51 -  జ్యోతిష్ప్రచారో

సూత ఉవాచ:-

 స్వాయంభువే నిసర్గే తు వ్యాఖ్యాతాన్యుత్తరాణి తు ।

 భవిష్యాణి చ సర్వాణి తేషాం వక్ష్యామ్యనుక్రమమ్ ॥

ఏతచ్ఛృత్వా తుమునయః పప్రచ్ఛుర్లోమర్షణమ్ ।

 సూర్యచంద్రమసోశ్చారమ్ గ్రహాణాం చైవ సర్వశః ॥

 ఋషయ ఊచు:

భ్రమన్తే కథమేతాని జ్యోతీంషి దివిమండలమ్ ।

తిర్యగ్వ్యూహేన సర్వాణి తథైవాసంకరేణ చ ॥

కశ్చ భామయతే తాని భ్రమన్తి యది వా స్వయమ్ ॥

 ఏతర్వేదితుమిచ్ఛామస్తన్నో నిగద సత్తమ ।

భూతసమ్మోహనం త్వేతచ్ఛ్రోతు మిచ్ఛాప్రవర్తతే ॥

సూతుడనెను:- స్వాయంభువ(మన్వంతర) సృష్టిలో ఉత్తర విషయములన్నియు వ్యాఖ్యానింపబడినవి. వాని యొక్క సమస్త భవిష్య విషయములను క్రమముగా జెప్పెదను. ఇది విని మునులు లోమహర్షణుని (సూతుని) సూర్యచంద్రుల యొక్క సంచారమును. అంతట గ్రహములయొక్క సంచారమును గూర్చి యడిగిరి. ఋషులనిరి. ఆకాశమున ఈ జ్యోతిస్సులు (కాంతిగలవస్తువులు) ఎట్లు మండలముగా తిరుగుచున్నవి? అడ్డముగను సమూహముగను కలియకుండగనుఎట్లు తిరుగుచున్నవి? వానినెవ్వడు త్రిప్పుచున్నాడు? లేదా అవి స్వయముగనే తిరుగుచున్నవా?. ఓ మహాజ్ఞానవంతుడా ఇది మేము తెలియదలచితిమి. దానిని మాకు జెప్పుడు. ఇది ప్రాణులందరి నాశ్చర్యమున ముంచునది. దీనిని వినగోరిక గలుగుచున్నది.

సూత ఉవాచ:-

భూతసమ్మోహనం హ్యేతద్భ్రువతో మే నిబోధత ।

ప్రత్యక్షమపిదృశ్యం యత్ తత్సంమోహయతే ప్రజాః ॥

 యోఽసౌ చతుర్దశం పుచ్చే శిశుమారే వ్యవస్థితః ।

ఉత్తానపాదపుత్రోఽ సౌఽమేఢీభూతో ధ్రువో దివి ॥

 స హి భ్రమన్ భ్రామయతే చంద్రాదిత్యౌగ్రహైః సహ ।

 భ్రమంతమనుగచ్ఛన్తి నక్షత్రాణి చ చక్రవత్ ॥

ధ్రువస్య మనసా చాసౌ సర్పతే భగణః స్వయమ్ ।

 సూర్యా చంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహైః సహ ॥

 వాతానీకమయై ర్బంధైర్ద్రువే బద్ధాని తాని వై ।

తేషాం యోగశ్చ భేదాశ్చ కాలచార స్తథైవ చ ॥

అస్తోదయౌ తథోత్పాతాః అయనే దక్షిణోత్తరే ।

విషువద్గ్రహవర్ణాశ్చ ధ్రువాత్సర్వం ప్రవర్తతే ॥

వర్షా ఘర్మో హిమం రాత్రిః సంధ్యాచైవ దినం తథా ।

 శుభాశుభం ప్రజానాం చ ధ్రువాత్సర్వం ప్రవర్తతే ॥

 ధ్రువేణాధికృతాం శ్చైవ సూర్యోపావృత్య తిష్ఠతి ।

 తదేషదీప్తకిరణః సకాలాగ్నిర్దివాకరః ॥

 పరివర్తక్రమా ద్విపాభాభిరాలోకయన్ దిశః ।

 సూర్యః కిరణజాలేన వాయుయుక్తేన సర్వశః ॥

జగతో జలమాదత్తే కృత్స్నస్య ద్విజసత్తమాః ॥

 ఆదిత్యపీతం సూర్యాగ్నేః సోమం సంక్రమతే జలమ్ ।

 నాడీభిర్వాయుయుక్తాభి ర్లోకాధానం ప్రవర్తతే ।

 యత్యోమాత్స్రవతే సూర్యస్తదగ్రేప్వవ తిష్ఠతే ।

 మేఘావాయునిఘాతేన విసృజన్తి జలం భువి ॥

ఏవముక్షిప్యతే చైవ సతతే చ పునర్జలమ్ ।

 నానాప్రకారముదకం తదేవ పరివర్తతే ॥

సంథారనార్థం భూతానాం మాయైషా విశ్వనిర్మితా ।

అనయామాయ యా వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్ ॥

సూతుడనెను:- ఇది ప్రాణుల కాశ్చర్యకరము దీనిని జెప్పెదవినుడు. ప్రత్యక్షముగా గనబడుచునే ప్రజలనాశ్చర్యపరచును. ఎవడు శింశు మారచక్రము యొక్కతోకయందు నాలుగు దిక్కుల (బ్రకాశించుచు) చక్కగా స్థిరపడియున్నాడో వాడు ఉత్తానపాదుని పుత్రుడై యాకాశమున మేఘీ భూతుడై ధ్రువుడు (గొఱ్ఱయాకారముననున్నవాడు), అతడు తన చుట్టు తాను తిరుగుచు గ్రహములతో బాటు చంద్రసూర్యులను త్రిప్పుచున్నాడు. తిరుగు చున్నయా ధ్రువుని ననుసరించి నక్షత్రములు చక్రమువలె దీరుగును. ధ్రువుని యొక్క మనస్సుతోనే యీ నక్షత్రగణము స్వయముగ గదిలిపోవును. గ్రహములతో బాటు సూర్యచంద్రులు తారా నక్షత్రములును స్వయముగా కదిలిపోవుచున్నవి. వాయువను సేనతో నిండినబంధములచే గ్రహములతోగూడిన తారనక్షత్రములు కట్టబడినవి. వానియొక్క యోగములు, భేదములు, అట్లే కాలచారములు. అట్లే అస్తోదయములు, ఉత్పాతములు, దక్షిణోత్తరాయణములు, విఘవత్తులు, గ్రహముల వర్ణములను మొత్తము ధ్రువుని నుండీయే ప్రవర్తిల్లును. వర్షములు, ఎండ, మంచు, రాత్రి సంధ్యదినము, అట్లే ప్రజల శుభాశుభులు, సమస్తము ధ్రువునినుండియే ప్రవర్తిల్లును. ధ్రువునిచే నదికృతులైన వారిని తొలగి సూర్యుడుండును. కావున అట్టి ఈ సూర్యుడు మండిన కిరణములుగలిగిన సూర్యుడు కాలాగ్నివలె నుండున. ఓ మహాజ్ఞానులైన బ్రాహ్మణులారా తిరుగునట్టి క్రమమున తన కాంతులతో దిక్కులను వెలిగించుచు(చూచుచు) వాయువుతో గూడిన కిరణజాలముచే సమస్త జగముయొక్క అంతటను జలమును లాగును. సూర్యునిచే త్రాగబడిన జలము సూర్యాగ్నినుండి చంద్రుని సంక్రమించును. వాయువుతో గూడిన (సూర్య) నాడులచే లోకముల యునికి జరుగును. సూర్యుడు చంద్రుడినుండి స్రవించిన జలమును మేఘముల చివరలలో నుండును. వాయువు తాకిడిచే మేఘములు జలమును భూమి పై గురియును. ఈ విధముగా జలము పైకి లేపబడును. మరల క్రింద భూమి పై బడును. అదే జలము అనేక విధముల మారుచుండును. భూతముల నిలుపుటకు ఈ మాయ (విశ్వునిచే) విశ్వవంతయు నిర్మింపబడినది. ఈ మాయచేతనే చరాచరములతో గూడిన మూడు లోకములును వ్యాపించబడినవి.

విశ్వేశో లోకకృద్దేవః సహస్రాంశుః ప్రజాపతిః ।

 ధాతా కృత్స్నన్యలోకస్య ప్రభుర్విష్ణుర్దివాకరః ॥

 సర్వలౌకికమంభో వై యత్సోమాన్నభసః సృతమ్ ।

 సోమాధారం జగత్సర్వం తత్తథ్యం ప్రకీర్తితమ్ ॥

 సూర్యాదుష్ణం నిస్రవతే సోమాచ్ఛీతం ప్రవర్తతే ।

 శీతోష్ణవీర్యౌద్వా వేతౌ యుక్తే ధారయతో జగత్ ॥

 సోమాధారానదీ గంగా పవిత్రా విమలోదకా ।

 సోమపుత్రపురోగాశ్చమహానద్యో ద్విజోత్తమాః ॥

 సర్వభూత శరీరేషు ఆపో హ్యనుగతాశ్చ యాః ।

తేషు సందహ్యమానేషు జంగమస్థావరేషు చ ॥

ధూమభూతాస్తు తా ఆపో నిష్క్రామన్ తీహ సర్వశః ॥

 తేన చాబ్రాణి జాయన్ తే స్థానమాత్రాంభసాం స్మృతమ్ ।

 ఆర్కం తేజో హి భూతేభ్యోహ్యాదత్తేరశ్మిభిర్జలమ్ ॥

 సముద్రాద్వాయు సంయోగద్వహన్ త్యాపో గభస్తయః ।

 యతస్త్వృతువశాత్కాలే పరివర్తో దివాకరః ॥

యచ్ఛత్యపోహి మేఘేభ్యః శుక్లాః శుక్లగభస్తిభిః ॥

అభ్రస్థాః ప్రపన్త్యాపో వాయునా సముదీరితాః ।

 సర్వభూతహితార్థాయ వాయుభిశ్చ సమన్తత ॥

 తతో వర్షతి షణ్మాసాన్ సర్వభూత వివృద్ధయే ।

 వాయువ్యంస్తనితం చైవ వైద్యుతం చాగ్నిసంభవమ్ ॥

మేహ నొచ్చమిహేర్దాతోర్మేఘత్వం వ్వర్మే జయన్తి చ ।

న భ్రశ్యన్తి యతస్యాపస్తదభ్రం కవయో విదుః ॥

 మేఘానాం పునరుత్పత్తి స్త్రివిధా యోనిరుచ్యతే ।

ఆగ్నేయా బ్రహ్మజా శ్చైవ పక్షజాశ్చ పృథగ్విథాః ॥

 త్రిథా ఘనాః సమాఖ్యాతాః తేషాం వక్ష్యామి సంభవమ్ ॥

 ఆగ్నేయా స్త్వర్ణజాః ప్రోక్తా స్తేషాం తస్మాత్ ప్రవర్తనమ్ ।

శీతదుర్దిన వాతా యే స్వగుణాస్తే వ్యవస్థితాః ॥

 మహిషాశ్చవరాహాశ్చ మత్తమాతంగగామినః ।

 భూత్వా ధరణి మభ్యేత్య విచరన్తి రమన్తి చ ॥

జీమూతా నామ తే మేఘాః ఏతే భ్యోజీవసంభవాః ।

 విద్యుద్గుణ విహీ నాశ్చ జలధారా విలంబినః ॥

మూకాఘనా మహాకాయా ప్రవాహస్య వశానుగాః ।

క్రోశమాత్రోచ్చవర్షన్తి క్రోశార్ధాదపి వా పునః ॥

 పర్వతాగ్రనితంబేషు వర్షన్తి చ రమన్తిచ ।

 బలాకాగర్ధభాశ్చైవ బలాకా గర్భధారిణః ॥

బ్రహ్మజా నామ తే మేఘా బ్రహ్మనిః శ్వాససంభవాః ।

తే హి విద్యుద్గుణోపేతాః స్వనయన్తి స్వనప్రియాః ॥

తేషాం శబ్దప్రణాదేన భూమిః స్వాంగరుహోద్గమా ।

 రాజ్ఞీరాజ్ఞా భిషిక్తేవ పునర్యౌవనమశ్నుతే ॥

 తేష్వియం ప్రీతిమాసక్తా భూతానాం జీవితోద్భవా ॥

జీమూతా నామ తే మేఘాస్తేభ్యోజీవస్య సంభవాః ।

 ద్వితీయం ప్రవహం వాయుం మేఘస్తేతు సమాశ్రితాః ॥

 ఏతే యోజనమాత్రాచ్చ సార్ధార్ధాన్నిష్కృతాదపి ।

వృష్టిసర్గస్తథా తేషాం ధారాసారాః ప్రకీర్తితాః ॥

పుష్కరావర్త కా నామ యే మేఘాః పక్షసంభవాః ॥

 శక్రేణ పక్షచ్చిన్నా యే పర్వతానాం మహౌజసామ్ ।

 కామగానాం ప్రవృద్దానాం భూతానాం శివమిచ్చతా ॥

పుష్కరా నామ తే మేఘాబృహన్తస్తోయమత్సరాః ।

నానారూపధరాశ్చైవ మహాఘోరతరాశ్చ తే ।

 కల్పాన్తవృష్టే స్రష్టారః సంవర్తాగ్నేర్నియామకాః ॥

వర్షన్త్యేతే యుగాన్తేషు తృతీయా స్తే ప్రకీర్తితాః ।

అనేకరూపసంస్థానాః పూరయన్తో మహీతలమ్ ।

 వాయుం పరం వహన్తః స్యురాశ్రితాః కల్పసాధకాః ॥

 యాన్యస్యాండకపాలస్య ప్రాకృతస్యాభవం స్తదా ।

 తస్మాద్భ్రహ్మాసముత్పన్నశ్చతుర్వక్త్రః స్వయంభువః ॥

 తాన్యేవాండకపాలస్య సర్వే మేఘాః ప్రకీర్తితాః ॥

 తేషామాప్యాయనంధూమః సర్వేషామ విశేషతః ।

తేషాం శ్రేష్ఠస్తు పర్జన్యశ్చత్వారశ్చైవ దిగ్గజాః ॥

 గజానాం పర్వతానాం చ మేఘానాం భోగిభిః సహ ।

కులమేకం పృథక్ భూతం యోనిరేకా జలం స్మృతమ్ ॥

పర్జన్యో దిగ్గజాశ్చైవ హేమన్ తే శీతసంభవాః ।

తుషారవృష్టిం వర్షన్తి సర్వసస్య వివృద్ధయే ॥

 శ్రేష్ఠః పరివహో నామ తేషాం వాయురుపాశ్రయః ।

యోఽసౌ బిభర్తి భగవాన్ గంగామాకాశ గోచరామ్ ।

 దివ్యామతిజలాం పుణ్యాం విద్యాం స్వర్గపథి స్థితామ్ ॥

తస్యావిష్పందం తోయం దిగ్గజాః పృధుభిః కరైః ।

 శీకరం సంప్రముంచన్తి నీహార ఇతి సంస్మృతః ॥

దక్షిణే న గిరిర్యోఽసౌ హేమకూటేతి స్మృతః ।

ఉదగ్ హిమవతః శైలాదుత్తరస్య చ దక్షిణే ॥

 పుండ్రం నామ సమాఖ్యాతం నగరం తత్ర వై స్మృతమ్ ॥

తస్మిన్నిపతితం వర్షం యత్తుషార సముద్భవమ్ ।

తతస్తదావహావాయుర్హిమశైలాత్ సముద్వహన్ ॥

ఆనయత్యాత్మయోగేన సించమానో మహాగిరిమ్ ॥

హిమవన్త మతిక్రమ్య వృష్టిశేషమతః పరమ్ ।

ఇహాబ్యేతి తత పశ్చాదపరాన్తవివృద్ధయే ॥

మేఘం వాప్యాయతశ్చైవ సర్వమేతత్ప్ర కీర్తితమ్ ।

 సూర్యఏవ తు వృష్టీనాం స్రష్టా సముపదిశ్యతే ॥

విశ్వేశుడును, లోకకారకుడును, దేవుడును, వేయికిరణములు గలవాడును. ప్రజాపతియు, బ్రహ్మయును, సమస్తలోకమునకు ప్రభువును, విష్ణువునునైనవాడు దివాకరుడు (సూర్యుడు). సర్వలోకములలోని జలము ఆకాశమున చంద్రుడి నుండి స్రవించినందున ఈ జగమంతయు చంద్రుడాధారముగా గలది. ఇది నిజమని చెప్పబడినది. సూర్యునినుండి జలమువేడిమై స్రవించును. చంద్రునినుండి యది చల్లనగును. శీతోష్ణవీర్యులైన యీ చంద్రసూర్యు లిరువురును గలిసి జగత్తును ధరించుచున్నారు. చంద్రుడాధారముగాగల నది గంగ పవిత్రమై స్వచ్చమైన జలములు గలది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మహానదులు చంద్రపుత్రులు మొదలైనవి. సర్వప్రాణుల శరీరముల జలములు అనుగతములై యున్నవి. స్థావరజంగమ ప్రాణులైన యవి కాల్పబడుచుండగా నీట ఆ జలములు పొగరూపములై యంతట వెలువడును. దానిచేత ఆయా చోట్లలో నిలిచి యున్న జలముల యొక్క మేఘములు ఏర్పడును. సూర్యతేజస్సు తన కిరణములచేత ప్రాణులనుండి జలమును లాగుకొనును. సూర్యకిరణములు వాయుసంయోగమున సముద్రమునుండి జలములధరించును. ఋతువశమున వర్షకాలమున సూర్యుడు తిరిగినవాడై తన తెల్లని కిరణములచేత తెల్లని నీటిని మేఘములకీచ్చును. మేఘములందున్న జలములు వాయుప్రేరితములై సర్వప్రాణులహితమునకై(వర్షముగా)పడును. ఆ వాయువుల చేతనే సర్వప్రాణులవృద్ది కొఱకు ఆజుమాసములంతట వర్షించును. అపుడు వాయువ్యదిక్కున మెలుపువలన వచ్చిన యగ్నితోబుట్టిన గర్జనము కలుగును. తడుపుట యనువర్షముగల మీహధాతువునుండి మేఘ శబ్దము బుట్టినది. మేహనము(తడుపుటను) చేయుట వలన మేఘమయినదని వ్యాకర్తలు వ్యంజింపజేసిరి. వీనినుండి జలములు జారి పడవు గావున (న భ్రశ్యంతీతి) మేఘములు అభ్రములైనవి అనికవులు వ్యత్పత్తిని జూపుదురు. మేఘములు బుట్టుకోరణములు మూడు అని చెప్పబడినది. ఆగ్నేయములు, బ్రహ్మజములు, పక్షజములు-అని మూడు విధములని మేఘములు చెప్పబడినవి. వాని పుట్టుకను జెప్పెదను. ఆగ్నేయములు (అగ్నినుండి బుట్టినవి) ఐన మేఘములు సముద్రమున బుట్టినవని చెప్పబడినవి. కావున ఆగ్నేయ మేఘములు సముద్రమునుండి బుట్టును. చల్లదనము, మేఘములు ఆకాశమునిండగప్పియుండుట, వాయువులు వీచుట-ఇవి వానిస్వగుణములు. దున్నపోతులు, పందులు, మదపుటేనుగలపై బోవువానిగా నయి భూమిమీదికి వచ్చి చరించును దమించును. జీమూతములను మేఘము ఈ ప్రాణులనుండి బుట్టినవి. మెఱుపులు లేనివి. జలధారలవలే ఆకాశమునుండి నల్లగా వ్రేలాడునవి. మూగవి (గర్జింపనివి) ఘనములు (దట్టమైనవి) ఆకాశమంతయు వ్యాపించినవి, జలప్రవాహమునకు వశమై పోవునవి. ఒక క్రోశము ఎత్తునుండి గాని ఒకటిన్నర కోశము ఎత్తునుండి గాని వర్షించును. పర్వతాగ్రములందును పర్వతమధ్యములందును వర్షించును క్రీడించును. కొంగలు గాడిదలును క్రీడించును. కొంగలు గర్భము ధరించును. ఇక బ్రహ్మజములను మేఘములు:- అవి బ్రహ్మ నిట్టూర్పులవల్ల బుట్టినవి. అవి మెఱుపుతీవలతో గూడియుండును. ధ్వని ప్రియములై గర్జించుచుండును. ఆమేఘముశబ్దధ్వనిచే భూమితన శరీరము పై వృక్షాదుల యంకారములు గలది యగును. రాజుచే పట్టాభిషిక్తురాలైన రాణీ వలె మరల యౌవనవతి యగును. భూతముల (ప్రాణుల) జీవనోత్పత్తికి కారణమై భూమి యా మేఘములందు ప్రేమాసక్తయగును. జీమూతములను నా మేఘములనుండి జీవము బుట్టును. ఆ మేఘము రెండవదైన ప్రవహమను వాయువునాశ్రయించి యుండును. ఇవి ఒక యోజనము (ఎత్తు)నుండిగాని, సార్థార్ధమునుండిగాని, నిష్కృతమునుండి గాని వర్షమును గురియును. వాని వర్షధారలు జడివానలుగా నుండుననబడినవి. పుష్కరావర్తకములను మేఘములు పక్షము (ఱెక్క)లనుండి బుట్టినవి. మహాబలముగలిగి, స్వేచ్ఛాగమనము గలిగి బాగా పెరిగిన పర్వతముల లెక్కలు ప్రాణుల యొక్క మంగళమును గోరి యింద్రునిచే తన వజ్రాయుధముతో ఖండింపబడినవి. పుష్కరావర్తకములా పక్షము(ఱెక్క)లనుండి బుట్టినవి. పుష్కరములను నామేఘములు చాల పెద్దవి. జలముతో(మహాజలమున్నదని)మాత్సర్యమును జెందినవి. ఆ కారణముచేతనే యచటసువి పుష్కరావర్తక (జలముజుట్టియున్నవి) శబ్దముతో బిలువబడినవి. అవి యనేకరూపముల ధరించినవి. మిక్కిలి భయంకరములైనవి. కల్పప్రళయవర్షమును గురియగలివి. సంవర్తమను ప్రళయాగ్నిని జల్లార్పగలవి. ఇవి యుగాన్తములలో వర్షించును. ఇవి మూడవవిగా జెప్పబడినవి-అనేక రూపములు, అనేకస్థావరములును గలవై భూతలము నంతయు జలముతో నింపుచున్నవే పరమను వాయువును కల్పసాధకములై ఆశ్రయించును. ప్రాకృతికమైన యండము(పగిలిదాని)నుండి బ్రహ్మపుట్టెను. అతడు నాలుగుముఖములు గలవాడు. స్వయంభువు (తనకుతానే పుట్టినవాడు) ఆ పగిలిన బ్రహ్మాండకపాలమునుండియే జలములు బుట్టినవో అవి యన్నియు మేఘములే యుబడినవి. ఆ జలములకు తృప్తికరమైన నివాసము ధూమము. ఇది యన్ని మేఘములకు సామాన్యము వానిలో శ్రేష్ఠమైనది. పర్జన్యుడు, నాలుగుదిగ్గజములను. ఏనుగులకును, పర్వతములకును, మేఘములకును, పాములకును వేరుగానైన కులమొక్కటే. వానికి పుట్టుస్థానము ఒక్కటే. అది జలమనబడినది. పర్జన్యుడు, దిగ్గజములును హేమనమున శీతమునుండి బుట్టినవి అవి సర్వసస్యముల వృద్దికొఱకు మంచు వర్షమును గుజపించును. శ్రేష్ఠమైన పరివహమను వాయువు వానికి ఉపాశ్రయము. ఈ భగవత్ స్వరూపుడైన పరీవహవాయువు ఆకాశమున గనబడుగంగను భరించును. ఆ గంగ దివ్యమైనది. బహుజలములుగలది. పుణ్యయైనది. సర్వమార్గమున నున్న విద్యయైనది. ఆ గంగ యొక్క కదలికలవలన గలిగిన జలమును దిగ్గజములు తమ విశాలములైన తొండములచే తుంపరగా నేగజిమ్మును. అది మంచనబడినది. హిమాలయమునకుత్తరమున దక్షిణముగానున్న గిరి హేమకూటమనబడినది. ఉత్తర హిమాలయమునుండి దక్షిణమున పుండ్రమను నగరమున్నదనబడినది. దానిపై బడిన వర్షము మంచు నుండి పుట్టినది. తరువాత ఆవహమను వాయువు హిమశైలమునుండి వీచుచు తనతాకిడిచే నా మహాగిరిని తడుపుచు నావర్షమును దీసికొనివచ్చును. హివవస్త్రమును దాటి తరువాతి ప్రదేశమున మిగిలిన వర్షము పడున. రెండు మేఘము లీవిధముగ తమ వర్షములతో తృప్తిని గలిగించును. ఇదియంతయు చెప్పబడినది. చివరకు సూర్యుడే వర్షములను సృష్టించువాడని చెప్పబడుచున్నది.

ధ్రువేణావేష్టితః సూర్యస్తాభ్యాం వృష్టిః ప్రవర్తతే ।

 ధ్రువేణావేష్టితో వాయుర్వృష్టిం సంహరతే పునః ॥

 గ్రహాన్నిసృత్య సూర్యాత్తు కృత్స్నే నక్షత్రమండలే ।

 వారస్యాన్ తేత్య విశత్యర్కం ధ్రువేణ పరివేష్టితమ్ ॥

అతః సూర్యరథస్యాధ సన్నివేశం నిబోధత ।

సంస్థితే నైకచక్రేణ పంచారేణ త్రినాభినా ॥

హిరణ్మయేన భగవాన్ పర్వణా తు మహౌజసా ।

 నష్టవర్త్మాంధకారేణ షట్ప్రకారైకనేమినా ॥

 చక్రేణ భాస్వతా సూర్యః స్వరదనేన ప్రసర్పతి ॥

దశయోజనసాహస్రో విస్తారా యామతః స్మృతః ।

 సతస్య బ్రహ్మణా సృష్టోరదోహ్యర్థవశేన తు ।

 అసంగః కాంచనో దివ్యో యుక్తః పరమగైర్హయైః ॥

ఛందోభిర్వాజ్జిరూపైస్తు యతః శుక్రస్తతః స్థితః ।

వరుణస్యందన స్త్వేహ లక్షణైః సదృశస్తు సః ॥

 తేనాసౌ సర్పతి వ్యోమ్ని భాస్వతా తు దివాకరః ॥

 అథేమాని తు సూర్యస్య ప్రత్యంగాని రథస్య తు ।

 సంవత్సరస్యావయవైః కల్పితాని యథాక్రమమ్ ॥

అహస్తు నాభిః సూర్యస్య ప్రత్యంగాని రథస్య తు ।

 ఆరాః పంచర్తవస్తస్య నేమిః షడృతవః స్మృతాః ॥

 రథనీడః స్మృతోహ్యబ్ధః స్త్వయనే కూబరావుభౌ ।

 ముహూర్తాబంధురాస్తస్యశమ్యా తస్యకలాః స్మృతాః ॥

తస్య కాష్ఠాః స్మృతా ఘోణా ఈషాదండః క్షణాంస్తు వై ।

విమేషాశ్చానుకర్షోఽస్య ఈషాచాస్యలవాః స్మృతాః ॥

రాత్రిర్వరూధోఘర్మస్య ధ్వజూర్థ్వసముచ్ఛ్రితః ।

యుగాక్షకోటీ తే తస్య అర్థకామావుభౌ స్మృతాః ॥

 సప్తాశ్వరూపాశ్ఛందాంసి వహన్ తే వామతో ధరామ్ ।

 గాయత్రీ చైవ త్రిష్ణుప్చ అనుష్టుబ్ జగతీ తథా ॥

 పంక్తిశ్చ బృహతీ చైవ ఉష్ణిక్ చైతు సప్తమమ్ ।

అక్షేచంక్రం నిబద్ధంతుధ్రువేత్వక్షః సమర్పితః ॥

 సహ చ క్రో భ్రమత్యక్షః సహక్షోభ్రమతిధ్రువః ।

అక్షః సహైవ చక్రేణ భ్రమతేఽ సౌ ధ్రువేరితః ॥

 ఏవమర్థవశాత్తస్య సన్నివేశో రథస్య తు ।

తథా సంయోగభాగేన సంసిద్ధో భాస్వరో రథః ॥

 తేనాసౌ తరణిర్దేవస్తరసా సర్పతే దివి ।

 యుగాక్షకోటి సంబద్ధౌ రశ్మీద్వౌ స్యంధనస్య హి ॥

 ధ్రువేణ భ్రమతో రశ్మీ విచక్రయుగయోస్తు వై ।

 భ్రమతో మండలాని స్యుః ఖే చరస్యపా రథస్య తు ॥

 యుగాక్షకోటీ తే తస్య దక్షిణే స్యందనస్య తు ।

 ధ్రువేణ సంగృహీతే వై ద్విచక్రశ్వేతరజ్జువత్ ॥

భ్రమన్త మనుగచ్ఛేతాం ధ్రువం రశ్మీ తు తావుభౌ ।

యుగాక్షకోటీ తే తస్య దక్షిణే స్యందనస్య తు ॥

కీలాసక్తో యథారజ్జు ర్భ్రయతే సర్వతో దీశమ్ ।

ప్రసతస్తస్యరశ్మీ తౌ మండలే సషూత్తరాయణే ॥

 వర్ధేతే దక్షిణే చైవ భ్రమతో మండలాని తు ।

 ధ్రువేణ సంగృహీతౌ తు రశ్మీ వై నయతో రవిమ్ ॥

తథైవ బాహ్యతః సూర్యో భ్రమతే మండలాని తు ।

ఉద్వేష్టయన్ స వేగేన మండలాని తు గచ్ఛతి ॥

 ఇతిశ్రీమహాపురాణే వాయుప్రోక్తే జ్యోతిష్ప్రచారో నామైకపంచాశోఽధ్యాయః ॥

 ధ్రువునిచే సూర్యుడు ఆవేషింపబడును.(చుట్టబడును) వారిరువురిచేత వర్షము కలుగును. ధ్రువునిచే జుట్టబడిన వాయువు మరల వర్షమునుపసంహరించును. సూర్యగ్రహమునుండి బయలువెడలి సమస్తమైన నక్షత్రమండలమున వారము చివర ధ్రువునిచే జుట్టబడిన సూర్యుని (జలము) ప్రవేశించును. అందువల్ల ఇక సూర్యరథముయొక్క సన్నివేశమును వినుడు. భగవంతుడైన సూర్యుడు ప్రకాశించు నొకే చక్రముగల రథముచేత నాకాశమున కదలిపోవును. ఆ చక్రము బంటిది, చక్కగా నమర్చబడినది. ఐదు ఆకులు గలది. మూడు నాభులు(బండికంటి తూములు) గలది. బంగారముతో నిర్మింపబడినది.(తేజస్సుతో నిర్మింపబడినది), అమావాస్యాదిపర్వముతో గొప్ప ఓజస్సు(తేజోబలము) గలది. నశించిన దారిచీకటిగలది, ఆయువిధములుగా నున్న ఒక్కచక్రపుటంచు(పట్టా)గలది. ఇట్టి చక్రముగల రథముతో నాకాశమున సూర్యుడు కదలిపోవును. ఈ రథముతో పదివేలయోజనముల విస్తారము పొడవుగలదనబడినది. రథమునందున్న యీషాదండము యొక్క (నాగటి కోలయొక్క ప్రమాణమును బట్టి రెండింతలుగా రథముండును. సూర్యుని యారథము ప్రయోజనవశమున బ్రహ్మచే సృష్టింపబడినది. అది సంగములేనిది. బంగారు మయమైనది. దివ్యమైనది. మిక్కిలి వేగముగా బోవుగుజ్జములు పూన్చినది. గుజ్జములరూపమున నున్న ఛందస్సులతో శుక్రుడున్నవైపుననున్నది. అది వరుణుని రథముయొక్క లక్షణములతో నిట సమానముగా నున్నది. అట్టి ప్రకాశించు రథములతో సూర్యుడు ఆకాశమున కదలిపోవును. తరువాత ఇవి సూర్యుని రథముయొక్క ప్రత్యంగములు (అవయవములు) అవి వరుసగా సంవత్సరము యొక్క యవయవములతో కల్పింపబడినవి. అహస్సు(పగలు) సూర్యుని యొక్క నాభి. అదియే యేక చక్రమనబడినది. ఆ చక్రముయొక్క యైదు ఆకులు ఐదు ఋతువులు అనబడినవి. రథము యొక్క నీడము (చోటు-గూడు) సంవత్సరమన బడినది. రెండు కూబరములు(నోగళు) దక్షిణోత్తరాయణములు. దాని (రథము) బంధరుములు (ఎత్తుతంతలు) ముహూర్తములు. దాని కంటిచీలలు కళలనబడినవి. (ముప్పది కాష్ఠలకాలములు). దానిముక్కు కాష్ఠలు (పదునెనిమిది రెప్పపట్ల కాలములు) దాని యీషాదండము క్షణములు. దాని యనుకరము (నొగచివరిమానితుండు) నిమేషములు. దాని యీష (నాగటికోల) లవములనబడినవి-62. వరూధము (చక్రపుటాకులలో జొప్పించునెమ్ము లేదా కప్పుతోలు) రాత్రి ఎత్తుగా లేపబడిన ధ్వజము ఎండకాలము. దాని యొక్క కాడి చివరలు(బండికన్ను చివరలను) అర్థకామములు రెండనబడినవి. ఏడుగుఱ్ఱముల రూపములైన ఛందస్సులు భూమికి ఎడుమగా లాగుకొనిపోవును. ఆ ఛంధస్సులు- 1గాయత్రి, 2త్రిష్టుప్, 3అనుష్టుప్,  4జగతి, 5పంక్తి, 6బృహత్, ఏడవది ఉస్లిక్ అక్షమున (ఇరుసున) చక్రము బంధింపబడినది. ధ్రువునియందు ఇరుసు జొప్పింపబడినది. చక్రముతో బాటు ఇరుసు తిరుగును. ఇరుసుతో బాటు ధ్రువుడు తిరుగును. ఈ యిరుసు ధ్రువునిచే ప్రేరేపింపబడినదై చక్రముతో బాటు తిరుగును, ఈ విధముగా ప్రయోజనమువలన సూర్యుని రథము యొక్క సన్నివేశమగును. ఆ విధముగా సంయోగభాగముతో ప్రకాశమైన సూర్యుని రథము సంసిద్దమగును. దానిచేత సూర్యదేవుడు ఆకాశమున వేగముగా కదలిపోవును. రథముయొక్క నొగలిరంధ్రముల చివరలకుకట్టబడిన రెండు పగ్గములవంటి రెండు కిరణములు. ధ్రువునితో దిరుగుచున్న చక్రములు లేని నొగల యొక్క(యందలి) రెండుపగ్గములు ఆకాశమున చరించుచున్న సూర్యుని రథము యొక్క మండలములుండును. అవి రథము యొక్క దక్షిణముగా నున్న నొగలిబండి కన్నుల చివరలు అవి రెండు చక్రముల తెల్ల త్రాడువలె ధ్రువునిచే చక్కగా పట్టుకొనబడినవి. ఆ రెండు పగ్గములు (తనచుట్టుతాను) తిరుగుచున్న ధ్రువుని వెంబడించి తిరుగును. అవి ఆ సూర్యరథముయొక్క దక్షిణము వైపుగా నున్న నొగలిబండికన్నులచివరలు. మేకునకు బిగించిన త్రాడు అన్ని దిక్కుల దిరిగినట్లే, ఉత్తరాయణమున మండలములందు ఆరథము యొక్క కిరణములను (పగ్గములను) తగ్గించును. దక్షిణమున మండలములను దిరుగుచు ఆరశ్ములే వృద్ధిజెందును. ధ్రువునిచే సంగ్రహింపబడిన యారశ్ములు ఆకర్షింపబడును. అపుడు ఆసూర్యుడు అభ్యంతరమున మండలములను దిరుగును. ధ్రువునిచే విడువబడుచున్న రెండురశ్ములతో రెండు కాష్ఠల కాలముతో (ముప్పదియాలు రెప్పపాట్ల కాలములో) ఎనుబది నూర్లమండలములను (సూర్యుడు) దిరుగును అట్లే వెలుపల గూడ మండలములను దిరుగును. వేగముగా పైన జుట్టుచు మండలములను దిరుగును.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున జ్యోతిప్రచారమనునేబదియొకటవ యధ్యాయము.