వాయు మహా పురాణము
43 - భువనవిన్యాసో
సూత ఉవాచ:-
గంధమాదనపార్శ్వే తు స్ఫీతాచోపరి గండికా ।
ద్వాత్రింశతం సహస్రాణి యోజనైః పూర్వపశ్చిమా ॥
అస్యాయామశ్చతు స్త్రింశత్ సహస్రాణి ప్రమాణతః ।
తత్ర తే శుభకర్మాణః కేతుమాలాః పరిశ్రుతాః ॥
తత్ర కాలా నరాః సర్వే మహాసత్త్వా మహాబలాః ।
స్త్రీయశ్చోత్పల పత్రాభాః సర్వాస్తాః ప్రియదర్శనాః ॥
సూతుడు పలికెను:- గంధమాదన పర్వతము ప్రక్కన ఒక విశాలమైన పై సందు గలదు. అది తూర్పుపడమలకు ముప్పది రెండువేల యోజనములు గలది-1. దీని పొడవు ముప్పది నాలుగువేలు (యోజనములు). అచట నుండి శుభకర్మలు చేయువాడు కేతుమాలులని ప్రసిద్ధి జెందిరి-2. అచట మానవులందరు నల్లనివారు గొప్పతేజము బలము గలవారు. స్త్రీలు కూడ నల్లకలువ రేకుల కాంతి కలవారు. వారందరు చూడదగిన యందగత్తెలు-3.
తత్ర దివ్యో మహావృక్షః పనసః షడ్రసాశ్రయః ।
ఈశ్వరో బ్రహ్మణః పుత్రః కామచారీ మనోజవ: ॥
తస్య పీత్వా ఫలరసం జీవన్తి హి సమాయుతమ్॥
అచట షడ్రసముల కాశ్రయమైన ఒక గొప్ప పనస చెట్టు గలదు. (అదివారు) బ్రహ్మ కుమారుడ(లగు) ఈశ్వరుడు దానిఫలరసమును ద్రాగి మనోవేగము గలిగి స్వేచ్చగా చరించువాడ(ర)యి పదికాలసంవత్సరములు జీవించును(తురు). దాని ఫలరసమును ద్రాగి (వారు) కలిసి జీవింతురు-4.
పార్శ్వే మాల్యవతశ్చాపి పూర్వే పూర్వా తు గండికా ।
ఆయామతోఽథ విస్తారాద్యథైతా పరగండికా ॥
భద్రాశ్వాస్తత్ర విజ్ఞేయా నిత్యం ముదిత మానసాః ।
భద్రం సాలవనం తత్ర కాలామ్రాశ్చ మహాద్రుమాః ॥
తత్ర తే పురుషాః శ్వేతా మహాసత్వా మహాబలాః ।
స్త్రియః కుముదవర్ణాభాః సుందర్యః ప్రియదర్శనాః ॥
చంద్రప్రభాశ్చంద్ర వర్ణాః పూర్ణచంద్ర నిభాననాః ।
చంద్రశీతల గాత్రాశ్చ స్త్రియశ్చోత్పల గంధికాః ॥
దశవర్ష సహస్రాణి తేషామాయుర్ని రామయమ్ ।
కాలామస్య రసం పీత్వా సర్వదా స్థిరమౌవనాః ॥
మాల్యవత్పర్వతము యొక్క ప్రక్కన గూడ తూర్పున తూర్పుగా సందు కలదు. దాని పొడవు వెడల్పులు పడమటి సందునకున్నంతటివే-5, అచట నుండి వారు భద్రాశ్వులుగా తెలియవలెను. వారునిత్యము సంతుష్టమనస్కులు. అచట భద్రమను సాల(మద్ది) వృక్షముల వనము గలదు. నల్లని మామిళ్ళు అచటి మహావృక్షములు-6, అటనుండు పురుషులు శ్వేత (తెలుపు) వర్ణము గలవారు. మహాతేజో బలసంపన్నులు. స్త్రీలు తెల్ల కలువల కాంతి కలవారు. సుందరులు చూడదగినవారు-7. చంద్రకాంతిగలిగి చంద్రవర్ణములు గలిగి చంద్రునివంటి ముఖము గలవారు చంద్రుని వలె చల్లనైన యా స్త్రీలు కలువ వాసనలు గలవారు-8. వారి యాయువు రోగములు లేక పదివేలయేండ్లు నల్లమామిడి పండ్ల రసము ద్రాగి వారెప్పుడును స్థిరమైన (ముసలితనమురాని) యౌవనము గలవారు-9.
ఋషయ ఊచు:-
ప్రయాణం వర్ణమాయుశ్చ యాథాతథ్యేన కీర్తితమ్ ।
చతుర్ణామపి ద్వీపానాం సమాసాన్నతు విస్తరాత్ ॥
సూత ఉవాచ:-
భద్రాశ్వానాం యథాచిహ్నం కీర్తితం కీర్తివర్ధనాః ।
తచ్చృణుధ్వం తు కార్త్స్యైన పూర్వసిద్ధై రుదాహృతమ్॥
దేవకూటస్య సర్వస్య ప్రధితస్యేహ యత్పరమ్ ।
పూర్వేణ దిక్షు సర్వాసు యథావచ్చ ప్రకీర్తితమ్ ।
కులాచలానాం పంచానాం నదీనాం చ విశేషతః ।
తథా జనపదానాం చ యథాదృష్టం యథాశృతమ్ ॥
శైవాలో, వర్ణమాలాగ్రః కోరంజశ్చాచలోత్తమః ।
శ్వేత వర్ణశ్చ, నీలశ్చ పంచైతే కులపర్వతాః ॥
తేషాం ప్రసూతిరన్యేపి పర్వతా బహువిస్తరాః ।
కోటికోటిః క్షితౌజ్ఞేయాః శతశోఽథ సహస్రశః॥
తైర్విమిశ్రా జనపదై ర్నానాసత్త్వ సమాకులాః ।
నానాప్రకార జాతీయాస్త్వనేక నృపపాలితాః ॥
నాయధేయైశ్చ విక్రాన్తైః శ్రమద్భిః పురుషర్షభైః ।
అధ్యాసితా జనపదాః కీర్తనీయాశ్చ శోభితాః ॥
ఋషులనిరి:- నాలుగు ద్వీపములయొక్క ప్రమాణము, వర్ణము (రంగు) ఆయువు, ఉన్నది యున్నట్లుగా (నిజముగా) జెప్పబడినది. సంగ్రహముగా కాని విస్తరముగా కాదు-10.
సూతుడనెను:- ఓ కీర్తివర్ధనలారా! ఏది పూర్వసిద్ధులచేత కీర్తింపబడి యుదాహరింప (చెప్పు) బడినదో ఆ భద్రాశ్వుల చిహ్నములను సంగ్రహముగా వినుడు. అది (భద్రాశ్వ దేశము)-11. ప్రసిద్ధమైన సమస్తదేవకూట పర్వతమునకు పరముగా తూరుపు దిక్కుగా అన్ని దిక్కులయందున్నట్లు చెప్పబడినది-12. కులాచలముల యొక్కయు, విశేషించి నదుల యొక్కయు జనపదములు (దేశముల) యొక్కయు, విశేషించి నదుల యొక్కయు, జనపదముల (దేశముల) యొక్కయు స్వరూపము చూచిన రీతిగను విన్నరీతిగను చెప్పబడినది-13. శైవాలము వర్ణమాలాగ్రము కోరంజము, శ్వేతవర్ణము, నీలము అనునీ యైదు కులపర్వతములు-14, వాని (నుండి బుట్టిన) సంతానమైన యితర పర్వతములు బహువిస్తరములై నూర్ల కొలదియు వేలకొలదియు నైన కోటి కోటుల భూమియందు గలవని తెలియవలెను-15. అవి జనావాస దేశములలో (జనపదములలో) కలసి యనేక ప్రాణులతో వ్యాకులమై అనేకవిధముల జాతులుగలవై యనేక రాజులచే పరిపాలింపబడినవి-16. పరాక్రమవంతులై శ్రీమంతులైన పురుష శ్రేష్ఠులచే నివసింపబడిన యా జనపదములు కీర్తనీయములుగా ప్రకాశించినవి-17.
తేషాం తు నామధేయాని రాష్ట్రాణి వివిధాని చ ।
గిర్యంతరనివిష్టాని సమేషు విషమేషు చ ॥
తథా సుమంగలాః శుద్ధాశ్చంద్ర కాంతాః సునందనాః ।
వ్రజకా నీలశైలేయాః సౌవీరా విజయస్థలాః ॥
మహాస్థలాః సుకామాశ్చ మహాకేశాః సుమూర్థజాః ।
వాతరంహాః సోపసంగా పరివాయాః పరాచకాః ॥
సంభాషకా మహానేత్రాః శైవాలాస్తనపా స్తథా ।
కుముదాః శాకముండాశ్చ ఉరః సంకీర్ణభౌమకాః ॥
సోదకా వత్సకాశ్చైకే వారాహార వాయకాః ।
శంఖాఖ్య భావిసంద్రాశ్చ ఉత్తరా హైమ భౌమకాః ॥
కృష్ణ భౌమాః సుభౌమాశ్చ మహాభౌమాశ్చ కీర్తితాః ।
ఏతే చాన్యే చ విఖ్యాతాః నానాజన పదామయా ॥
సమ స్థానముల యందును విషమ స్థానములందును గిరుల మధ్యలో నివేశించిన వివిధములైన రాష్ట్రములు వాని యొక్క పేరులను వినుడు-18. అట్లే సుమంగళములు, శుద్ధములు, చంద్రకాంతములు, సునందనములు, ప్రజకములు, నీలశైలేయములు, సౌవీరములు, విజయస్థలములు-19, మహాస్థలములు, సుకామములు మహాకేశములు సుమార్థజములు, పాంతరంహములు, సోపసంగములు, పరివాయములు, పరావాచకములు-20, సంభాషకములు, మహానేత్రములు, శైవాలములు, స్తనపములు, కుముదములు, శాకముండములు, ఉరః సంకీర్ణభౌమకములు-21. శంఖాఖ్యములు, భావిసంద్రములు, ఉత్తరములు, హైమ భౌమకములు, కృష్ణ భౌమములు, సుభౌమములు, మహాభౌమములు అని యివియు, మరి యితరములు ఐన జనపదములు అనేకములు నా చేత చెప్పబడినవి-22,23. (పై పౌరులు బోగికార్థములతో ఆ జనపదముల యొక్కయు. అందు నివసించు వారియొక్కయు విశేషములను జెప్పుచున్నవి. యథాసంభవముగా గమనింపదగినవి.)
తే పిబన్తి మహాపుణ్యాం మహాగంగాం మహానదీమ్ ।
ఆదౌ త్రైలోక్య విఖ్యాతా శీతా శీతాంబు వాహినీ ॥
తథా చ హంసవసతిర్మహాచక్రా చ నిమ్నగా ।
చక్రా వక్రా చ కాంచీ చ సురసా చాపగోత్తమా ॥
శాఖావతీ చేంద్రనదీ మేఘామంగా వాహినీ ।
కావేరీ హరితోయా చ సోమవార్తాశత ప్రదా॥
వనమాలా వసుమతీ పంపా పంపావతీ శుభా ।
సువర్ణా పంచవర్ణా చ తథా పుణ్యా వపుష్మతీ ॥
మణివ్రతా సు వప్రాచ బ్రహ్మభాగా శిలాశినీ ।
కృష్ణతోయా చ పుణ్యోదా తథానాగపదీ శుభా॥
శైవాలినీ మణికటాక్షా రోదా చారుణావతీ ।
తథా విష్ణుపదీ చైవ మహాపుణ్యా మహానదీ ॥
హిరణ్య వాహినీలా చ స్కందమాలా సురావతీ ।
నామోదా చ పతాకా చ వేతాలీ చ మహానదీ ॥
ఏతా గంగా మహానద్యో నాయికాః పరికీర్తితాః ।
క్షుద్రనద్యస్త సంఖ్యాతాః శతశోఽథ సహస్రశః ॥
పూర్వీ ద్వీపస్య వాహిన్యః పుణ్యవత్యశ్చ కీర్తితాః ।
కీర్తనేనాపి చై తాసాం పూతః స్యాదితి మే మతి ॥
ఆ జనపద వాసులు మహాపుణ్యయై మహా గంగయైన మహానదిని (జలమును) తాగుదురు. మొదట ముల్లోకముల బ్రసిద్ధి చెందినదియు చల్లనిదియు చల్లనీటిని బ్రవహించునదియు నైనది-24. అట్లే హంసవసతి, మహాచక్ర, వక్ర కాంచీ సురస, (అను నదులు)-25, శాఖావతీ, ఇంద్ర నదీ, మేఘా, మంగారవాహినీ, కావేరీ, హరితోయా, సోమవార్తా, శతప్రదా-26, వనమాలా, వసుమతీ, పంపా, పంపావతీ, సువర్ణా, పంచవర్ణా పుణ్యా వపుష్మతీ-27, మణీ వ్రతా, సువప్రా, బ్రహ్మభాగా, శిలాశినీ కృష్ణతోయా, పుణ్యోదా, నాగపదీ, శైవాలినీ, మణితలూ, క్షారోదా, అరుణావతీ, విష్ణుపదీ, మహాపుణ్యా-29, హిరణ్యవాహీ, నీలా స్కందకూలా సురావతీ, వామోదా, పతాకా, వేతాలీ ఇవి గంగా మహానదులు నాయికలుగా పరిగణింపబడినవి. చిన్న నదులు, పుణ్యవతులుగా జెప్పబడినవి. ఈ నదులు కీర్తించుట (పలుకుట) చేతగూడ మానవుడు పవిత్రుడగునని నా తలంపు -32.
సమృద్ధ రాష్ట్రం స్ఫీతం చ నానాజన పదాకులమ్ ।
నానావృక్షవనోద్దేశం నానానగసు వేష్టితమ్॥
నరనారీ గణాకీర్ణం నిత్యం ప్రముదితం శివమ్ ।
బహుధాన్య ధనో పేతం నానానృపతి పాలితమ్ ॥
తస్మిన్ దేశే సమాఖ్యాతా హేమశంఖదల ప్రభాః ।
మహాకాయా మహావీర్యాః పురుషాః పురుషర్షభాః ॥
సంభాషణం దర్శనం చ సమస్థానోప సేవనమ్ ।
దేవైః సహ మహాభాగాః కుర్వతే తత్ర వై ప్రజాః ॥
దశవర్ష సహస్రాణి తేషామాయుః ప్రకీర్తితమ్ ।
ధర్మాధర్మ విశేషశ్చ న తేష్వస్తి మహాత్మసు ।
అహింసా సత్యవాక్యం చ ప్రకృత్యైవ హి వర్తతే ॥
తే భక్త్యా శంకరం దేవం గౌరీం పరమ వైష్ణవీమ్ ।
ఇజ్యా పూజ్య నమస్కారాంస్తాభ్యాం నిత్యం ప్రయుంజుతే ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామ త్రిచత్వారింశోఽధ్యాయః ॥
అది సమృద్ధమైన రాష్ట్రము. విశాలమైనది. అనేక జనపదములుండు దేశములచే వ్యాకులమైనది. అనేక వృక్షములు వనములును గల ఉన్నత దేశము. అనేక పర్వతములతో చక్కగా జుట్టబడినది-33. పురుష స్త్రీ గుణములచే వ్యాపించినది. నిత్యము సంతుష్టమైనది. మంగళమైనది. అనేక ధాన్యములచే ధనములచేతను గూడినది. అనేక రాజులచే పరిపాలింపబడినది 34. అట్టి దేశమున బంగారు వర్ణము గలవారును, శంఖపు చిప్పలవలే తెల్లని వర్ణము గలవారును, మహాకాయులును, మహావీర్యులునునైన పురుషులు పురుష శ్రేష్ఠులుగా జెప్పబడిరి-35. అచట ప్రజలు మహాభాగ్యవంతులై దేవతలతో గూడ సంభాషణమును దర్శనమును, సమస్థానమున గూర్చుండుట మొదలగు గౌరవములను బొందుచుండిరి-36. వారి యాయువు పదివేల యేండ్లుగా జెప్పబడినది. ఆ మహాత్ములయందు ధర్మాధర్మ భేదము లేదు. అహింస, సత్యవచనము వారిలో సహజముగనే యుండినది-37. వారు దేవుడగు శంకరునకును పరమ వైష్ణ వియగు (విష్ణు సహోదరియగు) గౌరికిని యాగపుజానమస్కారములను నిత్యమును జేయుదురు-38.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబది మూడవ యధ్యాయము-43.