వాయు మహా పురాణము
36 - భువనవిన్యాసో
సూత ఉవాచ:-
తేషాం చతుర్ణాం వక్ష్యామి శైలేంద్రాణాం యథాక్రమమ్ ।
అనుబంధాని రమ్యాణి సర్వకాలర్తుకాని చ ॥
సారికాభిర్మ యూరైశ్చ చక్రైశ్చ మదోత్కటైః ।
శుకైశ్చ భృంగరాజైశ్చ చిత్రకైశ్చ సమన్తతః ॥
జీవం జీవకనాదైశ్చ హేమకానాం చ నాదితైః ।
మత్తకోకిల నాదైశ్చ వల్లూనాం చ నినాదితైః ॥
సుగ్రీవ కాంచనరవైః కలవింకరు తైస్తథా ।
కూజితాంతర శబ్ధైశ్చ సురమ్యాణి చ సర్వశః ॥
మదోత్కటైశ్చ మధురైః భ్రమరైశ్చ మహాలసైః ।
ఉపగీత వనాంతాని కిన్నరైశ్చ క్వచిత్క్వచిత్॥
పుష్పవృష్టిం విముంచంతి మందమారుత కంపితాః ।
తరవో యత్ర దృశ్యంతే చారుపల్లవ శోభితాః ॥
స్తబికైర్మం జరీభిశ్చ తామ్రైః కిసలయైస్తథా ।
మందవాత వశాల్లోలై ర్ధోలాయద్భిర్యుతాని చ ॥
నానాధాతు విచిత్రైశ్చ కాంతరూపైః శిలాశతైః ।
శల్లైఃక్వచిద్ద్విజశ్రేష్ఠా విన్యస్తై శోభితాని చ ॥
దేవదానవ గంధర్యై ర్యక్షరాక్షస పన్నగైః ।
సిద్ధాప్సరో గణేశ్చైవ సేవితాని తతస్తతః ॥
సూతుడనెను:- వరుసగా నా నాలుగు పర్వత రాజముల యొక్క మనోహరములైన యనుబంధ ప్రదేశము చెప్పెదను. అవి సర్వకాలములు (భూత భవత్- భవిష్య) సర్వఋతువులు సమముగా గలవి. అనగా నాయా ఋతుచిహ్నములగు పూవులుగలవీ-1. గోరువంకలు, నెమళ్లు, చకోరములు, మదించిన చిలుకలు, గండు తుమ్మెదలు, చిత్రములైన యితరపక్షులు వీనిచే నంతట ప్రకాశించు చుండును-2. వెన్నెల పురుగుల నాదములు, హేమక (బంగారువన్నె) పక్షుల నాదములు, మదించిన కోకిలనాదములు, మేకపోతుల నాదములు-3. చక్కని కంఠములు గల కాంచన పక్షుల నాదములు, ఊరబిచ్చుకల నాదములు, తక్కిన ప్రాణుల. కూతలనాదములు- వీనిచే నంతట మనోహరమైనవై యుండును-4. ఒక్కొక్క చోట మదముచే విజృంభించి మధురములై యలసతోనున్న తుమ్మెదల యొక్కయు, ఒక్కొక్క చోట కిన్నెరుల యొక్కయు గానములచే నిండి వనాంతములు ఉపగానము జేసినవి-5. అందమైన చిగురాకులతో నొప్పిన తరువులు పిల్లవాయువులతో కదల్చబడి పుష్పవర్షమును గురియుచున్నవి-6. పిల్లవాయువులతో కదలుచు ఊగుచున్న యెఱ్ఱని చివురాకుల తోను పూలగుత్తుల తోను ఆ వృక్షములు కూడియున్నవి-7. ఓ బ్రాహ్మణ శ్రేష్టులారా! ఒకచోట అనేక ధాతువులచే చిత్రమై మనోహరముగానుంచబడిన నూర్లకొలది శిలలచే శోభితములై యున్నవి-8. దేవదానవ-గంధర్వ-యక్ష- రాక్షస - పన్నగులచేతను, అప్సరోగణములచేతను సేవింపబడినవి-9.
మనోహరాణి చత్వారి దేవాక్రీడన కాన్యథ ।
చతుర్దిశ ముదారాణి నామ్నా శృణుత తాని యే ॥
పూర్వం చైత్రరథం నామ దక్షిణం నందనం వనమ్ ।
వైభ్రాజం పశ్చిమం విద్యాదుత్తరం సవితుర్వనమ్ ॥
మహావనేషు చైతేషు నివిష్టాని యథాక్రమమ్ ।
అనుబంధాని రమ్యాణి విహంగైః కూజితాని చ ॥
వనైర్విస్తీర్ణ తీర్థాని మహాపుణ్యవనాని చ ।
మహా నాగాధి వాసాని సేవితాని మహాత్మభిః॥
సురసా మలతో యాని శివాని సుసుఖాని చ ।
సిద్ధదేవాసుర వరైదుపస్పృష్ట జలాని చ ॥
ఛత్రప్రమాణైణెర్విక చైర్మహాగంధై ర్మనోహరైః ।
పుండరీకై ర్మహాపత్రైరుత్పలైః శోభితాని చ ॥
మహాసరాంసి చత్వారి తాని వక్ష్యామి నామతః ॥
తరువాత నచట మనోహరము లైన నాలుగు దేవతల ఉద్యానవనము లున్నవి. అవి నాలుగు దిక్కులతో విశాలముగా వ్యాపించి యున్నవి. వాని పేరులను వినుడు-10. తూర్పు దిక్కున నున్నది చైత్ర రథమను పేరు గలది. దక్షిణపుది నందన వనము పశ్చిమపుది వైభొజమనునది, ఉత్తరపుది సావిత్ర (సూర్యునిది) మనునది. ఈ విధముగా తెలియవలెను-11. ఈ మహావనములలో నున్న మనోహరములైన యనుబంధము వరుసగా నివి. పక్షుల కూతలు-12, వనములచే విస్తీర్ణములైన తీర్థములు, మహాపుణ్యములైన వనములు, గొప్పయేనుగలు, పాములు- వీనికి స్థానములు. మహాత్ములచే సేవింపబడిన ప్రదేశములు-13. మంచి రుచిగల నిర్మల జలములు- ఇవి మంగళములు సుఖకరములు ఉత్తములైన సిద్దులచేతను దేవతలచేతను అసురులచేతను స్నానము చేయబడినవి-14. ఛత్రము లంతటి ప్రమాణములు గలిగి, గొప్ప సువాసనలు గలిగి వికసించి విశాల దళములు గల మనోహరము లైన కమలముల చేతను కలువల చేతను ఆ జలములు శోభిల్లుచున్నవి. అట్టి జలములు గల మహాసరస్సులు నాలుగు గలవు, వాని పేరులను జెప్పెదను-15.
అరుణోదం సరః పూర్వం దక్షిణం మానసం స్మృతమ్ ।
సితోదం పశ్చిమసరో మహాభద్రం తథోత్తరమ్॥
అరుణోదం చ పూర్వేణ యే చ శైలాస్తతః స్మృతా ।
తాన్ కీర్తమానాం స్తత్త్వేన శృణుధ్వం విస్తరాన్మమ॥
సీతాంతశ్చ కుముంజుశ్చ సువీరశ్చాచలోత్తమః ।
వికంకో మణిశీల శ్చ వృషభశ్చాచ లోత్తమః ॥
మహానీలోఽ థరుచకః స బిందుర్మందరస్తథా ।
వేణుమాంశ్చ సుమేధశ్చ నిషధో దేవపర్వతః ॥
ఇత్యేతే పర్వతవరా అన్యేచ గిరయ స్తథా ।
పూర్వేణమందర స్యైతే సిద్ధావాసా ఉదాహృతాః ॥
తూర్పున అరుణోదయ (ఎఱ్ఱని నీరు గలది), దక్షిణమున మానసము, పశ్చిమమున సితోదము (తెల్లనీరుగలది), ఉత్తరమున మహాభద్రము- అను సరస్సులు గలవు, తూర్పుననున్న అరుణోదయ సరస్సు నుండి యేర్పడిన పర్వతము లెవ్వియో విస్తరముగా జెప్పెద వినుడు-17. సీతాంతము (చల్లని స్వభావము గలదియు) కుముంజము (గజిబిజిగానున్న ముంజుగడ్డి గలదియు), సువీరము (చక్కని వీరులుగలదియై సంవీరమను) ఒక పర్వతశ్రేష్ఠము. వికంకము (రాపులుగులు లేనిదియు)మణిశీలము (మణులే స్వభావమైనదియు) నైన వృషభమును-18. తరువాత నీలము (గొప్పనల్లనిదియు) రుచకము (మంగళద్రవ్యముగలదియు) సబిందువు (నీటిబొట్లుగలదియు) మందరము వేణమంతయు) వెదురు వృక్షములు గలదియు) సేమేధము (మంచి మేధాశక్తి గలవారుండునదియు) దేవపర్వతనీషధమనుపర్వతము-19. అనునీ పర్వత శ్రేష్ఠములును తక్కిన పర్వతములును మందరమునకు తూర్పుననున్నవై సిద్ధులకు ఆవాసములగా జెప్పబడినవి-20.
సరసో మానసస్యేహ దక్షిణా యే మహాచలాః ।
యే కీర్తితా మయా తే వై నామతస్తాన్ని బోధత ॥
శైలస్త్రీ శిఖరశ్చాపి శిశిరశ్చాచ లోత్తమః ।
కలింగశ్చ పతంగశ్చ రుచకశ్చైవ సానుమాన్ ॥
తామ్రాభశ్చ విశాఖశ్చ తథా శ్వేతోదరో గిరీః ।
సమూలో విషధారశ్చ రత్నధారశ్చ పర్వత ॥
ఏకశృంగో మహామూలో గజశైలః పిశాచకః ।
పంచశైలోఽథ కైలాసో హిమవాంశ్చాచ లోత్తమః
ఇత్యేతే దేవచరితా హ్యుత్కృష్టాః పర్వతోత్తమాః ।
దిగ్భాగే దక్షిణే ప్రోక్తా మేరోర మరవర్చసః ॥
మానస సరోవరము యొక్క దక్షిణ వైపున నున్న మహాపర్వతముల పేరులను వినుడు-21. మూడు శిఖరములుగల పర్వతము (త్రిశిఖరము)శిశిరము (చల్లనిది) అను పర్వత శ్రేష్ఠము, కలింగము, పతంగము, రుచకము, సానుమంతము-22. తామ్రాభము (రావిశ్రాంతిగలది), వీశాఖము, శ్వేతోదరము (తెల్లని మధ్యభాగము గలది), సమూలము, విషధారము, రత్నధారము-23, ఏకశృంగము, మహామూలము, గజశైలము, పిశాచకము. పంచశైలము, కైలాసము, పర్వత శ్రేష్టమైన హిమవంతము-24. అనునవి దేవతలు నడచిన యుత్కృష్టములైన పర్వతశ్రేష్ఠములు దివ్యతేజముగల మేరుపర్వతముయొక్క దక్షిణ దిగ్భాగమున నున్నవి-25.
అపరేణ సితోదస్య సరసో ద్విజసత్తమాః ।
ఉత్తమా యే మహాశైలాస్తాన్ ప్రవక్ష్యే యథాక్రమమ్॥
సువక్షాః శిఖిశైలశ్చ కాలో వైదూర్యపర్వతః ।
కపిలః పింగలో రుద్రః సురసశ్చ మహాచలః ॥
కుముదో మధుమాంశ్చైవ అంజనీ ముకుటస్తథా ।
కృష్ణశ్చ పాండరశ్చైవ సహస్ర శిఖరశ్చ హ॥
పారియాత్రశ్చ శైలేంద్ర స్త్రీశృంగశ్చాచలోత్తమః ।
ఇత్యేతే పర్వతవరా దిగ్భాగే పశ్చిమే స్మృతాః॥
ఓ బ్రాహ్మణోత్తములారా! సితోద సరస్సు యొక్క పశ్చిమమున నున్న ఉత్తమములైన మహాశైలమును వరుసగా జెప్పెదను-26. సువక్షము, శిఖిలము, కాలము, వైదూర్యము, కపిలము, పింగలము, రుద్రము, సురసము-27. కుముదము, మధుమంతము- అంజనీమకుటము, కృష్ణము, పాండరము, సహస్రశిఖరము-28. పారియాత్రము, త్రిశృగంము అనునవి పశ్చిమ పర్వతోత్తమములుగా జెప్పబడినవి-29.
మహాభద్రస్య సరస ఉత్తరేణాపి శ్రీమతః ।
యే మయా పూర్వతః ప్రోక్తాః స్తాన్వదిష్యే యథాక్రమమ్॥
శంకుకూటో మహాశైలో వృషభో హంసపర్వతః ।
నాగశ్చ కపిలశ్చైవ ఇంద్రశైలశ్చ సానుమాన్ ॥
నీలః కనకశృంగశ్చ శతశృంగశ్చ పర్వతః ।
పుష్పకో మేఘశైలశ్చ విరాజశ్చాచలోత్తమః ॥
జారుధిశ్చైవ శైలేంద్ర ఇత్యేతే ఉత్తరాః స్మృతాః ॥
ఏతేషాం శైలముఖ్యానామంతరేషు యథాక్రమమ్ ।
స్థల్యోహ్యంత ద్రోణ్యశ్చ సరాంసి చ నిబోధత ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామ షట్త్రింశోఽధ్యాయః ॥
శోభావంతమైన మహాభద్ర సరస్సు నకుత్తరమున నున్న పర్వతములను పూర్వము జెప్పిన వానిని వరుసగా జెప్పెదను 30. శంకుకూటము, మహాశైలము, వృషభము, హంస పర్వతము, నాగము కపిలము, ఇంద్రశైలము సానుమంతము-31. నీలము, కనకశృంగము, శతశృంగము, పుష్పకము. మేఘశైలము, విరాజము, జారుధి, అనునవి పర్వతశ్రేష్ఠములు ఇవి యుత్తరపర్వతములనబడినవి-32. ఈ ప్రధానశైలముల మధ్యనున్న స్థలులు (మెట్టునేలలు), (ద్రోణులు (పసులు మేయుకంచెలు- కొండపల్లములు) సరస్సులును వరుసగా వినుడు-33.
ఇది శ్రీ వాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను ముప్పది యాఱవ యధ్యాయము 36.