వాయు మహా పురాణము
57 - యజ్ఞప్రవర్తనం
ఋషయ ఉవాచ:-
చతుర్యుగాని యాన్యాసన్ పూర్వం స్వాయంభువేఽన్తరే ।
తేషాం నిసర్గం తత్త్వం చ శ్రోతుమిచ్ఛామి విస్తరాత్ ॥
సూత ఉవాచ:-
పృథివ్యాది ప్రసంగేన యన్మయా ప్రాగుదాహృతమ్ ।
తేషాం చతుర్యుగం హ్యేతత్ ప్రవక్ష్యామి నిబోధత ॥
సంఖ్య యే హ ప్రసంఖ్యాయ విస్తరాచైవ సర్వశః ।
యుగం చ యుగభేదం చ యుగధర్మం తథైవ చ॥
యుగ సంధ్యంశకం చైవ యుగసంధానమేవ చ ।
షట్ప్రకారయుగాఖ్యానాం ప్రవక్ష్యామీహ తత్త్వతః ॥
లౌకికేన ప్రమాణేన విబుద్ధోబ్దస్తు మానుషః ।
తేనాబ్దేన ప్రసంఖ్యాయ వక్ష్యామీహ చతుర్యుగమ్ ॥
ఋషులనిరి:- పూర్వము స్వాయంభువ మన్వంతరముననున్న నాలుగు యుగములను వాని స్వభావమును తత్యమును విస్తరముగా వినదలచితిమి.
సూతుడనెను:- పృథివి మొదలగువాని ప్రసంగమున నేను పూర్వము చెప్పినవారి చతుర్యుగమిది. దానిని జెప్పెదను వినుడు. ఇచట విస్తారముగా నంతట సంఖ్యచే చక్కగా లెక్కించి, యుగము, యుగభేదము, యుగధర్మము, యుగాంశకము, సంధ్యాంశకము, యుగసంధానము - అను నాజు విధముల యుగనామములను వాని తత్యములతో నిటజెప్పెదను. లౌకిక ప్రమాణముతో తెలియబడిన సంవత్సరము మానుషము. ఆ సంవత్సరముతో లెక్కించి యిచట చతుర్యుగమును జెప్పెదను.
నిమేషకాలః కాష్ఠా చ కలాశ్చాపి ముహూర్తకాః ।
నిమేషకాలతుల్యం హి విద్యాల్లఘ్వక్షరం చ యత్॥
కాష్టానిమేషాదశపంచచైవ త్రింశచ్చకాష్ఠా గణయేత్కలాస్తాః ।
త్రిశంత్కలాశ్చైవ భవేన్ముహూర్తాస్త త్రింశతారత్య్రహనీ సమేతే॥
అహోరాత్రౌ విభజతే సూర్యోమానుషదైవికే ।
తత్రాహః కర్మచేష్టాయాం రాత్రిః స్వప్నాయ కల్ప్యతే॥
పిత్య్రౌ రాత్య్రహనీ మాసః ప్రవిభాగస్తయోః పునః ।
కృష్ణపక్ష స్వహస్తేషాం శుక్లః స్వప్నాయ శర్వరీ॥
త్రింశచ్చ మానుషా మాసాః ప్రిత్య్రోమాసశ్చ స స్మృతః ।
శతాని త్రీణి మాసానాం షష్ట్యాచాప్యధికాని వై॥
పిత్య్రః సంవత్సరో హ్యేష మాను షేణ విభావ్యతే॥
మానుషేణైవ మానేన వర్షాణాం యచ్ఛతం భవేత్ ।
పితౄణాం త్రీణి వర్షాణి సంఖ్యాతానీహతాని వై ॥
చత్వారశ్చాధికా మాసాః పిత్రే చైవ హి కీర్తితాః ॥
లౌకికే నైవ మానేన అబ్దో యో మానుషః స్మృతః ॥
ఏతద్దివ్యమహారాత్రః శాస్త్రే ఽస్మినిశ్చయో మతః।
దివ్య రాత్య్రహనీ వర్షం ప్రవిభాగస్తయోః పునః ॥
అహ స్తత్రో దగయనం రాత్రిః స్యాద్దక్షినాయనమ్॥
యే తే రాత్య్రహనీ దివ్యే ప్రసంఖ్యా తే తయోః పునః ।
త్రింశచ్చతాని వర్షాని దివ్యో మాసస్తు స్మృతః॥
మానుషం చ శతం దిద్ధి దివ్యమాసాస్త్రయస్తు తే ।
దశ చైవ తథాహని దివ్యో హ్యేష విధిః స్మృతః॥
త్రీణి వర్షశతాన్యేన షష్ఠి వర్షాణి యాని చ ।
దివ్య సంవత్సరో హ్యేష మానుషేణ ప్రకీర్తితః॥
త్రీణి వర్ష సహస్రాణి మానుషేణ ప్రమాణతః ।
త్రిశంద్యాని తు వర్షాణి మతః సప్తర్షివత్సరః॥
నవ యాని సహస్రాణి వర్షాణాం మానుషాని తు ।
అన్యాని నవతిశ్చైవ క్రౌంచః సంవత్సరః స్మృతః॥
త్రీణ్యేవ నియుతాన్యేవ వర్షాణాం మానుషాణి చ ।
షష్టిశ్చైవ సహస్రాణి సంఖ్యాతాని తు సంఖ్యయా ॥
దీవ్యవర్షసహస్రం తు ప్రాహుః సంఖ్యావిదో జనాః ॥
ఇత్యేవమృషిభిర్గీతం దివ్యయా సంఖ్యయాన్వితమ్ ।
దివ్యే నైవ ప్రమాణీన యుగసంఖ్యా ప్రకల్పకమ్॥
నిమేషకాలము (కనురెప్పపాటు కాలము) కాష్ఠ, కళలు, ముహూర్తకములు ఇవి కాలగణనలో కొన్ని (ఏకమాత్రకమై హ్రస్వమైన) లఘ్వక్షరము నిమేషకాల తుల్యమైనది-6. పదియైదు నిముషములు కాష్ఠ ముప్పది కాష్ఠలు కళయని లెక్కింపవలె. ముప్పది ముహూర్తములు ఒక రాత్రి పగలు గలిగినదియు. సూర్యుడు అహోరాత్రములను మానుషములు దైవికములు అని రెండు విధములుగా విభజించును. అందులో పనిచేతలందు అహస్సు, పడుకొనుటకురాత్రియు కల్పింపబడుచున్నవి. పితరుల రాత్రీ పగలు గలిసిన దినము మానవుల ఒక మాసము ఆ రాత్రి పగలు విభాగము మానవుల కృష్ణ పక్షము పితరులకు ఒక పగలు, అట్లే శుక్లపక్షము వారికి పడుకొనుటకు రాత్రి. ముప్పది మానుష మాసములు పితరులకు ఒక్క మాసము. మూడు వందల యజువది మానుష మాసములు ఒక పితరుల సంవత్సరము. మానుష మాసమున నూరేండ్లు పిత్సమాసమున నీట మూడేండ్లుగా లెక్కింపబడినవి. పిత్స మానమున నాలుగు మాసములధికములనబడినవి. లౌకిక మానమున మానుషమైన సంవత్సరము దేవా మానమున ఒక రాత్రి పగలు కలసినదినము. ఈ శాస్త్రమున నిశ్చయమీష్టము . దేవతల రాత్రి పగళ్ళు, వర్షము మరి వారియొక్క విభాగమిట్లుండును. పైజెప్పబడిన దేవతల రాత్రి పగళ్ళలో ఉత్తరాయణము పగలు దక్షిణాయనము రాత్రియు నగును. ఆ ముప్పది మాసములు దేవతల మాసమనబడినది. నూరు మానుష మాసములు మూడు దివ్యమాసములు మరియు పది దినములును. ఇది దివ్యవిధి యనబడినది. మూడువందల యజువదియేండ్లు దివ్య సంవత్సరము. ఇది మానుష మానముతో జెప్ప బడినది, మానుష మానముతో మూడువేల ముప్పది' వర్షములు సప్తర్షుల సంవత్సరము. మానుషములైన తొమ్మిదివేల తొంబదియేండ్లు క్రౌంచ సంవత్సరమనబడును. మానుషమానముతో ముప్పదియారువేల వత్సరములు దివ్యములైన నూరు సంవత్సరములు ఇది దివ్యవిధియనబడినది. మూడు మానవుల మాసములు లెక్కించిన నియుత (లక్ష) సంవత్సరములు మరియు అరువదివేల సంవత్సరములు (60,000) దేవమానమున వేయిసంవత్సరములని సంఖ్యాధులైన జనులు చెప్పుదురు. ఈ విధముగ దేవమానసంఖ్యతోగూడినది ఋషులతో జెప్పబడినది. యుగ సంఖ్యా ప్రకల్పనముగూడ దేవమానముతోనే చూడవలెను.
చత్వారి భారతే వర్షేయుగాని కవయో విదుః ।
పూర్వం కృతయుగం నామ తతస్త్రేతా విధీయతే॥
ద్వాపరశ్చ కలిశ్చైవ యుగాన్యేతాని కల్పయేత్॥
చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం తు కృతం యుగమ్ ।
తత్ర తావచ్ఛతీ సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః ॥
ఇతరాసు చ సంధ్యాసు సంధ్యాంశేషు చ వైత్రిషు ।
ఏకపాయేవ వర్తంతే సహస్రాణి శతాని చ ॥
త్రేతా త్రీణి సహస్రాణి సంఖ్యైవ పరికీర్త్యతే ।
తస్యాస్తు త్రిశతీ సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః॥
ద్వాపరం ద్వే సహస్రే తు యుగమాహుర్మనీషిణః ।
తస్యాపిద్విశతీ సంధ్యా సంధ్యాంశః సంధ్యయా సమః ॥
కలివర్ష సహస్రం తు యుగమాహుర్మనీషిణః ।
తస్యాప్యేకశతో సంధ్యా సంధ్యాంశః సంధ్యయా సమః॥
ఏషా ద్వాదశ సాహస్రీ యుగసంఖ్యా ప్రకీర్తితా ।
కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చైవ చతుష్టయమ్॥
భారత వర్షమున యుగములు నాలుగని కవులు (పండితులు) తెలియుదురు. మొదట కృతయుగము తరువాత త్రేతాయుగమనబడినది. ద్వాపరము కలియునని యీ యుగముల కల్పింపవలెను. నాలుగువేల సంవత్సరములు కృతయుగమందురు. అచట నైతే సంధ్య(లు) నూరే సంధ్యాంశములు నట్లే (నూరి). ఇతర సంధ్యలలోను మూడు సంధ్యాంశముల లోను ఒకటి తక్కువ వేయి నూరు (1099) ఉండును. త్రేతాయుగము మూడు వేలయేండ్లు అని సంఖ్య చెప్పబడినది. దానికి మూడు వందల సంధ్యలు సంధ్యాంశములు నంతియ (300). ద్వాపర యుగము రెండువేల యేండ్లని విద్వాంసులందురు. దానికిగూడ రెండు వందల సంధ్యము సంధ్యాంశములు గూడ సంధ్యలతో సమానము (20. కలియగము వేయియేండ్లని విద్వాంసులందురు దానికి గూడ ఒక నూరుసంధ్యలు సంధ్యాంశములు సంధ్యలతో సమానము(100). ఇది పన్నెండువేలయుదియని యుగ సంఖ్య చెప్పబడినది. అవి కృతయుగము త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని.
అత్ర సంవత్సరాః సృష్టి మానుషేణ ప్రమాణతః ।
కృతస్య తావద్వక్ష్యామి వర్షాణాం తత్ప్రమాణతః ॥
సహస్రాణాం శతాన్యత్ర చతుర్దశతు సంఖ్యయా ।
చత్వారింశత్ సహస్రాణి కలికాలయుగస్య తు॥
ఏవం సంఖ్యాతకాలశ్చ కా లేష్విహ విశేషతః ।
ఏవం చతుర్యుగః కాలో వినా సంధ్యాంశకైః స్మతః ॥
చత్వారింశత్త్రీణి చైవ నియుతాని చ సంఖ్యయా ।
వింశతిశ్చ సహస్రాణి ససంధ్యాం శశ్చతుర్యుగః ॥
ఏవం చతుర్యుగాఖ్యా తు సాధికహ్యేక సప్తతిః ।
కృతవ్రేతాదియుక్తా సా మనోరస్తరముచ్యతే॥
మన్వంతరస్య సంఖ్యా తు వరాగ్రేణ నిబోధత ।
త్రింశత్కోట్యస్తు వర్షాణాం మానుషేణ ప్రకీర్తితాః॥
ఈ విధముగా సంధ్యాంశములు లేకుండగా నాలుగు యుగముల కాలము చెప్పబడినది. సంధ్యాంశములతోగూడిన చుతర్యుగ సంఖ్య నలుబది మూడు లక్షల యిరువదివేలు. ఈ విధముగ చతుర్యుగముల పేరు సాధిక కృత త్రేతాది - యుక్తమైయది డెబ్బది యొక్కటియైనచోమనువు యొక్కయంతరమనబడును. మన్వంతరము యొక్క సంఖ్యను వర్షాగ్రముతో, వీనుడు. అవి మానుషమానమునముప్పది కోట్ల సంవత్సరములు అనబడినది. సాధికను వదిలి యరువది యేడు లక్షల యిరువది వేల (సంవత్సరముల) కాలము. ఇది మన్వంతరము యొక్క సంఖ్య. పండితులచే చెప్పబడినది. ఈ మన్వంతరము యొక్క కాలము యుగములతోబాటు చెప్పబడినది. నాలుగువేల యేండ్లతో గూడినది. మొదటి కృతయుగము త్రేతాయుగమును ద్వాపర యుగమును కలియుగమును జెప్పెదను. ఒకేసారి కలిసినయర్థము (వస్తువు విషయమును) రెండు విధముల జెప్పరాదు. క్రమముగా వచ్చిన యీ యుగద్వయము ఋషివంశ ప్రసంగమునను అట్లే వ్యాకులుడనగుట చేతను నాచే నీకు చెప్పబడినది. అందులో త్రేతాయుగ ప్రారంభమున మనువు ఆ సప్తర్షులును శ్రుతి ప్రోక్తమైన ధర్మము, స్మృతిప్రోక్తమైన ధర్మమున్ను బ్రహ్మచే ప్రేరేపింపబడినవి. ఋగ్ యుజ్ సామవేదముల జెప్పబడిన దారాగ్నిహోత్ర సంయోగము మొదలగు లక్షణములుగల భౌతమగు (శ్రుతిప్రోక్తమగు) ధర్మమును సప్తర్షులు చెప్పిరి. పరస్పరముగా వచ్చిన ధర్మము ఆచారరూపమై స్మార్త ధర్మమైనది. వర్ణాచార ఆశ్రమాచారములతో గూడిన దానిని స్వాయంభువ మనువు ధర్మముగా జెప్పును. సత్యముతోను, బ్రహ్మచర్యముతోను, వేదముతోను తపస్సుతోను బాగుగా తపించిన తపస్సుగల తపస్వుల యారేయ (ఋషిసంబంధమైన) క్రమముతోను, సప్తర్షుల యొక్కయు, మనువు యొక్కయు త్రేతాయుగ ప్రారంభమున అబుద్ధి పూర్వకముగా
సప్తషష్టిస్తథావ్యాని నియుతాన్యాధికాని తు ।
వింశతిశ్చ సహస్రాని కాలోఽయం సాధికాం వినా॥
మన్వంతరస్య సంఖ్యైషా సంఖ్యా విద్భిర్ద్విజైః స్మృతా ।
మన్వంతరస్య కాలోఽయం యుగైః సార్థం ప్రకీర్తితః॥
చతుః సహస్రయుక్తం వై ప్రథమం తత్ కృతం యుగమ్ ।
త్రేతావిశిష్టం వక్ష్యామి ద్వాపరం కలిమేవ చ॥
యుగపత్సమవేతార్థో ద్విధా నక్తం న శక్యతే ।
క్రమాగతం మయా హ్యేతత్తుభ్యం ప్రోక్తం యుగద్వయమ్॥
ఋషివంశ ప్రసంగేణ వ్యాకులత్వాత్తథైవచ॥
తత్ర త్రేతాయుగస్యాదౌ మనుః సప్తర్షయశ్చ తే ।
శ్రౌతం స్మార్తం చ ధర్మం చ బ్రహ్మణా చ ప్రచోదితమ్॥
దారాగ్నిహోత్ర సంయోగమృగ్యజుః సామసంజ్ఞితమ్ ।
ఇత్యాది లక్షణం శ్రౌతం ధర్మం సప్తర్షయోఽ బ్రువన్ ॥
పరస్పరాగతం ధర్మం స్మార్తం చాచారలక్షణమ్ ।
వర్ణాశ్రమాచారయుతః మనుః స్వాయంభనోఽ బ్రవీత్ ॥
సత్యేన బ్రహ్మచర్యేణ శ్రుతేన తపసా చ వై ।
తేషాం సుతప్తతపసామార్షేయేణ క్రమేణ తు॥
సప్తర్షీణాం మనోశ్చైవ ఆద్యం త్రేతాయుగస్య తు ।
అబుద్ధిపూర్వకం తేషామక్రియా పూర్వమేవ చ ॥
అభివ్యక్తాస్తు తే మం త్రాస్తారకాద్యైర్ని దర్శనైః ।
ఆదికల్పే తు దేవానాం ప్రాదుర్భూతాస్తు తే స్వయమ్॥
ప్రణాశేత్వథసిద్ధీనామప్యాసాం చ ప్రవర్తనమ్ ।
ఆసన్మంత్రా వ్యతీతేషు యే కల్పేషు సహస్రశః ॥
తే మన్త్రా వై పునస్తేషాం ప్రతిభాససముత్థితాః॥
ఋచో యజూంషి సామాని మంత్రాశ్చాథర్వాణాని చ ।
సప్తర్షిభిస్తు తే ప్రోక్తాః స్మార్తం ధర్మం మనుర్జగౌ ॥
ఇచట మానమాన ప్రకారముగా సంవత్సరములు సృష్టించబడినవి. ఆ ప్రమాణముతోనే కృతయుగ వర్ష (సంవత్సర) మానమునుజెప్పెదను. అవి అంకెలలో నిట పదునాలుగు లక్షలు కలికాలయుగమునకు నలుబది నాలుగు వేలు ఈ విధముగ లెక్కించిన కాలము. విశేషించి కాలములలో లెక్కించిన కాలము. అక్రియ పూర్వకముగా తారకాది నిదర్శనములతో వెలువడినవి మంత్రములు ఆదికల్పమునందైతే దేవతల నుండియే స్వయముగా బయలువెడలినవి. నాశమందైనను ఈ సిద్ధులు ప్రవర్తిల్లును. గడచిన కల్పములలో వేలకొలది మంత్రములుండినవి. ఆ మంత్రములైతే వారి ప్రతిభాసము నుండి బుట్టినవి. సప్తర్షులచే ఋక్కులు (ఋగ్వేదము) యజుస్సులు (యజుర్వేదము) సామములు (సామవేదమును జెప్పబడినవి. మనువు స్మార్త ధర్మమును జెప్పెను.
త్రేతాదౌ సంహితా వేదాః కేవలాధర్మశేషతః ।
సంరోధాదాయుషశ్చైవ వ్యస్యంతే ద్వాపరేషు తే॥
ఋషయ స్తపసా దేవాః కలౌ చ ద్వాపరేషు వై ।
అనాదినిధనాదివ్యాః పూర్వం సృష్టాః స్వయం భువాః ॥
సధర్మాః సప్రజాః సాంగా యథాధర్మం యుగే యుగే ।
విక్రీడన్తే సమానార్థా వేదవాదా యథాయుగమ్ ॥
ఆరంభయజ్ఞాః క్షత్రస్య హవిర్యజ్ఞా విశాంపతేః ।
పరిచారయజ్జా క్షత్రస్య శూద్రాస్తు జపయజ్ఞా ద్విజోత్తమాః॥
తథా ప్రముదితా వర్ణాస్త్రేతాయాం ధర్మపాలితాః ।
క్రియావంతః ప్రజావంతః సమృద్ధాః సుఖిన స్తథా॥
బ్రాహ్మణానువర్తన్తీ క్షత్రియాః క్షత్రియాన్విశః ।
వైశ్యానువర్తినః శూద్రాః పరస్పరమనువ్రతాః ॥
శుభాః ప్రవృత్తయ స్తేషాం ధర్మావర్ణా శ్రమాస్తథా ।
సంకల్పితేన మనసా వాచోక్తే నస్వకర్మణా॥
త్రేతాయుగేత్వవికలః కర్మారంభః ప్రసిద్ద్యతి॥
ఆయుర్మేధా బలం రూపమారోగ్యం ధర్మశీలతా ।
సర్వసాధారణా హ్యేతే త్రేతాయా భవంత్యుత॥
త్రేతాయుగ ప్రారంభమున కేవలము ధర్మ విశేషముగా వేదములు గూర్చబడినవి. ద్వాపరయుగమున ఆయువును సంరోధించుట వలన విశేషముగా వ్యాపించి యుంచబడినవి. పూర్వము కలియందును ద్వాపరమునందును ఋషులును దేవతలును స్వయంభువుడైన బ్రహ్మచే జనన మరణములులేనివారుగా దివ్యులుగాను సృష్టించబడిరి. యుగమున వారు యుగముననుసరించి ధార్మికులుగను, ప్రజలతో గూడిన వారుగను రాజ్యాంగములతో గూడిన వారుగను, వేదమును జెప్పువారుగను సమానమైన (సుఖ) ప్రయోజనముగల వారుగనునై విశేషముగ క్రీడించుచుండిరి. క్షత్రియ జాతియొక్క కార్యారంభము యజ్ఞముగా గలవారు ఋషులు.రాజు యొక్క (యజ్ఞములలో నీయబడిన) హవిసే యజ్ఞముగా గలవారు దేవతలు. పరీచారమే (ఉన్నత జాతుల సేవయే) యజ్ఞముగా గలవారు శూద్రులు. జపమే యజ్ఞముగా గలవారు బ్రాహ్మణోత్తములు-50. ఆ విధముగా త్రేతాయుగములో నాలుగు వర్ణములును (జాతులు) మిక్కిలి సంతుష్టులై ధర్మముచే రక్షింపబడిన వారై నిత్యము క్రియావంతులై ప్రజా (సంతాన)వంతులై ఐశ్వర్యవంతులై సుఖులునైయుండిరి. క్షత్రియులు బ్రాహ్మణులను అనుసరించి మెలగుచుండిరి. క్షత్రియులను వైశ్యులు వైశ్యులను శూద్రులు అనుసరించి మెలగుచుండిరి. ఈ విధముగా అందరును పరస్పరముగా నియమ బద్దులై పెద్దలననుసరించుచుండిరి. వారి ప్రవృత్తులు (నడవడులు) శుభములు, ధర్మములు వర్ణాశ్రమానుగుణములు మనసుచే సంకల్పించిన దానిని వాక్కుతో పలికిన దానిని వారు తమ క్రియలతో నాచరించెడివారు త్రేతాయుగమున కర్మారంభము వికలముగాకుండగా సిద్దించెడిది. త్రేతా యుగమున ఆయువు మేధ, బలము, రూపము ఆరోగ్యము, ధర్మశీలత, ఇవి సర్వసాధారణములై అందరియందుండునవై యుండెడివి.
వర్ణాశ్రమ వ్యవస్థానం తేషాం బ్రహ్మా తథాఽకరోత్ ।
పునః ప్రజాస్తు తామోహాత్తాన్ ధర్మాన్నహ్య పాలయన్॥
పరస్పరవిరోధేన మనుం తాః పున రన్వయుః ।
మనుః స్వాయంభువో దృష్ట్యా యాథాతథ్యం ప్రజాపతిః ॥
ధాతా తు శతరూపాయాః పుమాన్ సఉదపాదయత్ ।
ప్రియవ్రతోత్తానపాదౌ ప్రథమం తౌ మహీపతీ॥
తతః ప్రభృతి రాజాన ఉత్పన్నా దండధారిణః ।
ప్రజానాం రంజనాచ్చైవ రాజానస్త్వభవన్నృపాః॥
ప్రచ్ఛన్నపాపా యే జేతుమశక్యా మనుజా భువి ।
ధర్మసంస్థాపనార్థాయ తేషాం శాస్త్రే తపోమయా॥
వర్ణానాం ప్రవిభాగాశ్చ త్రేతాయాం సంప్రకీర్తితాః ।
సంహితాశ్చ తతో మన్త్రా ఋషిభిర్భ్రాహ్మణైస్తు తే ॥
యజ్ఞః ప్రవర్తితశ్చైవ తదా హ్యేవం తు దైవతైః ।
యామైః శుక్లైర్జపైశ్చైవ సర్వసంభార సంభృతైః॥
సార్థం విశ్వభుజా చైవ దేవేంద్రేణ మహౌజసా ।
స్వాయంభువేఽ న్తరే దేవైర్యజ్ఞాన్తే ప్రాక్ప్రవర్తితాః॥
సత్యం జపస్తపో దానం త్రేతాయాం ధర్మ ఉచ్యతే ।
క్రియాధర్మశ్చ హ్రసతే సత్యధర్మః ప్రవర్తతే ॥
బ్రహ్మ వారికి వర్ణాశ్రమ వ్యవస్థానములనావిధముగా జేసెను. కాని మరల నా ప్రజలు అజ్ఞానము వలన ఆ ధర్మములను పాలించలేదు. ఆ ప్రజలు పరస్పర విరోధముతో మనువు ననుసరించిరి. స్వాయంభువ మనువు ఉన్నదీ యున్నట్లున్న నిజమును జూచెను-56. బ్రహ్మపురుషుడై శతరూపనుండి ప్రియవ్రత - ఉత్తాన పాదులను బుట్టించేను. వారు మొదటి రాజులు. అది మొదలు దండధారులైన రాజులు పుట్టిరి. ప్రజలను రంజింపచేయుటవల్ల ఆ నరపాలురు రాజులైరి. కప్పిపుచ్చుకొన్న పాపములు గలిగి భూమిలో జయింపనలవిగానివారు. ధర్మ సంస్థాపనమునకై వారిని శాసించు శాస్త్రమున నా చేత తపము జేయబడినది-59. ఋషులైన బ్రాహ్మణులచే త్రేతాయుగమున వర్ణముల విభాగములు చక్కగా జెప్పబడినవి, తరువాత వేదసంహితలు మంత్రములును చెప్పబడినవి. అపుడు దేవతలచేత నీ విధముగా యజ్ఞము ప్రవర్తింపజేయబడినది. జపములతో అప్పుడీ విధముగ శుక్లపక్ష యామముల సర్వసంభారములతోను జపములచే దేవతలు యజ్ఞమును నిర్వహింపజేసిరి. విశ్వభుక్కైన విష్ణువుతోబాటు మహౌజస్వియైన దేవేంద్రునిచే స్వాయంభువ మన్వంతరమున పూర్వ యా యజ్ఞములు ప్రవర్తింపబడినవి. సత్యము జపము, తపము దానములను త్రేతాయుగములో ధర్మమని చెప్పబడినది. క్రియాధర్మము తగ్గును. సత్యధర్మము ప్రవర్తించును.
ప్రజాయన్తే తతః శూరా ఆయుష్మంతో మహాబలాః ।
న్యస్తదండమహాభాగా యజ్వానో బ్రహ్మవాదినః॥
పద్మపత్రాయతాక్షాశ్చ పృథూరసాః సుసంహితాః ।
సింహాన్తకా మహాసత్త్వా మత్తమాతంగగామినః ॥
మహాధనుర్ధరాశ్చైవ త్రేతాయాం చక్రవర్తినః ।
సర్వలక్షణ సంపన్నా న్యగ్రోధ పరిమండలాః ॥
న్యగ్రోధౌ తౌ స్మృతా బాహూవ్యామోన్యగ్రోధ ఉచ్యతే ।
వామేనైవోచ్ఛ్రయా ద్యస్య సమఊర్థ్యం తు దేహినః॥
సముచ్ఛ్రయః పరిణామో జ్ఞేయో న్యగ్రోధమండలః ॥
చక్రం రథోమణిర్భార్యా నిధిరశ్వా గ్రజాస్తథా ।
సప్తాతిశయరత్నాని సర్వేషాం చక్రవర్తినామ్॥
చక్రం రథోమణిః ఖడ్గం ధనూరత్నం చ పంచమమ్ ।
కేతుర్నిధిశ్చ సప్తైతే ప్రాణహీనాః ప్రకీర్తితాః ॥
భార్యాపురోహితశ్చైవ సేనానీ రథకృచ్చయః ।
మంత్య్రశ్వ కలభశ్చైవ ప్రాణినః సంప్రకీర్తితాః ॥
రత్నాన్యేతాని దివ్యాని సంసిద్ధాని మహాత్మనామ్ ।
చుతర్ధశ విధేయాని సర్వేషాం చక్రవర్తినామ్॥
తరువాత శూరులు, ఆయుష్మంతులు, మహాబలులు ప్రజలను శిక్షించు దండనీతి గలవారు, మహాభాగులు (అదృష్టవంతులు), యజ్ఞములను జేయువారు, బ్రహ్మను (వేదములను పరబ్రహ్మను) జెప్పువారును, పద్మపత్రములవలె విశాలమైన కన్నులుగల వారు, విశాల వక్షముగలవారు చక్కని శరీరావయవముల కూర్సుగలవారు, సింహములను గూడ జంపు శౌర్యము గలవారు, మహాప్రాణశక్తి గలవారు మదపుటేనుగువలె ఠీవిగా నడచువారును, మహాధనుస్సును ధరించినవారునైన చక్రవర్తులు త్రేతాయుగమున నుండువారు. వారు సర్వలక్షణ సంపన్నులు, మట్టిచెట్టు వంటి పరిమండలముగలవారు. ఆ బాహువులు న్యగ్రోధములు (మజ్జిచెట్టువలె విశాలము) అనబడినవి. వారి బాహ్వంతరము గూడ న్యగ్రోధము (మజ్జిచెట్టువలె విశాలము) అనబడినది. దేహికి ఎడమవైపుగా సమోన్నతమైనది సముచ్చయమగు. ఆ విధముగా సమోన్నతమైన వైశాల్యము న్యగ్రోధమండలమని తెలియవలెను. చక్రము, రథము, మణి, భార్య, విధి, అశ్వములు, గఖములు - ఈ యేడు సమస్త చక్రవర్తులకును మహారత్నములు. చక్రము, రథము మణి, ఖడ్గము, ధనుః శ్రేష్ఠము, ధ్వజము(జెండా) నిధియు ఈ యేడును ప్రాణహీనములు (రత్నములు) అనబడినవి. భార్య పురోహితుడు, సేనాని, రథకారుడు, మంత్రి, అశ్వము, గున్నయేనుగును నీ యేడును ప్రాణముతో గూడినవి(రత్నములు) అనబడినవి. ఈ రత్నములు దివ్యములు మహాత్ములకు సిద్ధించునవి. చక్రవర్తులందరికిని నీ పదునాలుగు రత్నములు విధిగా నుండదగినవి.
విష్ణోరంశేన జాయంతే పృధివ్యాం చక్రవర్తినః ।
మన్వంతరేషు సర్వేషు అతీతానగతేషు వై ॥
భూతభవ్యాని యా నీహ వర్తమానాని యాని చ ।
త్రేతాయుగాదికేష్వత్ర జాయన్తే చక్రవర్తినః ॥
భద్రాణీమాని తేషాం వై భవన్తీహ మహీక్షితామ్ ।
అద్భుతాని చ చత్వారి బలం ధర్మః సుఖంధనమ్ ॥
అన్యోన్యస్యావిరోధేన ప్రాప్యన్తే వై నృపైః సమమ్ ।
అర్ధోధర్మశ్చ కామశ్చ యశో విజయ ఏవచ॥
ఐశ్వర్యేణాణి మాద్యేన ప్రభుశక్త్యా తథైవచ ।
అన్యేన తపసా చైవ ఋషీనభిభవన్తి చ॥
బలేన తపసాచైవ దేవదానవ మానుషాన్॥
లక్షణైశ్చాపి జాయన్తే శరీర స్థైరమాను షైః ।
కేశస్థితాలలాటోర్ణా జిహ్వాచాస్య ప్రమార్జనీ॥
తామ్రప్రభోష్ఠదంతోష్ఠాః శ్రీవత్సాశ్చోచ్చ రోమశాః॥
ఆజానుబాహవశ్చైవ జాలహస్తావృషాంకితాః ।
న్యగ్రోధపరిణాహాశ్చ సింహస్కంధాః సుమేహనాః ॥
గజేంద్రగతయశ్చైవ మహాహనవ ఏవచ॥
పాదయోశ్చక్రమత్స్యౌ తు శంకపద్మౌ తు హస్తయోః ।
పంచాశీతి సహస్రాణి తే భవన్ త్యజరా నృపాః॥
అసంగా గతయస్తేషాం చతస్రశ్చక్ర వర్తినామ్ ।
అంతరిక్షే సముద్రే చ పాతాలే పర్వతేషు చ॥
ఇజ్యాదానం తపః సత్యం త్రేతాయాం ధర్మ ఉచ్యతే ।
తదా ప్రవర్తతే ధర్మో వర్ణాశ్రమ విభాగశః ॥
మర్యాదాస్థాపనార్థం చ దండనీతిః ప్రవర్తతే ।
హృష్టపృష్టాః ప్రజాః సర్వా హ్యరోగాః పూర్ణమానసాః॥
ఏకోవేదశ్చతుష్పాదస్త్రేతా యుగవిధౌ స్మృతః ।
త్రీణివర్షసహస్రాణి తదా జీవన్తి మానవాః ॥
పుత్రపౌత్ర సమాకీర్ణా మ్రియంతే చ క్రమేణ తు ।
ఏష త్రేతాయుగే ధర్మ స్త్రేతాసంధౌ నిబోధత ॥
భూత భవిష్యత్కాలములలోని మన్వంతరములయన్నింటిలోను భూలోకమున చక్రవర్తులు విష్ణువుయొక్క యంశతో బుట్టుదురు. భూతభవిష్యత్తులలోను వర్తమానము నందును త్రేతాయుగాదులలోను ఇచట చక్రవర్తులు విష్ణ్యంశతోనే బుట్టుదురు. ఆ రాజులకు ఇచట నీవిక్షేమకరములు. బలము, ధర్మము, సుఖము, ధనము అనునీ నాలుగు అద్భుతములు. ఇవి పరస్పరవిరోధము లేకుండగా సమముగా రాజులను చేరును. అణిమాదులైన యైశ్వర్యముతోను, ప్రభుశక్తితోను వీనికి వేరైన తపస్సుచేతను వీరు ఋషులను అవమానింతురు. బలము చేతను, తపముచేతను, దేవదానవ, మానవులను తిరస్కరింతురు. వీరు శరీరమున (నుండు) మానుషేతరములైన చిహ్నములతో గూడ జన్మింతురు. వెంట్రుకలతో ఫాలభాగమున కనుబొమల మధ్య సుడిగలవారు, చీపురువంటి నాలుకగలవారు, ఎఱ్ఱని పెదవులు దంతములు గలవారు. రొమ్మునందు (విష్ణువునకు వలె) మచ్చగలవారు పైకి నిక్కబొడిచిన వెంట్రుకలు గలవారు మోకాళ్ళ వరకు బాహువులు గలవారు, జాలమువలెనుండు చేతులు గలవారు (అరచేతి వేళ్ళు) సందులుగానున్నవారు), వృషభ చిహ్నము గలవారు మఱిచెట్టు వలే విశాలమైనవారు సింహము వంటి భుజస్కంధము గలవారు, చక్కని జననాంగము గలవారు, గజరాజువలె గంభీరముగ నడచువారు, గొప్పనైన చెక్కిలిపై భాగము గలవారు, వారి పాదములలో చక్రమత్స్యములు చేతులలో శంకపద్మములును గలవారు. వారు ఎనుబదియైదు సంవత్సరముల వరకు ఆ రాజులు ముసలితనములేనివారై యుందురు. వారియొక్క గమనములు సంగము లేనివి. అవి నాలుగు అంతరిక్ష గమనము. సముద్ర గమనము, పాతాళగమనము, పర్వత గమనమును. త్రేతాయుగములో ఇజ్యా (యుగము) దానము, తపము, సత్యమును, ధర్మముగా జెప్పబడినవి. అపుడు ధర్మము వర్ణాశ్రమ విభాగమును బట్టి నడుచుచుండెను. దండనీతి మర్యాదాస్థాపనమునకే ప్రవర్తిల్లుచుండెను. సమస్త ప్రజలు సంతుష్టులై పుష్టిగాను, రోగములేని వారుగను. పూర్ణమైన మనస్సుగలవారుగను నుండిరి. త్రేతాయుగవిధిలో నాలుగు పాదములతో గూడిన యొక్కవేదము చెప్పబడినది. అపుడు మానవులు మూడు వేలయేండ్లు జీవించు యుండువారు . పుత్రులతోను మనుమలతోను వ్యాపించినవారై క్రమముగా వారు మరణింతురు. ఇది త్రేతాయుగములోని ధర్మము త్రేతాసంధిలో దానిని వినుడు.
త్రేతాయుగస్వభావస్తు సంధ్యా పాదేన వర్తతే ।
సంధ్యాయాం వై స్వభావస్తు యుగపాదేన తిష్ఠతి॥
శాంశపాయన ఉవాచ:-
కథం త్రేతాయుగేమూలే యజ్ఞస్యాసీత్ప్ర వర్తనమ్।
పూర్వం స్వాయంభువే సర్గే యథావత్త ద్భ్రవీహి మే॥
అంతర్షితాయాం సంధ్యాయాం సార్థం కృతయుగేన వై ।
కలాఖ్యాయాం ప్రవృత్తాయాం ప్రాప్తేత్రేతాయుగే తదా।
వర్ణాశ్రమవ్యవస్థానం కృతవంతశ్చ వై పునః॥
సంభారాంస్తాశ్చ సంభృత్య కథం యజ్ఞః ప్రవర్తితః ।
ఏతచ్ఛృత్వాఽ బ్రవీత్సూతః శ్రూయతాం శాంశపాయన।
యథా త్రేతాయుగముఖే యజ్ఞస్యాఽసీత్ర్పవర్తనమ్ ।
ఓషధీషు చ జాతాసు ప్రవృత్తే వృష్ఠిసర్జనే।
ప్రతిష్ఠితాయాం వార్తాయాం గృహాశ్రమపురేషు చ ।
వర్ణాశ్రమవ్యవస్థానం కృత్వా మంత్రాశ్చ సంహితామ్ ।
మంత్రాన్ సంయోజయిత్వాథ ఇహాముత్రేషు కర్మసు॥
తథా విశ్వభుగింద్రస్తు యజ్ఞం ప్రావర్తయత్తదా ।
దైవతైః సహితః సర్యైః సర్వసంభార సంభృతమ్॥
త్రేతాయుగ విభాగము సంధ్యావాదముతో నుండును. సంధ్యయందలి స్వభావము యుగపాదముతో నుండును . శాంశపాయ నుడనేను. పూర్వము స్వాయంభువమను సృష్టిలో త్రేతాయుగ ప్రారంభమున యజ్ఞము యొక్క ప్రవర్తనము (జరుపుట) ఎట్లుండెనో! దానిని నాకు జెప్పుము. కృతయుగముతోబాటు సంధ్యగూడ గడచిపోగా, త్రేతాయుగము వచ్చినపుడు కళయన్నది ప్రవర్తిల్లగా మరల వర్ణాశ్రమవ్యవస్థ నేర్పరచిరి. ఓ శాంశపాయనః ఆ సంభారములన్నియు సంపాదించి యజ్ఞమెట్లు నిర్వహింపజేయబడినదో వినుమనీ సూతుడు చెప్పెను. త్రేతాయుగప్రారంభమున వర్ష సృష్టి జరిగి యోషధులు పుట్టగనే, గృహములలోను ఆశ్రమములలోను, పురములలోను, జీవనోపాయములైన వృత్తులు స్థిరముగ నేర్పడగనే యజ్ఞము ప్రవర్తిల్లజేయబడినది. వర్ణ-ఆశ్రమముల వ్యవస్థ నేర్పరచి, వేద మంత్రములను సంహితను రచించి, లౌకికాలౌకికర్మలందు ఆ మంత్రములను జోడించియు. విశ్వాపాలకుడైన యింద్రుడు అపుడు సమస్త దేవతలతో గూడి సర్వసంభారములతో సంపాదించిన యజ్ఞమును బ్రవర్తిల్లజేసెదను.
అథాశ్వమేధో వితతే సమాజుగ్ముర్మ హర్షయః।
యజన్తే పశుభిర్మేధ్యేర్హత్వా సర్వే సమాగతాః ॥
కర్మవ్యగ్రేషు ఋత్విక్షు సతతే యజ్ఞ కర్మణి।
సంప్రగీతేషు తేష్వేవమాగమేష్వథ సత్వరమ్॥
పరిక్రాంతేషు లఘుషు అధ్వర్యు వృషభేషు చ ।
అలబ్దేషుచ మేధ్యేషు తథాపశుగణేషు వై॥
హవిష్యగ్నౌ హూయమానే దేవానాం దేవహోతృభిః।
ఆహూతేషు చ దేవేషు యజ్ఞభాక్షు మహాత్మసు॥
య ఇంద్రియాత్మకా దేవా యజ్ఞభాజస్తథా తు యే।
తాన్ యజన్తే తదా దేవాః కల్పాదిషు భవన్తి యే॥
అధ్వర్యవః ప్రైషకాలే వ్యుత్థితా యే మహర్షయః।
మహర్షయస్తు తాన్ దృష్ట్యా దీనాన్ పశుగణాన్ స్థితాన్॥
పప్రచ్చురిద్రం సంభూయ కోఽయం యజ్ఞంవిధిస్తవ ॥
అధర్మో బలవానేష హింసాధర్మేప్సయా తవ ।
నేష్టః పశువద స్తైవతవ యజ్ఞే సురోత్తమ ॥
అధర్మో ధర్మఘాతాయ ప్రారబ్ధం పశుభిస్త్వయా।
నాఽయం ధర్మోహ్యధర్మోఽయం న హింసా ధర్మ ఉచ్యతే ॥
ఆగమేన భవాన్ యజ్ఞం కరోతు యదిహేచ్ఛసి।
విధిదృష్టేన యజ్ఞేన ధర్మమవ్యయ హేతువా
యజ్ఞబీజైః సురశ్రేష్ఠ యేషు హింసా న విద్యతే॥
త్రివర్షపరమం కాలముషితైర ప్రరోహిభిః ।
ఏష ధర్మో మహానింద్ర స్వయంభువి విహితః పురా ॥
ఆ తరువాత అశ్వమేధయాగ విస్తారము జరుగగా మహర్పులు వచ్చిరి. అందరు వచ్చి పవిత్రములైన పశువులతో హోమము జేసి యజ్ఞము చేయుచుండిరి. నిరంతరము జరుగు యజ్ఞ కర్మయందు ఋత్విజులు వారి పనులలో నిమగ్నమైరి. ఆ తరువాత వెంటనే వేదములు (ఆగమములు) గానము జేయబడినవి-. యజ్ఞమున యజుర్వేదమును జదువు (అధ్వర్యు శ్రేష్ఠులు తొందరగా తిరుగుచుండిరి. పవిత్రములైన పశుగణములు లభింపకుండినవి. యజ్ఞాహుతికై కోయబడినవి. దేవతలును యజ్ఞభాక్కులైన మహాత్ములును పిలువబడగానే దేవహోతలచే (దేవతలకై హోమము జేయువారిచే) దేవలతకై హవిస్సు హోమము జేయబడినది. ఇంద్రియాత్మకులైనట్టియు, యజ్ఞక్కులైనట్టియు కల్పాదిలో నున్నవారునైన దేవతలను దేవతలప్పుడు, కల్పాదులలో యజ్ఞముతో బూజింతురు-96. ప్రేష కాలమున లేచిన యధ్వర్యులైన మహర్షులు దీనములైయున్న పశుగణములను జూచి యందజుగూడి ఈ యజ్ఞ విధియేమిటని యింద్రుని నడిగిర. నీవు ధర్మమును బొందగోరి హింసచేయుట నీకు బలీయమైన ధర్మము. ఓ దేవ శ్రేష్ఠుడా! నీ యజ్ఞమున పశువధయనిష్టము. ధర్మమును పడగొట్టుటకై పశువులతో నీచే యధర్మమునుప్రారంభింపబడినది. ఇది ధర్మముగాదు. ఇదియధర్మము హింస ధర్మమని చెప్పబడదు. నీవు కోరినచో వేదముతో యజ్ఞమును జేయము. అవినాశ కారణమైన వేద శాస్త్రదృష్టమైన విధానముగల యజ్ఞముతో ధర్మమును నిర్వహింపుము. ఓ దేవేంద్ర! హింసకు తావులేనివియు మూడేండ్ల యుత్కృష్ట కాలముండి మొలవనట్టి యజ్ఞ బీజములతో యజ్ఞమును నిర్వహింపుము. ఓ యింద్రా! ఇది స్వయంభువైన బ్రహ్మచే పూర్వము చెప్పబడిన గొప్ప ధర్మము.
ఏవం విశ్వభుగింద్రస్తు మునిభిస్తత్వ దర్శిభిః ॥
జంగమైః స్థావరైర్వేతికైర్యష్టవ్య మిహోద్యతే॥
తే తు భిన్నా వివాదేన తత్త్వయుక్తా మహర్షయః ।
సంధాయ వాక్యమొద్రేణ సప్రచుశ్చేశ్వరం వసుమ్ ॥
ఋషయ ఉవాచ:-
మహాప్రాజ్ఞ కథం దృష్టస్తయా యజ్ఞవిధిర్నృప।
ఉత్తానపాదే ప్రబ్రూహి సంశయం ఛింధి నః ప్రభో॥
జంగమములచేతనా? లేక స్థావరములచేతనా? యెవరిచే నీలోకమున యజ్ఞము చేయదగినది జెప్పబడినది? అని యీ విధముగా తత్యదర్శనులైన మునులతో నింద్రుడు చర్చించేను. ఋషులనిరి మహాప్రాజ్ఞుడవైన యోరాజా! ఉత్తానపాదునందు యజ్ఞ విధి యే రీతిగా నీచే జూడబడినది? తెలుపుము ఓ ప్రభూ! మాసంశయమును బోగొట్టుము-102. తత్యయుక్తులైన ఆ మునులు కూడ నావివాదముతో ఖిన్నులై యింద్రునితో మాట్లాడి ఈశ్వరుడైన వసువు నీ విధముగా నడిగిరీ.
శ్రుత్వా వాక్యం తతస్తేషామవిచార్య బలాబలమ్।
వేదశాస్త్రమనుస్మృత్య యజ్ఞతత్త్వమువాచ హ।
యథోపది ష్టైర్యష్టవ్యమితిహోవాచ పార్థివః।
యష్టవ్యం పశుభిర్మేథ్యైరథ బీజైః ఫలైస్తథా।
హింసా స్వభావోయజ్ఞస్య ఇతి మే దర్మ్యయత్యసౌ॥
యథేహ సంహితా మంత్రా హింసాలింగా మహర్షిభిః ।
దీర్ఘేణ తపసా యుక్తైర్దర్శనైస్తారకాదిభిః॥
తత్ప్రామాణ్యాన్మయా చోక్తం తస్మానామంతుమర్హథ।
యది ప్రమాణం తాన్యేవ మంత్రవాక్యాని వై ద్విజాః ।
తదా ప్రావర్తతాం యజ్ఞోహ్యన్యధా నోఽ నృతం వచః।
ఏవం హృతోత్తరాస్తే వై యుక్తాత్మానస్తపోధనాః ।
అధశ్చ భవనం దృష్ట్యా తమర్థం వాగ్యతోభవ।
మిథ్యావాదీ నృపో యస్మాత్ ప్రవేశ రసాతలమ్ ॥
వారి మాటను విని, బలాబలమును విచారింపక, వేదశాస్త్రములను స్మరించి యజ్ఞతత్యమును బలికెను. రాజు ఉపదేశించిన విధానములతో యజ్ఞము చేయదగినది అని పలికెను. యజ్ఞ బీజములు ఫలములునైన పవిత్రములైన పశువులతో యజ్ఞము చేయదగినది. యజ్ఞము యొక్క హింసాస్వభావమును గూర్చి కూడ నీ విధముగ నాకీతడు చెప్పుచున్నాడు. దీర్ఘమైన తపస్సుతో గూడిన తారకాదుల దర్శనముతో మహర్షులచేత హింసాలింగ (లక్షణ)ము గల మంత్రములు చూడబడినవి. ఆప్రామాణ్యముతోనే నాతో గూడ జెప్పబడినది. అందువలన దానిని భావింపదగదు. ఓ బ్రాహ్మణులారా! ఆ మంత్రములే ప్రమాణములైనచో అట్లే యజ్ఞము జరుగుగాక, కానిచో మా మాట అసత్యమగును. ఈ విధముగా యుక్తాత్ములై తపోధనులైన మునులు ప్రత్యుత్తరములేని వారైరి. అబద్ధములాడిన రాజు పాతాళమును బ్రవేశించినందున, పాతాళమున (నాతని) భవనమును జూచి మాటాడక మిన్నకుండుము.
ఇత్యుక్తమాత్రే నృపతిః ప్రవివేశ రసాతలమ్।
ఊర్థ్వచారీ వసుర్భూత్వా రసాతలచరో ఽభవత్॥
వసుధాతలవాసీ తు తేన వాక్యేన సోఽభవత్
ధర్మాణాం సంశయచ్చేత్తా రాజా వసురథాగతః।
తస్మాన్నవాచ్యమేకేన బహుజ్ఞేనాపి సంశయః।
బహూద్ధారస్య ధర్మస్య సూక్ష్మాద్దూరముపాగతిః ॥
తస్మాన్ననిశ్చయాద్వక్తుం ధర్మః శక్యస్తు కేనచిత్।
దేవానృషీనుపాదాయ స్వాయంభువమృతే మనుమ్॥
తస్మాన్న హింసా ధర్మస్య ద్వారయుక్తం మహర్షిభిః ।
ఋషికోటి సహస్రాణి కర్మభిః స్యైర్ధివం యయుః ॥
తస్మాన్నదానం యజ్ఞం వా ప్రశంసన్తి మహర్షయః ।
తుచ్ఛం మూలం ఫలం శాకముదపాత్రం తపోధనాః ।
ఏవం దత్వా విభవతః స్వర్గలోకే ప్రతిష్ఠితాః॥
అద్రోహశ్చాష్యలోభశ్చ దమోభూతదయా తపః।
బ్రహ్మచర్యం తథా సత్యమనుక్రోశః క్షమా ధృతిః ॥
సనాతనస్య ధర్మస్య మూలమేతద్దురాసదమ్॥
ధర్మమంత్రాత్మకో యజ్ఞస్తపశ్చాన శనాత్మకమ్।
యజ్ఞేన దేవానాప్నోతి వైరాగ్యాత్ ప్రేక్షతే లయమ్।
బ్రాహ్మణ్యం కర్మసన్యాసాధ్యైరాగ్యాత్ ప్రేక్షతే లయమ్ ।
జ్ఞానాత్ప్రాప్నోతి కైవల్యం పంచైతా గతయః స్మృతాః॥
ఏవం వివాదః సుమహాన్ యజ్ఞస్యాసీత్ప్ర వర్తనే।
ఋషీణాం దేవతానాం చ పూర్వం స్వాయంభువేఽతరే ॥
తతస్తే ఋషయో దృష్ట్యాద్భుతం వర్త్మబలేన తు।
వసోర్వాక్యమనాదృత్య జుగ్ముస్తే వై యథాగతాః॥
గతేషు దేవసం ఫేషు దేవా యజ్ఞమవాప్నుయుః ।
శ్రూయన్తే హి తపః సిద్దా బ్రహ్మక్షత్రమయా నృపాః॥
ప్రియవ్రతోత్తాన పాదౌ ధ్రువో మేధాతిథిర్వసుః ॥
సుమేథావిరజాశ్చైవ శంఖపాత్రజ ఏవ చ।
ప్రాచీన బర్హిః పర్జన్యో హవిర్ధానాదయో నృపాః ॥
ఏతే చాన్యే చ బహవో నృపాః సిద్దా దివంగతాః॥
రాజర్షయో మహాసత్త్వాయేషాం కీర్తిః ప్రతిష్ఠితా।
తస్మాద్విశిష్యతే యజ్ఞాత్ తపః సర్వేషు కారణైః ।
బ్రహ్మణా తపసా సృష్టం జగద్విశ్వమిదం పురా॥
తస్మాన్నాత్యేతి తద్యజ్ఞం తపోమూలం మిదం స్మతమ్।
యజ్ఞప్రవర్తనం హ్యేవ మతః స్వాయంభువేఽన్తరే॥
తతః ప్రభృతి యజ్ఞోఽయం యుగైః సహ వ్యవర్తత।
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే యజ్ఞవ్రర్తనం నామ సప్తపంచాశోఽధ్యాయః ॥
అని చెప్పిన వెంటనే రాజు పాతాళమును ప్రవేశించెను. ఊర్థ్వమున చరించువాడై వసువయి పాతాళమున జరించువాడయ్యెను. ఆ మాటతోనే యాతడు భూతలమున నుండువాడు గూడనయ్యెను. తరువాత ధర్మముల సంశయముల ఛేదించు రాజైన వసువు వచ్చెను కావున బహుజ్ఞానియైనను ఒక్కడు సంశయము చెప్పరాదు. అనేకములగును ద్వారములు గల ధర్మము సూక్ష్మమయినందున దానిని దగ్గరగా వెలసికొనుట యలవికానిది కావున దేవతలను ఋషులను దగ్గర జేర్చుకొని, స్వాయంభువ మనువు దక్క తక్కి వారికి ధర్మము నిశ్చయముగ జెప్ప సాధ్యముగానిది కావున అహింస ధర్మమునకు ద్వారముగా మహర్షులు చెప్పిరి. కోటి సహస్ర ఋషులు తమ (అహింసా) కర్మ చేత స్వర్గమునకు వెళ్ళిరి. కావున మహర్షులు దానమునుగాని యజ్ఞమును గాని ప్రశంసింపరు. తపోధనులు స్వల్పముగా తమ వైభవముననుసరించి కందమూలమును, ఫలమును, శాకమును, జలపాత్రమును ఈ విధముగ (హింసలేక) దానముజేసి స్వర్గలోకమున సుప్రతిష్ఠితులగుదురు, ద్రోహముచేయకుండుట, లోభములేమి, ఇంద్రియ నిగ్రహము, ప్రాణులయెడ దయాభావము, తపము, బ్రహ్మచర్యము, సత్యము, కనికరము, క్షమ, ధైర్యము ఇవి సనాతన ధర్మము నకు మూలము. ఇది సామాన్యముగా నబ్బదు. ధర్మముమంత్రాత్మకమైనది యజ్ఞము భుజింపకుండుట తపము యజ్ఞముతో దేవతల జేరును. మరి, తపముతో వైరాగ్యమును జెందును. కర్మసన్యాసమున బ్రాహ్మణ్యమునందును వైరాగ్యమున లయమును జూచును. జ్ఞానము వలన కైవల్యమును (పరమేశ్వరైక్యమును) బొందును. ఈ యైదును గతులనబడినవి. ఈ విధముగ పూర్వము స్వాయంభువ మన్వంతరమున ఋషులకును దేవతలకును యజ్ఞమును బ్రవర్తిల్లజేయుటలో గొప్ప వివాదము జరిగినది. తరువాత నా ఋషులు అద్భుతమైన మార్గమును జూచి, ఆ బలముతో వసువు (రాజు) యొక్క మాటను తిరస్కరించి వచ్చిన దారిన వెడలిరి. దేవ సంఘములు పోవగనే దేవతలు యజ్ఞమును బొందుదురు. బ్రహ్మనక్షత్రమయులైన రాజులు తపః సిద్దులుగా జెప్పబడినారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మేధాతి, వసువు, సుమేధనుడు, విరజుడు, శంఖపాదుడు, రజుడు, ప్రాచీనబర్హి, పర్జన్యుడు, హర్ధానుడు మొదలగువారు రాజులు . వీరును, మరికొందరును నైనయనేకులు రాజులు సిద్దులై స్వర్గమునకేగిరి. రాజర్షులు మహాత్యులునైన వీరి కీర్తి సుప్రతిష్ఠితమైనది కావున యజ్ఞమునకంటే తపము అన్నింటిలో బహుకారణములచే విశిష్టమైనది. పూర్వము బ్రహ్మచేత తపముచేత నీగమన శీలమైన విశ్వము సృష్టించబడినది. కావున నా యజ్ఞము అతీశయింపదు. ఇది తపోమూలకమనబడినది. అందువలన స్వామంభువ మన్వంతరమున యజ్ఞ ప్రవర్తనమీవిధముగ డెడిది. అప్పటి నుండి ఈ యజ్ఞము యుగములతోబాటుప్రవర్తిల్లెను.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున యజ్ఞ ప్రవర్తనమను నేబదియేడవ యధ్యాయము.