26 - స్వరోత్పత్తిర్నామ

సూత ఉవాచ:-

అహో విస్మయనీయని రహస్యాని మహామతే

 త్వయోక్తాని యథా తత్యం లోకానుగ్రహ కారణాత్

 తత్ర వై సంశయో మహ్యమవతారేషు శూలినః

కిం కారణం మహాదేవః కలిం ప్రాప్య సుదారుణమ్

హిత్వా యుగానీ పూర్వాణి అవతారం కరోతి వై

 అస్మిన్మన్వన్తరే చైవ ప్రాప్తే వైవస్వతే ప్రభో

 అవతారం కథం చక్రే ఏతదిచ్చామి వేదితుమ్

 న తేఽ విదితం కించి దిహ లోకే పరత్ర చ

 భక్తానాముపదేశార్థం వినయాత్పృచ్చతో మమ

 కథయస్వ మహాప్రాజ్ఞ యది శ్రావ్యమహామతమ్

సూతుడనెను:- ఓ మహామతియైన వాయుదేవా! నీవు చెప్పిన రహస్యములు లోకానుగ్రహకారణమున తత్యముననుసరించి యాశ్చర్యకరములు-1. శూలధారియైన శివుని యొక్క అవతారముల విషయమున నాకు సంశయము గలదు. మహాదేవుడైన శివుడు మిక్కిలి భయంకరమైన కలియుగమును బొంది పూర్వములైన యుగములను వదలి. యవతారమును బొంది పూర్వములైన యుగములను వదలి యవతారమును జేయుటలో (పరిగ్రహించుటలో) కారణమేమి? 2. ఓ ప్రభో ఈ వైవస్వత మన్వంతరము రాగా ఆ శివుడేవిధముగా అవతరించెనో తెలిసికొన గోరుచున్నాను-3. నీ కీలోకమున గాని పరలోకమునగాని తెలియని దేమియులేదు. భక్తులకుపదేశించుటకై యడుగుచున్నాను. ఓ ప్రాజ్ఞా! ఆ మహామతము (గొప్ప వారి కిష్టమైనది) మేము వినదగినచో చెప్పుము.

లోమశ ఉవాచ:

ఏవం పృష్టోఽథ భగవాన్ వాయుర్లోకహితేరతః

 ఇదమాహ మహాతేజా వాయుర్లోకనస్కృతః

ఏతద్గుహ్యతమంలోకే యన్మాంతంపరిపృచ్ఛసి

 తత్సర్వం శృణు గాధేయ ఉచ్యమానం యథాక్రమమ్

 పురా హ్యేకార్ణవే వృత్తే దివ్యే వర్షసహస్రకే

 స్రష్టుకామః ప్రజా బ్రహ్మా చిన్తయామాస దుఃఖితః

 తస్య చిన్తయమానస్యప్రాదుర్భూతః కుమారకః

 దివ్యగన్ధః సుధాపేక్షీ దివ్యాం శ్రుతిముదీరయన్

 అశబ్దస్పర్శ రూపాన్తా మగన్ధాం రసవర్జితామ్

శ్రుతిం హ్యుదీరయన్ దేవో యామవిన్దచ్చతుర్ముఖః

 లోమశుడనెను:- ఈ విధముగ నడుగ బడిన భగవంతుడు. లోకహితము జేయుటలో నాసక్తుడు, లోకములచే నమస్కరింపబడిన వాడు మహాతేజోవంతుడు నైన వాయువు ఇది పలికెను-5. ఓ గాధేయుడా! నీవునన్నడుగుచున్నది మిక్కిలి రహస్యమైనది. దాని నంతయు వరుసగా జెప్పెదను. వినుము-6. పూర్వమంతయు ఒకే సముద్రమైనది. దేవమానముతో వేయవర్షములు గడచినవి. అపుడు బ్రహ్మ ప్రజలను సృష్టింపగోరి దు:ఖితుడై చింతించెను-7. అట్లు చింతించునాతనికి ఒక కుమారుడు గలిగెను. ఆతడు దివ్యగంధము గలవాడై సుధను గోరినవాడై దివ్యమైన (శృతివేదము) ని ఉచ్చరించుచుండెను.8. శబ్దము, స్పర్శ, రూపము, గన్టము, రసము లేని యాశ్రుతి నుచ్చరించుచుండెను. దానిని దేవుడైన చతుర్ముఖుడు (బ్రహ్మ) తెలిసికొనెను-9.

తతస్తు ధ్యానసంయుక్త స్తప ఆస్థాయ భైరవమ్

 చిన్తయామాస మనసా త్రితయం కోఽ నయన్త్వితి.

 తస్య చిన్తయమానస్య ప్రాదుర్భూతం తదక్షరమ్

 అశబ్దస్పర్శరూపం చ రసగన్ధ వివర్జితమ్

అథోత్తమం సలోకేషు స్వమూర్తిం చాపి పశ్యతి

ధ్యాయన్యైస తదా దేవమథైనం పశ్యతే పునః

తం శ్వేతమథ రక్తం చ పీతం కృష్ణం తదా పునః

వర్ణస్థం తత్ర పశ్యేత న స్త్రీ న చ నపుంసకమ్

తరువాత బ్రహ్మధ్యానయుక్తుడై భైరవుడైన శివుని మనస్సులో నిలిపి యీ మూడవవాడెవ్వడా యని చింతించెను-10. ఆ విధముగ చింతించునోతనికి శబ్ద-స్పర్శ-రూప-రస. గన్టములు లేని యొక యక్షరము ప్రాదుర్భవించెను-11. ఆ తరువాత నా బ్రహ్మలోకములలో నుత్తమమైన తన మూర్తిని గూడ జూచును. అపుడు ధ్యానము జేయుచు తరువాత నీతనిని గూడ మరల జూచును. ఆ యీతడు వర్ణమునందు (అక్షరమునందు) ఉన్నవాడు. తెల్లనివాడు, ఎఱ్ఱనివాడు, పచ్చనివాడు, నల్లనివాడు,స్త్రీ కాదు. పురుషుడును కాడు. ఈ విధమైన యీతని జూచును.

తత్సర్వం సుచిరం జ్ఞాత్వా చిన్తయన్ హి తదక్షరమ్

తస్య చిన్తయమానస్య కంఠాదుత్తి తేఽక్షరః

ఏకమాత్రో మహాఘోషః శ్వేతవర్ణః సునిర్మలః

స ఓంకారో భవేద్వేదః అక్షరం వై మహేశ్వరః

అదియంతయు చాలకాలము దెలిసికొని ఆ యక్షరమును చింతించు (ధ్యానించు చుండెను. ఆ విధముగా ధ్యానించుచున్న (బహ్మయొక్క కంఠమునుండి యా యక్షరము పైకి వెలువడెను-14. కేవలమొక్కమాత్ర గలది. గొప్ప ధ్వని గలది. తెల్లని వర్ణము గలది. చక్కగా నిర్మలమైనది. యైన యా ఓంకారం వేదమై యుండవలెను. నాశము లేని (అక్షరమైన మహేశ్వరుడే యైయుండును.

తత శ్చిన్తయమానస్య త్వక్షరం వై స్వయంభువః

ప్రాదుర్భూతంతు రక్తన్తు స దేవః ప్రథమః స్మృతః

ఋగ్వేదం ప్రథమం తస్య త్వగ్ని మీళే పురోహితమ్

ఏతాం దృష్ట్యా ఋచం బ్రహ్మా చిన్తయామాస వై పునః

తదక్షరం మహాతేజాః కిమేతదితి లోకకృత్

తరువాత యక్షరమును ధ్యానించుచున్న బ్రహ్మనుండి బుట్టిన రక్తము (యెట్టనివాడు) మొదటి దేవుడనబడెను. ఆతని మొదటి ఋగ్వేదము అగ్నిమీళే పురోహితమ్ (అను మంత్రము మొదటగలది) మహాతేజస్వియైన లోకకారకుడైన బ్రహ్మయీ ఋక్కును జూచి యాయక్షరమేమిటని ధ్యానించెను.

తస్య చిన్తయమానస్య తస్మిన్నథ మహేశ్వరః

ద్విమాత్రమక్షరం జజ్ఞే ఈశిత్వేన ద్విమాత్రకమ్

తతః పునర్ద్విమాత్రం తు చిన్తయామాస చాక్షరమ్

ప్రాదుర్భూతం చ రక్తం తచ్ఛేదనే గృహ్య సా యజుః

ఇషేత్వోర్జే త్వావాయవస్థ దేవో వః సవితా పునః

ఋగ్వేద ఏకమాత్రస్తు ద్విమాత్రన్తుయజుః స్మృతమ్

తతో వేదం ద్విమాత్రం తు దృష్ట్యా చైవ తదక్షరమ్

ద్విమాత్రం చిన్తయన్ బ్రహ్మా త్వక్షరం పునరీశ్వరః

తస్య చిన్తయమానస్య చోంకారః సంబభూవహ

తతస్తదక్షరం బ్రహ్మా ఓంకారం సమచిన్తయత్

అథాపశ్యత్తతః పీతామృచం చైవసముత్థితామ్

అగ్నఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే

అట్లు ధ్యానము చేయుచున్న బ్రహ్మయొక్క యా యక్షరమునందు మహేశ్వరుడు రెండు మాత్రలు గల యక్షరముగా బుట్టెను. అది యీశ్వరుడు గలిగియుండుటచే మూడు మాత్రలు గలదైనది-18. తరువాత బ్రహ్మ మరల ద్విమాత్రమైన యక్షరమునే ధ్యానించెను. దాని (అక్షరముయొక్క) ఛేదనమునగలిగిన రక్తమును స్వీకరించి ఆయజుస్సు-19. “ఇషేత్వోర్జేత్వావాయవస్థ దేవో వః సవితా పునః” అనుమస్త్రము మొదట గలది జనించినది. తరువాత యజుర్వేదమును ద్విమాత్రకమైన యక్షరమును జూచి, యీశ్వరుడైన బ్రహ్మ ద్విమాత్రకమైన యక్షరమును జాచి, యీశ్వరుడైన బ్రహ్మ ద్విమాత్రమైన యా యక్షరమును మరల ధ్యానించుచుండెను-20,21. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మకు ఓంకారము కలిగెను. తరువాత బ్రహ్మ ఆయక్షరమైన ఓంకారమును ధ్యానించెను-22. తరువాత బ్రహ్మ దానినుండి పైకి బయలుదేరిన పచ్చని ఋక్కును జూచెను. అది "అగ్న ఆయా హెవీతయే గృణానో హవ్యదాతయే" - అనునది.

తతస్తు సమహాతేజా దృష్ట్యా వేదానుపస్థితాన్

చిన్తయిత్వా చ భగవాంస్త్రిసంధ్యం యత్త్రిరక్షరమ్

త్రివర్ణం యత్త్రిషవణమోంకారం బ్రహ్మసంజ్ఞితమ్

తతశ్చైవ త్రిసంయోగాత్ త్రివర్ణం తు తదక్షరమ్

లక్ష్యాలక్ష్య ప్రదృశ్యంచ సహితం త్రిదివం త్రికమ్

త్రిమాత్రం త్రిపదం చైవ త్రియోగం చైవ శాశ్వతమ్

తస్మాత్తదక్షరం బ్రహ్మా చిన్తయామాస వై ప్రభుః

తస్మాత్తదక్షరం సోఽథ బ్రహ్మరూపం స్వయం భువః

చతుర్దశ ముఖం దేవం పశ్యతే దీప్తతేజసమ్

తమోంకారం సకృత్వాదౌ విజ్ఞేయః స స్వయంభువః

తరువాత మహాతేజస్వియైన బ్రహ్మ ఆయక్షరమైన ఓంకారమును ప్రాత:సంధ్యలోను మధ్యాహ్న సంధ్యలోను సాయం సంధ్యలోను మూడు మారులు ధ్యానించి(తామంతటతాము) తనకు స్పురించిన వేదమును జూచెను. మూడు (అ..మ్) వర్ణములు గలది, ప్రాతః కాలమున, మధ్యాహ్నకాలమున, సాయంకాలమునను జేయు యజ్ఞ స్వరూపమైనదియు నైన ఓంకారము బ్రహ్మయని గుర్తింపబడినది-24. మూడింటి సంయోగమువలన త్రివర్ణమైనది యాయక్షరము లక్ష్యమై కనబడినదై, అలక్ష్యమై (కనబడనిదై) ప్రదృశ్యమై (చక్కగా నేక్కువగా గనబడినదై) బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కలిసి విహరించునదై (త్రిదివమై) మూడైనది-25. మూడు మాత్రలు గలది. మూడు పదములు గలది. మూడు యోగములు గలదియై మాయక్షరము(20) శాశ్వతమైనది. కావుననే భువైన బ్రహ్మ యాయక్షరమును ధ్యానించేను-26. కావుననే యాయక్షరము, బ్రహ్మ బ్రహ్మయొక్క బ్రహ్మరూపము పదునాలుగు ముఖములు గల దేవునిగా జూచును. కావుననే బ్రహ్మయొక్క ముందు ఓంకారమును జేర్చి బ్రహ్మ తెలియబడును.

చతుర్ముఖముఖాత్తస్మాదజాన్త చతుర్దశ

నానావర్ణః స్వరా దివ్యమాద్యం తచ్చ తదక్షరమ్

తస్మాత్త్రిషష్టి వర్ణా వై అకారప్రభవాః స్మృతాః

ఆ బ్రహ్మ ముఖమునుండి పదునాలుగైన వివిధ స్వర వర్ణములు (అఆఇఈఊఊఋ ఋలులూ, ఏఐ,ఓఔ) అను అచ్చులు) ద్వివ్యమై మొదటిదైన ఆ ఓంకారాక్షరమును బుట్టినవి. ఆ ముఖమునుండియే అకారమునుండి బుట్టినవి. అరువది మూడు (63) వర్ణములుగా జెప్పబడినవి.

తతః సాధారణార్థాయ వర్ణానాన్తు స్వయంభువః

అకారరూప ఆదౌతు స్థితః స ప్రథమః స్వరః

తతస్తేభ్యః స్వరేభ్యస్తు చతుర్దశ మహాముఖాః

మనవః సంప్రసూయన్తే దివ్యాన్తమన్వన్తరే స్వరాః

చతుర్దశముఖోయశ్చ అకారో బ్రహ్మసంజ్ఞితః

బ్రహ్మకల్పః సమాఖ్యాతః సర్వవర్ణః ప్రజాపతిః

ముఖాత్తు ప్రథమాత్తస్య మనుః స్వాయంభువః స్మృతః

అకారస్తు స విజ్ఞేయః శ్వేతవర్ణః స్వయంభువః

ద్వితీయాత్తు ముఖాత్తస్య ఆకారో వై ముఖః స్మృతః

నామ్నా స్వారోచిషోనామ వర్ణః పాండురుచ్యతే

తృతీయాత్తు ముఖాత్తస్య ఇకారో యజుషాం వరః

యజుర్మయః సచాదిత్యో యజుర్వేదో యతః స్మతః

ఈకారః సమనుర్జే యో రక్తవర్ణః ప్రతాపవాన్

తతః క్షత్రం ప్రవర్తన్త తస్మాద్రక్తస్తు  క్షత్రియః

చతుర్థాత్తు ముఖాత్తస్య ఉకారః స్వర ఉచ్యతే

వర్ణతస్తు స్మృతస్తామ్రః సమనుస్తామసః స్మృతాః

పంచమాత్తు ముఖాత్తస్య ఊకారో నామ జాయతే

పీతకో వర్ణతశ్చైవ మనుశ్చాపి చ రష్ణవః

తతః షష్ఠాన్ముఖాత్తస్య ఓంకారః కపిలః స్మృతః

వరిష్ఠశ్చ తతః షష్ఠో విజయః స మహాతపాః

సప్తమాత్తు ముఖాత్తస్యతతో వైవస్వతో మనుః

ఋకారశ్చ స్వరస్తత్ర వర్ణతః కష్ణఉచ్యతే

అష్టమాత్తు ముఖాత్తస్యఋకారః శ్యామవర్ణతః

శ్యామాక్షరసవర్ణశ్చ తతః సావర్ణిరుచ్యతే

ముఖాత్తు నవమాత్తస్య ఇకారో నవమః స్మృతః

ధూమ్రోవైవర్ణతశ్చాపి ధూమ్రశ్చ మనురుచ్యతే

దశమాత్తు ముఖాత్తస్య కారః ప్రభురుచ్యతే

దశమాత్తు ముఖాత్తస్య ఇకారః ప్రభురుచ్యతే

సమశ్చైవ సవర్ణశ్చ బభౌ సావర్ణికో మనుః

ముఖాధేకాదశాత్తస్య ఏకారో మనురుచ్యతే

పిశజ్గో వర్ణతశ్చైవ పిశజ్గో వర్ణ ఉచ్యతే

ద్వాదశాత్తు ముఖాత్తస్య ఐకారో నామ ఉచ్యతే

పిశజ్గోభస్మవర్ణాభః పిశజ్గో  మనురుచ్యతే

త్రయోదశాన్ముఖాత్తస్య ఓకారో వర్ణ ఉచ్యతే

పంచవర్ణసమాయుక్త ఓకారో వర్ణఉత్తమః

చతుర్దశముఖాత్తస్య జౌకారో వర్ణ ఉచ్యతే

కర్బూరో వర్ణతశ్చైవ మనుః సావర్ణిరుచ్యతే

ఇత్యేతే మనవశ్చైవ స్వరా వర్ణాశ్చకల్పతః

విజ్ఞేయా హియథా తత్త్వం స్వరతో వర్ణతః స్తథా

పరస్పరసవర్ణాశ్చ స్వరా యస్మాద్వృతా హి వై

తస్మాత్తేషాం సవర్ణత్వాదన్వయస్తు ప్రకీర్తితః

సవర్ణాః సదశాశ్చైవ యాస్మాజ్ఞాతాస్తు కల్పజాః

తస్మాత్ప్రజానాం లోకేఽస్మిన్ సవర్ణాః సర్వసన్ ధయః

భవిష్యన్తి యథాశైలం వర్ణాశ్చ న్యాయతోఽర్ధతః

అభ్యాసాత్సన్దయశ్చైవ తసాద్ జ్ఞేయాః స్వరా ఇతి

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే స్వరోత్పత్తి ర్నామ షడ్వింశోఽధ్యాయః

తరువాత వర్ణముల యొక్క సాధారణార్థముకొఱకు బ్రహ్మనుండి మొట్టమొదట అకార రూపము నిలిచెను. అది మొదటి స్వరము (అచ్చు)-29. తరువాత మన్వన్తరమున ఆ స్వరములనుండి పదునాలుగు మహాముఖములుగల మనువులు దివ్యములైన స్వరములును బుట్టినవి-30. పదునాలుగు ముఖములుగల అ కారం బ్రహ్మ యను పేర బిలువ బడినది. అన్ని వర్ణములు గల ప్రజాపతి (బ్రహ్మ) బ్రహ్మకల్పముగా జెప్పబడెను-31. ఆతని మొదటి ముఖము నుండి స్వాయంభువ మనువు వచ్చినట్లు స్మరింపబడెను. ఆతడు బ్రహ్మ యొక్క తెల్లని వర్ణముగల వాడని తెలియవలె-32. ఆ బ్రహ్మ రెండవ ముఖమునుండి 'ఆ' కారము బుట్టినట్లు స్మరింపబడెను. అది పేరుతో స్వారోషమనువు రంగు తెలుపు-33. మూడవముఖము నుండి యజుస్సులకు శ్రేష్ఠమైన 'ఇ' కారం బుట్టినది. అదియజుయన ఆదిత్యుడు ఆతని నుండి యజుర్వేదము వచ్చి నట్లు స్మరింపబడినది-34. ఈ కారము రక్తవర్ణుడై ప్రతాపవంతుడైన మనువని తెలియవలెను. ఆతని నుండి క్షత్రియజాతి బయలు దేరెను. కావున క్షత్రియుడు రక్తవర్ణుడు-35. బ్రహ్మనాలుగవ ముఖము నుండి ఉకారస్వరము వచ్చినదనబడినది. దాని రంగు తామ్రము (రాగివర్ణము) కావున (దాని నుండి బుట్టిన) మనువుతామసుడనబడెను-36. బ్రహ్మ యైదవ ముఖము నుండి ఊకారమనునది బుట్టెను. రంగుతో అది పచ్చనిది (అందుబుట్టిన) మనువుగూడ చరిష్ణవుడు (అనువాడు)-37. తరువాత బ్రహ్మయారవముఖము నుండి ఓంకారము బుట్టినది. అది కపిల వర్ణము గలది యనబడినది. దానినుండి వరిష్టుడు మహాతపస్వియునైన విజయుడు బుట్టెను-38. బ్రహ్మయేడవ ముఖమునుండి ఋకార స్వరము వైవస్వత మనువును బుట్టిరి. అచట రంగు నలుపనబడినది-39. బ్రహ్మ యెనిమిదవ ముఖము నుండి ఋకారము బుట్టినది. రంగునలుపు, శ్యామాక్షరముతో సమర్థుడు (సమానమైన వర్ణము గలవాడు) అగుటచే దానినుండి సావర్ణి యను మనువు బుట్టి నట్లు చెప్పబడినది-40. బ్రహ్మతొమ్మిదవ ముఖమునుండి తొమ్మిదవ వర్ణమైన లుకారము బుట్టినది. దానిరంగు ధూమ్రవర్ణము అందుబుట్టిన మనువుగూడ దూముడనబడేను-41. బ్రహ్మపదియవముఖమునుండి ప్రభువైన 'ఇ' కారము బుట్టినది. దానినుండి సముడైన సవర్ణుడైన సావర్ణికుడను మనువు ప్రకాశించెను-42. బ్రహ్మపదునొకండవ ముఖమునుండి 'ఏ' కారము దానిరంగు పిశంగవర్ణము మనువు పిశంగుడు-43. బ్రహ్మ పెన్నేండవ ముఖమునుండి ఐ కారము అది పిశంగము భస్మముతో సమానమైనకాంతి గల పిశంగుడను వాడు మనువు (బుట్టిరి)-44. బ్రహ్మ పదమూడవ ముఖమునుండి ఓ కారము అది పంచవర్ల సమాయుక్తము (ఐదురంగులు గలది) ఉత్తమము-45. తరువాత బ్రహ్మయొక్క పదునాలుగవ ముఖము నుండి ఔకారము బుట్టినది. దీని వర్ణము కర్బూర (చిత్ర) వర్ణము సావర్ణి మనువు కల్పమును బట్టి ఈ వీరు మనువులు స్వరములు వాని రంగులును- అని స్వరమునుండియు వర్ణమునుండియు తత్త్యముననుసరించి తెలియవలెను-47. ఏ కారణమువలన పరస్పరము సవర్ణములైన వర్ణములు వరింపబడినవో ఆకారణమువలననే సవర్ణమగుట వలన అన్వయము చెప్పబడినది-48. కల్పమున బుట్టినవి సవర్ణములును సమానములును అయినందున ఈ లోకమున సర్వసంధులు సవర్ణములగును-49. న్యాయమునుబట్టియు అర్థమును బట్టియు వర్ణములు శిలల సమూహమువలె (యథాశైలం) ఏకము అగును. అందువలననే అభ్యాసమును బట్టి సంధులు (వర్ణసంధులు) గూడ స్వరము లేయని తెలియవలెను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున స్వరోత్పత్తి యను నిరువది యారవయధ్యాయము.