వాయు మహా పురాణము
52 - ధ్రువచర్యా
సూత ఉవాచ:-
సరథోఽ ధిష్ఠితోఽ దేవైరాదిత్యై ఋషిభిస్తథా ।
గంధర్వైరప్సరోభిశ్చ గ్రామణీ సర్పరాక్షసైః ॥
ఏతే వసన్తి వై సూర్యే ద్వౌ ద్వౌ మాసౌ క్రమేణ తు ।
ధాతార్యమా పులస్త్యశ్చ పులహశ్చ ప్రజాపతిః ॥
ఉరగో వాసుకిశ్చైవ సంకీర్ణారశ్చ తావుభౌ ।
తుంబురుర్నారదశ్చైవ గంధర్వా గాయతాం వరౌ ॥
క్రతుస్థల్యప్సరాశ్చైవ తథా కైపుంజికస్థలీ ।
గ్రామణీరథకృచ్ఛ్రశ్చ తపోర్యశ్చ తావుబౌ ॥
రక్షోతిః ప్రహేతిశ్చ యాతుధానావుదాహృతౌ ।
మధుమాధవయోరేష గణో వసతి భాస్కరే ॥
వాసన్ తౌ గ్రైష్మికౌమాసౌ మిత్రశ్చ వరుణశ్చ హ ।
ఋషిర త్రిర్వసిష్ఠశ్చ తక్షకో రంభ ఏవ చ ॥
మేనకా సహజన్యాచ గంధర్వౌ చ హహాహుహూః ।
రథస్వనశ్చ గ్రామణ్యో ర చిత్రశ్చ తావుభౌ ॥
పౌరుషేయో ధవశ్చై యాతుధానావు దాహృతౌ ।
ఏతే వసన్తి వై సూర్యే మాసయోః శుచిశుభ్రయోః ॥
తతః సూర్యే పునస్త్వన్యా నివసన్తీహ దేవతాః ।
ఇంద్రశ్చైవ వివస్వాశ్చ అంగిరా భృగురేవ చ ॥
ఏలాపర్ణస్తథా సర్పః శంఖపాలశ్చ తావుభౌ ।
విశ్వావసూగ్రసేనౌ చ ప్రాతశ్చై వారుణశ్చహా ॥
ప్రమ్లో చేతి చ విఖ్యాతనిమ్లోచేతి చ తే ఉభే ।
యాతుధానస్తథాసర్పోవ్యాఘః శ్వేతశ్చ తావుభౌ ॥
నభో నభస్య యోరేష గణో వసతి భాస్కరే ॥
శరదృతౌ పునః శుభ్రా వసన్తి మునిదేవతాః
పర్జన్యశ్చాథ పూషా చ భరద్వాజః సగౌతమః ॥
విశ్వావసుశ్చ గంధర్వా పథైవ సురభిశ్చ యః ।
విశ్వాచీ చ ఘృతాచీ చ ఉభౌ తే శుభలక్షణే ॥
నాగ ఐరావతశ్చైవ విశ్రుతశ్చ ధనంజయః ।
సేనజిచ్చ సుషేణశ్చ సేనానీ ర్గ్రామణీశ్చ తౌ ॥
ఆపో వాతశ్చ తావేతౌ యాతుధానావుభౌస్మృతౌ ।
వసన్త్యే తే తు వై సూర్యే మాసయోశ్చ ఇషోర్జయోః ॥
హైమన్తి కౌతుద్వౌమాసౌ వసన్తి తు దివాకరే ।
అంశోభగశ్చ ద్వావేతా కశ్యపశ్చ ఋతుశ్చహ ॥
భుజంగశ్చ మహాపద్మః సర్పః కర్కోటకస్తథా ।
చిత్రసేనశ్చ గంధర్వ ఊర్ణాయుశ్చైవ తావుభౌ ॥
ఉర్వశీ విప్రచిత్తశ్చ తథౌప్సరసౌ శుభౌ ।
తార్థ్యశ్చారిష్టనేమిశ్చ సేనానీర్గ్రామణీశ్చ తౌ ॥
విద్యుత్ స్ఫూర్జశ్చతావుగ్రౌయాతుధానావుదా హృతౌ ।
సహేచైవ సహస్యే చ వసన్తే తే దివాకరే ॥
తతః శైశిరయాశ్చాపి మానయోర్నివసన్ తివై ।
త్వష్టా విష్ణుర్జమదగ్నిర్విశ్వామిత్రస్త థైవ చ ॥
కాద్రవేయౌ తథా నాగౌ కంబలాశ్వతరావుభౌ ।
గంధర్వో ధృతరాష్ట్రశ్చ దేవీరంభా మనోరమా ।
ఋతజత్సత్యజిచ్చైవ గ్రామణ్యౌ లోకవిశ్రుతౌ ॥
బ్రహ్మోపేతస్తథా దక్షోయజ్ఞో పేతశ్చ స స్మృతః ।
ఏతే దేవా వసన్తర్యే ద్వౌ మాసౌతు క్రమేణ తు ॥
సూతుడనెను:- దేవతలైన యాదిత్యులచేతను, ఋషులచేతను, అట్లే గంధర్వులచేతను, అప్సరసలచేతను, గ్రామీణులచేతను, అట్లే (గ్రామాధిపతులచేత), సర్పములచేతను, రాక్షసులచేతను, ఆ సూర్యుడధిష్ఠితుడై యుండును. వీరు సూర్యుని రెండేసి మాసములు వరుసగా నివసింతురు. ధాత, ఆర్యముడు, పులస్త్యుడు, పులముడు, ప్రజాపతి. ఉరుగుడైన వాసుకియు, సంకీర్ణారుడును అనునిద్దరు, గాయకవరులైన గంధర్వులైన తుంబురు నారదులును, క్రతుస్థలి, అప్సరయైన పుంజిక స్థలి, గ్రామణియైన కృఛ్ఛుడును, తాపోర్యుడును, అనునిద్దరును, రక్షో హేతి, ప్రహేతీయను రాక్షసులిద్దరును, ఈ గణము చైత్ర వైశాఖ మాసములలో భాస్కరుని యందుండును. పైవి వసంత ఋతువునకు సంబంధించిన మాసములు, ఇక గ్రీష్మ ఋతువునకు సంబంధించిన మాసములు ఋషులైన అత్రి, వసిష్ఠుడు, తక్షకుడు, రంభుడు, మేనక, సహజన్య, హా హూహువులను గంధర్వులును, గ్రామణ్యుడైన రథస్వనుడును, రథచిత్రుడును, అనునిర్వురును, పౌరుషేయుడు ధవుడు అను రాక్షసులును వీరు జ్యేష్ఠ - ఆషాడ మాసములలో సూర్యునిలో నివసింతురు. ఆ తరువాత ఇంకను ఇతర దేవతలు సూర్యునిలో నివసింతురు. ఇంద్రుడు, వివస్వంతుడు, అంగీరసుడు, భృగువు. సర్పమైన ఏలాపర్లుడు శంకపాలుడును అను నిరువురును, విశ్వావసువు, ఉగ్రసేనుడు ప్రాతస్సున అరుణుడును. ప్రహ్లిచ, నిమ్లోచయని ప్రసిద్దిజెందిన స్త్రీలును, సర్పమైన రాక్షసుడును, వ్యాఘుడు, శ్వేతుడు, అనునిర్వురును, అను నీ గణము శ్రావణ భాద్రపద మాసములలో భాస్కరునిలో నివసింతురు. శరదృతువునందైతే పర్జన్యుడు, పూష భరద్వాజుడు, గౌతముడు, మునులు, దేవతలు వసింతురు. విశ్వావసువు, గంధర్వులు, సురభి, శుభలక్షణులైన విశ్వాచి, ఘృతాచి, యనునిరువురు అప్పరలును, ఐరావతమను ఏనుగును, ప్రసిద్ధుడైన యగ్నియు, సేనజిత్తైన సుషేణుడును, సేనానియైన గ్రామణియు అను నిరువురును రాక్షసులనబడిన జలమును, వాయువును వీరందరు ఆశ్వయుజ కార్తీక మాసములలో సూర్యునిలో నివసింతురు. హేమంత ఋతువునకు సంబంధించిన మాసములలో సూర్యునియందుండు వారు వీరు. అంశుడు భగుడను నీ యిరువురు, కశ్యపుడును, ఋతువును. భుజంగుడైన మహాపద్ముడును, కర్కోటక సర్పమును, గంధర్వుడైన చిత్రసేనుడును, ఉర్ణాయువు, అను నిరువురును. శుభప్సరసలైన ఊర్వశియు, విప్రచిత్తియంతార్యుడైన యరిష్టనేమియు, గ్రామణియైన సేనానియు అనునిరువురును, విద్యుత్ స్పూర్ణుడు అను రాక్షసులును వీరు మార్గశీర్ష పుష్యమాసములలో దివాకరునిలో నివసింతురు. ఆత శిశిర ఋతు మాసములలో గూడ ఈ క్రిందివారు నివసింతురు. త్వష్ట, విష్ణువు జమదగ్ని, విశ్వామిత్రుడు, కద్రుపుత్రులైన కంబల అశ్వతరులను నిరువును నాగులును, గంధర్వుడైన దృతరాష్ట్రుడును, సూర్యువర్చస్కుడును. అప్పరసలైన తిలోత్తమయు, మనోరమయైన రంభాదేవియు, లోకప్రసిద్ధులైన గ్రామాధిపతులైన (గ్రామణ్యులు) ఋతజిత్తును, సత్యజిత్తును, బ్రహ్మతోగూడి యజ్ఞముతో గూడిన దక్షుడనబడువాడును ఈ దేవతలు వరుసగా మాఘ పాల్గుణమాసములలో సూర్యునీలో నివసింతురు.
స్థానాభిమానినో హ్యేతే గణాద్వాదశసప్తకాః ।
సూర్యమాప్యాయయన్త్యేతే తాజసా తేజ ఉత్తమమ్ ॥
ప్రథితైస్తైర్వచోభిస్తు స్తువన్తి మునయో రవిమ్ ।
గంధర్వాప్సరసశ్చైవ గీతనృత్యై రుపాసతే ॥
గ్రామణీ యక్షభూతాస్తు కుర్వతే భీమసంగ్రహమ్ ।
సర్పావహన్తి సూర్యం చ యాతుధానానుయాన్తి చ ॥
వాల ఖిల్యానయన్త్యస్తం పరిచర్యో దయాద్రవిమ్ ॥
ఈ పండ్రెండైన యేడేసి గణములు స్థానాభిమానముగలవి. ఇవి తమ తేజస్సుచే ఉత్తమతేజమైన సూర్యుని వెంబడించి సంతోషపెట్టును. మునులు ప్రసిద్ధమైన వాక్కులతో రవిని స్తుతింతురు. గంధర్వాప్సరసలు గీత నృత్యములతో నుపాసింతురు. గ్రామణీ యక్ష - భూతములు భయ సంగ్రహమును జేయుదురు. సర్పములు సూర్యుని మోయును. యాతుధానులు (రాక్షసులు) వెంబడింతురు. వాలఖిల్యులు ఉదయము నుండి రవిని సేవించి యస్తమింతురు.
ఏతేషామేవదేవానాం యథావీర్యం యథా తపః ।
యథాయోగం యథా సత్యం యథాధర్మం యథాబలమ్ ॥
యథాతపత్యసౌ సూర్యస్తేషాం సిద్ధస్తు తేజసా ।
ఇత్యేతే వై వ రక్తహ ద్వౌద్వౌమాసా దివాకరే ॥
ఋషయో దేవగంధర్వాపన్నగాప్సరసాం గణాః ।
గ్రామణ్యశ్చ తథా యక్షా యాతుధానాశ్చ భూరిశః ॥
ఏతే తపన్తి వర్షన్తి భాన్తి వాన్తి సృజన్తి చ ।
భూతా నామ శుభం కర్మవ్యపోహన్తీహ కీర్తితాః ॥
మానవానాం శుభం హ్యేతే హరన్తి దురితాత్మనామ్ ।
దురితం హి ప్రచారాణం వ్యపోహన్తి కృచిత్ క్వచిత్ ॥
విమానేఽ వస్థితా దివ్యే కామగా వాతరంహసః ।
ఏతే సహైవ సూర్యేణ భ్రమన్తి దివసానుగాః ॥
వర్షన్తశ్చ తపన్తవ్చ హ్లదయన్తశ్చ వైప్రజాః ।
గోపాయన్తి తు భూతాని సర్వానీహామణు క్షయాత్ ॥
స్థానాభిమానినా మేతత్ స్థానం మన్వన్తరేషు వై ।
అతీతోనాగతానాం వై వర్తన్ తే సాంప్రతం తు యే ॥
ఏవంవసన్తి వైసూర్యే సప్తకాస్తే చతుర్దిశమ్ ।
చతుర్దశసు సుర్గేషు గణామన్వంతరేషు చ ॥
గ్రీష్మే హిమే చ వర్షాసు ముంచమానా ఘర్మం హిమం చ వర్షం చ దినం చ నిశాం చ ।
కాలేన గచ్చత్యృతువశాత్ పరివృత్తరశ్మి ।
ర్దేవాక పితౄంశ్చ మనుజాంశ్చ తర్పయన్ వై ॥
ప్రీణాతి దేవానమృతేన సూర్యః సోమం సుషుమ్నేన వివర్ధయిత్వా ।
శుక్లే తు పూర్ణం దివసక్రమేణ తం కృష్ణ పక్షే విబుధాః పిబంతి ॥
పీతం తుసోమం ద్వికలావశిష్టం కృష్ణ క్షయే రశ్మిభిస్తం క్షరంతమ్ ।
సుధామృతం తత్పతరః పిబన్తి దేవాశ్చ సౌమ్యాశ్చ తథైవ కవ్యమ్ ॥
సూర్యేణ గోభిస్తు సముద్ధృతాభి రద్భిః పునశ్చైవ సముద్ధృతాభిః
వృష్యాతివృద్ధాభిరదౌషధీభిర్మర్త్యాః క్షుధంత్వన్నపానైగ్జయని ॥
అమృతేన తృప్తిస్వర్ణమాసం సురాణాం మాసార్థ తృప్తిః స్వదయా పితౄణామ్ ।
అన్నేన శశ్వత్తు దధాతి మర్త్యాన్ సూర్యః స్వయం తచ్చ భిభర్త గోభిః ॥
అయం హరిస్తైర్హరిభిస్తురంగమై రయన్ హిం చాపో హరీ తీతి రశ్మిభిః ।
విసర్గకాలే విసృజంశ్చ తాం పునర్బిబర్తి శశ్వత్ సవితా చరాచరమ్ ॥
హరిర్హరిద్భిర్హ్రియతే తురంగమైః పిబత్యథాపో హరిభిః సహస్రధా ।
తతః ప్రముంచత్యపి తాస్త్వ సౌహరిః సముహ్యమానో హరిభిస్తురంగమై ॥
ఈ దేవతలయొక్క వీర్యము ననుసరించి, తపస్సుననుసరించి యోగముననుసరించి, సత్యముననుసరించి ధర్మముననుసరించి బలము ననుసరించియు ఈ సూర్యుడు ఎట్లు తపించునో యట్లే వారియొక్క తేజస్సుచే సిద్దుడగును. ఈ విధముగా వీరు రెండేసి మాసములు సూర్యునీలో నివసింతురు. ఋషులు, దేవగంధర్వులు పన్నగాప్సరసల గణములు, గ్రామీణులు, యక్షులు, ఎక్కువ రాక్షసులు. వీరు తపింతురు, వర్షింతురు. ప్రకాశింతురు. వీతురు, సృజింతురు. ఈ లోకములో ప్రాణులయు శుభ కర్మను తొలగింతురు. పాపాత్ములైన మానవులు శుభమును వీరు హరింతురు. అక్కడక్కడ ప్రచారముల యొక్క పాపమును తొలగింతురు. వాయువేగము గలవారై కామగమనముగల (యధేచ్చాగమనముగల) వీరు దివ్యమైన విమానమున నున్నవారై పగలు ననుసరించి సూర్యునితోబాటు తిరుగుదురు. వర్షించుచున్న వారై తపించుచున్న వారై ప్రజలను సంతోషపెట్టుచున్న వారై ఈ లోకమున మన్వంతరము చివరి నుండియు ఈ ప్రాణులనందరిని రక్షింతురు. భూత భవిష్యద్వర్త మానముల నెవరుందురో మన్వంతరములలో అట్టి స్థానాభిమానుల కిది స్థానము, ఈ విధముగా పదునాలుగు మన్వంతర స్పష్టులలో ఆసప్తకులు నలుదెసల సూర్యునిలో నివసింతురు. రాత్రింబవళ్ళు గ్రీష్మ ఋతువున ఘర్మమును (వేడిని) హేమంత ఋతువున హిమమును, వర్ష ఋతువున వర్షమును గురియుచు, కాలముననుసరించి ఋతువశమున చుట్టు తిరిగిన కిరణములు గలవాడై సూర్యుడు దేవతలను పితరులను మనుజులను సంతోషపెట్టును. సూర్యుడు తనసుషుమ్న మను కిరణముచేత చంద్రుని పెంపొందజేసి యమృతముతో దేవతలను సంతోషపెట్టును. శుక్లపక్షమున దీవసక్రమమున నిండుగానైన యా చంద్రుని కృష్ణపక్షమున దేవతలు ద్రావుదురు. కృష్ణ పక్షములో క్షీణావస్థలో ఆ విధముగా త్రాగబడి రెండు కళలు మిగిలిన వాడై కిరణములతో క్షీణించుచున్న వాడగును. అట్టి చంద్రునిలోని యాసుధామృతమును సౌమ్యులైన (సోమ సంబంధులైన) దేవతలు త్రాగుదరు. అట్లే పితరులు దానిని కవ్యముగా త్రాగుదురు. సూర్యుడు తన కిరణములచే భూమి పైని జలములను పైకి తీసికొనిపోవును. తరువాత వర్షించిన వృష్టిచే ఫలపాకాంతములైన వరి గోధుమ మొదలగు ధాన్యౌషధులు వృద్ధిజెందును. వానియన్నపానములచే మర్యులు (మానవులు) ఆకలిని జయింతురు. దేవతలకు అమృతముతో సగము నెల (15 దినములు) తృప్తి కలుగును. పితరులకు స్వధచేత నలువదియైదు దినములు తృప్తి కలుగును. సూర్యుడన్నముతో మర్త్యులను ఎల్లప్పుడు ధరించును. అదియును తన కిరణములతో ధరించును. ఈ సూర్యుడు ఆ తన పచ్చని గుఱ్ఱములతో (కిరణములతో) బోవుచు, కిరణములతో జలమును హరించును. విసర్గ (సృష్టి) కాలమున మరల నా జలములను వదలును. ఈ విధముగా సూర్యుడెల్లప్పును స్థావర జంగమాత్మకమైన జగమునెల్లప్పుడు భరించును, సూర్యుడు తన పచ్చని గుజ్జములచే (కిరణములచే) జలములను హరించును. ఆ తరువాత కిరణముల చే వేయి(అనంత) ఔషధములుగా జలముల ద్రావును. తరువాత కిరణములను గుఱ్ఱములచే మోయబడుచున్నవాడై యీ సూర్యుడు ఆ జలములను వర్షరూపమున వదులును.
ఇత్యేష ఏకచక్రేణ సూర్యస్తూర్ణం రథేనతు ।
భద్రైస్తైరక్షతైరశ్యైః సర్పతేఽ సౌది విక్షయే ॥
అహోరాత్రాద్రథేనాసౌ ఏకచక్రేణ తు భ్రమన్ ।
సప్తద్వీపసముద్రాన్తం సప్తభిః సప్తభిర్హయైః ॥
ఛందోభిరశ్వరూపై సెస్తైర్యతశ్చక్రం తతః స్థితైః ।
కామరూపైః సకృదుక్తైరమితైస్తైర్మనోజవైః
హరితై రవ్యయైః పింగైరీశ్వర ర్బ్రహ్మవాదిభిః ।
అశీతిమండలశతం భ్రమన్త్యబ్దేన తే హయాః ॥
బాహ్యమభ్యంతరం చైవ మండలం దివసక్రమాత్ ।
కల్పాదౌ సంప్రయుక్తాస్తే వహన్త్యభూతా సంప్లవాత్ ।
ఆవృతావాలఖిల్యై స్తే భ్రమన్తే రాత్య్రహాని తు ॥
ప్రధితైర్వచోభిరగ్య్రై స్తూయమానో మహర్షిభిః ।
సేవ్యతే నృత్యగీతైశ్చ గంధర్వైరప్పరో గణైః ॥
పతంగః పతగైరశ్యైః భ్రమమాణోదివస్పతిః ॥
ఈ విధముగా నీ సూర్యుడు ఏక చక్రరథముతోను, భద్రములై నాశములేని యా గుఱ్ఱములతోను పగటి చివరి వరకు కదలుచు బోవును. సప్తద్వీపసముద్రములు చివరగల భూమిని యేడు గుఱ్ఱములతోను ఏకచక్రముతోను గూడిన రథముతో అహోరాత్రము ఈ సూర్యుడు తిరుగును. ఆ సూర్యుని రథాశ్వములు అశ్వరూపములైన ఛందస్సులు చక్రము వైపుననే యున్నవి. కామ రూపములు (కోరిన రూపమున ధరింపగలవి. ఒక్కమారే రథమునకు బూన్చబడినవి. ఒక పరిమితి (కొలత) లేనివి. మనోవేగముగలవి. పచ్చనివి, నాశములేనివి, పింగ(గోరోచన) వర్ణముగలవి, ఈశ్వర స్వరూపములైనవి. బ్రహ్మ(వేదము)ను బలుకునవి, ఇట్టి యా గుఱ్ఱములు సంవత్సరమున ఎనుబది నూర్ల మండలములను దిరుగును. కల్పాదియందు రథమునకు బూన్చబడిన యా గుజ్జములు భూత ప్రళయము వరకు దివసక్రమమున బాహ్యమండలమును అభ్యంతర మండలమును జుట్టినవై వాలఖిల్యులతోబాటు రాత్రింబవళ్ళు దిరుగును. పక్షులవలె ఆకాశమున వేగముగా బోవు గుఱ్ఱములచే దిరుగుచున్న దినపతియైన సూర్యుడు, వేదాది ప్రసిద్ధములైన శ్రేష్ఠములైన వాక్కులచే మహర్షులచే స్తుతింపబడుచున్న వాడై గంధర్వుల చేతను అప్సరోగణముల చేతను గీత నృత్యములచే సేవింపబడుచుండును.
వీథ్యాశ్రయాణి చరతి నక్షత్రాణి తథా శశీ ।
హ్రసవృద్ధీ తథైవాస్య రశ్మీనాం సూర్యవత్ స్మృతే ॥
త్రిచక్రోభయపార్శ్వస్థో విజ్ఞేయః శశినో రథః ।
అపాం గర్భ సముత్పన్నో రథః! సాశ్వః సపారథిః ॥
శతారైశ్చ త్రిభిశ్చక్రైర్యుక్తః శుక్లైర్హయోత్తమైః
దశభిస్తు కృశైర్దివ్యైరసంగైస్తైర్మనోజవైః ।
సకృద్యుక్తే రథే తస్మిన్ వహన్తే చాయుగక్షయాత్
సంగృహీతే రధే తస్మిన్ శ్వేతశ్చక్షుః శ్రవాస్తు వై ।
అశ్వాస్తమేకవర్ణాస్తే వహన్తే శంఖవర్చసమ్ ॥
యయుశ్చ త్రిమనాశ్చైవ వృషారాజీవలో హయః ।
అశ్వో వామస్తు రణ్యశ్చ హంసో వ్యోమీ మృగస్తథా ॥
ఇత్యేతే నామభిః సర్వే దశచంద్రమసో హయాః ।
ఏతే చంద్రమసం దేవం వహన్ తి దివసక్షయాత్ ॥
దేవైః పరివృతః సౌమ్యం పితృభిశ్చైవ గచ్ఛతి ।
సౌమ్యస్య శుక్ల పక్షాదౌ భాస్కరే పురతః స్థితే ॥
ఆపూర్యతే పున స్తాన్తః సతతం దివసక్రమాత్ ॥
దేవైః పీతం క్షయే సోమమాప్యాయయతి నిత్యదా ।
పీతం పంచదశాహన్తు రశ్మినేకేన భాస్కరః ॥
ఆపూరయన్ సుషుమ్నేన భాగం భాగమహః క్రమాత్ ।
సుషుమ్నాప్యాయమానస్య శుక్లా వర్థని వైకలాః ॥
తస్మాద్ధ్రసన్తి వై కృష్ణే శుక్ల ఆప్యాయయ న్తి చ ।
ఇత్యేవం సూర్యవీర్యేణ చంద్రస్వాప్యాయి తా తనుః ॥
పౌర్ణమస్యాం సదృశ్యేత శుక్లః సంపూర్ణమండలః ।
ఏవమాప్యాయితః సోమః శుక్లపక్షే దినక్రమాత్ ॥
తతో ద్వితీయా ప్రభృతి బహులస్య చతుర్దశీ ।
అపాం సారమయస్యేందో రసమాత్రాత్మకస్య చ ॥
పిబన్ త్యంబు మయం దేవా మధుసౌమ్యం సుధామయమ్ ॥
సంభృతం చార్థమాసేన అమృతం సూర్యతేజసా ।
భక్షార్థమమృతం సౌమ్యం పౌర్ణమాస్యాముపాసతే ॥
ఏకరాత్రం సురైఃసర్యైః పితృభిశ్చ మహర్షిభిః ।
సోమస్య కృష్ణ పక్షాదౌ భాస్కరాభిముఖస్య చ ॥
ప్రక్షీయతే పురస్యాంతః పీయమానాః కలాః క్రమాత్ ।
క్షయన్ తే తస్మాత్ కృష్ణేయాః శుక్ల హ్యాప్యాయయన్తి తాః ॥
ఏవం దినక్రమాతోతే విబుధాస్తు నిశాకరమ్ ।
పీత్వాఽర్ధ మాసం గచ్చన్తి అమావాస్యాం సురోత్తమాః
పితరశ్చోపతిష్ఠన్ తి అమావాస్యాం నిశాకరమ్ ॥
తతః పంచదశే భాగే కించిచ్ఛిష్టే కలాత్మకే ।
అపరాహ్ణే పితృగణైర్జఘన్యః పవర్యుపాస్యతే ॥
పిబన్ తి ద్వికలాకాలం శిష్టా తస్యతు యా కలా ।
నిఃసృతం తదా మావాస్యాం గభస్తిభ్యః స్వధామృతమ్ ।
తాం స్వధాం మాసతృప్త్యై తు పీత్వా గచ్ఛన్తి తేఽమృతమ్ ॥
సౌమ్యా బర్హిషదశ్చైవ అగ్నిష్వాత్తా సథైవ చ ।
కన్యాశ్చైవ తు యే ప్రోక్తాః పితరం సర్వ ఏవ తే ॥
సంవత్సరాస్తు వై కవ్యాః పంచాబ్దా యే ద్విజైః స్మృతాః ।
సౌమ్యాస్తు ఋతవో జ్ఞేయా మాసాబర్హిషదః స్మృతాః ॥
పితృభిః పీయమానస్య పంచదశ్యాం కలా తు వై ।
యావన్నక్షీయతే తస్య భాగః పంచదశస్తు సః ॥
అమావాస్యాం తదా తస్య అస్తమాపూర్యతే పరమ్ ।
వృద్ధిక్షయే వై పక్షాదౌ షోడశ్యాం శశినః స్మృతౌ ॥
ఏవం సూర్యనిమిత్తైషా క్షయవృద్ధిర్నిశాకరే ।
తారాగ్రహణం వక్ష్యామి స్వర్భానోశ్చ రథః పునః ॥
అట్లే చంద్రుడు వీధి నాశ్రయించియున్న నక్షత్రములను చరించును. అట్లే చంద్రునియొక్క కిరణములయొక్క వృద్దిక్షయములు సూర్యునివలెను యుండునని చ్పెబడినది. చంద్రుని రథము మూడు చక్రములు గలది. రెండు చక్రముల ప్రక్కన (మధ్యన)నున్నది. అని తెలియవలెను. ఆ రథము గుఱ్ఱములతోను, సారథితోను, జలగర్భమునుండి పుట్టినది. నూరు ఆకులుగల మూడు చక్రములతోను, తెల్లని శ్రేష్ఠములైన గుజ్జములతోను కూడియున్నది. సన్ననైనవియు దివ్యములైనవియు, సంగములేనివియు మనోవేగముగలవియునైన పది గుఱ్ఱములను ఒక్కమారే పూన్చిన యా రథము నా గుఱ్ఱములు యుగక్షయము వరకును మోసికొని పోవుచుండును. ఆ రథమట్లు సంగ్రహింపబడగా, తెల్ల సర్పము, ఒకే వర్ణముగల యా గుజ్జములును శంఖమువలె తెల్లనైన రథమును మోసికొనిపోవును. మయువు, త్రిమనము, వృషము, రాజీవలము, హయము, అశ్వము, వామము, తురణ్యము హంసము, వ్యోమి, మృగము. అనునవి. చంద్రుని పది గుఱ్ఱముల పేరులు. పగలు నశించినప్పటి నుండి దేవుడైన చంద్రుని మోసికొని పోవును. భాస్కరుడుముందు ఉండగా చంద్రుని శుక్లపక్ష ప్రారంభమున చంద్రుడు పితృదేవతలచే జుట్టబడి వెళ్ళుచుండును. దివసక్రమమున నెల్లప్పుడు తన పురముయొక్క లోపలనింపబడును. కృష్ణ పక్షమున దేవతలచే ద్రావబడిన చంద్రుని పదియైదు దినములు. సూర్యుడు ఒకే కిరణముచే నెల్లప్పుడు నింపి సంతసింపజేయును. సుషుమ్నయను కిరణములచే నెల్లప్పుడు నింపి సంతసింపజేయును. సుషుమ్న కిరణములచే దినక్రమముననుసరించి చంద్రుని ప్రతిభాగమును సూర్యుడు నింపుచుండును. సూర్యుని సుషుమ్న కిరణముచే శుక్లపక్షమున నింపి సంతసింపబడుచున్న చంద్రుని కళలు వృద్ధిజెందును. కావున కృష్ణపక్షమున చంద్రకళలు తగ్గును. శుక్లపక్షమున చంద్రకళలు వృద్ధిజెంటినిండును. ఈ విధముగా సూర్యుని వీర్యము (బలము)చే చంద్రుని శరీరము నిండును. ఈ విధముగ శుక్ల పక్షమున దీనక్రమమున చంద్రుడు కళలచే నిపంబడుటచే సంతుష్టి జెందింపబడినవాడై పూర్ణిమయందు తెల్లనివాడై నిండిన మండలముగలవాడై కనబడును. తరువాత బహుళపక్షమున ద్వితీయ నుండి చతుర్దశివరకు, జలసారమై రసమే, యాత్మగా గలిగిన చంద్రునియొక్క జలమయమై సౌమ్యమై సుధామయమైన మధువును దేవతలు ద్రావుదురు. సూర్యతేజస్సు చేత అర్ధ మాసములో దేవతలభోజనమునకై సౌమ్యమైన (చంద్రసంబంధియైన) అమృతము సంపాదింపబడును. దానిని పూర్ణిమయందు దేవతలు ఉపాసింతురు. కృష్ణపక్ష ప్రారంభమున, సూర్యునికెదురుగా నున్న చంద్రుని యొక్క కళలు ఒక రాత్రిలో సమస్త దేవతలచేతను, పితృదేవతలచేతను మహర్షులచేతను, త్రాగబడుచున్నవై క్రమముగా పురములోపల క్షీణించును. కావున కృష్ణ పక్షమున క్షీణించుకళలు శుక్లపక్షమున నా కళలను నింపును. ఈ విధముగా దినక్రమము గడవగా దేవతలు చంద్రుని నర్ధమాసం వరకు త్రాగి యాదేవోత్తములే అమావాస్యను జేరుదురు. పితరులు గూడ అమావాస్యయందు చంద్రునుపాసింతురు. ఆ తరువాత కళాత్మకమైన పదియైదవ భాగము కొద్దిగ మిగులగా అపరాష్ట్రమున పితృగణములచే ఆ మిగిలిన చివరి కళయే యుపాసింపబడును. చంద్రునిలో చివర మిగిలిన కళను రెండు కళల కాలము (60 కాష్టల కాలము) త్రాగుదురు. అది యమావాస్యలో కిరణముల. ద్వారా బయలువెడలిన స్వధామృతము. నెల తృప్తికై వారు ఆ స్వధను ద్రావి యమృతమును బొందుదురు. సౌమ్యులు (సోమ సంబంధులు), బర్హిషదులు. (దర్బలపై గూర్చునువారు) అగ్నిష్వాత్తులు, కవ్యులనబడు వారును వారందరును పితరులే. సంవత్సరములు కవ్యములు వారు బ్రాహ్మణులచే పంచాబ్దులు అని యనబడిరి. సౌమ్యములు ఋతువులని తెలియవలె. మాసములు బర్హిషదులనబడిరి. పితృదేవతలచే త్రాగబడుచున్న చంద్రుని యొక్క పదియైదవ కళ క్షీణము జెందనంతవరకు అది చంద్రుని పదియైదవ భాగము. అప్పుడమావాస్యలో చంద్రుని యొక్క చిట్టచివరి భాగము పూరించబడును. పక్షప్రారంభమున షోడశి (పదునాఱువ) కళయందు చంద్రుని యొక్క వృద్ధి క్షయములుండు ననబడినది. ఈ విధముగా చంద్రునియందలి క్షయ వృద్దులు సూర్యుని కారణమున గలిగినవి. ఇక తారాగ్రహముల యొక్కయు, రాహువుయొక్కయు రథమును గురించి వినుడు.
తోయ తేజోమయః శుభ్రః సోమపుత్రస్య వై రథః
ముకోహయైః పిశంగైస్తు అష్టాభిర్వాతరంహసైః ॥
సవరూథః సానుకర్షః సూతో దివ్యో రథే మహాన్ ।
సోపాసంగపతాకస్తు సధ్వజో మేఘసన్నిభః ॥
భార్గవస్య రథః శ్రీమాంస్తేజసా సూర్యసన్నిభః ।
పృధి వ్యాం సంభవైద్యుక్తో నానావర్ణైర్హయోతమైః ॥
శ్వేతః పిశంగః సారంగొ నీలః పీతో విలోహితః
కృష్ణశ్చ హరితశ్చైవ ప్పషతః పృష్ణిరేవ చ ॥
దశభిస్తైర్మహాభాగైరకృశైర్వాతవేగితైః ॥
అష్టాశ్వః కాంచనః శ్రీమాన్ సోమస్యాపి రథోఽభవత్ ।
అసంగైర్లోహితైరశ్వైః సర్వగైరగ్నిసంభవై ॥
సర్వతేఽ సౌ కుమారో వై జువక్రానుచక్రగః ।
తతస్త్వాంగి రసోవిద్వాన్ దేవాచార్యో బృహస్పతిః ।
శోణైరశ్యైః కాంచనేన స్యందనేన ప్రసర్పతి ॥
యుక్తస్తు వాజిభిర్దద్యైరష్టాభిర్వాత సమ్మితైః ।
నక్షత్రేఽ బ్దం నివసతి సవేగస్తేన గచ్ఛతి ॥
తతః శనైశ్యరోఽప్యశ్యైః శబలైర్వ్యో మసంభవైః ।
కార్షాయసం సమారు హ్యస్యందనం యాతి వై శనైః ।
స్వర్భానోస్తు తదైవాశ్వః కృష్ణాహ్యష్టౌ మనోజవాః ।
రథం తమోమయం తస్య సకృద్యుక్తా వహన్త్యుత ॥
ఆదిత్యాన్నిః సృతో రాహుః సోమం గచ్ఛతి పర్వసు ।
ఆదిత్యమేతి సోమాచ్చ పునః సౌరేఘ పర్వసు ॥
అథ కేతు రథస్తస్యాశ్వా అష్టాష్టౌవతరంహసః ।
పలాలధూమసంకాశాః బలారాసభారుణాః ॥
ఏతే వాహాగ్రహాణాం వై మహాప్రోక్తా రథైః సహ ।
సర్వే ధ్రువనిబద్ధాస్తే ప్రబద్ధా వాతరశ్మిభిః ॥
చంద్రపుత్రుడైన బుధుని యొక్క రథము జలతేజోమయమై శుభ్రమైనది. గోరోజన వర్ణముగలిగి వాయువేగము గల యెనిమిది గుజ్జములతో బుధ రథము పూన్చబడినది. ఆ రథమున మేఘముతో సమానమై గొప్పనైన సారధి యుండును. ఆ సారధి కవచముతో గూడినవాడు. ఆకర్షణము గలవాడు. దివ్యుడు అమ్ములపొదియు, ధ్వజమును ధ్వజస్తంభమును గలవాడు. శుక్రుని యొక్క రథము చక్కని శోభగలది. తేజస్సుతో సూర్యునితో సమానమైనది. భూమిలో బుట్టిన యనేక వర్ణములు గల శ్రేష్ఠమైన గుజ్జములతో బూన్చబడినది. ఆ గుఱ్ఱములు - శ్వేతము, పిశంగము, సారంగము, నీలము, పీతము, విలోహితము, కృష్ణము, మరితము, పృషతము, వృష్టి, అనునీ పది చంద్రుని యొక్క రథము గూడ ఎనిమిది గుఱ్ఱములు గలదై, బంగారు మయమై శోభించునది. అసంగములును, ఎటు పైనవియు, అంతటనుబోగలవియునైన యగ్నినుండి బుట్టిన గుజ్జములచే, చక్కగను వంకరగను చక్రముననుసరించి పోవువాడై యీ కుమారుడు (చంద్ర సారథి) కదలిపోవుచుండును. తరువాత ఆంగిరసుడును, విద్వాంసుడును, దేవాచార్యుడునైన బృహస్పతి యెట్లని గుఱ్ఱములతో బంగారు రథముతో (నాకాశమున) కదలిపోవును. దివ్యములు, వాయువేగములునైన న యెనిమిది గుఱ్ఱములచే బూన్చబడినదై నక్షత్రమున సంవత్సరముండును. వేగము గలదై యా నక్షత్రముతోనే వెళ్ళును. తరువాత శనైశ్చరుడు గూడ, ఆకాశమున బుట్టి చిత్ర వర్ణములు గల గుజ్జములతో నల్ల యినుము రథమునెక్కి మెల్లిగా వెళ్ళును. అట్లే రాహువు యొక్క గుజ్జములు మనోవేగము గలిగి నల్లనైన యెనిమిది గుజ్ఞములు అవి తమయమైన రాహు రథమునకు ఒక్కమారు బూన్చబడినవై రథమును లాగికొని పోవును. సూర్యుని నుండి బయలు వెడలిన రాహువు పర్వదినములందు (పూర్ణిమా మావస్యలందు) చంద్రుని జేరును. మరల చంద్రుని నుండి సౌర పర్వతములందు (అమావాస్య పర్వదినములందు సూర్యుని జేరును. ఇక కేతువు యొక్క రథము దాని గుజ్జములు వాయువేగముగల యెనిమిది గింజలేని వరిపోచ వర్ణము గలవి పొగవర్ణముగలవి చిత్రవర్ణము గలవి (కంచరి గాడిద యెరుపుగలవి. ఇవి గ్రహముల యొక్క గుఱ్ఱములు రథములతో బాటు నాచే జెప్పబడినవి. అవి యన్నీయు వాయువుల చేతను కిరణములచేతను బాగుగా కట్టబడినవై ధ్రువుని యందు నిబంధింపబడినవి.
ఏతే వై భ్రామ్యమాణాస్తు యథాయోగం భ్రమన్ తి వై ।
వాయవ్యాభిరదృశ్యాభిః ప్రబద్ధావాతరశ్మిభిః ॥
పరిభ్రమన్తి తద్భద్ధాశ్చంద్ర సూర్యగ్రహా దివి ।
భ్రమన్తమను గచ్చన్తి ధ్రువం తే జ్యోతిషాం గణాః ॥
యథా నద్యుదకే నౌస్తు సలిలేన సహోహ్యతే ।
తథా దేవాలయాహ్యేతే ఉహ్యన్తే వాతరశ్మిభిః ।
తస్మాత్సర్వేణ దృశ్యన్తే వ్యోమ్ని దేవగణాస్తు తే ॥
యావన్య శ్చైవ తారాస్తు తావన్తో వాతరశ్మయః ।
సర్వాధ్రువనిబద్ధాస్తా భ్రమన్త్యో భామయన్తి తమ్ ॥
తైలపీడాకరం చక్రం భ్రమద్భ్రామయతే యథా ।
తథా భ్రమన్తి జ్యోతీంషి వాతబద్ధాని సర్వశః ॥
అలాతచక్రవద్యాన్తి వాతచక్రేరితాని తు ।
తస్మాజ్జ్యోతిషి వహతే ప్రవహంస్తే నను స్మృతః ॥
ఏవం ధ్రువనిబద్ధోఽ సౌ సర్పతే జ్యోతిషాం గణః ।
సైష తారామయో జ్ఞేయం శిశుమారో ధ్రువో దీవి ॥
యదహ్నా కురుతే పాపం దృష్ట్యా తం నిశి ముచ్యతే ॥
యావత్యశ్చైవ తారాస్తాః శిశుమారాశ్రితా దివి ।
తావన్త్యేవ తు వర్షాణి జీవన్త్యభ్యధికాని తు ॥
శాశ్వతః శిశుమారోఽ సౌ విజ్ఞేయః ప్రవిభాగశః ।
ఉత్తానపాదస్తస్యాథ విజ్ఞేయోహ్యత్తరోహనుః ॥
యజ్ఞోఽధరస్తు విజ్ఞేయో ధర్మో మూర్ధానమాశ్రితః ।
హృది నారాయణః సాధ్యః అశ్వినౌ పూర్వపాదయోః ॥
వరుణశ్చార్యమా చైవ పశ్చిమే తస్య సక్థిని ।
శిశ్నః సంవత్సరస్తస్య మిత్రోఽ పానే సమాశ్రితః ॥
పుచ్ఛేగ్నిశ్చ మహేంద్రశ్చ మరీచిః కశ్యపో ధ్రువః ।
తారకాః శిశుమారశ్చ నాన్తమేతి చతుష్టయమ్ ॥
నక్షత్రచంద్రసూర్యాశ్చ గ్రహాసారాగణైః సహ ।
ఉన్ముఖాభిముఖాః సర్వే చక్రీ భూతాశ్రితా దివి ॥
ధ్రువేణాధిష్ఠితాః సర్వే ధ్రువమేవ ప్రదక్షిణామ్ ।
ప్రయాన్తీహ వరంశ్రేష్ఠ మేధీభూతం ధ్రువః స్మృతః ।
ఏక ఏవ భ్రమత్యేష మేరు పర్వతమూర్ధని ॥
జ్యోతిషాం చక్రమేతద్ధి సదాకర్షత్యవాఙ్మ్ఖః ।
మేరుమాలోకయత్యేష ప్రయాతీహ ప్రదక్షిణమ్ ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే ధ్రువచర్యా నామ ద్విపంచాశోఽధ్యాయః ॥
ఇవి వాయవ్యములైన పోతరశ్ములచే (వాయు కిరణములచేత) బాగుగా గట్టబడినవై త్రిప్పబడుచు యోగముననుసరించి (తమ చుట్టు తామును) తిరుగును. ఆకాశమున ధ్రువునిచే బద్దములై చంద్ర-సూర్యగ్రహములు చుట్టు తిరుగును. ఆ జ్యోతిర్గణములు (తన చుట్టు తాను) తిరుగుచున్న ధ్రువుని ననుసరించి తిరుగుచున్నవి. నదియొక్క జలమున నావ నీటితోబాటు మోయబడినట్లు ఈ దేవాలయములు (గ్రహాదులు) వాయు-కిరణములచే మోయబడును. నాకాశమున నా దేవగణములందరిచే జూడబడుచున్నవి. ఎన్ని నక్షత్రములున్నవి? అన్ని వాయు కిరణములున్నవి. అవి యన్నియు ధ్రువుని కేంద్రము బేసికొని కట్టబడినవై తాము దిరుగుచు ఆతనిని (ధ్రువుని) గూడ ట్రిప్పును. తైలమును (కందెనను) పీడించు చక్రము తాను దిరుగుచు ఇతరమును (రథాదులను) ద్రిప్పునట్లు వాయుబద్ధములైన జ్యోతిస్సులను (చుక్కలను) అంతటను త్రిప్పును. అందువలన జ్యోతీరూపములైన గ్రహనక్షత్రాదులు వాయు చక్రముచే ప్రేరేపింపబడినవై కొఱవి చక్రమువలె తాను పరుగెత్తుచునే గ్రహనక్షత్రాదులను పరుగెత్తింపజేయునని చెప్పబడినది. ఈ విధముగా జ్యోతిరూపములైన నక్షత్ర తారాగ్రహణములు ధ్రువునియందు నిబద్ధమైయున్నవి. ఆ ధ్రువుడుగ ఆకాశమున తారా ఏ (నక్షత్రమయమైన శిశుషామార రూపమని (మొసలి) తెలియదగినది. పగలు చేసిన పాపము రాత్రి యా ధ్రువుని జూచిన వదలిపోవును. ఆకాశమున ఈ శింశుమారము (మొసలి) నాశ్రయించిన తారలెన్ని కలవో అన్ని వర్షములు (సంవత్సరములు) అంతకంటే నెక్కువయును శింశుమారాశ్రితములైన తారలు జీవించును. ఈ శింశుమారము (మొసలి) శాశ్వతమైనది. ఇక విభాగ ప్రకారమైతే శింశుమార రూప ధ్రువునకు చెక్కిలిపై భాగము (ఉత్తరాహనువు) ఉత్తానపాదుడు అని తెలియవలెను.యజ్ఞము (అధర్హనవు) క్రింది చెక్కిలి భాగము అనియు ధర్మము శిరస్సు నాశ్రయించినదనియు, హృదయమున నారాయణుడు సాధ్యుడైయుండుననియు, పూర్వపాదములయందు' అశ్వినీ దేవతలిరువురును. వరుణుడును సూర్యుడును (ధ్రువశింశుమారము యొక్క తొడలయందును ఆశ్రయించియుండును. సంవత్సరము దాని శిశ్నము. అసానమున మిత్రుడు (సూర్యుడు) ఆశ్రయించును. తోకయందు అగ్నియు మహేంద్రుడును ఆశ్రయించియుండును. మరీచి, కశ్యపుడు తారకలును, శింశుమారరూపుడైన ధ్రువుడును ఈ నాలుగును అస్తమించవు, నక్షత్ర, చంద్ర, సూర్యులును తారాగణములతో గూడిన గ్రహములును అన్నియు ఆకాశమున చక్రీభూతమును (మండలమును) ఆశ్రయించినట్లే ఉన్ముఖములుగను అభిముఖములుగను) (పైకి ముఖములుంచిగాని ఎదురెదురుగ ముఖములుంచి గాని)యుండును. ధ్రువునిచే (ఆకాశమున) నిలుపబడినవై యన్ని గ్రహనక్షత్రములును ధ్రువునికే ప్రదక్షిణము జేయును. ఆ ధ్రువుడు వరుడు, శ్రేష్ఠుడు అందరికంటే పైనున్నవాడు. ఆకాశమున మిక్కిలి పైకి వృద్ధి చెందినవాడు. ధ్రువ అగ్ని కశ్యపులలో ధ్రువుడే శ్రేష్ఠుడనబడినాడు. ఈతడొక్కడే మేరు పర్వత శిరస్సున దిరుగును. ఈతడు అవాళ్ముఖుడైన (క్రిందు ముఖముగలవాడై) ఈ జ్యోతిశ్చక్రమునంతయు నెల్లప్పుడాకర్షించును. ఈతడు (ధ్రువుడు) మేరువునకు ప్రదక్షిణముగా బోవును, మేరువును జూచును.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ధ్రువచర్యయను నేబది రెండవ యధ్యాయము.