వాయు మహా పురాణము
46 - భువనవిన్యాసో
సూత ఉవాచ:-
ఏతచ్చృత్వా తు ఋషయః ఉత్తరం పునరేవ తే ।
శుశ్రూషవో ముదాయుక్తాః పప్రచ్చుర్లో మహర్షణమ్॥
ఋషయ ఊచు:-
యచ్చ కింపురుషం వర్షం హరివర్షం తథైవ చ ।
ఆచక్ష్య వో యథాతత్త్వం కీర్తితం భారతః త్వయా॥
పృష్టస్త్విదం యథావిప్రైర్యథాప్రశ్నం విశేషతః ।
ఉవాచ మునినిర్దిష్టం పురాణం విహతం యథా ॥
సూత ఉవాచ:-
శుశ్రూషాం యత్ర వో విప్రాస్తచ్చృణుధ్వం ముదాయుతాః ।
ప్లక్షఖండః కింపురుషో సుమహాన్నంద నోపమః ॥
దశవర్ష సహస్రాణి స్థితిః కింపురషే స్మృతా ।
సువర్ణవర్ణాశ్చనరాః స్త్రియశ్చాప్సరసోపమాః ॥
అనామయాహ్య శోకాశ్చ సర్వే తే శుద్ధమానసా ।
జాయన్తే మానవాస్తత్ర నిస్తప్త కనకప్రభాః ॥
వర్షే కింపురుషే పుణ్యే ప్లక్షోమధువహః శుభః ।
తస్య కింపురుషా సర్వే పిబంతి రసముత్తమమ్ ॥
అతః పరం కింపురుషాద్దరివర్షః ప్రచక్ష్యతే ।
మహారాజత సంకాశా జాయన్తే తత్ర మానవాః ॥
దేవలోకాచ్చ్యుతాః సర్వే దేవరూపాశ్చ సర్వశాః ।
హరివర్షే నరాః సర్వే పిబంతీక్షురసం శుభమ్॥
ఏకాదశ సహస్రాణి వర్షాణాం తు ముదాయుతాః ।
హరివర్షే తు జీవన్తి సర్వే ముదితమానసాః॥
న జరా బాధతే తత్ర జీర్యంతి న చ తే నరాః ॥
సూతుడనెను:- ఇది విని యా ఋషులు సమాధానమును వినగోరిన వారై సంతసముతో లోమ హర్షణుని నీ విధముగా నడిగిరి-1.
ఋషులనిరి:- భారత వర్షమును గూర్చి ఉన్నది యున్నట్లు చెప్పినట్లే (ఓసూతా) మాకు కింపురుష వర్షమును గూర్చియు హరివర్షమును గూర్చియు తత్యస్థితిని జెప్పము. ఈ విధముగా బ్రాహ్మణులచే నడుగబడిన సూతుడు మునులు పూర్మము చెప్పినట్లుగా విశ్లేషించి ప్రశ్నానుగుణముగా నీ విధముగా జెప్పెను-3. సూతుడనెను. ఓ బ్రాహ్మణులారా! మీరు వినగోరినది సంతోషముతో వినుడు. ప్లక్షఖండమను కింపురుషదేశముచాల గొప్పది. అది నందనవనముతో బోలును-4. కింపురుషదేశమున మానవులస్థితి పదివేలయేండ్లు అనబడినది. అచటి మానవులు బంగారువన్నెగలవారు. స్త్రీలు అప్సరలవలె నందగత్తెలు-5. వారందరు రోగములులేని వారు. దుఃఖములేనివారు. నిర్మలమైన మనస్సుగలవారు. అట మానవులు కాచిన బంగారు కాంతిగలవారై పుట్టుదురు. ఆ పుణ్యమైన కింపురుష దేశమున తేనెలు వహించు మంగళకరమైన ప్లక్ష (జువ్వి) చేట్టుగలదు. కింపురుష దేశవాసులందరు. దాని యుత్తమ రసమును ద్రావుదురు-7. కింపురుష దేశము తరువాత హరివర్షము (దేశము)గూర్చి చెప్పెదను. అచట మానవులు బంగారుకాంతిగల వారై పుట్టుదురు-8. అంతటను వారు దేవలోకమునుండి జారినవారై దేవరూపులగా నుందురు. హరీవర్షదేశమున మానవులందరు శుభమైన చెరుకు రసం ద్రావుదురు? హరివర్థమున మానవులు సంతుష్టమనస్కులై పదునొకండువేలయేండ్లు జీవించరు. అచట నరులను ముదిమి బాధింపదు. వారు క్షీణింపరు-10.
మధ్యమం యన్మయా ప్రోక్తం నామ్నా వర్షమిలావృతమ్ ।
న తత్ర సూర్యస్తపతి న చ జీర్యన్తి మానవాః ॥
చంద్రసూర్యౌ సనక్షత్రావ ప్రకాశా విలావృతే ।
పద్మవర్ణాః పద్మప్రభాః పద్మపత్ర నిభేక్షణాః ॥
జంబూరస ఫలాహారా హ్యనిష్పందాః సుగంధీనః ।
మనస్వినో భుక్తభోగాః సత్కర్మ ఫలభోగినః ॥
దేవలోకాచ్చ్యుతాః సర్వే జాయన్తే హ్యజరామరాః ।
త్రయోద సహస్రాణి వర్షాణాం తే నరోత్తమాః ॥
ఆయుష్ప్రమాణం జీవన్తి తే తు వర్షేత్విలావృతే ।
మేరోః ప్రతిదిశం తే తు నవసాహస్ర విస్తృతే ॥
యోజనానాం సహస్రాణి షడ్వింశస్తస్యవిస్తరః ।
చతురస్రః సమన్తాచ్చ శరావాకార సంస్థిత: ॥
మధ్యన్నదని నాతో జెప్పబడినది. యిలా వృతవర్షము(దేశము) అచట సూర్యుడు ప్రకాశింపడు. మానవులు క్షీణింపరు. ఇలావృతదేశమున చంద్రసూర్యులప్రకాశముండదు. అచటి మానవులు పద్మపురంగుగలవారు. పద్మకాంతి గలవారు పర్మదళముల వంటి కన్నులు గలవారు. జంబూరస-ఫలములాహారము గలవారు. కపంములేని వారు. సువాసన గలవారు. మానవంతులు. సుఖములనుభవించినవారు. సత్కర్మ ఫలముల ననుభవించువారు. వీరు అందరు దేవలోకమునుండి జారివచ్చియిచట అజరామరులై (ముదీమీ చావును లేనివారై) పుట్టుదురు. ఆ నరశ్రేష్ఠులయొక్క యాయు ప్రమాణము పదమూడు వేలయేండ్లు. ఇలా వృతము మేరువు యొక్క ప్రతి దిక్కున తొమ్మిదివేల (యోజనముల) విస్తారముగల దేశము. ఇచట మానవులు, వేలయేండ్లు జీవింతురు. దాని విస్తారము ఇరువది యారు యోజనములు. అంతట చతురస్రముగనదే ప్రమాణములో నున్నది అది మూకుడువలె నున్నది.
మేరోస్తు పశ్చిమే భాగే నవసాహస్ర సంమితే ।
చతుస్త్రిం శత్సహస్రాణి గంధమాదన పర్వతః ॥
ఉదగ్ధక్షిణ తశ్చైవ ఆనీల నిషధాయతః ।
చత్వారిః శత్సహస్రాణి పరివృద్ధో మహీతలాత్ ॥
సహస్ర మవగాఢస్తు తావదేవ తు ధిష్ఠితః ॥
మేరువు యొక్క తొమ్మిదివేల (యోజనముల) పరిమితమైన పశ్చిమభాగమున గంధమాదనపర్వతముగలదు. అదియుత్తరదక్షిణములుగా నీలనీషధపర్వతములవజుకు ముప్పది నాలుగు వేల (యోజనముల?) పొడవు గలదు. భూతలమునుండి నలుబదివేల యోజనముల) యెత్తు పెరిగినది. వేయి (యోజనముల) వరకు భూమిలో మునిగి యున్నది. వేయివఱకే (యోజనము వరకే?) ధిష్టితమైనది. (విస్తారములో నిలచియున్నది).
పూర్వేణ మాల్యవాన్ శైలస్తత్ప్రమాణః పరికీర్తితః ।
దక్షిణే న తు నీలస్య నిషధస్యోత్తరేణ తు ॥
తేషాం మధ్యే మహామేరు: సుప్రమాణః ప్రకీర్తితః ।
సర్వేషామేవ శైలానామవగాఢో యథా భవేత్ ॥
విస్తరస్తత్ప్రమాణః స్యాదాయామే నియుతః స్మృతః ।
వృత్తభావాత్ సముద్రస్య మహీమండల భావనః ॥
ఆయామాః పరిహీయన్తే చతురస్రాః సమస్తతః ।
అనావృత్తాశ్చ తుష్కేణ భిద్యంతే మధ్యమా గతాః ॥
తూర్పువైపుగా నున్న మాల్యవత్పర్వతము అంతే (గంథమాదనమంతే) ప్రమాణము గలది. అది నీలపర్వతమునకు దక్షిణముగా నిషధ పర్వతమునకు ఉత్తరముగా గలదు. వాటి మధ్యలో మహామేరుపర్వతము మంచి ప్రమాణము గలదిగా చెప్పబడినది. అది యన్ని శైలములకు లోతుగా నున్నట్లుండును. దాని విస్తారము గూడ అంతే ప్రమాణము గలదు. పొడవున లక్ష (నియుతము) ప్రమాణము గలదని చెప్పబడినది. సముద్రము చుట్టుగా గుండ్రముగా నుండుట, వలన భూమండలమని భావనము గలదు. మొత్తముగా పొడవులు చతురస్రములుగా తగ్గును. చదుకముచే చుట్టబడనివై మధ్యనున్నవి భిన్నము (వేరు) అగును.
ప్రభిన్నాంజనసంకాశా జంబూర సవతీనదీ ।
మేరోస్తు దక్షిణే పార్శ్వే నిషధస్యోత్తరేణ తు ॥
సుదర్శనో నామ మహాజంబూవృక్షః సనాతనః ।
నిత్యపుష్పఫలో పేతః సిద్ధాచారణ సేవితః ॥
తస్య నామ్నా సమాఖ్యతో జంబూద్వీపే వనస్పతిః ।
యోజనానాం సహస్రం తు శతం చిన్య మహాద్రుమ: ॥
ఉత్సేధో వృక్షరాజస్య దివం స్పృశతి సర్వశః ॥
అరత్నీనాం శతాన్యష్టా ఏకషష్ట్యధికాని తు ।
ఫలప్రమాణం సంఖ్యాత మృషిభిస్తత్వ దర్శిభిః ॥
పతమానాని తాన్వుర్వ్యాం కుర్వంతి విపులస్వనమ్ ।
తస్యా జంబ్వాః ఫలరసో నదీభూయ ప్రసర్పతి ॥
మేరుం ప్రదక్షిణీ కృత్య జంబూవృక్షం విశత్యథః ।
తే పిబంతి సదా హృష్టా జంబూరస ఫలావృతాః ॥
జంబూరస ఫలం పీత్వా న జరాం ప్రాప్నువన్తి తే ।
న చ ధ్రువం న రోగం తు న చ మృత్యుం తథావిధమ్ ॥
తత్ర జాంబూనదం నామ కనకం దేవభూషణమ్ ।
ఇంద్రగోపక సంకాశం జాయతే భాస్వరం తు తత్ ॥
సర్వేషాం వర్షవృక్షాణాం శుభ ఫలరసస్తు సః ।
స్కన్నం భవతి తుచ్చుక్రం కనకం దేవభూషణమ్ ॥
తేషాం మూత్రం పురీషం చ దిక్షు సర్వాసు భాగశః ।
ఈశ్వరానుగ్రహా ద్భూమిర్మృతాశ్చ గ్రసతే తు తాన్ ॥
రక్షః పిశాచా యక్షాశ్చ సర్వే హైమవతాః స్మతాః ।
హేమకూటేతు గంధర్వా విజ్ఞేయా: సాప్సరోగణాః ॥
సర్వే నాగాస్తు నిషధే శేషవాసుకి తక్షకాః ।
మహామేశౌ త్రయస్త్రింశత్ భ్రమంతే యాజ్ఞకాః సురాః ॥
నీలే తు వైడూర్యమయే సిద్దబ్రహ్మర్షయో మతా: ।
దైత్యానాం దానవానాం చ శ్వేతపర్వత ఉచ్యతే ॥
శృంగవాన్ పర్వత శ్రేష్ఠః పితౄణాం ప్రతిసంచర: ।
నవ స్వేతేషు సర్వేషు యథా భాగస్థితేషు వై ॥
భూతాన్యుపనివిష్టానీ గతిమన్తి ధ్రువాణి చ ॥
తేషాం వివృద్ధిర్బహులా దృశ్యతే దేవమానుషోః ।
న శక్యా పరిసంఖ్యాతుం శ్రద్ధేయానుఋభూషతా ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే భునవవిన్యాసో నామ షట్చత్వారింశోఽధ్యాయః ॥
అచట మర్థించిన కాటుక వలె నల్లనైన జంబూఫల రసముగల నది (జంబూనది) కలదు. మేరు పర్వతమునకు దక్షిణ ప్రక్కగా నిషధ పర్వత (దేశమునకు ఉత్తరముగా, ప్రాచీనమైన సుదర్శనమను నొక పెద్ద జంబూ వృక్షము గలదు. అది నిత్యము పుష్ప ఫలములతో గూడియుండును. సిద్దులచేతను చారణులచేతను సేవింపబడును. ఆ జంబూవృక్షము పేరుతోనే పిలువబడు జంబూద్వీపమున జంబూవృక్షము వృక్షరాజము. ఈ మహావృక్షము ఎత్తు లక్షయోజనములు. అది యంతట నాకాశమును తాకును. తత్యద్రష్టలైన మునులు ఆ జంబూఫలప్రమాణమును ఎనిమిదివందల యజువది యొక్క మూరలు (861) లెక్కించి చెప్పిరి, భూమి పైబడుచుండు నా జంబూఫలములు విశాలమైన ధ్వనిని గలుగజేయును. ఆ భూమియందు జంబూఫలరసము నదిగానయి ప్రవహించును: మేరువును ప్రదక్షిణముజేసి క్రింది జంబూవృక్షమును బ్రవేశించును. అచటి వారు జంబూరసఫలములచే జుట్టబడినవారై యా రసమును సంతుష్టులై త్రాగుదురు. వారు జంబూఫలరసమును ద్రావి ముదిమిని బొందరు. గుఱ్ఱపు సుడిని బొందరు. రోగమును బొందరు. మరణమును గూడ బొందరు. అచట జాంబూనదమున బంగారము దేవభూషణమైయుండును. అది యా రుద్రపురుగువలె నెట్టనిదై ప్రకాశవంతమగును, అది యన్ని వర్ష (దేశ) వృక్షముల యొక్క శభమైన ఫలరసము. అది స్టలితమై శుక్రమగును. అది దేవభూషణమై బంగారము, వారి మూత్ర పురీషములను అన్ని దిక్కులలో భాగములుగా భూమి గ్రసించును. మృతులైనవారిని గూడ (భూమి) గ్రసించును. రాక్షసులు పిశాచులు యక్షులు అందరు హైమవతులుగా జెప్పబడిరి. హేమకూటమున నున్నవారు అప్సరోగణములతోగూడిన గంధర్వులుగా దెలియవలె. నిషధమున శేష-వాసుకి తక్షకులైన సమస్త నాగులు గలరు. మహా మేరువున ముగ్గురు యాజ్ఞికులు సరయిను దిరుగచుందురు. వైడూర్యమయమైన నీలపర్వతమున సిద్ధ బ్రహ్మర్షులు తిరుగుదురని తెలియవలెను. దైత్యులకు దానవులకును శ్వేతపర్వతము తిరుగు స్థానమని చెప్పబడినది. పర్వత శ్రేష్ఠమైన శృంగవత్పర్వతము పితృదేవతలు సంచరించుస్థానము. ఒక విభాగముగానున్న యీయన్ని తొమ్మిదింటిలో నివసించియున్న భూతములు గమనము గలవియు స్థిరముగా నుండినవియునై యున్నవి. వారిలో దేవ మనుష్యుల వివృద్ధియెక్కువగా గనబడును. అనుభవింపగోరువానిచేత చక్కగా లెక్కించుట సాధ్యపడదని విశ్వసింపవలె.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబది యాఱవ యధ్యాయము.