వాయు మహా పురాణము
13 - యోగైశ్వర్యా
వాయు రువాచ :-
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ఐశ్వర్య గుణవిస్తరమ్ ।
యేన యోగవిశేషేణ సర్వలోకాన తిక్రమేత్॥
తత్రాష్టగుణమైశ్వర్యం యోగినాం సముదాహృతమ్ ।
తత్సర్వం క్రమయోగేన ఉచ్యమానం నిబోధత॥
అణిమా, లఘిమా చైవ మహిమా, ప్రాప్తిరేవ చ ।
ప్రాకామ్యం చైవ, సర్వత్ర ఈశత్వం, చైవ సర్వతః॥
వశిత్వమథ సర్వత్ర యత్రకామా వసాయితా ।
తచ్చాపి వివిధ జ్ఞేయమైశ్వర్యం సర్వకామికమ్॥
సావద్యం నిరవద్యం చ సూక్ష్మం చైవ ప్రవర్తతే ।
సావద్యం నామ తత్తత్త్వం పఞ్చభూతాత్మకం స్మృతమ్॥
నిరవద్యం తథా నామ పఞ్చభూతాత్మకం స్మృతమ్ ।
ఇన్ద్రియాణి మనశ్చైవ అహఙ్కారశ్చ వై స్మృతమ్॥
అత్ర సూక్ష్మప్రవృత్తం తు పఞ్చభూతాత్మకం పునః ।
ఇన్ద్రియాణి మనశ్చైవ బుద్ధ్యహఙ్కార సంజ్ఞితమ్॥
తథా సర్వమయ ఞ్చైవ ఆత్మస్థాఖ్యాతిరేవ చ ।
సంయోగ ఏవం త్రివిధః సూక్ష్మే ష్వేవ ప్రవర్తతే ॥
పునరష్ట గుణస్వాపి తేష్వైవాథ ప్రవర్తతే ।
తస్య రూపం ప్రవక్ష్యామి యథాహ భగవాన్ప్రభు:॥
వాయువు పలికెను:- యోగవిశేషము చేత యోగి సర్వలోకములను అతిమ్రించును. ఈ పైన ఆ యోగ విశేషము యొక్క యైశ్వర్యములను జెప్పుదును-1. అట యోగులయైశ్వర్యము ఎనిమిది గుణములు గలదిగా చెప్పబడినది. అది యంతయు ఒక క్రమయోగముతో జెప్పుదను వినుడు-2 అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, అంతట ప్రాకామ్యము, అంతట ఈశిత్వము-3. అంతట వశిత్వము, అంతట యంత్ర కామావ సాయిత్వము ఇవి యెనిమిది టైశ్వర్య గుణములు. సార్వకామికమైన యాయైశ్వర్యము గూడ అనేక విధములైనది-4. అది సావద్యము, నిరవద్యము, సూక్ష్మము అని ప్రవర్తిల్లును. సావద్యమను నాతత్యము పంచభూతాత్మకము ఇన్టియములు, మనస్సు అహంకారమును నిరవద్యముగా జెప్పబడినది-6. అట సూక్ష్మ ప్రవృత్తము (ఐశ్వర్యము) గూడ పంచభూతాత్మకము, ఇన్షియములు, మనస్సు బుద్ధి, అహంకారముగా జెప్పబడినది-7. అట్లే సర్వనుయము ఆత్మస్థము, ఖ్యాతి అని యీ విధముగా సంయోగము మూడు విధములైన సూక్ష్మములందే ప్రవర్తిల్లును-8. తరువాత అష్టగుణమైన టైశ్వర్యము గూడ ఆ సూక్ష్మములందే ప్రవర్తించును. ప్రభువైన భగవంతుడు చెప్పినట్లు దానియొక్క రూపమును జెప్పుదును.
త్రైలోక్యే సర్వభూతేషు జీవస్వాని యతః స్మృతః ।
అణిమా చ యథా వ్యక్తం సర్వం తత్ర ప్రతిష్ఠితమ్॥
త్రైలోక్య సర్వభూతానాం దుష్ప్రాపం సముదాహృతమ్ ।
తచ్చాపి భవతి ప్రాప్యం ప్రథమం యోగినాం బలాత్ ॥
లంబనం ప్లవనం యోగే రూపమస్య సదా భవేత్ ।
శీఘ్రగం సర్వభూతేషు ద్వితీయ, తత్పదం స్మృతమ్॥
త్రైలోక్యే సర్వభూతానాం ప్రాప్తి: ప్రాకామ్యమేవ చ ।
మహిమా చాపి యో యస్మిం స్తృతీయో యోగ ఉచ్యతే॥
త్రైలోక్యే సర్వభూతేషు త్రైలోక్యమగమం స్మృతమ్ ।
ప్రకామాన్ విషయాన్ భుంక్తే న చప్రతిహతః క్వచిత్।
త్రైలోకే సర్వభూతానాం సుఖదుఃఖ ప్రవర్తతే॥
ఈశో భవతి సర్వత్ర ప్రవిభాగేన యోగవిత్ ।
వశ్యాని చైవ భూతాని త్రైలోక్యే స చరాచరే।
భవన్తి సర్వకార్యేషు ఇఛ్చాతో న భవన్తి హి॥
యత్ర కామావసాయిత్వం త్రైలోక్యే సచరాచరే ।
ఇచ్ఛయా చేన్ద్రియాణి స్యుర్భవస్తి భవన్తి చ ॥
శబ్దః స్పర్శో రసో గన్దో రూపం చైవ మనస్తథా ।
ప్రవర్తన్తేఽస్యచేచ్చాతో న భవన్తి తథేచ్చయా॥
న జాయతే న మ్రియతే భిద్యతే న చ భిద్యతే ।
న దహ్యతే న ముహ్యతే హీయతే న చ లిప్యతే॥
న క్షీయతే న క్షరతి న భిద్యతి కదాచన ।
క్రియతే చైవ సర్వత్ర యథా విక్రియతే న చ॥
అగన్ధరస రూపస్తు స్పర్శ శబ్దవివర్జితః ।
అవర్ణో హ్యవరశ్చైవ తధా వర్ణస్య కర్హిచిత్॥
భుంక్తేఽథ విషయాంశ్చైవ విషయైర్న యుజ్యతే ।
జ్ఞాత్వా తు పరమం సూక్ష్మం సూక్ష్మత్వాచ్ఛాప వర్గక:॥
వ్యాపకస్త్వప వర్గాచ్ఛ వ్యాపిత్వాత్పురుషః స్మృతః ।
పురుషః సూక్ష్మభావాత్తు ఐశ్వర్య పరతః స్థిత॥
గుణాన్తరన్తు ఐశ్వర్యే సర్వతః సూక్ష్మ ఉచ్యతే ।
ఐశ్వర్యమ ప్రతీఘాతి ప్రాప్యయోగ మనుత్తమమ్॥
అపవర్గం తతో గచ్చేత్ సుసూక్ష్మం పరమం పదమ్ ॥
ఇతి మహాపురాణే వాయు ప్రోక్తే యోగైశ్వర్యాణి నామ త్రయోదశోఽధ్యాయః ॥
త్రైలోక్యమున సర్వభూతములలో జీవుని యొక్క (స్థితి) అనియతమని చెప్పబడినది. అంతయు ప్రతిష్ఠితమై వ్యక్తమగునట్టి సూక్ష్మము అణిమ-10, త్రైలోక్యమున సర్వప్రాణులకు పొందనలవి గానిదైనను యోగులకు (యోగ) బలమువలన లభించును ఇది మొదటిది అణిమ-11, యోగమున యోగియొక్క రూపము (ఆకారము) వ్రేలాడునది, తేలియుండునది, సర్వప్రాణులలో శీఘ్రముగ బోవునదియు నగును. ఇది రెండవదైన లఘిమ యొక్క స్థానము అనబడినది-12. త్రైలోక్యమున సర్వభూతము (అంగుల్యముచే చంద్రునిలో కలుగుట) యొక్క ప్రాప్తియున్న యోగము సిద్ధి ప్రాప్తియనియు, ప్రాకామ్యము (సంకల్పమునకు అడ్డులేమి) ఉన్న యోగ సిద్ది ప్రాకామ్యమనియు జెప్పబడినవి. మహిమ మహత్పరిమాణుడుగాగలి) యున్న యోగసిద్ధి మహిమయనియు జెప్పబడినది. ఇది మూడవ యోగసిది-13. త్రైలోక్యమున సర్వభూతములలో ప్రాణులలో త్రైలోక్యము పొందనలవి గానీ దనబడును. ప్రతిరోధముచే నడ్డబడిన వాడై ఒకచోట ప్రకామములైన విషయములను అనుభవింపజాలడు. త్రైలోక్యమున సర్వభూతమలకు సుఖదుఃఖములు ప్రవర్తిల్లుచున్నవి. (ఇట్టి స్థితిలో త్రైలోక్యమును పొందగల యోగ సిద్ధి ప్రాప్తి, అడ్డులేని సంకల్పముతో ప్రకామ విషయానుభవము చేయగల యోగి సిద్ది ప్రాకామ్యమే, త్రైలోక్యమున సుఖదుఃఖములకందరాని మహత్పరిమాణమును బొందగల యోగసిద్ది మహిమయని తెలియనగుచున్నది)-14. యోగి అంతట ప్రతిభాగముచే భూత భౌతికములయుత్పత్తి స్థితి నాశములొనర్చు శక్తిగలిగియుండుట ఈశత్వ సిద్ది. చరాచరములుగల త్రైలోక్యమున భూతములు వశ్యములగును. కాని యవి తమ యిచ్ఛతో పరవశముగావుగదా. యోగి యొక్క వశిత్వసిద్ధితోనే వశమగును-15. చరాచరములు నిండిన త్రైలోక్యమున “యత్రకామావసాయిత్వ'మను యోగ సిద్దితో యోగి యిచ్చాను సారమే ఇంద్రియములు పనిచేయుచుండుటయు పనిచేయకుండుటయు జరుగును-16. ఈ యోగి యిచ్చానుసారమే శబ్దము, స్పర్శ, రసము, గడ్గము, రూపము, మనస్సున్ను, ప్రవర్తించుచుండును. అతని యిచ్చానుసారమే యవి ప్రవర్తింపకగూడ నుండు ఇంద్రియములైన త్వగాదులును, వాని విషయములైన స్పర్శాదులును “యత్ర కామావసాయిత"యను యోగ సిద్ధిగల యోగి యొక్క యిచ్చానుసారమే. ప్రత్యక్షానుకూలమైన పరస్పర సంబంధము గలిగియుండును-17. అట్లే ఆ సిద్దయోగి పుట్టడు, చావడు, భేదింపబడడు, పూజింపబడడు, దహింపబడడు-18, క్షీణింపబడడు. నశింపడు ఎప్పుడును దుఃఖింపడు, అంతటను వికారము జెందడు-19. గన్షరస రూపములు లేనివాడై స్పర్శ శబ్దముల వదలినవాడై వర్ణము యొక్క వర్ణములేనివాడై వరుడు గానివాడై యుండును-20. తరువాత విషయములు అనుభవించును. విషయములలో దగుల్కొనడు. పరమమైన సూక్ష్మమును దెలిసి సూక్ష్మత్వమువలన అపవర్గకుడు అగును-21. అపవర్గము నుండి వ్యాపకుడగును వ్యాపియైనందున పురుషుడనబడును. పురుషుడు సూక్ష్మభావము వలన ఐశ్వర్యమువలన పరముగనే యుండును-22. ఐశ్వర్యమున గణాన్తరము అన్నిటికంటే సూక్ష్మమనబడును. ఎదురుదెబ్బలేని యైశ్వర్యమును బొంది యత్యుత్తమమైన యోగమును, ఆ తరువాత సుసూక్ష్మమై పరమపదమైన మోక్షమును బొందవలె-23.
ఇది వాయుప్రోక్తే మహాపురాణమున యోగేశ్వర్యములను పదమూడవ యధ్యాయము-13.