వాయు మహా పురాణము
15 - పాశుపతయోగో
వాయురువాచ:-
చతుర్దశవిధం హ్యేతుద్బుద్ద్వా సంసారమణ్డలమ్ ।
తథా సమారభేత్ కర్మ సంసారభయపీడితః॥
తతః స్మరతి సంసారచక్రేణపరివర్తితః ।
తస్మాత్తు సతతం యుక్తో ధ్యానతత్పరముఞ్చ కః ।
తథా సమారభేద్యోగం యథాత్మానం స పశ్యతి ॥
ఏష ఆద్యః పరంజ్యోతిరేష సేతురనుత్తమః ।
వివృద్ధో హ్యేష భూతానాం న సంభేదశ్చ శాశ్వతః॥
తదేనం సేతుమాత్మానం అగ్నిం వై విశ్వతోముఖమ్ ।
హృదిస్థం సర్వభూతానాముపాసీత విధానవిత్॥
హుత్వా వాష్టాదాహుతీః సమ్యక్ శుచిస్తద్గత మానసః ।
వైశ్వానరం హృదిస్థం తు యథావదనుపూర్వశః॥
ఆపః పూర్వం సకృత్ ప్రాశ్య తూష్ణీం భూత్వా ఉపాసతే॥
ప్రాణాయేతి తతస్తస్య ప్రథమాహ్యాహుతిః స్మృతా ।
అపానాయ ద్వితీయా తు సమానాయేతి చాపరా ॥
ఉదానాయ చతుర్ధీతి వ్యానాయేతి పఞ్చమీ ।
స్వాహాకారైః పరం హుత్వా శేషం భుంజీత కామతః॥
అపఃపునః సకృత్ ప్రాశ్య త్య్రాచమ్యహృదయం స్పృశేత్ ॥
ఓం ప్రాణానాం గ్రన్ధిరస్యాత్మా రుద్రోహ్యాత్మా విశాన్తకః ।
రుద్రోహ్యాత్మనః ప్రాణా ఏవమాప్యాయయేత్స్వయమ్ ॥
త్వం దేవానామసి జ్యేష్ఠ ఉగ్రస్త్వం చతురో వృషా ।
మృతఘ్నోఽసిత్వమస్మభ్యం భద్రమేతద్భుతం హవిః ॥
ఏవం హృదయమాలభ్య పాదాజ్గుష్ఠేతు దక్షిణే ।
విశ్రావ్య దక్షిణాం పాణిం నాభిం వై పాణినా స్పృశేత్
తతఃపునరుపస్పృశ్య చాత్మానమభి సంస్పృశేత్ ॥
అక్షిణీ నాసికా శ్రోత్రే హృదయం శిరఏవచ ।
ద్వావాత్మానానుభావేతౌ ప్రాణాపానావుదా హృతా॥
తయోః ప్రోణోఽన్తరాత్మాస్య బాహోఽపానోఽత ఉచ్యతే ।
అన్నం ప్రాణస్తథాపానం మృత్యుర్జీవితమేవ చ ॥
అన్నం బ్రహ్మచ విజ్ఞేయం ప్రజానాం ప్రసవస్తథా ।
అన్నాద్భూతాని జాయన్తే స్థితిరన్నేన చేష్యతే॥
తదేవాగ్నే హుతం హ్యన్నం భుజంతే దేవదానవాః ।
గన్ధర్వయక్షరక్షాంసి పిశాచాశ్చాన్నమేవ హి॥
ఇతి శ్రీమహాపురాణేవాయుప్రోక్తే పాశుపతయోగో నామ పంచదశోఽధ్యాయః॥
వాయువు పలికెను:- ఈ పదునాలుగు విధములుగానున్న సంసార మండలమును దెలిసికొనవలెను. అట్లే సంసార భయపీడితుడై కర్మను ప్రారంభింపవలేను-1, ఆ తరువాత సంసార చక్రముచే త్రిప్పబడినవాడై స్మరించును. కావున తాను ఆత్మను చూచు విధముగా నెల్లప్పుడు యోగముచే నాత్మయుక్తుడై ధ్యాన తత్పరుడై యాత్మయందు ధ్యానము నుంచువాడై యోగము చక్కగా ఆరంభించవలెను-2. వీడీయాద్యుడైన పరంజ్యోతి. వీడే మహాత్తముడైన సేతువు. (బాహిరములను రానీయని పెద్ద అడ్డుకట్ట). వీడు సర్వభూతములలో వృద్ధిబొందినవాడు. సంభేదము లేనివాడు ఏకమైనవాడు శాశ్వతుడు-3. కావున సేతువై విశ్వతోముఖుడైన యగ్నియై సర్వభూత ముల హృదయమందున్న యాత్మను విధానమును దెలిసినవాడైయుపాసించవలె-4. ఎనిమిది యాహుతులను హోమముజేసి, చక్కగా శుచియై తద్ధత మనుస్కుడై పూర్వక్రమమున మొదట ఒక్కమారు నీరాచమించి మిన్నకుండి హృదయమందున్న వైశ్వానరుని (అగ్నిని) ఉపాసింపవలెను-5. ప్రాణాయస్వాహాయని మొదటి యాహుతి చెప్పబడినది. అపానాయస్వాహాయని-రెండవ యాహుతి సమానాయస్వాహాయని మూడవ యాహుతి, ఉదానాయస్వాహాయని నాలుగవ యాహుతి వ్యానాయస్వాహా యైదవది. ఈ విధముగ స్వాహాకారములచే హోమము చేసి కోరిన విధముగ భుజింపవలెను. మరల నొక్కమారు నీరాచమించి మూడు మారులాచమించి హృదయమును స్పృశించవలెను-6, 7. ఓంకార స్వరూపుడవై రుద్రుడవైన నీవు ప్రాణముల (ప్రాణపానాది పంచ ప్రాణముల) ముడిరూపమైన యాత్మవు. రుద్రుడవైన నీవే యాత్మవు. అంతుకుడవై ప్రవేశింపుము. ఆ రుద్రుడే యాత్మకు ప్రాణములు. ఈ విధముగ తనను తానే తృప్తిజెందించుకొనవలె. నీవు దేవతలకు గూడ జ్యేష్టుడవు. ఉగ్రుడవు. చతురుడవు. వృషభరూపుడవు. నీవు మాకు నీ మృత్యుఘ్నుడవు. ఈ భద్రమైన హవిస్సు హోమము చేయబడినది-8,9. ఈ విధముగా హృదయమును తాకి, కుడికాలి బొటన వ్రేలియందు విశ్రావము (?) జేయవలెను. కుడిచేతిని నాభిని చేతితో తాకవలెను. ఆ తరవాత మరల (నీటిని) రెండు చేతులతో తాకి (ఆత్మను) తనను తాకవలెను-10. రెండు కండ్లు, ముక్కు, రెండు చెవులు, హృదయము, శిరస్సు, వీనిని తాకవలెను. ప్రాణాపానములను నీ రెండు ఆత్మలుగా చెప్పబడినవి-11. వానిలో మునుష్యునియొక్క ప్రాణము అన్తరాత్మ, అపానము బాహ్యాత్మ అని చెప్పబడును. అన్నము ప్రాణము. అట్లే యపానము మృత్యువు. జీవితము గూడను 12. అన్నము బ్రహ్మయని తెలియవలె. అది ప్రజలను (సంతానమును) కనునదీ. అన్నము వలన భూతములు (ప్రాణులు) పుట్టును. అన్నము చేతనే వాని స్థితి (నిలకడ) యేర్పడుచున్నది-13. అగ్నియందు హోమము జేసినయాయన్నమును దేవదానవులు భుజింతురు-14.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున పాశుపతయోగమను పదియైదవ యధ్యాయము.