14 - పాశుపతయోగో

వాయురువాచ : -

న చైవ మాగతోజ్ఞానా ద్రాగాత్కర్మ సమాచరేత్ ।

రాజసం తామసం వాపి భుక్త్యా తత్త్రెవ యుజ్యతే॥

తథా సుకృతకర్మా తు ఫలం స్వర్గే సమశ్నుతే ।

తస్మాత్ స్థానాత్ పునర్బ్రష్టో మానుష్య మనుపద్యతే॥

తస్మాద్భ్రహ్మపరం సూక్ష్మం బ్రహ్మశాశ్వత ముచ్యతే ।

బ్రహ్మ ఏవహి సేవేత బ్రహ్మైవ పరమం సుఖమ్॥

పరిశ్రమస్తు యజ్ఞానాం మహతార్థేన వర్తతే ।

భూయో మృత్యువశం యాతి తస్మాన్మోక్షః పరం సుఖమ్॥ 

ఈ విధముగా జ్ఞానము నుండి వచ్చినవాడు రాగము వలన కర్మ నాచరింపరాదు. రాజస మైనదిగాని తామస మైనదిగాని యైన కర్మను చేసి అనుభవించిన మానవుడు దానిలోనే తగుల్కొనును-1. అట్లే పుణ్యకర్మను జేసినవాడు స్వర్గములో దాని ఫలమును బొందును. ఆ స్థానము నుండి (పుణ్యము క్షీణింపగా) మరల భ్రష్టుడై మానవ లోకమును బొందును-2. కావున బ్రహ్మ పరము సూక్ష్మము. బ్రహ్మ శాశ్వతము అని చెప్పబడును. కావున బ్రహ్మనే సేవింపవలె. బ్రహ్మయే పరమమైన సుఖము-3. యజ్ఞములలో పరిశ్రమ గొప్ప (స్వర్ణ) ప్రయోజనముతో జరుగును. కాని వాడు క్షణయజ్ఞఫలుడై మరల మర్త్యలోకమునకు వచ్చి మృత్యువశుడగును. కావున మోక్షము పరమసుఖము-4.

అథ వై ధ్యానసంయుక్తో బ్రహ్మయజ్ఞ పరాయణః ।

న సస్యాద్వ్యాపితుం శక్త్యా మన్వన్తర శతైరపి॥

దృష్ట్వాతు పురుషం దివ్యం విశ్వాఖ్యం విశ్వరూపిణమ్ ।

విశ్వపాద శిరోగ్రీవం విశ్వేశం విశ్వభావనమ్।

విశ్వగన్దం విశ్వమాల్యం విశ్వాంబరధరం ప్రభుమ్॥   

అట్లుగానిచో ధ్యాన సంయుక్తుడు బ్రహ్మయజ్ఞ పరాయణుడు. (జ్ఞానయజ్ఞ పరాయణుడు). వాడు మన్వంతర శతములచేత గూడ వ్యాపించుటకు సాధ్యపడడు-5. విశ్వరూపుడు విశ్వమే పాదములు శిరము, కంఠములైనవాడు, విశ్వేశుడు, సమస్త భావనలుగలవాడు, సమస్త గంథములు గలవాడు సమస్తమాలలచే నలంక రింప బడినవాడు. విశ్వమను వస్త్రమును (సమస్త వస్త్రములను) ధరించువాడు ప్రభువు ఐయిన,విశ్వుడను దివ్య పురుషుని చూచి-6.

గోభిర్మహీ సంయతతే పతత్రిణం మహాత్మానం పరమమతాం వరేణ్యమ్ ।

కవిం పురాణమనుశాసితారం సూక్ష్మం మహతో మహాన్తమ్॥

యోగేన పశ్యన్తి న చక్షుషాతం నిరిన్ద్రియం పురుషం రుక్మవర్ణమ్॥

అలిజ్ఞనం పురుషం రుక్మవర్ణం లిలిజ్గినం నిర్గుణం చేతనం చ ॥

నిత్యం సదా సర్వగతం తు శౌచం పశ్యన్తి యుక్త్యా హ్యచలం ప్రకాశమ్॥

తద్భావిత స్తేజసా దీప్యమానః అపాణి పాదోద పార్శ్వ జిహ్వః ॥

అతీన్ద్రియోఽద్యాపి సుసూక్ష్మ ఏకః పశ్యత్యచక్షుః సశృణీత్యకర్ణః॥

నాసాస్య బుద్ధం న బుద్ధి రస్తి సవేదసర్వం నచ వేదవేద్యం

తమాహురగ్ర్యం పుషుషం మహాన్తం సచేతనం సర్వగతం సుసూక్ష్మమ్॥  

భూమి తన గోవుల (కిరణముల) చేత, రెక్కలు గలవానిని, మహాత్ముని, పరమమతిని, వరింపదగి వానిని, కవిని (బ్రహ్మరూపిని) పురాణుని (ప్రాచీనుని), అనుశాసించువానిని, సూక్ష్మమునకన్న సూక్ష్మరూపిని, మహత్తుకన్న మహత్తైన వానిని, బంధించి వేయును. అతడు నిరింద్రియుడు, బంగారు వన్నెగల తేజోమయపురుషుడు, నిర్గుణుడు చేతనుడు. ఈతనిని యోగులు యోగముతోనే చూతురుగా నేత్రములతో జూడలేరు-7. ఎల్లప్పుడు సర్వగతుడై శుచియైన వాడు అచలుడై ప్రకాశ స్వరూపుడైన యాతనని యోగము చేతనే నిత్యము జూతురు-8. అతడు తత్తుగా పరమాత్మగా భావింపబడినవాడు, తేజస్సుతో వెలుగుచున్నవాడు, చేతులు, కాళ్ళు కడుపు, ప్రక్కలు, నాలుక లేనివాడు, ఇంద్రియముల కతీతుడు. ఇప్పటికి గూడసుసూక్ష్మడైన ఒక్కడు. అతడే నేత్రములు లేకయే జూచువాడు. చెవులు లేకయే వినువాడు-9. ఈతనికి బుద్ధిలేదు. కాని యాతనికి తెలియనిది లేదు. అతడు వేదములకు గూడ దెలియని వాడు. కాని తాను సర్వము తెలిసినవాడు. అతని మొట్టమొదటివానిగా పురుషునిగా మహత్స్వరూపునిగా సచేతనునిగా, సర్వగతునిగా, సుసూక్ష్మునిగా జెప్పుదురు-10.

తామాహుర్మునయః సర్వే లోకే ప్రసవధర్మిణీమ్ ।

ప్రకృతం సర్వభూతానాం యుక్తా: పశ్యన్తి చేతసా॥

సర్వతః పాణిపాదాన్తం సర్వతోఽక్షి శిరోముఖమ్ ।

సర్వతః శ్రుతి(మ) మాంల్లోకే సర్వమావృత్య తిష్ఠతి

యుక్తాయోగేన చేశానం సర్వతశ్చ సనాతనమ్ ।

పురుషం సర్వభూతానాం తస్మాద్ధ్యాతా న ముహ్యతే॥

భూతాత్మానం మహాత్మానం పరమాత్మాన మవ్యయమ్ ।

సర్వాత్మానం పరం బ్రహ్మ తద్వై ధ్యాత్వా న ముహ్యతి॥   

సమస్త మునులు ఆమెను లోకమున ప్రసవ ధర్మిణిగా (లోకమును బుట్టించుదానినిగా) జెప్పుదురు. యోగయుక్తులు తమ చిత్తముతో ఆమెను సర్వ భూతములకు ప్రకృతిగా జూతురు-11. అంతట కాలుసేతు చాచియందు కొనునది. అంతట జూడగల కన్నులు శిరస్సు ముఖములు గలది. అంతట వినగల చెవులు గలదియునై యాప్రకృతి సర్వముగా నావరించి యుండును-12. యోగముచే యుక్తులై యోగులు, ఈశానుడు, అన్ని విధముల సనాతనుడు, సర్వభూతములలో పురుషుడైన వానిని జూతురు. కావున ధ్యానయోగి మోహమును జెందడు-13. భూతాత్ముడు, మహాత్ముడు పరమాత్ముడు, అవ్యయుడు, సర్వాత్ముడు ఐన ఆ పరబ్రహ్మను ధాన్యనముజేసి మోహము జెందడు-14. 

పవనో హి యథాగ్రాహ్యో విచరన్ సర్వమూర్తిషు ।

పురిశేతే తథాఽ భ్రే చ తస్మాత్పురుష ఉచ్యతే।

అథచేల్లుప్త ధర్మాత్తు సవిశేషైశ్చ కర్మభిః ॥

తతస్తు బ్రహ్మ యోన్యాం వై శుక్రశోణిత సంయుతమ్ ।

స్త్రీపుమాంస ప్రయోగేణ జాయతే హి పునః పునః॥

తతస్తు గర్భకాలే తు కలనం నామ జాయతే ।

కాలేన కలనం చాపి బుద్బుదశ్చ ప్రజాయతే॥

మృత్పిండస్తు యథా చక్రే చక్రవాతేన పీడితః ।

హస్తాభ్యాం క్రియమాణస్తు విశ్వత్వముపగచ్చతి॥

ఏవమాత్మాస్థి సంయుక్తో వాయునా సముదీరితః ।

జాయతే మానుషస్తత్ర యథారూపం తథా మనః॥

వాయుః సంభవతే తేషాం తావత్ సంజాయతే జలమ్ ।

జలాత్సంభవతి ప్రాణాః ప్రాణాచ్చుక్రం వివర్ధతే॥

రక్తభాగాస్త్రయ స్త్రించ్ఛుక్ర భాగాశ్చతుర్దశ ।

భాగతోఽర్ధ ఫలం కృత్వా తతో గర్భే ని షేవతే॥

తతస్తు గర్భసంయుక్తః పంచభిర్వాయు భిర్వృతః ।

పితు: శరీరాత్ ప్రత్యజ్గ రూపమాస్యోప జాయతే॥

తతోఽస్య మాతురాహారాత్ పీతలీఢ ప్రవేశితమ్।

నాభిః స్రోతః ప్రవేశేన ప్రాణాధారో హి దేహినామ్॥     

వాయువు సర్వ మూర్తులయందు చరించుచు గ్రహింప దగినదైనట్లే పురమును అట్లే ఆకాశమునను శయనించును గావున పురుషుడనబడుచున్నాడు. ఒకవేళ సవిశేషములైన కర్మలచే లోపించిన ధర్మము గలవాడై నందున పురుషుడనబడి నట్లైతే-15, అప్పుడు స్త్రీ పురుషుల ప్రయోగము చేత శుక్ర శోణిత సంయుత మైన బ్రహ్మ స్త్రీ యోని యందు మరల మరల బుట్టును. సూక్ష్మ రూపమున జన్మనొందును-16. అపుడు గర్భకాలమున (గర్భముగా నేర్పడు కాలమున) కలనమనునది (శుక్రశోణితములు గలియుటయన్నది) జనించును. కాలక్రమమున 'ఆ కలనము బుద్బుదము (బుడగ) యగును-17. కుమ్మరి సారె (చక్రము) మీద నున్న మట్టి ముద్ద తిరుగుచున్న చక్రవాయువు (సుడిగాలి)చే పీడింపబడినదై (కుమ్మరి) హస్తములచే చేయబడుచున్నదై విశ్వరూపమును (కుండమొ రూపమును) దాల్చును-18. ఈ విధముగనే ఆత్మ ఎముకతోగూడినదై వాయువుతో పైకి ప్రేరేపింపబడినదై మానుషాకారము గలవాడగును. అచట రూపము గలిగినట్లే మనస్సు కలుగును-19. వానిలో వాయువు బుట్టును. వాయువునుండి జలము, జలము నుండి ప్రాణము బుట్టును. ప్రాణము నుండి శుక్రము వృద్ధిజెందును-20. రక్తభాగములు (శోణితముల యొక్క భాగములు) ముప్పదిమూడు. శుక్రభాగములు పదునాలుగు (మొత్తము 46 భాగములు). ప్రతి భాగము నుండి సగము ఫలము అనగా రెండు కరములు లేదా ముప్పదిరెండు మాషముల పరిమాణము గల భాగమును దీసికొని గర్భమున ప్రవేశించును. (గర్భముగానగును)-21. తరువాత గర్బముతో గూడిన యాకారము ఐదు ప్రాణ అపాన-సమాన-వ్యాన-ఉదాన) వాయువులతో జుట్టబడును. ఈ గర్భమునకు తండ్రి శరీరము నుండి ప్రతియవయవ రూపము గలుగును-22. తరువాత తల్లి యొక్క తల్లి యాహారము నుండి త్రాగుట ద్వారా నాకుట ద్వారా వైశించినది బొడ్డు తాడులో బ్రవహించి గర్భములో బ్రవేశించుటచే అది దేహులకు (గర్భస్థ ప్రాణులకు) ప్రాణాధారమగును-23.

నవమాసాన్ పరిక్లిష్ట: సంవేష్టిత శిరోధరః ।

వేష్టితః సర్వ గాత్రైశ్చ అపర్యాయ క్రమాగతః

నవమాసోషితశ్చైవ యోనిచ్ఛిద్రాదవాజ్మఖః ॥

మావితో చుట్టబడిన శిరమును ధరించినవాడై, సర్వావయవములచే జుట్టబడినవాడై తొమ్మిది మాసములు చుట్టుగా కష్టములనుభవించినవాడై తొమ్మిది మాసములు గర్భమందుండి యోని రంధ్రము నుండి యధోముఖుడై పర్యాయ క్రమమును దప్పి యావలకు వచ్చును-24.

తతస్తు కర్మభిః పా పైర్నిరయం ప్రతిపద్యతే ।

అసిపత్రవనం చైవ శాల్మలిచ్ఛేద భేదయో:॥

తత్ర నిర్భర్త్సనం చైవ తథాశోణిత భోజనమ్ ।

ఏతాస్తు యాతనా ఘోరాః కుంభీపాక సుదుః స్సహా:॥

యథాహ్యాపస్తు విచ్ఛిన్నా: స్వరూప ముపయాన్తి వై ।

తస్మాచ్ఛిన్నాశ్చ భిన్నాశ్చ యాతనా స్థానమాగతః॥

ఏవం జీవస్తుతైః పాపైస్తప్యమానః స్వయం కృతైః ।

ప్రాప్నుయాత్కర్మభిర్దుః ఖం శేషం వా యది చేతరమ్॥

ఏకైవ తు గన్తవ్యం సర్వమృత్యు నివేశనమ్ ।

ఏకేనైవ చ భోక్తవ్యం తస్మాత్ సుకృతమాచరేత్॥

నహ్యేనం ప్రస్థితం కశ్చిద్గచ్ఛన్త మనుగచ్చతి।

యదనేన కృతం కర్మ తదేవ మనుగచ్ఛతి॥         

ఆ తరువాత పాప కర్మలచేత నరకము బొందును. అసిపత్ర వనమను నరకము, బూరుగు చెట్టుల గొట్టుట పగలగొట్టుట యొక్క భయము-25. రక్త భోజనము, ఈ భయంకరమైన తీవ్రబాధలను కుంభీపాకముచే సహింపనలవిగానివై యుండును 26. నీరు వేరు చేయబడిన రూపమును బొందినట్లు యాతనాస్థానమునకు వచ్చినవాడు ఛిన్నుడు భిన్నుడునగును-27. ఈ విధముగా జీవుడు తాను చేసిన ఆ పాపములచేత పరితపింపబడినవాడగును. జీవుడు తన కర్మలచేతనే దుఃఖమును గాని సుఖమునుగాని పొందును-28. అన్ని విధముల మృత్యు ప్రవేశము తానొక్కడే చేయును. తోడెవ్వడునూ రాడు.' చేసిన కర్మఫలము నొక్కడే యనుభవింపవలెను. తోడెవ్వడురాడు. కావున పుణ్యమునే యాచరించవలె-29. ప్రాణావసానమున శరీరమును వదలి బయలుదేరి పోవుచున్నవాని వెంటనెవ్వరును రారు. వాడు చేసిన కర్మయే వెంబడివచ్చును-30.

తే నిత్యం యమవిషయే విభిన్నదేహాః క్రోశన్తః సతతమనిష్ట సంప్రయోగైః ॥

శుష్యన్తే పరిగత వేదనా శరీరా: బహ్వీభిం సుభృశమధర్మ్య యాతనాభి:॥

కర్మణా మనసా వాచా యదభీష్టం నిషేవ్యతేన ।

తత్ కర్మహరేత్పాపం తస్మాత్సుకృత మాచరేత్॥

యాదృగ్జాతాని పాపాని పూర్వం కర్మాణి దేహినః ।

సంసారం తామసంతాదృక్ షడ్విధం ప్రతిపద్యతే॥

మానుష్యం పశుభావం చ పశుభావాన్మృగో భవేత్ ।

మృగత్వాత్పక్షి భావస్తు తస్మాచ్చైవ సరీసృపం॥

సరీసృపత్వాచ్చేద్ధి స్థావరత్వం న సంశయః ।

స్థావరత్వం పునః ప్రాప్తో యావదున్మిషతే నరః ॥

కులాలచక్రవద్భ్రాన్తస్తత్త్రెవ పరికీర్తితః ॥         

వారు నిత్యము యమలోకములో వేర్వేరు దేహములు గలవారై యేడ్చుచుందురు. వారికి అనిష్టమైన ప్రయోగముల చేత నిండిపోవు చుందురు. అధర్మమువల్ల గలిగిన అనేక యాతనలచే తీవ్ర బాధలచే చుట్టుకొన్న వేదనా శరీరములు గలవారగుదురు 31. దేహికి పూర్వకృత పాపకర్మల సరిపోవు తామస సంసారము కలుగును. అదియారు విధములు-32, 33. మానుషము పశు భావమును పశుభావము వల్ల మృగమగును. మృగభావము వల్ల పక్షిభావమును దాని నుండి సర్పమగును-34. సర్పభావము నుండి నిస్సంశయముగ స్థావరత్వమునందును ఆ స్థావరత్వము నుండి మేలుకొనునంత వరకు వాడు కుమ్మరి సారె (చక్రము) వలె అక్కడనే తిరుగుచుండునని చెప్పెడివారు-35.

ఇత్యేవం హి మనుష్యాదిః సంసారే స్థావరాన్తకే ।

విజ్ఞేయస్తామసో నామ తత్రైవ పరివర్తతే ॥

సాత్త్వికశ్చాపి సంసారో బ్రహ్మాది: పరికీర్తితః ।

పిశాచాన్తః స విజ్ఞేయః స్వర్గస్థానేషు దేహినామ్॥

బ్రాహ్మే తు కేవలం సత్త్వం స్థావరే కేవలం తమః ।

చతుర్ధశానాం స్థానానాం మధ్యే విష్టంభకంరజః।

మర్మసుచ్ఛిధ్యమానేషు వేదనార్తస్య దేహినః॥

తతస్తు పరమం బ్రహ్మ కథం విప్రః స్మరిష్యతి ।

సంస్కారాత్పూర్వ ధర్మస్య భావనాయా ప్రణోదితః।

సంస్కారాత్పూర్వ ధర్మస్య భావనాయా ప్రణోదితః ।

మానుష్యం భజతే నిత్యం తస్మాన్నిత్యం సమాదధేత్॥

ఇతి శ్రీమహాపురాణే వాయు ప్రోక్తే పాశు పతయోగోనామ చతుర్దశోఽధ్యాయః॥ 

ఈ విధముగా మనుష్యుడు మొదలు స్థావరము వరకు పరివర్తించునది తామస సంసారమని తెలియవలెను. అచటనే-36, బ్రహ్మ మొదలుకొని పరివర్తనమానమగునది సాత్త్యిక సంసారము అని యనబడినది. స్వర్గ స్థానములతో బ్రహ్మాది పిచాశముల వరకు పరివర్తమానమగు సంసారము సాత్త్యికమని తెలియవలెను-37. బ్రాహ్మము నందు కేవలము సత్యముండును. స్థావరమున కేవలము తమముండును. ఈ పదునాలుగు స్థానముల మధ్యన విఘ్నముగా నిలచినది రజము. తన మర్మ స్థానములు కోయబడుచుండగా వేదనచే పీడితుడైన దేహియైన బ్రాహ్మణుడు పరవశుడైన బ్రహ్మనెట్లు స్మరించగలడని పూర్వధర్మము యొక్క సంస్కారము వలన భావనవల్లను ప్రవేశింపబడిన వాడై నిత్యము మానుష్య భావమును బొందును.కావున నిత్యము సమాహిత చిత్తుడు (బ్రహ్మయందు మాత్రమే లగ్నమైన చిత్తము గలవాడు గావలెను-38, 39.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున పాశుపత యోగమను పదునాలుగవ యధ్యాయము.