వాయు మహా పురాణము
22 - కల్పసంఖ్యానిరూపణం
ఋషయ ఉవాచ:-
అత్యద్భుత మిదం సర్వం కల్పానాంతే మహామనే ।
రహస్యం వై సమాఖ్యాతః మన్త్రాణాం చ ప్రకల్పనమ్ ॥
న తవావిదితం కించిత్ త్రిషు లోకేషు విద్యతే ।
తస్మాద్విస్తరతః సర్వాః కల్పసంఖ్యా బ్రవీహి నః ॥
వాయురువాచ:-
అత్ర వదః కథయిష్యామి కల్పసంఖ్యాం యథాతథా ।
యుగాగ్రం చతువర్షాగ్రం బ్రహ్మణః పరమేష్ఠినః ॥
ఏకం కల్పసహస్రం తు బ్రహ్మణోఽబ్దః ప్రకీర్తితః ।
ఏతదష్టసహస్రన్తు బ్రహ్మణస్తద్యుగం స్మృతమ్ ॥
ఏకం యుగసహస్రం తు సవనం తత్ ప్రజాపతేః ।
సవనానాం సహస్రంతు ద్విగుణం త్రివృతం తథా॥
బ్రహ్మణః స్థితికాలస్య తత్ సర్వం ప్రకీర్తితం ।
తస్య సంఖ్యాం ప్రవక్ష్యామి పరస్తాద్యై యథాక్రమమ్ ॥
ఓ మహామునీ ఇది యంతయు అత్యద్భుతమైనది. ఈ కల్పముల యొక్క రహస్యము మన్తముల యొక్క ప్రకల్పమున్ను మీకు చక్కగా జెప్పబడినది-1. ముల్లోకములో నీకు దెలియనిదేమియు లేదు. కావున విస్తారముగా మాకు సమస్త కల్ప సంఖ్యలను జెప్పుము-2.
వాయువు పలికెను:- ఇట ఉన్నది యున్నట్లు కల్పసంఖ్యను జెప్పబోవుచున్నాను. అట్లే పరమేష్ఠియైన బ్రహ్మయొక్క యుగాగ్రమును వర్షాగమును జెప్పెదను-3. ఒక వేయి కల్పములు బ్రహ్మయొక్క అబ్దము (సంవత్సరము) అనబడును. ఎనిమిదివేల యబ్దములు బ్రహ్మయొక్క యుగము అనబడును-4. వేయు యుగములు బ్రహ్మకు ఒక్క సవనము వేయు. సవనములు ద్విగుణము (రెట్టింపు) అట్లే త్రివృతము (మూడింతలు) (?) ఇదియంతయు బ్రహ్మయొక్క స్థితి కాలమునకు సంబంధించినదిగా జెప్పబడినది. ముందు వరుసగా దాని సంఖ్యను జెప్పుదును-5, 6.
అష్టావింశతిర్యేకల్పానామతః పరీకీర్తితాః ।
తేషాం పురస్తాద్వక్ష్యామి కల్పసంజ్ఞాని యథా క్రమమ్॥
రథన్తరస్య సామ్నస్తు ఉపరిష్టాన్ని బోధత ।
కల్పాన్తే నామధేయాని మన్త్రోత్పత్తిశ్చ యస్య యా ॥
ఏకోనవింశకః కల్పో విజ్ఞేయః శ్వేతలోహితః ।
యస్మింస్తత్పరమధ్యానం ధ్యాయతో బ్రహ్మణస్తథా॥
శ్వేతోష్ణీశః శ్వేతమాల్యః శ్వేతాంబరధరః శిఖీ ।
ఉత్పన్నస్తు మహతేజాః కుమారః పావకోపమః ॥
భీమం ముఖం మహారౌద్రం సుఘోరం శ్వేతలోహితమ్ ।
దీప్తం దీప్తేన వపుషా మహాస్యం శ్వేతవర్చసమ్॥
తం దృష్ట్వా పురుషః శ్రీమాన్ బ్రహ్మా వై విశ్వతోముఖః ।
కుమారం లోకధాతారం విశ్వరూపం మహేశ్వరమ్ ॥
పురాణ పురుషం దేవం విశ్వాత్మా యోగినాం చిరమ్ ।
వవన్దే దేవదేవేశం బ్రహ్మలోక పితామహః ॥
హృది కృత్వా మహాదేవం పరమాత్మానమీశ్వరమ్ ।
సద్యోజాతం తతో బ్రహ్మ బ్రహ్మవై సమచిన్తయత్॥
జ్ఞాత్వా ముమోచ దేవేశో హృష్ణో హాసం జగత్పతిః ॥
పేరులతో జెప్పబడిన ఇరువది యెనిమిది కల్పములలో ముందుగా వరుసగా కల సంజ్ఞను (కల్పమను పేరును) జెప్పెదను-7. రథస్తరసామము యొక్క పైన కల్పాక్షమున నామధేయములు వాని నుండి బుట్టిన మనోత్పత్తియు వినుడు 8. పందొమ్మిదవ కల్పము శ్వేతలోహితమని తెలియవలె. దానిలో పరమధ్యానమును జేయుచున్న బ్రహ్మను వేడి-9, తెల్లని శిరోవేష్టనము (తలపాగా) గలవాడు, తెల్లని పూలమాలలు గలవాడు, తెల్లని వస్త్రములు ధరించిన సిగగలవాడు అగ్నితోబోలి మహాతేజోమంతుడైన కుమారుడు బుట్టెను-10. భయంకరమైన ముఖముగలవాడు. మహారౌద్రుడు, చక్కని ఘోర (భయంకర) రూపుడు, తెలుపు ఎఱుపు రంగుగలవాడు, ఉజ్వలమైన శరీరముతో మహోజ్జలుడును. విశాలమైన నోరు గలవాడును, తెల్లని కాంతిగలవాడు-11. అయిన ఆతనిని శ్రీమంతుడును విశ్వమంతటను ముఖములు గలవాడు పురుషుడును అయిన బ్రహ్మ చూచెను ఆతడు లోకసష్ట విశ్వరూపుడు మహేశ్వరుడు-12. పురాణ పురుషుడు. దేవుడు అట్టి దేవదేవేశుని యోగులకు విశ్మాత్ముడైనవాడు. పితామహుడు అయిన బ్రహ్మ చాలకాలము ననుసరించెను-13. ఆ తరువాత బ్రహ్మ మహాదేవుడు పరమాత్మ ఈశ్వరుడు సద్యోజాతుడైన పరబ్రహ్మను హృదయమున నిలిపి, ధ్యానించేను. దేవేశుడైన జగత్పతి యీశ్వరుని దెలిసికొని సంతసించి నవ్వెను-14.
తతోఽస్య పార్శ్వఽతః శ్వేతా ఋషయో బ్రహ్మవర్చసః ।
ప్రాదుర్భూతా మహాత్మానః శ్వేతమాల్యానులేపనాః ॥
సుదన్దో నన్దకశ్చైవ విశ్వనన్దో ఽథ న్ధనః ।
శిష్యాస్తే వై మహాత్మాయైస్తున బ్రహ్మ తతో వృతమ్ ॥
తస్యాగ్రీశ్వేతవర్ణాభం శ్వేతనామా మహామునిః ।
విజజ్ఞేధ మహాతేజాయ స్మాజ్జజ్ఞే నరస్త్య సౌ ॥
తత్ర తే ఋషయ సర్వే సద్యో జాతం మహేశ్వరమ్ ।
తస్మాద్విశ్వేశ్వరం దేవం యే ప్రపశ్యన్తి వై ద్విజాః ।
ప్రాణాయామపరాయుక్తా బ్రహ్మణి వ్యవసాయినః ॥
తే సర్వేపాపనిర్ముక్తా విమలా బ్రహ్మవర్చసః ।
బ్రహ్మలోకమతిక్రమ్య బ్రహ్మలోకం వ్రజన్తి చ ॥
ఆ తరువాత బ్రహ్మయొక్క ప్రక్క భాగము నుండి బ్రహ్మవర్చస్సుగల శ్వేతులను ఋషులు పుట్టిరి. ఆ ఋషులు మహాత్ములు, తెల్లని పుష్పమాలలను ధరించిన వారు. తెల్లని మైపూత (గంధము) బూసికొన్నవారు-15. సుదన్దుడు, నన్దకుడు, విశ్వనస్తుడు, తరువాత నన్దనుడు అను వారు శిష్యలైన మహాత్ములు వారిచేత బ్రహ్మ (పరబ్రహ్మ జ్ఞానము) వరింపబడినది 16. ఆ బ్రహ్మయొక్క ముందర తెల్లని కాంతి గల శ్వేతుడను పేరుగల మహాముని పుట్టెను. అతడు మహా తేజస్కుడు. అతని నుండి యీ నరుడు పుట్టెను-17. అచట ఆ ఋషులందరు సద్యోజాతుడయిన మహేశ్వరుని చూచిరి. కావున దేవుడైన విశ్వేశ్వరుని జూచిన బ్రాహ్మణులు అందరు ప్రాణాయామపరులై యోగధారణబేసినవారై, పరబ్రహ్మయందు ప్రయత్నశీలురై-18, పాప నిర్ముక్తులయి మలము లేనివారై, బ్రహ్మ తేజోవంతులై బ్రహ్మ లోకమును దాటి పరబ్రహ్మలోకమును జేరుదురు-19.
వాయురువాచ:-
తతస్త్రింశత్తమః కల్పోరక్తానామ ప్రకీర్తితః ।
రక్తో యత్రమహాతేజాః రక్తవర్ణమధారయత్॥
ధ్యాయతః పుత్రకామస్య బ్రహ్మణం పరమేష్ఠినః ।
ప్రాదుర్భూతో మహాతేజాః కుమారో రక్తవిగ్రహః ॥
రక్తమాల్యాంబరధరో రక్త నేత్రః ప్రతాపవాన్ ॥
వాయువు పలికెను:- ఆ తరువాత ముప్పదియవ కల్పము రక్తమని చెప్పబడినది. అచట రక్తుడు. మహాతేజస్కుడై రక్తవర్ణమును ధరించేను-20. ఆ తరువాత పుత్రుని గోరి పరమేష్టియైన బ్రహ్మధానము జేసెను. ధ్యానించుచున్న యాతని నుండి రక్త (ఎర్రని) ఆకారముగల మహాతేజస్వియైన కుమారుడు పుట్టెను. అతడు ఎఱ్ఱని మాలలను ఎఱ్ఱని వస్త్రములను దరించి మిక్కిలి ప్రతాపవంతుడయ్యెను-21.
స తు దృష్ట్యా మహాదేవం కమారం రక్తవాససమ్ ।
ధ్యానయోగం పరం గత్వా బుబుధే విశ్వమీశ్వరమ్॥
స తు ప్రణమ్య భగవాన్ బ్రహ్మపరమమన్త్రితః ।
వామదేవం తతో బ్రహ్మ బ్రహ్మాత్మకం వ్యచిన్తయత్॥
ఏవం ధ్యాతో మహాదేవో బ్రహ్మణా పరమేష్ఠినా ।
మనసా ప్రీతియుక్తేన పితామహమథా బ్రవీత్ ॥
ధ్యాయతా పుత్రకామేన యస్మాత్తేహం పితామహః ।
దృష్టః పరమయా భక్త్యా ధాన్యయోగేన సత్తమ ॥
తస్మాద్ధ్యానం పరం ప్రాప్య కల్పేకల్పే మహాతపాః ।
వేత్స్యసే మాం మహాసత్త్వ లోకధాతారమీశ్వరమ్ ॥
ఏవముక్త్యా తతః శర్వః అట్టహాసం ముమోచ హ ॥
తత్తస్య మహాత్మానశ్చత్వారశ్చ కుమారకాః ।
సంబభూవుర్మహాత్మానో విరేజుః శుద్ధబుద్ధయః ॥
విరజశ్చ వివాహశ్చ విశోకో విశ్వభావనః ।
బ్రహ్మణ్యా బ్రహ్మణస్తుత్యావీరా అధ్యవసాయినః ॥
రక్తాంబరధరాః సర్వే రక్తమాల్యానులేపనాః ।
రక్తభస్మానులిప్తాంగా రక్తాస్యారక్తలోచనాః ॥
బ్రహ్మ కుమారుడైన యెఱ్ఱని వస్త్రములు ధరించిన మహాదేవుని జూచెను. వెంటనే పరమధ్యానయోగమును బొంది విశ్వమునీశ్వరునిగా తెలిసికొనెను (విశ్వేశ్వరుని దెలిసికొనెను)-22. భగవంతుడైన బ్రహ్మ పరమమునందే మనస్సును నిలిపినవాడై యా మహాదేవునకు నమస్కరించెను. తరువాత బ్రహ్మ వామదేవుని (శివుని) బ్రహ్మాత్మకుగా విశ్లేషించి ధ్యానించెను. 23. ఈ విధము పరమేష్టియైన బ్రహ్మచే ధ్యానింపబడిన మహాదేవుడు సంతోషముతో గూడిన మనస్సుతో బ్రహ్మదేవునితో నిట్లనెను-24. ఓ సత్తమా నీకు పితామహుడను (తండ్రియైన తాతను) అయినందున పుత్రిని గోరి పరమభక్తితో ధ్యానయోగముతో చూడబడితిని-25. కావున పరమధ్యానమును బొంది ప్రతి కల్పమున మహాతపస్వివై లోకప్రష్టను, మహాసత్త్యుడను, ఈశ్వరుడనగు నన్ను తెలిసికొనగలవు. ఈ విధముగా జెప్పిన తరువాత శర్వుడు (శివుడు) పెద్ద నవ్వునవ్వెను- 26. తరువాత ఆ శర్వునకు నలుగురు మహాత్ములు కుమారులుగా బుట్టిరి. ఆ మహాత్ములు శుద్ధబుద్దులై ప్రకాశించిరి-28. వారందరు ఎఱ్ఱని వస్త్రములు ధరించినవారు. ఎఱ్ఱని మాలలు మైపూతలు గలవారు. ఎఱ్ఱని భస్మమును బూసికొన్న అంగములు గలవారు. ఎఱ్ఱని ముఖము, ఎఱ్ఱని కండ్లు గలవారు-29.
తతో వర్షసహస్రాన్తే బ్రహ్మణ్యా వ్యవసాయినః ।
గుణన్తశ్చ మహాత్మానో బ్రహ్మ తద్వామదైవకమ్ ॥
అనుగ్రహార్థం లోకానాం శిష్యాణాం హితకామ్యయా ।
ధర్మోపదేశమఖిలం కృత్వాణి తే బ్రాహ్మణాః స్వయమ్॥
యేఽపిచాన్యే ద్విజశ్రేష్ఠా యుంజానా మమీశ్వరమ్ ।
ప్రపద్యన్తి మహాదేవం తద్భక్తాస్తత్పరాయణాః ॥
తే సర్వే పాపనిర్ముక్తా విమలా బ్రహ్మవర్చసః ।
రుద్రలోకం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే కల్పసంఖ్యా నిరూపణం నామ ద్వావింశోఽధ్యాయః ॥
ఆ తరువాత వేయి సంవత్సరముల చివర బ్రహ్మహితులై ప్రయత్నశీలురైన యా మహాత్ములు ఆ వామదేవ (శివ) సంబంధమైన బ్రహ్మను శబ్దములతో జెప్పుచుండిరి-30. లోకానుగ్రహమునకై శిష్యహితమును గోరి యా బ్రాహ్మణులు స్వయముగా ధర్మోపదేశములను సమస్తమును జేసిరి. తరువాత వెంటనే మరల నాశములేని ధర్మోపదేశములను సమస్తమును జేసిరి. తరువాత వెంటనే మరల నాశములేని యా రుద్రునిలో బ్రవేశించిరి-31. తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులు గూడ వామదేవుడైన యీశ్వరుని యోగధారణముచేయుచున్న వారై తద్భక్తులై తత్పరాయణులై మహాదేవుని (శివుని) బొందుచున్నారు-32. వారందరు పొపములవీడినవారై విమలురై బ్రహ్మతేజముగలవారై పునరావృత్తిలేని రుద్రలోకమును బొందగలరు-33.
ఇది వాయు మహాపురాణమున కల్పసంఖ్యా నిరూపణమను ఇరువది రెండవ యధ్యాయము 22