వాయు మహా పురాణము
4 - ప్రజాపతి వంశానుకీర్తనమ్
ఋషయ ఊచు :-
శ్రుత్వా పాదం ద్వితీయం తు క్రాంతం సూతేన ధీమతా ।
అతస్తృతీయం పప్రచ్ఛ పాదం వై శాంశపాయనః ॥
పాదః క్రోంతో ద్వితీయో ఽయమనుషంగేణ యస్త్వయా ।
తృతీయం విస్తరిత్పాదం సోపోద్ఘాతం ప్రకీర్తయ ।
ఏవముక్తోఽ బ్రవీత్సూతః ప్రహృష్టనాంతరాత్మనా ॥
ఋషులనిరి :
బుద్ధిమంతుడైన సూతునిచే జెప్పబడిన రెండవ పాదమును విని, శాంశపాయనుడు మూడవ పాదమును జెప్పుమని యడిగెను (1). అనుక్రమముగా నీవు రెండవ పాదమును జెప్పితివి. మూడవ పాదమును ఉపోద్ఘాతముతో వివరించుము. ఈ విధముగా నడుగబడిన సూతుడు సంతుష్టాంతరంగుడై యిట్లనెను .
సూత ఉవాచ :-
కీర్తయి ష్యే తృతీయం చ సోపోద్ఘాతం సవిస్తరమ్ ।
పాదం సముదయాద్విప్రా గదతో మే నిబోధత ॥
మనోర్వైవస్వతస్యేమం సాంప్రతస్య మహాత్మనః ।
విస్తరేణానుపూర్వ్యా చ నిసర్గం శృణుత ద్విజాః ॥
చతుర్యుగైకసప్తత్యా సంఖ్యాతః పూర్వమేవ తు ।
సహ దేవగణైశ్చైవ ఋషిభిర్దానవైః సహ ॥
పితృగంధర్వ యక్తైశ్చ రక్షోభూత గణైస్తథా ।
మాను షైః పశుభిశ్చైవ పక్షిభిః స్థావరైః సహ ॥
మన్వాదికం భవిష్యాంతమాఖ్యానైర్చహువిస్తరమ్ ।
వక్ష్యే వైవస్వతం సర్గం నమస్కృత్య వివస్వతే ॥
సూతుడనెను :
ఉపోద్ఘాతముతో బాటు విస్తరముగా మూడవ పాదమును జెప్పెదను. ఓ ద్విజులారా! ఆ పాదమును మొదటి నుండి చే వినుడు (3). ఓ ద్విజులారా! మహాత్ముడైన ఇప్పటి వైవస్వతమనువు యొక్క సృష్టిని పూర్వానుక్రమముగా విస్తరముగ విను డెబ్బదియొక్క చతుర్యుగముల (కృతాది కల్యంత యుగముల) పూర్వమే దేవగణముల తోను, ఋషుల తోను, దానవుల తోను, పితృ-గ యక్షులను దేవగణముల తోను, రాక్షస - భూత గణముల తోను, మనుష్యుల తోను, పశువుల తోను, పక్షుల తోను చెట్లు మొదలగు స్థావరము మనువు మొదలు భవిష్యము వరకు గల యాఖ్యానములతో (కథాప్రవచనములతో)ను, వైవస్వత మన్వంతర) సృష్టిని సూ! నమస్కరించి చెప్పెదను .
ఆద్యే మన్వంతరేఽతీతాః సర్గా ప్రావర్తకాశ్చ యే ।
స్వాయంభువేంఽతరే పూర్వం సప్తాసన్ యే మహర్షయః ॥
చాక్షుషస్యాంతరే ఽతీతే ప్రాప్తే వైవస్వతే పునః ॥
దక్షస్య చ ఋషీణాం చ భృగ్వాదీనాం మహౌజసామ్ ।
శాపాన్మహేశ్వరస్యాసీత్ ప్రాదుర్భావో మహాత్మనామ్ ॥
భూయః సప్తర్షయస్తే చ ఉత్పన్నాః సప్త మానసాః ।
పుత్రత్వే కల్పితాశ్చైవ స్వయమేవ స్వయంభువా ॥
ప్రజాసంతాన కృద్భిస్తైరుత్పద్య ద్భిర్మహాత్మభిః ।
పునః ప్రవర్తితః సర్గో గ్రహనక్షత్ర మండితః ॥
తేషాం ప్రసూతిం వక్ష్యామి విశుద్ధ జ్ఞానకర్మణామ్ ।
సమాసవ్యాస యోగాభ్యాం యథావదను పూర్వశః ॥
మొదట మన్వంతరమున గడచిన సృష్టులును, వానిని ప్రవర్తింపజేయువారును స్వాయంభువ మన్వంతరుమన నేఁ మహర్షులుగా నుండిరి. చాక్షుష మన్వంతరము గడచి మరల వైవస్వత మన్వంతరము రాగా (8), మహేశ్వరుని శాపము వలన యొక్కయు, మహౌజస్కులై మహాత్ములైన భృగువు మొదలగు ఋషుల యొక్కయు ప్రాదుర్భావము జరిగినది (9). మరల నాస మానస సృష్టిగా బుట్టిరి. స్వయంభువుడైన బ్రహ్మచే తనపుత్రులుగా జేయబడిరి (10). ప్రజా సంతానకారులై పుట్టుచున్న యా మహాత గ్రహ నక్షత్రములతో నలంకరింపబడిన సృష్టి మరల ప్రవర్తింపబడినది (11). విశుద్ధమైన జ్ఞానము కర్మలును గల్గిన వారియొక్క (స యొక్క) సంతానమును సంగ్రహ విస్తరములతో అనుక్రమముగ జెప్పెదను.
యేషామన్వయం సంభూతైర్లోకోఽయం సచరాచరః ।
పునః స పూరితః సర్గో గ్రహనక్షత్ర మండితః ॥
ఏతచ్ఛృత్వా వచస్తస్య మునీనాం సంశయో ఽభవత్ ।
తతస్తం సంశయావిష్టాః సూతం సంశయనిశ్చయే ।
సత్కృత్య పరిపప్రచ్ఛుర్మునయః శంశితవ్రతాః ॥
ఆ ఋషుల వంశములచేత బుట్టిన సృష్టి యీ చరాచరములతో నిండినదై గ్రహ నక్షత్రములతో నలంకరింపడినదై నావిర్భవించినది. అతని యీ వచనమును విని మునులకు సంశయము గలిగెను. తరువాత సంశయముతో గూడిన వారై ప్రశంసింప వ్రతములు గల యా మునులు సూతుని సత్కరించి సంశయమును దీర్పుమని యడిగిరి .
ఋషయ ఊచుః :-
కథం సప్తర్షయః పూర్వముత్పన్నాః సప్త మానసాః ।
పుత్రత్వే కల్పితాశ్చైవ తన్నో నిగద సత్తమ ॥
తతోఽబ్రవీన్మహాతేజాః సూతపౌరాణికః శుభమ్ ॥
కథం సప్తర్షయః సిద్ధాః యే వై స్వాయంభువేంఽతరే ।
మన్వంతరం సమాసాద్య పునర్యైవస్వతం కిల ॥
భవాభిశాపాత్సంవిద్ధా హ్యప్రాప్తాస్తే తదా తపః ।
ఉపపన్నా జనే లోకే సకృదాగామినస్తు తే ॥
ఊచుః సర్వే తతోఽ న్యోఽన్యం జనలోకే మహర్షయః ।
ఊచురేవ మహాభాగా వారుణే వితతే క్రతౌ ॥
సర్వేవయం ప్రసూయామశ్చాక్షుషస్యాంతరే మనోః ।
పితామహాత్మజాః సర్వే తతః శ్రేయో భవిష్యతి ॥
స్వాయంభువేఽ న్ తరే శప్తాః సప్తార్థం తే భవేన తు ।
జజ్ఞిరే వై పునస్తే హ జనలోకాద్ధివం గతాః ॥
దేవస్య మహతో యజ్ఞే వారుణీం బిభ్రతస్తనుమ్ ।
బ్రహ్మణో జుహ్వతః శుక్రమగ్నౌ పూర్వం ప్రజేప్సయా ॥
ఋషయో జజ్ఞిరే పూర్వం ద్వితీయమితి నః శ్రుతమ్ ॥
భృగురంగిరా మరీచిః పులస్త్యః పులహః క్రతుః ।
అత్రిశ్చైవ వసిష్ఠశ్చ అష్ఠౌ తే బ్రహ్మణః సుతాః ॥
ఋషులనిరి :
పూర్వము సప్తర్చులు మానస సృష్టిగా నెట్లు బుట్టిరి? బ్రహ్మచే వారు పుత్రులుగా నెట్లు చేయబడిరి? ఓ పండితశ్రేష్ఠా! మాకు జెప్పుము అనిరి. తరువాత మహాతేజస్వియైన సూతపౌరాణికుడు శుభముగా నిట్లు చెప్పెను (15). స్వాయంభువ మన్వంతరమునందలి సప్తర్షులు మరల వైవస్వత మన్వంతరమును జేరి సిద్ధులైరట (16). వారు అప్పుడు శివుని శాపముచే కొట్టబడినవారై తపోలోకమును జేరలేదు. మరల వారు 'జన' లోకమునకు మరలి వచ్చి చేరిరి (17). తరువాత నా మహరులందరు ఆ 'జన' లోకమున వారుణమైన క్రతువు ఏర్పడగా పరస్పరముగా నిట్లనుకొనిరి (18}. చాక్షుషమన్వంతరమున మనమందరము బ్రహ్మ (మానస) పుత్రలమై జన్మించెదము. దాని వలన శ్రేయస్సు గలుగును (19). స్వాయంభువ మన్వంతరమున సప్తార్థముగా శపింపబడిన వారై యీ లోకమున మరల జనించిరి. తరువాత జనలోకము నుండి దీవమునకు (స్వర్గమునకు) వెడలిరి (20). మహాదేవుని యజ్ఞమున బ్రహ్మ వరుణ శరీరమును ధరించెను. సంతానేచ్చతో అగ్నిలో నాతనిశుక్రమును హోమము జేయుచుండగా దాని నుండి ఈ ఋషులు పూర్వము రెండవ మారుగా జన్మించిరి - అని వినికిడి (21). భృగువు, అంగిరసుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడను ఈ యెనమండుగురు ఆ బ్రహ్మపుత్రులు.
తథాఽస్య వితతే యజ్ఞే దేవాః సర్వే సమాగతాః ।
యజ్ఞాంగాని చ సర్వాణి వషట్కారశ్చ మూర్తిమాన్ ॥
మూర్తిమంతి చ సామాని యజూంషి చ సహస్రశః ।
ఋగ్వేదశ్చా భవత్తత్ర పదక్రమ విభూషితః ॥
యజుర్వేదశ్చ వృత్తాఢ్య ఓంకార వదనోజ్జ్వలః ।
స్థితో యజ్ఞార్థ సంపృక్త సూక్ష బ్రాహ్మణ మంత్రవాన్ ॥
సామవేదశ్చ వృత్తాఢ్యః సర్వగేయ పురఃసరః ।
విశ్వావస్వాదిభిః సార్ధం గంధర్యైః సంభృతోఽభవత్ ॥
బ్రహ్మ వేదస్తథా ఘోరైః కృత్యావిధి భిరన్వితః ।
ప్రత్యంగిర సయోగైశ్చ ద్విశరీరశిరోఽభవత్ ॥
లక్షణాని స్వరాః స్తోభాః నిరుక్త స్వరభక్తయః ।
ఆశ్రయస్తు వషట్కారో నిగ్రహ ప్రగ్రహావపి ॥
దీప్తా దీపిరిలాదేవీ దిశః ప్రదిశగీశ్వరాః ।
దేవకన్యాశ్చ పత్మ్యశ్చ తథా మాతర ఏవ చ ॥
ఆయుః సర్వత ఏవైతే దేవస్య యజతో ముఖే ।
మూర్తిమంతః స్వరూపాఖ్యా వరుణస్య వపుర్భృతః ॥
స్వయంభువస్తు తా దృష్ట్వా రేతః సమపతద్భువి ।
బ్రహర్షేర్భావ భూతస్య విధానాచ్చ న సంశయః ॥
కృత్వా జుహావ స్రుగ్భ్యాం చ స్రువేణ పరిగృహ్య చ ।
ఆజ్యవజుహవాంచక్రే మంత్రవచ్చ పితామహః ॥
అట్లే యీతని (బ్రహ్మ) యొక్క విశాలమైన యజ్ఞమున దేవత లందరును వచ్చిరి. సమస్తములైన యజ్ఞాంగములును, వషట్కారమును మూర్తిమంతము లైనవి (23). వేలకొలది సామములును యజుస్సులును మూర్తిమంతములైనవి. ఆకారముల దాల్చినవి. పదక్రమములతో నలంకరింప బడిన ఋగ్వేదము గూడ నట మూర్తిమంతమయ్యెను (24). వృత్తములతో గూడిన యజుర్వేదము ఓంకారమే ముఖముననుజ్జ్వలముగా వెలిగినదై, యజ్ఞమునకై జోడించిన సూక్తములు - బ్రాహ్మణములు, మంత్రములును గలదై యుండెను (25), సామవేదము గూడ వృత్తములతో నొప్పినదై, సమస్త గేయములు ముందుగానున్నదై విశ్వావస్వాదులతోను గంధర్వులతోను సంపాదింప బడియుండెను (26). బ్రహ్మ వేదము. అట్లే యది ఘోరములైన కృత్యావిధులతో గూడినదై, ప్రత్యంగిరసయోగములతోను గూడినదై రెండు శరీర - శిరములు గలదయ్యెను (27). లక్షణములు - స్వరములు, స్తోభములు, నిరుక్త స్వరభక్తులును, ఆశ్రయమైన వషట్కారమును, నిగ్రహ - ప్రగ్రహములును (లక్షణములు) (28). దీప్తమైన (మండిన) దీప్తి (వెలుగు) గల . ఇలాదేవియు (భూదేవియు), దిక్కులును, ఆగ్నేయాది కోణ దిక్కులును, వాక్పతులును, దేవకన్యలును, పత్నులును, అట్లే మాతృ దేవతలును (29), ఆయ వీరందరును యజ్ఞము జేయుచున్న దేవుని (అగ్నిదేవుని) ఎదుటనంతటను ఆకారము గలవారై శరీరము దాల్చిన వరుణుని స్వరు నావిర్భవించిరి (30). వారందరిని జూచి స్వయంభువున (బ్రహ్మ)కు భూమి పై రేతఃపతనమాయెను. అది బ్రహ్మర్షి భావనా : వల్లనే జరిగినది. నిశ్చయము (31). బ్రహ్మదానిని స్రువముతో పరిగ్రహించి స్రుక్కులతో ఆజ్యము వలె మంత్రవంతముగా : జేసెను .
తతః స జనయామాస భూతగ్రామం ప్రజాపతిః ।
తస్యార్వాక్ తేజసస్తస్య యజ్ఞే లోకేషు తైజసమ్ ॥
తమసో భావవ్యాప్యత్వం తథా సత్త్వం తథారజః ॥
సగుణాత్తేజసో నిత్యమాకాశే తమసి స్థితమ్ ।
తమస స్తేజసత్వాచ్చ సర్వభూతాని జజ్ఞిరే ॥
యదా తస్మిన్నజాయంత కాలే పుత్రాస్తు కర్మజాః ।
ఆజ్యస్థాల్యాము పాదాయ స్వశుక్రం హుతవాంశ్చ హ ॥
శుక్రే హుతేఽథ తస్మింస్తు ప్రాదుర్భూతా మహర్షయః ।
జ్వలంతో వపుషా యుక్తాః సప్త వై ప్రస్రవైర్గుణైః॥
హుతే చాగ్నౌ సకృచ్ఛుక్లే జ్వాలయా నిఃస్రుతః కవిః ।
హిరణ్యగర్భస్తం దృష్ట్వా జ్వాలాం భిత్త్వా వినిఃస్రుతమ్ ॥
భృగుస్త్వమితి హోవాచ యస్మాత్త స్మాత్స వై భృగుః ॥
మహాదేవ స్తథోద్భూతం దృష్ట్వా బ్రహ్మాణమబ్రవీత్ ।
మమైష పుత్రకామస్య దీక్షితస్య త్వయం ప్రభో ।
విజజ్ఞేఽ థ భృగుర్దేవో మమ పుత్రో భవత్వయమ్ ॥
తథేతి సమనుజ్ఞాతో మహాదేవః స్వయంభువా ।
పుత్రత్వే కల్పయామాస మహాదేవస్తథా భృగుమ్ ।
వారుణా భృగవస్తస్మాత్తదపత్యం చ స ప్రభుః ॥
దాని నుండి యా ప్రజాపతి (బ్రహ్మ) భూత సమూహమును సృష్టించెను. దానికి ముందుగనే యజ్ఞమందలి యా తేజ లోకములలోని తైజసము ఆవిర్భవించినది. తమస్సుతో భావవ్యాప్యత్వరూపమైన తమస్సు, అట్లే సత్త్వము, అట్లే రజస్సును జని (33). సగుణమైన తేజస్సు వలన ఆకాశమున తమమున నిత్యము (భూత గ్రామము) ఉన్నది. తమస్సు తేజస్సగుట వలన సర్వభూ జనించినవి (34). కర్మజులైన పుత్రులు దానియందు బుట్టినపుడు బ్రహ్మ తన శుక్రమును ఆజ్యస్థాలిలో (యజ్ఞపునేతిపాత్రలో), హోమము జేసెనట (35). ఆ శుక్రము హోమము జేయబడగా దాని నుండి ప్రసవగుణముతో గూడినవారై శరీరములతో (అగ్నుల వలె) ప్రకాశించినవారై సప్త మహర్షులు బుట్టిరి (36). అగ్నిలో శుక్రము ఒక్కమారు హోమము చేయగనే యాజ్వాల (శుక్రుడు) బయల్వెడలేను. ఆ తీరుగా మంటను భేదించుకొని బయలు వెడలిన యాతనిని బ్రహ్మ చూచి నీవు భృగుడవు అని ప అందువలన నాతడు భృగువయ్యేను (37). మహాదేవుడు శివుడు ఆ విధముగా జ్వాల నుండి బయలు వెడలిన బ్రాహ్మణు బ్రహ్మతో నిట్లనెను. ఓ ప్రభూ! బ్రహ్మా! పుత్రకాముడనై దీక్షితుడనైన నాకీ భృగువను దేవుడు జనించెను. ఇక వీడు నా పుత్రుడి అని యనెను (38). బ్రహ్మదేవుడంగీకరించగనే మహాదేవుడు ఆ 'భృగు 'వును తన పుత్రునిగా జేసికొనెను. కావున వా భృగువులు ఆ ప్రభువైన భృగువు వారి సంతానము .
ద్వితీయం తు తతః శుక్రమంగారేష్వ పతత్ప్రభుః ।
అంగారేష్వంగి రోంఽగాని సంహితాని తతోంఽగిరాః ॥
సంభూతిం తస్య తాం దృష్ట్వా వహ్నిర్భ్రహ్మాణ మబ్రవీత్ ।
రేతోధాస్తుభ్యమేవాఽహం ద్వితీయోఽయం మమాస్త్వితి॥
ఏవమస్త్వితిసోఽ ప్యుక్తో బ్రహ్మణా సదసస్పతిః ।
తస్మాదంగిరసశ్చాపి ఆగ్నేయా ఇతి నః బ్రతమ్ ॥
తరువాత రెండవ శుక్రము అగ్నిలో బడెను. ఆయంగారములలో (శుక్రము) అంగములను గూర్చుకొని ప్రభువగు అంగిరసుడి (40). ఆ విధముగ అంగిరసుని యుత్పత్తిని జూచి యగ్ని బ్రహ్మతో నిట్లనెను. ఓ బ్రహ్మా! నీకొరకే నేను రేతస్సును ధరించితి రెండవవాడు నాకు పుత్రుడగు గాక - అని యడిగెను (41). అట్లేయగుగాకయని బ్రహ్మ సదసస్పతియైన యగ్నితో ననేను. అంగిరసులు ఆగ్నేయులని మేము ఏంటీమి .
షట్కృత్యస్తు పునః శుక్రే బ్రహ్మణా లోకకారిణా ।
హుతే సమభవంస్తత్ర షద్భ్రహ్మాణ ఇతి శ్రుతిః ॥
మరీచిః ప్రథమస్తత్ర మరీచిభ్యః సముత్థితః ।
క్రతౌ తస్మిన్ సుతో జజ్ఞే యతస్తస్మాత్స వై క్రతుః ॥
అహం తృతీయ ఇత్యర్ధస్తస్మాదత్రిః స కీర్త్యతే ।
కేశైశ్చ నిశితైర్భూతః పులస్త్యస్తేన స స్మృతః ॥
కేశైర్లంబైః సముద్భూతస్తస్మాత్తు పులహః స్మృతః ।
వసుమధ్యాత్స ముత్పన్నో వసుమాన్ వసుధాశ్రయః ॥
వసిష్ఠ ఇతి తత్త్వజ్ఞైః ప్రోచ్యతే బ్రహ్మవాదిభిః ।
ఇత్యేతే బ్రహ్మణః పుత్రాః మానసాః షణ్మహర్షయః ॥
లోకస్య సంతానకరా స్తైరీమా వర్ధితాః ప్రజాః ।
ప్రజాపతయ ఇత్యేవం పఠ్యంతే బ్రహ్మణః సుతాః ॥
లోకకారియైన బ్రహ్మచే మరల సౌకుమారులు శుక్రము హోమము చేయబడగా అందుండి యాఱుగురు బ్రహ్మలు బుట్టరని మేము వింటిమి (43). అందులో మొదటి వాడు మరీచి. మరీచుల (కీరణముల) నుండి పుట్టినవాడు. ఆ క్రతువునందొక కొడుకు బుట్టెను. దాని వలన సౌతడు క్రతువనబడెను (44). నేను మూడవవానిని - అను నర్థముతో మూడవవాడు అత్రీ (అహంత్రిః) అని కీర్తింపబడెను. నిశితములైన (వాడియైన) కేశములతో బుట్టినందున (తరువాతివాడు) పులస్త్యుడనబడెను (45). పొడవైన వెంట్రుకలతో బుట్టినందున తరువాతివాడు) పులహుడనబడెను. వసు (ధన) మధ్యము నుండి బుట్టి (తరువాతివాడు) వసుమంతుడై వసుధకు (భూమికి) ఆశ్రయుడై (46), తత్త్వజ్ఞులైన బ్రహ్మవాదులచే వసిష్ఠుడనబడెను. ఈ యాఱుగురు మహరులు బ్రహ్మ మానసపుత్రులు (47). లోకమునకు సంతానకారులు, వీరిచే ప్రజలు వృద్ధిజేయబడిరి. బ్రహ్మపుత్రులైన వీరు ప్రజాపతులనబడుదురు .
అపరే పితరో నామ ఏతై రేవ మహర్షిభిః ।
ఉత్పాదితా ఋషిగణాః సప్త లోకేషు విశ్రుతాః ॥
మారీచా భార్గవాశ్చైవ తథైవాంగీరసో ఽపరే ।
పౌలస్త్యాః పౌలహాశ్చైవ వాసిష్ఠాశ్చైవ విశ్రుతాః ॥
ఆత్రేయాశ్చ గణాః ప్రోక్తాః పితృణాం లోకవిశ్రుతాః ॥
ఏతే సమాసతస్తాత పురైవ తు గుణాస్త్రయ ।
అపూర్వాశ్చ ప్రకాశాశ్చ జ్యోతిష్మంతశ్చ విశ్రుతాః ॥
ఈ మహర్షుల చేతనే జనించిన పితరులను వేడొక ఋషిగణములు ఏడు. లోకములలో బ్రసిద్ధములు (49). మారీచగణములు, భార్గవ గణములు, ఆంగిరసగణములు, పౌలస్త్యగణములు, పౌలహగణములు, వాసిష్ఠగణములు, ఆత్రేయగణములు - అనునవి లోకప్రసిద్ధములైన పితృగణములనబడినవి (50). ఓయి! వీరు సంగ్రహముగా పూర్వమే మూడు గణములుగా జెప్పబడిరి. అవి - అపూర్వములు, ప్రకాశములు, జ్యోతిష్మంతములును - అని మూడుగా ప్రసిద్ధిజెందినవి.
తేషాం రాజా యమో దేవో యమైర్విహిత కల్మషాః ।
అపరే ప్రజానాం పతయస్తాన్ శృణుధ్వ మతంద్రితాః ॥
కర్దమః కశ్యపః శేషో విక్రాంతః సుశ్రువాస్తథా ।
బహుపుత్రః కుమారశ్చ వివస్వాన్ స శుచిశ్రవాః ॥
ప్రచేతసోఽ ర్నిష్ట నేమిర్భహులశ్చ ప్రజాపతిః ।
ఇత్యేవమాదయోఽ న్యేపి బహవశ్చ ప్రజేశ్వరాః ॥
కుశోచ్చయా వాలఖిల్యాః సంభూతాః పరమర్షయః ।
మనోజవాః సర్వగతాః సార్వభౌమాశ్చ తేఽభవన్ ॥
జాతా భస్మవ్యపోహిన్యాం బ్రహ్మర్షి గణసమ్మతాః ।
వైఖానసా మునిగణాన్తపః శ్రుతపరాయణాః ॥
శ్రోతో భ్యస్తస్య చోత్పన్నావశ్వినౌ రూపసమ్మితౌ ।
విదుర్జన్మాక్షరజసో విమలా నేత్రసంభవాః ॥
జ్యేష్ఠాః ప్రజానాం పతయః స్రోతోభ్యస్తస్య జజ్ఞిరే ।
ఋషయో రోమకూపేభ్యస్తథా స్వేదమలోద్భవాః ॥
దారుణా హి రుతే మాసా నిర్యాసాః పక్షసంధయః ।
వత్సరా యే త్వహోరాత్రాః పిత్రం జ్యోతిశ్చ దారుణమ్ ॥
రౌద్రం లోహితమిత్యాహుర్లోహితం కనకం స్మృతమ్ ।
తస్మైత్రమితి విజ్ఞేయం ధూమశ్చ పశవః స్మృతాః ॥
యేఽర్చిషస్తస్య తే రుద్రాః తథాదిత్యాః సముద్భవాః ।
అంగారేభ్యః సముత్పన్నాః జ్యోతిషో దివ్యమానుషాః ॥
ఆదిమానస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మసముద్భవః ।
సర్వకామదమిత్యాహుస్తత్ర కన్యాముదాహరన్ ॥
బ్రహ్మా సురగురుస్తత్ర త్రిదశైః సంప్రసీదతి ।
ఇమే వై జనయిష్యంతి ప్రజాః సర్వాః ప్రజేశ్వరాః ॥
సర్వే ప్రజానాం పతయః సర్వే చాపి తపస్వినః ।
తత్ప్రసాదాదిమాన్ లోకాన్ ధారయేయురిమాః క్రియాః ॥
ద్వంద్వం సంవర్ధయామాస తవ తేజోవివర్ధనమ్ ।
దేవేషు వేదవిద్వాంసః సర్వే రాజర్షయస్తథా ॥
వేదమంత్రపరాః సర్వే ప్రజాపతి గుణోద్భవాః ।
అనంతం బ్రహ్మ సత్యం చ తపశ్చ పరమం భువి ॥
సర్వే హి వయమేతే చ తథైవ ప్రసవః ప్రభో ।
బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చైవ లోకాశ్చైవ చరాచరాః ॥
మరీచిమాదితః కృత్వా దేవాశ్చ ఋషిభిః సహ ।
అపత్యానీహ సంచింత్య తేపత్యం కామయామహే ॥
తస్మిన్ యజ్ఞే మహాభాగా దేవాశ్చ ఋషిభిః సహ ।
ఏతద్వంశ సముద్భూతాః స్థానకాలాభిమానినః ॥
న చ తేనైవ రూపేణ స్థాపయేయురిమాః ప్రజాః ।
యుగాదినిధనాచ్చైవ స్థాపయైయురిమాః ప్రజాః ॥
వారికి రాజు యమదేవుడు. అహింసాది నియమములతో వీడిన పాపములు గల యితరులు ప్రజాపతులు. వారిని జెప్పెదను మీరు ఏమరుపాటు లేక వినుడు (52). కర్దముడు, కశ్యపుడు, శేషుడు, విక్రాంతుడు, సుశ్రువుడు, బహుపుత్రుడు, కుమ వివస్వంతుడు, శుచిశ్రవుడు, (53) ప్రచేతసుడు, అరిష్టనేమీ, బహులుడు, ప్రజాపతి - అను నీ మొదలగు వారు ఇతరులును ఆ ప్రజాపతులు (54). దర్భలంత యెత్తు గలవారును, మనోవేగము గలవారును, సర్వము నందుండువారును - ఐన వాలఖిల్యుల, పరమరులు సార్వభౌములునునై జన్మించిరి (55). భస్మవ్యపోహిని యందు (భస్మమును దూరము జేయు దానియందు) బుల్స్ బ్రహ్మర్షిగణముచే సమ్మతులై తపో వేదములందు పరాయణులైనవారు వైఖానసులను ముని గణము వారు (56), ఆతని (బ్రహ్మ యింద్రియముల నుండి పుట్టిన యశ్వినీ దేవతలు చక్కని రూపములతో గూడినవారు. జన్మాక్షరజసులు విమలురై నేత్రముల బుట్టినవారుగా దెలియుదురు (57). ఆతని (బ్రహ్మ, అగ్ని) యింద్రియముల నుండి జ్యేష్ఠులైన ప్రజాపతులు పుట్టిరి. రోమకూ నుండియు అట్లే స్వేద (చెమట) మలము నుండియు ఋషులు పుట్టిరి (58). రుతమున మాసములు, జిగురులు, పక్షసంధ వత్సరములును, అహోరాత్రములును, దారుణములు (భయంకరములు) పుట్టినవి (59). రౌద్రమును లోహితమందురు. లో కనకమనబడినది. అది మైత్రమని (సూర్యసంబంధమని) తెలియవలెను. ధూమము పశువులనబడినవి (60). ఆ యగ్నిజ రుద్రులు అట్లే జనించిన ఆదిత్యులు (సూర్యులు). అంగారముల నుండి పుట్టిన జ్యోతిస్సులు దివ్యమానుష రూపములు (దే మనుష్యులును) (61). వేదము నుండి పుట్టిన బ్రహ్మ యీ లోకమునకు మొదటివాడు. దీనిని సర్వకామదమని యందురు. కన్యనుదాహరించిరి (62). అచట దేవగురువైన బ్రహ్మ దేవతలచే ప్రసన్నుడగును. ఈ ప్రజాపతులందరు ప్రజలను బుట్టీ (63). వారందరు ప్రజాపతులు. వారందరును తపస్వులు, వారియనుగ్రహమున నీలోకముల నీక్రియలు ధరించును (64). అగ్ని తేజమును వర్ధిల్లజేయు జంటను వర్ధిల్లజేసెను. అట్లే దేవతలలో వేద విద్వాంసులందరు రాజర్షులైరి (65). అం వేదమంత్రుపరులును, ప్రజాపతి గుణములతో బుట్టినవారునైరి. భూమిలో తపము అనంతమై బ్రహ్మస్వరూపమై, సత్యస్వర పరమమైనదగును (66). ఓ ప్రభూ! ఈమేమందరము నీ సంతానరూపులమే. బ్రహ్మయు, బ్రాహ్మణులును, చరాచరములైన లోకమ నీ సంతానమే (67). మరీచి మహర్షిని మొదటనుంచుకొని ఋషులతోబాటు దేవతలు - మేము నీ అపత్యములను (సంతానమ కోరుచున్నామని సంతానమును గోరిరి (68), ఆ యజ్ఞమున మహాభాగులైన దేవతలు ఋషులతో గూడ నీ వంశమున బుట్టి స్థానకాలాభిమానులైరి (69). వారు ఈ ప్రజలను ఆ రూపముతోనే నిలుపరు. యుగాద్యంతముల దాక ఈ ప్రజలను నిలుపుదురు.
తతోఽబ్రవీల్లో కగురుః పరమిత్య విచారయన్ ।
ఏవం దేవా వినిశ్చిత్య మయా సృష్టా న సంశయః ॥
భవతాం వంశసంభూతాః పునరేతే మహర్షయః ॥
తేషాం భృగోః కీర్తయి ష్యే వంశం పూర్వమహాత్మనః ।
విస్తరేణానుపూర్వ్యా చ ప్రథమస్య ప్రజాపతేః ॥
భార్యా భృగోరప్రతిమే ఉత్తమేఽ భీజనే శుభే ।
హిరణ్యకశిపోః కన్యా దివ్యా నామ పరిశ్రుతా ॥
పులోమ్నశ్చాపి పౌలోమీ దుహితా వరవర్ణినీ ॥
భృగోస్త్వజనయద్దివ్యా కావ్యం వేదవిదాం వరమ్ ।
దేవాసురాణమాచార్యం శుక్రం కవిసుతం గ్రహమ్ ॥
స శుక్రశ్చోశనా ఖ్యాతః స్మృతః కావ్యోఽపి నామతః ।
పితృణాం మానసీ కన్యా సోమపానాం యశస్వినీ ॥
శుక్రస్య భార్యాంగీ నామ విజజ్ఞే చతురః సుతాన్ ॥
బ్రా హ్మేణ తేజసా యుక్తః స జాతో బ్రహ్మవిత్తమః ।
తస్యామేవ తు చత్వారః పుత్రాః శుక్రస్య జిజ్ఞిరే ॥
త్వష్టా వరూత్రీ ద్వావేతౌ శండోమర్కౌ చ తావుభౌ ।
తే తదాదిత్యసంకాశా బ్రహ్మకల్పాః ప్రభావతః ॥
రంజనః పృథురశ్మిశ్చ విద్వాన్ యశ్చ బృహద్గిరాః ।
వరూత్రిణః సుతా హ్యేతే బ్రహ్మిష్ఠాః సురయాజకః ॥
ఇజ్యాధర్మవినాశార్థం మనుమేత్యాభ్య యోజయన్ ।
నిరస్యమానం వై ధర్మం దృష్ట్వేంద్రో మనురబ్రవీత్ ॥
ఏతైరేవ తు కామం త్వాం ప్రాపయిష్యామి యాజనమ్ ।
శ్రుత్వేంద్రస్య తు తద్వాక్యం తస్మాద్దేశాదపాక్రమన్ ॥
తిరోభూతేషు తేష్వింద్రో ధర్మపత్నీం చ చేతనామ్ ।
గ్రహేణ మోచయిత్వా తు తతః సోఽ నుససార తామ్ ॥
తత ఇంద్రవినాశాయ యతమానాన్ యతీంస్తు తాన్ ।
తత్రాగతాన్ పునర్దృష్ట్వా దుష్టానింద్రః ప్రహన్య తు ॥
సుష్వాప దేవదేవస్య వేద్యాం వై దక్షిణే తతః ॥
తేషాం తు భక్ష్యమాణానాం తత్ర శాలావృకైః సహ ।
శీర్షాణి న్యపతంస్తాని ఖర్జూరాణ్యభవం స్తతః ।
ఏవం వరూత్రిణః పుత్రాః ఇంద్రేణ నిహతాః పురా ।
యజన్యాం దేవయానీ చ శుక్రస్య దుహితాఽ భవత్ ॥
త్రిశిరా విశ్వరూపస్తు త్వష్టుః పుత్రోఽ భవన్మహాన్ ।
విశ్వరూపానుజశ్చాపి విశ్వకర్మా యమః స్మృతః ॥
భృగోస్తు భృగవో దేవా జజ్ఞిరే ద్వాదశాత్మజాః ।
దేవ్యాం తాన్ సుషువే సర్వాన్ కావ్యశ్చైవాత్మజాన్ప్రభుః ॥
భువనో భావనశ్చైవ అన్యశ్చాన్యాయతస్తథా ।
క్రతుః శ్రవాశ్చ మూర్ధా చ వ్యజయో వ్యశ్రుషశ్చ యః ॥
ప్రసవశ్చాప్యజశ్చైవ ద్వాదశోఽ ధిపతిః స్మృతః ॥
ఇత్యేతే భృగవో దేవాః స్మృతా ద్వాదశ యాజ్ఞికాః ।
పౌలోమ్యజనయత్పుత్రం బ్రహ్మిష్ఠం వశినం విభుమ్ ॥
వ్యాధితః సోఽ ష్టమే మాసి గర్భక్రూరేణ కర్మణా ।
చ్యవనాచ్చ్యవనాసోఽథ చేతనస్తు ప్రచేతసః ।
ప్రాచేతసాచ్చ్యవనక్రోధాదధ్వానం పురుషాదజః ॥
జనయామాస పుత్రౌ ద్వౌ సుకన్యాయాం చ భార్గవః ।
ఆత్మవానం దధీచం చ తావుభౌ సాధుసమ్మతౌ ॥
సారస్వతః సరస్వత్యాం దధీచాచ్చోపపద్యతే ।
రుచీ పత్నీ మహాభాగా ఆత్మవానస్య నాహుషీ ॥
తస్య ఊర్వోః ఋషిర్జజ్ఞే ఊరూ భిత్త్వా మహాయశాః ।
ఔర్వస్యాసీదృచీకస్తు దీప్తాగ్నిసదృశప్రభః ॥
జగమదగ్నిః ఋచీకస్య సత్యవత్యాం వ్యజాయత ।
భృగోశ్చ రుచిపర్యాయే రౌద్రవైష్ణవయో స్తథా ॥
జమనాద్వైష్ణవ స్యాగ్నేర్జమదగ్ని రజాయత ।
రేణుకా జమదగ్నేస్తు శక్రతుల్య పరాక్రమమ్ ।
బ్రహ్మాక్షత్రమయం రామం సుషువేఽ మిత తేజసమ్ ॥
ఔర్వస్యాసీత్పుత్రశతం జమదగ్ని పురోగమమ్ ।
తేషాం పుత్ర సహస్రాణి భార్గవాణాం పరస్పరాత్ ॥
ఋష్యంతరేషు వై బాహ్యా బహవో భార్గవాః స్మృతాః ।
వత్సో విశ్వోఽ శ్విషేణశ్చ పాండః పథ్యః సశౌనకః ।
గోత్రేణ సప్తమా హ్యేతే పక్షా జ్ఞేయాస్తు భార్గవాః ॥
తరువాత లోకగురుడైన బ్రహ్మ పరుడని విచారింపక యిట్లు పలికెను. ఈ విధముగా నిశ్చయించి నా చేత దేవతలు సృష్టింపబడిరి. సంశయము లేదు. మరల నీ మహర్షులు మీ యొక్క వంశమున బుట్టిరి (71). వారిలో పూర్వ మహాత్ముడైన భృగువుయొక్క వంశమును కీర్తించెదను (చెప్పెదను) ప్రథమప్రజాపతియైన యా భృగువుయొక్క వంశమును విస్తరముగను ఆనుపూర్వీతోను జెప్పెదను (72). భృగువు యొక్క భార్యలు సాటిలేనివారు, ఉత్తమురాండ్రు, బాంధవ్యము గలవారు, శుభకరులై వారునైన యిరువురుండిరి. అందులో నొకటి హిరణ్యకశిపుని యొక్క కన్య ‘దివ్య’ యని ప్రసిద్ది జెందినది - రెండవది పులోముని పుత్రిక పౌలోమి శ్రేష్టురాలైనది (73). భృగువు వలన దివ్య వేదవేత్తలలో శ్రేష్ఠుడైన కావ్యుని (శుక్రుని) గనెను. ఆతడు దేవాసురులకు ఆచార్యుడు, కనీసుతుడు, గ్రహరూపుడునైన శుక్రుడు (74). ఆ శుక్రుడు ఉశనుడని ప్రసిద్ధుడు. పేరున కొవ్యుడని పిలువడినవాడు, సోమపులైన పితరుల మానసీకన్యయు యశస్వినియునైన 'అంగి' యను శుక్రుని భార్య నలుగురను పుత్రులను గనెను (75), భృగు - దివ్యల వల్ల బుటిన శుక్రుడు బ్రహ్మతేజముతో గూడినవాడు. బ్రహ్మవేత్తలలో నుత్తముడు. ఆ శుక్రునకు భార్యయైన యంగియందు నలుగురు పుత్రులు పుట్టిరి (76). త్వష్ట, వరూత్రీ - అను నీయిరువురును, శండుడు - అమర్కుడు - అనువారిరువురును. వారు ఆ సూర్యునితో సమానమైన కాంతి గలవారు. ప్రభావమున బ్రహ్మతో సమానులు (77). రంజనుడు, పృథురశ్మి, విద్వాంసుడైన బృహఠిరుడును - వీరు వరూత్రియొక్క సుతులు బ్రపి సురులకు యాజకులు (యజ్ఞముల జేయించువారు) (78). వారు ఇజ్యా (యాగ) ధర్మ వినాశము కొరకు మనువును జేరి కలిసి విధముగా నిరసింపబడుచున్న ధర్మమును జూచి మనువనెను. వీరిచేతనే స్వేచ్చగా నిన్ను యాజనమును (యజ్ఞము జేయ పొందించగలను (అని యనెను). ఇంద్రుని యా వాక్యమును విని యా ప్రదేశము నుండి వారు తొలగిరి (80). వారు తొలిగి కనబడి ఇంద్రుడు ధర్మపత్నియైన చేతనను గ్రహముతో ముక్తురాలినిగా జేయించి, తరువాత నాతడామె ననుసరించెను (81). త ఇంద్రవినాశనమునకై యత్నించుచున్న నాయకులను అక్కడికి వచ్చిన వారిని మరల నింద్రుడు చూచెను. చూచి యింద్రుడా జంపి, తరువాత దక్షిణమునందు దేవదేవుని యొక్క వేదియందు పరుండెను (82), శాలావృకములతో (శాలలోనీ తోడేళ్ళతో) తినబరి వారియొక్క శిరములు పడినవి. అవి తరువాత ఖర్జూరములైనవి (83). ఈ విధముగ వరూత్రీయొక్క పుత్రులు పూర్వమిం హతులైరి. శుక్రునకు యజనియందు దేవయాని పుత్రికగా జనించెను (84), త్రిశిరుడై మహాత్ముడైన విశ్వరూపుడు త్వష్ట పుత్రుడయ్యెను. విశ్వరూపుని తోబుట్టువు గూడ విశ్వకర్మయే యముడనబడెను (85). భృగువు వలన దేవతలైన భృగువులు పండ్రెం పుత్రులుగా జన్మించిరి. ప్రభువైన కావ్యుడు దేవియందు వారందరిని పుత్రులుగా గనెను (86). వారు భువనుడు, భావనుడు, అ అన్యాయతుడు, క్రతువు, శ్రవుడు, మూర్ధుడు, వ్యజయుడు, వ్యశ్రుషుడు, ప్రసవుడు, అజుడు, పండ్రెండవవాడు అధిపతియు న (87) వీరు దేవతలైన భృగువులు, పండ్రెండుగురు, యాజ్ఞికులును. (భృగువు వలన) పౌలోమీ బ్రహ్మిష్ణుడు వశియు విభు పుత్రుని గనెను (88). ఆతడు ఎనిమిదవ నెలలో గర్భక్రూరమైన కర్మచే చ్యవనమగుట (జారినవాడగుట) వలన చ్యవనుడన తరువాత ప్రచేతసుని నుండి చేతనుడు చ్యవనక్రోధుడైన ప్రాచేతసు (చేతను) నుండి అధ్వానుడు, పురుషుని నుండి యజుడును జ (89). భార్గవుడైన చ్యవనుడు సుకన్యయందు ఆత్మవానుడు, దధీచుడు అను నిరువురు పుత్రులను గనెను. వారిరువురు సమ్మతులు (90). దధీచి వలన సరస్వతియందు సారస్వతుడు పుట్టెను. నహుష పుత్రియైన 'రుచి' అను మహాభాగ్యవతి ఆత్మ పత్నియైనది (91). ఆ ఆత్మవానుని యొక్క తొడల నుండి యా తోడలను భేదించుకొని ఋషియైన ఔర్వుడు' పుట్టెను. మహాయశస్వి. ఔర్వునకు మండుటగ్ని వలె ప్రకాశించు ఋచీకుడు పుట్టెను (92). ఋచీకునకు సత్యవతియందు జమదగ్ని భృగువునకు రుచి పర్యాయమున రౌద్ర - వైష్ణవములలో వైష్ణవాగ్నియొక్క (93) జమనము వలన (భుజించుట వలన) జ జనించెను. రేణుక జమదగ్ని వలన ఇంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడును, బ్రహ్మ - క్షత్ర తేజములు నిండినవ అమిత తేజస్కుడైన పరశురాముని గనెను (94). ఔర్వునకు జమదగ్ని మొదలుగా గల పుత్రశతము గలిగెను. ఆ భార్గవులకు పరస్పర వేల పుత్రులు గలిగిరి (95). ఋష్యంతరులలోను బాహ్యలుగా ననేకులు భార్గవులనబడిరి. వారు - వత్సుడు, విశ్వుడు, అశ్విపే పాండుడు, పథ్యుడు, శౌనకుడును. గోత్రముతో వీరు ఏడవవారు ఈ పక్షములు భార్గవ పక్షములుగా దెలియదగినవి.
శృణుతాంగిరసో వంశమగ్నేః పుత్రస్య ధీమతః ।
యస్యాన్వవాయే సంభూతా భారద్వాజాః సగౌతమాః ॥
దేవాశ్చాంగిరసో ముఖ్యాస్త్విషుమంతో మహౌజనః ॥
సురూపా చైవ మారీచీ కార్దమీ చ తథా స్వరాట్ ।
పథ్యా చ మానవీ కన్యా తిస్రో భార్యాస్త్వథర్వణః ॥
ఇత్యేతాంగిరసః పత్న్యః స్తాసు వక్ష్యామి సంతతిమ్ ॥
అథర్వణస్తు దాయాదాస్తాసు జాతాః కులోద్వహాః ।
ఉత్పన్నా మహతా చైవ తపసా భావితాత్మనామ్ ॥
బృహస్పతిః సురూపాయాం గౌతమః సుషువే స్వరాట్ ।
అవంధ్యం వామదేవం చ ఉతథ్యముశిజం తథా ॥
ధిష్ణుః పుత్రస్తు పథ్యాయాం సంవర్తశ్చైవ మానసః ।
విచిత్తశ్చ తథాయస్యః శరద్వాంశ్చాప్యుతథ్యజః ॥
అశిజో దీర్ఘతమా బృహదుత్థో వామదేవజః ।
ధిష్ణోః పుత్రః సుధన్వాన ఋషభశ్చ సుధన్వనః ॥
రథకారాః స్మృతా దేవా ఋషయో యే పరిశ్రుతాః ।
బృహస్పతేర్భరద్వాజో విశ్రుతః సుమహాయశాః ॥
అంగిరసస్తు సంవర్తో దేవానంగిరసః శృణు ।
బృహస్పతేర్యవీయాంసో దేవా హంగీరసః స్మృతాః ॥
ఔరసాంగిరసః పుత్రాః సురూపాయాం విజజ్ఞిరే ।
ఔదార్యాయుర్ధనుర్ధక్షోదర్భః ప్రాణస్తథైవ చ ॥
హవిష్మాంశ్చ హావిష్ణుశ్చ క్రతుః సత్యశ్చ తే దశ ॥
అయస్యస్తు ఉతథ్యశ్చ వామదేవస్తథోశిజః ।
భారద్వాజాః శాంకృతికాః గార్గ్యకాణ్వ రథీతరాః ॥
ముద్గలా విష్ణువృద్ధాశ్చ హరితా వాయవస్తథా ।
తథా భాక్షా భరద్వాజా ఆర్షభాః కింభయాస్తథా ॥
ఏతే హ్యంగిరసః పక్షా విజ్ఞేయా దశ పంచ చ ।
ఋష్యంతరేషు వై బాహ్యా బహవోఽగిరసః స్మృతాః ॥
అగ్నిపుత్రుడై ధీమంతుడైన యంగిరసుని యొక్క వంశమును వినుడు. ఆతని వంశమున గౌతమునితో బాటు భారద్వాజులు పుట్టిరి. దేవతలైన యాంగిరసులు మహౌజస్కులై ఇపుమంతులై (బాణములు గలవారై) ముఖ్యులైనవారు (97). మరీచి మహర్షి పుత్రి మారీచియైన సురూపయు, స్వరాట్టెవ కర్దమప్రజాపతి పుత్రియైన కార్టమియు, మనుపుత్రి మానవియైన పథ్యయు - అను నీ మువ్వురు అధర్వణునీ (అంగీరసుని) భార్యలు. ఇవ్వీరు అంగిరసుని భార్యలు. వారియందలి సంతతిని జెప్పెదను (98). ఆ పత్నులందు అధర్వణునకు అంగిరసునకు కులోద్వహులైన దాయాదులు (పుత్రులు) పుట్టిరి. మహాతపస్సుతో భావించిన యాత్మలు గలవారికి మహాతపస్సుతో పుత్రులు పుట్టిరి (99). సురూపయందు (అంగిరసుడు) స్వరాష్ట్రాన గౌతముని బృహస్పతిని అవంధ్యుని వామదేవుని ఉతథ్యుని ఉజుని కనెను (100). పథ్యయందు ధిష్ణువను పుత్రుడు కలిగెను. మానసుడైన సంవర్తుడు ఆయస్యుడైన (నల్లనివాడైన) విచితుడును కలిగిరి. ఉతథ్యుని పుత్రుడు శరద్వంతుడు (101), అశిజుడు (ఉశిజుడు) దీర్ఘతముడు. వామదేవజుడు బృహదుతుడు. ధీష్ణువు యొక్కపుత్రుడు సుధన్వానుడు. సుధన్వనునీ పుత్రుడు ఋషభుడు (102). ఋషులని ప్రసిద్ది జెందినవారు. రథకారులైన దేవతలుగా జెప్పబడిరి. బృహస్పతికి ప్రసిద్ధుడును మహాయశస్కుడునైన భరద్వాజుడు కలిగెను (103). అంగిరసునకు సంవర్తుడు కలిగెను. ఇక అంగీరసులైన దేవతలను వీనుడు. దేవతలైన యంగీరసులు బృహస్పతి కన్న చిన్న వారనబడిరి (104). సురూపయందు ఔరసులైన యంగిరసుని పుత్రులు పుట్టిరి. వారు - ఔదార్యుడు, ఆయువు, దనువు, దక్షుడు, దర్భుడు, ప్రాణుడు, హవిష్మంతుడు, హవిష్ణుడు, క్రతువు, సత్యుడు - అను వారు పదుగురు (105). అయస్యుడు, ఉతథ్యుడు, వామదేవుడు, ఉశిజుడు, భారద్వాజులు, శాంకృతికులు, గార్యులు, కాణ్వులు, రథితరులు (106),ముద్గలులు, విష్ణువృద్ధులు, హరితులు, వాయువులు, భాక్షులు, భరద్వాజులు, ఆర్షభులు, కొంభయులు (107) - వీరు అంగీరసుని పక్షము వారుగా పదియైదుగురిని దెలియవలెను. ఋష్యంతరులలో బాప్యులైన యంగిరసులు అనేకులనబడినారు .
మారీచం పరివక్ష్యామి వంశముత్తమపూరుషమ్ ।
యస్యాన్వవాయే సంభూతం జగత్ స్థావరజంగమమ్ ॥
మరీచిరాపశ్చకమే తాభిధ్యాయన్ ప్రజేప్సయా ।
పుత్రః సర్వగుణోపేతః ప్రజావాన్ సురుచిర్దితిః ॥
సంపూజ్యతే ప్రశస్తాయాం మనసా భావితా ప్రభుః ॥
ఆహూతాశ్చ తతః సర్వా ఆపః సమవసత్ప్రభుః ।
తాసు ప్రణిహితాత్మానమేకః సోఽ జనయత్ప్రభుః ॥
పుత్రమప్రతిమన్నామ్నారిష్టనేమిః ప్రజాపతిః ।
పుత్రం మరీచం సూర్యాభం వధౌవేశో వ్యజీజనత్ ॥
ప్రధ్యాయన్ హి సతాం వాచం పుత్రార్థీ సలిలే స్థితః ।
సప్తవర్షసహస్రాణి తతః సోఽ ప్రతిమోఽ భవత్ ॥
కశ్యపః సవితుర్విద్వాంస్తేన స బ్రహ్మణః సమః ।
మన్వంతరేషు సర్వేషు బ్రాహ్మణాంశేన జాయతే ॥
కన్యానిమిత్తమిత్యుత్తే దక్షేణ కుపితాః ప్రజాః ।
అపిబత్సతథా కశ్యం కశ్యం మద్యమిహోచ్యతే ॥
హాశ్చేకసా హి విజ్ఞేయా బ్రహ్మణః కశ్య ఉచ్యతే ।
కశ్యం మద్యం స్మృతం విప్రైః కశ్యపానాత్తు కశ్యపః ॥
కరోతి నామ యద్వాచో వాచం క్రూరముదాహృతమ్ ।
దక్షాభిశప్తః కుపితః కశ్యపస్తేన సోఽ భవత్ ॥
తస్మాచ్చ కశ్య పేనోక్తో బ్రహ్మణా పరమేష్ఠినా ।
తస్మాద్దక్షః కశ్యపాయ కన్యాస్తాః ప్రత్యపద్యత ।
సర్వాశ్చ బ్రహ్మవాదిన్యః సర్వాస్తా లోకమాతరః ॥
ఇత్యేతమృషిసర్గం తు పుణ్యం యో వేద వారుణమ్ ।
ఆయుష్మాన్ పుణ్యవాన్ శుద్ధః సుఖ మాప్నోత్యనుత్తమమ్ ॥
ధారణచ్ఛ్రవణాచ్చైవ సర్వపాపైః ప్రముచ్యతే ॥
ఇక ఉత్తమ పురుషులు గల మారీచ వంశమును జెప్పెదను. ఆ వంశమున స్థావరజంగమాత్మకమయమైన జగము పుట్టినది (109). మరీచి ఆపోదేవతలను (నీటిదేవతలను) కామించెను. సంతానేచ్ఛతో వారినే (తపస్సులనే) ధ్యానించుచుండెను. ప్రజావంతుడై సర్వగుణములతో గూడిన పుత్రుడు గూడ కలిగెను. చక్కని కాంతిగల దితి మనస్సుచే భావింపబడినదై యుండెను. ప్రభువైన ప్రశస్తురాలైన యామె యందు పూజింపబడుచుండెను (110). తరువాత సమస్త జలములు (జలస్త్రీలు) పిలువబడిరి. ప్రభువు వారియందు నివసించెను (111). వారిలో ప్రభువైన మరీచి తానుంచీన యాత్మకలవానిని ఒక పుత్రని జనింపజేసేను. ఆ సాటిలేనివాడు, అరిష్టనేమియను (రెండవ) పేరు గల కశ్యప ప్రజాపతి. వధేవేశుడు సూర్యకాంతి గల మరీచుని పుత్రునిగా జనిం: (112). సత్పురుషుల వాక్యమును ధ్యానించుచు పుత్రార్థియై జలమందు ఏడువేలయేండ్లుండి యా మరీచి సాటిలేని వాడయ్యెన కశ్యపుడు సూర్యుని వలన విద్వాంసుడయ్యెను. ఆకారణమున ఆతడు బ్రహ్మతో సమానుడు. అన్ని మన్వంతరములలోను బ్రాహ్మ కన్యా నిమిత్తముగా జనించును (114). అని చెప్పగనే దక్షునిచే ప్రజలు సంతానములు) కోపింపబడిరి. అపుడు మరీచి : కశ్యమును ద్రాగెను. ఇచట కశ్యమనగా మద్యము అని చెప్పబడినది (115). బ్రహ్మ సంబంధము కశయనీ తెలియవలెను. బ్రప వచ్చినది. కశ్యయనబడును. విప్రులు కశ్యమును మద్యమందురు. కశ్యమును (మద్యమును) పానము చేయుట వలన క అయినాడు (116). దక్షునిచే శపింపబడి కోపించినవాడై క్రూరముగా బలుకబడిన వాక్కులను నిర్వర్తించుటచే నాతడు కశ్యపు (117). కావుననే పరమేష్టియు బ్రహ్మయునైన కశ్యపునిచే పలుకబడినది. కావుననే దక్షుడు తన కన్యలను కశ్యపునకిచ్చెను చేసియిచ్చెను). ఆ కన్యలందరును బ్రహ్మవాదినులు వారందరును లోకమాతలును అయిరి (118). అను నీ వారుణమై పుణ్యమై సృష్టిని దెలిసినవాడు ఆయుష్మంతుడును, పుణ్యవంతుడును, శుదుడునై యుత్తమ సుఖమును బొందును. దీనిని (కథను) బుద్ధి ధారణ జేయుట వలన, వినుటవల్లను సర్వపాపముల నుండి ముక్తుడగును.
అథాఽ బ్రువన్ పునః సర్వే మునయో రోమహర్షణమ్ ।
వినివృత్తే ప్రజాసర్గే షష్ఠే వై చాక్షుషస్య హ ॥
నిసర్గః సంప్రవృత్తోఽయం మనోర్వైవస్వతస్య హ ॥
ఆ తరువాత మునులందరు రోమహర్షునితో (సూతునితో) నిట్లనిరి. ఆఱవదైన చాక్షుషమన్వంతర ప్రజాసృష్టి జరిగిపోగా నీ సృష్టి జరిగినది .
సూత ఉవాచ :
ప్రజాః సృజేతి వ్యాదిష్టః స్వయం దక్షః స్వయంభువా ।
ససర్జ దక్షో భూతాని గతిమంతి ధ్రువాణి చ ॥
ఉపస్థితేఽతరే హ్యస్మిన్ మనోర్వైవస్వతస్య హ ॥
తతః ప్రవృత్తో దక్షస్తు ప్రజాః స్రష్టుం చతుర్విధాః ।
జరాయుజా ఆండజాశ్చ ఉద్భిజ్జాః స్వేదజాస్తథా ॥
దశవర్షసహస్రాణి తప్త్వా ఘోరం మహత్తపః ।
సంభావితో యోగబలైరణిమాద్వైర్విశేషతః ॥
ఆత్మానం వ్యభజత్ శ్రీమాన్ మనుష్యోరగ రాక్షసాన్ ।
దేవాసుర సగంధర్వాన్ దివ్యసంహననప్రజాన్ ॥
ఈశ్వరానాత్మనస్తుల్యాన్ రూపద్రవిణ తేజసా ॥
తదైవాన్యాని ముదితో గతిమంతి ధ్రువాణి చ ।
మానసాన్యేవ భూతాని సిసృక్షుర్వివిధాః ప్రజాః ॥
ఋషీన్ దేవాన్ సగంధర్వాన్ మనుష్యోరగ రాక్షసాన్ ।
యక్షభూతపిశాచాంశ్చ వయః పశుమృగాంస్తథా ॥
యదాస్య మనసా సృష్టా న వ్యవర్ధంత తాః ప్రజాః ।
అపధ్యాతా భగవతా మహాదేవేన ధీమతా ॥
మైథువేన చ భావేన సిసృక్షుర్వివిధాః ప్రజాః ।
అసిక్నీం చావహత్ పత్నీం వీరణస్య ప్రజాపతేః ॥
సుతాం సుమహతా యుక్తాం తపసా లోకధారిణీమ్ ।
యయా ధృతమిదం సర్వం జగత్ స్థావరజంగమమ్ ॥
అత్రాప్యుదాహరంతీమౌ శ్లోకౌ ప్రాచేతసం ప్రతి ।
దక్షస్యోద్వహతో భార్యామసిక్నీం వీరిణీం పరామ్ ॥
కూపానాం నియుతం దక్షః సర్పిణీం సాభిమానినామ్ ।
నదీగిరిషు సర్జ్జంస్తాః పృష్ఠతోజ్ నుయయౌ ప్రభుః ॥
తం దృష్ట్వా ఋషిభిః ప్రోక్తం ప్రతిష్టాస్యతి వై ప్రజాః ।
ప్రథమాత్ర ద్వితీయా తు దక్షస్యేప ప్రజాపతేః ॥
తథాగచ్ఛద్యథాకాలం కూపానాం నియుతే తు సః ।
అసిక్నీం వైరిణీం యత్ర దక్షః ప్రాచేతసో వహత్ ॥
అథ పుత్రసహస్రం స వైరిణ్యామమొతౌజసా ।
అసిక్న్యాం జనయామాస దక్షః ప్రాచేతసః ప్రభుః ॥
తాంస్తు దృష్ట్వా మహాతేజాః స వివర్ధయిషూన్ ప్రజాః ।
దేవర్షిః ప్రియసంవాదో నారదో బ్రహ్మణః సుతః ।
నాశాయ వచనం తేషాం శాపాయైవాత్మనోఽ బ్రవీత్ ॥
యః సవై ప్రోచ్యతే విప్రః కశ్యప స్యేతి కృత్రిమః ।
దక్షశాపభయాద్భీతో బ్రహ్మర్షిస్తేన కర్మణా ॥
యః కశ్యపసుతస్యాథ పరమేష్ఠీ వ్యజాయత ।
మానసః కశ్యప స్యేహ దక్షశాపభయాత్పునః ॥
తస్మాత్ స కశ్యపస్యాథ ద్వితీయం మానసోఽ భవత్ ।
స హి పూర్వసముత్పన్నో నారదః పరమేష్ఠినః ॥
యేన దక్షస్య పుత్రాస్తే హర్యశ్వా ఇతి విశ్రుతాః ।
నిందార్థం నాశితాః సర్వే వినష్టాంశ్చ న సంశయః ॥
తస్యోద్యతస్తదా దక్షః క్రుద్ధో నాశాయ వై ప్రభుః ।
బ్రహ్మర్షీన్ వై పురస్కుృత్య యాచితః పరమేష్ఠినా ॥
తతోఽ భినంధితం చక్రే దక్షస్తు పరమేష్ఠినా ।
కన్యాయాం నారదో మహ్యం తవ పుత్రో భవత్వితి॥
తతో దక్షః సుతాం ప్రాదాత్ ప్రియాం వై పరమేష్ఠినే ।
తస్మాత్ స నారదో జజ్ఞే భూయః శాంతో భయాదృషిః ॥
తదుపశ్రుత్య విప్రాస్తే జాతకౌతూహలాః పునః ।
అపృచ్ఛన్ వదతాం శ్రేష్ఠం సూతం తత్త్వార్థదర్శినమ్ ॥
సూతుడనెను :
స్వయంభువైన బ్రహ్మచేత “స్వయముగా ప్రజలను సృష్టింపుము” అని యాదేశింపబడినవాడై దక్షుడు జంగమములను స్థావరములును అగు ప్రాణులను సృష్టించెను. వైవస్వత మన్వంతరము రాగా ఇది జరిగినది (121). తరువాత దక్షుడు నాలుగు విధములైన ప్రజలను సృష్టింప మొదలిడెను. వారు - జరాయుజులు (మావి వల్ల బుట్టినవారు), అండజులు (గ్రుడ్లనుండి బుట్టిన వారు), ఉద్భిజ్జులు భూమిని ఛేదించకొని పుట్టిన తరులతాదులు, స్వేదజులు (చెమట వల్ల బుట్టినవారు) అను నాలుగు విధములైన వారు (122). పదివేలయేండ్లు ఘోరమైన, గొప్పనైన తపమును జేసి, యోగ ఫలములచేతను, విశేషించి యణిమాదిసిద్ధులచేతను సంభావింపబడి (123), శ్రీమంతుడైన దక్షుడు తనను విభజించి మనుష్యులను, ఉరగులను, రాక్షసులను, దేవతలను, అసురులను, గంధర్వులను దివ్యవిగ్రహములు (ఆకారములు) గల ప్రజలను, ఈశ్వరులైన వారిని రూపములోను - ద్రవ్యములోను - తేజములోను తనతో సమానులైనవారిని (124), అట్లే యితరులను స్థావరములును జంగమములును అయిన ప్రాణులను మానసికముగనే సృష్టింపదలచి యనేక విధములైన ప్రజలను (125), ఋషులను, దేవతలను, గంధర్వులను, మనుష్యులను, ఉరగులను, రాక్షసులను, యక్ష - భూత - పిశాచులను, పక్షులను, పశువులను, మృగములను సృష్టించెను (126), మనస్సుతో సృష్టించిన యా ప్రజలు చక్కగా వర్ధిల్లకుండిరి. అపుడు బుద్ధిమంతుడై మహాదేవుడైన భగవంతునిచే వేరుగా ధ్యానింప (చింతింప) బడినది (127). వివిధ ప్రజలను మైథున భావముతో పదలచేను. వీరణ ప్రజాపతియొక్క పుత్రీయైన ‘అసిక్ని’ యను నామెను వహించెను (వివాహమై భార్యనుగా జేసికొనెను) (128). ఆమే గొప్ప తపముతో గూడినది. లోకమును ధరించునది. ఆమెచే ఈ సమస్త స్థావరజంగమాత్మకమైన జగత్తు ధరింపబడినది (129). ఇట కూడ ఉత్కృష్టురాలై వీరణ ప్రజాపతి పుత్రీయైన 'అసిక్ని'ని భార్యగా పెండ్లాడుచున్న ప్రాచేతసుని (దక్షుని) గూర్చి ఈ రెండు శ్లోకములను జెప్పుదురు (130). ప్రభువైన దక్షుడు నదీగిరులలో లక్షబావులను, అభిమానవంతులకు సర్పిణిని (ప్రవహించుదానిని) సృజించుచు వాని వెనుకనే యనుసరించి వెడలెను (131). ఆతనిని జూచి ఋషులు - ఇట మొదటిది ప్రజలను ప్రతిష్టాపించగలదు - అని యనిరి. రెండవది (అసిక్ని) దక్షప్రజాపతియొక్క ప్రజలను (సంతానమును) ప్రతిష్టాపించగలదు అని యరి (132). ప్రాచేతసుడైన దక్షుడెచట వీరిణీ పుత్రియగు అసిక్నిని భార్యగా పెండ్లాడెనో అచటనాతడు కాలానుగుణముగా లక్షబావులజేరెను (133). ఆ తరువాత ప్రాచేతస ప్రభువు (దక్షుడు) తనయమీతమైన యోజస్సుచే వీరిణీ పుత్రియైన 'అసిక్ని' యందు వేవురను పుత్రులను జనింపజేసెను (134). వారిని జూచి ప్రజలను (సంతానమును) వృద్దిబోందిపదలచెను. మహాతేజస్వియు, దేవర్షియు, ప్రియముగ నై బ్రహ్మపుత్రుడైన నారదుడు వారి నాశము కొరకును ఆత్మశాపమునకును వచనమును బలికెను (135). ఎవ్వడు విప్రుడని చెప్పబడునో యాతడు కశ్యపుని వాడనుట కృత్రిమము, ఆ పనిచేత బ్రహ్మర్షి నారదుడు దక్షశాప భయమున భయము జెందెను (136). తరువాత, ఎవ్వడు కశ్యపసుతునకు పరమేష్ఠియై (బ్రహ్మలై) పుట్టెనో, ఆతడే యిట దక్షశాపభయమున మరల కశ్యపునకు మానసపుత్రుడుగా జనించెను (137). ఆకారణమున నాతడు (నారదుడు) రెండవ మానసపుత్రుడయ్యెను. ఆతడు (నారదుడు) బ్రహ్మకు మొదట (మానస బుట్టినవాడు (138). ఆతనిచేతనే యా దక్షుని పుత్రులందరు హర్యశ్వులని ప్రసిద్ధులైరి. నిందకొఱకై వారందరు నశిపజేయ కావున దష్టులైరి. సంశయము లేదు (139). దానికి ప్రభువైన దక్షుడు కోపించినవాడై వాని నాశమునకు బయలుదేరెను. బ్రహ్మరులను ముందడుకొని బ్రహ్మచే యాచింపబడెను (140). దాని వల్ల దక్షుడు బ్రహ్మతో అభిసంధితమును (ఒప్పంద జేసికొనెను. నా కన్యయందు నీ యొక్క (బ్రహ్మయొక్క) పుత్రుడు నా కొఱకు జనించు గాక - అని యా యొప్పందము (141). ఆ దక్షుడు తన ప్రియపుత్రిని పరమేష్ఠికి (బ్రహ్మకు) ఇచ్చెను. ఆ బ్రహ్మ వల్ల నారదుడు మరల జనించెను. ఆ నారదఋషియు భ నుండి శాంతించెను (భయము బా సెను) (142). అది విని యా విప్రులు మరల కుతూహలము కలిగినవారై ప్రవక్తలలో శ్రే తత్త్వార్థమును దర్శించువాడును ఐన సూతునడిగిరి .
ఋషయ ఊచుః :
కథం వినాశితాః పుత్రా నారదేన మహాత్మనా ।
ప్రజాపతిసుతాస్తే వై ప్రజాః ప్రాచేతసాత్మజాః ॥
స తథ్యం వచనం శ్రుత్వా జిజ్ఞాసా సంభవం శుభమ్ ।
ప్రోవాచ మధురం వాక్యం తేషాం సర్వగుణాన్వితమ్ ॥
దక్షపుత్రాశ్చ హర్యశ్వా వివర్ధయిషవః ప్రజాః ।
సమాగతా మహావీర్యా నారదస్తానువాచ హ ॥
దక్షప్రజాపతి పుత్రులును ప్రాచేతసాత్మజులునైన దక్షపుత్రులు మహాత్ముడైన సోరదునిచే నెట్లు నశింపజేయబడిరి - అని ఋషు (144). సూతుడు ఆ నిజమైన వాక్యమును తెలిసికొను కోరికతో బయలు వెడలి మధురమైన సర్వగుణములతో గూడిన వచన పలికెను (145). దక్షపుత్రులు హర్యశ్వులను వారు. వారు వృద్ధి బొందగోరిన (దక్షుని) సంతానము. మహావీర్యులైన వారు నే కడకు వచ్చిరి. నారదుడు వారితో నిట్లనెను .
బాలిశా బత యూయం వై న ప్రజానీథ భూతలమ్ ।
అంతమూర్ధ్వమధశ్చైవ కథం స్రక్ష్యథ వై ప్రజాః ॥
కిం ప్రమాణం తు మేదిన్యాః స్రష్టవ్యాని తథైవ చ ।
అవిజ్ఞాయేహ స్రష్టవ్యమన్యథా కింను స్రక్ష్యథ ॥
అల్పం వాపి బహుర్వాపి తత్ర దోషస్తు దృశ్యతే ॥
అయ్యో! మీరు చిన్నపిల్లవాండ్రు. భూతలమును తెలియరు. దానియంతమును, ఊర్ధ్వమును, క్రిందుభాగమును దెలి ప్రజలనెట్లు సృష్టించగలరు (147). భూమి యొక్క ప్రమాణమెంత? సృష్టింపదగినవారెంతటివారు? సృష్టింపదగిన దానిని తెలిం వేరొక విధముగా మీరేమీ సృష్టింతురు? అది కొద్దిదై నను గొప్పదైనను అచట దోసము కనబడుచున్నది .
తే తు తద్వచనం శ్రుత్వా ప్రయాతాః సర్వతోదిశమ్ ।
వాయుం తు సమనుప్రాప్య గతాస్తే వై పరాభవమ్ ॥
అద్యాఽపి న నివర్తంతే భ్రమంతో వాయుమిశ్రితాః ।
ఏవం వాయుపథం ప్రాప్య భ్రమంతే తే మహర్షయః ॥
స్వేషు పుత్రేపు నష్టేషు దక్షం ప్రాచేతసః పునః ।
వైరిణ్యామేవ పుత్రాణాం సహస్రమసృజత్ప్రభుః ॥
ప్రజా వివర్ధయిషవః శబలాశ్వాః పునస్తు తే ।
పూర్వముక్తం వచస్తత్ర శ్రావితా నారదేన హ ॥
తచ్ఛృత్వా వచనం సర్వే కుమారాస్తే మహౌజసః ।
అన్యోన్యమూచుస్తే సర్వే సమ్యగాహ మహానృషిః ।
భ్రాతౄణాం పదవీ చైవ గంతవ్యా నాత్ర సంశయః ॥
జ్ఞాత్వా ప్రాణం పృధివ్యాశ్చ సుఖం స్రక్ష్యామహే ప్రజాః ।
తేఽపి తేనైవ మార్గేణ ప్రయాతాః సర్వతోదిశమ్ ।
అద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవాపగాః ॥
తతః ప్రభృతి వై భ్రాతా భ్రాతురన్వేషణే రతః ।
ప్రయాతో నశ్యతి తథా తన్నకార్యం విజానతా ॥
నష్టేషు శబలాశ్వేషు దక్షః క్రుద్ధోఽ భవద్విభుః ।
నారదం నాశమేహీతి గర్భవాసం వసేతి చ ॥
తథా తేష్వపి నష్టేషు మహాత్మసు పురా కిల ।
షష్టి కన్యాఽ సృజద్దక్షో వైరిణ్యామేవ విశ్రుతాః ॥
తాస్తదా ప్రతిజగ్రాహ పత్న్యర్థే కశ్యపః ప్రభుః ।
ధర్మః సోమస్తు భగవాంస్తథైవాన్యే మహర్షయః ॥
ఇమాం విసృష్టిం దక్షస్య కృత్స్నాం యో వేద తత్త్వతః ।
ఆయుష్మాన్ కీర్తిమాన్ ధన్యః ప్రజావాంశ్చ భవత్యుత ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే ప్రజాపతివంశానుకీర్తనం నామ చతుర్దోఽధ్యాయః॥
ఆహర్యశ్వులు నారదుని మాటను విని వాయువుతో జేరి అన్ని దిక్కులకు (చెల్లాచెదరుగా) వెడలిపోయిరి. ఆ విధముగ వారు పరాభవమును బొందిరి (149). వాయువుతో గలిసి తిరుగుచున్న వారిప్పటికి మరల రాలేదు. ఈ విధముగా నా మహరులు వాయుమార్గమును జేరి తిరుగుచునే యున్నారు (150). ఈ విధముగా తన పుత్రులు నష్టులు (కనబడనివారు) గాగా ప్రాచేతసుడైన ప్రభువైన దక్షుడు మరల వీరిణియందు వేయి పుత్రులను సృజించెను (151). ప్రజలను వృద్ధిజేయదలచినవారు శబలాశ్వులనబడిరి. మహౌజసులైన యా కుమారులందరును నారదుడు హర్యశ్వులనన్నమాటను వినిరి - నారద మహర్షి చక్కగాననెను - అనిపరస్పరమనుకొనిరి. మనము గూడ మనయన్నల మార్గముననే బోవలసియున్నది. సంశయము లేదు అనిరి (153). భూమి యొక్క ప్రమాణమును తెలిసికొని సుఖముగా ప్రజలను సృజింతము అని యనుకొని వారు గూడ యా (వాయు) మార్గముననే అన్ని దెసలకు వెడలిపోయిరి. సముద్రమునుండి నదులవలె నిప్పటికీని వారు మరలిరారైరి (154). అప్పటినుండి అన్నలను వెదకుటలో నాసక్తుడై పోవువాడు నశించును. తెలిసి యాపనిని జేయరాదు - అనుకొనిరి (155). ఈశబలాశ్వులు నష్టులు గాగా విభువైన దక్షుడు కుపితుడయ్యెను. నారదుని నాశమును బొందుమనియు గర్భవాసమున నుండుమనియును శపించెను (156). ఆ విధముగ మహాత్ములైన శబలాశ్వులు పూర్వము నష్టులు కాగా దక్షుడు వీరణపుత్రియైన వీరిణియందు ప్రసిద్దలైన యువది కన్యలను సృజించెను. (157). అపుడు ప్రభువైన కశ్యపుడు వారిని తన భార్యలుగా స్వీకరించెను. ధర్ముడు, భగవంతుడైన సోముడు, అట్లే ఇతర మహరులును (158) కన్యలను స్వీకరించిరి. ఈ దక్షుని సమస్త సృష్టిని దెలిసినవాడు ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, ధన్యుడు, ప్రజా (సంతాన)వంతుడును అగును (159).
ఇది శ్రీ వాయుమహాపురాణమున ప్రజాపతి వంశానుకీర్తనమను నాలుగవ యధ్యాయము సమాప్తము.