2 - పృథువంశాను కీర్తనమ్

సూత ఉవాచ :-

ఆసీదియం సముద్రంతా మేదినీతి పరిశ్రుతా

వసు ధారయతే యస్మాత్ వసుధా తేన చోచ్యతే

 మధుకైటభయోః పూర్వం మేదసా సంపరిప్లుతా

 తతోఽభ్యుపగమద్రాజ్ఞః పృథోర్యైన్యస్య ధీమతః

 ఇయం చాసీత్ సముద్రాంతా మేదినీతి పరిశ్రుతా

 దుహితృత్వ మనుప్రాప్తా పృథివీత్యుచ్యతే తతః

 ప్రథితా ప్రవీభక్తా చ శోభితా చ వసుంధరా

 సస్యాకరవతీ రాజ్ఞా పత్తనాకరమాలినీ

చాతుర్వర్ణ్య సమాకీర్ణ రక్షితా తేన ధీమతా  

సూతుడనెను :

సముద్రాంత మైన యీ భూమి మేది నీయని ప్రసిద్దముగా వినబడినది. వస్తువును (ధనమును) ధరించుట చేత వసుధయని చెప్పబడెను. పూర్వము మధు కైటభుల మేదస్సుతో నంతటను ప్రవాహితమైన భూమి ధీమంతుడై రాజైన పృథువును జేరెను. కావున నీ సముద్రాంతమైన భూమి మేదినీయని ప్రసిద్ధి జెందినదై పుత్రత్వము నందినదై పృథివి యని పిలువబడినది. ఈ విధముగ పేరు గాంచినది, అట్లే విభజింపబడినదై వసుంధరయే రాజుచే శోభిల్లినది. అట్లే పంటలకు నిధానమైనదై పట్టణసమూహములు మాలగా గలదై, నాలుగు వర్ణములతో బ్రహ్మ క్షత్రవైశ్య శూద్రులతో నిండినదై బుద్ధిశాలియైన యా పృథువుచే రక్షింపబడినది.

ఏవం ప్రభావో రాజాఽఽసీద్వైన్యః స నృపసత్తమః

 నమస్యశ్చైవ పూజ్యశ్చ భూతగ్రామేణ సర్వశః

 బ్రాహ్మణైశ్చ మహాభాగైర్వేద వేదాంగ పారగైః

 పృథురేవ నమస్కార్యో బ్రహ్మయోనిః సనాతనః

 పార్థివైశ్చ మహాభాగైః ప్రార్థయద్భిర్మహద్యశః

 ఆదిరాజా నమస్కార్యః పృథుర్వైన్యః ప్రతాపవాన్

 యోధైరపి చ సంగ్రామే ప్రార్థయానైర్జయం యుధి

 ఆదికర్తా నరాణాం వై నమస్యః పృథురేవ హి

 యో హి యోద్ధా రణం యాతి కీర్తయిత్వా పృథుం నృపమ్

 స ఘోరరూపే సంగ్రామే క్షేమీ తరతి కీర్తిమాన్

 వైశ్యైరపి చ రాజర్షిర్వైశ్యవృత్తి సమాస్థితైః

పృథురేవ నమస్కార్యో వృత్తిదాతా మహాయశాః

 ఏతే వత్సవిశేషాశ్చ దోగ్ధారః క్షీరమేవ చ

 పాత్రాణి చ మయోక్తాని సర్వాణ్యేవ యథాక్రమమ్

 బ్రహ్మణా ప్రథమం దుగ్ధా పురా పృధ్వీ మహాత్మనా

 వాయుం కృత్వా తదా వత్సం బీజాని వసుధాతలే

 తతః స్వాయంభువే పూర్వం తదా మన్వంతరే పునః

 వత్సం స్వాయంభువం కృత్వా దుగ్ధా గ్రీష్మేణ వై మహీ

 మనౌ స్వారోచిషే దుగ్ధ మహీ చైత్రేణ ధీమతా

 మనుం స్వారోచిషం కృత్వా వత్సం సస్యాని వై పురా

 ఉత్తమేఽ నుత్తమేనాపి దుగ్ధా దేవభుజేన తు

 మనుం కృత్వోత్తమం వత్సం సర్వసస్యాని ధీమతా

 పునశ్చ పంచమే పృథ్వీ తామసస్యాంతరే మనోః

దుగ్ధేయం తామసం వత్సం కృత్వా తు బలబంధునా

 చారిష్ణవస్య దేవస్య సంప్రాప్తే చాంతరే మనోః

దుగ్ధా మహీ పురాణేన వత్సం చారిష్ణవం ప్రతి

 చాక్షుఽషేపి చ సంప్రాప్తే తదా మన్వంతరే పునః

 దుగ్ధా మహీ పురాణేన వత్సం కృత్వా తు చాక్షుషమ్

 చాక్షుషస్యాంతరేఽ తీతే ప్రాప్తే వైవస్వతే పునః

 వైన్యేనేయం మహీ దుగ్ధా యథా తే కీర్తితం మయా

 ఏతైర్దుగ్ధా పురా పృథ్వీ వ్యతీతేష్వంతరేపు వై

 దేవాదిభిర్మనుష్యైశ్చ తథా భూతాదిభిశ్చ యా  

ఆ వైన్యరాజు రాజులలో కెల్ల మంచి శ్రేష్ఠుడై యిట్టి ప్రభావము గల వాడయ్యెను. ప్రాణి సమూహముచే నంతట ఆతడు నమస్కరింప దగినవాడును, పూజింపదగిన వాడును అయ్యెను. బ్రహ్మయోనియే సనాతనుడైన పృథువే వేద వేదాంగముల సారము నెరింగిన మహాభాగులైన బ్రాహ్మణులచే నమస్కరింప దగినవాడు. మహాకీర్తిని పొందగోరిన మహాభాగులైన రాజుల చేత గూడ ఆదిరాజై ప్రతాపవంతుడై వైన్యుడైన పృథువే నమస్కరింప దగినవాడు. యుద్ధమున జయము గోరు యోధులచేత గూడ నరులకాదికర్తయైన పృథువే నమస్కరింపదగినవాడు. పృథురాజును కీర్తించి రణమునకేగిన యోధుడు భయంకర యుద్ధ గూడ జయమంది క్షేమముతో కీర్తిమంతుడై తరించును, వైశ్యవృత్తిలోనున్న వైశ్యులచేత గూడ తమకు వృత్తి (వ్యాపార జీవః నీచ్చు మహాకీర్తిమంతుడైన పృథువే నమస్కరింపదగినవాడు. వీరు (ఈ క్రిందివారు) వత్స విశేషములు (ప్రత్యేకమైన దూఁ పాలు పితుకువారును, సమస్త ములైన పాలు పితుకు పాత్రలును - క్రమముగా నాతో జెప్పబడినవి. మొదట వాయువును ద జేసి మహాత్ముడైన బ్రహ్మ పృథివి (యను ఆవు) నుండి భూతలమున బీజములను పితికెను. తరువాత స్వాయంభువ మన్వంతర స్వాయంభువ మనువును దూడగా జేసి గ్రీష్మునిచే భూమి పితుకబడినది పూర్వము స్వారోచిషమన్వంతరమున స్వారోచిష మన దూడగా జేసి బుద్ధిశాలియైన చైత్రవునిచే భూమి నుండి సస్యములు పితుకబడినవి, ఉత్తమ మన్వంతరమున ఉత్తమమను దూడగా జేసి బుద్ధిమంతుడై యుత్తముడైన దేవభుజునిచే భూమి నుండి సర్వసస్యములు పితుకబడినవి. పంచమమగు తె మన్వంతరమున తామసమనువును దూడగా జేసి మరల నీ భూమినుండియే బలబంధువుచే (సర్వసస్యములు) పితుకబడినవి చారిష్ణవదేవుని మన్వంతరమున చారిష్ణవుని వత్సమునుగాజేసి యీ భూమి పురాణునిచే పితుకబడినది. చాక్షుషమన్వంత రాగానే చాక్షుష మనువును దూడనుగా జేసి పురాణునిచే ఈ భూమి. పితుకబడినది. నేను పూర్వము చెప్పినట్లే వైవస్వత చాక్షుష మన్వంతరము గడచి వైవస్వతము రాగా వైన్యునిచే మరల నీ భూమీ పితుకబడినది. గడచిన మన్వంతరములలో పూర్వమీ భూమి ఈ దేవాదుల చేతను మనుష్యులచేతను భూతాదుల చేతను పైజెప్పిన వారిచే గూడ పితుకబడినది.

 ఏవం సర్వేషు విజ్ఞేయా హ్యతీతా నాగతేష్విహ

 దేవా మన్వంత రేష్వస్య పృథోస్తు శృణుత ప్రజాః

 పృథోస్తు పుత్రౌ విక్రాంతౌ జజ్ఞాతేంఽతర్థిపాలినౌ

శిఖండినీ హవిర్ధాన మంతర్ధానాద్వ్య జాయత

 హవిర్ధానాత్ షడాగ్నేయీ ధిషణాఽ జనయత్సుతాన్

ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం వ్రజాజినౌ

ప్రాచీన బర్హిర్భగవాన్ మహానాసీ త్ప్రజాపతిః

 బలశ్రుత తపోవీర్యైః పృథివ్యా మేకరాడసౌ

 ప్రాచీనాగ్రాః కుశాస్తస్య తస్మాత్ప్రాచీన బర్హ్యసౌ

 సముద్ర తనయాయాం తు కృతధారః స వై ప్రభుః

 మహతస్తమసః పారే సవర్ణాయాం ప్రజాపతేః

 సవర్ణాఽఽధత్త సాముద్రి దశ ప్రాచీనబర్హిషః

 సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగాః

 అపృథగ్ధర్మచరణా స్తేఽ తప్యంత మహత్తపః

 దశవర్ష సహస్రాణి సముద్ర సలిలేశయాః

 తపశ్చరత్సు పృథివీం ప్రచేతస్సు మహీరుహాః

 అరక్ష్యమాణా మావవ్రుర్బభూవాథ ప్రజాక్షయః

 ప్రత్యాహతే తదా తస్మింశ్చాక్షుష స్యాంతరే మనోః

 నాశకన్మారుతో వాతుం వృతం ఖమభవద్దృమైః

 దశవర్ష సహస్రాణి నశేకుశ్చేష్టితుం ప్రజాః

తదుపశ్రుత్య తపసా సర్వే యుక్తాః ప్రచేతసః

 ముఖేభ్యో వాయుమగ్నిం చ ససృజుర్జాతమన్యవః

 ఉన్మూలానథ తాన్ వృక్షాన్ కృత్వా వాయు రశోషయత్

 తానగ్నిరదహద్ఘోర ఏవమాసీద్దృమక్షయః

 దృమక్షయమథో బుద్ధ్వా కించిచ్ఛేశేషు శాఖీషు

 ఉపగమ్యా బ్రవీదేతాన్ రాజా సోమః ప్రచేతసః

 దృష్ట్యా ప్రయోజనం సర్వం లోకసంతాన కారణాత్

 కోపం త్యజత రాజానః సర్వం ప్రాచీనబర్హిషః

 వృక్షాః క్షిత్యాం జనిష్యంతి శామ్యేతామగ్ని మారుతౌ

 రత్నభూతా తు కన్యేయం వృక్షాణాం వరవర్ణినీ

 భవిష్యం జానతా హ్యేషా మయా గోభిర్వివర్ధితా

మారిషా నామ నామ్నైషా వృక్షైరేవ వినిర్మితా

భార్యా భవతు వో హ్యేషా సోమగర్భ వివర్ధితా

యుష్మాకం తేజసోఽర్ధేన మమ చార్ధేన తేజసః

అస్యా ముత్పత్స్యతే విద్వాన్ దక్షోనామ ప్రజాపతిః

 స ఇమాం దగ్ధభూయిష్ఠాం యుష్మత్తేజోమయేవ వై

 అగ్నినాగ్నిసమో భూయః ప్రజాః సంవర్ధయిష్యతి

తతః సోమస్య వచనాజ్జ గృహుస్తే ప్రచేతసః

సంహృత్య కోపం వృక్షేభ్యః పత్నీం ధర్మేణ మారిషామ్

మారిషాయాం తతస్తే వై మనసా గర్భమాదధుః

 దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః

 దక్షో జజ్ఞే మహాతేజాః సోమస్యాంశేన వీర్యవాన్

అసృజన్మానసొనాదౌ ప్రజా దక్షోఽథ మైథునాత్

అచరాంశ్చ చరాంశ్చైవ ద్విపదోఽథ చతుష్పదాన్

 విసృజ్య మనసా దక్షః పశ్చాదసృజత స్త్రియః

దదౌ స దశ ధర్మాయ కాశ్యపాయ త్రయోదశ

కాలస్య నయనేయుక్తాః సప్తవింశతి మిందవే

ఏభ్యో దత్త్వా తతోఽ న్యా వై చతస్రోఽ రిష్టనేమినే

ద్వే చైవబాహుపుత్రాయ ద్వే చైవాంగిరసే తథా

కన్యామేకాం కృశాశ్వాయ తేభ్యో ఽపత్యం నిబోధత

అంతరం చాక్షుషస్యాత్ర మనోః షష్ఠం తు హీయతే

మనోర్వైవస్వత స్యాపి సప్తమస్య ప్రజాపతేః

తాసు దేవాః ఖగా గావో నాగా దితిజదానవాః

 గంధర్వాప్సరసశ్చై జజ్ఞిరేఽ న్యాశ్చ జాతయః

 తతః ప్రభృతి లోకేఽ స్మిన్ ప్రజా మైథున సంభవాః

 సంకల్పాద్దర్శనాత్స్పర్శాత్ పూర్వేషాం సృష్టిరుచ్యతే    

ఈ విధముగనే యిచట భూత - భవిష్యత్మన్వంత రములలో దేలియ వలెను. ఈ మన్వంతరములో పృథువు యొక్క సంతానమును దేవతలను గూర్చి వినుడు. పృథువు నుండి అంతర్ధిపాలురు పరాక్రమ వంతులునైన యిరువురు పుత్రులు జనించిరి. అంతర్ధాను నుండి శిఖండిని హవిర్ధానుని గనెను, హవిర్ధాను నుండి షడాగ్నేయి యైన ధిషణ సుతులను గనెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, ప్రజాజీనులును, భగవంతుడైన ప్రాచీన బర్హి  గొప్ప ప్రజాపతి యయ్యెను. ఈతడు బలము చేతను, పాండిత్యము చేతను, తపము చేతను, వీర్యము (పరాక్రమము) చేతను భూమిలో అందరిని పాలించు ఒకే ఒక రాజుగానయ్యెను. అతని దర్భలు ప్రాచీనాగ్రములు (తూరుపు వైపు కొసలు గలవి). కావున నతడు ప్రాచీనబరియయ్యెను. ఆ ప్రభువు సముద్రతనయను భార్యగా జేసికొనెను. ఆమె మహాతమస్సు యొక్క పాతమున సవర్ణమైనది. తఱువాత సాముద్రి (సముద్రతనయ) యైన సవర్ణ ప్రజాపతి వలన పదుగురను ప్రాచీన బర్హిషులను గర్భము ధరించి కనెను. వారందరు ప్రచేతసులనువారు, ధనుర్వేద పారగులు. ఏకధర్మము నాచరించునట్టి వారు. సముద్ర జలమునబరుండినవారై పదివేల యేండ్లు మహాతపమును జేసిరి. ఆ ప్రచేతసులు తపము జేయుచుండగా, వృక్షములు రక్షణము లేని భూమిని జుట్టీ వైచినవి. అంత ప్రజాక్షయము జరిగినది. చాక్షుష మన్వంతరమీ విధముగ గొట్టబడగా, వాయువు వీచలేకపోయినది. ఆకాశము వృక్షములతో జుట్టబడినది. పదివేలయేండ్లు ప్రజలు కదలజాలకుండిరి. అది విని తపములతో గూడిన ప్రచేతసులందరు కోపించినవారై ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. ఆ వాయువు పెకిలిపడిన వృక్షములనన్నింటిని శోషింప జేసేను. వాని నా భయంకరమైన యగ్ని దహించివైచెను. ఈ విధముగ వృక్షముల నాశము జరిగినది. తరువాత రాజైన సోముడు వృక్షనాశమును దెలిసి, అందులో కొన్ని మిగిలియుండగా, సమీపించి యీ ప్రచేతసులతో నిట్లనెను. లోకసంతాన కారణము వలన (లోకముల సంతానమునకు కారణమైనందున) వృక్షముల సమస్త ప్రయోజనమును జూచి ఓ రాజరూపులైన ప్రాచీన బర్హిషులారా! (అగ్ని స్వరూపులారా!) కోపమును వదలుడు. వృక్షములు భూమిలో (ప్రాణులను) జన్మింపజేయగలవు. ఓ అగ్ని - వాయువులారా! శమించుడు. రత్నము వంటిదై యుత్తమురాలైనది యీ వృక్షముల యొక్క కన్య. భవిష్యత్కాలమును దెలిసిన నేను (సోమరాజు) గోవులతో బెంచితిని. . ఈమె మారిషయను కన్య వృక్షములచేతనే నిర్మింపబడినది. సోమగర్భముతో వృద్ధిజెందిన యీ కన్య మీకు భార్యయగుగాక. మీ యొక్క సగము తేజము చేతను నాయొక్క సగము తేజము తోను ఈ మారిషయందు విద్వాంసుడైన దక్షుడను ప్రజాపతి జనించును. ఆ దక్షప్రజాపతి ఈ మిక్కిలి దగ్గమైన భూమిని మీ తేజముతో నిండిన అగ్నితో అగ్నిసముడై ప్రజలను వృద్ధి జెందింపగలడు. తరువాత సోముని మాట వలన నా ప్రచేతసులు కోపమునుపసంహరించి, వృక్షముల కొఱకై వాటి కన్యయైన మారిషయను కన్యను పత్నిగా గ్రహించిరి. తరువాత వారు మారిషయందు గర్భమును ధరింపజేసిరి. పదుగురైన ప్రచేతసుల వలన మారిషయందు సోమునియొక్క యంశచే వీర్యవంతుడును మహాతేజస్వియునైన దక్షుడను ప్రజాపతి జనించెను. దక్షుడు మొదట మానస సృష్టిగా కొందరిని సృష్టించి తరువాత మైథునముతో సృష్టించెను. దక్షుడు అచరులను (నడవలేనివారిని), చరులను (నడువగలవారిని), రెండు కాళ్లు గల మానవాదులను, నాలుగు కాళ్లు గల పశ్వాదులను, మనస్సుతో సృష్టించెను. తరువాత (వాని) స్త్రీలను సృష్టించెను. ఆ దక్షుడు యమధర్మరాజునకు పదిమంది స్త్రీలను, కాశ్యపునకు పదముగ్గురు స్త్రీలను, కాలమును నడుపుటలో సమర్థులైన యిరువది యేడుగురు స్త్రీలను చంద్రునకును ఇచ్చి తక్కిన నలుగురు స్త్రీలను అరిష్టనేమికిని ఇద్దరిని బాహుపుత్రునకును, ఇద్దరిని అంగిరసునకును, ఒక్కరితను కృశాశ్వు భార్యలుగా నిచ్చెను. వారి వల్ల గలిగిన సంతానమును వినుడు. ఇచట ఆఱవదియైన చాక్షుష మన్వంతరము క్షీణిఁ ఏడవదైన వైవస్వత మన్వంతరములోని యేడవ ప్రజాపతికి సంబంధించినది ప్రారంభమగును: ఆ దక్షకన్యలందు దే ఖగములు, గోవులు, నాగులు, దితిజులైన దైత్యులు, దనువునకు బుట్టిన దానవులు, గంధర్వులు, అప్సరసలును బుట్టిరి. ఇతర జాతులు గూడ బుట్టినవి. అప్పటినుండి యీ లోకమున సంతానము మైథునము వల్ల గలిగినదేయయ్యెను. పూర్వుల సృష్టి సంకల్పము వల్లను, దృష్టివల్లను, స్పర్శవల్లను కలుగుచుండెడిదని చెప్పబడినది.

ఋషయ ఊచుః :-

దేవానాం దానవానాం చ దేవర్షీణాం చ తే శుభః

 సంభవః కఠితః పూర్వం దక్షస్య చ మహాత్మనః

ప్రాణాత్ప్రజా పతేర్జన్మ దక్షస్య కథితం త్వయా

కథం ప్రాచేతసత్వం చ పునర్లేభే మహాతపాః 

 ఏతన్నః సంశయం సూత వ్యాఖ్యాతుం త్వమిహార్హసి

స దౌహిత్రశ్చ సోమశ్చ కథం శ్వశురతాం గతః     

ఋషులనిరి :

పూర్వము దేవతల యొక్కయు, దానవుల యొక్కయు, దేవర్షుల యొక్కయు, నీయొక్కయు మహాత్ముడైన, దక్షుడైన దక్షుని యొ సంభవము (పుట్టుక) చెప్పబడినది. ప్రాణము నుండి దక్ష ప్రజాప్రజాపతి పుట్టుక యని నీ చేత చివరకు చెప్పబడినది. మహాతపసి అతడు మరల ప్రచేతస పుత్రత్వము నెట్లు పొందెను? ఇది మా సందేహము. ఓ సూతా! ఈ విషయమున వివరించి చెప్పదగు ఆ పుత్రిపుత్రుడైన సోముడు మామయెట్లయ్యెను? 

సూత ఉవాచ :-

ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యం భూతేషు సత్తమాః

 ఋషయోఽత్ర న ముహ్యంతి విద్యావంతశ్చ యే నరాః

యుగేయుగే భవంత్యేతే సర్వే దక్షాదయో ద్విజాః

 పునశ్చైవ నిరుధ్యంతే విద్వాంస్తత్ర న ముహ్యతి

 జ్యేష్ఠ్యం కానిష్ఠ్యమ ప్యేషాం పూర్వం నాసీద్ద్విజోత్తమాః

తప ఏవ గరీయోఽ భూత్ ప్రభావశ్చైవ కారణమ్

ఇమాం విసృష్టిం యో వేద చాక్షుషస్య చరాచరమ్

ప్రజానామా యురుత్తీర్ణః స్వర్గలోకే మహీయతే

ఏష సర్గః సమాఖ్యాతశ్చాక్షుషస్య సమాసతః

 ఇత్యేతే షడ్విసర్గా హి క్రాంతి మన్వంతరాత్మనా

 స్వాయంభుపాద్యాః సంక్షేపాచ్చాక్షుషాంతా యథాక్రమమ్

ఏతే సర్గా యథాప్రజ్ఞం ప్రోక్తా వై ద్విజసత్తమాః

వైవస్వతనిసర్గేణ తేషాం జ్ఞేయస్తు విస్తరః

అనంతా నాతిరిక్తాశ్చ సర్వే సర్గా వివస్వతః

 ఆరోగ్యాయు ష్ప్రమాణేన ధర్మతః కామతోఽర్థతః

 ఏతానేవ గుణాతి యః పఠత్యన సూయకః

 వైవస్వతస్య వక్ష్యామి సాంప్రతస్య మహాత్మనః

సమాసాద్వ్యాసతః సర్గం బ్రువతో మే నిబోధత

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే పృథువంశాను కీర్తనం నామ ద్వితీయోఽధ్యాయః      

సూతుడనెను :

ఓ మంచి పండితోత్తములారా! ప్రాణుల యందు ఉత్పత్తియు, వాని నిరోధమును, (మరణమును) నిత్యము జరుగుచుండ ఈ విషయమున ఋషులును విద్యావంతులైన నరులును మోహము జెందరు. దక్షాదులైన ద్విజులు వీరందరును ప్రతియుగ బుట్టుదురు. మరల గిట్టుదురు. విద్వాంసు లావిషయమున మోహము జెందరు, ఓ ద్విజోత్తములారా! పూర్వము వారిలో చిన్నల భేదము లేదు. ఇచట గొప్ప తపస్సు ప్రభావమును కారణముగా నుండెను. చాక్షుష మన్వంతరము యొక్క యీ చ? సృష్టిని దెలిసినవానికి ప్రజలకును ఆయువు తనయంతము దాటును. అతడు స్వర్గలోకమున గొప్పవాడై పూజింపబడును. మన్వంతరము యొక్క యీ సృష్టి సంగ్రహముగా జెప్పబడినది. ఈ విధముగా గడచిన మన్వంతరాత్మకములైన విసర్గలు (విసృష్టులు) ఆఱు - స్వాయంభువ మన్వంతరము మొదలు చాక్షుష మన్వంతరము వఱకు వరుసగా సంక్షేపముగా జెప్పబడినవి. ఓ బ్రాహ్మణ పండితోత్తములారా! నా ప్రజ్ఞననుసరించి యీ సృష్టులు చెప్పబడినవి. వైవస్వతమన్వంతరసృష్టితో వాని విస్తరము తెలియదగును. వివస్వతుని యొక్క సృష్టులన్నియు అనంతములు అతిరిక్తములు గానివియు (వేరుగా నుండనివియు) నైనవి. అసూయ లేక వీనిని పఠించువాడు ఆరోగ్యాయుః ప్రమాణమును బట్టి ధర్మార్థ కామములతో ఈ గుణములనే పొందును. ఇక ఇప్పటివాడైన గొప్పవాడైన వైవస్వతుని యొక్క సర్గమును (సృష్టిని) సంగ్రహముగను విస్తారముగను జెప్పెదను. నా నుండి వినుడు. 

ఇది శ్రీ వాయు మహాపురాణమున పృథువంశాను కీర్తనమను ద్వితీయాధ్యాయము సమాప్తము.