50 -  జ్యోతిష్ప్రచారో

సూత ఉవాచ :-

అథః ప్రమాణమూర్థ్వం చ వర్ణ్యమానం నిబోధత

పృధివీ వాయురాకాశ మాపోజ్యోతిశ్చ పంచమమ్

 అనన్తధాతవో హ్యేతే వ్యాపకాస్తు ప్రకీర్తితాః

జననీ సర్వభూతానాం సర్వభూతధరా ధరా

 నానాజనపదాకీర్ణా నానాధిష్ఠానపత్తనా

 నానా నదనదీశైలా నైకజాతి సమాకులా

అనన్తా గీయతే దేవీ పృథివీ బహువిస్తరా

 నదీనద సముద్రస్థాస్తథా క్షుద్రాశ్రయాః స్థితాః

 పర్వతాకాశసంస్థాశ్చ అన్తర్భూమిగతాశ్చ యాః

ఆపోఽనన్తశ్చ విజ్ఞేయాస్తథాగ్నిః సర్వలౌకికః

అనన్తః పఠ్యతే చైవ వ్యాపకః సర్వసంభవః

తథాకాశమనాలంబం రమ్యం నానాశ్రయం స్మృతమ్

అనన్తం ప్రథితం సర్వం వాయుశ్చాకాశసంభవః

 ఆపః పృధివ్యాముదకే పృధివీ చోపరిస్థితా

 ఆకాశం చాపరమధః పునర్భూమిః పునర్జలమ్

ఏవమన్తమనస్తస్య భౌతికస్య న విద్యతే

పురాసురైరభిహితం నిశ్చితం తు నిబోధత

 భూమిర్జలమథాకాశమితి జ్ఞేయా పరంపరా

 స్థితిరేషా తు విజ్ఞేయాసప్తమేఽస్మిన్ రసాతలే

సూతుడనెను:- క్రింది ప్రమాణమును పైని ప్రమాణమును నాచే వర్ణింపబడుదానిని వినుడు. పృథివీ, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు అని యివి (భూతములు) ఐదు. ఇవి యనన్త (లెక్కలేని- ఆకాశముయొక్క) ధాతువులు. ఇవి వ్యాపించునవిగా జెప్పబడినవి, సర్వప్రాణులకు సర్వభూతములను (పృథివ్యాది పంచభూతములను) ధరించునది పృథివి. ఇది అనేక జనపదములతో నిండినది- అనేక అధిష్టానములు పత్తనములు (బహుజనావాసములు వ్యాపారనగరములు) గలది. అనేక నదులు (తూర్పుసముద్రములో గలియునవి) నదములు (పశ్చిమ సముద్రములోగలియునవి)ను శైలములును గలది. అనేక జాతులతోనిండినది. ఈవిధముగా భూదేవి బహువిస్తరయై యనన్తగా (అస్తములేనిదిగా ఆకాశముకంటిదిగా) గానము జేయబడును. నదనదీసముద్రములలోనున్నవియు, అట్లే చిన్న చెరువులును గుంటలనాశ్రయించియున్నవియు, పర్వతమునందును ఆకాశమున మేఘములతోను ఉన్నవియు, భూమిలోపలనున్నవియు, నైన జలములు అనంతముగానే తెలియవలెను. అట్లే అగ్నియు సర్వలోకనివాసియై, అనంతమని చదువబడుచున్నది. అది వ్యాపించినది, అన్నింటికిని పుట్టు కారణము అట్లే యాకాశము నిరాధారమై రమ్యమై యనేకములకాశ్రయముగా జెప్పబడినది. అది యంతయు . అనన్తమని ప్రసిద్ది చెందినది. ఆకాశమునుండి బుట్టిన వాయువు కూడ నట్టిదే. జలము భూమియందు (పైన-లోపల), జలమునందు పైన భూమియు నున్నవి. ఆకాశము మీదను క్రిందనుగలదు. మరల భూమి మరల జలము. ఈ విధముగ భౌతికమైన యాకాశమునకస్తములేదు. ఇది పూర్వము దేవతలచే నిశ్చితముగా జెప్పబడినది. వినుడు. భూమి, జలము తఱువాత ఆకాశము- అని వరుసక్రమము. ఈ యేడవ రసాతలమున (పాతాళ భాగమున) స్థితి యిట్లు తెలియవలెను.

దశయోజనసాహస్రమేకభౌమం రసాతలమ్

 సాధుభిః పరివిఖ్యాతమేకైకం బహువిస్తరమ్

 ప్రథమమతలం చైవ సుతలం తు తతఃపరమ్

తతః పరతరం విద్యాద్వితలం బహువిస్తరమ్

 తతో నభస్తలం నామ పరతశ్చ మహాతలమ్

 శ్రీతలం చ తతః ప్రాహుః పాతాలం సప్తమం స్మృతమ్

 కృష్ణభౌమం చ ప్రథమం భూమిభాగం చ కీర్తితమ్

 పాండుభౌమం ద్వితీయం తు తృతీయం రక్తమృత్తికమ్

పీతభౌమం చతుర్థం తు పంచమం శర్కరాతలమ్

షష్ఠం శిలామయం చైవ సౌవర్ణం సప్తమం తలమ్

 ప్రథమే తు తలే ఖ్యాతమసురేంద్రస్య మందిరమ్

నముచేరింద్రశత్రోర్హి మహానాదస్య చాలయమ్

పురం చ శంకుకర్ణస్య కబంధస్య చ మందిరమ్

 నిష్కులాదస్య చ పురం ప్రహృష్ట జనసంకులమ్

 రాక్షసస్య చ భౌమస్య శూలదస్తస్య చాలయమ్

లోహితాక్షకలింగానాం నగరం శ్వాపదస్య తు

 ధనంజయస్య చ పురం మాహేంద్రస్య మహాత్మనః

కాలియస్య చ నాగస్య నగరం కలసస్య చ

 ఏవం పురసహస్రాణి నాగదాన వరక్షసామ్

 తలే జ్ఞేయాని ప్రథమే కృష్ణభౌమే న సంశయః

పదివేల యోజనములు గలది ఒకే భూమి సంబంధించిన రసాతలము (పాతాళము) అని ఒక్కొకటి బహువిస్తరమైనదిగా సాధువులచే జెప్పబడినది. మొదటిది అతలము, తఱువాతిది సుతలము. ఆతఱువాతిది బహువిస్తరమైన వితలముగా దెలియవలెను. ఆతజువాతది నభస్తలమనునదీ, దాని తజువాతది మహాతలము. తజువాతిది శ్రీతలము. ఆతరువాత పాతాలమేడవదిగా జెప్పబడినది. అందులో కృష్ణభౌమము మొదటి భూమి భాగముగా జెప్పబడినది. పాండుభౌమము రెండవది. మూడవది మృత్తికము. నాలుగవది పీతభౌమము. ఐదవది శర్కరాతలము (ఇసుకయేట) ఆజవది శిలామయము. ఏడవది సౌవర్ణ (బంగారు) తలము. మొదటి తలమున రాక్షస రాజభవనము, ఇంద్రశత్రువైన నముచి యొక్కయు మహానాథుని యొక్కయు భువనములు గలవు. శంకుకుని పురమును, కబంధుని భవనమును గలవు, సంతుష్టజనముతో నిండిన నిష్కులాదుని పురము గూడ గలదు. రాక్షసుడైన భీమునియొక్కయు శూలదక్షుని యొక్కయు భవనములు గలవు. లోహితాక్ష కలింగులయొక్క నగరముగలదు శ్వాపదుని యొక్కయు. ధనంజయుని యొక్కయు, మహాత్ముడైన మహేంద్రుని యొక్కయు నగరములు గలవు. ఈ విధముగా కృష్ణభౌమతలమున నాగ, దానవ, రాక్షసులయొక్క వేలపురములు గలవు. సంశయము లేదు.

ద్వితీయేఽ పి తలే విప్రా దైత్యేంద్రస్య సురక్షసః

మహాజంభస్య చ తథా నగరం ప్రథమస్య తు      

హయగ్రీవస్య కృష్ణస్య నికుంభస్య చ మందిరమ్

 శంఖాఖ్యే యస్య చ పురం నగరం గోముఖస్య చ

 రాక్షసస్య చ నీలస్య మేఘస్య క్రధనస్య చ

 పురం చ కురుపాదస్య మహోష్ణీషస్య చాలయమ్

కంబలస్య చ నాగస్య పురమశ్వతరస్య చ

 కద్రుపుత్రస్య చ పురం తక్షకస్య మహాత్మనః

 ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

ద్వితీయేఽ స్మిన్ తలే విప్రాః పాండుభౌమే న సంశయః

ఓ విప్రులారా! రెండువదైన పాండుభౌమతలమున గూడ దైత్యరాజైన సురక్షసుని యొక్కయు మహాజంభుని యొక్కయు భవనములు గలవు. అట్లే మొదటి, హయగ్రీవునియొక్కయు కృష్ణుని యొక్కయు (రెండవహయగ్రీవుడు కృష్ణుడు విష్ణువుగాబోలు) నికుంభునియొక్కయు భవనములు గలవు. శంఖుడును వానియొక్క పురము, గోముఖుని యొక్క నగరమును గలవు. రాక్షసుడైన నీలునియొక్కయు, మేఘునియొక్కయు, క్రథనుని యొక్కయు పురము గలదు. కురుపాదుని యొక్కయు మహెస్లీషుని యొక్కయు భవనములు గలవు. కంబలుని యొక్కయు నాగుని యొక్కయు, అశ్వతరుని యొక్కయు పురములు గలవు, కద్రువపుత్రుడై మహాత్ముడైన తక్షకుని పురము గూడ కలదు. ఈ విధముగా రెండవదైన పాండుభౌమమునందు నాగదానవరాక్షసులయొక్క వేల పురములు గలవు. సంశయము లేదు.

తృతీయే తు తలే ఖ్యాతం ప్రహ్లాదస్య మహాత్మనః

 అనుహ్లాదస్య చ పురం దైత్యేంద్రస్య మహాత్మనః

తారకాఖ్యస్య చ పురం పురం త్రిశిరసస్తథా

శిశుమారస్య చ పురం హృష్టపుష్పజనాకులమ్

 చ్యవనస్య చ విజ్ఞేయం రాక్షసస్య చ మందిరమ్

రాక్షసేంద్రస్య చ పురం కుంభిలస్య ఖరస్య చ

 విరాధస్య చ క్రూరస్య పురముల్కా ముఖస్య చ

హేమకస్య చ నాగస్య తథాపాండురకస్య చ

 మణిమంత్రస్య చ పురం కపిలస్య చ మందిరమ్

 నందస్య చోరగపతేర్విశాలస్య చ మందిరమ్

ఏవం పురం సహస్రాణి నాగదానవరక్షసామ్

తృతీయేఽస్మింస్తలే విప్రాః పీతభౌమేన సంశయః

రక్తమృత్తిక (పీతభౌమ)మను మూడవతలమున మహాత్ముడైన ప్రహ్లాదుని యొక్కయు దైత్యరాజైన మహాత్ముడైన ప్రహ్లాదుని యొక్కయు ప్రసిద్దమైన పురము గలదు. తారకుడను వానీపురమును అట్లే త్రిశిరస్సుని యొక్క పురమును గలవు. హృష్టపుష్టజనులతో నిండిన శిశుమారుని యొక్క పురము గూడ గలదు. చ్యవనుడను రాక్షసుని యొక్క భవనమున్నదని తెలియవలెను. రాక్షసరాజైన కుంభిలుని యొక్కయు, ఖరుని యొక్కయు పురము గలదు. క్రూరుడైన విరాధుని యొక్కయు, ఉల్కాముఖుని యొక్కయు పురము గలదు. హేమకుని యొక్కయు నాగుని యొక్కయు అట్లే పాండురకుని యొక్కయు పురములుగలవు. మణిమంత్రునిపురము. కపిలునిభవనమును నందుని యొక్కయు ఉరగపతియైన విశాలుని యొక్కయు భవనములు గలవు. ఓ విప్రులారా! ఈవిధముగా మూడవదగు రక్తమృత్తికమను తలమున నాగదానవరక్షస్సుల యొక్కవేలపురములు గలవు.

చతుర్థే దైత్యసింహస్య కాలనేమేర్మహాత్మనః

గజకర్ణస్య చ పురం నగరం కుంజరస్య చ

 రాక్షసేంద్రస్య చ పురం సుమాలేర్బహు విస్తరమ్

 ముంజస్య లోకనాథస్య వృకవక్త్రస్య చాలయమ్

 బహుయోజన సాహస్రం బహుపక్షి సమాకులమ్

నగరం వైనతేయస్య చతుర్థేఽస్మిన్ రసాతలే

 పంచమే శర్కరాభౌమే బహుయోజనవిస్తృతే 

 విరోచనస్య నగరం దైత్యసింహస్య దీమతః

 వైదూర్యస్యాగ్నిజిహ్వస్య హిరణ్యాక్షస్య చాలయమ్

 పురం చ విద్యుజ్జిహ్వస్య రాక్షసస్య చ ధీమతః

మహామేఘస్య చ పురం రాక్షసేంద్రస్య శాలినః

కర్మారస్య చ నాగస్య స్వస్తికస్య జయస్య చ

 ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

 పంచమే తథా జ్ఞేయం శర్కరానిల యే సదా

నాలగవ (పీతభౌమమను) తలమున దైత్యశ్రేష్ఠుడైన కాలనేమి యొక్కయు, గజకర్ణుని యొక్కయు పురములు గలవు. కుంజరుని నగరము గూడ కలదు. రాక్షసేంద్రుడైన సుమాలియొక్క బహువిస్తరమైన పురము గలదు. లోకనాథుడైన ముంజుని యొక్కయు వృకవక్రుని యొక్కయు భవనములు గలవు. అనేక వేలయోజనములు గలదియు, అనేక పక్షులతో నిండినదియు నై వైనతేయు (గరుడు)ని నగరము ఈ నాలుగవ రసాతలమున గలదు, బహుయోజనములు విస్తరించిన యైదవ శర్కరాభౌమమున దైత్యశ్రేష్ఠుడై ధీమంతుడైన విరోచనుని నగరము గలదు. వైదూర్యునియొక్కయు, అగ్నిజిహ్వునియొక్కయు, హిరణ్యాక్షునియొక్కయు భవనములు గలవు. రాక్షసుడై బుద్ధిమంతుడైన విద్యుజ్జిహ్వునియొక్క పురము గలదు. మహామేఘుని యొక్కయు, రాక్షసేంద్రుడైన శాలియొక్కయు, కర్మారుని యొక్కయు, నాగునియొక్కయు, స్వస్తికానియొక్కయు, జయునియొక్కయు పురములు గలవు. ఈ విధముగానే ఐదువదియైన శర్కరానిలయమున నాగ-దానవ-రక్షస్సుల యొక్క వేలయిండ్లు ఎల్లప్పుడును గలవు.

షష్ఠే తలే దైత్యపతేః కేసరేర్నగరోత్తమమ్

 సుపర్వణః సులోమ్నశ్చ నగరం మహిషస్య చ

రాక్షసేంద్రస్య చ పురముత్క్రోశస్య మహాత్మనః

తత్రాస్తే సురసా పుత్రః శీతశీర్షోముదాయుతః

 కశ్యపస్య సుతః శ్రీమాన్ వాసుకిర్నామ నాగరాట్

ఏవం పురసహస్రాణి నాగదానవరక్షసామ్

 షష్ఠే తలే స్మిన్ విఖ్యాతే శిలాభౌమే రసాతలే

ఆఱవదైన శిలాభౌమతలమున దైత్యపతియైన కేసరి యొక్క నగరశ్రేష్ఠముగలదు. సుపర్వణునియొక్కయు, సులోముని యొక్కయు మహిషునియొక్కయు నగరములు గలవు. రాక్షసరాజై మహాత్ముడైన ఉత్ర్కేశునియొక్కపురముగలదు. అచట సంతోషముతో గూడిన సురసాపుత్రుడగు శతశీర్పుడు గలడు. కశ్యపమహర్షి సుతుడై శ్రీమంతుడైన వాసుకి యను నాగరాజు గలడు. ఈ విధముగ ప్రఖ్యాతమై యాజవదైన శిలాభౌమమున పాతాళమున నాగదానవరక్షస్సులయొక్క వేలపురములు గలవు.

సప్తమే తు తలే జ్ఞేయం పాతాలే సర్వపశ్చిమే

 పురం బలేః ప్రముదితం నరనారీసమాకులమ్

అసురాశీవిషైః పూర్ణముద్ధృతైర్దేవశత్రుభిః

 ముచుకుందస్య దైత్యస్య తత్ర వై నగరం మహత్

అనేకైర్దితిపుత్రాణాం సముదీర్లైర్మహాపురైః

 తథైవ నాగనగరైః బుద్ధిమద్భిః సహస్రశః

 దైత్యానాం దానవానాం చ సముదీర్లైర్మహాపురైః

 ఉదీర్లైరాక్షసావాసై రనేకైశ్చ సమాకులమ్

అన్నింటికీని పశ్చిమముగా నుండి యేడవదైన పాతాళమున (సౌవర్ణభౌమమున) మిక్కిలి సంతుష్టమైనదియు స్త్రీ పురుషులతో నిండినదైన బలియొక్క పురము గలదు. విజృంభించిన దేవశత్రువులైన రాక్షస సర్పములచే నిండినదై రాక్షసుడైన ముచుకుందునియొక్కమహానగరమచటనే కలదు. దితిపుత్రులైన రాక్షసులయొక్క విశాలములైన యనేక మహాపురములచేతను, అట్లే సుసంపన్నములైన వేలకొలదీ నాగనగరములచేతను, దైత్యులయొక్కయు, దానవులయొక్కయు విశాలములైన మహాపురములచేతను, విశాలములైన యనేక రాక్షసభవనములచేతను ఆ సౌవర్ణభౌమ పాతాళతలమునిండియున్నది.

పాతాలాన్తే చ విప్రేంద్ర విస్తీర్ణే బహుయోజనే

ఆస్తే రక్తారవిందాక్ష మహాత్మాహ్యజరామరః

 ధౌతశంఖోదరపుర్నీలవాసా మహాభుజః

 విశాలభోగో ద్యుతిమాంశ్చిత్రమాలాధరో బలీ

 రుక్మశృంగావదా తేన దీప్తాస్యేన విరాజతా

 ప్రభుర్ముఖ సహస్రేణ శోభతే వై సకుండలీ

 సజిహ్వామాలయా దేవో లోలజ్వాలానలార్చిషా

 జ్వాలామాలాపరిక్షిప్తః కైలాస ఇవ లక్ష్యతే

స తు నేత్రసహస్రేణ ద్విగుణేన విరాజతా

బాలసుర్యాభితామ్రేణ శోభతే స్నిగ్ధమండలః

 తస్య కుందేందు వర్ణస్య అక్షమాలా విరాజతే

 తరుణాదిత్య మాలేవ శ్వేతపర్వతమూర్థని

 జటాకరాలో ద్యుతిమాన్ లక్ష్యతే శయనా సనే

విస్తీర్ణ ఇవ మేదిన్యా సహస్రశిఖరో గిరిః

మహాభోగైర్మహాభాగైర్మహానాగైర్మహాబలైః

 ఉపాస్యతే మహాతేజా మహానాగపతిః స్వయమ్

 స రాజా సర్వనాగానాం శేషో నామ మహాద్యుతిః

 సా వైష్ణవీ హ్యహితనుర్మర్యాదాయాం వ్యవస్థితా

సప్తైవ మేతే కథితా వ్యవహార్యా రసాతలాః

దేవాసుర మహానాగరాక్ష సాధ్యుషితాః సదా

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా బహుయోజనవిస్తారముగల పాతాలాన్తమున జరామరణములులేని మహాత్ముడైన ఎట్టకమలములవంటి కన్నులుగల శ్రీమహావిష్ణువుండును. కడిగిన శంఖమధ్యభాగమువలె తెల్లని శరీరము గలవాడును, నల్లని వస్త్రముగలవాడును, పెద్దభుజములు గలవాడును, విశాలమైన పడగలు గలవాడును, చక్కని కాంతిగలవాడును, చిత్రమైన మాలలను ధరించినవాడును, బలియైయునైన శేషుడచటనే యుండును. బంగారుకొమ్మలచే పచ్చనై వెలిగిన   ముఖముచే బ్రకాశించుచున్న ప్రభువైన యా కుండలి (శేషుడు) వేయి ముఖములతో బ్రకాశించుచున్నాడు. చంచలమైనయగ్నియొక్క మంటలుగల నాలుకవరుసతో (రుద్రుని) జ్వాలామాలలచే వ్యాపించిన కైలాసపర్వతమువలె ఆశేషుడు కనబడుచున్నాడు. ఆ శేషుడు, బాలసూర్యునివలె నెఱ్ఱనైన రెండు వేల కన్నులతో బ్రకాశించుచు దట్టముగా దేహముతో జుట్టుకొన్న మండలము గలవాడై వెలుగుచుండును. మల్లెలవలెను చంద్రునివలేను తెల్లనైనయాతని యొక్క అక్షమాల (అకారాది క్షకారాంతవర్ణమాల శ్వేతపర్వత (హిమాలయపర్వత) శిరస్సుల పై ప్రతిబింబించియున్న ప్రాతఃకాలోదిత సూర్యుపంక్తివలెనున్నది. జటలతో భయంకరుడుగానున్న యాశేషుడు శయనాసనమున (పడుకొనియుండు యోగాసనము) గనబడును. అప్పుడాతడు సహస్రశిఖరములుగల పర్వతము భూమి పై విస్తరించినదా యన్నట్లుండును. మహాతేజస్వియై మహానాగులకు పతియైన శేషుడు గొప్పపడగలుగలిగి మహాభాగ్యవంతులైన మహాబలవంతులైన మహానాగులచే స్వయముగా నుపాసింపబడును. ఆతడు సర్వనాగులకును రాజు. మహాతేజస్సుగలవాడు. శేషుడను పేరుగలవాడు. ఆతని యాసర్పశరీరము మహావిష్ణువునకు సంబంధించినదై మర్యాదలో (అందరిచే గౌరవింపబడి)నున్నది. ఈ విధముగా జెప్పబడినవి యేడు పాతాళలోకములుగా వ్యవహరింపదగినవి. అవి యెల్లప్పుడును దేవ-అసుర-మహానాగ-రాక్షసులచే నివసింపబడినవి.

అతఃపరమానాలోక్యమగమ్యం సిద్ధసాధుభిః

 దేవానామప్యవిదితం వ్యవహారవివర్జితమ్

 పృథివ్యగ్న్యంబు వాయూనాం నభసశ్చ ద్విజోత్తమాః

మహ త్త్వమేవ మృషిభిర్వర్ణ్యతే నాత్ర సంశయః

ఆ తఱువాత సిద్ధసాధువులకు గూడ చూడనలవిగానిది, పోవనలవిగానిది, దేవతల కుగూడ తెలియనది, ఏ వ్యవహారములు లేనిది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఋషులచేత నిట్లే పృథివి-అగ్ని-జల- వాయు ఆకాశముల గొప్పతనము వర్ణింపబడును. ఇచట సంశయము లేదు.

అతః ఊర్ధ్వుం ప్రవక్ష్యామి సూర్యచంద్రమసోర్గతిమ్

సూర్యాచంద్రమసావైతౌభ్రమన్తౌ  యావదేవ తు

ప్రకాశతః స్వభాభిస్తౌ మండలాభ్యాం సమాస్థితౌ

 సప్తానాం చ సముద్రాణాం ద్వీపానాం తు సవిస్తరః

విస్తరార్థం పృధివ్యాస్తు భవేదన్యత్ర బాహ్యతః

 పర్యాసపారిమాణ్యం తు చంద్రాదిత్యౌ ప్రకాశతః

పర్యాసపారిమాణ్యే న భూమేస్తుల్యం దివం స్మృతమ్

 అవతి త్రీనిమాన్ లోకాన్ యస్మాత్ సూర్యః పరిభ్రమన్

అవధాతుః ప్రకాశాఖ్యోహ్యవనాత్సరవిః స్మృతః

ఆ పైన సూర్యచంద్రులగతిని జెప్పెదను. ఈ సూర్యచంద్రులు ఎంతవరకు తిరుగుచుందురో అంతవరకు మండలాకారములతో నుండి తమకాంతులతో బ్రకాశింతురు. సప్తసముద్రములయొక్కయు ద్వీపములయొక్కయు పూర్వము జెప్పబడినదే విస్తరము. భూమియొక్క విస్తరమునకై వెలుపలగా మరొకచోట విస్తరముండును. చంద్రసూర్యులు పర్యాసపారిమాణ్యమునుబట్టి (భ్రమణ-పరిభ్రమణములపరిమాణమును బట్టి) ప్రకాశింతురు. ఈభ్రమణ పరిభ్రమణముల పరిమాణముచేత భూమికి ఆకాశము సమానమనబడినది. (సూర్యచంద్రులకాంతి వ్యాపించునాకాశముగావచ్చు). సూర్యుడు పరిభ్రమించుచు మూడులోకములను ప్రకాశింపజేయును గావునను అవధాతువు ప్రకాశార్థకమైనందునను, అవనము (ప్రకాశమును) జేయుటవలనను రవియని చెప్పబడును.

అతః పరం ప్రవక్ష్యామి ప్రమాణం చంద్రసూర్యయోః

 మహితత్వాన్మహీశబ్ధో హ్యస్మిన్వర్షే నిపాత్యతే

 అస్య భారతవర్షస్య విష్కంభం తు సువిస్తరమ్

మండలం భాస్కరస్యాథ యోజనానాం నిబోధత

 నవయోజనసాహస్రో విస్తారో భాస్కరస్య తు

విస్తారాత్త్రి గుణశ్చాస్య పరిణాహోఽథ మండలమ్

విష్కంభో మండలస్యైవ భాస్కరాద్ద్విగుణః శశీ

అతఃపృథివ్యాం వక్ష్యామి ప్రమాణం యోజనైః సహ

సప్తద్వీపసముద్రాయ విస్తారో మండలం చ యత్

ఇత్యేతదిహ సంఖ్యాతం పురాణం పరిమాణతః

తద్వక్ష్యామి ప్రసంఖ్యాయ సాంప్రతైరభిమానిభిః

 అభిమాని వ్యతీతా యే తుల్యాస్తే సాంప్రవైరిహ

 దేవా యే వై హ్యతీతాస్తే రూపై ర్నామభిరేవ చ

 తస్మాత్తు సాంప్రతైర్దేవైర్వక్ష్యామి వసుధాతలమ్

దివస్తు సన్నివేశో వై సాంప్రతైరేవ కృత్స్నః

 శతార్ధకోటివిస్తారా పృథివీ కృత్స్నతః స్మృతా

తస్యావార్ధ ప్రమాణేన మేరోర్యైచాతురన్తరమ్

 పృథివ్యా వార్ధ విస్తారో యోజనాగ్రాత్ప్రకీర్తితః

 మేరుమధ్యాత్ప్రతిదేశం కోటిరేకాదశస్మృతాః

 తథా శతసహస్రాణి ఏకోన నవతిః పునః

 పంచాశచ్చ సహస్రాణి పృథివ్యా వార్ధ విస్తరః

 పృథివ్యా విస్తరం కృత్స్నం యోజనైస్తన్ని బోధత

 తిస్రః కోట్యస్తు విస్తారః సంఖ్యాతః స చతుర్దిశమ్

తథా శతసహస్రాణామేకోనాశీతి రుచ్యతే

సప్తద్వీపసముద్రాయాః పృథివ్యాస్త్యేష విస్తరః

 విస్తారాత్త్రిగుణం చైవ పృథివ్యన్తస్య మండలమ్

గణితం యోజనాగ్రం తు కోట్యస్త్యే కాదశస్మృతాః

 తథా శతసహస్రం తు సప్తత్రింశాధికాని తు

ఇత్యేతద్వై ప్రసంఖ్యాతం పృథివ్యన్తస్య మండలమ్

తారకా సన్నివేశస్య దివియావద్ధి మండలమ్

 పర్యాసః సన్నివేశస్య భూమేస్తావత్తు మండలమ్

పర్యాస పారిమాణ్యేన భూమేస్తుల్యం దివం స్మృతమ్

 సప్తానామపి లోకానామేతన్మానం ప్రకీర్తితమ్

పర్యాసపారిమాణ్యేన మండలానుగతేన చ

ఉపర్యుపరిలోకానాం ఛత్రవత్పరి మండలమ్

 సంస్థితిర్విహితా సర్వాయేషు తిష్ఠన్తి జన్తవః

ఏతదండకటాహస్య ప్రమాణం పరికీర్తితమ్

అండస్యాంతస్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ

 భూర్లో కశ్చ భువశ్చైవ తృతీయః స్వరితి స్మృతః

 మహర్లోకో జనశ్చైవ తపః సత్యశ్చ సప్తమః

 ఏతే సప్తకృతాలోకా శ్చత్రాకారా వ్యవస్థితాః

 స్వకైరావరణైః సూక్ష్మార్ధార్యమాణాః పృథక్ పృథక్

 దశభాగాధికాభిశ్చ తాభిః ప్రకృతిభి ర్బహిః

 ధార్యమాణా విశేషైశ్చ సముత్పన్నైః పరస్పరమ్

ఆ తరువాత చంద్రసూర్యుల ప్రమాణమును జెప్పెదను. మహితమై (గొప్పదై) నందున మహీశబ్దమాదేశమునందుని పతింపబడును. ఈ భారతవర్ష (దేశము యొక్క విరివి మిక్కిలి విస్తారమైన మండలము. తరువాత సూర్యునియొక్క యోజనముల విస్తారమును వినుడు. సూర్యుని యొక్క విస్తారము తొమ్మిది వేల యోజనములు. ఈ విస్తారమునకన్న మూడింతలు వైశాల్యము విష్కంభము మండలమునకున్నంతటిదే. చంద్రుడు సూర్యునికన్న రెండింతలవాడు. తరువాత భూమియందలి ప్రమాణములను యోజనములతో సహ చెప్పెదను. సప్తద్వీప సముద్రములుగల భూమీయొక్క విస్తారము మండలమును ఏదికలదో, పరిమాణముగా ప్రాచీనముగా నిదియిట్లని యిచట లెక్కించి చెప్పబడినదో దానిని అభిమానులచే సాంప్రతులచే లెక్కించి చెప్పెదను. ఇచట అభిమాన వ్యతీతులెవరో వారు సాంప్రతులతో సమానులు. రూపనామములచే అతీతులైన దేవతలు గూడ సాంప్రతులతో సమానులు. కావున సాంప్రతులైన దేవతలచే వసుధాతలమును జెప్పెదను ఆకాశముయొక్క సన్నివేశము అంతటను సాంప్రతులచేతనే యేర్పడినను, భూమిమొత్తము ఏబదికోట్ల విస్తారముగలదని చెప్పబడినది. మేరువు యొక్క చాతురంతరము ఇరువదియైదుకోట్ల ప్రమాణముతో నుండును. లేదా భూమియొక్క సగము విస్తారము యోజనముయొక్క అగ్రమునుండి చేప్పబడినది. మేరువు మధ్యనుండి ప్రతి దిక్కున పదునొకండుకోట్లు (విస్తారము) చెప్పబడినవి. లేదా అట్లే నూరువేలును మరల ఎనుబదితొమ్మిదియు, ఏబదివేలును, పృథివియొక్క సగము విస్తారము. భూమియొక్కమొత్తము విస్తారము యోజనములచే (లో) వినుడు. మూడుకోట్లు విస్తారము చెప్పబడినది. అది నాలుగు దిక్కులది. అట్లే నూరువేల యేనుబది తొమ్మిదియని చెప్పబడినది. సప్తద్వీపసముద్రములుగల భూమియొక్క విస్తారమిది. పృథివ్వంతముయొక్క మండలముపై విస్తారమునకన్న మూడింతలుగలది. యోజనాగ్రము గణింపబడినది పదునొకండు కోట్లని చెప్పబడినది. అట్లే నూరువేల ముప్పదియేడును. ఈ విధముగ పృథివ్యంతముయొక్క మండలము లెక్కించి చెప్పబడినది. ఆకాశమున తారకల సన్నివేశము మండలముగానెంత వరకుండునో భూమి సన్నివేశముయొక్క పర్యాసము (చుట్టుఉనికి) అంతవఱకు మండలము. పర్యాసపారిమాణ్యముచేత భూమికి సమానమాకాశమని చెప్పబడినది. ఏడులోకములకు గూడనిదియే పరిమాణమనబడినది. మండలానుగతమైన పర్యాసపారిమాణ్యముచేత పై పైలోకములయొక్క మండలము ఛత్రమువలె నుండును. ప్రాణులుండు లోకములయొక్క స్థితియంతయు చెప్పబడినది. ఇది అండకటాహముయొక్క బ్రహ్మాండమనుకడవ (తాబేటిచిప్ప) యొక్క ప్రమాణమదియని చెప్పబడినది. ఆ మండలము యొక్క లోపల ఈ లోకములుండును. సప్తద్వీపములుగల భూమియంతయు కలది. భూలోకము, భువర్లోకము, మూడవదైన స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, ఏడవదైన సత్యలోకము- ఈ యేడులోకములు చేయబడి (సృష్టింపబడి) (భూమికి) ఛత్రాకారములుగా (పై పైన) -నిర్మింపబడినవి. అవి తమ తమ యావరణములచే వేరువేరుగా ధరింపబడుచున్నవి. పదిభాగములధికముగా గల ప్రకృతుల చేతను వెలుపలనుత్పన్నములైన విశేషములచేతను పరస్పరము ధరింపబడుచున్నవై యుండును.

అస్యాండస్య సమంతాచ్చ సన్నివిష్టో ఘనోదధిః

పృథివీమండలం కత్స్నం ఘనతోయేన ధార్యతే

 ఘనోదధి పరేణాథ ధార్యతే ఘనతేజసా

బాహ్యతో ఘనతేజస్తు తిర్యగూర్థ్యం తు మండలమ్

సమన్ తాధనవాతేన ధార్యమాణాం ప్రతిష్ఠితుమ్

ఘనవాతాత్త ధాకాశమాకాశం చ మహాత్మనా

భూతాదినావృతం సర్వం భూతాదిర్మహతా వృతః

 వృతో మహాననన్తేన ప్రధానేనావ్యయాత్మనా

 పురాణి లోకపాలానాం ప్రవక్ష్యామి యథాక్రమమ్

జ్యోతిర్గణప్రచారస్య ప్రమాణం పరివేక్ష్యతే

ఈ యండమంతటను గొప్పసముద్రము ప్రవేశించియున్నది. భూమండలమంతయు మహాజలములతో ధరింపబడుచున్నది. ఆ తరువాత మహాజలమునకు పరముగా (పైగా) గొప్ప తేజస్సుచే (భూమి ధరింపబడుచున్నది. అడ్డముగాను నిలువుగాను వెలుపలగా గొప్పతేజము మండలముగానుండును. తరువాత గొప్పవాయువుచే (మండలముచే) ధరింపబడుచున్న భూమిని నిలుపుటకు ఆ గొప్పవాయువు (మండలము) తరువాత ఆకాశము మహాత్మయై భూతాదిచే మొత్తమావరింపబడినది. భూతాది మహత్తుచే నావరింపబడినది. మహత్తు నాశములేని స్వరూపము గలిగి అనన్తమైన ప్రధానముచేత (ప్రకృతిచేత) ఆవరింపబడినది. ఇక లోకపాలురయొక్క పురములను క్రమముగా జెప్పెదను. జ్యోతిర్గణ ప్రచారముయొక్క (నక్షత్ర తారాగ్రహ సంచారము యొక్క) ప్రమాణమును జెప్పెదను.

మేరోః ప్రాచ్యాం దిశి తథా మానసస్యైవ మూర్ధని

 వస్వోకసారామాహేంద్ర పుణ్యహేమపరిష్కృతా

దక్షిణేన పునర్మేరో ర్మానసస్యైవ మూర్ధని

వైవస్వతో నివసతి యమః సంయమనే పురే

 ప్రతీచ్యాం తు పునర్మేరో ర్మానసైవ మూర్ధని

సుఖా నామ పురీ రమ్యా వరుణస్యాథ ధీమతః

దిశ్యుత్తరస్యాం మేరోస్తు మానసస్యైవ మూర్ధని

తుల్యా మాహేంద్రపుర్యా తు సోమస్యాపి విభావరీ

 మానసోత్తరపృష్ఠే తు లోకపాలాశ్చతుర్దిశమ్

స్థితా ధర్మవ్యవస్థాయై లోకసంరక్షణాయ చ

లోకపాలోపరిష్టాత్తు సర్వతో దక్షిణాయనే

 కాష్ఠాగతస్య సూర్యస్య గతిర్యాతాం నిబోధత

మేరువునకు తూర్పు దిక్కునను, అట్లే మానస సరోవరము యొక్క శిరముననుండి మహేంద్రునకు సంబంధించినదియు పుణ్యమై బంగారుచే నలంకరింపబడిన వస్వోకసార (బంగారునిధులసారము గలది అమరావతి)యను పురము గలదు. తరువాత మేరువునకు దక్షిణముగా మానస సరస్సుయొక్క శిరస్సుననే సంయమనమను పురమున సూర్యపుత్రుడైన యముడు నివసించును. మేరువునకు పశ్చిమమున మానససరస్సు యొక్క శిరముననే బుద్ధిమంతుడైన వరుణునియొక్క పురము సుఖమను పేరుగలది కలదు-89. తరువాత మేరువు యొక్క యుత్తరదిక్కున మానస సరస్సుయొక్క శరీరముననే మహేంద్ర పురితో (అమరావతితో) సమానమైన సోమునియొక్క పురి విభావరి యనునది కలదు. ధర్మవ్యవస్థ కొరకును లోకసంరక్షణము కొరకును మానస సరస్సు యొక్క ఉత్తరపృష్టి (వెనుక) భాగమున నాలుగు దిక్కులలో లోకపాలురు (పైవిధముగా) నున్నారు. లోకపాలకులైన దక్షిణాయనమున నంతటను కాష్ఠాగతుడైన (ఆదిక్కునందున్న) సూర్యునియొక్క గమనమేది కలదో దానిని జెప్పెద వినుడు.

దక్షిణే ప్రక్రమే సూర్యః క్షిప్తే షురివ సర్పతి

జ్యోతిషాం చక్ర మాదాయ సతతం పరిగచ్చతి

మధ్యగశ్చామరావత్యాం యదా భవతి భాస్కరః

 వైవస్వతే సంయమనే ఉదయస్తత్ర ఉచ్యతే

 సుఖాయామర్ధరాత్రిం చ మధ్యగః స్యాద్రవిర్యదా

 సుఖాయామథ వారుణ్యాముత్తిష్ఠన్ స తు దృశ్యతే

 విభాయామర్ధరాత్రం స్యాన్మాహేంద్య్రామస్తమేతి చ

 తథా దక్షిణపూర్వేషా మర్ధరాత్రో విధీయతే

 దక్షిణాపరదేశ్యానాం పూర్వాహ్ణః పరికీర్త్యతే

 తేషామపరిరాత్రం చ యే జనా ఉత్తరాపథే

 దేశా ఉత్తర పూర్వా మే పూర్వరాత్రం తు తాన్ ప్రతి

 ఏవ మేవోత్తర కోణేషు భవనేషు విరాజతే

సుఖాయామథవారుణ్యాం మధ్యాహ్నే చార్యమా యదా

విభావర్యాం సోమపుర్యాముత్తిష్ఠతి విభావసుః

రాత్య్రర్థం చామరావత్యామన్తమేతి యమస్య చ

 సోమపుర్యాం విభాయాం తు మధ్యాహ్నే స్యాద్దివాకరః

మహేంద్రస్యామరావత్యాముత్తిష్ఠతి యదా రవిః

 అర్ధరాత్రం సంయమనే వారుణ్యామస్తమేతి చ

 స శీఘ్రమేతి పర్యేతి భాస్కరోఽ లాతచక్రవత్

భ్రమన్ వైభ్రమమాణాని ఋక్షాణి గగనే రవి

ఏవం చతుర్షు ద్వీపేషు దక్షిణాంతేన సర్పతి

ఉదయాస్తమనే నాసావుత్తిష్ఠతి పునః పునః

 పూర్వాహ్ణే చాపరాహ్ణే తు ద్వౌ ద్వౌ దేవాలయౌ తు సః

తపత్యేకం తు మధ్యాహ్నే తైరేవ తు సరశ్మిభిః

ఉదితో వర్ధమానాభిరామధ్యాహ్నం తపన్ రవిః

అతః పరం హ్రసన్ తీభి ర్గోభిరస్తం స గచ్ఛతి

 ఉదయాస్తమయాభ్యాం హి స్మృతే పూర్వాపశౌ దిశౌ

 యాత్పరస్తాత్తపతి తావత్పృష్ఠే తు పార్శ్వయోః

 యత్రోద్యన్ దృశ్యతే సూర్యస్తేషాం స ఉదయః స్మృతః

యత్రప్రణాశమాయాతి తేషామస్తః స ఉచ్యతే

 సర్వేషాముత్తరే మేరుర్లోకాలోకస్తు దక్షిణే

 విదూరభావాదరస్య భూమేర్లేఖావృతస్య చ

 హ్రియన్తే రశ్మయో యస్మాత్తేన రాత్రౌ న దృశ్యతే

గ్రహనక్షత్రతారాణాం దర్శనం భాస్కరస్య చ

ఉచ్ఛ్రాయస్య ప్రమాణేన జ్ఞేయమస్తమనోదయమ్

 శుక్లచ్ఛాయోఽగ్నిరాపశ్చ కృష్ణచ్ఛాయా చ మేదినీ

 విదూరభావావర్కస్య ఉద్యతస్య విరశ్మితా

రక్తాభావో విరశ్మిత్వాత్ రక్తత్వాచ్చాప్యనుష్ణతా

 లేఖయావస్థితః సూర్యో యత్ర యత్ర తు దృశ్యతే

ఊర్థ్వం గతం సహస్రం తు యోజనానాం స దృశ్యతే

 ప్రభా హి సౌరీ పాదేన అస్తం గచ్చతి భాస్కరే

అగ్నిమావిశతే రాత్రౌ తస్మాద్దూరాత్ప్రకాశతే

 సూర్యుడు దక్షిణాయనమున క్షిప్రేషువు (వేసిన బాణము)వలె పోవును. ఆ విధముగా సూర్యుడు జ్యోతిస్సులయొక్క నక్షత్ర తారాగ్రహముల చక్రమును వెంటబెట్టుకొని యెల్లప్పుడు తిరుగుచునే యుండును. ఎప్పుడూ సూర్యుడు మధ్యన నుండి యమరావతి యందుండునో అప్పుడు యమపురియైన సంయమనమున సూర్యోదయమని చెప్పబడును. అట్లే యెప్పుడు సూర్యుడు మధ్యగుడగునో వరుణపురియైన సుఖయందు అర్థరాత్రమగును. ఆ తరువాత వరుణపురియైన సుఖయందుదయించుచు సూర్యుడు కనబడును. సోమపురియైన విభా (వరి) యందు అర్థరాత్రియగును. మాహేంద్రియైన యమరాతి యందు సూర్యోదయమగును. అప్పుడు ఆగ్నేయ దేశములకర్థరాత్రియగునని చెప్పబడినది. నైఋత్య దేశవాసులకు పూర్వాప్తమగునని చెప్పబడినది. ఉత్తరాపథమున నుండువారికి అపరరాత్రి యగును. ఈశాన్య దేశవాసులకు పూర్వ రాత్రియగును. ఈ విధముగనే యుత్తరదేశములందలి భవనములపై సూర్యుడు విరాజిల్లుచుండును. ఆ తరువాత, వారుణ్యపురియైన ‘సుఖ’ యందు సూర్యుడుదయించును. అపుడు అమరావతి యందు అర్ధరాత్రియు, యమపురియైన సంయమనమున సూర్యుడుండును. సూర్యుడు మహేంద్రుని యమరావతిలో నుదయించునపుడు యమపురియైన సమయమున అర్ధరాత్రియు, వరుణపురియైన ‘సుఖ’సూర్యాస్తమయమును జరుగును. ఆ సూర్య కొలవులతో జేయబడిన చక్రమువలె వేగముగా బోవును వేగముగా జుట్టిపోవును. (భ్రమించును పరిభ్రమించునుగాబోలు?) ఆకాశమున సూర్యుడు తిరుగుచునే తిరుగుచున్న నక్షత్రములను జుట్టి వచ్చును. ఈవిధముగా దక్షిణదిక్కుచివరగా సూర్యుడు (దక్షిణాయనమున) నాలుగు ద్వీపములలో రుగును. ఈ సూర్యుడు తన యుదయాస్తమయములచే మరల మరల పైకి లేచును. ఆ సూర్యుడు పూర్వాష్ణ మునను అప రాష్ట్రమునను రెండేసి దేవాలయములను తపింపజేయును (ప్రకాశింపజేయును). ఆ కిరణములతోనే యాసూర్యుడు మధ్యాహ్నముననొక దేవాలయమును తపింపజేయును. ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నము వరకు వృద్ధిచెందుచున్న తన కిరణములచేత తపింపజేయుచు బోవును. అట్లే ఆ తరువాత తన క్షీణించు కిరణములచేత తపింపజేయుచు అస్తముజెందును. సూర్యుని యుదయమున పూర్వదిక్కనియు, అస్తమయమున పశ్చిమదిక్కనియు జెప్పబడినవి.సూర్యుడంతవరకు ముందు ప్రకాశించునో అంతియే వెనుకను, ఇరుప్రక్కలను ప్రకాశించును. ఎచట సూర్యుడుదయించుచు గనబడునో వారికది సూర్యోదయమనబడును. ఎచట సూర్యుడు గనపడకుండబోవునో అది వారికి సూర్యాస్తమయమనబడును. అందరికీని ఉత్తరమున మేరువుండును దక్షిణమున లోకాలోకపర్వతముండును. సూర్యుడు మిక్కిలి దూరముగా నుండుటచేతను, భూమియొక్క లేఖచే (మండల రేఖ) ఆవరింపబడిన సూర్యునియొక్క కిరణములు హరింపబడినందున రాత్రియందు సూర్యుడు కనబడడు. గ్రహనక్షత్ర తారలయొక్కయు సూర్యుని యొక్కయు దర్శనము, వాని యెత్తుయొక్క ప్రమాణమునుబట్టి సూర్యోదయాస్తమయములును తెలియదగినవి. అగ్నియును జలమును తెల్లనికాంతిగల వారు భూమి నల్లని ఛాయ (కాంతి) గలది. మిక్కిలి దూరముండుటచే సూర్యునకు కిరణములు లేమి యేర్పడును. కిరణములు లేనందున ఎఱుపులేమియు, ఎఱుపు కిలిగియుండుటవలన వేడి లేమియు గలిగినవి. ఒక వరుసలేఖలోనున్న సూడ్యుడెచటెచట గనబడునో వేయి యోజనముల పైకి వెళ్ళిన యాతడు అచట గనబడుచుండును. సూర్యుడస్తమించగానే సూర్యునియొక్క కాంతిలో పాద (పావు) భాగము రాత్రియందు అగ్నిలో బ్రవేశించును. కావున నగ్నియు దూరమునుండి ప్రకాశించును.

ఉదితస్తు పునః సూర్యః అస్తమాగ్నేయమావిశత్

సంయుక్తో వహ్నినా సూర్యస్తతః న తపతే దివా

 ప్రాకాశ్యం చ తధేష్ణ్యం చ సూర్యాగ్నేయాచతేజసీ

 పరస్పరాను ప్రవేశాదాప్యాయేతే దివానిశమ్

 ఉత్తరే చైవభూమ్యర్ధే తథా తస్మింశ్చ దక్షిణే

 ఉత్తిష్ఠతి తథా సూర్యే రాత్రిరాశతే త్వపః

 తస్మాత్తామాభవన్త్యాపో దివారాత్రిప్రవేశనాత్

అస్తం యాతి పునః సూర్యే దినం వై ప్రవిశత్యపః

తస్మాచ్ఛుక్లా భవన్త్యాపో నక్తమహ్నః ప్రవేశనాత్

 ఏతేన క్రమయోగేన భూమ్యర్ధే దక్షిణోత్తరే

 ఉదయాస్తమనేఽర్కస్య అహోరాత్రం విశత్యపః

 దినం సూర్యప్రకాశాఖ్యం తామసీ రాత్రిరుచ్యతే

తస్మాత్వ్యవస్థితా రాత్రిః సూర్యాపేక్ష్యమహః స్మృతమ్

ఉదయించిన సూర్యుడు మరల నస్తమాన రూపమున అగ్నిని ప్రవేశించెను. తరువాత అగ్నితో గలిసిన సూర్యుడు పగలు ఎండగాయును. క్రమముగా ప్రకాశరూపమయినదియు వేడిరూపమయినదియునైన సూర్య-ఆగ్నేయ తేజస్సులు పరస్పరముగా అను ప్రవేశించుటచే పగటిని- రాత్రిని తృప్తిబొందించెదరు. ఉత్తరమున భూమియొక్క సగభాగమునను, అట్లే దక్షిణమునను సూర్యుడు పైకిలేచుచుండగా,(ఉదయించుచుండగా) త్రిజలములలో బ్రవేశించును. అందువలన  రాత్రియందు బ్రవేశించుటచే జలములు రాగివలెనెజ్జనగును. మరల సూర్యుడు అస్తమించగా పగలు జలముల బ్రవేశించును. అందువలన రాత్రియందు పగటి ప్రవేశము వలన జలములు తెల్లని వగును. ఈ క్రమయోగముచే దక్షిణోత్తరముల భూమి సగభాగములందు సూర్యునీయొక్క ఉదయాస్తమయములలో అహోరాత్రములు (పగలును రాత్రియును) క్రమముగా జలములలో బ్రవేశించును. పగలు సూర్య ప్రకాశము పేరుగలది. రాత్రి చీకటిదనబడును. ఆకారణమున సూర్యుడులేనిది రాత్రియనియు, సూర్యునితో జూడదగినది పగలనబడును.

ఏవం పుష్కరమధ్యైవయదాసర్పతి భాస్కరః

 త్రింశాంశకం తు మేఽదిన్యాముహూర్తే నైవ గచ్ఛతి

యోజనాగ్రాన్ముహూర్తస్య ఇమాం సంఖ్యాం నిబోధత

పూర్ణం శత సహస్రాణామేకత్రింశత్తు సా స్మృతా

 పంచాశత్తు తథాఽన్యాని సహస్రాణ్యధికాని తు

 మౌహూర్తికీ గతిర్హ్యేషా సూర్యస్య తు విధీయతే

 ఏతేన గతియోగేన యదా కాష్ఠాం తు దక్షిణామ్

 పర్యాగచ్చేత్తదాదిత్యో మాఘేకాష్ఠాన్తయేవ హి

 సర్పతే దక్షిణాయాం తు కాష్ఠాయాం తన్ని బోధత

నవకోట్యః ప్రసంఖ్యాతా యోజనైః పరిమండలమ్

తథా శతసహస్రాణి చత్వారింశచ్చ పంచ చ

 అహోరాత్రాత్పతగస్య గతిరేషా విధీయతే

 ఈ విధముగా సూర్యుడాకాశమధ్యమున బోవుచున్నపుడు భూమి పైన ముప్పదియంశకములను(30/100)ఒక ముహూర్తకాలముననే (రెండు గడియలలో= 48నిమిషములలో) దాటిపోవును. యోజనాగ్రమునుండి ముహూర్తమునకు ఈసంఖ్యను వినుడు. అది ఒక లక్ష ముప్పదియొకటి యనబడినది. ముహూర్త (రెండుగడియలకాలమున) సూర్యుని గమనము ఇంక నేబదివేలధికమని సూర్యుని విధింపబడినది. ఈ గతియోగముచే సూర్యుడు దక్షిణదిక్కును తిరగి చేరునపుడు ఆసూర్యుడు మాఘమాసమునకే చేరును. దక్షిణదిక్కునందు దానిని (సంఖ్యను) వినుడు. యోజనములచే పరిమండలము (మండలము చుట్టు) తొమ్మిది కోట్లని లెక్కింపబడినది. అట్లే అహోరాత్రములనుండి సూర్యుని యీగతి ఒకలక్ష నలుబదియైదని విధింపబడినది.

దక్షిణాద్వినివృత్తాఽసౌ విషువస్థో  యదా రవిః

 క్షీరోదస్య సముద్రస్య ఉత్తరాన్ తాదిశశ్చరన్

మండలం విషువద్యాపి యోజనైస్తన్ని బోధత

త్రిపుః కోట్యస్తు విస్తీర్ణా విషువద్యాపి సా స్మృతా

 తథా శతసహస్రాణామశీత్యేకాధికా పునః

శ్రవణేచోత్తరాం కాష్ఠాం చిత్రభానుర్యదా భవేత్

కాశద్వీపస్య షష్ఠస్య ఉత్తరాన్ తాదిశశ్చరన్

 ఉత్తరాయాం చ కాష్ఠాయాం ప్రమాణం మండలస్య చ

యోజనాగ్రత్ప్రసంఖ్యాతా కోటిరేకా తు సా ద్విజైః

 అశీతిర్నియుతా నీహ యోజనానాం తథైవ చ

అష్టపంచాశతం చైవ యోజనాన్యధికాని తు

నాగవీథ్యుత్తరా వీథీ అజ వీధీ చ దక్షిణా

 మూలం చైవ తథాషాఢే హ్యజవీథ్యుదయాస్త్రయః

 అభిజిత్పూర్వతః స్వాతిర్నాగ వీథ్యుదయాస్త్రయః

 కాష్ఠయోరంతరం యచ్చ తద్వక్ష్యే యోజనైః పునః

ఏతచ్ఛత సహస్రాణామేకత్రింశోత్తరం శతమ్

 త్రయస్త్రింశాధికాశ్చాన్యే త్రయస్త్రింశచ్చ యోజనైః

 కాష్ఠయోరంతరం హ్యేతద్యోజనాగ్రాత్ప్రతిష్ఠితమ్

 కాష్ఠయోర్లేఖయో శ్చైవ అన్తరే దక్షిణోత్తరే

తే తు వక్ష్యామి సంఖ్యాయ యోజనైస్తన్ని బోధత

ఏకైకమక్షరం తస్యా నియుతాన్యేకసప్తతిః

సహస్రాన్యతిరిక్తాశ్చ తథోఽన్యా పంచసప్తతిః

 లేఖయోః కాష్ఠయోశ్చైవ బాహ్యభ్యంతరయోః స్మృతమ్

అభ్యంతరం తు పర్యేతి మండలాన్యుత్తరాయణే

దక్షిణమునుండి మరల యీ సూర్యుడు రాత్రిపగలు సమముగానుండు కాలమైన విషువత్తులో నెప్పుడుండునో (అప్పుడు) క్షీరసముద్రముయొక్క ఉత్తరాంతములైన దిక్కులను చరించుచు నుండును. సూర్యుని భ్రమణమండలము విషువన్మార్గము గూడను యోజనములతో (లో) వినుడు. విషువన్మార్గము మూడుకోట్లు విస్తీర్ణమైనదనబడినది. అట్లే మరల ఒకకోటి ఎనుబది యొకటి యధికమైనది. శ్రవణానక్షత్రమున నుత్తరదిక్కున సూర్యుడున్నప్పుడు ఆజవదైన కాశద్వీపము యొక్క ఉత్తరాన్తములైన దిక్కులను చరించుచుండును. ఉత్తరదిక్కున మండలముయొక్క ప్రమాణము బ్రాహ్మణులచే యోజనాగ్రమునుండి ఒక కోటీగా లెక్కింపబడినది. ఇచట ఎనుబదిలక్షల యేబదియెనిమిదీ యోజనము లధికములు. నాగవీథి ఉత్తరావీధి, అజవీథి, దక్షిణావీథి (వీనిలో) (ఉత్తర) ఆషాఢ నక్షత్రమున అజవీథియుదయముగా గలవి మూడును. మూలము అభిజిన్నక్షత్రమునకు పూర్వముగా స్వాతీనక్షత్రమున నాగవీథియుదయముగా గలవి మూడును మూలము. దిక్కులయొక్క మధ్యదూరమును యోజనములతో జెప్పెదను. ఇది ఒక కోటి ముప్పదియొక్క యోజనములు. ఇతరములు ముప్పది మూడధికముగా గలవి. ఈ దిక్కులయొక్క మధ్యదూరము యోజనాగ్రమునుండి ముప్పదిమూడు యోజనములచే ప్రతిష్టితమైనది. దిక్కులకును లేఖలకును దక్షిణోత్తరములు అంతరములు (ఎడము) వానిని యోజనములతో లెక్కించి చెప్పేదను. దానిని వినుడు. ఆదిక్కుయొక్క ఒక్కొక్క మధ్యదూరము డెబ్బదియొక్క లక్షలు+డెబ్బదియైదువేలు యోజనములు. ఇది లేఖల యొక్కయు దిక్కులయొక్కయు బాహ్యభ్యంతరములయంతరము (మధ్యదూరము) అనబడినది. ఉత్తరాయణమున మండలముల యభ్యంతరమును (రవి) చుట్టివచ్చును.

బాహ్యతో దక్షిణే చైవ సతతం తు యథాక్రమమ్

 మండలానాం శతం పూర్ణమశీత్యధికముత్తరమ్

వెలుపల దక్షిణమునను ఎల్లప్పుడు క్రమమును దప్పక రవి చరించును. నూటయెనుబది మండలముల మొత్తముత్తరమున రవి చరించును.

చరతే దక్షిణే చాపి తావదేవ విభావసుః

 ప్రమాణం మండలస్యాథ యోజనాగ్రాన్ని బోధత

ఏకవింశద్యోజనానాం సహస్రాణి సమాసతః

శతే ద్వే పునరప్యన్యే యోజనానాం ప్రకీర్తితౌ

 ఏకవింశతిభిశ్చైవ యోజనైరధికైర్హితే

ఏతత్ప్రమాణమాఖ్యాతం యోజనైర్మండలం హి తత్

 విష్కంభో మండలస్యైష తిర్యక్ స తు విధీయతే

ప్రత్యహం చరతే యాని సూర్యో వై మండలక్రమమ్

 కులాలచక్రపర్యంతో యథాశీఘ్రం నివర్తతే

దక్షిణే ప్రక్రమే సూర్యస్తథా శీఘ్రం నివర్తతే

తస్మాత్ప్రకృష్ణాం భూమిం చ కాలేనాల్పే న గచ్ఛతి

సూర్యో ద్వాదశభిః శీఘ్రం ముహూర్తైర్దక్షిణోత్తరే

 త్రయోదశార్ధమృక్షాణామప్ననుచరతే రవిః

ముహూర్తైస్తావద్భక్షాణి నక్తమష్టాదశైశ్చరన్

కులాలచక్రమధ్యస్తు యథామందం ప్రసర్పతి

తథోదగమనే సూర్యః సర్పతే మందవిక్రమః

 త్రయోదశార్ధమర్ధేన ఋక్షాణాం చరతే రవిః

 తస్మాద్దీర్ఘేణ కాలేన భూమిమల్పాం నిగచ్చతి

 అష్టాదశముహూర్తైస్తు ఉత్తరాయణపశ్చిమమ్

అహర్భవతి తచ్ఛాపి చరతే మందవిక్రమః

 త్రయోదశార్ధమధేన ఋక్షాణాం చరతే రవిః

ముహూర్తైస్తావదృక్షాణి నక్తమష్టాదశైశ్చరన్

 తతో మందతరం తాభ్యాం చక్రం భ్రమతి వై యథా

మృత్పిండ ఇవ మధ్యస్థో ధ్రువో భ్రమతి వై యథా

త్రింశన్ముహూర్తానేవాహురహోరాత్రం ధ్రువో భ్రమన్

ఉభయోః కాష్ఠయోర్మధ్యే భ్రమతే మండలాని సః

 కులాలచక్రనాభిస్తు యధా తత్రైవ వర్తతే

 ధ్రువస్తథా హి విజ్ఞేయ స్తత్రైవ పరివర్తతే

 ఉభయోః కాష్ఠయోర్మధ్యే భ్రమతో మండలాని తు

దివా నక్తం చ సూర్యస్య మందాశీఘ్రా చ వై గతిః

 ఉత్తరే ప్రక్రమేత్విందో ర్దివామందాగతిః స్మృతా

తథైవ చ పునర్నక్తం శీఘ్రా సూర్యస్య వై గతిః

దక్షిణే ప్రక్రమే చైవ దివా శీఘ్రం విధీయతే

 గతిః సూర్యస్య నక్తం వై మందా చాపి తథా స్మృతా

ఏవంఽ గతి విశేషేణ విభజన్ రాత్య్రహాని తు

తథా విచరతే మార్గం సమేన విషమేణ చ

దక్షిణమున గూడ సూర్యుడంతవరకే తిరుగును. తరువాత మండలము యొక్క ప్రమాణమును యోజనాగ్రమునుండి వినుడు. అది ఇరువదియొక్కవేల రెండువందల యిరువదియొక్క యోజనములని సంగ్రహముగా జెప్పబడినవి. ఈ ప్రమాణము యోజనములతో జెప్పబడినది. అది మండలము. మండలముయొక్క విష్కంభమిది. అదియడ్డముగా విధింపబడుచున్నది. ప్రతిదినము మండలక్రమముగా అన్ని యోజనములు రవి చరించును. కుమ్మరివాని చక్రము చివర శీఘ్రముగ మరలివచ్చునట్లే దక్షిణాయనమున సూర్యుడు శీఘ్రముగ దిరిగివచ్చును. అందువలననే యెక్కువభూమిని కొద్దికాలములోనే పయనించును. సూర్యుడు పండ్రెండు ముహూర్తములతో (24గడియలు) దక్షిణోత్తరభాగములను చరించును. ఒక పగటితో సూర్యుడు పదమూడున్నర నక్షత్రములు తిరుగును. పదునెనిమది ముహూర్తములతో ఒక రాత్రిని చరించును. కమ్మరిచక్రము యొక్క మధ్యము మెల్లిగా తిరిగినట్లే ఉత్తరాయణమున సూర్యుడు మెల్లని నడకగలవాడై చరించును. సగము దినముతో పదమూడున్నర నక్షత్రములను చరించును. కావున ఎక్కువ కాలముచే తక్కువభూమిని సూర్యుడు పయనించును. పదునెనిమిది ముహూర్తములతో ఉత్తరాయణము పశ్చిమదినమగును. రవి దానిని మెల్లని నడకతో చరించును. అర్ధదినముతో పదమూడున్నర నక్షత్రములను రవి చరించును. పదునెనిమిది ముహూర్తములతో రాత్రియందు అన్నియే నక్షత్రములను (131/2) చరించును. కుమ్మరిచక్రము మధ్యనున్నమట్టిముద్ద ధ్రువమై (చలింపనిదై) యెట్లు తిరుగునో యట్లే యహోరాత్రములచేత సూర్యచక్రము మిక్కిలి మెల్లిగా దీరుగును. రెండుదిక్కుల మధ్యన ముప్పదిముహూర్తములలో ఒక యహోరాత్ర కాలమును ధ్రువుడై స్థిరుడై తిరుగుచు తిరుగును. కుమ్మరి చక్రపునాభి యచ్చటనే (ఉన్నచోటనే) తిరుగునట్లు ధ్రువుడు గూడనున్నచోటనే తన చుట్టు తాను తిరుగును. రెండుదిక్కులమధ్యన మండలముల దిరుగు సూర్యునకు పగలును రాత్రియును మందగతియు శీఘ్రగతియు గలుగును. ఉత్తరాయణమున పగలు చంద్రుని గతి మందము అట్లే రాత్రియందు సూర్యుని గతి శీఘ్రమైనది. దక్షిణాయనమున పగలు (చంద్రగతి) శీఘ్రమనబడినది. అట్లే రాత్రిసూర్యగతమందమని కూడ ననబడినది. ఈ విధముగ చంద్రసూర్యగతి విశేషముచే రాత్రి పగళ్లను విభజించి చంద్రసూర్యులు సమయముగను విషయముగను మార్గమును చరింతురు.

లోకాలోకే స్థితా యే తే లోకపాలాశ్చతుర్దివమ్

 అగస్త్యశ్చరతే తేషాముపరిష్టాజ్జన తు

 భజన్నసావహోరాత్రమేవం గతివిశేషణైః

 దక్షిణే నాగవీథ్యాయం లోకాలోకస్య చోత్తరమ్

లోకసంతారకో హ్యేష వైశ్వానరపథాద్బహిః

 పృష్ఠే యావత్ప్రభా సౌరీ పురస్తాత్ సంప్రకాశతే

 పార్శ్వయోః పృష్ఠతస్తావల్లోకాలో కస్య సర్వతః

యోజనానాం సహస్రాణి దశోర్థ్యం తూచ్చ్రితో గిరిః

 ప్రకాశశ్చాప్రకాశశ్చ సర్వతః పరిమండలః

 నక్షత్రచంద్రసూర్యాశ్చ గ్రహాస్తారాగణైః సహ

 అభ్యంతరం ప్రకాశన్ తే లోకాలోకస్య వై గిరేః

ఏతావానేవ లోకస్తు నిరాలోకస్త్యతః పరమ్

లోకాలోక ఏకథా తు నిరాలోకస్త్వనే కథా

లోకాలోకం తు సంధత్తే యస్మాత్సూర్యః పరిగ్రహమ్

 తస్మాత్సంధ్యేతి తామహురుషావ్యుష్ట్యోర్యదంతరమ్

 ఉషారాత్రిః స్మృతా విప్రైర్వుష్టిశ్చాపి త్వహః స్మృతమ్

సూర్యం హి గ్రసమానానాం సంధ్యాకాలే హి రక్షసామ్

 ప్రజాపతినియోగేన శాపస్త్వేషాం దురాత్మనామ్

అక్షయత్వం చ దేహస్య ప్రాపితా మరణం తథా

 తిస్రః కోట్యస్తు విఖ్యాతా మందేహా నామ రాక్షసాః

 ప్రార్థయన్తి సహస్రాంశు ముదయన్తి దినే దినే

 తాపయన్తో దురాత్మనః సూర్యమిచ్ఛంతి ఖాదితుమ్

అథ సూర్యస్య తేషాం చ యుద్ధమాసీత్ సుదారుణమ్

 తతో బ్రహ్మ చ దేవాశ్చ బ్రాహ్మణాశ్చైవ సత్తమాః

సంధ్యేతి సముపాసన్తః క్షేపయన్తి మహాజలమ్

 ఓంకార బ్రహ్మసంయుక్తం గాయత్య్రా చాభిమంత్రితమ్

 తేన దహ్యన్తి తే దైత్యా వజ్రభూతేన వారీణా

లోకాలోకమున నలుదిక్కుల ఏలోకపాలురున్నారో! వారికన్న పైననే యీ విధముగ గతిని శేషణ)ములచేత అగస్త్యుడు (నక్షత్రము) వేగముగా దిరుగును. దక్షిణమున నాగ వీథియందు లోకాలోకమునకుత్తరముగా వైశ్వానర (అగ్ని) మార్గమువెలుపల లోకసంతారకుడై యీతడు (అగస్త్యుడు) చరించుచుండును. లోకాలోకము (పర్వతము) యొక్క వెనుక ఎంతకాలము సూర్యకాంతి ప్రకాశించుచుండునో అంతవరకు లోకాలోక (పర్వత)ము యొక్క యిరుప్రక్కలను వెనుకను నంతట (అగస్త్యనక్షత్రము) ప్రకాశించును. ఆ గిరి పదివేల యోజనముల యెత్తు పదిమండలములుగానున్నదై యంతటను ప్రకాశముగను అప్రకాశముగను నుండును. ఆలోకాలోకగిరియొక్క లోపలనే నక్షత్ర-చంద్ర సూర్యలు తమ తారాగణములతోగూడి ప్రకాశింతురు. ఇంతవరకే లోకము (లోకపర్వతము) ఆ తరువాతిది నిరాలోక (ఆ లోకపర్వత)ము. లోకాలోకము ఒకేవిధము. నిరాలోకమనేకవిధము. ఏ కారణమున సూర్యుడు లోకాలోకమును పరిగ్రహముగా (చుట్టివచ్చుదానినిగా) సంధించునో, ఆ కారణముననే ఉషా-వ్యుష్టుల (రేయి-పగలుల) మధ్యకాలమును సంధ్య యని యందురు. ఉషయన రాత్రి వ్యుష్టియన పగలు- అనబడినవి. సంధ్యాకాలములలో రాక్షసులు సూర్యుని మ్రింగబోవుదురు. ఈ దురాత్ములకు బ్రహ్మనియోగముతో (ఆజ్ఞతో) శాపముగలదు. వారిదేహమునకు నాశములేమియు అమరణమును (చావులేమియు) వరముగాబొందిరి. వారు ప్రసిద్ధులైన మందేహులను మూడు కోట్ల రాక్షసులు. వారు ప్రతిదినమున సూర్యుని బ్రార్థింతురు, ఉదయింతురు. ఆ దురాత్ములు తపింపజేయుచు సూర్యుని దీనివేయదలంతురు. ఆ తరువాత, సూర్యనకును ఆ రాక్షసులకును భయంకరయుద్దమాయెను. అంతలో దేవతలు, బ్రాహ్మణులు, మహాసజ్జనులు (మునులు) సంధ్యయని యుపాసించుచు మహాజలమును నిడుతురు. ఆ మహాజలము ఓంకార బ్రహ్మతో గూడినది, గాయత్రీ మంత్రముతో అభిమంత్రింపబడినది. మంత్రముతో వజ్రముగా నైన యాజలముతో ఆ రాక్షసులు దహింపబడుదురు.

తతః పునర్మహాతేజాః మహాద్యుతిపరాక్రమః

 యోజనానాం సహస్రాణి ఊర్థ్వముత్తిష్ఠతే శతమ్

 తతః ప్రయాతి భగవాన్ బ్రాహ్మణైః పరివారితః

 వాలఖిల్యైశ్చ మునిభిః కృతార్థైః సమరీచిభిః

 కాష్ఠా నిమేషాదశపంచచైవ త్రాశచ్చ కాష్ఠాగణయేత్కలాంతమ్

 త్రింశత్ కలాశ్చైవ భవేన్ముహూర్తస్తైక్రింశతారాత్యహనీ సమే తే

ప్రసవృద్ధితహర్బాగైర్దివసానాం యథాక్రమమ్

 సంధ్యాముహూర్తమానం తు హాసోవృద్ధౌ సమా స్మృతా

లేఖాప్రభృత్యధథిత్యే త్రిముహూర్తా గతే తు వై

 ప్రాతస్తనః స్మృతః కాలోభాగస్త్యహ్నః స పంచమః

 తస్మాత్ప్రాతస్తనాత్కాలాత్ త్రిముహూర్తస్తు సంగవః

మధ్యాహ్నస్త్రి ముహూర్తస్తు తస్మాత్కాలచ్చ సంగవాత్

తస్మాన్మధ్యందినాత్కాలాదపరాహ్ణ ఇతి స్మృతః

త్రయ ఏవ ముహూర్తాస్తు తస్మాత్కాలాచ్చ మధ్యమాత్

 అపరాహ్ణే వ్యతీపాతే కాలః సాయాహ్న ఉచ్యతే

దశపంచ ముహూర్తాద్యై ముహూర్తా స్త్రయ ఏవ చ

 దశపంచ ముహూర్తం వై అహర్విషువతి స్మృతమ్

దశపంచముహూర్తా ద్యై రాత్రిం దివమితి స్మృతమ్

వర్థతే హ్రసతే చైవ అయనే దక్షిణోత్తరే

అహస్తు గ్రసతే రాత్రిం రాత్రిస్తు గ్రసతే త్వహః

 శరద్వసంతయోర్మధ్యేవిషువంతాద్విభావ్యతే

 అహోరాత్రం కలాశ్చైవ సప్తసోమః సమశ్నుతే

ఆ తరువాత మరల నాతేజస్వియై మహాకాంతి పరాక్రమములుగల సూర్యుడు. లక్షయోజనముల పైకి లేచును. ఆ తరువాత భగవంతుడైన సూర్యుడు బ్రాహ్మణులచేతను కృతార్థులై కిరణములతో గూడిన వాలఖిల్యమునులచే జుట్టబడినవాడై (యాకాశమున) బోవును. పదునైదు నిమేషములు (కనురెప్పపాట్లు) ఒక కాష్ఠ ముప్పదికాఫ్టలు ఒక కల (ళ). ముప్పది కలలు ఒక ముహూర్తము. ముప్పది ముహూర్తము రాత్రింబవళ్లు కలిసియేర్పడిన కాలము. అహర్బాగములతో దివసములయొక్క క్షయవృద్దులు వరుసగా నిట్లుండును. సంధ్యయొక్క ముహూర్తపరిమాణము (రాత్రింబవళ్ళ) క్షయవృద్ధులలోగూడ సమానముగనే యుండును (మారదు). తరువాత, సూర్యుడు తన బింబములోని రేఖమాత్రోదయము మొదలుకొని మూడు ముహూర్తములవరకు ఆకాశమున పైకివచ్చుకాలము ప్రాతఃకాలము. అది పగటిలో నైదవ భాగమనబడింది. (15ముహూర్తములు పగలు 15/5=3 భాగము). దానినుండి (ప్రాతఃకాలము) మూడుముహూర్తముల కాలము సంగవకాలము (3 నుండి 6 ముహూర్తకాలము). సంగవమునుండి, మూడు ముహూర్తముల కాలము మధ్యాహ్నము. మధ్యాహ్నమునుండి మూడు ముహూర్తములకాలము అపరాహ్లాము. దానినుండి మూడు ముహూర్తకాలము సాయాహ్నము అనబడినది. పదియైదు ముహూర్తములలో మూడేసి ముహూర్తములు (ప్రాతస్సంగవమధ్యాహ్నపరాప్లసాయంకాలములు). విషువత్తునందు పదునైదు ముహూర్తముల పగలుండుననబడినది. పదునైదు ముహూర్తములు గలిపిన రాత్రితో గలిపి పగలు రాత్రి సమముగా విషువత్తునందుండననబడినది. దక్షిణోత్తరాయణములు రాత్రిపగళ్లు వృద్దిక్షయములనందుచుండును. రాత్రి పగటిని, పగలు రాత్రిని గ్రహించు (ఆక్రమించు) చుండును. విషువత్కాల (సమరాత్రిదినకాల)మునుండి శరత్-వసంతఋతువుల మధ్యన చంద్రుడు అహోరాత్రములలో ఏడు కల(ళ)లను దినును.

తథా పంచదశాహాని పక్ష ఇత్యభిధీయతే

 ద్వౌ పక్షౌచ భవేన్మాసో ద్వామాసావంతరావృతం

ఋతుత్రయమ నం స్యాత్ ద్వేఽయనే వర్షముచ్యతే

నిమేషాదికృతః కాలః కాష్ఠాయా దశపంచ చ

కలాయాస్త్రింశతః కాష్ఠా మాత్రాశీతిద్వయాత్మికా

 శతఘ్నైకో నకాస్త్రి శన్మాత్రా త్రింశత్ షడుత్తరా

 ద్విషష్ఠిం భాక్త్రయోవింశన్మాత్రాయాం చ చలా భవేత్

 చత్వారింశత్సహస్రాణి శతాన్యష్టౌ చ విద్యుతిః

 సప్తతిం చాపి తత్రైవ నవతిం విద్ది నిశ్చయే

చత్వార్యేవ శతాన్యాహుర్విద్యుతా వైధసంయుగే

చరాంశో హ్యేష విజ్ఞేయో నాలికాచాత్ర కారణమ్

 సంవత్సరాదయః పంచ చతుర్మానవికల్పితాః

నిశ్చయః సర్వ కాలస్య యుగ ఇత్యభిధీయతే

 సంవత్సరస్తు ప్రథమో ద్వితీయః పరివత్సరః

 ఇద్వత్సరస్తృతీయస్తు చతుర్థాశ్చానువత్సరః

పంచమో వత్సరస్తేషాం కాలస్తు పరిసంజ్ఞితః

 వింశశతం భవేత్పూర్ణం పర్వణాం తు రవేర్యుగమ్

ఏతాన్యష్టాదశస్త్రింశదుదయో భాస్కరస్య చ

 ఋతవస్త్రింశతః సౌరా అయనాని దశైవ తు

 పంచత్రింశత్ శతం చాపి షష్టిర్మాసాశ్చ భాస్కరః

త్రింశదేవత్వహోరాత్రం స తు మాసశ్చ భాస్కరః

 ఏకషష్టిస్త్యహోరాత్రాదనురేకో విభావ్యతే

అహ్నాం తు త్య్రధికాశీతిః శతంచాప్యధికం భవేత్

మానం తచ్చిత్రభానోస్తు విజ్ఞేయం భువస్య తు

 సౌరసౌమ్యం తు విజ్ఞేయం నక్షత్రం సావనం తథా

సామాన్యేతాని చత్వారి యైః పురాణం విభావ్యతే  

అట్లే పదునైదు దినములు పక్షమనబడును. రెండు పక్షములు మాసము.రెండు (లోపలి) మాసములు ఋతువు. మూడు ఋతువులు అయనము. రెండయనములు వర్షము (సంవత్సరము) అనబడును. కనురెప్పపాటు కాలమైన నిషాదులతో ఏర్పడునది కాలము. కాష్ఠలో పదునైదు కాలములుండును. కళలో ముప్పదియవది కాష్ఠ అది నూట అటువది మాత్రల (చిటుకల) కాలము. ఇరువది తొమ్మిది మాత్రల కాలము శతఘ్న. ముప్పదియారు మాత్రలదియు, అరువదిరెండు మాత్రలకాలము గలదియు, ముప్పదిమూడు మాత్రల కాలము గలదియు చలయగును. నలుబదివేల యెనిమిది వందల విద్యుతి అక్కడనే నిశ్చయమున డెబ్బదియు తొంబదియునని తెలిసికొనుము (7108, 9108గా వచ్చును)

వైధసంయుగమున నాలుగే వందలని యందురు. ఇది చరాంశగా దెలియదగినది. ఇచట నాళిక కారణము. సంవత్సరము మొదలైన వైదు నాలుగుమాసములతో విడివిడిగా కల్పింపబడినవి. మొత్తము కాలముయొక్క నిశ్చయము యుగమనబడును. మొదటి సంవత్సరము ప్రథమమనబడును. రెంవడదీ పరివత్సరమనబడును. మూడవది ఇద్వత్సరమనబడును. నాలుగవది అనువత్సరమనబడును. వానిలో నైదవవత్సరము కాలమని పేరొడబడినది. పూర్తిగా రెండువేల పర్వముల కాలము రవియొక్క యుగము, (పర్వము అమావాస్యా ప్రతిపత్తుల సంధి, విషువదాది, పూర్ణిమ). నలుబది. యెనిమిది పర్వములు భాస్కరుని యొక్కయుదయము. సూర్యసంబద్దములైన ఋతువులు ముప్పది, పది అయనములు. నూటతొంబదియైదు మాసములును భాస్కరుడు. ముప్పదియే యహోరాత్రములు (30దినములు) భాస్కర మాసము. అటువదియొక్కయహోరాత్రములు ఒక అనువు అని భావింపబడును. నూటయెనుబదిమూడు పగళ్లు (ఒక యేడుగా) అగును సూర్యుని యొక్కయు భువనముయొక్కయు మాసమును (పరిమాణమును) తెలియవలేను. సౌరమనియు సౌమ్యమనియు (చాంద్రము) న(నా)క్షత్రమనియు, సావనమనియు మానము (జ్యోతిషమానము) యొక్క నాలుగు విధములని పురాణము (పౌరాణికంగా) భావింపబడుచున్నది.

భేతస్యోత్తరతశ్చైవ శృంగవన్నామ పర్వతః

 త్రీణి తస్య తు శృంగాణి స్పృశన్తీవ నభస్తలమ్

 తైశ్చాపి శృంగవన్నామ సర్వతశ్చైవ విశ్రుతః

 ఏకమార్గశ్చ విస్తారో విష్కంభశ్చాపి కీర్తితః

తస్య వై సర్వతః శృంగం మధ్యమం తద్ధిరణ్మయమ్

 దక్షిణం రాజతం చైవ శృంగం తు స్పటిక ప్రభమ్

 సర్వరత్నమయం చైకం శృంగముత్తర ముత్తమమ్

ఏవం కూటైస్త్రిభిః శైతైః శృంగవానితి విశ్రుతః

యత్తద్విషువతం శృంగం తదర్కః ప్రతిపద్యతే

 శరద్వసంతయోర్మధ్యే మధ్యమాం గతిమాస్థితః

 అహస్తుల్యామధోరాత్రిం కరోతి తిమిరాపహః

 హరితాశ్చ హయాదివ్యా స్తే నియుక్తా మహారథే

అనులిప్తా ఇవాభాన్తి పద్మరక్తైర్గభస్తిభిః

 మేషాన్ తే చ తులాన్తే చ భాస్కరోదయతః స్మృతాః

 ముహూర్తాదశపంచైవ అహోరాత్రిశ్చ తావతీ

 కృత్తికానాం యథా సూర్యః ప్రథమాంశగతో భవేత్

 విశాఖానాం తథా జ్ఞేయశ్చతుర్థాంశేనిశాకరః

 విశాఖ్యాయాం యథా సూర్యశ్చరతేంఽశం తృతీయకమ్

తథా చంద్రం విజానీయాత్ కృత్తికా శిరసి స్థితమ్

విషువంతం తథా విద్యా దేవమాహుర్మహర్షయః

 సూర్యే న విషువం విద్యాత్ కాలం సోమేన లక్షయేత్

 సమారాత్రిరహశ్చైవ యదా తద్విషువత్యపి

 బ్రాహ్మణేభ్యో విశేషేణ ముఖమేతత్తు దైవతమ్

ఊనరాత్రాధిమాసౌ చ కలాకాష్ఠాముహూర్తకాః

పౌర్ణమాసీ తథా జ్ఞేయ అమావాస్యా తథైవ చ

 సినీవాలీ కుహూశ్చైవ రాకాచానుమతిస్తథా

 తపస్తపస్యౌ మధుమాధవే చ శుక్రఃశుచిశ్చాయనముత్తరం స్యాత్

 నభోగభస్యోఽథ ఇషుః సహోర్జః సహః సహస్యావితి దక్షిణం స్యాత్

సంవత్సరాప్తతో జ్ఞేయా పంచాబ్దా బ్రహ్మణః సుతాః

 తస్మాత్తు ఋతవో జ్ఞేయా ఋతవో హ్యంతరాః స్మృతాః

తస్మాదనుముఖాజ్ఞేయా అమావాస్యాఽస్య పర్వణః

 తస్మాత్తు విషువం జ్ఞేయం పితృదైవహితం సదా

 ఏవం జ్ఞాత్వా నము హ్యేత దైవే పిత్య్రే చ మానవః

తస్మాత్ స్మృతం ప్రజానాం వై విషువత్సర్వగం సదాం

ఆకాశమున దాని యుత్తరముగా 'శృంగవాన్' అను పర్వతముగలదు. దాని మూడు శిఖరములు ఆకాశము నంటుచున్నవా యన్నట్లుండును. వానిచేతగూడ “శృంగవాన్” అని యంతట ప్రసిద్ధి చెందినది. దాని విస్తారము, విష్కంభము ఒకే మార్గమున నుండునని చెప్పబడినది. దానికంతట శృంగములుగలవు. మధ్యది బంగారపుది. దక్షిణపుది శృంగము స్ఫటిక కాంతిగలదై వెండిది. ఉత్తమమైన యుత్తర శృంగము ఒకట సమస్త రత్నములతో నిండినది. ఈవిధముగా పర్వతమునకు సంబంధించిన మూడు శృంగములచేత నాపర్వతము 'శృంగవాన్' అని ప్రసిద్ది చెందినది. శరద్- వసంత ఋతువుల మధ్యన ఆకాశమధ్యగతియందున్న వాడై సూర్యుడు విషువతమయిన శృంగమును జేరును. చీకటిపోద్రోలు సూర్యుడు రాత్రిని పగటితో సమముగా జేయును. మహారథమునగట్టబడిన హరితములైన (పసుపు పచ్చనవైన) దివ్యములైన గుజ్జములు పద్మములవలె నెఱ్ఱనైన కిరణములచే వెంటనే పూయబడినవా యన్నట్లు ప్రకాశించును. మేషరాశ్యంతమునకు తులారాశ్యంతమునను సూర్యోదయమువలన పగలును రాత్రియు పదునైదు ముహూర్తములుగల వేయగుననబడినవి. కృత్తికా నక్షత్ర ప్రథమపాదమునను సూర్యుడున్నప్పుడు చంద్రుడు విశాఖానక్షత్ర చతుర్థపాదమున నుండునని తెలియవలెను. సూర్యుడు విశాఖానక్షత్ర తృతీయపాదముననున్నపుడు చంద్రుడు కృత్తికాశిరస్సుననుండునని తెలియవలేను. అపుడు విషవంతమును దెలియవలెనని మహర్పులు చెప్పుదురు. సూర్యునితో విషువమును దెలియవలెను. సోముని (చంద్రుని)చే కాలమును గనవలెను. రాత్రి-పగలు సమానములైనపుడు విషువత్తమగును. విషువత్తులో పితృదేవతలకై దానముల జేయవలెను. విశేషించి బ్రాహ్మణులకు దానముజేయవలేను బ్రాహ్మణులు దేవతలకు ముఖముతో సమానులు. ఊనరాత్ర అధిమాసములు, కలా-కాషా-ముహూర్తకములు, పౌర్ణమాసీ, అమావాస్యా సినీ వాలీ (చంద్రకళకనబడినయమావాస్య) కుహూ (చంద్రకళకనబడనియమావాస్య) రాకా (పూర్ణచంద్రుడు గలపూర్ణిమ), అనుమతి (ఒకచంద్రకళతగ్గిన పూర్ణిమ)- ఇవి యన్నియు దెలియవలె. మాఘఫాల్గునమాసములు, చైత్రవైశాఖమాసములు, జ్యేష్ఠాషాఢ మాసములును గలిసి యుత్తరాయణమగును. శ్రావణభాద్రపద మాసములు, ఆశ్వయుజ కార్తిక మాసములు, మార్గశీర్ష పుష్యమాసములును గలిసి దక్షిణాయనము. తరువాత సంవత్సరములను దేలియవలెను. ఐదు సంవత్సరములు బ్రహ్మయొక్కపుత్రులు దానినుండి (తరువాత) ఋతువులు తెలియదగినవి. ఋతువులు అంతరములనబడినవి. దాని తరువాత పర్వమునకు అనుముఖమైన యమావాస్య తెలియదగినది. తరువాత పితృదేవతలకు హితమైన విషవము నెల్లప్పుడును దెలియవలె. ఈ విధముగా దెలిసిన మానవుడు దైవకార్యముల విషయములోను పితృకార్య విషయములోను మజపు జెందడు. అందువలననే విషువత్తు ప్రజలకందరికి నెల్లప్పుడును తెలియదగినదిగా జెప్పబడినది.

ఆలోకాంతః స్మృతో లోకో లోకాన్తో లోక ఉచ్యతే

 లోకపాలాః స్థితాస్తత్ర లోకాలోకస్య మధ్యతః

 చత్వార స్తే మహాత్మానస్తిష్ఠన్త్యాభూతసంప్లవాత్

 సుధామా చైవ వైరాజః కర్దమః శంకృపస్తథా

 హిరణ్యలోమా పర్జన్యః కేతుమాన్ జాతనిశ్చయః

నిర్ద్వంద్వా నిరభిమానా నిస్తంత్రా నిష్పరిగ్రహాః

లోకపాలాః స్థితా హ్యేతే లోకాలోకే చతుర్దిశమ్

 ఉత్తరం మదగస్త్యస్య అజవీథ్యాశ్చ దక్షిణమ్

పితృయాణః స వై పంథాః వైశ్వానరపథాద్బహిః

 తత్రాసతే ప్రజావన్తో మునయో హ్యగ్నిహోత్రిణః

లోకస్య సంతానకరాః పితృయాణే పథి స్థితాః

 భూతారంభకృతం కర్మ ఆశిషా ఋత్విగుచ్యతే

 ప్రారంభన్తే లోకకామాస్తేషాం పంథాః స దక్షిణః

ఆలోకాన్తము (ఆ లోకపర్వతము చివరివరకు) లోకమనియు (లోకపర్వతమనిము) లోకాన్తము (లోకపర్వతము) చివరివరకు లోకమనియు (భూలోకమనియు) చెప్పబడును. లోకాలోక (పర్వత)ముల మధ్యగా లోకపాలురున్నారు. మహాత్ములైన యా నలుగురు భూతప్రళయము నుండి యుందురు. వారు వైరాజైన సుధాముడు, శంకృపుడైన కర్దముడు, పర్జన్యుడైన హిరణ్యలోముడు, జాతనిశ్చయుడైన కేతుమంతుడును. సాటిలేనివారు, నిరభిమానులు, నిస్తంత్రులు (ఏ సిద్దాంతము లేనివారు), నిష్పరిగ్రహులు (దానమును స్వీకరింపనివారు) నైన వీరు లోకాలోకపర్వతమున నాలుగు దిక్కులకు లోకపాలురుగా నున్నారు. అగస్త్యునకు (నక్షత్రమునకు) ఉత్తరముగను, అజవీథికి దక్షిణముగను వైశ్వావర (అగ్ని) మార్గమునకు వెలుపలను ఉన్నమార్గము పితృయాణము(పితరులమార్గము). అచట అగ్నిహోత్రహోమము జేయువారును సంతానవంతులునైన మునులుందురు. పితృయాణమార్గముననున్నట్టి వారు లోకమునకు సంతానమును గలుగజేయువారు. భూతముల ప్రారంభమునకై చేసినది కర్మ. ఆశీస్సుచే 'ఋత్విక్' అనబడును. లోకకాములై వారు వారు ప్రారంభింతురు. వారియొక్క మార్గము ఆదక్షిణము.

చలితం తే పునర్దర్మం స్థాపయన్తి యుగేయుగే

 సం తత్యా తపసా చైవ మర్యాదాభిః శ్రుతేన చ

 జాయమానాస్తు పూర్వేవై పశ్చిమానాం గృహేషు చ

 పశ్చిమాశ్చైవ జాయన్తే పూర్వేషాం నిధనేష్వపి

 ఏవమావర్తమానాస్తే తిష్ఠంత్యా భూతసంప్లవాత్

అష్టాశీతి సహస్రాణి మునీనాం గృహమేధినామ్

 సవితుర్దక్షిణం మార్గం శ్రితాహ్యాచంద్ర తారకమ్

క్రియావతం ప్రసంఖ్యేయా యే శ్మశానాని భేజిరే

లోకసంవ్యవహారేణ భూతారంభకృతేన చ

 ఇచ్చాద్వేషప్రకృత్యా చ మైథునోపగమేన చ

 తథా కాయకృతేనేహ సేవనాద్విషయస్య చ

ఏతైస్తైః కారణైః సిద్ధాః శ్మశానాని హి భోజిరే

ప్రజైషిణస్తే మునయో ద్వాపరేష్విహ జజ్ఞిరే

నాగవీథ్యుత్తరే యచ్చ సప్తర్షిభ్యశ్చ దక్షిణమ్

 ఉత్తరః సవితుః పంథా దేవయానస్తు స స్మృతః

యత్ర తే వాసినః సిద్ధా విమలా బ్రహ్మచారిణః

 స తతం తే జుగుప్సన్ తే తస్మాన్మృత్యుర్జి తస్తుతైః

అష్టాశీతిసహస్రాణి తేషామప్యూర్థ్వ రేతసామ్

ఉదక్పంథానమర్యమ్ణః శ్రితాహ్యాభూత సంప్లవాత్

 ఇత్యేతైః కారణైః శుద్దైస్తేఽ స్మృ(మృ) తత్వం హి భేజిరే

 ఆభూతసంప్లవ స్థానమమృతత్వం విభావ్యతే

 త్రైలోక్యస్థితికాలోఽ య మపునర్మార్గగామినః

 బ్రహ్మహత్యాశ్వ మేధాభ్యాం పుణ్యపాపకృతోఽ పరమ్

ఆభూతసంప్లవాన్తే తు క్షీయన్తే హ్యూర్థ్వరేతసః

ఊర్ధ్వోత్తరమృషిభ్యస్తధ్రువో యత్రాస్తి వై స్మృతమ్

 ఏతద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్నిభాస్వరమ్

 తత్ర గత్వా న శోచన్తి తద్విష్ణోః పరమం పదమ్

ధర్మధ్రువాద్యాస్తిష్ఠన్తి యత్ర తే లోకసాధకాః

 ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే జ్యోతిష్ప్రచారో నామ పంచాశోఽ ధ్యాయః

వారు చలితమైనధర్మమును మరల ప్రతియుగమున సంతతిచేతను తపస్సుచేతను, మర్యాదలచేతను, వేదపాండిత్యముల చేతను స్థాపింతురు. ముందువారు తరువాతివారియిండ్లలోను జనియింతురు అపూర్వులు చావగా మరల తరువాతివారు (పశ్చిములు) జనింతురు. ఇట్లు జననమరణములచే తిరుగుచున్నవారై వారు భూతప్రళయమునుండి (వరకు) ఉందురు. క్రియావంతుల యుద్ధములో నైవరైతే శ్మశానములకు పంపబడిరో! ఆ గృహమేథు (గృహస్థాశ్రమవాసు)లైన యేనుబదియెనిమిదివేల మునులు సూర్యునియొక్క దక్షిణమార్గము నాచంద్రతారకమాశ్రయించిరి. పంచభూతముల ప్రారంభముచే గలిగిన లోకసం వ్యవహారముతోను ఇచ్చాద్వేష ప్రకృతితోను శరీరకృతమైన మైథునమును బొందుటచేతను, విషయసుఖములను సేవించుటచేతను- ఇటువంటి యాకారణములచేత సిద్ధులు శ్మశానములను బొందిరి. నాగవీథికి ఉత్తరమునను, సప్తర్పులకు (నక్షత్రములకు) దక్షిణముగను సూర్యునియొక్క ఉత్తర (దిక్కు) మార్గమేదీకలదో! అది దేవయానమనబడినది. అక్కడున్న సిద్దులు విమలురు, బ్రహ్మచారులు. వారెప్పుడును దయజూపుదురు. దానివలన వారిచే మృత్యువు జయింపబడినది. ఊర్థ్వరేతస్కులైన యాయెనుబది యెనిమిదివేల సిద్దులు సూర్యునియొక్క యుత్తరమార్గమును భూతప్రళయమువరకు ఆశ్రయించిరి. ఇట్టి యాశుద్దకారణములచే వారు అమృతత్వమును బొందిరి. పంచమహాభూతప్రళయము వరకుండుటయమృతత్వమని భావింపబడినది. ఇది పునర్మార్గగామికాని (పునర్జన్మతో మరల నుత్తరాయణమునబోని) వానీయొక్క ముల్లోకములనుండు కాలము. బ్రహ్మహత్య అశ్వమేధములచే పుణ్య-పాపములజేసిన వానికి వేడొకటి. ఊర్థ్వరేతస్కులు గూడ పంచమహాభూతప్రళయము తరువాత నశింతురు. సప్తర్షులకు ఊర్టోత్తరముగా (పైకి ఉత్తరముగా) ధ్రువుడు (నక్షత్రము)న్న పదము దివ్యమైన విష్ణుపదము. అది మూడవది. ఆకాశమున బ్రకాశించునది. అచటికి బోయినవారు దుఃఖము నొందరు. అది విష్ణువుయొక్క పరమపదము. అచట ధర్ముడు ధ్రువుడు మొదలగు లోకసాధకులుందురు.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున జ్యోతిష్ప్రచారమను నేబదియవ యధ్యాయము.