48 -  భువనవిన్యాసో

సూత ఉవాచ: -

దక్షిణేనాపి వరస్య భారతస్య నిబోధత ।

దశయోజనసాహస్రం సమతీత్య మహార్ణవమ్ ॥

 త్రీణ్యేవ తు సహస్రాణి యోజనానాం సమాయతమ్ ।

 అతస్త్రీభాగవిస్తీర్ణం నానాపుష్పఫలోదయమ్ ॥

 విద్యుత్వంతం మహాశైలం తత్ర్యేకం కులపర్వతమ్ ।

యేన కూటతటైర్నెకైస్తద్వీపం సమలంకృతమ్ ॥

ప్రసన్నస్వాదు సలిలాస్తత్ర నద్యః సహస్రశః ।

వాప్య స్తస్య తు ద్వీపస్య ప్రవృత్తి విమలోదకాని ॥

తస్య శైలస్య ఛిద్రేషు విస్తీర్ణేష్వాయతేషు చ ।

అనేకేషు సమృద్ధిని నానాకారాణి సర్వశః ॥

 నరనారీ సమాడ్యాని ముదితాని మహాస్తి చ ।

 తేషాం తల ప్రవేశాని సహస్రాణి శతాని చ ॥

పురాణి సన్ని విష్ణాని పర్వతాంతర్గతాని చ ।

 సుసంబధాని చాన్యోన్య మేకద్వారాణి చాప్యథ ॥

 దీర్ఘశ్మశ్రుధరాత్మానో నీలామేఘసమప్రభాః ।

జాతమాత్రాః ప్రజాస్తత్ర అశీతిపరమాయుష ॥

 శాఖామృగసధర్మాణః ఫలమూలాశినస్తథా ।

గోధర్మాణో హ్యనిర్దిష్టాః శౌచాచారవివర్జితాః ॥

 తద్ద్వీపం తాదృతైః పూర్ణమనుజైఃక్షుద్రమానుషైః ।

 ఏవమేతేస్తరద్వీపా వ్యాఖ్యాతా ఆనుపూర్వశః ॥

సూతడనెను:- భారతదేశమునకు దక్షిణము వైపున గూడ పదివేల యోజనముల వైశాల్యముగల సముద్రమును దాటి తరువాత నున్న భూమి విశేషమును వినుడు. అచట మూడువేల యోజనముల పొడవు గలిగి ఒక వేయి యోజనముల వెడల్పు గల్గి నానా పుష్పఫలముల వృద్ధిగలిగి, మెఱువులు గలిగి మహాశైలమైన నొకకుల పర్వతము గలదు. దానియనే! శిఖరములచేత నా ద్వీపము చక్కగా నలంకరింపబడినది. అచట నిర్మలములై తీయనైన జలములు గల వేల నదులు గలవు. ఆ ద్వీపముయొక్క బావులు గూడ నిర్మల జలములు గలవిగా నైనవి. ఆ పర్వతముయొక్క పొడవై (వెడల్పుతో విశాలములై అనేక ఛిద్రములు (నిర్మితములైన గుహా రంధ్రములు) గలవు. వానియందు అంతటను నరనారులచే సంతుష్టములై యొప్పి సమృద్ధములైన యనేకాకారములు (చెక్కిన మూర్తులు చిత్రించిన చిత్రములు) గలవు ఆయాకారములున్న వాని పై భాగములకు బ్రవేశించు మార్గములే ద్వారములు వేలు నూర్లు గలవు పర్వతాంతర్గతముగా పురములు చక్కగా గూర్పబడినవి. ఒకే ద్వారములు గలవైనను పరస్పరము సుసంబద్దములుగా జేయబడినవి. అచటి ప్రజలు పొడవైన మీసములు గడ్డములును గలవారు జన్మించిన వారందరును ఎనుబదియేండ్ల పరమాయుష్యము గలవారు. నల్లనై మేఘములకకు సమానమైన కాంతిగలవారు. కోతులతో సమానమైన ధర్మము (ఆచరణము) వారు ఫలములు మూలములను దినువారు. ఎడ్లవంటివారై శౌచాచారముల వదిలినవారు. చెప్పుచేతలు లేనివారు. ఆ ద్వీపము క్షుద్ర మానుషులైన మనుజులచే నిండినది. ఈ విధముగా నీయన్తరద్వీపములు ఆనుపూర్వకముగా వ్యాఖ్యానింపబడినవి.

వింశత్ త్రింశచ్చ పంచాశత్ షష్ట్యశీతిః శతం తథా ।

సహస్రమసి చాప్యు క్తం యోజనానాం సమన్తతః ॥

 విస్తీర్ణాశ్చాయతాశ్చైవ నానాసత్య సమాకులాః ।

 బర్హిణ ద్వీపపర్వాణి క్షుద్రద్వీపాః సహశ్రశః ॥

 ఇరువది ముప్పది. ఏబది అటువది, ఎనుబది, నూరు, వేయి యోజనములలో నంతటను వెడల్పై పొడవైనవియునై అనేక ప్రాణులతో నిండినవై నెమళ్ళ ద్వీప భాగములు గల క్షుద్ర ద్వీపములు వేలకొలది కలవు.

జంబుద్వీపప్రదేశాత్తు షడన్యే వివిధాశ్రయాః ।

అత్ర ద్వీపాః సమాఖ్యాతాః నానారత్నాకరాః క్షితౌ ॥

అంగద్వీపం యమద్వీపం మలయద్వీపమేవ చ ।

శంఖద్వీపం కుశద్వీపం వరాహద్వీపమేవ చ ॥

అంగద్వీపం నిబోధ త్వం (ధ్వం) నానాసంఘ సమాకులమ్ ।

నానామ్లేచ్చగణాకీర్ణం తద్ద్వీపం బహువిస్తరమ్ ॥

 హేమవిద్రుమ పూర్ణానాం రత్నానామాకరం క్షితౌ ।

 నదీశైలవనైశ్చిత్రం సన్నిభం లవణాంభసా ॥

 తత్ర చక్రగిరిర్నామ నైకనిర్ఘరకంధరః ।

తత్ర సా తు దరీచాస్య నానాసత్త్వ సమాశ్రయా ॥

సమధ్యే నాగదేశస్య నైకదేశో మహాగిరిః ।

 కోటిభ్యాం నాగనిలయం ప్రాప్తోనదనదీపతిమ్ ॥

జంబుద్వీప ప్రదేశమున కంటే వేరుగా వివిధాశ్రయములై నానారత్నములకు గనులై భూమి పై మరి యారు ద్వీపములు గలవు. అవి అంగద్వీపము, యమద్వీపము, మలయద్వీపము, శంఖద్వీపము, కుశద్వీపము, వరాహద్వీపము అనునవి. అంగద్వీపమును గూర్చి వినుడు. అది యనేక సంఘములతో నిండినది. అనేక మ్లేచ్చ గణములతో వ్యాపించినది. అది మహావిశాలమైనది. భూమిలో బంగారము పగడములును నిండిన రత్నములకును నెలవైనది. నదీ శైలవనములతో చిత్రమైనది. ఉప్పు సముద్రముతో సమానమైనది. చట చక్రగిరియను పర్వతము గలదు. అదియనేకములైన సెలయేరులను గుహలును గలది. దాని గుహ పెక్కు మృగజీవముల కాశ్రయమైనది. అది నాగదేశ మధ్యమున నున్న అనేక ప్రదేశములు గల మహాపర్వతము దాని శిఖరములు నాగములకు నిలయములు. అది నదనదీపతియగు సముద్రము వరకు జేరినది (వ్యాపించినది).

యమద్వీపమితి ప్రోక్తం నానారత్నా కరాచితమ్ ।

తత్రాపి ద్యుతిమాన్నామ పర్వతో ధాతుమండితః ।

సముద్రగానాం ప్రభవః ప్రభవః కాంచనస్య తు ॥

యమద్వీప మను ద్వీపము పెక్కు రత్నముల గనులతో వ్యాపించినది. అచట గూడ ధాతువులతో నలంకరింపబడిన 'ద్యుతిమాన్' అను పర్వతము గలదు. అది నదులకుత్పత్తి స్థానము, బంగారమునకుగూడ పుట్టు స్థానము,

తథైవ మలయద్వీపమేవమేవ సుసంవృతమ్ ।

 మణిరత్నాకరం స్ఫీతమాకరం కనకస్య చ ॥

 ఆకరం చందనానాం చ సముద్రాణాం తథాకరమ్ ।

 నానామ్లేచ్చ గణాకీర్ణం నదీపర్వత మండితమ్ ॥

తత్ర శ్రీమాన్ సుమలయః పర్వతోరజతాకరః ।

 మహామలయ ఇత్యేవం విఖ్యాతో వరపర్వతః ॥

ద్వితీయం మందం నామ ప్రథితం చ సదా క్షితౌ ।

అగస్త్యభవనం తత్ర దేవాసుర నమస్కృతమ్ ॥

తథా కాంచన పాదస్య మలయస్యాపరస్య హి ।

నికుంజైస్తృణసోమాంగై రాశ్రయం పుణ్యసేవితమ్ ॥

 నానాపుష్ప ఫలోపేతం స్వర్గాదపి విశిష్యతే ।

తత్రావతరతే స్వర్గం! సదా పర్వసు పర్వసు ॥

 తధాత్రికూటనిలయ నానాధాతు విభూషితే ।

 అనేక యోజనోత్సేధే చిత్రసానుదరీ గృహే ॥

తస్యకూట తటే రమ్యే హేమప్రాకారతోరణా ।

 నిర్యూహవలభ చిత్రహర్మ్య ప్రాసాదమాలినీ ॥

శతయోజన విస్తీర్ణా త్రింశదాయాయయోజనా ।

నిత్య ప్రముదితా స్ఫీతా లంకానామ మహాపురీ ॥

 సా కామరూపిణాం స్థానం రాక్షసానాం మహాత్మనాం ।

 ఆవాసో బలదృప్తానాం తద్విద్యాద్దేవ విద్విషామ్ ॥

 మానుషాణామసంబాధా హ్యగమ్యా సమహాపురీ ॥

 తస్య ద్వీపస్య వై పూర్వే తీరే నదనదీపతేః ।

 గోకర్ణనామధేయస్య శంకరస్యాలయం మహత్ ॥

 అట్లే మలయద్వీపము. గూడ నిట్లే చక్కగా జుట్టబడియున్నది. అది మణిరత్నములకు నెలవైనది. విశాలమైనది. బంగారమునకు గూడ నెలవైనది. చందనవృక్షములకు నెలవైనది. అట్లే సముద్రములకును నెలవైనది. పెక్కు మ్లేచ్చ గణములతో వ్యాపించినది. నదులు పర్వతములు వీనిచే నలంకరింపబడినది. అచట శ్రీమంతమైన సుమలయపర్వతముగలదు. అది వెండికి నెలవు మహామలయమని ప్రసిద్దిజెందిన శ్రేష్ఠమైన పర్వతము. భూమిలో రెండవ మందర పర్వతమని యెల్లప్పుడు పేరొందినది. అచట దేవరాక్షసులచే నమస్కరింపబడిన అగస్త్యుని భవనము గలదు. అట్లే బంగారు పాదము (ప్రత్యంత పర్వతము) గల మరొక మలయపర్వతము యొక్క గడ్డిచే తెల్లనైన పొదలకాశ్రయమై, పుణ్యాత్ములతో సేవింపబడినది. అనేకపుష్ప ఫలములతో గూడినదై స్వర్గమునకంటే మిన్నయైనది. అచట రవి సంక్రాంతులు మొదలగు ప్రతి పండుగలందును ఎల్లప్పుడు, స్వర్గమే దిగివచ్చును. అట్లే మూడు శిఖరములకు నెలవై యనేకధాతువులచే నలంకరింపబడి, అనేకయోజనముల యెత్తె, చిత్రములైన చరియలు గుహా గృహములును గలిగి, రమ్యమైన యాసుమలయపర్వతము యొక్క శిఖర భాగమున, బంగారు కోటగోడలును తోరణములును (బురుజులును) గలిగినదై, నాగవాసములందును గోడల యందును చిత్రములు గలదై, ధనిక భవనముల యొక్కయు రాజభవనములయొక్కయు వరుసలుగలదై నూరుయోజనముల విస్తీర్ణము ముప్పదియోజనముల పొడవును గలదై నిత్య సంతోషముగలదై, విశాలమైనదై లంకయను పురి కలదు. అది కామరూపులైన మహాత్ములైన రాక్షసులకు స్థానము, బలముచే మదించిన వారికి నివాసస్థానము అది దేవశత్రువులగు రాక్షసులకు నివాసము. సంకుచితములు విశాలమై యామహాపురి మనుషులకు జేరనలవిగానిది, సముద్రమునకు తూరుపున ఆ ద్వీపము యొక్క తీరమున గోకర్ణుడను పేరుగల శంకరుని గొప్ప యాలయము గలదు.

తథైకరాజ్యం విజ్ఞేయం శంకద్వీపసమాస్థితమ్ ।

 శతయోజనవిస్తీర్ణం నానామ్లేచ్ఛ గణాలయమ్ ॥

 తత్ర శంకగిరిర్నామ ధౌతశంకదలప్రభః ।

 నానారత్నాకరః పుణ్యః పుణ్యకృద్భిర్ని షేవితః ॥

 శంఖనాగా మహాపుణ్యా యస్మాత్ప్రభవతే నదీ ।

యత్ర శంఖముఖో నామ నాగరాజః కృతాలయః ॥

అట్లే ఒకే రాజ్యముగా నున్నది. శంఖద్వీపమని తెలియవలెను. అది నూరు యోజనముల విస్తీర్ణము గలది. అనేక మ్లేచ్చగణములకు నివాసమయినది. అచట శంఖగిరియను పేరుగల పర్వతము గలదు. అది కడిగిన శంఖపు చిప్పవంటి కాంతిగలది. అనేక రత్నములకు నిధియైనది. పుణ్యమైనది పుణ్యముజేసిన వారిచేత సేవింపబడినది. దానినుండి శంఖనాగయనునది పుట్టి ప్రవహించినది. శంఖముఖుడను నా రాజు దానిని వాసముగా జేసికొనెను.

తథైవ కుముదద్వీపం నానాపుణ్యోపశోభితమ్ ।

 నానాగ్రామసమాకీర్ణం నానారత్నాకరం శివమ్ ॥

కుముదాఖ్యా మహాభాగాదుష్టచిత్త నిబర్హిణీ ।

మహాదేవస్య భగీనీ ప్రభాభిస్తాభిరిజ్యతే ॥

అట్లే కుముద ద్వీపము అనేక పుణ్యములతో బ్రకాశించినది. అనేక గ్రామముల వ్యాపించినది. అనేక రత్నములకు నెలవై శివమై (మంగళమైనది. అచట కుముదాయను మహాభాగ దుష్టచిత్తములను బోగొట్టు నదిగను, మహాదేవుని సోదరిగను, ఆ (మహాదేవ) కాంతులతో బూజింపబడును.

తథా వరాహద్వీపే చ నానామ్లేచ్ఛగణాకులే ।

 నానాజాతి సమాకీర్ణే నానాధిష్ఠానపత్తనే ॥

ధనధాన్యయుతే స్ఫీతే ధర్మిష్టజన సంకులే ।

 నదీశైలవనైశ్చిత్రైర్బహుపుష్ప ఫలోపగైః ॥

వరాహపర్వతో నామ తత్ర రమ్యః శిలోచ్చయః ।

 అనేకకందరదరీ గుహానిర్ఘరశోభితః ॥

 తస్మాత్సురస పానీయా పుణ్యతీర్థ తరంగిణీ ।

 వారాహీ నామ వరద ప్రవృత్తాస్య మహానదీ ॥

 వరాహరూపిణే తత్ర విష్ణవే ప్రభవిష్ణవే ।

అనన్యదేవతాస్తస్మై నమస్కుర్వంతి విప్రజాః ॥

ఏవం షడేతే కథితా అనుద్వీపాః సమన్తతః ।

 భారతద్వీపదేశో వై దక్షిణం బహువిస్తరః ॥

 ఏవమేకమిదం వర్షంబహుద్వీప మిహోచ్యతే ।

 సముద్రజల సంభిన్నం ఖండం ఖండీకృత స్మృతమ్ ॥

ఏవం చతుర్మహాద్వీపః సాంతర ద్వీపమండితః ।

 సానుద్వీపః సమాఖ్యాతో జంబూద్వీపస్య విస్తరః ॥

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామాష్టచత్వారింశోఽధ్యాయ ॥

 అట్లే వరాహద్వీపము అనేక మ్లేచ్ఛగణములతో నిండినది. నానాజాతులతో వ్యాపించినది. అనేక ప్రభుత్వములు పత్తనములును గలది. ధన ధాన్యముల గూడి బలసినది. ధర్మిష్టులైన జనులచే గజిబిజిగానున్నది. దానియందు చిత్రములైన పెక్కు పుష్పఫలములతో గూడిన నదీ పర్వత వనములచే నొప్పిన, వరాహ పర్వతమను నొక పర్వతము గలదు. అది రమ్యమయిన పర్వతము. అనేకములైన కందకములు దరులు గుహలు సెలయేరులు వీనిచే బ్రకాశించినది. ఆ వరాహ పర్వతము నుండి 'వారాహీ' యను మహానది చక్కని రసవంతమైన జలములు గలిగి పుణ్యతీర్థ నదియై బయలుదేరినది. అది భక్తులకు వరములిచ్చునది. అచట బ్రాహ్మణ జన్ములు వరాహావతారరూపియై సర్వప్రభువుగా సమర్థుడైన విష్ణువునకు తదేక దేవతాభక్తులై నమస్కరింతురు. ఈ యేడును ద్వీపములు సంపూర్ణముగా జెప్పబడినవి. భారత ద్వీపదేశము దక్షిణదిశగా బహువిస్తరము. ఒక్కటైన యీ దేశము ఇచట నీ విధముగ బహు ద్వీపములు గలదిగ జెప్పబడినదని తలపబడినది. ఈ విధముగా చతుర్మహా ద్వీపము తనలోని ద్వీపములచే నలంకరింపబడినది. జంబూద్వీపము యొక్క విస్తరము అను ద్వీపముతోబాటు ఈ విధముగ జెప్పబడినది.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబది యెనిమిదవ యధ్యాయము.