28 - ఋషివంశానకీర్తవం

సూత ఉవాచ: -

భృగోః ఖ్యాతి ర్విజజ్ఞేఽథ ఈశ్వరే సుఖదుఃఖయోః

శుభాశుభప్రదాతారౌ సర్వప్రాణ భృతామిహ

దేవోధాతావిధాతారౌ మన్వన్తర విచారిణే

తయీర్జ్యేష్ఠా తు భగినీ దేవీశ్రీర్లోకభావినీ

సా తు నారాయణం దేవం పతిమాసాద్య శోభనమ్

నారాయణాత్మజౌ సాధ్వీ బలోత్సాహో వ్యజాయత

తస్యాస్తు మానసాః పుత్రా యేచాన్యే దివ్యచారిణః

యే వహన్తి విమానాని దేవానాం పుణ్యకర్మణామ్

ద్వే తు కన్యే స్మృతే భార్యే విధాతుర్ధాతు రేవ చ

ఆయతిర్నియతిశ్చైవ తయోః పుత్రౌ దృఢవ్రతౌ

పాండుశ్చైవ మృకండుశ్చ బ్రహ్మకోశౌ సనాతనౌ

మనస్విన్యాం మృకండోశ్చ మార్కండేయో బభూవ హ

సుతో వేదశిరాస్తస్య మూర్థన్యాయామ జాయత

పీవర్యం వేదశిరసః పుత్రావంశకరాః స్మృతాః

మార్కండేయా ఇతిఖ్యాతా ఋషయో వేదపారగాః

సూతుడనెను:- భృగువునకు ఖ్యాతి పుట్టెను ఆ తరువాత సుఖదుఃఖములకీశ్వరులును, సమస్త ప్రాణులకు శుభాశుభములనిచ్చువారును, మన్వన్త విచారిణులునునై దేవతలైన ధాత విధాత అనువారలును బుట్టిరి-1. వారిలో జ్యేష్ఠయైయక్కయైనది. లోకభావినియై దేవియైన 'శ్రీ' అనునామే ఆమె సుందరుడై దేవుడైన నారాయణుని పతిగా బొందెను. ఆ సాధ్వియైన లక్ష్మీదేవి నారాయణుని పుత్రులనుగా బల-ఉత్సాహులను వారలను గనెను. ఆమెకు మానసపుత్రులు, పుణ్యకర్ములైన దేవతలకు విమానములనడుపువారును, దివ్యులై చరించువారును జనించిరి-3. విధాతకును ధాతకును ఆయతి నియతి యనువారలు ఇరువురు కన్యలు భార్యలయిరి. వారిరువురికీ దృడవ్రతులగు పుత్రులిరువురు పాండువు మృకండుడు అనువారు గలిగిరి. వారు బ్రహ్మకు (జ్ఞానమునకు) కోశము (నిధి)ఐనవారు సనాతనులైన వారును. మృకండునకు మనస్వినియందు మార్కండేయుడు పుట్టెను-4,5, మార్కండేయునకు మూర్థన్యయను(నామె) భార్యయందు వేదశిరుడను. వాడు జన్మించెను. వేద శిరునకు పేవరియను భార్యయందు వంశకరులైన పుత్రులు పుట్టిరి. వీరందరు వేదపారగులైన ఋషులై మార్కండేయులని ప్రసిద్ధి జెందిరి-6.

పాండోశ్చ పుండరీకాయాం ద్యుతిమానాత్మజోఽభవత్

ఉత్పన్నౌ ద్యుతిమన్తశ్చసృజవానశ్చ తావుభౌ

తయోః పుత్రాశ్చ పౌతాశ్చ్ర భార్గవాణాం పరస్పరమ్

స్వాయం భువేఽన్తరేఽతీతే మరీచేః శృణుత ప్రజాః

పత్నీమరీచేః సంభూతి ర్విజజ్ఞే సాత్మసంభవమ్

ప్రజాయతే పూర్ణమాసం కన్యాశ్చేమా నిబోధత

కృష్టిః పుష్టిః త్విషా చైవ తధాచాపచితిః శుభా

పూర్ణమాసః సరస్వత్యాం ద్వౌ పుత్రా వుదపాదయత్

విరజం చైవ ధర్మిష్ఠం పర్వసం చైవ తావుబౌ

విరజస్యాత్మజో విద్వాన్ సుధామా నామవిశ్రుతః

సుధామసుత వైరాజః ప్రాచ్యాం దిశి సమాశ్రితః

లోకపాలః సుధర్మాత్మా గౌరీ పుత్రః ప్రతాపవాన్

పర్వసః సర్వగణానాం ప్రవిష్టః సమహాశయా

పర్వసః పర్వసాయాన్తు జనయామాస వై సుతౌ

యజ్ఞవామం చ శ్రీమన్తం సుతం కాశ్యపమేవ చ

తయోర్గోత్రకి పుత్రౌ తౌ జాతౌ  ధర్మనిశ్చితౌ

స్మృతిశ్చాంగిరసః పత్నీ జజ్ఞే తావాత్మసంభవౌ

పుత్రౌ కన్యాశ్చ తిస్రశ్చ పుణ్యాస్తా లోకవిశ్రుతాః

సినీవాలీ కుహూశ్చైవ రాకాచాను మతిస్తథా

తథైవ భరతాగ్నిం చ కీర్తిమన్తం చ తావుభౌ

పాండువునకు పుండరీకయందు కుమారుడు గా ద్యుతిమంతుడు స్పజవానుడు అను నిరువురు పుట్టిరి. వారిరువురికిని పుత్రులును మనుమలును గలిగిరి. భార్గవులకు (భృగుసంతానములకు) పరస్పరముగా సంతానములు గలిగినవి. స్వాయంభువ మన్వంతరము గడచిపోగా మరీచి (ప్రజాపతికి) గలిగిన సంతానమును వినుడు? మరీచి భార్య సంభూతి పూర్ణమాసుడను కుమారుని గనెను. వారి కన్యలు కృష్టి, పుష్టి, త్విషా, అపచితి, శుభా అనువారు పూర్ణమాసుడు సరస్వతియను, తన భార్య యందు ఇరువురి పుత్రులను గనెను. వారు ధర్మిష్ఠుడైన విరజుడు, పర్వసుడు అనువారు-7,8,9. విరజునకు కుమారుడు విద్వాంసుడైన సుధాముడనువాడు ప్రసిద్ధిజెందెను. సుధామసుతుడైన వైరాజుడు తూరుపు దిక్కున (నెలకొనెను) నాశ్రితుడయ్యెను-10. లోకపాలుడు, చక్కనిధర్మాత్ముడు, గౌరీపుత్రుడై ప్రతాపవంతుడు అయిన పర్వసుడు సర్వగణములకు ప్రవిష్టుడైన (వారితత్త్యము దెలిసిన) మహాశయుడు-11. పర్వసుడు పర్వసయను నామేయందు ఇరువురి సుతులనుగనెను. వారు శ్రీమనుడైన యజ్ఞవాముడు కాశ్యపుడును వారిరువురికి బుట్టిన పుత్రులు గోత్రకరులు (వంశకరులు) ధర్మముచే నిశ్చయింపబడినవారు-12, ఆంగిరసుని భార్య స్మృతి యాయిరువురి కుమారులను పుణ్యాత్ములు లోకప్రసిద్ధురాండ్రు అయిన నలుగురు కన్యకలను గూడగనెను-13. వారు సినీవాలి, కుహు, రాక, అనుమతి యనువారు, అట్లే వారిరువురును భరతాగ్ని కీర్తిమంతుడు-అను ఇరువురిని గనిరి-14.

అగ్నేః పుత్రం చ పర్జన్యం సంహుతీ సుషువే ప్రభుమ్

హిరణ్యరోమా పర్జన్యో మారీచ్యాముద పాదయత్

ఆభూతసంప్లవ స్థాయీ లోకపాలః స వై స్మృతః

జజ్ఞే కీర్తిమతశ్చాపి ధేనుకాతావకల్మషౌ

వరిష్ఠం ధృతిమన్తం చాప్యుభావంగిరసాం వరౌ

తయోః పుత్రాశ్చ పౌత్రాశ్చ యేఽ తీనా వై సహస్రశః

అనసూయాపి జజ్ఞే తాన్ పంచాత్రేయాన కల్మషాన్

అగ్ని పుత్రుడైన పర్జన్య ప్రభువును సంహుతి యను నామెకనెను. బంగారు రోమములు గల పర్జన్యుడు మారీచియందు ఒకనిని బుట్టించెను. ఆతడు భూత ప్రళయమువరకుండు లోకపాలుడుగా స్మరింపబడెను-15, కీర్తిమంతుని వల్ల ధేనుకయను నామె యిరువురిని కనీనది. వారు వరిష్ణుడు ధృతిమనుడు, వీరాంగీరసులలో (ఆంగీరస వంశీయులలో) శ్రేష్ఠులు-16. వారిరువురికిని (వరిష్ఠ ధృతిమంతులకు) పుత్రులు పౌత్రులును గలిగిరి. వారు వేలకొలదిగా మించిరి, అనసూయకూడ అత్రిపుత్రులనుగా పాపరహితులైన యైదుగురిని గనేను-17.

కన్యాం చైవ శ్రుతిం నామ మాతాశంఖపదస్య యా

కర్దమస్యతు యా పత్నీ పులహస్య ప్రజాపతే

సత్యనేత్రశ్చ హవ్యశ్చ ఆపోమూర్తిః శనీవరః

సోమశ్చ పంచమస్తేషామాషీత్ స్వాయంభువేఽన్తరే

యామేఽతీతే సహాతీతాః పంచాత్రేయాః ప్రకీర్తితాః

తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చహ్యత్రిణా వై మహాత్మనా

స్వాయంభువేఽన్తరే యామే శతశోఽథ సహస్రశః

అనసూయ శ్రుతియను కన్యను గూడ గనెను. ఆమె శంఖపదునకు తల్లి పులిహప్రజాపతియైన కర్దముని యొక్క భార్య సత్యనేత్రుడు, హవ్యుడు, ఆపోమూర్తి, శనీవరుడు, సోముడు అనునైదుగురు స్యాయంభువమున్వంతరములో ఒకయామము గడచిపోగా అనసూయాత్రిమునులకు బుట్టి ఆత్రేయులుగా ప్రసిద్ది జెందిరి-18,19. స్వాయంభువ మన్వంతరమున యామము గడవగా మహాత్ముడైన యత్రియను గ్రహమున పై యైదుగురికి పుత్రులు పౌత్రులును నూర్లకొలదియు వేలకొలదియు జనించిరి.

ప్రీత్యాం పులస్త్య భార్యాయాం దత్తాలిస్తత్సుతోఽభవత్

పూర్వజన్మని సోఽగస్త్యః స్మృతః స్వాయంభువోఽన్తరే

మధ్యమో దేవ బాహుశ్చ వినీతోనామ తే త్రయః

స్వసా యవీయసీ తేషాం సద్వతీ నామ విశ్రుతా

పర్జన్యజననీ శుభ్రా పత్నీ త్వగ్రే స్మృతా శుభా

పౌలస్త్యస్య ఋషేశ్చాఽపి ప్రీతిపుత్రస్య ధీమతః

దత్తా తే సుషువే పత్నీ సుజంఘాందన్ బహూన్ సుతాన్

పౌలస్త్యా ఇతి విఖ్యాతాః స్మృతాః స్వాయంభువేఽన్తరే

పులస్త్యభార్యయైన ప్రీతియను నామెయందు దత్తాలియనువాడు వారి కుమారుడుగా బుట్టెను. పూర్వజన్మలోనాతడు స్వాయంభువమన్వంతరమున అగస్త్యుడనబడెను. మధ్యముడు, దేవబాహువు, వినీతుడు-అనునీ ముగ్గురు వారి పుత్రులు 21. వారి చినచెల్లెలు సద్వతియను నామె ప్రసిద్ది జెందినది. పర్జన్య జననియైన శుభ్రయనునది పౌలస్త్య ఋషికి పత్నియై మొదట శుభయనబడినది-22. ప్రీతికి పుత్రుడై ధీమంతుడైన దత్తాలియొక్క భార్య సుజంఘుడు మొదలగు ననేక పుత్రులనుగనెను. వారందరు. స్వాయంభువ మన్వస్తరమున పౌలస్త్యులనబడి ప్రసిద్ధిజెందిరి-23.

క్షమా తు సుషువే పుత్రాన్ పులహస్య ప్రజాపతేః

తే చాగ్నివర్చసః సర్వే యేషాం కీర్తి ప్రతిష్ఠితా

కర్దమశ్చాంబరీషశ్చ సహిష్ణుశ్చేతి తే త్రయః

ఋషిర్ధనకపీవాంశ్చ శుభాకన్యాచ పీవరీ

కర్దమస్య శ్రుతిః పత్నీ ఆత్రేయ్య జనయత్సుతాన్

పుత్రం శంఖ పదం చైవ కన్యాం కామ్యాం తథైవ చ

స వై శంఖపదః శ్రీమాన్ లోకపాలః ప్రజాపతిః

దక్షిణస్యాం దిశి శతః కామ్యాం దత్వా ప్రియవ్రతే

కామ్యా ప్రియవ్రతాల్లేభే స్వాయంభువసమాన్ సుతాన్

దశకన్యా ద్వయం చైవ యైః క్షత్రం సంప్రవర్తితమ్

పులహ ప్రజాపతియొక్క పుత్రులను క్షమయనునామెకనెను. వారు అగ్నితేజస్కులు. వారికీర్తి సుప్రతిష్ఠితము-24. కర్దముడు, అంబరీషుడు, సహిష్ణుడు అనువారు ఆమువ్వురు. ఋషియైన ధనకపీవానుడు శుభయైన కన్యపీఠియను నామము వారికి జనించిరి-25. కర్దమునకు శ్రుతి యను నది భార్య ఆత్రేయి యను నామె సుతులను గనెను. పుత్రుడు శంఖపదుడనువాడు కన్యకామ్యయను నామే-26, ఆశంఖపదుడే శ్రీమంతుడై లోకపాలుడై ప్రజాపతియయ్యెను. దక్షిణ దిక్కునందు ఆసక్తుడై ప్రియవ్రతునకు కొమ్యనిచ్చెను-27. ఆ కామ్య ప్రియవ్రతుని వల్ల స్వయంభువైన బ్రహ్మతోసమానులగు పదుగురు పుత్రులను, ఇద్దరు కన్యలను గనెను. వారిచేత క్షత్రియజాతి చక్కగా వ్యాపించెను. (నెలకొనెను).

పుత్రొ ధనకపీవాంశ్చ సహిష్ణుర్నామవిశ్రుతః

యశోధారీ విజజ్ఞే వై కామదేవః సుమధ్యమః

ఋతోః క్రతుసమః పుత్రో విజజ్ఞే సంతతిః శుభా

నైషాం భార్యాఽస్తి పుత్రో వా సర్వే తేహ్యౌర్ధ్వరేతసః

షష్ట్యే తాని సహస్రాణి వాలఖల్యా ఇతి శ్రుతాః

అరుణస్యాగ్రతో యాన్తి పరివార్య దివాకరమ్

ఆభూత సంప్లవాత్సర్వే పతంగ సహచారిణః

పుత్రుడైన ధనకపీవానుడు సహిష్ణువని పేరుగాంచెను. యశోధారియైన యాతడు సుమధ్యముడైన కామదేవుని గనెను 29. ఋతువునకు క్రతుసముడైన పుత్రుడు గలిగెను. ఆసంతతి శుభమైనది. వీరందరికి భార్యగాని పుత్రుడుగాని లేరు. వారందరు ఊర్థ్వరేతుస్కులు. ఈయజువది వేల మంది వాలఖిల్యులని ప్రసిద్ధిజెందిరి-30. వీరు సూర్యుని జుట్టుకొని యరుణుని ముందుగా బోవుచుందురు. మహాభూతప్రళయము వరకు వీరు సూర్యునితోడుగా నడుచువారే.

స్వసారౌ తు యవీయస్యౌ పుణ్యాత్మసుమతీ చ తే

పర్వసస్యస్నుషే త్యే వై పూర్ణమాస సుతస్యవై

ఊర్జాయాం తు వసిష్ఠస్య పుత్రావై సప్త జజ్ఞిరే

జ్యాయసీ చ స్వసా తేషాం పుండరీకా సుమధ్యమా

జననీ సా ద్యుతిమతః పాండోస్తు మహిషీ ప్రియా

అస్యాం త్విమే యవీయాసో వాసిషాః సప్త విఃశ్రుతాః

రజః పుత్రోర్ధ్వబాహుశ్చ సవనశ్చాథనశ్చయః

సుతపాః శుక్ల ఇత్యేతే సర్వే సప్తర్షయః స్మృతాః

రజసోవాఽ ప్యజనీయన్మార్కండేయీ యశస్వినీ

ప్రతీచ్యాం దిశి రాజన్య కేతుమన్తం ప్రజాపతిమ్

గోత్రాణి నామభిస్తేషాం వసిష్ఠానాం మహాత్మనామ్

స్వాయంఽభువేన్తరేఽతీతా స్త్వగ్నేస్తు శ్రుణుత ప్రజాః

ఇత్యేష ఋషిసర్గస్తు సానుబంధః ప్రకీర్తితః

విస్తరేణానుపూర్వాచాప్యగ్నేస్తు శ్రుణుత ప్రజాః

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే ఋషివంశానుకీర్తనంనామ అష్టావింశోఽధ్యాయః

పుణ్యాత్మసుమతీయనునాచిన్న చెల్లెండ్రు పూర్ణమాససుతుడైన పర్వసునకు కోడండ్రు-32. వసిష్ఠునకు ఊర్జయను నామెయందు ఏడుగురు పుట్టిరి. వారికి పెద్దచెల్లెలు సుమధ్యమయైన పుండరీకయను నామె-33. ఆమె పాండువైన ద్యుతిమంతుని యొక్క ప్రియపట్టపురాణి, ఆమెయందు వసిష్ఠవంశీకులైన ప్రసిద్ధిజెందిన యేడుగురు జనించిరి-34. రజసుడు. పుత్రుడు, అర్థబాహువు, సవనుడు, అదనుడు, సుతపుడు, శుక్లుడు-అనువీరందరు సప్తర్షులనబడిరి-35. రజసునినుండి మార్కండేయ యశస్వినిని గనెను. ప్రతీచీదిక్కునందు క్షత్రియుడైన ప్రజాపతియైన కేతుమంతునిగనెను-36. ఆవాసిష్ఠులైన మహాత్ముల యొక్క పేరులతో బాటు గోత్రములు స్వాయంభువమన్వన్తరమున గడిచిపోయినవి. అగ్ని యొక్క సంతతిని వినుడు-37. అనియీ ఋషి సృష్టి సానుబంధముగా జెప్పబడినది. ఆనుపూర్వీతో విస్తరముగా అగ్నిసంతతిని వినుడు-38.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ఋషివంశానుకీర్తనమను ఇరువదియెనిమిదవ యధ్యాయము.