11 - పాశుపతయోజనామైకా

వాయురువాచ:-

ఏకం మహాన్తం దివసమహోరాత్రమథాఽ పి వా

 అర్ధమాసం తథా మాసమయనాబ్దయుగాని చ

  మహాయుగ సహస్రాణి ఋషయస్త పసస్థితాః

 ఉపాసతే మహాత్మానః ప్రాణం దివ్యేన చక్షుషా

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ప్రాణాయామ ప్రయోజనమ్

ఫలం చైవ విశేషేణ యథాహ భగవాన్ ప్రభుః

 ప్రయోజనాని చత్వారి ప్రాణాయామస్య విద్ధి వై

 శాన్తిః ప్రశాన్ తి ర్దీప్తిశ్చ ప్రసాదశ్చ చతుష్టయమ్  

వాయువు పలికెను:- ఒక పూర్తి పగలు గాని, రాత్రి పగలు గలిసిన దీనము గాని, సగము నెల గాని, నెల గానీ, ఆరుమాసములతో గూడిన అయనము గాని, సంవత్సరము గాని, యుగములుగాని, మహాయుగ సహస్రములు గాని ఋషులు తపస్సు నందుండి మహాత్ములై దివ్యచక్షువుచే ప్రాణమును పాసింతురు. ఆ పైన భగవంతుడైన ప్రభువు చెప్పిన విధముగా ప్రాణాయామ ప్రయోజనమును ఫలమును చెప్పగలను. ప్రాణాయామము యొక్క ప్రయోజనములు నాలుగని తెలిసికొనుము అవి శాస్త్రి, ప్రశాస్త్రి దీప్తి, ప్రసాదము, అనునవి.

ఘోరాకార శివానాన్తు కర్మణాం ఫలసంభవమ్

 స్వయం కృతాని కాలేన ఇహాముత్ర చ దేహినామ్

 పితృమాతృ ప్రదుష్టానాం జ్ఞాతిసంబన్ది సంకరైః

 క్షపణం హి కషాయాణాం పాపానాం శాన్తిరుచ్యతే

లోభమానాత్మకానాం హి పాపానామపి సంయమః

ఇహాముత్ర హితార్థాయ ప్రశాన్తి స్తప ఉచ్యతే

సూర్వేన్దు గ్రహతారాణాం తుల్యస్తు విషయో భవేత్

ఋషీణాం చ ప్రసిద్ధిగాం జ్ఞాన విజ్ఞాన సంపదామ్

 అతీతానాగతానాం చ దర్శనం సాంప్రతస్యతీ చ

బుద్ధస్వ సమతాం యాన్తి దీప్తిః స్యాత్తప ఉచ్యతే

 ఇన్ద్రియాణీన్ ద్రియార్థాంశ్చ మనః పఞ్చ చ మారుతాన్

 ప్రసాదయతి యేనాసౌ ప్రసాద ఇతి సంజ్ఞితః

 ఇత్యేష ధర్మః ప్రథమః ప్రాణాయామశ్చ తుర్విధః

 సన్నికృష్ణఫలో జ్ఞేయః సద్యః కాలప్రసాదజ:  

 దేహమును ధరించిన ప్రాణులు ఈ లోకమునను పరలోకమునను స్వయముగా కాలము ననుసరించి కొన్ని పనులు చేయుదురు. అవి వాని ఫలముననునరించి ఘోరములనియు శాస్త్రములనియు తెలియును బంధుసంబంధమైన సంకరములచే తల్లిదండ్రులు దోషవంతులగుదురు. దానిచే వారికి జనించిన సంతానము దుష్టమగును కషాయవర్ణముగా నంటిన యాపాపములను తపముచే శమింపచేయుట శాస్త్రీయను తపమనబడును. ఇహ పరలోకహితమునకై లోభము తోను, అభిమానము తోను జేసిన పాపములను గూడ తపమనబడును-5,6,7, జ్ఞానము విజ్ఞానము సంపద. గాగల ఋషులు ప్రసిద్ధులు వారికి సూర్యుడు చంద్రుడు తారలును సమానముగా గనబడుదురు. గడిచిన వానిని రాబోవువానినీ ప్రస్తుతము వర్తమానమగుచున్న వానిని జ్ఞాని సమానముగా జూడగలుగును అనగా వానియందు జ్ఞానియొక్కజొన ప్రకాశము సమానముగా బడి ప్రత్యక్షము జేయును. దీప్తియను తపమనబడును-8,9. కన్నుమొదలగు ఇంద్రియములు రూపము మొదలగు ఇంద్రియార్థములు మనస్సును ప్రాణాపానవ్యాన ఉదాన సమానములను ఐదు వాయువులు వీని నుద్రేకము నందకుండా ప్రసన్నముగానుంచు తపము ప్రసాదమనేడి తపమనబడును-10. ఈ విధముగా ప్రాణాయామము నాలుగు విధములుగా నుండు మొదటి ధర్మము దీనికి ఫలమతి సమీపములో నుండును. ఇది ప్రసన్నమైన కాలమున నప్పటికప్పుడు కలుగును.

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ప్రాణాయామస్య లక్షణమ్

 ఆసనం చ యథాఽ తత్త్వం యుజ్ఞతో యోగమేవ చ

 ఓఙ్కారం ప్రథమం కృత్వా చన్ద్ర సూర్యే ప్రణమ్య చ

 ఆసనం స్వస్తికం కృత్వా పద్మమర్ధాసనం తథా

 సమజానురేక జానురుత్తానః సుస్థితోఽ పి చ

 సమో దృఢసనో భూత్వా సంహృత్య చరణావుబౌ

 సంవృతాస్యోఽవ బద్ధాక్ష ఉరోవిష్టభ్య చాగ్రతః

 పార్షిభ్యాం వృషణే భాద్య తథా ప్రజననం తతః

కిఞ్చిదున్నామిత శిరాః శిరోగ్రీవాం తథైవ చ

 సంప్రేక్ష్య నాసికాగ్రం స్పందిశ్చానవ లోకయన్

 తమః ప్రచ్ఛాద్య రజసా రజః సత్వేన చ్ఛాదయేత్

తతః సత్త్వస్థితో భూత్వా యోగం యుఞ్జన్ సమాహితః

 ఇన్ద్రియాణీన్ద్రియార్థాంశ్చ మనః పఞ్చ సమారుతాన్ 

 విగృహ్య సమవాయేన ప్రత్యాహార ముపక్రమేత్

 యస్తు ప్రత్యాహరేత్కామాన్ కూర్మోజ్గానీవ సర్వతః

 తథాత్మరతిరేకస్థః పశ్యత్యాత్మాన మాత్మని

 పూరయిత్వా శరీరస్తు సబాహ్యాభన్తరం శుచిః

 ఆకర్థానాభియోగేన ప్రత్యాహార ముపక్రమేత్

ఆ పైన ప్రాణాయామ లక్షణమును జెప్పుదును. శరీర తత్త్యము ననుసరించి తగిన యాసనములో నుండవలెను. చిత్తవృత్తులను (మనోవ్యాపారములను) నిరోధింపవల-12 ఓంకారం నుచ్చరించి, చంద్రసూర్యులకు ప్రణమిల్లి, స్వస్తి కాసనమును గాని పద్మాసనమునుగాని, అర్ధాసనము గాని వేసి యుండవలెను-13. సమముగా నుంచిన మోకాళ్లు గలుగునట్లుగా గాని, ఒకే మోకాలుండు మోనట్లుగగాని, వెల్లికిల నుండిగాని, చక్కగా కూర్చున్నవాడై గూనితో ఒడుదుడుకులుగా గాక సమముగా గూర్చోన్న వాడై రెండు పాదములు ముడిచి దృఢమైన యాసనముననుండవలె-14. తరువాత నోరుమూసుకొని క్రిందుగా నర్థానిమీలితనేత్రుడై జొమ్మును ముందుకు నిక్కబొడిచి, కాలి మడమలతో వృషణములను లింగమును గప్పికూర్చొనవల-15. తరువాత తలను మెడను కొద్దిగా ఎత్తవలె, తన ముక్కు చివరకు చూడవలే. దీక్కులు చూడరాదు- . 16. తమో గుణమును రజో గుణముతో గప్పి, సత్య గుణముతో రజో గుణమును గప్పి వేయవలె. తరువాత సత్య గుణంలో నున్న వాడై చిత్తవృత్తుల నిరోధించుచు సమాధిలో నుండవలే-17. ఇన్షియములను వానివిషయములైన రూపాదులను, మనస్సును, ప్రాణాదులైన ఐదు వాయువులను అంతర్ముఖముగా లాగి, వానిని వెనుదిరుగునట్లు జేయుటకారంభింపవలె. (వానిని కరిగి యేకాగ్రముగా చిత్తమున లయమగునట్లు జేయవలె-18. తాబేలు తన యంగములను లోనికి ముడుచుకొనునట్లు కోరికలనన్నింటిని ఉపసంహరించు కొన్నవాడు ఆత్మయందే రతుడై ఆత్మలో పరమాత్మను జూడగలడు-19. శరీరమును (వాయువుచే) నింపి బాహ్యాంతరముల పరిశుద్దుడై కంఠమునుండి బొడ్డువరకు కలుపుయోగము చేత ప్రత్యాహారమును వాయువును చీల్చుకొనుటను ప్రారంభింపవలె.

కలామాతస్తు విజ్ఞేయో నిమేషోన్మేషఏవ చ

తథా ద్వాదశమాతస్తు ప్రాణాయాయో విధీయతే

 ధారణా ద్వాదశా యామో యోగో వై ధారణాద్వయమ్

 తథా వై యోగముక్తశ్చ ఐశ్వర్యం ప్రతిపద్యతే

 వక్షతే పరమాత్మానం దీప్యమానం స్వతేజసా

 ప్రాణాయామే నయుక్తస్యవిప్రస్య నియతాత్మనః

సర్వే దోషాః ప్రణశ్యన్తి సత్త్వస్థశ్చైవ జాయతే      

కనురెప్పపాటు వేసి తెరచునంత కాలము కలామాత్రయని తెలియవలె అట్లే ప్రాణాయామము పండ్రెండు మాత్రలకాలము చేయవలెను-21. పండ్రెండు (మాత్రల) పొడవైనది ధారణ (చిత్తమునొక చోటనిలుపుట) రెండు ధారణలు యోగము అట్టి యోగము తో గూడినవాడు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును పొందును.తన తేజముతో దీప్యమానుడైన పరమాత్మను చూచును-22. నియతాత్ముడైప్రాణాయామయుక్తుడైన బ్రాహ్మణునకు సర్వదోషములు నశించును. వాడు సత్యగుణమునందున్న వాడగును.

ఏవం వై నియతాహారః ప్రాణాయామ పరాయణః

 జిత్వా జిత్వా సదా భూమిమాలో హేత్తు సదా మునిః

 అజితా హి మహాభూమిర్ధోషానుత్పాద యేద్బహూన్

 వివర్దయతి సమ్మోహం న రో హెదజతాం తతః  

నాతే నతు యథా తోయం యన్త్రేణైవ బలాన్వితః

 ఆపిబేత ప్రయత్నేన తథా వాయుం జితశ్రమః

 నాభ్యాం చ హృదయే చైవ కణ్ఠే ఉరసి చాననే

 నాసాగ్రే తు తథా నేత్రే భ్రువోర్మధ్యేఽథ మూర్ధని

 కిష్చోదూర్థ్వం పరస్మింశ్చ ధారణా పరమా స్మృతా

ప్రాణాపాన సమారోధాత్ ప్రాణాయామః స కథ్యతే

 మనసో ధారణా చైవ ధారణేతి ప్రకీర్తితా

 నివృత్తిర్విషయాణాన్తు ప్రత్యాహారస్తు సంజ్ఞితః

సర్వేషాం సమవాయే తు సిద్ధిః స్వాద్యోగలక్షణా

 తయోత్పన్నస్య యోగస్య ధ్యానం వై సిద్ధిలక్షణమ్

 ధ్యానయుక్తాః సదా పశ్యేదాత్మానం సూర్యచంద్రవత్    

ఈ విధముగా నియతమైన యాహారము గలవాడై ప్రాణాయామ పరాయణుడై భూమినెప్పుడు జయించి జయించియే మునియై యధిరోహింపవలెను-24. మహా భూమిని జయింపనిచో నది బహుదోషముల బుట్టించును. సమ్మోహమును గలుగజేయును. కావున జయింపని భూమినధిష్టింపరాదు-25 యస్త్రరూపమైన నాళముచే బలముతోగూడిన వాడై ప్రయత్నముతో నీరును సంపూర్ణముగా ద్రావిన విధమున శ్రమమును జయించినవాడై వాయువును జయింపవలెను-26. నాభియందు, హృదయమున, కంఠమున, వక్షః స్థలమున, ముఖమున, నాసాగ్రమున అట్లే నేత్రమున, కనుబొమ్మల మధ్యన, ఆ తరువాత శిరమున దానికి కొంచెము పైనున్న పరమునందు ప్రాణమును మనస్సును నిలిపీయుంచుట ధారణయనబడును. ప్రాణాపానములను చక్కగా నరికట్టి నిలుపుట చేత అది ప్రాణాయామమనబడును-27,28. మనస్సును నిలుపుట ధారణయనబడినది. విషయములనుండి మనస్సును మరల్చుట ప్రత్యాహారమనబడినది-29. అన్నింటియొక్క సమూహము నందైతే అది యోగలక్షణ (రూప)మైన సిద్ధియగును. ఆ సిద్ధిచే గలిగిన యోగము యొక్క ధ్యానము సిద్దిలక్షణ (రూపము ధ్యానయుక్తుడై సూర్యచంద్రులవలె నెల్లప్పుడు ఆత్మను జూడవలెను.

సత్త్వస్యానుపపత్తౌ తు దర్శనస్తు న విద్యతే

 అదేశకాలయోగస్య దర్శనస్తు న విద్యతే

 అగ్న్యభ్యాశే వనే వాపి శుష్కపర్ణచయే తథా

 జన్తువ్యాప్తే శ్మశానే వా జీర్ణగోష్టే చతుష్పదే

 సశబ్ధే సభయే వాపి చైత్యవల్మీక సంచయే

ఉదహనే తథా నద్యాం న బాధా తః కదాచన

 క్షుధావిష్టస్తథా ప్రీతో న చ వ్యాకులలోచనః

యుజ్జీత పరమం ధ్యానం యోగీ ధ్యానపరః సదా

 ఏతాన్దోషాన్వినిశ్చిత్య ప్రమాదాద్యో యునక్తి వై

 తస్య దోషాః ప్రకుప్యన్తి శరీరే విఘ్నకారకాః

జడత్వం బధిరత్వం చ మూకత్వం చాధిగచ్ఛతి

 అన్ధత్వం స్మృతిలోపశ్చ జరారోగ స్తథైవ చ

 తస్య దోషాః ప్రకుప్యన్తి అజ్ఞానాద్యోయునక్తి వై

 తస్మాఙ్ఞానేన శుద్దేన యోగీ యుఞ్జేత్సమాహితః

 అప్రమత్తః సదా చైవ న దోషాన్ ప్రాప్నుయాత్క్వచిత్

తేషాం చికిత్సాం వక్ష్యామి దోషాణాం చ యథాక్రమమ్

యథా గచ్చన్తిక్తి తే దోషా: ప్రాణాయామ సముత్థితాః      

సత్యము గలుగనప్పుడు దర్శనము గలుగదు. తగని దేశమునను తగని కాలమునను జరిపిన యోగమునకు దర్శనముండదు-31. అగ్నిదగ్గర, వనమున, ఎండినయాకుల సమూహము (కుప్ప) యందు, అట్లే జన్తువులు తిరుగాడు చోట, శ్మాశానమున, పాడుబడిన గోశాలయందు, నాలుగుదారులు, గలిగిన చోట (చౌరస్తాలో) శబ్దముల యలజడియున్న చోట, భయమున్నచోట రచ్చమానులు పుట్టలు విని సమూహమున్న చోట, నీరు ద్రావు బావి దగ్గర, అట్లే నదీలో బాధ గలుగు చోటను, ఎప్పుడును యోగమును బూనరాదు-32,33. ఆకలి బాధ నున్న వాడు, సంతోషము లేనివాడు. వ్యాకులములైన కన్నులు గలవాడు, యోగమున పరమధ్యానమును జేయరాదు. కావున నెల్లప్పుడును యోగి ధ్యానపరుడై -34. ఈ దోషములను నిశ్చయించి తెలిసికొనవలెను. అవి యున్నను ప్రమాదమున యోగమును ఆచరించు వానికి శరీరములో దోషములు ప్రకోపించి యోగవిఘ్నకారకములగును-35. జడత్వము (చచ్చుపడిపోవుట పక్షపాతము వంటిది) చెవిటితనము, మూగతనమును పొందును. గ్రుడ్డితనమును, స్మృతిలోపమును (మతిచెడుట), జరారోగమును, పొందును.36 కావున అజ్ఞానమున పై దోషములుండగా యోగమునకు బూనినవానికి శరీరమున బహు దోషములు ప్రకోపించును. కావున శుద్దమైన జ్ఞానముతో ; సమాహితుడై (ఏకాగ్రచిత్తుడై యోగి తన యోగమునకు బూను కొనవలెను-37. ఎప్పుడును అప్రమత్తుడై (జాగరూకుడై ఎక్కడగూడ యోగిపై దోషములనొందరాదు. ఇక ఆ ప్రాణాయామమువలన గలిగిన దోషములను బోగొట్టు చికిత్సను యథాక్రమముగా జెప్పుదును.

స్నిగ్ధాం యవాగూమత్యుష్ణాం భుక్త్యా తత్రావ ధారయేత్

ఏతేన క్రమయోగేన వాతగుల్మం ప్రశామ్యతి

 గుదావర్త ప్రతీకారమిదం కుర్యాచ్చికిత్సితమ్

 భుక్త్యాదధియవాగూర్వా వాయురూర్థ్వం తతో వ్రజేత్

 వాయుగ్రంధిం తతో భీత్వా వాయుదేశే ప్రయోజయేత్

 తథాపి న విశేషః స్యాద్ధారణాం మూర్ధ్ని ధారయేత్

 యుఞ్జానస్య తనుం తస్య సత్వస్థ స్యైవ దేహినః

 గుదావర్త ప్రతీఘాతే ఏతత్కుర్యా చ్చికిత్సితమ్

 సర్వగాత్ర ప్రకమ్పేన సమారబ్ధస్య యోగినః

 ఇమాం చికిత్సాం కుర్వీత తయా సంపద్యతే సుఖీ       

మిక్కలి వేడిగానున్న యవల జావను నేయి గలిపి తిని తన యోగమును నిలుపవలెను. ఈ క్రమయోగముతో వాతమువలన గలిగిన గుల్మవ్యాధి శమించును-39. గుదావర్తవ్యాధికి తిరుగుడుగా నీ చికిత్స చేయవలెను. పెరుగుతోగూడిన యవలజావను తినవలెను. దాని వలన వాయువు పైకి పోవును-40. తరువాత వాయు గ్రంథి (ముడి) ని ఛేదించి వాయుదేశమున (వాయువును) ప్రయోగింపవలెను. అట్లేనను విశేషములేని (కనబడని) చో యోగధారణమును శిరస్సున జేయవలెను-41. ఈ విధముగ శరీరమును యోగముతో బూన్చి స్వస్థుడైన వానికి (శరీరికి) గుదావర్త ప్రతిఘాతము గలుగగా నీ చికిత్సను చేయవలెను-42. యోగమును ప్రారంభించిన యోగికి సమస్త శరీరము ప్రకంపనమును చెందినప్పుడు ఈ చికిత్సను చేయవలెను. దానిచేత వాడు సుఖియగును.

మనసా యద్వ్రతం కించిద్విష్టం భీకృత్య ధార యేత్

 ఉరోద్ఘాతే ఉరః స్థానం కణ్ఠదేశే చ ధారయేత్

త్వచో ఽవఘాతే తాం వాచి బాధిర్యేశ్రోత్రయోస్తథా

జిహ్వాస్థానే తృషార్తస్తు అగ్రేస్నేహాంశ్చ తస్తుభి:

ఫలం వై చిన్తయేద్యోగీ తతః సంపద్యతే సుఖీ

క్షయేకుష్ఠే సకీలా సే ధారయేత్సర్వ సాత్వికీమ్

యస్మిన్ యస్మిన్ రజోదేశే తస్మిన్ యుక్తో వినిర్దిశేత్

యోగోత్పన్నస్య విప్రస్య ఇదం కుర్యాచ్చిచికిత్సతమ్

 వంశ కీలేన మూర్ధానం ధార్యమాణస్య తాడయేత్

 మూర్ధ్ని కీలం ప్రతిష్టాప్య కాష్టం కాష్ఠేన తాడయేత్

 భయభీతస్య సా సంజ్ఞాతతః ప్రత్యాగమిష్యతి

 అథవా లుప్త సంజ్ఞస్య హస్తాభ్యాం తత్ర ధారయేత్

 ప్రతిలభ్య తతః సంజ్ఞాం ధారణాం మూర్ధ్ని ధార యేత్

 స్నిగ్ధమల్పం చ భుఞ్జీత తతః సంపద్యతే సుఖీ       

వ్రతమే దైననున్న మనస్సుతో దానిని చక్కగా నిలిపి ధారణ చేయవలెను. ఉరోద్ఘాతము గలిగినచో ఉరః స్థానమును కంఠస్థానమున యోగ ధారణ చేయవలెను-44. చర్మమునకవఘాతము గలిగినపుడు ఆ చర్మమును వాక్ స్థానమున యోగదారణచేయవలెను. చెవుడు కలిగినపుడు చెవులయందును. దప్పిక కలిగినపుడు నాలుకయందును యోగధారణ చేయవలెను. తంతువుల చేత మొదట స్నేహములను ఫలమును యోగి చింతింపవలేను. దాని వలన యోగి సుఖియగును-45. క్షయ, కుష్టు, కిలాసము, (సిబ్బెము) ఈ వ్యాధులు సంభవించినపుడు సర్వసాత్వికిని ధారణ చేయవలెను. ఏయే రజోదేశమున (బాధగలుగునో) ఆయా ప్రదేశమున యోగధారణాయుక్తుడై నిర్దేశింపవలెను-46. యోగోత్సన్నుడైన విప్రునకు ఈ చికిత్సను చేయవలెను. యోగధారణము చేయుచున్న వానియొక్క శిరస్సును వెదురు కీలము (మేకు)తో గొట్టవలెను. శిరమున (మేకు) కీలమునుంచి కట్టెను కట్టేతో గొట్టవలెను-47. దాని వల్ల భయభీతునకు పూర్వస్మృతి మరల రాగలదు. లేదా స్మృతిని గోలుపోయిన వానిని చేతులతో బట్టినిలుపవలెను-48. ఆ తరువాత స్మృతిని పొంది శిరమున యోగధారణమును చేయవలెను. నేయి గలిపిన దానిని కొద్దిగా భుజింపవలెను. దాని వలన సుఖి యగును.

అమానుషేణ సత్త్వేన యదా బుధ్యతి యోగవిత్

దివం చ పృథివీం చైవ వాయుమగ్నిం చ ధారయేత్

 ప్రాణాయామేన తత్సర్వం దహ్యమానం వశీ భవేత్

 అధాపి ప్రవిశేద్దేహం తతస్తం ప్రతిక్షేధయేత్

 తతః సంసభ్య యోగేన ధార్యయానస్యమూర్థని

 ప్రాణాయామాగ్నినా దగ్ధ తత్సర్వం విలయం వ్రజేత్

 కృష్ణసర్పాపరాధం తు ధారయేద్ధృదయోదరే

 మహర్జనస్తపః సత్యం హృది కత్వా తు ధారయేత్

 విషస్యతు ఫలం పీత్వా విశల్యాం ధారయేత్తతః

 సర్వతః సనగాం పృథ్వీం కృత్వా మనసి ధారయేత్

హృది కృత్వా సముద్రాంశ్చ తథా సర్వాశ్చ దేవతాః

సహస్రేణ ఘటానాం చ యుక్తః స్నాయీత యోగవిత్

 ఉదకే కంఠమాత్రే తు ధారణాంమూర్ధ్ని ధారయేత్

 ప్రతిస్రోతో విషావిష్టో ధారయేత్ సర్వగాత్రికీమ్

శీర్ణోఽర్కపత్రపుటకైః పిబేద్వల్మీక మృత్తికామ్

 చికిత్సత విధిర్హ్యేష విశ్రుతో యోగనిర్మితః

 వ్యాఖ్యాతస్తు సమాసేన యోగ దృష్టేన హేతునా

 బ్రువతో లక్షణం విద్ధి విప్రస్య కథయేత్ క్వచిత్

 అథాఽపి కథయేన్మోహాత్త ద్వీజ్ఞానం ప్రతీయతే

 తస్మాత్ప్రవృత్తి ర్యోగస్య న వక్తవ్యా కథంచన

 సత్త్వం తథారోగ్యమ లోలుపత్వం వర్ణప్రభాసుస్వర సౌమ్యతా చ

 గన్దః శబ్ధో మూత్రపురీషతల్పం యోగప్రవృత్తి: ప్రథమాశరీరే

 ఆత్మానం పృథివీం చైవ జ్వరన్తీం యది పశ్యతి

కృత్వాఽన్యం విశతే చైవ ద్యాత్ సిద్ధి ముపస్థితామ్

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే పాశుపతయోగో నామైకాదశోఽధ్యాయః     

యోగమును దెలిసినవాడు అమానుషమైన (మానవాతీతమైన) బలముతో (యోగమునుండి) మేలుకొనినపుడు, స్వర్ణమును, భూమిని, వాయువును అగ్నిని యోగధారణలో నిలుపవలెను-50. ప్రాణాయామముచే నదియంతయు దహింపబడుచున్నదై వశమగును అయినప్పటికీని దేహమును ప్రవేశింపవలె, తరువాత దానిని (ఆవహ్యమానమును) నిషేధింపవలేను-51. తరువాత స్తంభించి యోగముతో శిరమున ధారణచేయుచున్న యాతనికి ప్రాణాయామాగ్నిచే దహింపబడిన దంతయు విలయమును బొందును-52. నల్లనాగు బాముయొక్క అపరాధమునైతే (విషమును) రోమ్మునను కడుపులోను యోగధారణము చేయవలె మహోలోకమును, జనలోకమును, తపోలోకమును, సత్యలోకమును, హృదయమునందుంచి యోగ ధారణ చేయవలె-53. విషము యొక్క ఫలమును (జలమును) ద్రావి తరువాత విశల్యను (విషములేని దానిని) ధారణ చేయవలె అంతటను పర్వతములతో గూడిన భూమిని మనస్సున ధారణ చేయవలె-54. యోగజ్ఞుడైయోగమునందున్న వాడు సముద్రలను దేవతలను హృదయమున ధారణతోనిలిపి వేయికుండలతో స్నానము జేయవలె-55. కంఠమువరకు నీటిలో నుండి శిరమున యోగధారణ చేయవలె. విషావిష్ణుడైనవాడు ప్రవాహమున కెదురుగా నుండి సార్వగాత్రికిని (సర్వత్రధారణను) జేయవలె-56. సన్నగిల్లిన (బక్కచిక్కిన) యోగి జిల్లేడాకుల దొప్పలతో పుట్టమన్ను ద్రావవలె ఇది విషబాధితుడైన యోగికి చికిత్సావిధానము ఇదియోగనిర్మితమై ప్రసిద్ధమైనది-57. యోగదృష్టమైన హేతువుచే సంగ్రహముగా వ్యాఖ్యానింపబడినది. దీనినెక్కడనైనను ఎవడేని జెప్పవచ్చును. ఆ బ్రాహ్మణుని లక్షణమును దెలిసికొనుము (యోగము తోగనుగొన్న రహస్యం చెప్పరాదు)-58. అయినప్పటికిని మోహము వలన జెప్పినచో ఆ విజ్ఞానము ప్రళయం (నాశనము చెందును) కావున యోగప్రవృత్తినేమైనను చెప్పరాదు-59. సత్యము శాస్త్రి పూర్వకమైన బలము) ఆరోగ్యము, మిక్కిలికోరిక, రంగుయోక్కకాంతి, మంచిస్వరము సౌమ్యత, సుగంధము, అల్పమైన మూత్ర పురీషములు- ఇవి శరీరమున యోగమువల్ల మొదట గలుగు లక్షణములు-60. యోగి తనయోగమున, తనను, భూమిని జ్వలించుచున్నట్లుగా జూచి, తన్నువేరొకనిగా ప్రవేశించినచో, ఆతనికి సిద్ధి తనకడకు చేరినట్లుగా దెలిసికొనవలె.

ఇది వాయుప్రోక్తమైన మహాపురాణమున పాశుపత యోగమను పదనొకండవ ధ్యాయము.