ఖితులైరి. తమపల్లెలను వదలి సమీపములోని నగరదేశములను సేవించిరి-96. అపుడు జనులు నదులను, సముద్రములను, బావులను, పర్వతములను జేరిరి. మిక్కిలి దుఃఖించిన వారై మధుమాంసములతోను, మూల ఫలములతోను, జీవించుచుండిరి. నారచీరలను చర్మములను ధరించిరి. వారికి ఆకులు గూడ లభించలేదు. ఏదానములు గూడ లేవు. వర్ణాశ్రమములనుండి భ్రష్టులై ఘోరమైన సంకరమునొందిరి. ప్రజలీ దశకు జేరి కొద్ది మాత్రమే మిగిలిరి. ముసలితనము వ్యాధి ఆకలి వీనిచే నలమటించి దుఃఖమును వైరాగ్యమును బొందిరి. నిర్వేదము నుండి విచారణమును, విచారణమునుండి సామ్యావస్థను, సామ్యావస్థలలో సంబోధము(జ్ఞానము)ను, సంబోధమునుండి ధర్మశీలతను మానవుడు పొందును-. కలి శిష్టములైన పైనిజెప్పబడినవి. రాత్రింబవళ్లు ఉపగమము (అంగీకారము)తో గూడిన వైనపుడు వానియొక్కయుగము మారును. వానికి (నిర్వేదఽ విచారణ 3 సామ్య 4 సంబోధ 5 ధర్మశీలత 6 ఉపగమము) ఏడవదిగా చిత్తసంమోహనమును గూర్చి రాబోవు ఆర్థము యొక్కబలమువలన తరువాత కృతయుగమేర్పడెను.

ప్రవృత్తే తు పునస్తస్మిన్ తతః కృతయుగే తు వై

 ఉత్పన్నాః కలిశిష్టాస్తుకార్తయుగ్యః ప్రజాస్తదా

తిష్టింతి చేహ యే సిద్ధాః సుదృష్టా విచరన్తి చ

 సదా సప్తర్షయశ్చైవ తత్ర తే చ వ్యవస్థితాః

 బ్రహ్మక్షత్రవిశః శూద్రాః బీజార్థం యే స్మృతా ఇహ

 కలిజైః సహతే సర్వే నిర్విశేషా స్తదాభవన్

తేషాం సప్తర్షయో ధర్మం కథయంతీతరేషు చ

 వర్ణాశ్రామాచారయుక్తః శ్రౌతః స్మార్తోద్విధాతు సః

 తతస్తేషు క్రియావత్సు వర్తంతే వై ప్రజాః కృతే

 శ్రౌతః స్మార్త కృతానాం తు ధర్మః సప్తర్షిదర్శిత

 తాసు ధర్మవ్యవస్థార్థం తిష్ఠంతీహ యుగే క్షయాత్

మన్వంతరాధికారేషు తిష్ఠంతి మునయస్తు వై

తరువాత మరల కృతయుగము ప్రవర్తిల్లగనే కలియుగమున మిగిలిన వారు కృతయుగపు వారుగా ప్రజలు పుట్టిరి. ఇచట సిద్దులుగా నున్న వారును చక్కగా గనబడి తిరుగుచుండిరి. ఆ సప్తర్షులు గూడనచట చక్కగా నివసించియుండిర. ఇచట బీజప్రాయులుగా జెప్పబడిన బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులు కలిలోబుట్టినవారును అప్పుడు సమానముగా నుండిరి. సప్తర్షులు వారి యొక్కధర్మమును ఇతరుల విషయమున గూడ చెప్పుచుండిరి. వర్ణాశ్రమాచారయుక్తుడు శ్రాతుడనియు స్మార్తుడనియు రెండువిధములు. తజువాత, కృతయుగమున ఆక్రియావంతులలో ప్రజలుండిరి. శ్రాతస్మార్త క్రియలు కృతములైనందున కృతయుగమును పేరువచ్చినది.) కృతయుగపువారికి శ్రాతము (వేదోక్తము) స్మార్తము (స్మృతులలో జెప్పబడినది)అయిన ధర్మము సప్తర్షులచే జెప్పబడినది. (శుతి స్మృత్యుక్త ధర్మమే కృతయుగధర్మము). ప్రజలలో నాధర్మమును వ్యవస్థాపించుటకై మునులు యుగాంతమువరకు మన్వంతరాధికారములలోనుండిరి.

యథా దావప్రదగ్ధేషు తృణేష్యిహ తపే ఋతౌ

నవానాం ప్రథమం దృష్టస్తేషాం మూలే తు సంభవః

ఏవం యుగాద్యుగ సేహ సంతానస్తు పరస్పరమ్

 వర్తతే హ్యవ్యవచ్ఛేదాద్యావన్మన్వంత రక్షయః

సుఖమాయుర్బలం రూపం ధర్మార్థౌ కామ ఏవ చ

 యుగే ష్వేతాని హీయన్తే త్రీణి పాదక్రమేణ తు

 ససంధ్యంశేషు హీయంతే యుగానాం ధర్మసిద్ధయః

 ఇత్యేషప్రతిసంధిర్వః కీర్తితస్తు మయా ద్విజాః

ఈ లోకమున వేసంగిలో (ఎండకాలములో) కారు చిచ్చుతో భూమి పైన గడ్డియంతయు తగులబడి పోవును. మరల వర్షకాలమున మొదట నా కాలిన గడ్డి మూలముననే క్రొత్త గడ్డి మొలకలు పుట్టును. అట్లే యుగమునుండి యుగమునకు ఎడతెగకుండగ మన్వంతరక్షయమగువలకు పరస్పరము సంతాన సంక్రమము జరుగుచుండును. సుఖము ఆయువు- బలము-రూపము-ధర్మము-అర్థము-కామములును- ఈ మూడును యుగములలో పాదక్రమముగా క్షీణించును. యుగములయొక్క ధర్మసిద్దులు సంధ్యంశలలో క్షీణించును. ఓ ద్వీజులారా! ఈ విధముగా మీకు ప్రతిసంధి చెప్పబడినది.

చతుర్యుగానాం సర్వేషామేతే నైవ ప్రసాధనమ్

ఏషా చతుర్యుగావృత్తిరా సహస్రాత్ప్రవర్తతే

బ్రహ్మణస్తదహః ప్రోక్తం రాత్రిశ్చ తావతీ స్మృతా

అత్రార్జవం జడీభావో భూతానామాయుగ క్షయాత్

 ఏతదేవ తు సర్వేషాం యుగానాం లక్షణం స్మృతమ్

 ఏషా చతుర్యుగానాం తు గణనా హ్యేకసప్తతిః

క్రమేణ పరివృత్తా తు మనోరంతర ముచ్యతే

 చతుర్యుగే తథైకస్మిన్ భవతీహ యథా శ్రుతమ్

 తథాచాన్యేషు భవతి పునస్తద్వై యథాక్రమమ్

సర్గే సర్గేయథా భేదా ఉత్పద్యంతే తథైవ తు

 పంచవింశత్పరిమితా న న్యూనా నాథికాస్తథా

 తాధి కల్పయుగైః సార్థం భవంతి సమలక్షణాః

మన్వంతరాణాం సర్వేషామేతదేవ తు లక్షణమ్

 తథా యుగానాం పరివర్తనాని చిరప్రవృత్తాని యుగస్వభావాత్

 తథా న తిష్ఠతి జీవలోకః క్షయో దయాభ్యాం పరివర్తమానః 

ఇత్యేతల్లక్షణం ప్రోక్తం యుగానాం వై సమాసతః

అతీతానాగతానాం వై సర్వమన్వంతరేష్విహ

అనాగతేషు తద్వచ్చ తర్కః కార్యో విజానత

మన్వంతరేషు సర్వేషు అతీతానాగతేష్విహ

 మన్వంతరేణ చైకేన సర్వాణ్యేవాంతరాణి వై

వ్యాఖ్యాతాని విజానీధ్వం కల్పే కల్పే న చైవ హి

అస్యాభిమానినః సర్వే నామరూపైర్భవంత్యుత

 దేవాహ్యష్టవిధా యే చ ఇహమన్వంతరేశ్వరాః

 ఋషయో మనవశ్చైవ సర్వే తుల్యాః ప్రయోజనైః

ఏవం వర్ణాశ్రమాణాం తు ప్రవిభాగో యుగే యుగే

యుగస్వభావాచ్చ తథా విధత్తే వై సదా ప్రభుః

 వర్ణాశ్రమవిభాగశ్చ యుగాని యుగసిద్ధయే

 ఆనుషంగః సమాఖ్యాతః సృష్టిసర్గన్ని బోధత

 విస్తరేణానుపూర్యా చ స్థితిం వక్షే యుగేష్విహ

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే చతుర్యుగాఖ్యానం నామాష్టపంచాశోఽధ్యాయః

పై జెప్పిన లక్షణములతోనే నాలుగు యుగములయన్నింటి యొక్క క్రమనిర్మాణము. ఈ నాలుగు యుగముల యావృత్తి వేయి వజకు జరుగుచుండును-. ఆ వేయి యుగములు బ్రహ్మకొక పగలు. అట్టిమరొక వేయియుగములు బ్రహ్మ యొక్క రాత్రియనబడినది. ఇదియే సమస్తయుగములకు లక్షణము. ఈ నాలుగు యుగములు డెబ్బదియొక్క మారులు తిరిగినచో మన్వంతరమనబడును. నాలుగుయుగములలో (ప్రతి) ఒకదాని యందు పూర్వము విన్నవిధముగ జరుగును. అట్లే అన్ని చతుర్యుగములలో గూడ వరుసగా ప్రతియుగము జరుగును. ప్రతి సర్గమున (సృష్టియందు) భేదములుత్పన్నమైన విధముననే (యుగములు) యిరువదియైదు విధములు. అంతకు తక్కువగాని యెక్కువగాని లేవు. అట్లే కల్పయుగములతో గూడ సమాన లక్షణములు గలవగును. సమస్తమన్వంతరమున కిదియే లక్షణము. అట్లే యుగస్వభావము వలన పరివర్తనములు చాలకాలము నుండియే జరిగినవి. ఆ విధముగా జీవలోకము క్షయ - అభివృద్ధులతో దిరుగుచునుండదు-119. అని యీవిధముగా సంగ్రహముగా నిచట మన్వంతరములలో భూత-భవిష్యద్యుగముల లక్షణము చెప్పబడినది. ఆ విధముగనే విజ్ఞాని భవిష్యద్యుగముల విషయమై తరింపవలెను. సమస్తమన్వంతరములోను భూతభవిష్యద్యుగములను గూర్చి యూహింపవలెను. ప్రతి కల్పమునను ఒక్కమన్వంతర (వివరణ)ముతో సమస్తమన్వంతరములు వివరింపబడినట్లు తెలియవలెను. నామరూపములతో నందరు ఈయుగాభిమానులగుదురు. ఇచటనెనిమిది విధములైన దేవతలు మన్వంతరాధిపులు.. ప్రయోజనములతో ఋషులు, మనువులు. అందజును సమానులే. ఈ విధముగ యుగయుగమున వర్ణాశ్రమములవిభాగము. ప్రభువెల్లప్పుడు యుగస్వభాగమును జేయును (ఈ విధముగ అనుషంగము చెప్పబడినది. సృష్టిసర్గమును వినుడు. ఇచట ఆనుపూర్వితో విస్తరముగా యుగములలోని స్థితిని జెప్పెదను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున చతుర్యుగాఖ్యానమను నేబదియెనిమిదవ యధ్యాయము.