4 -  సృష్టి ప్రకరణము

ఋషయస్తు తతః శ్రుత్వా నైమిషారణ్య వాసినః

ప్రత్యూచుస్తే తతః సర్వే సూతం పర్యాకులేక్షణా:

 భవాన్ వై వంశకు శలో వ్యాసాత్ ప్రత్యక్షదర్శవాన్

 తస్మా త్త్వం భవనం కృ త్స్నం లోకస్యాముష్య వర్ణయ

యస్య యస్యాన్వయా యే యే తాంస్తానిచ్చామ వేదితుమ్

తేషాం పూర్వర్షి సృష్టిం చ విచిత్రాం తాం ప్రజాపతేః

అసకృత్పరి సృష్ట స్తైర్మహాత్మా లోమహర్షణః

 విస్తరేణాను పూ ర్వ్యా చ కథయామాస సత్తమః

నైమిషారణ్య ములో నివసించే ఆ మహర్షులందరు సూతుని మాటలను విని, ఉత్కంఠతో నిండిన కన్నులు గలవారై, సూతునితో నిట్లనిరి నీవు పురాణములో సమర్థుడవు. వ్యాసుని నుండి సాక్షాత్తుగా ఆ జ్ఞానమును పొందినవాడవు. కావున నీవు ఈ లోకము యొక్క పూర్వ స్థితిని వర్ణింపుము ఏయే వంశములకు చెందిన మహాత్ములు ఎవరెవరు? అను విషయమును, పూర్వ ఋషుల సృష్టిని, ప్రజాపతి యొక్క విచిత్రమగు సృష్టిని తెలియగోరుచున్నాము. మహాత్ములు లోమహర్షణుడు అనేక పర్యాయములు వారిచే కోరబడిన వాడై పురాణమును విస్తరముగా, సరియగు క్రమములో చెప్పెను.

లోమహర్షణ ఉవాచ:-

పృష్టాం చైతాం కథాం దివ్యాం శ్లక్ష్ణాం పాపప్రణాశినీమ్

 కథ్యమానాం మయా చిత్రాం బహ్వర్థాం శ్రుతిసమ్మతామ్

 యశ్చేమాం ధారయేన్నిత్యం శృణుయాద్వాప్య భీక్ష్ణశః

 శ్రావయేచ్చాపి విప్రేభ్యో యతిభ్యశ్చ విశేషతః

శుచిః పర్వసు యుక్తాత్మా తీర్థేష్వాయతనేషు చ

దీర్ఘమాయురవాప్నోతి స పురాణాను కీర్తనాత్

స్వవంశధారణం కృత్వా స్వర్గలోకే మహీయతే

 విస్తరావయవం తేషాం యథాశబ్దం యథాశ్రుతమ్

కీర్త్యమానం నిబోధధ్వం సర్వేషాం కీర్తివర్ధనమ్

ధన్యం యశస్యం శత్రుఘ్నం స్వర్గ్యమాయుర్వివర్ధనమ్              

 లోమహర్షణుడిట్లు పలికెను:- మీరు దివ్యము, మధురము, పాపనాశనము అగు కథను కోరితిరి. నేను చిత్రము, అనేకార్థములు గలది, వేద సమ్మతమునగు పురాణమును చెప్పెదను-5. దీనిని ఎవరైతే తమ బుద్ధిలో నిత్యము ధారణ చేస్తారో; ఎవరైతే దీనిని మలర మరల వింటారో, ఎవరైతే మనోనిగ్రహముతో శుచిగా నుండి దీనిని పర్వదినములలో పుణ్యక్షేత్రముల యందు, దేవాలయముల యందు విప్రులకు, విశేషించి యతులకు వినిపించెదరో, అట్టి వారు దీర్ఘాయుర్దాయమును పొందెదరు మరియు, ఈ పురాణమును పఠించువారు ఈ లోకములో తమ వంశమును నిలిపి, స్వర్గలోకములో మహిమను గాంచెదరు. ఈ పురాణము చాల విశాలమైనది. దీనిని నేను ఉన్నది ఉన్నట్లుగా, వీన్నది విన్నట్లుగా కీర్తించేదను. శ్రద్దతో విని తెలియుడు. ఇది అందరికీ కీర్తిని పెంచి, ధన్యులను చేయును. శత్రువులను నశింపజేసి, ఆయుర్దాయమును పెంపొందించును. స్వర్గఫలము నిచ్చును.

కీర్తనం స్థిరకీర్తీనాం సర్వేషాం పుణ్యకారిణామ్

 సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ

  వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్

కల్పేభ్యోఽపి హి యః కల్పః శుచిభ్యో నియతః శుచిః

పురాణం సంప్రవక్ష్యామి మారుతం వేదసమ్మితమ్

 ప్రబోధః ప్రలయశ్చైవ స్థితిరుత్పత్తిరేవ చ

ప్రక్రియా ప్రథమః పాదః కథ్యవస్తు పరిగ్రహః

 ఉపోద్ఘాతోఽనుషంగశ్చ ఉపసంహార ఏవ చ

  ధర్మం యశస్యమాయుష్యం సర్వపాప ప్రణాశనమ్

 ఏవం హి పాదాశ్చత్వార: సమాసాత్కీర్తితా మయా               

శాశ్వతమగు కీర్తిగల పుణ్యాత్ములందరి చరితము దీనియందు వర్ణింపబడును. సృష్టి అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశములు, మన్వంతరములు, రా? వంశములు అను అయిదు విషయములు పురాణములో వర్ణింపబడును. పావ నములగు వాటిలో కెల్లా పావనమైనది. వేదమునకు అనురూపమైనది యగు వాయు పురాణమును నియమము, శుచిగలవాడనై నేను ప్రవచించెదను. సృష్టి స్థితి ప్రళయములు, పరమాత్మ నిద్ర లేచుట అను అంశములు, మొదటి దగు ప్రక్రియాపాదములో వివరింపబడును. ఇదిగాక, ఉపోద్ఘాత, అనుషంగ, ఉపసంహార పాదములు కూడా గలవు-13. ధర్మ బోధకము, కీర్తిదాయకము, ఆయుర్వర్ధనము, సర్వపాపహరమునగు ఈ పురాణములోని నాలు పాదములను నేను సంగ్రహముగా చెప్పితిని.

వక్ష్యామ్యేతాన్ పునస్తాంస్తు విస్తరేణ యథాక్రమమ్

 తస్మై హిరణ్యగర్భాయ పురుషాయేశ్వరాయ చ

 అంతాయ ప్రథమాయైవ విశిష్టాయ ప్రజాత్మనే

 బ్రహ్మణే లోకతంత్రాయ నమస్కృత్య స్వయంభువే

 మహదాద్యం విశేషాంతం స వైరూప్యం సలక్షణమ్

 పంచప్రమాణం షట్ శ్వేతం పురుషాధిష్ఠితం నుతమ్

 అసంశయాత్ ప్రవక్ష్యామి భూతసర్గ మనుత్తమమ్

 అవ్యక్తం కారణం యత్తు నిత్యం సద సదాత్మకమ్

  ప్రధానం ప్రకృతిం చైవ యమాహుస్తత్త్వ చింతకాః

 గంధవర్ణర సైర్హీనం శబ్దస్పర్శ వివర్జితమ్

 అజాతం ధ్రువమక్షయ్యం నిత్యం స్వాత్మన్యవస్థితమ్

 జగద్యోనిం మహద్భూతం పరంబ్రహ్మ సనాతనమ్          

ఈ పాదములను నేను మరల క్రమములో విస్తారముగా నుడివెదను. పూర్ణ స్వరూపుడగు ఈశ్వరుని, జగత్ర్పథముడగు హిరణ్య గర్బుని, జగత్తును సంహరించు శివుని, ప్రాణి రూపముగా ప్రకటితమయ్యే పరమాత్మను, జగత్సృష్టికి మూలము, స్వయంభువునగు బ్రహ్మగారికి నమస్కరించెదను. మహత్తు (సమష్టి బుద్ది) ఆదియందు, పరమాణు విశేషములు అంతము నందు కల్గినట్టియు, వివిధ రూపములు, లక్షణములు కలిగినట్టియు, పరమాత్మచే అధిష్ఠింపబడి యున్న సాటిలేని ప్రాణి సృష్టిని సంశయ నివారణ యగునట్లు ప్రవచించెదను. జగత్కారణము అవ్యక్తము అది నిత్యము కారణము అదియే. కార్యము అదియే. తత్వవేత్తలు దానిని ప్రధాన మనియు, ప్రకృతి అనియు వ్యవహరించెదరు. మరియు దాని యందు రుచి, వాసన, రంగు, శబ్దము, స్పర్శలు లేవు. దానికి పుట్టుక, నాశము లేవు. అది నిత్యము, స్థిరము, సనాతనము (త్రికాలా బాధితము) అగు ఈ ప్రధానము తనకు తాను ఆశ్రయముగా కలిగియుండును. ఇదియే జగత్కారణము ఈ ప్రధానము కూటస్థ (నిర్వికార) పరబ్రహ్మ యొక్క స్వరూపమ.

విగ్రహం సర్వభూతానా మవ్యక్త మభవత్ కిల

అనాద్యంతమజం సూక్ష్మం త్రిగుణం ప్రభవావ్యయమ్

  అసాంప్రత మవిజ్ఞేయం బ్రహ్మాగ్రే సమవర్తతః

 తస్యాత్మనా సర్వమిదం వ్యాప్త మాసీత్త మోమయమ్

 గుణసామ్యే తదా తస్మిన్ గుణభావే తమోమయే

సర్గకాలే ప్రధానస్య క్షేత్రజ్ఞాధిష్ఠి తస్య వై

 గుణభావా ద్వాచ్యమానో మహాన్ ప్రాదుర్బభూవ హ

 సూక్ష్మేణ మహతా సోఽథ అవ్యక్తేన సమావృత:

 సత్త్వోద్రిక్తో మహానగ్రే సత్త్వమాత్ర ప్రకాశకమ్

మనోమహాంశ్చ విజ్ఞేయో మనస్తత్కారణం స్మృతమ్              

ఆద్యంతములు లేనిది, పుట్టుక లేనిది, ఇంద్రియ గోచరము కానిది (సూక్ష్మము), త్రిగుణాత్మకమునగు అవ్యక్తమే సర్వప్రాణుల దేహములుగా పరిణమించినది అవ్యక్తము బ్రహ్మ కంటే ముందు ఉండెను. అప్పుడది ఇప్పటి వలె ఇంద్రియగోచరము కాని సూక్ష్మావస్థలో నుండెడిది. అప్పుడు ఈ జగత్తు అంతా తమోగుణరూపముగా అవ్యక్తముచే వ్యాప్తమై యుండెను. సృష్టి కాలమునందు ఆ ప్రధానము (అవ్యక్తము) క్షేత్రజ్ఞుని (పురుషుని) చే అధిష్ఠితమై, త్రిగుణముల సామ్యావస్థా రూపములో నుండెను. తమోగుణము ప్రముఖముగా నుండెడిది కాద. ప్రధానము గుణముల సామ్యావస్థ నుండి వైదొలగుటచే, మహత్తు పుట్టెను. అవ్యక్త పరిణామమగు ఆ మహత్తు సూక్ష్మ రూపములో నుండెను. మహత్తు నందు సత్య గుణము అధికముగా నుండుటచే, అది ప్రకాశరూపమై యుండెను. సమష్టి బుద్ధి యగు మహత్తు నుండి వ్యష్టి బుద్ధి జనించెను.

లింగమాత్ర సముత్పన్న: క్షేత్రజ్ఞాధిష్ఠితస్తు సః

 ధర్మాదీనాం తు రూపాణి లోకతత్త్వార్థ హేతవః

మహాంస్తు సృష్టిం కురుతే నోద్యమానః సిసృక్షయా

మనో మహాన్మతిర్భ్రహ్మా పూర్బుద్ధి: ఖ్యాతిరీశ్వర:

 ప్రజ్ఞా చితి: స్మృతిః సంవిత్ విపురం చోచ్యతే బుదైః

మనుతే సర్వభూతానాం యస్మాచ్చేష్టా ఫలం విభు:

సౌక్ష్మత్వేన వివృద్ధానాం తేన తన్మన ఉచ్యతే

 తత్త్వానామగ్రజో యస్మాన్మహాంశ్చ పరిమాణతః

శేషేభ్యోఽపి గుణేభ్యోఽసౌ మహానితి తతః స్మృత:             

 క్షేత్రజ్ఞుని (పురుషుని) చే అధిష్ఠింపబడిన ఆ సమష్టి లింగదేహము (మహత్తు) పుట్టెను. జగత్తులోని పదార్థముల సృష్టికి మూలమైన ధర్మము మొదలగు వాటి రూపములు దాని యందు నిహితమై యుండెను. సృష్టించాలనే కోరికచే ప్రేరితమైన మహత్తు సృష్టిని చేయును. మనస్సు, మహాన్, మతి, బ్రహ్మ, పురము, బుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, చితి, స్మృతి, సంవిత్, విపురసు అను పేర్లతో విద్వాంసులు దానిని వ్యవహరింతురు. సర్వవ్యాపకమగు మహత్తు సర్వప్రాణుల విస్తారమగు కర్మ ఫలమును, తెలుసుకొనగలిగే సూక్ష్మమగు బుద్దిగలది గనుక, దానికి మనస్సు అని పేరు వచ్చినది. మహత్తు తత్త్యములు (సాంఖ్య పరిగణిత పదార్థములు) అన్నింటిలో ముందుగా పుట్టెను. మరియు అది మిగిలిన తత్యములన్నింటి కంటే పరిమాణములో పెద్దది. అందువలన దానికి మహాన్ అని పేరు వచ్చెను.

బిభర్తీ మానం మనుతే విభాగం మన్యతేఽపి చ

పురుషో: భోగ సంబంధాత్ తేన చాసౌమతిః స్మృత:

బృహత్త్వాద్భృంహణత్త్వాచ్చ భావానాం సలిలాశ్రయాత్

యస్మాద్భృంహయతే భావాన్ బ్రహ్మా తేన నిరుచ్యతే

 ఆపూరయిత్వా యస్మాచ్చ కృత్స్నాన్ దేహాననుగ్రహైః

 తత్త్వ భావాంశ్చ నియతాంస్తేన పూరితి చోచ్యతే

 బుధ్యతే పురుషశ్చాత్ర సర్వభావాన్ హితాహితాన్

 యస్మాద్బోధయతే చైవ తేన బుద్ధిర్నిరుచ్యతే

 ఖ్యాతిః ప్రత్యుపభోగశ్చ యస్మాత్సంవర్తతే తతః

 భోగశ్చ జ్ఞాన నిష్ఠత్వాత్తేన ఖ్యాతిరితి స్మృతః

ఖ్యాయతే తద్గుణైర్వాపి నామాదిభి రనేకశః

 తస్మాచ్చ మహతస్సంజ్ఞా ఖ్యాతిరీత్యభి ధీయతే                

మహత్తు పురుషునికి లభించే భోగము యొక్క పరిమాణమును, వివిధ పురుషుల భోగములలోని విభాగమును నిరూపించును. కావున అది మతి అనబడును. ఈ మహత్తు గొప్ప పరిమాణము గలది. మరియు సృష్టి కాలములో దాని నుండి మహా శబ్దము వెలువడును. అంతే గాక, మహత్తు, సర్వప్రాణుల రూపములో విస్తారము చెందును. కావున, అది 'బ్రహ్మ' యనబడును మహత్తు తన అనుగ్రహములను ప్రాణుల దేహములపై ప్రసరింపజేసి, ఆ పాంచ భౌతికశరీరములను వ్యాపించి యుండును గనుక, దానికి పురము (పూరించునది) అని పేరు వచ్చినది. పురుషుడు ఈ మహత్తు నందు తనకు ఇష్టానిష్టములగు పదార్థములనన్నిటినీ దర్శించును. పురుషునకు అట్టి బోధను కలిగించును గనుక, మహత్తునకు బుద్దిఅను పేరు గలదు. పురుషుని భోగము జ్ఞానరూపమున నుండును. పురుషునికి వివేకము, భోగము కూడా మహత్తు నుండి సంప్రాప్తమగును. కావున, మహత్తునకు ‘ఖ్యాతి' అను పేరు గలదు. మరియు, మహత్తు అనేక నామములచే, గుణములచే కీర్తింపబడును. ఆ కారణము చేత కూడా, దానికి ఖ్యాతి' యను పేరు వచ్చేను.

సాక్షాత్ సర్వం విజానాతి మహాత్మా తేన చేశ్వరః

తస్మాజ్జాతా గ్రహాశ్చైవ ప్రజ్ఞా తేన స ఉచ్యతే

జ్ఞానాదీని చ రూపాణి క్రతుకర్మఫలాని చ

 చినోతి యస్మాద్భో గార్థాన్తేనాసౌ చీతిరుచ్యతే

 వర్తమానాన్యతీతాని తథా చానాగతాన్యపి

 స్మరతం సర్వకార్యాణి తేనాసౌ స్మృతిరుచ్యతే

కృత్స్నం చ విందతే జ్ఞానం తస్మాన్మాహాత్మ్య ముచ్యతే

 తస్మాద్విదేర్విదేశ్చైవ సంవిదిత్య భిధీయతే

విద్యతే స చ సర్వస్మిన్ సర్వం తస్మింశ్చ విద్యతే

 తస్మాత్సంవిదితి ప్రోక్తో మహాన్వై బుద్ధిమత్తరై

 జ్ఞానాత్తు జ్ఞానమిత్యాహ భగవాన్ జ్ఞానసన్నిధి:

ద్వంద్వానాం విపురీ భావాద్విపురం ప్రోచ్యతే బుధై:             

మహత్తు వలననే పరమాత్మ సర్వజ్ఞుడైనాడు. మహత్తు నుండి యే గ్రహములు పుట్టినవి. కావున, దానికి ప్రజ్ఞ' అని పేరు. పురుషుడు ఆచరించే యజ్ఞాది కర్మలకు ఫలములైన భోగములను, మహత్తు పురుషునకు సంక్రమింప జేయును. మరియు పురుషునకు జ్ఞానప్రకాశము నిచ్చును. కావున, మహత్తునకు 'చితి' యని పేరు వచ్చినది. పురుషుడు భూత, వర్తమాన, భవిష్యత్కార్యములనన్నిటిని స్మరించగలుటలో మహత్తు హేతు భూతమైనది. కాన, ఇది . స్మృతి యనబడును. పురుషుడు పొందే సర్వ జ్ఞానమునకు మూలము మహత్తు. కాన, దానికి మాహాత్మ్యము అని పేరు. పురుషుడు జ్ఞానము నంతనూ మహత్తునందు పొందుటచే, దానికి 'సంవిత్' అని పేరు వచ్చినది. సర్వము దాని యందున్నది. అది సర్వమునందున్నది. ఈ కారణము చేత గూడా పండితులు మహత్తును 'సంవిత్' అని పిలుతురు. మహత్తు జ్ఞానరూపము. భగవానుడు జ్ఞానమునకు సన్నిధిలో నుండును. మహత్తు స్త్రీ పురుష ద్వంద్వ రూపములో విపులమగు

జగద్రూపముగా విస్తరించుటచే, పండితులు దానిని విపుర(ల)ము అని వర్ణింతురు.

సర్వేశత్వాచ్చ లోకానామవశ్యం చ తథేశ్వరః

 బృహత్వాచ్చ స్మృతో బ్రహ్మా భూతత్వాద్భవ ఉచ్యతే

 క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానాదేకత్వాచ్చ సకః స్మృతః

యస్మాత్పుర్యనుశేతే చ తస్మాత్పురుష ఉచ్యతే

 నోత్పాదితత్వాత్ పూర్వత్వాత్ స్వయంభూరితి చోచ్యతే

 పర్యాయవాచకై శ్శబ్ధైస్తత్వ మాద్యమనుత్తమమ్

 వ్యాఖ్యాతం తత్త్వ భావజ్ఞైరేవం సద్భావ చింతకైః

 మహాన్ సృష్టిం వికురుతే చోద్యమానః సిసృక్షయా               

ఈ సర్వ జగత్తును శాసించు పరమాత్మ సర్వవ్యాపకుడు గనుక, బ్రహ్మయని నిర్దేశింప బడును. ఉనికి ఆయన స్వరూపము గనుక, ఆయన భవుడనబడును క్షేత్రము (దేహము), క్షేత్రజ్ఞుడు (పురుషుడు) అను వాటి సత్యము నెరింగినచో, బ్రహ్మ మొక్కటియే సర్వముగా భాసించుచున్నదని స్పష్టమగును. కావున, ఆ పరమాత్మకు 'కః' (ఒక్కటే) అని పేరు. దేహమనే నగరము నందు నివసించును గాన, పరమాత్మకు పురుషుడని పేరు. పరమాత్మకు పుట్టుక లేదు; పరమాత్మ సనాతనుడు; కావున, ఆయనకు స్వయంభువు అని పేరు. ఈ తీరున, సర్వోత్కృష్టము, సర్వాదియగు ఈశ్వరతత్యము, తత్యజ్ఞులగు ఋషులచే అనేక పదములతో పిలువబడును. (అట్టి ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన) మహత్తు సృష్టించ వలెననే కోరికతో ప్రేరితమై, వివిధ రకములుగా సృష్టిని చేసెను.

సంకల్పోఽధ్యవసాయశ్చ తస్య వృత్తిద్వయం స్మృతమ్

ధర్మాదీని చ రూపాణి లోకతత్త్వార్థ హేతవః

త్రిగుణస్తు స విజ్ఞేయః సత్త్వ రాజసతామసః

త్రిగుణా ద్రజసోద్రిక్త దహంకార స్తతోఽభవత్

మహతా చావృతస్సర్గో భూతాది వికృతస్తు సః

తస్మాచ్చ తమసోఽద్రిక్తా దహంకారాద జాయత

భూతతన్మాత్ర సర్గస్తు భూతాదిస్తా మసస్తు సః

 ఆకాశం శుషిరం తస్మాదుద్రిక్తం శబ్ద లక్షణమ్                 

మహత్తు నందు సంకల్పము, అధ్యవసాయము (నిశ్చయము) అను రెండు వృత్తులు గలవు. జగత్తులో పదార్థ తత్యములకు కారణమైన పదార్థ ధర్మములు, రూపములు మహత్తునందు గలవు. అది సత్యము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగి యుండును. ఆ త్రిగుణాత్మకమగు మహత్తు నందు రజోగుణము అతిశయించి, అహంకారము పుట్టెను. ఈ సృష్టి మహత్తుచే వ్యాప్తమై యున్నది. భూతములకు ఆదియగు మహత్తు యొక్క వికారమే అహంకారము. దాని యందు తమే గుణము అతిశయించి భూతతన్మాత్రలు (భూత సూక్ష్మములు) పుట్టినవి. ఈ భూతతన్మాతలు భూతాదియగు అహంకారము యొక్క తామస వికారములు. తరువాత శబ్దము గుణముగా కలిగిన, అవకాశాత్మకమగు ఆకాశము అహంకారము నుండి జన్మించెను.

ఆకాశం శబ్దమాత్రం తు భూతాదిశ్చా వృణోత్ పునః

 శబ్దమాత్రం తదాకాశం స్పర్శమాత్రం ససర్జ హ

భూతాదీస్తు వికుర్వాణ శ్శబ్దమాత్రం ససర్జ హ

బలవాన్ జాయతే వాయుః స వై స్పర్శగుణో మత:

 ఆకాశం శబ్దమాత్రం తు స్పర్శమాత్రం సమావృణోత్

 రసమాత్రాస్తు తాహ్యాపో రూపమాత్రాభి రావృణోత్

  ఆపో రసాన్ వికుర్వంత్యో గంధమాత్రం ససర్జిరే

సంఘాతో జాయతే తస్మాత్తస్య గంధో గుణః స్మృత:

 రసమాత్రం తు తత్తోయం గంధమాత్రం సమావృణోత్

తస్మింస్తస్మింస్తు తన్మాత్రా తేన తన్మాత్రతా స్మృతా                 

భూతాదియగు అహంకారము శబ్ద గుణకమగు ఆకాశమును వ్యాపించెను. అపుడు శబ్దతన్మాత్ర స్పర్శతన్మాతన సృజించెను. భూతాది ఇట్లు వికృతిని పొంది శబ్దతన్మాత ఆయెను. ఆకాశము నుండి స్పర్శ గుణము కలిగిన, క్రియాశక ప్రధానుడగు వాయువు జన్మించెను. శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత యందు వ్యాపించెను. రసము గుణముగా గల జలములు. వాటి యందు రూపతన్మాత్రలు వ్యాపించెను. రసాత్మకమగు జలములు వికారమును పొంది గంధ తన్మాత్రన సృష్టించినవి. జలముల నుండి పుట్టిన ఘన రూపమగు పృథివికి గుణము గంథమని చెప్పబడినది. జల గుణమగ రసతన్మాత్ర గంధతన్మాత యందు వ్యాపించెను. ఇట్లు ఆయాతన్మాత్రలు వికారమును పొంది, ఆయా గుణములు గల పంచభూతములు పుట్టెను. ఆయా గుణములు ఆయా భూతములకు అసాధారణములగుటచే తన్మాత్రలనబడును 

అవిశేష వాచకత్వా దవిశేషాస్తతః స్మృతాః

అశాంత ఘోరమూఢత్వా దవిశేషాస్తతః పునః

 భూతతన్మాత్ర సర్గోఽయం విజ్ఞేయస్తు పరస్పరాత్

వైకారికా దహంకారాత్ సత్త్వోద్రిక్తాత్తు సాత్త్వికాత్

 వైకారికస్స సర్గస్తు యుగపత్సం ప్రవర్తతే

 బుద్ధీంద్రియాణి పంచైవ పంచ కర్మేంద్రియాణ్యపి

సాధకానీంద్రియాణి స్యుర్దేవా వైకారికా దశ

 ఏకాదశం మనస్తత్ర దేవా వైకారికాః స్మృతాః              

ఈ తన్మాతల యందు శాంత (సుఖానుభవము), ఘోర (దుఃఖానుభవము), మూఢ (అజ్ఞానానుభవము) అన విశేష లక్షణములు లేకపోవుటచే, వాటికి అవిశేషములని పేరు వచ్చెను. ఈ విధముగా భూతములు, భూత తన్మాత్రల తామసాహంకారము నుండి ఉద్భవించినవి. సత్య గుణము అతిశయించిన సాత్వికాహంకారము నుండి , ఏకకాలమునంద అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు పుట్టినవి. పురుషునకు ఇంద్రియములు కార్యసాధకములగ చుండును. జ్ఞానేంద్రియములు, పదకొండవది యగు మనస్సు (ప్రకాశరూపములగుటచే) “దేవ' అనబడును. ఈ విధముగా వికార రూపమగు ఈ జగత్తు ఆవిర్భవించినది. ఇంద్రియములు రాజసాహంకారము నుండియు, తదధిష్టాన దేవతల సాత్యిక అహంకారము నుండియు పుట్టినవి అని కూడా చెప్పవచ్చును.

శ్రోత్రం త్వక్ చక్షుషీ జిహ్వా నాసికా చైవ పంచమీ

 శబ్దాదీనా మవాప్త్యర్థం బుద్ధియుక్తాని వక్ష్యతే

 పాదౌ పాయురుపస్థశ్చ హస్తౌ వాగ్ధశమీ భవేత్

గతిర్వి సర్గోహానందః శిల్పం వాక్యం చ కర్మ చ

 ఆకాశం శబ్దమాత్రం చ స్పర్శ మాత్రం సమావిశేత్

ద్విగుణస్తు తతో వాయుః శబ్ద స్పర్శాత్మకోఽభవత్

 రూపం తథైవ విశతః శబ్దస్పర్శ గుణావు భౌ

త్రిగుణస్తు తతశ్చాగ్నిః సశబ్ద స్పర్శరూపవాన్  

చెవులు, చర్మము, కన్నులు, నాలుక మరియు ముక్కు అను అయిదు జ్ఞానేంద్రియములు మనస్సుతో గూడి శబ్దాది విషయములను గ్రహించును. పాదములు, పాయువు, ఉపస్థ, హస్తములు మరియు వాక్కు అనునవి అయిదు కర్మేంద్రియములు కలిసి వెరసి పది అయినవి. అవి క్రమముగా గమనము, విసర్జనము, ఆనందము, చేతి పని మరియు మాటలాడుట అను క్రియలను నిర్వర్తించును ఆకాశములోని శబ్దతన్మాత స్పర్శమాత్రలో ప్రవేశించుటచే, వాయువునకు శబ్దము, స్పర్శ అను రెండు గుణములు కలిగెను. అటులనే, శబ్దస్పర్శలు రెండు రూపమును ప్రవేశించుటచే, అగ్నికి శబ్ద, స్పర్శ, రూపములనే మూడు గుణములు కలిగెను.

సశబ్దస్పర్శరూపం చ రసమాత్రం సమావిశత్

 తస్మాచ్చతుర్గుణా హ్యాపో విజ్ఞేయాస్తా రసాత్మికాః

సశబ్ద స్పర్శరూపేషు గంధస్తేషు సమావిశత్

సంయుక్తా గంధమాత్రేణ ఆచిన్వంతి మహీమీమామ్

 తస్మాత్పంచగుణా భూమిః స్థూలభూతేషు దృశ్యతే

శాంతా హోరాశ్చ మూఢాశ్చ విశేషాస్తేన తే స్మృతాః

 పరస్పరాను ప్రవేశాద్ధారయంతి పరస్పరమ్

భూమేరంతస్త్విదం సర్వం లోకా లోకఘనావృతమ్     

శబ్ద స్పర్శ రూపములు రసతన్మాతను ఆవేశించుటచే, రసాత్మకములగు జలముల యందు నాలు గుణములు గలవు . ఈ నాలు గుణములు గంధమాత్ర యందు సమావేశమై పృథివి యందున్నవి. అందువలన స్థూలభూతములలో పృథివి యందు ఐదు గుణములు గలవు. ఈ పంచ భూతములలో శాంత, ఘోర, మూఢములను గుణములు ఉండుటచే వాటికి విశేషములు అని పేరు. ఈ భూతములు ఒక దానితో మరియొకటి కలిసి, ఒకదానికి మరియొకటి ధారకములగుచున్నవి. లోకాలోక పర్వతముతో సహా ఈ సర్వము భూమియందంతర్భాగములై యున్నవి.

విశేషా ఇంద్రీయ గ్రాహ్యా నియతత్వాచ్చ తే స్మృతాః

గుణం పూర్వస్య పూర్వస్య ప్రాప్నువంత్యుత్త రోత్తరమ్

 తేషాం యావచ్చ యద్యచ్చ తత్తత్తావద్గుణం స్మృతమ్

ఉపలభ్య శుచేర్గంధం కేచిద్వాయో రనైపుణాత్

 పృథివ్యామేవ తద్విద్యాదేషాం వాయోశ్చ సంశ్రయాత్

 ఏతే సప్త మహావీర్యా నానాభూతాః పృథక్ పృథక్

 నాశక్నువన్ ప్రజాః స్రష్టుమసమాగమ్య కృథ్స్నశః  

తే సమేత్య మహాత్మానో హ్యన్యోన్యస్యైవ సంశ్రయాత్

 పురుషాధిష్ఠి తత్వాచ్చ అవ్యక్తాను గ్రహేణ చ

 మహదాద్యా విశేషాంతా అండముత్పాదయంతి తే       

పంచభూతములలో ప్రతి భూతమునకు ప్రత్యేకముగా తనదైన విశేషము (అసాధారణ గుణము) ఉండును. ఆయా విశేషములు ఇంద్రియములకు గోచరమగును. ఆకాశము నుండి పృధివి వరకు క్రమముగా ముందు వాటి గుణములు తరువాతి వాటికి సంక్రమించును. కాని, ఒక విశిష్ట భూతము తన అసాధారణ గుణము చేతనే గుర్తింపబడును." కొందరు శుచియగు వాయువును పొంది, అవివేకముచే గంధము వాయుగుణమని పొరబడుదురు. వాస్తవంలో, పృథివీ గుణమగు గంధము వాయువునకు పృథివీ సంపర్కము వలన కలిగినది. ఈ ఏడింటిలో ప్రతి ఒక్క తత్యము గొప్పదీయే 69. కాని, అవి విడివిడిగా ఇతర తత్త్యములతో కలియకుండగా ప్రజలను, ఇతర ప్రాణులను సృష్టింపలేకపోయినవి. ఈ గొప్ప తత్యములు ఒక దానితో మరియొకటి దగ్గరగా వచ్చినవి. మరియు, పురుషునిచే అధిష్ఠింపబడినవై, మహత్తు మొదలుకొని విశేషముల (పంచ భూతముల అసాధారణ గుణములు) వరకు గల ఈ తత్త్యములు అవ్యక్తము (ప్రకృతి) యొక్క అనుగ్రహముచే అండమును సృష్టించును.

ఏక కాలం సముత్పన్నం జలబుద్బుదవచ్చ తత్

విశేషేభ్యోంఽడమభవత్ బృహత్తదుదకం చ యత్

 తత్తస్మిన్ కార్యకరణం సంసిద్ధం బ్రహ్మణస్తదా

ప్రాకృతేంఽడే విబుద్దే సన్ క్షేత్రజ్జో బ్రహ్మ సంజ్ఞితః

స వై శరీరీ ప్రథమః స వై పురుష ఉచ్యతే

ఆదికర్తా చ భూతానాం బ్రహ్మాఽగ్రే సమవర్తత

హిరణ్యగర్భః సోఽగ్రేస్మిన్ ప్రాదుర్భూత శ్చతుర్ముఖః

 సర్గే చ ప్రతిసర్గే చ క్షేత్రజ్జో బ్రహ్మసంజ్ఞితః

కరణైః సహ సృజ్యంతే ప్రత్యాహారే త్యజంతి చ

 భజన్తేచ పునర్దేహాన సమాహారసంధిషు         

నీటినుండి బుడగ పుట్టిన తీరున విశేషముల నుండి పెద్ద అండము ఒకటి క్షణ కాలములో పుట్టి మహాజలరా యందు ఉండెను. ఈ విధముగా సృష్ట్యాదిలో ప్రకృతి నుండి అండము ఉద్భవించగా, పరబ్రహ్మయని పేరుగాంచి క్షేత్రజ్ఞునకు జగత్కర్తృత్వము సిద్ధించెను. క్షేత్రజ్జునకు పురుషుడనియు పేరు గలదు. సృష్ట్యాదిలో సర్వ జీవులను సృష్టించి ప్రథమ జీవుడగు బ్రహ్మగారు మున్ముందుగా జన్మించెను పర బ్రహ్మమని పిలువబడే క్షేత్రజ్ఞుడు ముందుగా నాల ముఖములు గల హిరణ్య గర్భుని రూపములో ప్రకటమయ్యెను. ప్రాణులు సృష్ట్యాది యందు ఇంద్రియములతో కూ సృజింపబడుదురు. వారు (ఆత్యంతిక, మరియు ప్రాకృతిక) ప్రళయములో దేహములను విడిచి పెట్టుదురు. నూత సృష్టియందు, తన్మధ్యకాలము నందు కూడ వారు మరల దేహములను పొందెదరు.

హిరణ్మయస్తు యో మేరుస్తస్యోల్బం తన్మహాత్మనః

 గర్భోదకం సముద్రాశ్చ జరాధ్యస్థీని పర్వతాః

తస్మిన్నండే త్వమేలోకా అంతర్భూతాస్తు సప్త వై

సప్తద్వీపా చ పృథ్వీయం సముద్రైః సహసప్తభిః

  పర్వతైః సుమహద్భిశ్చ నదీభిశ్చ సహస్రశః

 అంతస్తస్మింస్త్విమే లోకా అంతర్విశ్వమిదం జగత్

 చంద్రాదిత్యౌ సనక్షత్రౌ సగ్రహో సహ వాయునా

 లోకాలోకం చ యత్ కించిచ్చాండే తస్మిన్ సమర్పితమ్          

గొప్ప ప్రమాణముగల ఆ అండమునకు బంగరు మేరు పర్వతము పిండముగా నుండెను. సముద్రములే గర్బములో నీరు ఆయెను. పర్వతములు ఎముకలాయెను. ఈ ఏడు లోకములు ఆ అండమునందు అంతర్భాగములై ఉండెను ఏడు ద్వీపములతో, ఏడు సముద్రములతో మహోన్నతమగు పర్వతములతో, మరియు వేలాది నదులతో కూడిన ఈ భూమి, ఈ లోకములు, ఈ బ్రహ్మాండము సర్వము ఆ అండములోపల నుండెను. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు గ్రహములు, వాయువు, లోకాలోక పర్వతము, ఇతరము సర్వము ఆ అండములోపల ఇమిడి యుండెను .

అద్భిర్ధశ గుణాభిస్తు బాహ్యతోంఽడం సమావృతమ్

 ఆపో దశగుణా హ్యేవం తేజసా బాహ్యతో వృతాః

తేజో దశగుణేనైవ బాహ్యతో వాయునావృతమ్

వాయోర్దశ గుణేనైవ బాహ్యతో నభసా వృతమ్

 ఆకాశేన వృతోవాయుః ఖం చ భూతాదినా వృతమ్

 భూతాదిర్మహతా చాపి అవ్యక్తేన వృతో మహాన్

 ఏతై రావరణై రండం సప్తభిః ప్రాకృతైర్వృతమ్

 ఏతాశ్చావృత్య చాన్యోన్యమష్టౌ ప్రకృతయః స్థితాః        

ఆ అండము చుట్టూ (దానికంటే) పదిరెట్లు నీరు, నీటి చుట్టు పదిరెట్లు అగ్ని ఆవరించి యుండెను. తేజస్సు చుట్టూ పది రెట్లు వాయువు, వాయువు చుట్టూ పదిరెట్లు ఆకాశము ఆవరించి యుండెను. ఆకాశము అహంకారము చేత, అహంకారము మహత్తు చేత, మహత్తు అవ్యక్తము చేత ఆవరింపబడి యుండెను. ఇట్లు ఆ అండము ఏడు ప్రకృతి వికారములచే ఆవరించబడి యుండెను. ఇట్లు ఆ ఎనిమిది (అండముతో సహా) ప్రకృతి వికారములు ఒక దానిని మరియొకటి ఆవరించి యుండెను.

ప్రసర్గకాలే స్థిత్వా చ గ్రసంత్యేతాః పరస్పరమ్

 ఏవం పరస్పరోత్పన్నా ధారయంతి పరస్పరమ్

 ఆధారాధేయ భావేన వికారస్య వికారిషు

అవ్యక్తం క్షేత్రముద్దిష్టం బ్రహ్మ క్షేత్రజ్ఞ ఉచ్యతే

 ఇత్యేష ప్రాకృతః సర్గః క్షేత్రజ్ఞాధిష్ఠితస్తు సః

 అబుద్ధి పూర్వం ప్రాగాసీత్ ప్రాదుర్భూతా తడిద్యథా

ఏతద్ధిరణ్య గర్భస్యజన్మ యో వేద తత్త్వతః

 ఆయుష్మాన్ కీర్తిమాన్ ధన్యః ప్రజావాంశ్చ భవత్యుత

నివృత్తికామోఽపి నరః శుద్ధాత్మా లభతే గతిమ్

 పురాణశ్రవణాన్నిత్యం సుఖం చ క్షేమవాప్నుయాత్     

ఇతి మహాపురాణే వాయుప్రోక్తే సృష్టి ప్రకరణం నామ చతుర్థోఽధ్యాయః         

ఇవి స్థితి కాలము నందు ఈ తీరున ఉండి, ప్రళయములో ఒక దానిని మరియొకటిగా కబళించి వేయును. ఇట్లు ఇవి ఒక దాని నుండి మరియొకటి పుట్టి, ఒక దానిని మరియొకటి ధరించియున్నవి. ప్రకృతి వికారములగు ఈ తత్త్య ములు ఈ విధముగా ఒక దానిపై మరియొకటి క్రమముగా ఆధారపడియున్నవి. అవ్యక్తము (ప్రకృతి) నకు క్షేత్రము అనియు, బ్రహ్మకు క్షేత్రజ్ఞుడనియు పేరు. ఈ విధముగా క్షేత్రజ్ఞునిచే అధిష్ఠింపబడిన జగత్సృష్టి పూర్వము సంకల్పము యొక్క సంబంధము లేకుండగనే మెరుపువలె సంభవించేను. ఈ హిరణ్యగర్భుని జన్మయొక్క తత్యము నెరింగిన మానవుడు ఆయుర్దాయమును, కీర్తిని, సంతానమును పొంది, ధన్యుడగును. మోక్షకాముడగు మానవుడు కూడా ఈ పురాణమును నిత్యము వినుట వలన, అంతః కరణ శుద్ధిగలవాడై, సుఖమును, క్షేమమును, పరమగతిని కూడా పొందును.

శ్రీవాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అను నాల్గవ అధ్యాయము ముగిసెను.