1 - ఉత్తరార్థము - పృథివీదోహనమ్

వైశంపాయన ఉవాచ :-

క్రమం మన్వంతరాణాం తు జ్ఞాతుమిచ్ఛామి తత్త్వతః

 దైవతానాం చ సర్వేషాం యే చ యస్యాంతరే మనోః

సూత ఉవాచ :-

మన్వంతరాణాం యాని స్యురతీతానాగతాని హ

 సమాసాద్విస్త రాచ్చైవ బ్రువతో వై నిబోధత

 స్వాయంభువో మనుః పూర్వం మనుః స్వారోచిషస్తథా

 ఔత్తమస్తామ సశ్చైవ తథా రైవతచాక్షుషౌ

షడేతే మనవోఽ తీతాః వక్ష్యామ్యష్టావ నాగతాన్

వైశంపాయునుడు ఇట్లనెను :

మన్వంతరములను యథార్థముగా దెలియ గోరుచున్నాను. మన్వంతరములో నున్న దేవతలందరి క్రమమును గూడ దెలియ గోరుచున్నాను.

సూతుడు ఇట్లనెను :

 భూత - భవిష్యత్మన్వంతరము లెన్ని యుండునో వానిని విస్తరముగను సంగ్రహముగను చేప్పెదను వినుడు. పూర్వము స్వాయంభువ మనువు, స్వారోచిషమనువు, ఔత్తమమనువు, తామసమనువు, రైవతమనువు, చాక్షుషమనువు - అను నారుగురు మనువులు గడచిపోయిరి. ఇక భవిష్యత్మనువుల ఎనమండుగురిని గూర్చి చెప్పెదను.

సావర్ణాః పంచ రౌచ్యశ్చ, భౌత్యో వైవస్వతస్తథా

 వక్ష్యామ్యేతాన్ పురస్తాత్తు మనోర్వైవస్వతస్య హా

 మనవః పంచ యేఽ తీతాః మానవాం స్తాన్ని బోధత

మన్వంతరం మయా చోక్తం క్రాంతం స్వాయంభువస్య హ

సావర్ణమనువు లైదుగురు. రౌచ్యమనువు, భౌత్యమనువు, వైవస్వతమనువు అని వారెన మండుగురు. వీరిని గూర్చి చెప్పెదను. ముందు గతించిన వైవస్వత మనువుల నైదుగురిని గూర్చి ఆ మానవులను (మనువు నుండి బుట్టిన వానిని) గూర్చి వినుడు. నాచే జెప్పబడిన స్వాయంభువ మన్వంతరము క్రాంతమైనది (గడిచినది).

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి మనోః స్వారోచిషస్య హ

 ప్రజాసర్గం సమా సేన ద్వితీయస్య మహాత్మనః

 ఆసన్ వై తుషితా దేవా మనుస్వారోచిషేంఽతరే

పారావతాశ్చ విద్వాంసో ద్వావేవ తు గణౌ స్మృతౌ

 తుషితాయాం సముత్పన్నాః క్రతోః పుత్రాః స్వరోచిషః

 పారావతాశ్చ శిష్టాశ్చ ద్వాదశౌ తౌ గణౌ స్మృతౌ

 ఛందజాశ్చ చతుర్వింశద్దేవాస్తే వై తదా స్మృతాః

ధైవస్యశోఽథ వామాన్యో గోపా దేవాయతస్తథా

 అజశ్చ భగవాన్ దేవో దురోణశ్చ మహాబలః

ఆపశ్చాపి మహాబాహుర్మహోజాశ్చాపి వీర్యవాన్

 చికిత్వాన్నిభృతో యశ్చ అంశో యశ్చైవ పఠ్యతే

ఇత్యేతే క్రతుపుత్రాస్తు తదాసన్ సోమపాయినః

ప్రాచేతాశ్చైవ యో దేవో విశ్వేదేవాస్తథైవ చ

 సమంజో విశ్రుతో యశ్చ అజిహ్మశ్చారి మర్దనః

అజిహ్మాన మహీయాణౌ విద్యావంతౌ, తథైవ చ

 అజోషౌ చ మహాభాగౌ యవీయశ్చ మహాబలః

 హోతా యజ్వా చ ఇత్యేతే పరాక్రాంతాః పరావతాః

 ఇత్యేతా దేవతా హ్యాసన్ మనుస్వారోచి షేంతరే

సోమపాస్తు తదా హ్యేతాశ్చతుర్వింశతి దేవతాః

 తేషామింద్రస్తదా హ్యాసీద్యైధశ్చ లోకవిశ్రుతః

 ఊర్జో వసిష్ఠపుత్రస్తు స్తంభః కాశ్యప ఏవ చ

భార్గవశ్చ తదా ద్రోణో ఋషభోంఽగిరస స్తథా

 పౌలస్త్యశ్చైవ దత్తాత్రిరాత్రేయో నిశ్చలస్తథా

పౌలహస్య చ ధావాంస్తు ఏతే సప్తర్షయః స్మృతాః

 చైత్రః కవిరుతశ్చైవ కృతాంతో విభృతో రవిః

 బృహద్గుహో నవశ్చైవ సుతాశ్చైతే నవ స్మతాః

 మనోః స్వారోచిష స్యైతే పుత్రా వంశకరాః స్మృతాః

 పురాణే పరిసంఖ్యాతా ద్వితీయం చైతదంతరమ్

 సప్తర్షయో మనుర్దేవాః పితరశ్చ చతుష్టయమ్

మూలం మన్వంతర స్యైతే తేషాం చైవాంతరే ప్రజాః

 ఋషీణాం దేవతాః పుత్రాః పితరో దేవసూనవః

 ఋషయో దేవపుత్రాశ్చ ఇతి శాస్త్ర వినిశ్చయః

 మనోః క్షత్రం విశశ్చైవ సప్తర్షిభ్యో ద్విజాతయః

 ఏతన్మన్వంతరం ప్రోక్తం సమాసాన్నతు విస్తరాత్           

ఆ తరువాత మహాత్ముడైన రెండవ స్వారోచిష మన్వంతరము యొక్క ప్రజాసృష్టిని చెప్పబోవుచున్నాన స్వారోచిషమన్వంతరమున తుషితులు విద్వాంసులైన పార్వతులు. వీరు రెండేగణములని చెప్పబడిరి, క్రతువునకు తుషిత బుట్టినవారు స్వరోచిషులు పార్వతులును, తక్కినవారును పండ్రెండుగల రెండుగణములనబడిరి. ఛందమున( స్వేచ్ఛగా) బుజ్జి ఇరువది నాలుగు. వారపుడు దేవతలనబడిరి, ధైవస్యశుడు, వామాన్యుడు, గోపుడు, దేవాయతుడు, మహాబలుడు, మహాబ ఆపుడు, వీర్యవంతుడైన మహాబలుడు, చికిత్వంతుడు, నిభృతేయుడు, అంశోయుడు అను (పండ్రెండుగురు) పఠింపబడుచు వీరు క్రతువు యొక్క పుత్రులుగానపుడుండిరి. వారు సోమపాయులు (సోమమునుద్రావువారు). దేవుడైన ప్రచేతసుడు, విశ్వే: ప్రసిద్ధుడైన సమంజుడు, అరమర్దుడైన యజిహ్ముడు, విద్యావంతులైన అజిహ్మానుడును, మహీయానుడును, మహాభ యజోషులిరువురును, యవీయుడు, మహాబలుడు, హోతయు, యజ్వయు. వీరందరు పరాక్రమించిన పర్వతులు. వీరు సా మన్వంతరమున దేవతలుగా నుండిరట. అపుడీ యిరువది నలుగురు దేవతలు సోమపానము జేయువారు. అపుడు నింద్రుడుండెను. లోకప్రసిద్ధుడైన వైధుడు (విధికి సంబంధించినవాడు) గూడ నుండెను. వసిష్ఠపుత్రుడైన ఊర్జుడు, కాశ్య స్తంభుడు, భార్గవుడైన ద్రోణుడు, ఋషభుడైన అంగిరసుడు, పౌలస్త్యుడైన దత్తాత్రి, ఆత్రేయుడైన నిశ్చలుడు, పౌలహునీధావంత వీరు సప్తరులనబడినోరు. చైత్రుడు, కవి, ఉతుడు, కృతాంతుడు, విభృతుడు, రవి, బృహత్తు, గుహుడు, నపుడు తొమ్మండుగురు కుమారులనబడినారు. వీరు స్వారోచిష మనువు యొక్క వంశకరులైన పుత్రులనబడిరి. వీరు పురా? రు. ఇది రెండవ మన్వంతరము. సప్తర్వులు, మనువు, దేవతలు, పితరులును ఈ నలుగురు మన్వంతరం మూలము. వారియొక్క మధ్యన ప్రజలుందురు. ఋషులకు పుత్రులు దేవతలు, పితరులు దేవపుత్రులు, ఋషులు దేవపు - అని శాస్త్ర వినిశ్చయము. మనువు నుండి క్షత్రియులు వైశ్యులును బుట్టిరి. సప్తరుల నుండి బ్రాహ్మణులు బుట్టిరి. ఇది స మన్వంతరమని చెప్పబడినది. విస్తరముగా గాదు.

స్వాయంభువేన విస్తారో జ్ఞేయః స్వారోచిషస్య తు

 న శక్యో విస్తరస్తస్య వక్తుం వర్ష శతైరపి

పునరుక్త బహుత్వాత్తు ప్రజానాం వై కులే కులే

తృతీయస్త్వథ పర్యాయ ఔత్తమస్యాంతరే మనోః

పంచ చైవ గణాః ప్రోక్తాస్తాన్ వక్ష్యామి నిబోధత    

స్వాయంభువముతో స్వారోచిషము యొక్క విస్తారము తెలియదగినది. స్వారోచిషము యొక్క విస్తారము వందయేండ్లలో జెప్ప సాధ్యము గాడు. దానికి కారణము - ప్రతికులమున సంతానము యొక్క పునరుక్తి యెక్కువగానుండుట. తరువాత ! మనువు యొక్క పర్యాయము మూడవది. అందు ఐదే గణములు చెప్పబడినవి. వానిని జెప్పెద వినుడు.

సుధామానశ్చ దేవాశ్చ యే చాన్యే వశవర్తినః

 ప్రతర్దనాః శివాః సత్యా గణా ద్వాదశ వై స్మృతాః

 సత్యో ధృతిర్ధమో దాంతః క్షమః క్షామో ధృతిః శుచిః

 ఈషోర్జాశ్చ తథా జ్యేష్ఠో వపుష్మాంశ్చైవ ద్వాదశ

 సహస్రధారో విశ్వాత్మా శమితారో బృహద్వసుః

 విశ్వధా విశ్వకర్మా చ మనస్వంతో విరాడ్యశాః

జ్యోతిశ్చైవ విభావ్యశ్చ కీర్తిమాన్ వంశకారిణః

అన్యానారాధితో దేవో వసుధిష్ణా వివస్వసుః

 దినక్రతుః సుధర్మా చ ధృతవర్మా యశస్వినః

 కేతుమాంశ్చైవ ఇత్యేతే కీర్తితాస్తు ప్రమర్ధనాః

హంసస్వరోఽ హిహా చైవ ప్రతర్ద నయశస్కరౌ

 సుదానో వసుదానశ్చ సుమంజస విషావుభౌ

జంతు వాహయతిశ్చైవ సువిత్త సునయస్తథా

 శివా హ్యేతే తు విజ్ఞేయా యజ్ఞియా ద్వాదశాపరాః     

సుధాములు, దేవతలు, వశవర్తులైన మరికొందరు, ప్రతర్దనులు, శివులు, సత్యులు పండ్రెండు. గణములనబడినారు. సత్యుడు, ధృతి, దముడు, దాంతుడు, క్షముడు, క్షాముడు, ధృతి, శుచి, ఈషుడు, ఊర్జుడు, జ్యేష్ఠుడు, వపుష్మంతుడును ఈ పండ్రెండుగురు. ఇవ్వీరు పేరులతో చెప్పబడినవారు. సుధాములైతే పండ్రెండుగురు. సహస్రధారుడు, విశ్వాత్ముడు, శమితారుడు, బృహద్వసువు, విశ్వధుడు, విశ్వకర్మ, మనస్వంతుడు, విరాట్టు, యశుడు, జ్యోతి, విభావ్యుడు, కీర్తిమంతుడు, అన్యోనోరాధితుడగు దేవుడు, వసుధిష్ఠుడు, వివస్వసుడు, దినక్రతువు, సుధర్ముడు, ధృతవర్ముడు, యశస్వినులు, కేతుమంతుడు - అను వీరు ప్రమర్దనులని చెప్పబడినారు. హంసస్వరుడు, అహిహుడు, ప్రతర్దనుడు, యశస్కరుడు, సుదానుడు, వసుదానుడు, సుమంజసుడు, విషుడు, జంతువాహుడు, యతి, సువిత్తుడు, సునయుడు - శివులైన వీరు వేరుగా యజ్ఞయులైన పండ్రెండుగురు.

సత్యానామపి నామాని నిబోధత యథామతమ్

 దీక్పతిర్వాక్పతిశ్చైవ విశ్వః శంభుస్తథైవ చ

స్వమృడీకోఽధిపశ్చైవ వర్చోధా ముహ్యసర్వశః

వాసవశ్చ సదాశ్వశ్చ క్షేమానందౌ తథైవ చ

సత్యా హ్యేతే పరిక్రాంతా యజ్ఞియా ద్వాదశాపరాః

 ఇత్యేతే దేవతా హ్యాసన్నౌత్త మస్యాంతరే మనోః    

సత్యుల యొక్క పేరులను గూడ నిష్ణా పూర్వకముగా వినుడు. దికృతి, వాక్పతి, విశ్వుడు, శంభువు, సమృడీకుడు, అధిపుడు, వర్చోధుడు, ముహ్యసర్వశుడు, వాసవుడు, సదాశ్వుడు, క్షేముడు, ఆనందుడు - అను వీరు మరొక పండ్రెండుగురైన సత్యులుగా జెప్పబడినారు. వీరే ఔత్తమమన్వంతరమున దేవతలై యుండిరి.

అజశ్చ, పరశుశ్చైవ దివ్యో దివ్యౌషధిర్నయః

దేవానుజశ్చాప్రతిమో, మహోత్సాహౌ శిజస్తథా

 వినీతశ్చ సుకేతుశ్చ సుమిత్రః సుబలః శుచిః

ఔత్తమస్య మనోః పుత్రాస్త్రయోదశ మహాత్మనః

ఏతే క్షత్రప్రణేతార స్తృతీయం చైతదంతరమ్

ఔత్తమే పరిసంఖ్యాతః సర్గః స్వారోచిషేణ తు

విస్తరేణానుపూర్వ్యా చ తామసస్తాన్ని బోధత

చతుర్థే త్వథ పర్యాయే తామసస్యాంతరే మనోః

 సత్యాః స్వరూపాః సుధియో హరయశ్చతురో గణాః

పులస్త్యపుత్రస్య సుతాస్తా మసస్యాంతరే మనోః

 గణస్తు తేషాం దేవానామేకైకః పంచవింశకః

ఇంద్రియాణాం శతం యద్ధి మునయః ప్రతిజానతే

సత్యప్రాణాస్తు శీర్షణ్యాస్త మశ్చైవాష్ట మస్తథా

ఇంద్రియాణి తథా దేవా మనోస్తస్యాంతరే స్మృతాః

తేషాం చ ప్రభుదేవానాం శిబిరింద్రః ప్రతాపవాన్

 సప్తర్షయోంతరే చైవ తాన్ని బోధత సత్తమాః

కావ్యో హర్షస్తథా చైవ కాశ్యపః పృథురేవ చ

 ఆత్రేయశ్చాగ్నిరిత్యేవ జ్యోతిర్ధామా చ భార్గవః

 పౌలహో వన పీఠశ్చ గోత్రే వాసిష్ఠ ఏవ చ

 చైత్రస్తథాపి పౌలస్త్య ఋషయస్తామ సేఽన్తరే

జనువండస్తథా శాంతిర్నరః ఖ్యాతిర్భయస్తథా

 ప్రియభృత్యో హ్యవక్షిశ్చ పృష్టలోడో దృఢోద్యతః

 ఋతశ్చ ఋతబంధుశ్చ తామసస్య మనోః సుతాః

 పంచమే త్వథ పర్యాయే మనోశ్చారిష్ణవేఽన్తరే

 గణాస్తు సుసమాఖ్యాతా దేవతానాం నిబోధత

అమృతాభా భూతరాజో వికుంఠాః ససుమేధసః

చరిష్ణోస్తు శుభాః పుత్రా వసిష్ఠస్య ప్రజాపతేః

చతుర్దశ చ చత్వారో గణా స్తేషాం తు భాస్వరాః

 స్వత్ర విప్రోగ్ని భాసశ్చ ప్రత్యేతిష్ఠా మృతస్తథా

 సుమతిర్వా విరావశ్చ వాచినోదః స్రవస్తథా

ప్రవిరాశీ చ వాదశ్చ ప్రాశశ్చేతి చతుర్ధశ

అమృతాభాః స్మృతా హ్యేతే దేవాశ్చారిష్ణవేఽ న్తరే

మతిశ్చ సుమతీశ్చైవ ఋతసత్యౌ తథైవ చ

ఆవృతిర్వి వృతిశ్చైవ మదో వినయ ఏవ చ

జేతా జిష్ణుః సహశ్చైవ ద్యుతిమాన్ స్రవసస్తథా

ఇత్యేతానీహ నామాని ఆభూతరజసాం విదుః

వృషభేత్తా జయో భీమః శుచిర్ధాంతో యశో దమః

 నాథో విద్వానజేయశ్చ కృశో గౌరో ధ్రువస్తథా

కీర్తితాస్తు వికుంఠా వై సుమేధాస్తు నిబోధత

మేధా మేధాతిథిశ్చైవ సత్యమేధా స్తథైవ చ

 పృశ్ని మేధాల్పమేధాశ్చ భూయోమేధాదయః ప్రభుః

 దీప్తిమేధా యశోమేధాః స్థిరమేథా స్తథైవ చ

 సర్వమేధాశ్వ మేధాశ్చ ప్రతిమేధాశ్చ యః స్మృతః

 మేధావాన్ మేధహర్తా చ కీర్తితాస్తు సుమేధసః

 విభురింద్రస్తదా తేషామాసీ ద్విక్రాంతపౌరుషః

 పౌలస్త్యో వేదబాహ్యశ్చ యజుర్నామా చ కాశ్యపః

హిరణ్య రోమాంగిరసో వేదశ్రీశ్చైవ భార్గవః

 ఊర్ధ్వబాహుశ్చ వాసిష్ఠః పర్జన్యః పౌలహస్తథా

సత్యనేత్రస్తథాఽఽత్రేయ ఋషయో రైవతాంతరే  

మహాపురాణ సంభావ్యః ప్రత్యంగపరహా శుచిః

 బలబంధుర్నిరామిత్రః కేతుభృంగో దృఢవ్రతః

 చరిష్ణవస్య పుత్రాస్తే పంచమం చైతదంతరమ్

అజుడు, పరశుడు, దివ్యుడు, దివ్యౌషధి, నయుడు, అప్రతీముడగు దేవానుజుడు, మహోత్సాహుడు, ఔశిజుడు, వి సుకేతుడు, సుమిత్రుడు, సుబలుడు, శుచి - ఈ పదముగ్గురు మహాత్ముడైన ఔత్తమ మనువు యొక్క పుత్రులు. వీరు క్ష (క్షత్రియజాతిని సృష్టించువారు. ఇది రెండవయంతరము. ఔత్తమ మన్వంతరమున స్వారోచిషునిచే జరిగిన సృష్టి పరిగణింప విస్తరముగను అనుపూర్వితోను తామసమన్వంతరము లోని వారలను వీనుడు. తరువాత నాలుగవ పర్యాయమైన మన్వంతరమున సత్యులు, స్వరూపులు, సుధీలు, హరులు - అను నాలుగు గణములుండినవి. తామసమన్వంతరమున పులస్త పుత్రులుండిరి. ఆ దేవతల గణమొక్కొకటి యిరువదియైదు గలది. నూరింద్రియములు దెలిసిన మునులు సత్య శీర్షణ్యులు (శిరస్థానీయులు). తమస్సు అను మనువు ఎనిమిదవవాడు. ఆ మన్వంతరమున (తామస మన్వంతరమున) ఇంద్రిం దేవతలనబడినారు. ప్రభుదేవులైన యవ్వారిలో శిబి ప్రతాపవంతుడైన యింద్రుడు. ఆ తామసమన్వంతరమున సప్తర్వు ఓ ఉత్తమ పండితులారా! వారిని వినుడు. కాశ్యపుడైన హరుడు, కాశ్యపుడైన పృథువు, ఆత్రేయుడైన అగ్ని, భార్గవుడైన జ్యోతి, పౌలహుడైన వనపీఠుడు, వాసిష్టుడైన గోత్రుడు, పౌలస్త్యుడైన చైత్రుడును తామస మన్వంతరమున ఋషులు. జనువ శాంతి, నరుడు, ఖ్యాతి, భయుడు, ప్రియభృత్యుడు, అవక్ష, పృష్టలోడుడు, దృఢద్యతుడు, ఋతుడు, ఋత బంధువును - వీరు మనువు యొక్క సుతులు. ఐదవ పర్యాయమున చారిష్ణవ మన్వంతరమున దేవతల యొక్క గణములు చక్కగా జెప్ప వానిని వినుడు. అమృతాభులు, భూతరాజులు, వికుంఠులు, సుమేధసులు - వీరు నాలుగు గణములుగా నున్నవారు. మనువు యొక్క మంగళకరులైన పుత్రులు. వసిష్ఠ ప్రజాపతియొక్క పుత్రులు పదునాలుగురు. వారి గణములు నాలు. అవి ప్రకాశవంతములు. స్వత్రవిప్రుడు, అగ్నిభాసుడు, అమృతుడు, సుమతి, వారుడు, విరవుడు, చినోదుడు, స్రవుడ ప్రవిరాశీ, పొదుడు, ప్రొశుడు - అను నీ పదునలుగురు చారిష్ణవ మన్వంతరమున అమృతాభులుగను దేవతలుగను జెప్పబడినా మతీ సుమతి, ఋతుడు, సత్యుడు, ఆవృతి, వివృతి, మదుడు, వినయుడు , జేత, జిష్ణువు, సహుడు, ధ్యుతిమంతుడు, - ఈ పేరులు ఆభూతరజసులవని యందురు, వృషభేత్త, జయుడు, భీముడు, శుచి, దొంతుడు, యశోదముడు, విద్వాంసుడు, అజేయుడు, కృశుడు, గౌరుడు, ధ్రువుడు - వీరు వికుంఠులనబడినారు. ఇక సుమేధసులను వినుడు. మేధాతిధి, సత్యమేధుడు, పృశ్నిమేధుడు, అల్పమేధుడు, భూయో మేధుడు మొదలగు వారును, ప్రభువు, దీప్తిమేధుడు, యశో స్థిరమేధుడు, సర్వమేధుడు, అశ్వమేధుడు, ప్రతిమేధుడు, మేధావంతుడు, మేధాహర్త - వీరు సుమేధసులుగ జెప్పబడినారు. అపుడు విక్రమించిన పౌరుషము గల యింద్రుడు వారికి ప్రభువుగా నుండెను. పౌలస్త్యుడైన వేదబాహుడును, కాశ్యపుడైన యజువనువాడును, అంగిరసుడైన హిరణ్యరోముడును, భార్గవుడైన వేదశ్రీయు, వాసిష్ఠుడైన ఊర్ధ్వబాహువును, పౌలహుడైన పర్జన్యుడును, ఆత్రేయుడైన సత్యనేత్రుడును - వీరు రైవతమన్వంతరమున ఋషులు. మహాపురాణ సంభావ్యుడు, ప్రత్యంగపరహుడు, శుచి, బలబంధువు, నిరామిత్రుడు, కేతుభృంగుడు, దృఢవ్రతుడు - వీరు చరిష్ణువునియొక్క పుత్రులు. ఇది యైదవ యంతరము.

 స్వారోచిషోత్తమశ్చైవ తామసో రైవతస్తథా

 ప్రియవ్రతాన్వయా హ్యేతే చత్వారో మనవస్తథా

 షష్ఠ ఖల్వథ పర్యాయే దేవా యే చాక్షు షేంఽతరే

 ఆద్యాః ప్రసూతా భావ్యాశ్చ పృథుకాశ్చ దివౌకసః

మహానుభావ లేఖాశ్చ పంచ దేవగణాః స్మృతాః

 దివౌకసః సర్గ ఏషః ప్రోచ్యతే మాతృనామభిః

అత్రేః పుత్రస్య నప్తార ఆరణ్యస్య ప్రజాపతేః

గణాశ్చ తేషాం దేవానామేకైకో హ్యష్టకః స్మృతః

 అంతరిక్షో వసుహయో హ్యతిథిశ్చ ప్రియవ్రతః

 శ్రోతా మంతా సుమంతా చ ఆద్యా హ్యేతే ప్రకీర్తితాః

 శ్యేన భద్రస్తథా పశ్యః పథ్యనేత్రో మహాయశాః

సుమనాశ్చ సువేతాశ్చ రైవతః సుప్రచేతసః

 ద్యుతిశ్చైవ మహాసత్త్వః ప్రసూతాః పరికీర్తితాః

విజయః, సుజయశ్చైవ మనోద్యానౌ తథైవ చ

 సుమతిః సుపరిశ్చైవ విజ్ఞాతోఽర్థపతిశ్చ యః

భావ్యా హ్యేతే స్మృతా దేవాః పృథుకాంస్తు నిబోధత

అజిష్టః శాక్యనో దేవో వానపృష్ఠ స్తథైవ చ

శాంకరః సత్యధృష్ణుశ్చ విష్ణుశ్చ విజయస్తథా

అజితశ్చ మహాభాగః పృథుకాస్తే దివౌకసః

లేఖాంస్తథా ప్రవక్ష్యామి బ్రువతో మే నిబోధత

మనోజవః ప్రవాసస్తు ప్రచేతాస్తు మహాయశాః

వాతో ధ్రువక్షితిశ్చైవ అద్భుతశ్చైవ వీర్యవాన్

 అవనో బృహస్పతిశ్చైవ లేఖాః సంపరికీర్తితాః  

స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు - అను నలుగురు ప్రియవ్రత వంశమునకు జెందిన మనువులు. ఆరవ పర్యాయమున చాక్షుష మన్వంతరమున వీరు దేవతలు. ఆద్యులు, ప్రసూతులు, భావ్యులు, పృథుకులు - మహానుభావులైన లేఖులును - అను నైదుగురు దేవగణములుగా జెప్పబడినారు. దేవతల యీ సర్గము మాతృనామములచే జెప్పబడును. అత్రియొక్క పుత్రుని మనుమలును, ఆరణ్య ప్రజాపతి యొక్క గణములును, వాని యొక్క దేవతలలో నొక్కొకడును అష్టకుడు (ఎనిమిది గలవాడు) అనబడినాడు. అంతరిక్షుడు, వసుహయుడు, అతిథియు, ప్రియవ్రతుడును, శ్రోతయు, మంతయు (మననము జేయువాడు), సుమంతయు . వీరు ఆద్యులనబడినారు. శ్యేనభద్రుడు, పశ్యుడు, పథ్యనేత్రుడు, మహాయశుడు, సుమనుడు, సువేతుడు, రైవతుడు, సుప్రచేతసుడు, ద్యుతి, మహాసత్వుడు - వీరు ప్రసూతులనబడినారు. విజయుడు, సుజయుడు, మనుడు, ఉద్యానుడు, సుమతి, సుపరి, అర్థపతియని తెలియబడినవాడును - వీరు భావ్యులను దేవతలు (గణము) గా జేష్పబడినారు. ఇక పృథుకులను వినుడు. అజిష్టుడు, శాక్యనుడు, దేవుడు, వానపృష్ఠుడును, శాంకరుడు, సత్యదృష్ణుడు, విష్ణువు, విజయుడు, మహాభాగ్యుడైన యజితుడునని - వీరు పృథుకులను దేవతలు. అట్లే లేఖులను గూర్చి చెప్పెదను వినుడు. మనోజవుడు, ప్రవాసుడు, మహాయశస్కుడైన ప్రచేతసుడు, వాతుడు, ధ్రువక్షితి, అద్భుతుడు, వీర్యవంతుడు, అవనుడు, బృహస్పతియు - వీరు లేఖులనబడినారు.

మనోజవో మహావీర్యస్తేషామింద్ర స్తదాఽ భవత్

 ఉన్నతో భార్గవశ్చైవ హవిష్మానంగిరః సుతః

సుధామా కాశ్య పశ్చైవ వాసిష్ఠో విరజస్తథా

అతిమానశ్చ పౌలస్త్యః సహిష్ణుః పౌలహస్తథా

 మధురాత్రేయ ఇత్యేతే సప్త వై చాక్షుషేంతరే

 ఊరుః పూరుః శతద్యుమ్నస్తపస్వీ సత్యవాక్ కృతిః

 అగ్నిష్టు దతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తే నవ

 అభిమన్యుశ్చ దశమో నాద్వలేయా మనోః సుతాః

 చాక్షుషస్య సుతా హ్యేతే షష్ఠం చైవ తదంతరమ్

వైవస్వతేన సంఖ్యాతస్తస్య సర్గో మహాత్మనః

విస్తరేణానుపూర్వ్యా చ కథితం వై మయా ద్విజాః  

అపుడు మహావీర్యుడైన మనోజవుడు వారికింద్రుడయ్యెను. భార్గవుడైన ఉన్నతుడు, అంగిరసుని సుతుడైన హవిష్మ, కాశ్యపుడైన సుధామ, వాసిష్ఠుడైన విరజుడు, పౌలస్త్యుడైన అతిమానుడు, పౌలహుడైన సహిష్ణువు, ఆత్రేయుడైన మధువ యేడుగురును చాక్షుష మన్వంతరములోని వారు. ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కృతి, అగి అతిరాత్రుడు, సుద్యుమ్నుడును - అను నీ తొమ్మండుగురు. పదియవ వాడగు అభిమన్యుడును వీరు నాద్వలేయులైన మనువు యొక్క సుతులు. ఇది యారవ మన్వంతరము. ఓ బ్రాహ్మణులారా! వైవస్వత మన్వంతరములోని యా మహాత వైవస్వతమనువు యొక్క సృష్టి ఆనుపూర్వి తోడను విస్తరముగను నాచే జెప్పబడినది.

ఋషయ ఊచుః :-

 చాక్షుషస్య తు దాయాదః సంభూతః కశ్యపాన్వయే

 తస్యాన్వవాయే యేప్యన్యే తన్నో బ్రూహి యథాతథమ్

 సూత ఉవాచ :-

చాక్షుషస్య నిసర్గం తు సమాసాచ్చ్రోతు మర్హథ

 తస్యాన్వవాయే సంభూతః పృథుర్వైన్యః ప్రతాపవాన్

 ప్రజానాం పతయశ్చాన్యే దక్షః ప్రాచేతసస్తథా

 ఉత్తానపాదం జగ్రాహ పుత్రమత్రిః ప్రజాపతిః

 దక్షకస్య తు పుత్రోఽస్య రాజా హ్యాసీత్ప్రజాపతేః

 స్వాయంభువేన మనునా దత్తోఽత్రేః కారణం ప్రతి

మన్వంతరం తథాసాద్య భవిష్యం చాక్షుషస్య హ

షష్ఠం తదను వక్ష్యామి ఉపోద్ఘాతేన వై ద్విజాః

ఉత్తాన పాదాచ్చతురా సూనృతా విత్తభావినీ

 ఉత్పన్నా చాధిధర్మేణ ధ్రువస్య జననీ శుభా

 ధర్మస్య పత్న్యాం లక్ష్మ్యాం వై ఉత్పన్నా సా శుచిస్మితా

 ధ్రువం చ కీర్తిమంతం చ అయుష్మంతం వసుం తథా

 ఉత్తానపాదోఽ జనయత్ కన్యే ద్వే చ శుచిస్మితే

 మనస్వినీం స్వరాం చైవ తయోః పుత్రాః ప్రకీర్తితాః

ధ్రువో వర్షసహస్రాణి దశ దివ్యాని వీర్యవాన్

 తపస్తే పే నిరాహారః ప్రార్థయన్ విపులం యశః

 త్రేతాయుగే తు ప్రథమే పౌత్రః స్వాయంభువస్య సః

 ఆత్మానం ధారయన్ యోగాత్ ప్రార్థయన్ సుమహద్యశః

 తస్మై బ్రహ్మా దదౌ ప్రీతో జ్యోతిషాం స్థానముత్తమమ్

 ఆభూతసంప్లవం హృద్యమస్తోదయ వివర్జితమ్

 తస్యాతి మాత్రమృద్ధిం చ మహిమానం నిరీక్ష్య హ

 దైత్యా సురాణమాచార్యః శ్లోకమప్యుశనా జగౌ

 అహోఽ స్య తపసో వీర్యమహో శ్రుత మహో హుతమ్

 స్థితాః సప్తర్షయః కృత్వా యదేనముపరి ధ్రువమ్

ధ్రువే దివం సమాసక్త మీశ్వరః స దివస్పతిః

 ధ్రువాత్పుష్టం చ భవ్యం చ భూమిః సా సుషువే నృపౌ

 స్వాం ఛాయామాహ వై పుష్టిర్భవ నారీ తు తాం విభుః

సత్యాభివ్యాహృతే తస్య సద్యః స్త్రీ సాఽభవత్తదా

దివ్యసంహననాచ్ఛాయా దివ్యాభరణ భూషితా

 ఛాయాయాం పుష్టిరాధత్త పంచపుత్రాన కల్మషాన్

ప్రాచీనగర్భం వృషకం వృకంచ వృకలం ధృతిమ్

 పత్నీ ప్రాచీనగర్భస్య భూవర్చా సుషవే నృపమ్

 నామ్నోదారధియం పుత్రమింద్రో యః పూర్వజన్మని

 సంవత్సర సహస్రాంతే సకృదాహార మాహరత్

ఏవం మన్వంతరం యుక్తమింద్రత్వం ప్రాప్తవాన్ విభుః

 ఉదారధీః సుతం భద్రాఽనయత్సా దివంజయమ్

 రిపుం రిపుంజయం జజ్ఞే వరాంగీ సా దివంజయాత్

 రిపోరాదత్త బృహతీ చాక్షుషం సర్వతేజసమ్

 వ్యజ్జనత్పుష్కరిణ్యాం వారుణ్యాం చాక్షుషో మనుమ్

 మనోరజాయంత దశ నద్వలాయాం శుభాః సుతాః

 కన్యాయాం వై మహాభాగ వైరాజస్య ప్రజాపతేః

 ఊరుః పూరుః శతద్యుమ్నస్తపస్వీ సత్యవాక్కవిః

 అగ్నిష్టు దతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తే నవ

 అభిమన్యుశ్చ దశమో నద్వలాయాం మనోః సుతాః

ఊరోరజనయత్పుత్రాన్ షడాగ్నేయీ మహాప్రభాన్

 అంగం సుమనసం స్వాతి క్రతుమంగిరసం శివమ్

అంగాత్ సునీథాపత్యం వై వేనమేకం వ్యజాయత

అపచారేణ వేనస్య ప్రకోపః సుమహానభూత్

 ప్రజార్థమృషయస్తస్య మమంధుర్దక్షిణం కరమ్

వేనస్య పాణౌ మథితే సంబభూవ మహాన్ నృపః

 వైన్యో నామ మహీపాలో యః పృథుః పరికీర్తితః

స ధన్వీ కవచీ జాత స్తేజసా ప్రజ్వలన్నివ

పృథుర్వైన్యః సర్వలోకాన్ రరక్ష క్షత్రపూర్వజః

రాజసూయాభి షిక్తానామాద్యః స వసుధాధిపః

 తస్య స్తవార్థముత్పన్నౌ నిపుణౌ సూతమాగధౌ

 తేనేయం గౌర్మహారాజ్ఞా దుగ్ధా సస్యాని ధీమతా

 ప్రజానాం వృత్తికామానాం దేవైః ఋషిగణైః సహ

 పితృభిర్దానవై శ్చైవ గంధర్వైరప్సరోగణైః

సర్యైః పుణ్యజనైశ్చైవ వీరుద్భిః పర్వతైస్తథా

 తేషు తేషు తు పాత్రేషు దుహ్యమానా వసుంధరా

 ప్రాదాద్యథేప్సితం క్షీరం తేన లోకాంస్త్వధారయత్  

ఋషులిట్లనిరి :

కశ్యపాన్వయమున చాక్షుషునకు దాయాదుడు పుట్టెను. ఆతని యొక్క వంశమున బుట్టిన యితరులను గూడ ఉన్నది యున్నట్లు మాకు జెప్పుము అనెను. దానికి సూతుడ నెను :- చాక్షుషుని సృష్టిని సంగ్రహముగా మీరు వినదగియున్నారు. అతని వంశమున ప్రతాపవంతుడైన వేనపుత్రుడైన పృథువు పుట్టెను. ఇతర ప్రజాపతులు గూడ బుట్టిరి. దక్షుడును ప్రాచేతసుడును బుట్టిరి. అత్రి ప్రజాపతి ఉత్తానపాదుని (తన) పుత్రునిగా స్వీకరించెను, ఈ దక్ష ప్రజాపతియొక్క పుత్రుడు రాజయ్యను. స్వాయంభువ మనువు చేత ఒక కారణమున అత్రికేయబడెను. ఓ బ్రాహ్మణులారా! చాక్షుషుని యొక్క రాబోవు మన్వంతరమును బొంది, దాని వెంటనే యారవదాని నుపోద్ఘాతముతో బాటు చేప్పేదను. ధర్మునీతో ధర్ముని పత్నియైన లక్ష్మియందు సూనృతురాలు, చతుర విత్తభావినీ, శుభయునైన శుచిస్మితయు, ధ్రువుని తల్లి జన్మించినది, ఆమె ఉత్తానపాదుని వలన ధ్రువుని, కీర్తిమంతుని, అయస్మంతునిని గనెను. అట్లే శుచిస్మితులైన మనస్విని స్వర - అను కన్యలను గూడ ఉత్తానపాదుడు గనెను. వారిరువురి పుత్రులు విశేషముగ కీర్తింపబడిరి. వీర్యవంతుడైన ధ్రువుడు పదివేల దివ్యవర్షములు విపులయశస్సును గోరుచు నిరాహారుడై తపము జేసెను. మొదటి త్రేతాయుగమున స్వాయంభువమనువు యొక్క పుత్రుడైన యాతడు సుమహాయశమును గోరుచు యోగముతో ఆత్మను ధరించెను. బ్రహ్మయాతనికి (ధ్రువునకు) జ్యోతిస్సులలో (వెలుగునట్టి నక్షత్రములలో) ఉత్తమస్థానము నిచ్చెను. అది మహాభూత ప్రళయము వరకైనను మనోహరమైనది. అస్తమయము గానీ, యుదయము గానీ లేనిది. ఆతని యొక్క మిక్కిలి యతిశయించిన సంపదను, మహిమను బాగుగా జూచి, దితి సుతులైన రాక్షసుల యాచార్యుడు శుక్రాచార్యుడు ఈ శ్లోకమును గానము జేసెను. ఏమీ! యీతని (ధ్రువుని) తపము యొక్క బలము. ఏమి యీతని శ్రుతము! వైదిక పాండిత్యము! ఏమి యీతని హుతము ! (హోమము జేసిన గొప్పతనము!, యజ్ఞము జేసిన ప్రభావము!) సప్తర్వులు ఈ ధ్రువుని తమ పైన నుంచుకొని యున్నారు. ధ్రువునియందు స్వర్గ (ఆకాశ) మంటియున్నది. ఆతడు ఈశ్వరుడు స్వర్గాధిపతియైన యింద్రుడును. ధ్రువుని వలన నొ భూమి పుష్టిని, భవ్యుని గనెను. వారిరువురు రాజులు. వీభువైన 'పుష్టి' తన ఛాయను నారి (స్త్రీ)వి గమ్మనెను. ఆతని సత్యవచనమున నపుడు ఆమె (ఛాయ నీడ) వెంటనే స్త్రీయయ్యెను. ఆమె దివ్యమైన శరీరచ్ఛాయ గలదియు, దివ్యమైన యాభరణములచే నలంకరింపబడినదియు నయ్యెను. 'పుష్టి' ఛాయయందు అకల్మషులైనయైదుగురు పుత్రులను గనెను. వారు ప్రాచీన గర్భుడు, వృషకుడు, వృకుడు, వృకలుడు, ధృతి - అనువారు. ప్రాచీన గర్భుని భార్య ‘వర్చ' ఒక రోజును గనెను. ఆతడు పూర్వజన్మలో ఇంద్రుడు, ఉదొరధీ అని పేరు. వేయి సంవత్సరముల చివర నాతడొక్కమారాహారమును దీసికొనెను. ఈ విధముగ నావిభుడు మన్వంతరము గూడిన యింద్రత్వమును బొందెను. భద్రయను నామె 'ఉదోరధీ' వలన ‘దివంజయు'ని గనెను. వరాంగి యను సొమే దివంజయుని వలన రిపుని, రిపుంజయుని గనెను. 'బృహతి' యను నామె రిపుని వలన సర్వతేజోవంతుడైన చాక్షుషుని గనెను. చాక్షుషుడు పొరుణ్యమైన 'పుష్కరిణి' యందు 'మనువు'ను గనెను. పుష్కరిణి మహాత్ముడైన యరణ్య ప్రజాపతి యొక్క పుత్రిక. ఓ మహాభాగా! మనువునకు వైరాజప్రజాపతి యొక్క కన్యయైన నద్వలయందు మంగళకరులైన పుత్రులు పదుగురు గలిగిరి. ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్ణుత్తు, అతి రాత్రుడు, సుద్యుమ్నుడును - అను తొమ్మండుగురును, అభిమన్యుడను పదవవాడును నద్వలయందు మనువునకు గలిగిన పుత్రులు. ఆగ్నేయి ఊరువు వలన మహాప్రభావంతులగు పుత్రులను గనెను. అంగుడు, సుమసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శివుడు అనువారు. అంగుని వలన సునీథ తమ సంతానముగా నొకనీ గనెను. వేనుని యొక్క అపచారము వలన సుమహత్తైన ప్రకోపము (జనులలో) గలిగెను. ఋషులు ప్రజకొఱకై య కుడిచేతిని మధించిరి. ఆ విధముగ వేనునీ చేయి మథింపబడగా దాని నుండి ఒక గొప్పరాజు పుట్టెను. అతడు వైన్యుడన ఆతడు పృథువని కూడ పిలువబడెను. ఆతడు తేజస్సుతో మండుచున్నవాని వలె నుండి ధనువును ధరించినవాడై కవ ధరించినవాడై పుట్టేను. క్షత్రియజాతికే మొదట పుట్టిన యావైన్యుడైన పృథువు సర్వలోకములను రక్షించెను. రాజసూయయ నాతడు మొదటిరాజు. అతనిని స్తుతించుటకై పుట్టిన నిపుణులు సూత - మాగధులు. వృత్తి కాములై - వ్యాపారకములైన ప్రజలయొక్క భూమియను నీ గోవు ఆధీమంతుడైన మహారాజు చేత దేవతలచేతను, ఋషిగణములచేత పంటలు పితుకబడినది. పితరుల చేతను, దానవుల చేతను, గంధర్వుల చేతను, అప్పరోగణములచేతను, యక్షులచేతన చేతను, పర్వతముల చేతను ఆయా పాత్రలలో పితుకబడుచున్న భూమి కోరినంతగా పాలనిచ్చెను. దానిచేత లోకములను ధ. "

ఋషయ ఊచుః :-

విస్తరేణ పృథోర్జన్మ కీర్తయస్వ మహామతే

యథా మహాత్మనా దుగ్ధా పూర్వం తేన వసుంధరా

 యథా దేవైశ్చ నాగైశ్చ యథా బ్రహ్మర్షిభిః సహ

 యథా యక్షైః సగంధర్వైరప్సరో భిర్యథా పురా

 తేషాం పాత్రవిశేషాంశ్చ దోగ్ధారం క్షీరమేవ చ

తథా వత్స విశేషాంశ్చ తన్నః ప్రబ్రూహి పృచ్ఛతామ్

 యస్మింశ్చ కారణే పాణిర్వేనస్య మథితః పురా

 క్రుద్ధైర్మహర్షిభిః పూర్వం తత్సర్వం కథయస్వ నః  

ఋషులిట్లనిరి :

ఓ మహామతీ! పృథుని జన్మను విస్తరముగా జెప్పుము. ఆ మహాత్మునిచే వసుంధర (భూమి) యే విధముగా బితుకః దేవతలచేతను, నాగులచేతను, బ్రహ్మర్షులచేతను, యక్షుల చేతను, గంధర్వులచేతను, అప్సరుల చేతను పూర్వము భూమి ఏవి బతుకబడినది? వారియొక్క పాత్ర విశేషములను, పితుకువారిని, పితికినపాలను, అట్లే వత్స (దూడ) విశేషములను అడుగుచున జెప్పుము. పూర్వము కోపించిన మహరులచేత ఏ కారణమున వేనుని చేయి మథింపబడినదో, యదియంతయు మాకు:.

సూత ఉవాచ :-

వర్ణయిష్యామి వో విప్రాః పృథోర్వైన్యస్య సంభవమ్

 ఏకాగ్రాః ప్రయతాశ్చైవ శుశ్రూషధ్వం ద్విజోత్తమాః

 నాశు చేర్నాపి పాపాయ నాశిష్యాయాహితాయ చ

 వర్ణయేయమిమం పుణ్యం నావ్రతాయ కథంచన

స్వర్గ్యం యశస్యమాయుష్యం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్

రహస్యమృషిభిః ప్రోక్తం శుృణుయాద్యోఽనసూయకః

 యశ్చేమం శ్రావయేన్మర్త్యః పృథోర్యైన్యస్య సంభవమ్

బ్రాహ్మణేభ్యో నమస్కృత్య న స శోచేత్ కృతాకృతమ్

గోప్తా ధర్మస్య రాజాఽ సౌ బభూవాత్రిసమః ప్రభుః

అత్రివంశ సముత్పన్నో హ్యంగో నామ ప్రజాపతిః

 యస్య పుత్రోఽ భవద్వేనో నాత్యర్థం ధార్మికస్తథా

 జాతో మృత్యుసుతాయాం వై సునీథాయాం ప్రజాపతిః

స మాతామహదో షేణ వేనః కాలాత్మజాత్మజః

 సధర్మం పృష్ఠతః కృత్వా కామాల్లోభే వ్యవర్తత

స్థాపనం స్థాపయామాస ధర్మా పేతం స పార్థివః

 వేదశాస్త్రాణ్యతిక్రమ్య హ్యధర్మే నిరతోఽ భవత్ 

 నిః స్వాధ్యాయవషట్కారాః ప్రజాస్తస్మిన్ ప్రశాసతి

 ఆసన్ న చ పపుః సోమం హుతం యజ్ఞేషు దేవతాః

 న యష్టవ్యం న హోతవ్యమితి తస్య ప్రజాపతేః

 ఆసీత్ప్రతిజ్ఞా క్రూరేయం వినాశే ప్రత్యుపస్థితే

అహమిజ్యశ్చ పూజ్యశ్చ సర్వయజ్ఞే ద్విజాతిభిః

 మయి యజ్జో విధాతవ్యో మయి హోతవ్యమిత్యపి

 తమతి క్రాంతమర్యాద మాదదానమ సాంప్రతమ్

ఊచుర్మహర్షయః సర్వే మరీచి ప్రముఖాస్తథా

 వయం దీక్షాం ప్రవేక్ష్యామః సంవత్సరశతాన్ బహూన్

 మాఽ ధర్మం వేన కార్షీస్త్వం నైష ధర్మః సనాతనః

నిధనే చ ప్రసూతోఽసి ప్రజాపతిర సంశయః

పాలయష్యే ప్రజాశ్చేతి త్వయా పూర్వం ప్రతిశ్రుతమ్

 తాంస్తథా వాదినః సర్వాన్ బ్రహ్మర్షీన బ్రవీత్తదా

 స ప్రహస్య తు దుర్బుద్ధిరిదం వచనకోవిదః

 స్రష్టా ధర్మస్య కశ్చాన్యః శ్రోతవ్యం కస్య వై మయా

 వీర్యశ్రుతతపః సత్యైర్మయా వా కః సమో భువి

 మహాత్మానమనూనం మాం యూయం జానీత తత్త్వతః

ప్రభవః సర్వలోకానాం ధర్మాణాం చ విశేషతః

ఇచ్ఛన్ ద హేయం పృథివీం ప్లావయేయం జలేన వా

 సృజేయం వా గ్రసేయం వా నాత్ర కార్యా విచారణా

 యదా న శక్యతే స్తంభాన్మానాచ్చ భృశమోహితః

 అనునేతుం నృపో వేనస్తతః క్రుద్ధా మహర్షయః

 నిగృహ్య తం మహాబాహుం విస్ఫురంతం యథాఽ నలమ్

 తతోఽ స్య వామహస్తం తే మమంథుః భృశకోపితాః

 తస్మాత్ప్రమథ్య మానాద్వై జజ్ఞే పూర్వమభిశ్రుతః

 హ్రస్వోఽ తిమాత్రం పురుషః కృష్ణశ్చాపి తథా ద్విజాః

 స భీతః ప్రాంజలిశ్చైవ స్థితవాన్ వ్యాకులేంద్రియః

 తమార్తం విహ్వలం దృష్ట్వా నిషీదేత్య బ్రువన్ కిల

 నిషాదవంశకర్తాఽసౌ బభూవానంత విక్రమః

ధీవరాన సృజత్సోపి వేనకల్మష సంభవాన్

యే చాఽన్యే వింధ్య నిలయాస్తుంబురా తువరాః ఖసాః

అధర్మరుచయశ్చాఽపి సంభూతా వేనకల్మషాత్      

సూతుడు అనెను :

ఓ విప్రులారా! వైన్యుడైన పృథువు యొక్క జననమును మీకు వర్ణించి చెప్పెదను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఏకాగ్రచిత్తులై పరిశుద్ధులై వినుడు. ఏవిధముగనై నను, అపవిత్రునకును, పాపికిని, శిష్యుడుగాని వానికిని, అహితునకును, వ్రతము లేనివానికిని పుణ్యమైన పృధు జన్మమును వర్ణించి చెప్పను. స్వర్గము నొసగునట్టిదియు, కీర్తినిచ్చునదియు, ఆయువు నొసంగునదియు, పుణ్యమై వేదములచే సమ్మతింపబడినదియు, రహస్యముగా ఋషులచే జెప్పబడినదియునైన యీ పృథుజన్మను అసూయ లేక యెవడు "వినునో! ఏ మానవుడైతే బ్రాహ్మణులకు నమస్కరించి యీ పృథుజన్మను (ఇతరులకు వినిపించునో! వారు కృతాకృతములను (చేసిన పాపములను చేయని పుణ్యములను) గూర్చి దుఃఖింపడు. ధర్మ రక్షకుడైన యీ రాజు అత్రితో సముడైన ప్రభువుగా నుండెను. అత్రి వంశమున అంగుడను ప్రజాపతి జన్మించెను. వేనుడాతనికి పుత్రుడు. ఆతడు తండ్రి వలె మిక్కిలి ధార్మికుడు గాకుండెను. ఆ వేన ప్రజాపతి మృత్యు (యముని) సుతయైన సునీధయందు మాతామహ (తల్లియొక్క తండ్రి) దోషముతో కాలాత్మ జాత్మజుడు (యముని పుత్రికి పుత్రుడు) అయ్యెను. ఆతడు ధర్మమును వెనుకకు నెట్టి కామము వలన లోభమునందు ప్రవర్తించేను. ఆ రాజు ధర్మము వీడిన స్థాపనమును (నియమమును) స్థాపించెను. వేదశాస్త్రములనతిక్రమించి అధర్మమునందత్యాసక్తుడయ్యెను. ఆతడు పరిపాలించుచుండగా ప్రజలు స్వాధ్యాయ వషట్కారములు లేనివారు (వేదాధ్యయనము లేనివారై యజ్ఞయాగములు చేయనివారు) అయిరి. సోమయాగములు లేనందున దేవతలు యజ్ఞములలో సోమపానము జేయలేనివారైరి. వేన ప్రజాపతికి తన వినాశము దగ్గరకు రాగా “యజ్ఞము జేయరాదు, హోమము జేయరాదు” అను క్రూర ప్రతిజ్ఞను జేసెను. అన్ని యజ్ఞములలో బ్రాహ్మణులచే నేనే యజ్ఞముతో బూజింపదగినవాడను, (నాకొరకే యజ్ఞముల జేయవలెను) అంతటను బూజింపదగినవా(దేవు)డను, నా విషయముగనే యజ్ఞము, హోమమును జేయదగినవి అని శాసించెను. ఈ విధముగ మర్యాదనతిక్రమించి అయుక్తమైన వాని స్వీకరించుచున్న వేనునితో నపుడు మరీచి మొదలగు మహరులందరు నిట్లనిరి. మేమనేక సంవత్సరములు దీక్షలో బ్రవేశించెదము. ఓ వేనరాజా! 'అధర్మము నాచరింపము. ఇది సనాతనమైన ధర్మము గాదు. నిస్సంశయముగా నీవు చావుననే కే) బుట్టిన ప్రజాపతివి. పూర్వము నీవు ప్రజలను చక్కగా పాలించెదనని ప్రతిజ్ఞ చేసితివి అని యీ విధముగ జెప్పుచున్న బ్రహ్మరులందరీతో వేనుడిట్లనెను. దుర్బుద్ధియై వచనకోవిదుడైన వేనుడు ఆ మాటలకు నవ్వి” నన్ను విడిచి మరొక ధర్మ స్రష్ట యెక్కడున్నాడు? ఎవరికి నేను వినదగినవాడను?  వీర్యమునను, వైదిక జ్ఞానమునను, తపమునను, సత్యమునను భూమిలో నాకు సమానుడెవడున్నాడు? (ఎవ్వరును లేరు). మీరు నిజముగా నన్ను గొప్ప మహాత్మునిగా దెలిసికొనుడు. సమస్త లోకములకును విశ్లేషించి ధర్మముల కారణ భూతుడను. నేను కోరినచో భూమినే కాల్చి వేయగలను. నీటితో బ్రవహింపజేయగలను. మరల సృష్టింపగలను, మ్రింగీవే ఈ విషయమున విచారింపబనిలేదు, ఈ విధముగ వేనుడు గర్వముతో స్తంభించుట వలన మిక్కిలి మోహితుడై ఋషులకు సాధ్యుడుగానపుడు ఆ మహరులు క్రుద్దులై. ఆ మహాబాహువులు గలిగి అగ్ని వలె మండిపడుచున్న యా వేనుని నీ! తరువాత వారు మిక్కిలి కోపించిన వారై యా వేనుని యెడమ చేతిని మథించిరి. ఓ బ్రాహ్మణులారా! ఆ మధింపబడు హస్తము నుండి పూర్వమొక అభిశ్రుతుడను, చక్కని వేదవిజ్ఞానియు, మిక్కిలి పొట్టివాడును, నల్లనివాడునునైన పురుషుడు. ఆతడు భయము జెంది, వ్యాకులము జెందిన యింద్రియములు గలిగి, చేతులు జోడించినవాడై నిలిచెను. ఆ విధ జెంది వివశుడైన యాతనిని జూచీ ఋషులు “నిషీద” (కూర్చోనుము) అని యనిది. అందువలన నీతడు అనంత గలవాడై నిషాద వంశకర్తయయ్యెను. అతడు కూడ వేనునీ పాపము వలన బుట్టిన ధీవరులను (జాలరులను) సృజించెను వింధ్యపోసులగు తుంబురులు, తువరులు, ఖసులు ఇంకను అధర్మమునందభిరుచి గలవారును వేనుని పోపము వలన బుట్టి

పునర్మహర్ష యస్తస్య పాణిం వేనస్య దక్షిణమ్

 అరణీమివ సంరంభాన్మ మంథుర్జాతమన్యవః

 పృథుస్తస్మాత్స ముత్పన్నః కరాస్ఫాలన తేజసః

 పృథోః కరతలాద్వాపి యస్మాజ్జాతః పృథుస్తతః

దీప్యమానః స్వవపుషా సాక్షాదగ్ని రివోజ్జ్వలన్

ఆద్యమాజగవం నామ ధనుర్గృహ్య మహారవమ్

 శరాంశ్చ బిభ్రద్రక్షార్థం కవచం చ మహాప్రభమ్

తస్మిన్ జాతేఽథ భూతాని సంప్రహృష్టాని సర్వశః

సముత్పన్నే మహారాజ్ఞి వేనశ్చ త్రిదివం గతః

 సముత్పన్నేన రాజర్షిః స సత్పుత్రేణ ధీమతా

 పురుషవ్యాఘ్రః పుంనామ్నో నరకాత్త్రాయతే తతః

తం నద్యశ్చ సముద్రాశ్చ రత్నాన్యాదాయ సర్వశః

 సమాగమ్య తదా వైన్యమభ్యషించన్న రాధిపమ్

 మహతో రాజరాజ్యేన మహారాజం మహాద్యుతిమ్

 సోఽభిషిక్తో మహారాజా దేవైరంగీరసః సుతైః

 ఆదిరాజో మహారాజః పృధుర్వైన్యః ప్రతాపవాన్

పిత్రాఽ పరంజితాస్తస్య ప్రజా స్తేనానురంజితాః

 తతో రాజేతి నామాస్య అనురాగాదజాయత

 ఆపస్త స్తంభిరే చాస్య సముద్రమభి యాస్యతః

 పర్వతాశ్చ విశీర్యంతే ధ్వజభంగశ్చ నాభవత్

 అకృష్టపచ్యా పృథివీ సిద్ధ్యంత్యన్నాని చింతయా

 సర్వకామదుఘా గావః పుటకే పుటకే మధు

ఏతస్మిన్నేవ కాలే చ యజ్ఞే పైతామహే శుభే

 సూతః సుత్యాం సముత్పన్నః సౌత్యేఽహని మహామతిః

 తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోథ మాగధః

 ఐంద్రేణ హవీషా చాపి హవిః పృక్తం బృహస్పతేః

 జుహావేంద్రాయ దేవేన తతః సూతో వ్యజాయత

 ప్రమాదస్తత్ర సంజజ్ఞే ప్రాయశ్చిత్తం చ కర్మసు

 శిష్యహవ్యేన యత్పృక్తమభిభూతం గురోర్హవిః

 అధరోత్తర చారేణ జజ్ఞే తద్వర్ణవైకృతమ్

యచ్చ క్షత్రాత్స మభవద్భ్రాహ్మణ్యాం హీనయోనితః

 సూతః పూర్వేణ సాధర్మ్యతుల్య ధర్మప్రకీర్తితః

మధ్యమో హ్యేష సూతస్య ధర్మః క్షత్రోపజీవినామ్

రథనాగాశ్చ చరితం జఘన్యం చ చికిత్సతమ్

పృథోస్త వార్థం తౌ తత్ర సమాహూతో సురర్షిభిః

తావూచుర్మనయః సర్వే స్తూయతామేష పార్థివః

 కర్మైతదనురూపం వాం పాత్రం స్తోత్రస్య చాప్యయమ్

 తావూచతుస్తదా సర్వాంస్తానృషీన్ సూతమాగధౌ

ఆవాం దేవానృషీంశ్చైవ ప్రీణయావః స్వకర్మభిః

 న చాస్య కర్మ వై విద్వో న తథా లక్షణం యశః

 స్తోత్రం యేనాస్య కుర్యావో రాజ్ఞస్తే జస్వినో ద్విజాః

 ఋషిభిస్తౌ నియుక్తౌ తు భవి ష్యైః స్తూయతామితి

 ధానధర్మరతో నిత్యం సత్యవాన్ స జితేంద్రియః

 జ్ఞానశీలో వదాన్యస్తు సంగ్రామేష్వ పరాజితః

యాని కర్మాణి కృతవాన్ పృథుశ్చాపి మహాబలః

తాని శీలేన బద్ధాని స్తువద్భిః సూతమాగధైః

తతః స్తవాంతే సుప్రీతః పృథుః ప్రాదాత్ప్రజేశ్వరః

అనూపదేశం సూతాయ మగధం మాగధాయ చ

 తదా వై పృథివీపాలాః స్తూయంతే సూతమాగధైః

ఆశీర్వాదైః ప్రబోధ్యంతే సూతమాగధ బందిభిః

తం దృష్ట్వా పరమప్రీతాః ప్రజా ఊచుర్మహర్షయః

ఏష వో వృత్తిదో వైన్యో భవత్వితి నరాధిపః

తతో వైన్యం మహాభాగం ప్రజాః సమభిదుద్రువుః

 త్వం నో వృత్తిం వీధత్స్వేతీ మహర్షేర్వచనాత్తదా

 సోఽ భిద్రుతః ప్రజాభిస్తు ప్రజాహిత చికీర్షయా

 ధనుర్గృహీత్వా బాణాంశ్చ వసుధామార్ద యద్బలీ

అస్యార్ధన భయత్రస్తా గౌర్భూత్వా ప్రాద్రవన్మహీ

 తాం పృథుర్ధనురాదాయ ద్రవంతీ మన్వధావత

 సా లో కాన్ భ్రహ్మలోకాదీన్ గత్వా వైన్యభయాత్తదా

 దదర్శ చాగ్రతో వైన్యం కార్ముకోద్యత ధారిణమ్

 జ్వలద్భిరిశిఖై ర్బాణైరీప్త తేజసమచ్యుతమ్

 మహాయోగం మహాత్మానం దుర్ధర్షమమరై రపి

అలభంతీ తదా త్రాణం వైన్యమేవాన్వపద్యత

 కృతాంజలిపుటా దేవీ పూజ్యా లోకైస్త్రిభిః సదా

 ఉవాచ వైన్యం నాధర్మం స్త్రీవధే పరిపశ్యసి

కథం ధారయితా చాసి ప్రజా రాజన్ మయా వినా

 మయి లోకాః స్థితా రాజన్ మయేదం ధార్యతే జగత్

 మదృతే చ వినశ్యేయుః ప్రజాః పార్థివసత్తమ

న మామర్హసి వై హంతుం శ్రేయశ్చేత్త్వం చికీర్షసి

 ప్రజానాం పృథివీపాల శృణు చేదం వచో మమ

 ఉపాయతః సమారబ్దాః సర్వే సిద్ధ్యంత్యుపక్రమాః

 హత్వాపి మాం న శక్తస్త్వం ప్రజానాం పాలనే నృప

 అన్నభూతా భవిష్యామి జహి కోపం మహాద్యుతే

 అవధ్యాశ్చ స్త్రియః ప్రాహుస్తిర్యగ్యోని శతేష్వపి

 మత్త్ర్యైవం పృథివీపాల ధర్మం న త్యక్తుమర్హసి

ఏవం బహువిధం వాక్యం శ్రుత్వా రాజా మహామనాః

 క్రోధం నిగృహ్య ధర్మాత్మా వసుధామిద మబ్రవీత్

ఏకస్యార్థాయ యో హన్యాదాత్మనో వా పరస్య వా

 ఏకం ప్రాణం బహూన్ వాపి కామం తస్యాస్తి పాతకమ్

యస్మింస్తు నీహతే భద్రే లభంతే బహవః సుఖమ్

తస్మిన్ హతే శుభే నాస్తి పాతకం చోప పాతకమ్

 సోఽహం ప్రజానిమిత్తం త్వాం వధిష్యామి వసుంధరే

 యది మే వచనం నాద్య కరిష్యసి జగద్ధితమ్

త్వాం నిహత్యాద్య బాణేన మచ్ఛాసన పరాజ్ముఖీమ్

 ఆత్మానం ప్రథయిత్వేహ ధారయిష్యామ్యహం ప్రజాః

సా త్వం వచనమాసాద్య మమ ధర్మభృతాం వరే

సంజీవయ ప్రజా నిత్యం శక్తా హ్యసి న సంశయః

 దుహితృత్వం చ మే గచ్చ ఏవమేతం మహద్వరమ్

 నియచ్చే త్వాం తు ధర్మార్థం ప్రయుక్తం ఘోరదర్శనే

ప్రత్యువాచ తతో వైన్యమేవముక్తా సతీ మహీ

 ఏవమేత దహం రాజన్ విధాస్యామి న సంశయః

వత్సం తు మమ తం యచ్ఛ క్షరేయం యేన వత్సలా

 సమాం చ కురు సర్వత్ర మా త్వం ధర్మభృతాం వర

 యథా విష్యందమానం చ క్షీరం సర్వత్ర భావయే

తత ఉత్సారయామాస శిలాజాలాని సర్వశః

ధనుష్కోట్యా తతో వైన్యః తేన శైలా వివర్ధితాః

 మన్వంతరేష్వతీతేషు విషమాసీద్వసుంధరా

 స్వభావేనాభవంస్తస్యాః సమాని విషమాణి చ

న హి పూర్వ నిసర్గే వై విషమే పృథివీతలే

 ప్రవిభాగః పురాణాం వా గ్రామాణాం వాపి విద్యతే

 న సస్యాని న గోరక్షా న కృషిర్న వణిక్పథః

 చాక్షుషస్యాంతరే పూర్వమేతదాసీత్పురా కిల

 వైవస్వతేంఽతరే తస్మిన్ సర్వ స్యైతస్య సంభవః

 సమత్వం యత్ర యత్రాసీద్భూయస్తస్మింస్తదేవ హి

 తత్ర ప్రజాస్తా వై నివసంతి స్మ సర్వదా

 ఆహారః ఫలమూలం తు ప్రజానామభవత్కిల

 వైన్యాత్ప్రభృతి లోకేఽ స్మిన్ సర్వ స్యైతస్య సంభవః

 క్రుచ్చ్రేణ మహతా సోఽపి ప్రనష్టాస్వోషధీషు వై

స కల్పయిత్వా వత్సం తు చాక్షుషం మనుమీశ్వరః

 పృథుర్ధుదోహ సస్యాని స్వతలే పృథివీం తతః

సస్యాని తేన దుగ్ధాని వైన్యేన తు వసుంధరామ్

మనుం చ చాక్షుషం కృత్వా వత్సం పాత్రే చ భూమయే

 తేనాన్నేన తదా తా వై వర్తయంతే ప్రజాః సదా

 ఋషిభిస్తూయతే వాపీ పునర్ధుగ్ధా వసుంధరా

వత్సః సోమస్త్వ భూత్తేషాం దోగ్ధా చాపి బృహస్పతిః

పాత్రమాసీత్తు ఛందాంసి గాయత్ర్యాదీని సర్వశః

 క్షీరమాసీత్తదా తేషాం తపో బ్రహ్మ చ శాశ్వతమ్

పునః స్తుత్వా దేవగణైః పురందర పురోగమైః

సౌవర్ణం పాత్రమాదాయ అమృతం దుదుహే తదా

 తేనైవ వర్తయంతే చ దేవా ఇంద్రపురోగమాః

నాగైశ్చ స్తూయతే దుగ్ధా విషం క్షీరం తదా మహీ

 తేషాం చ వాసుకిర్ధోగ్ధా కాద్రవేయా మహౌజసః

నాగానాం వై ద్విజశ్రేష్ఠం, సర్పాణాం చైవ సర్వశః

 తేనైవ వర్తయంత్యుగ్రా మహాకాయా మహోల్బణాః

తదాహారాస్తదాచారాస్తద్వీర్యాస్తు సదాశ్రయాః

 శ్రామపాత్రే పునర్దుగ్ధా త్వంతర్ధానమియం మహీ

 వత్సం వైశ్రవణం కృత్వా యక్షైః పుణ్యజనైస్తథా

 దోగ్ధా చ జతునాభస్తు పితా మణివరస్య సః

 యక్షాత్మజో మహాతేజా వశీ స సుమహాబలః

 తేన తే వర్తయంతీతి పరమర్షిరువాచ హ

 రాక్ష సైశ్చ పిశాచైశ్చ పునర్ధుగ్ధా వసుంధరా

 బ్రహ్మోపేతస్తు దోగ్ధా వై తేషామాషీత్కుబేరకః

రక్షః సుమాలీ బలవాన్ క్షీరం రుధిరమేవ చ

కపాలపాత్రే నిర్దుగ్ధా అంతర్ధానం చ రాక్షసైః

 తేన క్షీరేణ రక్షాంసి వర్తయంతీహ సర్వశః

పద్మపాత్రే పునర్దుగ్ధా గంధర్వైరప్సరోగణైః

 వత్సం చిత్రరథం కృత్వా శుచీన్ గంధాం స్తథైవ చ

 తేషాం విశ్వావసుస్త్వాసిత్ దోగ్ధా పుత్రో మునేః శుచిః

 గంధర్వరాఽజోతిబలో మహాత్మా సూర్యసన్నిభః

 శైలైశ్చ స్తూయతే దుగ్ధా పునర్దేవీ వసుంధరా

తత్రౌషధీర్మూర్తిమతీ రత్నాని వివిధాని చ

 వత్సస్తు హిమవాంస్తేషాం మేరుర్దోగ్ధా మహాగిరిః

 పాత్రం తు శైలమేవాసీత్తేన శైలః ప్రతిష్ఠితః

 స్తూయతే వృక్షవీరుద్భిః పునర్దుగ్ధా వసుంధరా

 పలాశ పత్రమాదాయ దుగ్ధం ఛిన్నప్రరోహణమ్

 కామధుక్ పుష్పితః శైలః ప్లక్షో వత్సో యశస్వినీ

సర్వకామదుఘా దోగ్ధ్రీ పృథివీ భూతభావినీ

సైషా ధాత్రీ విధాత్రీ చ ధారణీ చ వసుంధరా

దుగ్ధా హితార్థం లోకానాం పృథునా ఇతి నః శ్రుతమ్

 చరాచరస్య లోకస్య ప్రతిష్ఠా యోనిరేవ చ

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే పృథివీదోహనం నామ ప్రథమోఽధ్యాయః

 కోపించిన మహర్షులు అరణిని మథించినట్లుగా మరల సంరంభముతో నావేనుని కుడిచేతిని మథించిరి. దాని పృథువు బుట్టెను. చేయిచ అపున తేజస్సు గల పృథువు యొక్క యరచేతి నుండి పుట్టినందున నాతడు పృథువయ్యెను. త నాతడు తన శరీరముతో బ్రకాశించుచున్న వాడై సాక్షాత్తు అగ్నివలె మండుచుండెను. మహాధ్వనిగలిగి మొట్టమొదటిదై యాజగ పేరుగల శివధనువును, బాణములను ధరించి యుండెను. రక్ష కొరకు మహాకాంతివంతమైన కవచమును ధరించియుండెను ఆతడు పుట్టగనే యంతటను సమస్త భూతములు చక్కగా సంతసించెను. ఆ మహారాజు పుట్టగనే వేనుడు గూడ స్వర్గమున. ఆ విధముగ బుట్టిన ధీరుడైన సత్పుత్రునిచే నా రాజర్షియై పురుషశ్రేష్ఠుడైన వేనుడు పుంసోమక నరకము నుండి రక్షింప తరువాత నదులును సముద్రములును గలిసి మహాద్యుతిమంతుడును మహారాజునునైన. వేనపుత్రుని (పృథ మహారాజరాజ్యముతో నభిషేనభి షేకించినవి. అంగిరసుని కుమారులైన దేవతలచే సో మహారాజు అభిషిక్తుడఁ ప్రతాపవంతుడును వేన పుత్రుడునై న పృథువు మొట్టమొదటి రాజైన మహారాజు. ఆతని తండ్రి చేనపరంజి (దుఃఖింపజేయబడిన) ప్రజలు ఆపృథువుచే ఆనందింపజేయబడిరి. కావున ప్రజానురాగమును బట్టి యాతనికి 'రాజు' అన కలిగెను. సముద్రమున కెదురుగా విజయ యాత్రకు బయలుదేరిన యా పృథువునకు దారి యిచ్చుటకై జలములు అల స్తంభించిపోయెను. పర్వతములు బ్రద్దలుగా జొచ్చెను. ఆతనికి విజయధ్వజభంగము గలుగదాయెను. ఆతని సంకల్పయాత్ర దున్నకయే భూమి పంటలు పండించి యిచ్చెను. అన్నములు స్వయం సిద్ధమగుచుండెను. గోవులు పాలతో సర్వకామములను బిదుకునవయ్యెను. దొప్పలకొలది తేనెలను (వృక్షపుష్పములు) ఇచ్చుచుండెను. ఈ కాలముననే పవిత్రమైన బ్రహ్మయొక్క (ప్రాజాపత్య) యజ్ఞమున సౌత్యదినమున సుత్యయందు (సోమలతను దంచీపిండుటయందు) సూతుడు పుట్టేను. ఆతడు మహామేధావి. ఆ మహాయజ్ఞముననే ప్రాజ్ఞుడైన మాగధుడు బుట్టెను. ఇంద్రహవిస్సుతో బృహస్పతి హవిస్సు కలిసెను. అది యింద్రునకై హోమము చేయబడెను. దాన సూతుడు జన్మించెను. అచట ప్రమాదము గలిగెను. కర్మలలో ప్రాయశ్చిత్తము గూడ జరిగెను. శిష్యహవ్యముతో గలిసిన గురువు యొక్క హవిస్సు తిరస్కరింపబడెను. ఈ తలక్రిందుల యా చరణమున అది వర్ణవికారమును జెందినది. క్షత్రము వలన బ్రాహ్మణ స్త్రీయందు హీన యోని నుండి పుట్టిన సూతుడు పూర్వునితో (క్షత్రియునితో) సాధర్మ్యతుల్య ధర్మునిగా (సమానధర్మము గలవాడుగా) జెప్పబడినాడు. క్షత్రోపజీవనమైన యది మధ్యమమైన సూతధర్మము, రథనాగులు ఈ చరితమును నీచముగా చికిత్సతముగా చేయదలచినట్లుగా జేయబడినది. దేవరులు అచట పృథుని స్తుతించుటకై యా సూతమాగధులను బిలిచి మీరు పృథురాజును స్తుతింపుడనిరి. ఈ స్తుతించుట మీకు తగీనపని. ఈ పృథువు కూడ మీ స్తుతికి తగినవాడు గూడ. అపుడా సూతమాగధులు ఆ ఋషులందరితో నిట్లనిరి. “మేము దేవతలను ఋషులను పొని పనులతో స్తుతించి సంతోష పెట్టగలవారము. మేమీతడు చేసిన పని నెఱుగము. ఈతని లక్షణమును కీర్తిని ఎటుగము. ఓ బ్రాహ్మణులారా! ఈతడు చేసిన ఏ పనిని ఆధారముగా ఈ తేజస్వియైన రాజును స్తుతింపవలెనో సెలవిండు అనిరి. ఓయి! ఆతడు భవిష్యత్కాలమున జేయబోవు సత్కర్మలతో సుతింపుడని ఋషులో సూత మాగధులను నియోగింపగా వారీ విధముగ స్తుతించిరి. పృథువు నిత్యము దాన ధర్మమలందు నిరతుడు, సత్యవంతుడు, ఇంద్రియముల జయించినవాడు, జ్ఞానశీలుడు, దానశీలుడు, యుద్ధములలోనపజయము నందనీవాడు. అని యీ విధముగ మహాబలుడైన పృథువు జేసిన పనులనన్నింటిని ఆతని శీలముతో జోడించి సూతమాగధులు పృథువును స్తుతించిరి. తరువాత స్తోత్రము ముగియగానే ప్రజానాథుడైన పృథువు మిక్కిలి సంతసించినవాడై సూతునకు అనూపదేశమును (జలప్రాయమైన దేశము), మాగధునకు మగధదేశమును ఇచ్చెను. అపుడు (అప్పటి నుండి) రాజులు సూతమాగధులచే స్తుతింపబడుచుండిరి. సూతమాగధ - వందులచే నాశీర్వాదములతో మేలుకొల్పబడుచుండిరి. ఆ పృథువును జూచి మహర్షులు సంతసించినవారై ప్రజలను గూర్చి “ఈ రాజైన వేనపుత్రుడగు పృథువు మీకు వృత్తినిచ్చువాడు (జీవనమిచ్చువాడు) అగుగాక" - అని యనీర్తి, అంత ప్రజలు మహాభాగుడైన వేనపుత్రుని వెంటబడి, ఓ రాజా! మహర్షి వచనము వలన నీవు మాకు వృత్తిని కల్పింపుమని యడిగిరి. ఆ విధముగ ప్రజలతో వెంబడింపబడిన పృథువు ప్రజాహితమును జేయగోరి, ధనుర్బాణములను దీసికొని బలవంతుడై భూమిని పీడించేను. ఈతని పీడనభయమున భయపడినదై భూమి గోరూపమును ధరించి పరుగెత్తెను. పరుగెత్తుచున్న యా గోవును ధనువుతో వెంబడించెను. ఆ గోవు పృథువు భయమున బ్రహ్మలోకము మొదలగు లోకములకు వెళ్లి కూడ ధనువెక్కు పెట్టి యెదుట నిలిచిన పృథువును జూచెను. ఆతడు మండుచున్న జ్వాలలు గల బాణములతో దీప్తమైన తేజస్సు గలిగినవాడై యచ్యుతుడుగా నున్నాడు, మహాయోగము గలవాడు దేవతలకు గూడ జయింపనలవికాని వాడు మహాత్ముడు. ఎల్లప్పుడు త్రిలోక పూజ్యమైన గోరూపధారిణియగు భూదేవి యెక్కడను రక్షణము లభించనిదై చేతులు జోడించినదై పృథువునే చేరినది . తరువాత నాతనితో నిట్లనినది, ఓ రాజా! స్త్రీ వధలో అధర్మమును జూడవొ? నేనులేక ప్రజలను ఎట్లు ధరింపగలవు? ఓ రాజా! నాయందు లోకములున్నవి. నాచేతనే యీ జగము ధరింపబడుచున్నది. ఓ రాజోత్తమా! నేను లేకున్న ప్రజలు వినాశము జెందుదురు. నీవు ప్రజల శ్రేయస్సును జేయగోరినచో నన్ను జంపదగదు. ఓ రాజా! నా యీమాటను వినుము. ఉపాయముతో బ్రారంభించిన యన్ని కార్య ప్రారంభములు సిద్ధించును. ఓ రాజా! నన్ను జంపి కూడ ప్రజాపాలనము జేయజాలవు. నేనన్నమై యుండగలను. ఓ మహాద్యుతీ! కోపమును త్యజింపుము. నూరు (అనేక) జంతుజాతులలో గూడ స్త్రీలు వధింపదగినవారు గారు అని చెప్పుదురు. దీనిని దలంచి ఓ రాజా! నీవు ధర్మమును విడనాడరాదు. మహామనస్సు గల యా రాజు (పృథువు) ఈ యనేక విధములైన గోరూప ధారిణియగు భూవాక్యమును విని కోపమునణచికొని ధర్మాత్ముడై యా భూమితో నిట్లనెను. ఒక్కని కొఱకు తనకు సంబంధించిన వారిని గానీ, పరులకు సంబంధించినవారిని గాని, ఒక్కరినీ గాని అనేకులను గాని చంపిన వానికి పాపము గలిగిన గలుగును గాక. కాని ఓ భద్రురాలా! ఏ యొక్కనీస్ జంపినచో ననేకులు సుఖమునందుదురో ఆ ఒక్కడు చంపబడినచో చంపిన వానికి పాతకముగాని ఉపపాతకముగాని కలుగదు. ఓ వసుంధరా! జగత్తునకు హితమైన నామాటనాచరింపనిచో ప్రజానిమిత్తముగా నిన్ను వధింపబోవుచున్నాను. నా మాటను తిరస్కరించిన నిన్ను ఇపుడు నా బాణముతో జంపి నన్ను (భూమీవలె) నిట ప్రకటించి (విస్తరించి) నేను ప్రజలను రక్షింతును. ఓ ధర్మధారణ శ్రేష్ఠురాలా! నా మంచి శాంతమైన మాటను విని ప్రజలనెల్ల బ్రతికింపుము. నీవు దానికి సమర్ధురాలవు. సంశయము లేదు. నాకు దుహితవు (పుత్రివి) గమ్ము. ఈ విధముగ నాకీ వరమును ప్రసాదింపుము. ఓ భయంకర దర్శనము గలదానా! ధర్మమునకై యుపయుక్తమగు దానినిగా నిన్నాజ్ఞాపించుచున్నాను ! పృధువుచే నిట్లు చెప్పబడినదై భూదేవి యిట్లు మారుపలికెను. “నేను అట్లే చేయుదును” ఓ రాజా! సంశయము లేదు. నేను వాత్సల్యము గలదానినై ద్రవింపజేయదగినట్టి వత్సమును (దూడను) ఇమ్ము. ఓ ధర్మధారులలో శ్రేష్ఠుడా! నేనంతటను క్షీర గలుగునట్లు స్రవింప నన్ను అంతట సమురాలనుగా జేయుము. అంత పృథువు అంతటను శిలాసమూహములను ( యొక్క అంచుతో (కొసతో) పైకి ప్రసరింపజేయసాగెను. దాని వలన శైలములు వర్ధిల్లినవి. మన్వంతరములు గడవగా విషమ (ఎత్తు పల్లములు గలది). యయ్యెను. భూమికి సహజముగనే సమములు విషములును ఏర్పడెను. పూర్వ స విషమమగు భూమి పైన పురముల యొక్కగాని గ్రామముల యొక్కగాని విభాగము లేదు. సస్యములు లేవు. గోరక్షణము వ్యవసాయము లేదు. వైశ్యుల మార్గము లేదు. ఇట్టి స్థితి చాక్షుష మన్వంతరమున పూర్వముండెనట. కాని వైవస్వతమన్వంతం ఈ పురగ్రామ సస్యగోరక్షా కృషి వ్యాపారముల యొక్క యేర్పాటు జరిగినది. భూమి పైన సమతలమున్న చోటుల నెల్ల ఎల్లప్పుడు నివసించుచుండిరి. ప్రజలకు ఫలములాహారమయ్యెను. పృథువు నుండి మొదలు లోకములో నిదియం సంభవించినది. ఓషధులన్నియు నశించిపోగా, ప్రభువైన పృథువు అతికష్టముతో చాక్షుష మనువును వత్సము (దూడ)గా భూమీ భాగమున భూమి నుండి సస్యములను (పంటలను) బీతికెను, పృథువుచేత చాక్షుష మనువును దూడనుగా జేసి భూమం పాత్రయందు సస్యములు (క్షీరములు) పితుకబడినవి. ఆ యన్నము చేతనపుడు ప్రజలెల్లప్పుడును జీవనము గడుపుచుండిరి ( ఋషులచేత మరల స్తుతించి భూమీ పేతుకబడినది. వారికి దూడ సోముడయ్యెను. బృహస్పతి పితుకువాడయ్యేను. గా మొదలగు ఛందములు పొత్ర (పాలు పితుకు ముంత) యయ్యెను. వారు పితికిన పొలు తపస్సు శాశ్వతమైన బ్రహ్మయు (వేఁ నయ్యెను. ఇంద్రుడు మొదలగు దేవతలు స్తుతించి సువర్ణ పాత్రను దీసికొని వచ్చి అమృతమునుబితికిరి. దానిచేతనే ఇం మొదలగు దేవతలు ఆయమృతముతోనే జీవించుచుండిరి. సోగులచే స్తుతింపబడిన భూమి అపుడు విషము క్షీరముగా ఓ వారిలో వాసుకీ పితుకువాడయ్యెను. దాని వలన కాద్రవేయులు (కుద్రువ కుమారులు నాగులు) మహాతేజస్వులైరీ. ఓ బ్రాహ్మణ నాగులకు గానీ సర్పములకు గానీ ఆ విషముతోనే జీవనము, దానిచే పెద్ద శరీరములు గలవారై గొప్పగానుప్పొంగినవారై, విషాహా విషాచారులై, విషబలులై, విషాశ్రయులై యుండిరి. అట్లే యక్షుల చేతను, పుణ్యజనులచేతను (రాక్షసుల చేతను) వైశ్రు దూడగా జేసి శ్రామపొత్రలో మరల బీతుకబడినదై భూమి అంతర్థానమందెను. పితుకుపోడు జతునాభుడు. ఆతడు మణి తండ్రి, యక్షుని కుమారుడు, మహాతేజస్వి. ఇంద్రియములను తన వశమందుంచుకొన్నవాడు. చక్కని మహాబలుడు, ఆ క్షీర జీవనము గడుపుతున్నారని పరమరి చెప్పెనట. రాక్షసుల చేతను పిశాచుల చేతను మరల భూమి పితుకబడినది. బ్రహ్మతో గూడిన కుబేరుడు పితుకువాడుగా నయ్యెను. బలవంతుడైన సుమాలీయను రాక్షసుడు పితుకువాడై క్షీరమును రక్తం కపాలపాత్రలో బితుకగానంతర్ధానమైనది. ఆ క్షీరము తోనే భూలోకమున నంతట రాక్షసులు జీవనము గల వారగుచున్నారు ( గంధర్వుల చేతను అప్సరోగణముల చేతను చిత్రరథుని దూడగా జేసి యా భూమి నుండి పవిత్రములైన గంధములు పద్మ పితుకబడినవి, వారికి విశ్వావసువు పితుకువాడయ్యెను. అతడు మునికి పుత్రుడై పవిత్రమైనవాడు, గంధర్వరాజు, అతిబల మహాత్ముడు, సూర్యునితో సమానుడు. శైలములచే స్తుతింపబడినదై భూదేవి మరల పితుకబడెను. అపుడు పితుకబడి ఆకారము దాల్చిన మహౌషధులు, వివిధములైన రత్నములును, వారికి దూడ హిమవంతుడు, పితుకువాడు మేరు మహాపర్వం పాత్రము శైలమేయయ్యెను. దాని వలన శైలము ప్రతిష్ఠితమయ్యెను. వృక్షములచేతను తీవల చేతను స్తుతింపబడినదై .: మరల పితుకబడెను. మోదుగాకును పాత్రముగా దీసికొని ఛేదించినను మరల మొలచు తత్త్వము పిండబడినది. కామమ పితుకువాడు పుష్పించిన శైలము, వటవృక్షము దూడ. కీర్తిమంతమైనది, సర్వకామములను బితుకునది, త్రికాలములను నుండునదియ యావు భూదేవి. అట్టి యీ భూదేవి సృష్టికర్తయై, ధరించునదై, వసువుల (ధనముల) ధరించునదై లోకముల హితవ పృథువుచేత పితుకబడినది అని మాకు వినబడినది. అది చరాచరమైనయీలోకమునకు ప్రతిష్ఠా కారణమును నైనది.

ఇది శ్రీవాయుమహాపురాణమున పృథివీ దోహనమను ప్రథమాధ్యాయము సమాప్తము.