44 - భువనవిన్యాసో

సూత ఉవాచ:-

 నిసర్గ ఏష విఖ్యాతో భద్రాశ్వానాం యధార్థవత్

 శృణుధ్వం కేతుమాలానాం విస్తరేణ ప్రకీర్తనమ్

నిషధస్యా చలేంద్రస్య పశ్చిమస్య మహాత్మనః

 పశ్చిమేన హి యత్తత్ర దీక్షు సర్వాసు కీర్తితమ్

కులాచలానాం సప్తానాం నదీనాం చ విశేషతః

 తథా జనపదానాం చ విస్తరం శ్రోతుమర్హథ

 విశాలః కంబలః కృష్ణో జయన్తో హరీపర్వతః

 అశోకో వర్ధమానశ్చ సప్తైతే కులపర్వతాః

 తేషాం ప్రసూతి రమ్యేపి పర్వతా బహువిస్తరాః

 కోటికోటిశతా జ్ఞేయ శతశోఽథ సహస్రశః

 తైర్విమిశ్రా జనపదా నానాజాతి సమాకులాః

 నానాప్రకారా విజ్ఞేయా స్త్వనేక నృపపాలితాః                     

సూతుడనెను:- భద్రాశ్వుల నిజమైన స్వభావమిది వర్ణింపబడినది. ఇక కేతుమాలుల స్వభావమును విస్తరముగా వినుడు-1. పశ్చిమ పుదైన నిషధాచల శ్రేష్ఠము యొక్క పశ్చిమముగా సర్వదిక్కుల యందు చెప్పబడిన-2, యేడు కులాచలముల యొక్కయు, నదుల యొక్కయు, విశేషించి జనపదముల యొక్కయు విస్తరమును మీరు వినదగియున్నారు-3. విశాలము, కంబలము, కృష్ణము, జయంతము, హరిపర్వతము, అశోకము, వర్ధమానము అనునీ యేడు కుల పర్వతములు. వాని సంతానమై బహు విస్తారములైన యితర పర్వతమలు నూర్లకొలది వియు వేలకొలదీ వియునై కోటి కోటి శతములని తెలియవలెను-5. వానితో గలిసిన జనపదములు నానా జాతులతో వ్యాకులములు నానా ప్రకారములునై యనేక రాజులచే పరిపాలింపబడినవి-6.

తే నామధేయైర్విక్రాన్తా వివిధాః ప్రథితా భువి

 అధ్యాసితా జనపదైః కీర్తనైశ్చ విభూషితాః

అవి భూమిలో వాని వాని పేర్లతో విక్రమించినవై వివిధములుగా జెప్పబడినవి. అవి జనపదములు నెలకొన్నవై కీర్తనములతో నలంకరింపబడినవి-7.

తేషాం స నామధేయాని రాష్ట్రాణి వివిధాని చ

గిర్యంతర నివిష్టాని సమేషు విషమేషు చ

 యధేహ కథితాః పౌరాః గోమనుష్య కపోతకాః

 తత్సుఖాభ్రమరాయూధ మహేయాచలకూటకాః

 సుమౌలాస్తావకామః క్రౌంచాః కృష్ణాంగ మణిపుంజకాః

కూటకంబల మౌషీయాః సముద్రాంతర కాస్తథా

 కరంభవాః కుచాః శ్వేతాః సువర్ణకటకాః శుభాః

 శ్వేతాంగాః కృష్ణపాదాశ్చ విహాః కపిలకర్ణికాః

 అత్యాకరాల గోజ్వాలా హీనానా వనపాతకాః

 మహిషాః కుముదాభాశ్చ కరవాటా సహోత్కచాః

 శుకనాసా మహానాసా వానాస గజ భూమికాః

 కరంజమంజమావాహాః కిష్కండీపాండు భూమికాః

 కుబేరా ధూమజాజంగా వంగారా జీవకోకిలాః

 వాచాంగాశ్చ మహాంగాశ్చ మధౌరేయాః సురేచకాః

 పిత్తలాః కాచలాశ్చైవ శ్రవణామత్త కాసికాః

గోదా వా బకులా వాంగా వంగకా మోదకాః కలాః

 తే పిబన్తి మహాభాగాః ప్రథమాం తు మహానదీమ్

 సువప్రాం పుణ్యసలిలాం మహానాగ నిషేవితామ్

కంబలాంతామసీం శ్యామాం సుమేధాం వకులాం నదీం

 వికీర్ణాం శిఖిమాలాం చ తథా దర్భావతీ మపి

భద్రానదీం శుకనదీం పలాశాం చ మహానదీమ్

 భీమాం ప్రభంజనాం కాంచీ పుణ్యాం చైవ కుశావతీమ్

 దక్షాం శాకవతీం చైవ పుణ్యోదాం చ మహానదీమ్

 చంద్రావతీం సుమూలాం చ ఋషభాం చాపగోత్తమామ్ 

నదీం సముద్రమాలాం చ తథా చంపావతీమపి

ఏకాంక్షాం పుష్కలాం వాహాం సువర్ణాం నందినీమపి

కాలిందీం చైవ పుణ్యోదాం భారతీం చ మహానదీమ్

శీతోదాం పాలికాం బ్రాహ్మీం విశాలాంచ మహానదీమ్

 పీవరీం కుంభకారీం చ రుషాం చైవాప గోత్తమామ్

మహిషీం మానుషీం దండాం తథా నదనదీం శుభమ్

 ఏతాం శాన్యాం చ పీయన్తే బహ్య్వో హి సరితోత్తమాః

దేవర్షి సిద్ధచరితాః పుణ్యోదాః పాపహాః శుభా

నానాజన పదాస్ఫీతం మహాప విభూషితమ్

నానారత్నౌఘ సంపూర్ణం నిత్యం ప్రముదితం శివమ్

ఉదీర్ణం ధనధాన్యార్ధైర్నరావాసైః సమస్తతః

సన్నివిష్టం మహాద్వీపం మహాపగ విభూషితమ్

ఇది శ్రీమహాపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామ చతుశ్చత్వారింశోఽధ్యాయః                        

వాటికి సమానమైన పేరుగల రాష్ట్రము లనేకములు అవి గిరుల మధ్యలో సమస్థానములలోను విషమ (ఎగుడు దిగుడు) స్థానములలోను ప్రవేశించినవి-8. ఇచట పురమున నివసించు పౌరులు గోవులు మనుష్యులు పావురములు. వాని ముఖములు గలవారు. భ్రమరులు యూధులు మాహేయాచలకూటకులు (మాహేయా చల శిఖరముననుండువారు) కూట కంబలమౌషీయులు (కూటముగ నుండువారు గొంగళ్ళు ధరించువారు ఎలుకలతో నుండువారు), సముద్రాంతరకులు (సముద్రాంతర్భాగమున నుండువారు)-9,10. కరంభవులు, కుచులు, శ్వేతులు, శుభులైన సువర్ణకంకణములు గలవారు శ్వేతాంగులు, కృష్ణపాదులు, విహులు, కపిలకర్షకులు-11, అత్యాకరాల గోజ్వాలులు, హీనాదులు, వనపాతకులు, మహిషులు, కుముదాభులు, కరవాటులు, సహనత్కచులు-12, శుకవాసులు, మహావాసులు, వనాసులు, గజభూమికులు-13, కుబేరులు (మిడి గ్రుడ్లు గలవారు) ధూమజులు, జంగులు, వంగులు, రాజీవులు కోకిలలు, వాచాంగులు, మహాంగులు, మధౌరేయులు, సురేచకులు-14, పిత్తలులు, కాచులు, శ్రవణులు, మత్తకాసినోలు, గోదావులు, బకులులు, వాగులు వంగకులు, మోదకులు, కలులు-15, అను వీరు కేతుమాలదేశమున నుండువారు పై పేరులలో భోగికార్థములతో వారి స్వభావములు తెలియవచ్చును). ఆ పై మహాభాగులు (గొప్ప యదృష్టవంతులు) మొదటిదియు, మంచి ప్రాకారముగలదియు, పుణ్యజలము గలదియు, మహా సర్పజములతో సేవింపబడినదియు నైన మహానదిని (జలములను) ద్రావుదురు-16, కంబలా తామసీ, శ్యామా, సుమేధా, వకులా, భీమా, ప్రభంజనా, కాంచీ, పుణ్యమైన కుశావతి-18, దక్ష శాకవతీ, పుణ్యోదీయను మహానదీ చంద్రావతీ, సుమూలా, ఋషభాయను నదీ శ్రేష్ఠము-19, సముద్రమాలా, చంపావతీ, ఏకాక్షా, పుష్కలా, వాహాసువర్ణ నందినీ-20, కాళిందీ, పుణ్యజలములు గల మహానదియైన భారతీ, శీతల జలములుగల పాతికా, బ్రాహ్మీ, మహానదియైన విశాలా-21, ఓవరీ, కుంభకారీ, నదీశ్రేష్ఠమైన రుషా, మహిషీ మానుషీ, దండానదనదీ-22, ఈ పైజెప్పిన నదులను (జలములను) ఇతరములైన యుత్తమ నదులను (జలములను కేతుమాలదేశవాసులు ద్రావుదురు ఆ దేశముననున్న ఉత్తమనదులనేకములు. అవి దేవరులచేతను సిద్దులచేతను సంచరింపబడినవి. పుణ్యజలములు గలవి. పాపముల బోగొట్టునవి. ఈ విధముగా కేతుమాల ద్వీపము అనేక పదములచే మిక్కిలి బలిసినది. గొప్పనదులచే నలంకరింప బడినది. అనేక రత్న సమూహములచే నలంకరింపబడినది. నిండైనది. నిత్యము సంతుష్టమైనది. మంగళమైనది-23, 24. ధనములచే ధాన్యములచే తక్కిన పదార్థములచేతను మిక్కిలి సమృద్ధమైనది. జనావాసములచేతను సంనిష్టమై మిక్కిలి గొప్పగా సమృద్ధమైనది. మహానదుల విభూషితమైనది-25.

ఇది శ్రీ వాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబదినాల్గవ యధ్యాయము - 44.